second phase
-
116 కి.మీ. 80స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రాఫిక్ అధ్యయనం ‘రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్మెంట్లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భూగర్భంలో మెట్రో రైల్ నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.⇒ ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. రోడ్ల విస్తరణ ⇒ ప్రస్తుతం దారుల్íÙఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి. ⇒ ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆలి్వన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ⇒ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. 9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ⇒ రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)కారిడార్ – 4 నాగోల్ – ఎయిర్పోర్ట్ 36.6కారిడార్ – 5 రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ 11.6కారిడార్ – 6 ఎంజీబీఎస్ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5కారిడార్ – 7 మియాపూర్ – పటాన్చెరు 13.4కారిడార్ – 8 ఎల్బీనగర్–హయత్ నగర్ 7.1కారిడార్ – 9 ఎయిర్పోర్ట్– ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 40 -
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
‘స్టార్ చంద్రు’.. రెండో దశ పోలింగ్‌లో రిచ్ ఈయనే..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది.అత్యంత ధనిక అభ్యర్థులు వీళ్లే..అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన విశ్లేషణ ప్రకారం.. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణే గౌడ ఫేజ్ 2 పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న ఈయన రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. ఈయన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు.మథుర లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని రూ. 278 కోట్ల ఆస్తులతో మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉన్నారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు .కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.217.21 కోట్లు.వీళ్లే పేద అభ్యర్థులుమహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆయన కేవలం రూ.500 విలువైన ఆస్తులను ప్రకటించారు.రెండో స్థానంలో కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అమరావతి (SC) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ప్రవేశించిన పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఈయన మొత్తం ఆస్తులు రూ.1,400. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. కేరళలోని కొట్టాయం నుండి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. -
మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్‌కు కౌంట్‌డౌన్
న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమామాలిని తదితరులు సెకండ్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారానికి బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం తెరపడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. శుక్రవారం(ఏప్రిల్26) రెండో దశ పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది.కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదేసి, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో మూడు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘంకాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, లోక్‌సభ మాజీ స్పీకర్ ఓంబిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు.వరుసగా రెండోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాతో తలపడుతున్నారు. ఏప్రిల్19న తొలి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్‌లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్ గాం«దీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర రాహుల్ గాంధీ తన తొలి విడత భారత్ జోడో యాత్రను 2022 సెపె్టంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్‌లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ అగ్రనేత కె.సి.వేణుగోపాల్ వివరించారు. యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్–కార్నర్ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ సభకు హమ్ తయ్యార్ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. -
తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందన్నారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 70 శాతం పథకాలు బీసీ,ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు. ‘‘సామాజిక సాధికార యాత్రలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేనలో ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు -
‘దళిత బంధు’కు ఆదరణ కరువు
సాక్షి,సిటీబ్యూరో: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఆదరణ కరువైంది. రెండో విడతలో యూనిట్ల సంఖ్య పెరిగినా... నిరుద్యోగ యువత ఆసక్తి కరువైంది. దరఖాస్తులు ఆహా్వనిస్తే కనీసం కేటాయించిన యూనిట్లకు సరిపడ దరఖాస్తులు కూడా రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మొదటి విడతలో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి యూనిట్లను మంజూరు చేయడంతో గ్రౌండింగ్ కూడా పూర్తైంది. నియోజవకవర్గానికి 1,100 యూనిట్లు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 1,100 చొప్పున యూనిట్లు కేటాయించారు. గత మూడు, నాలుగు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 16, 500 యూనిట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం 13 వేల దరఖాస్తులకు మించి రాలేదని తెలుస్తోంది. కొన్ని దరఖాస్తులు నేరుగా రాగా, మరికొన్నింటిని ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు. అయినప్పటికీ యూనిట్ల కేటాయింపునకు అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య పెరగలేదు. విచారణ అంతంతే... రెండో విడత దరఖాస్తుల విచారణ సైతం అంతంత మాత్రంగా తయారైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపిన ప్రతిసారీ దళిత బంధు దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ పథకం కింద యూనిట్‌కు రూ.10 లక్షల అందిస్తారు. అయినప్పటికీ దరఖాస్తుల తాకిడి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు. -
AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. 1.34 లక్షల మందికి కొత్త ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్ జారీచేశారు. నాలుగు నెలల్లోనే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్మెంట్ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్ పొందుతారని అధికారులు వెల్లడించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం జగన్‌కు మేమెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్.ఆర్. కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ సీఎం జగన్ రుణం తీర్చుకుంటాం.. ఉద్యోగ సంఘాల హర్షం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉద్యోగాలు పొందిన వారికీ ప్రొబేషన్ ఖరారు చేసినందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకుంటారని చెప్పారు. చదవండి: ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్కాల్స్ వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్ రెండో విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వన్స్ ఎగైన్ థాంక్యూ సీఎం సార్. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షులు జి.హరీంద్ర, కె.రామకృష్ణా రెడ్డి, కె.కిరణ్ -
హైదరాబాద్ మెట్రోపై ఎందుకు వివక్ష?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై కేంద్రం చేతులెత్తేయడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదంటోందని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘మెట్రో రెండోదశ దూరమే! ’శీర్షికన ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. మెట్రో రెండోదశపై కేంద్రం తీరును తప్పుపడుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు. గాం«దీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరా లతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. జనాభారద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్‌కి మాత్రం మెట్రోరైల్ విస్తరణార్హత లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ, హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాతమేనని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ విమర్శించారు. పూర్తి సమాచారంతో డీపీఆర్ ఇచ్చాం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్(డీపీఆర్)ను అందించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వాటిని జతచేశారు. కేంద్ర మంత్రి స్పందన నిరాశాజనకం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని వ్యక్తిగతంగా కలిసి వివరించేందుకు తాను ప్రయత్నించానని కేటీఆర్ వివరించారు. కాగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే కేంద్రమంత్రి పూరీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌పై సాధ్యమైనంత త్వరలో సరైన నిర్ణయం తీసుకొంటారని, తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించానని కేటీఆర్ తెలిపారు. -
పీఎల్ఐ పథకంలో రిలయన్స్
న్యూఢిల్లీ: సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ప్రకటిత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం రెండో దశలో 11 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో రిలయన్స్, ఫస్ట్ సోలార్, ఇండోసోల్ తదితరాలున్నాయి. మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. పథకంలో భాగంగా ఇందుకు రూ. 14,007 కోట్లు వెచ్చించనుంది. అత్యధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రెండో దశలో భాగంగా విద్యుత్ శాఖ తాజా ప్రాజెక్టులను కేటాయించింది. వీటిలో 7,400 మెగావాట్లు 2024 అక్టోబర్‌కల్లా ప్రారంభంకావచ్చని అంచనా. ఈ బాటలో 2025 ఏప్రిల్‌కల్లా 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌కు మరో 15,400 మెగావాట్లు సిద్ధంకానున్నట్లు అంచనా. వెరసి రెండో దశలో భాగంగా మొత్తం రూ. 93,041 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి. అంతేకాకుండా 1,01,487 ఉద్యోగాల సృష్టికి అవకాశముంది. వీటిలో 35,010 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 66,477 పరోక్షంగా లభించే వీలుంది. కంపెనీల వివరాలు పాలీసిలికాన్, ఇన్గాట్ వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్ బాస్కెట్లో రిలయన్స్, ఇండోసోల్ విడిగా 6,000 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టులను పొందాయి. ఈ బాటలో ఫస్ట్ సోలార్ 3,400 మెగావాట్లను పొందింది. వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ బాస్కెట్లో వారీ 6,000 మెగావాట్లు, రీన్యూ 4,800 మెగావాట్లు, అవాడా 3,000 మెగావాట్లు, గ్రూ 2,000 మెగావాట్లు, జేఎస్‌డబ్ల్యూ 1,000 మెగావాట్ల ప్రాజెక్టులు పొందాయి. ఇక సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌లో టాటా పవర్ సోలార్ 4,000 మెగావాట్లు, విక్రమ్ 2,400 మెగావాట్లు, యాంపిన్ 1,000 మెగావాట్లు చొప్పున ప్రాజెక్టులు అందుకున్నాయి. హైటెక్నాలజీతో.. హై టెక్నాలజీ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ వేల్యూ చైన్‌లో దేశం బలపడుతున్నట్లు పీఎల్ఐ పథ కం విజయంపై స్పందిస్తూ విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. తాజా సామర్థ్య విస్తరణ ద్వారా సోలార్ తయారీ రంగంలో దేశం స్వావలంబన దిశగా భారీ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశా రు. కాగా.. పథకం తొలి దశలో భాగంగా 2022 నవంబర్–డిసెంబర్లో 8,737 మెగావాట్ల సమీకృత సామర్థ్య ప్రాజెక్టులను కేటాయించింది. వెరసి పీ ఎల్ఐ పథకం రెండు దశల్లో కలిపి మొత్తం 48,337 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించింది. రూ. 18,500 కోట్లకుపైగా ఆర్థిక మద్దతు ప్రకటించింది. -
