seven
-
వందేళ్లకు కల నిజమైంది.. ఏడు ఖండాలూ చుట్టేసిన బామ్మ
‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు. కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. డెస్టినేషన్ ఎన్ఎస్డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు. వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏడడుగులు ఎందుకు వేస్తారు?
మూడు ముళ్ల తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేస్తారు వధూవరులు. అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని వాగ్ధానం చేస్తూ ఏడడుగులు వేస్తారు. ఇంకా వివరంగా చె΄్పాలంటే ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్కమొదటి అడుగు.. అన్నవృద్ధికి. అంటే అన్నపూర్ణగా పిలిచే మనదేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండో అడుగు.. బలవృద్ధికి. అంటే వధూవరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు.మూడో అడుగు.. ధన ప్రాప్తి కలగాలని వేస్తారునాలుగో అడుగు..దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని ఐదో అడుగు..ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెప్పడం. ఆరో అడుగు..వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని.ఏడో అడుగు.. శారీరకంగా, మేధో పరంగా పుష్ఠి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు. -
Russia: రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి. Magnitude 7.0 earthquake strikes off #Russia, tsunami warning issued: #US monitors. https://t.co/eLyx1YCU4L pic.twitter.com/wWvMMnmKZb— Arab News (@arabnews) August 17, 2024 -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి
మహారాష్ట్రాలో అకోలా జిల్లాలోని ఆలయంలో పెను విషాదం చోటు చోటసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు ఆలయంలోని ఓ భారీ వేప చెట్టు కూలి షెడ్‌పై పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 30 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అకోలా జిల్లాలో బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో బాబూజీ మహారాజ్ దేవాలయంలోని షెడ్‌పై వేప చెట్టు పడటంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. జేసీబీ యంత్రాలతో విరిగిన చెట్టును, కూలిన షెడ్డు భాగాలను తొలగించి.. అందులో చిక్కుపోయిన వారిని రక్షించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అరోరా జిల్లా కలెక్టర్ అధికారులు తెలిపారు. (చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్) -
అమృత కాల బడ్జెట్ 23: సీతారామన్ ‘సప్తఋషులు’..అవేంటంటే!
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమృత కాల్ బడ్జెట్లో అవి ఒకదానికొకటి సమన్వయంతో సప్త ఋషులుగా మార్గ నిర్దేశనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాధాన్యతలు దేశాన్ని 'అమృత్ కాల్' వైపు మళ్లిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇవి తమ ప్రభుత్వానికి ఫ్రేమ్‌వర్క్‌గా సీతారామన్ అభివర్ణించారు. సీతారామన్ ఏడు ప్రాధాన్యతలు: సమ్మిళిత అభివృద్ధి రీచింగ్ లాస్ట్ మౌలిక సదుపాయాలు ,పెట్టుబడి పొటెన్షియల్ గ్రోత్ గ్రీన్ గ్రోత్ యువశక్తి ఆర్థిక విభాగం అలాగే పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పరిశుధ్దమైన నీరు, ఇండ్లు, రోడ్,టెలికాం వసతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 15 వేల కోట్లు కేటాయించారు. ఈ మిషన్, వచ్చే మూడేళ్లలో వారి సంకక్షేమం కోసం కృషి చేయనున్నట్టు ఆర్థిక మంతత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రకటించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. మహిళలు, రైతుల, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అందుకోసం ప్రత్యక అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీటవేయడంతోపాటు, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ఏర్పాటును ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేలా ప్రణాళిక అని చెప్పారు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ చేస్తామని, ఇందుకోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపును ప్రకటించారు. -
నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు
హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాలు ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది క్యూ1 నాటికి 42,080, 2020 క్యూ1లో 41,750 యూనిట్లుగా ఉన్నాయి. కరోనా తర్వాతి నుంచి హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ గృహాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2020 క్యూ1లో 1,810 అల్ట్రా లగ్జరీ గృహాలు అందుబాటులో ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 2,070లకు, ఈ ఏడాది క్యూ1 నాటికి 3,030 యూనిట్లకు పెరిగాయి. ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్‌కతాలలో కంటే హైదరాబాద్ అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ అతి తక్కువగా ఉంది. 2020 జనవరి–మార్చిలో నగరంలో 3,370 ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 5% క్షీణతతో 3,190 గృహాలకు చేరాయి. -
జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు
సాక్షి, హైదరాబాద్: డెంగీ, చికున్ గున్యా, ఇతర విష జ్వరాల దెబ్బకు ఆసుపత్రుల్లో మందులు అవసరానికి మించి వినియోగమయ్యాయి. కీలకమైన మూడు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఏకంగా ఏడున్నర కోట్ల జ్వరం మాత్రలు వాడేశారు. సాధారణంగా ఈ కాలంలో రెండున్నర కోట్లు అవసరం కాగా, ఈసారి అదనంగా ఐదు కోట్లు వినియోగించారని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వర్గాలు వెల్లడించాయి. అవన్నీ కూడా పారాసిటమాల్, డోలో వంటి మాత్రలే కావడం గమనార్హం. వాటితోపాటు జ్వరాన్ని తగ్గించే యాంటి పైరేటిక్స్, యాంటి బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌నూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. డెంగీ నిర్దారణ కిట్లు కూడా దాదాపు మూడు రెట్ల మేరకు పెరిగినట్లు అంచనా వేశామని వారు చెబుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి కూడా అదేస్థాయిలో వినియోగమయ్యాయి. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగీ, సీజనల్ జ్వరాలు విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారమే రాష్ట్రంలో 10 వేల మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ జరిగింది. దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు లెక్కలకు రెండింతలు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకే ఖతం... రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నీ కలిపి 1,056 ఉన్నాయి. ఈ ఏడాది ఆయా ఆసుపత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి రూ.226 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఆ నిధులతో టీఎస్ఎంఎస్ఐడీసీ మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అత్యవసరమైనప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇచ్చిన బడ్జెట్లో 20 శాతం ఆసుపత్రులకు కేటాయిస్తారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఆసుపత్రులకు కేటాయించిన ప్రత్యేక నిధులను కూడా వాటికే వినియోగించారు. 200 ఆసుపత్రుల పరిధిలో ఏడాదికి మందుల కొనుగోలుకు కేటాయించిన సొమ్ము మూడు నెలలకే ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రులకు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి అవసరమైన మందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీకి నిధుల సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున జ్వరం మాత్రలు కొనుగోలు చేశాం సీజన్ మూడు నెలల కాలంలో పెద్ద ఎత్తున జ్వరాలు విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జ్వరానికి సంబంధించిన మందుల వినియోగం భారీగా పెరిగింది. గతేడాది కంటే ఈసారి జ్వరం మాత్రల వినియోగం రెండింతలు అదనంగా పెరిగిందని తేలింది. డెంగీ కిట్లు కూడా భారీగానే వినియోగించాం. ఏడాది బడ్జెట్‌కు అదనంగా మరో రూ.50 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
ఆ వాతావరణం నాకు నచ్చలేదు!
నటి నయనతార చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పింది నటి నందిత. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో అట్టకత్తి చిత్రంలో కథానాయకిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఎదిర్‌నీశ్చల్ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ బిజీ హీరోయిన్గా మారింది. కాగా ఇటీవల తెరపైకి వచ్చిన దేవి–2 చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో కలిసి నటించింది. తాజాగా శుక్రవారం తెరపైకి రానున్న 7 చిత్రంలోనూ నటించింది. ఈ సందర్భంగా నటి నందితతో చిట్‌చాట్.. ప్ర: కోలీవుడ్‌లో కనిపించి చాలా కాలమైందే? జ: నేను తమిళంతో పాటు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తున్నాను. దీంతో మీకు కోలీవుడ్‌లో గ్యాప్ వచ్చినట్లు అనిపించవచ్చు. నా అదృష్టం ఏమోగానీ తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటించిన తొలి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తెలుగులో నటించిన ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రానికి ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నాను. ప్ర: ఈ మూడింటిలో ఏ భాషా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్నారు? జ: మూడు భాషల్లోనూ తనకున్న స్థానాన్ని కాపాడుకుంటున్నాను. 2017 నుం చి గ్యాప్ లేకుండా తమిళం, తెలుగు, కన్నడం భాషా చిత్రాల్లో రేయింబవళ్లు నటిస్తూనే ఉన్నాను. ప్ర: తమిళంలో మీరు నటించిన నెంజమ్ మరప్పదిలై, ఇడం పొరుల్ ఏవల్ చిత్రాలు ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, ఇం కా విడుదలకు నోచుకోకపోవడం గురించి? జ: నిజం చెప్పాలంటే నెంజమ్ మరప్పదిలై చిత్రంలో నటిస్తున్నప్పుడు తీసుకున్న శిక్షణే తెలుగులో నటించడానికి ఎంతగానో దోహదపడింది. దర్శకుడు సెల్వరాఘవన్ అంతగా నటీనటుల నుంచి నటనను రాబట్టుకుంటారు. అలాంటి దర్శకుడి చిత్రాల్లో నటించే అవకా«శం మళ్లీ రావాలని కోరుకుంటాను. ఇక ఆ రెండు చిత్రాలు త్వరగా విడుదల కావాలని దేవుడిని ప్రార్థిస్తాను. ప్ర: నటి ఐశ్వర్యరాజేష్‌తో మీ స్నేహం గురించి? జ: కనా చిత్రంలో నటిస్తునప్పుడు మా మధ్య స్నేహం మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ విషయాన్నైనా ఐశ్వర్య నాతో పంచుకుంటుంది. నిజానికి దేవి–2 చిత్రంలో నటించే అవకాశం తన ద్వారానే వచ్చింది. ఇక సారి ఫోన్ చేసి దేవి–2 చిత్రంలో మంచి పాత్ర ఉంది నటిస్తావా? అని ఐశ్వర్యరాజేశ్ అడిగింది. నేను సరే అనడంతో దర్శకుడు విజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పింది. అలా అందులో నటించాను. ప్ర: నటి నయనతారను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్నారా? జ: నిజం చెప్పాలంటే నయనతార చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇకపోతే నేనెవరినీ పోటీగా భావించను. నాకు వచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తాను. అది హీరో ఓరియెంటెడ్ కథా చిత్రమా? హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమా అని ఆలోచించను. పాత్ర నచ్చితే నటించి దానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు? జ: 7 చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం తెరపైకి రానుంది. తమిళంలో ఐపీసీ 375 చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. ఇంతకు ముందు నేను నటించిన పాత్రలన్నింటికీ భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నాను. తెలుగులో కల్కీ చిత్రంలో ముస్లిం యువతిగా నటిస్తున్నాను. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇంకా నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ప్ర: మిమ్మల్ని కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు పా.రంజిత్ ఇప్పుడు బాలీవుడ్‌కు వెళుతున్నారు.ఆ చిత్రంలో మీకు అవకాశం ఇస్తారా? జ: పా.రంజిత్ అట్టకత్తి చిత్రంలో నటించిన పలువురికి ఇతర చిత్రాల్లోనూ అవకాశం కల్పిస్తున్నారు. ఒక కథా పాత్రకు నటి నందిత బాగుంటుందని భావిస్తే కచ్చితంగా అవకాశం కల్సించే దర్శకుడాయన. ప్ర: తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటించారు. మలయాళంలో ఎప్పుడు నటిస్తారూ? జ: ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలోగానీ మలయాళంలోనూ నటిస్తాను. ప్ర: నైట్ పార్టీలకు వెళతారా? జ: ఒక్కసారి బెంగళూర్‌లో పార్టీకి వెళ్లాను. అయితే ఆ వాతావరణం నాకు నచ్చలేదు. అంతే మళ్లీ పార్టీలకు వెళ్లలేదు. -
7(సెవెన్) మూవీ రివ్యూ