కంటి ‘వెలుగు’ కావాలి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు. ఘనంగా ప్రారంభించినా.. రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి. రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు. ఈసారి ఆపరేషన్లు చేస్తారా? ‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన రావడం లేదు. గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మసకబారుతున్న చూపు! క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు. అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి. – తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్ జిల్లా ఈసారైనా ఆపరేషన్ చేస్తారో..లేదో! నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో.. – రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా కంటి వెలుగుకు సహకరిస్తాం ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
75 బృందాలు..100 రోజులు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు. ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు.. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు 43 బృందాలను నియమించారు. జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289 డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు. అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. ఇటీవలే వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్(ఏఆర్) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. నిరంతరాయంగా శిబిరాలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి -
నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్ స్థల పరిశీలన చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జమ్ము కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ పాల్గొన్నారు. చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ) -
మళ్లీ కంటి వెలుగు.. జనవరి 18 నుంచి షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం, వైద్యం అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కన్నుల్లో వెలుగులు నింపాం ‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. అందువల్ల మరోసారి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగానే కంటి అద్దాలు కూడా అందిస్తాం’ అని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కళ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీని వాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజే శ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ప్రభు త్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం -
CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ శ్రీ కేష్ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్ లాఠకర్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్ తదితరులు ఉన్నారు. చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్) -
టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి రెండో విడత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా, వియత్నాం దేశాలతో పోటీపడేందుకు ఇది పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని. టెక్స్టైల్స్ రంగానికి ప్రకటించిన పీఎల్ఐ పథకం పనితీరుపై ఆ శాఖ వ్యవహరాలను చూస్తున్న గోయల్ సమీక్షించారు. టెక్స్టైల్స్ పీఎల్ఐ 2.0 ప్రకటించానికి ముందు భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో బలమైన పోటీనిచ్చే విధంగా పీఎల్ఐ 2.0ని రూపొందించాలన్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఉపాధి అవకాశాల కల్పనకు, ఎగుమతులు, వృద్ధి బలోపేతానికి తగినన్ని సామర్థ్యాలు టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉన్నట్టు చెప్పారు. -
తెరపైకి మెట్రో నియో, రెండో దశ, బీఆర్టీఎస్
సాక్షి, హైదరాబాద్: జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోన్న గ్రేటర్ సిటీ ప్రజారవాణా వ్యవస్థలో మెట్రో శకం మొదలైంది. ఆధునిక రవాణా సదుపాయాల కల్పన ద్వారానే ట్రా‘ఫికర్’ తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెట్రో నియో, రెండోదశ ప్రాజెక్టులతో పాటు కేవలం బస్సులే ప్రత్యేక మార్గంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా బీఆర్టీఎస్ ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. వీటిని పట్టాలెక్కించేందుకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 75 లక్షలకు చేరువ కావడం, ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం 40 శాతానికి మించకపోవడంతో రహదారులపై నిత్యం ట్రాఫిక్ నరకం సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తూ.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు దిక్సూచిగా మారిన పలు ప్రాజెక్టులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మెట్రో నియో ఇలా... మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. ట్రాఫిక్రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్– కోకాపేట్ మార్గంలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం తాజాగా అనుమతించడం గమనార్హం. బీఆర్టీఎస్ సైతం.. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే రహదారులను విస్తరించి.. ఈ రహదారికి మధ్యలో కేవలం బస్సులు మాత్రమే రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు లేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు బస్సులు రావడానికి, మరోవైపు వెళ్లడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది. బీఆర్టీఎస్ ఏర్పాటుకు కిలోమీటర్‌కు రూ.110 కోట్లు వ్యయం అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ అవసరం ఉండని కారణంగా కిలోమీటరుకు రూ.20 కోట్లు ఖర్చు చేసి బీఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. రెండో దశ మార్గం ఇదీ.. ప్రస్తుతం ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులో ఉంది. నగరంలో సుమారు 270 కి.మీ మార్గంలో మెట్రో ఏర్పాటు చేయాల్సి ఉందని గతంలో లీ అసోసియేట్స్ నివేదిక స్పష్టంచేసింది. (క్లిక్ చేయండి: నగరంపై ‘కారు’ మబ్బులు!) ఈ నివేదిక మేరకు మెట్రో రెండోదశ మార్గాలను.. రాయదుర్గం– శంషాబాద్ విమానాశ్రయం, ఎంజీబీఎస్–ఫలక్‌నుమా, బీహెచ్ఈఎల్– గచ్చిబౌలి– లక్డీకాపూల్, నాగోల్– ఎల్బీనగర్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, జేఎన్టీయూ– ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, ఎల్బీనగర్– అబ్దుల్లాపూర్‌మెట్, జేబీఎస్– కూకట్పల్లి వై జంక్షన్, తార్నాక– కీసర–ఓఆర్ఆర్, నానక్‌రాంగూడ– బీహెచ్ఈఎల్, బోయిన్పల్లి– మేడ్చల్, ఎల్బీనగర్–చాంద్రాయణగుట్ట– శంషాబాద్, ఎంజీబీఎస్–ఘట్కేసర్ మార్గాలున్నాయి. ఒక కిలోమీటరు మార్గంలో మెట్రో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం వ్యయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు సైతం ఏ సంస్థా ముందుకు రాకడంలేదు. -