టైటిల్ : 7 (సెవెన్) జానర్ : థ్రిల్లర్ తారాగణం : హవీష్, రెహమాన్, రెజీనా, నందితా శ్వేతా, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, పూజితా పొన్నాడ, అదితి ఆర్య సంగీతం : చేతన్ భరద్వాజ్ దర్శకత్వం : నిజార్ షఫీ కథ, నిర్మాత : రమేష్ వర్మ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. సరైన కంటెంట్‌తో తెరకెక్కితే ఈ జానర్ సినిమాలు సీజన్‌తో సంబందం లేకుండ ఆడేస్తాయి. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హవీష్ హీరోగా నటించేందుకు ఈ జానర్నే ఎంచుకున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి స్వయంగా కథ అందించి నిజార్ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 7(సెవెన్) సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించిన 7 ఆడియన్స్‌ను మెప్పించిందా? కథ ; రమ్య( నందితా శ్వేతా) అనే అమ్మాయి తన భర్త కార్తీక్ రఘునాథ్ (హవీష్) కనిపించటం లేదంటూ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తుంది. తన భర్తతో దిగిన ఫోటోలను స్టేషన్లో ఇస్తుంది. ఆమె కథ విన్న ఏసీపీ విజయ్ ప్రకాష్ (రెహమాన్) షాక్ అవుతాడు. రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్ గతంలో జెన్నీ అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలుస్తుంది. దీంతో ఏసీపీ ఈ రెండు కేసులను మిస్సింగ్ కేసులా కాకుండా కార్తీక్ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడన్న అనుమానంతో చీటింగ్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి (అదితి ఆర్య)ని కార్తీక్ మోసం చేశాడని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా కార్తీక్ ఆచూకి దొరక్క పోవటంతో కార్తీక్ కోసం పేపర్ యాడ్ ఇస్తారు. చివరకు కార్తీక్‌ను అరెస్ట్ చేస్తారు. అయితే కార్తీక్ మాత్రం తాను ఎవరినీ మోసం చేయలేదని, అసలు ఆ అమ్మాయిలు ఎవరో తనకు తెలియదని చెప్తాడు. కార్తీక్ చెప్పేది నిజమేనా..? మరి ఆ అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? వీరికి సరస్వతమ్మ (రెజీనా)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ కథలో విలన్ ఎవరు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; లాంగ్ గ్యాప్ తరువాత నటించిన హవీష్ ఇంట్రస్టింగ్ కథను ఎంచుకున్నాడు. అయితే కథకు తగ్గ స్థాయిలో వేరియేషన్స్ చూపించటంతో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు హవీష్ ఇంకా కష్టపడాలి. హీరోయిన్లుగా కనిపించిన వారిలో కాస్త ఎక్కువ సేపు తెర మీద కనిపించిన పాత్ర రెజీనాదే. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో నందితా, అనీషా, త్రిదా, అదితి ఆర్యలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెహమాన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ ; రమేష్ వర్మ ఇంట్రస్టింగ్ కథను తయారు చేసుకున్నా, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కథనం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్థాయి గ్రిప్పింగ్‌గా అనిపించదు. ఇంట్రస్టింగ్‌గా కథను మొదలు పెట్టిన దర్శకుడు, లవ్ స్టోరిలను మాత్రం చాలా స్లోగా నడిపించాడు. అసలు కథను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ ను మాత్రం ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించాడు. కార్తీక్ పోలీసులకు దొరికిన తరువాత కథ వెంట వెంటనే మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మరోసారి తడబడ్డాడు నిజార్. దర్శకుడిగా తడబడినా సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం నిజార్ షఫి ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్లను అందంగా చూపించటంతో పాటు ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా కలర్ఫుల్గా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు మరో ఎసెట్ నేపథ్య సంగీతం. చేతన్ భరద్వాజ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ; ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథనం ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
‘సెవెన్’ విడుదలపై స్టే
సాక్షి, హైదరాబాద్ : నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఎన్నారై కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు. అయితే తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని తెలిపారు. ఈ విషయం గురించి ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు. -
అవన్నీ కథలో భాగమే
‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సెవెన్’ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా మారారు. హవీష్ హీరోగా రమేష్ వర్మ ప్రొడక్ష¯Œ లో రమేష్ వర్మ నిర్మించారు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ 5న చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిజార్ షఫీ మాట్లాడుతూ – ‘‘ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజ¯Œ ట్రైనింగ్ ఇ¯Œ స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తీ శరవణన్‌గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ఒక రోజు హవీష్ ఫోన్ చేసి, ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని దర్శకుడిగా ఓకే చెప్పేశా. ఇదొక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాలో లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం ఆలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. దర్శకుడిగా రెండు స్టోరీ లైన్స్ అనుకున్నాను’’ అన్నారు. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్’ రిలీజ్
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మాణంలో డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇటీవల సెవెన్ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. -
ఒక్కరా.. ఇద్దరా?