28న టీ–హబ్ రెండో దశ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం ‘టీ–హబ్’రెండో దశను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. రాయదుర్గంలోని టీ–హబ్ భవనంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రసంగాలు, చర్చాగోష్టులు ఉంటాయి. డ్రాయిన్ బాక్స్, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌కేర్, డెలివరీ వంటి యూనికార్న్ సంస్థలు, సిక్వోయా క్యాపిటల్, యాక్సెల్, కలారీ క్యాపిటల్స్ వంటి వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలు, సాప్, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు టీ–హబ్ రెండో దశ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 2016లో టీ–హబ్ రెండో దశకు శంకుస్థాపన చేయగా 2020 నాటికి అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణం ఆలస్యం అయింది. ఇటీవల పనులు పూర్తి కావడంతో ఈ నెల 28న ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
AP: రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం రెండో దశ కింద పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ్‌లో భాగంగా 1,79,060 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో కూడిన పట్టాల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టారు. చదవండి: పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, సీఎం రాసిన లేఖలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. -
బీజేపీని ఇరుకున పెట్టెందుకు కాంగ్రెస్ వ్యూహాం
-
మణిపూర్‌లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
-
11 జిల్లాల్లో రెండోవిడత జ్వర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత ఇంటింటి జ్వర సర్వే 11 జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైంది. జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మొదటి విడత సర్వే పూర్తికాగానే మొదలుపెడతారని పేర్కొంది. సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తుండటంతో ఎక్కడికక్కడే వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. రోగుల పరిస్థితి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్‌లో మూడు, నాలుగుసార్లు కూడా జ్వర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏకంగా 8 లక్షల మందికి మెడికల్ కిట్లు అందజేశారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పలు విడతలుగా జ్వర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జరిగిన మొదటి విడత సర్వేలో రాష్ట్రంలో కేవలం 9 రోజుల వ్యవధిలోనే 4,00,283 మందిలో కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వీరిలో అందరికీ కరోనా అని నిర్ధారణ కాకపోయినా, 3,97,898 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. -
అక్టోబర్ 7న ఒంగోలుకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ సోమవారం పరిశీలించారు. అనంతరం క్రీడా మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. క్రీడా మైదానంలో దక్షిణ భాగంలో ముఖ్యమంత్రి సభావేదిక ఉండాలన్నారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. పీవీఆర్ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు మహిళలు పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి 20 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలిపాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటుకు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు మార్గానికి అడ్డు రాకుండా సీఎంకు అభివాదం చేసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా రెండో విడతలో మహిళలకు నగదు పంపిణీ కార్యక్రమం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జిల్లాకు వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నందున విజయవంతం చేసే బాధ్యత మహిళలపై ఉందన్నారు. కేవలం రెండు రోజుల సమయంలో సభా ఏర్పాట్ల విషయంపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా ‘ఒంగోలులో వాసన్న ఉన్నాడు కదా చూసుకుంటాడు’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లు తలశిల తెలిపారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకుంటేనే అనుమతి: కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారినే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, నగరంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించాలని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి వివరించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాల్లోను సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, ఎస్పీ మలికాగర్గ్, జేసీలు జేవీ మురళి, కె.కృష్ణవేణి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో ఎస్.సరళావందనం, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ టి.రవికుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా సీఎం పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో హెలికాప్టర్ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. -
ఐపీఎల్లో కొత్త రూల్.. బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్
ముంబై: కరోనా కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ వేదికగా లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్ హాఫ్ జరగనుంది. అయితే ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్ కోసం సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్స్‌లోకి బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి తెచ్చింది. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు తాకే అవకాశం ఉన్నందున, తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్ బ్యాట్స్మెన్లకు ఫంక్షన్, బౌలర్లకు టెన్షన్ అన్న చందంగా మారింది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్లకు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.