ఆ అబ్బాయి పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా? కృష్ణమూర్తా? వంటి సస్పెన్స్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సెవెన్’. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కింది. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది. శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపొద్దోయ్ నన్నే..., పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు...’ పాటలను ఇప్పటికే రిలీజ్ చేయగా, తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రమేష్ వర్మ మాట్లాడుతూ–‘‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. కథ నేనే అందించాను. అభిషేక్ పిక్చర్స్ సంస్థ మా సినిమాని విడుదల చేస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లా సినిమా కూడా కొత్తగా ఉంటుంది’’ అని హవీష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహనిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
సెప్టెంబర్‌లో ‘7’
తమిళ, తెలుగు చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నిషార్ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘7’. ఈ చిత్రంలో రెజినా, నందితా సహా ఏడుగురు కథానాయకిలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిషార్ షఫి మాట్లాడుతూ ‘7లో కథను నడిపించేందుకు ఏడు మహిళా కథా పాత్రలు ఉంటాయన్నారు. కనిపించకుండాపోయిన భర్త ఆచూకీ కనిపెట్టి ఇవ్వాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేస్తారని, వీరి ఫిర్యాదులన్నీ పార్థిబన్ పాత్ర చుట్టే తిరుగుతాయని తెలియజేశారు. రెజినా, నందిత, అనిషా ఆంబ్రోస్, సునితా చౌదరి, అతిథి ఆర్య, పూజిత, పొన్నాడా కథానాయకిలుగా నటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు నటుడు హవిష్, పార్తిబన్ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారని, సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. -
ఆరు ప్రేమకథలు
‘‘ఆరుగురు అమ్మాయిలు.. ఆరు ప్రేమకథలు.. విచిత్రంగా ఆరు ప్రేమకథల్లోనూ అబ్బాయి ఒక్కడే. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా?’’ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటోంది ‘సెవెన్’ చిత్రబృందం. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, అనీషా ఆంబ్రోస్, త్రిదా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రమేష్ వర్మ కథ అందించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘సెవెన్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఊహించని మలుపులు ఉంటాయి’’ అన్నారు రమేష్ వర్మ. ఈ సినిమాకు కెమెరా: నిజార్ షపి, సంగీతం: చైతన్య భరద్వాజ్. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సెవెన్’
ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా సెవెన్. రమేష్ వర్మ స్వయంగా కథ అందించి ఈ సినిమాను నిర్మించారు. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
సప్తవర్ణ శోభితం..సప్తరాగ రంజితం..
-కన, విన వేడుకగా ఏడు నృత్యరూపకాలు –అలరించిన కూచిపూడి నృత్యోత్సవం రాజమహేంద్రవరం కల్చరల్ : వీనులకు విందుచేసే మధురమైన సంగీతానికి ఉత్తమ విలువలతో కూడిన సాహిత్యం అబ్బింది. సంగీత సాహిత్యాలకు రాగభావతాళయుక్తమైన చక్కని నృత్యాభినయం తోడైంది. వెరసి కళాభిమానుల కనులకు, వీనులకు విందు దక్కింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిర్విరామ సప్తనృత్యరూపకాల కూచిపూడి నృత్యోత్సవం హృదయరంజకంగా సాగింది. సంగీత త్రిమూర్తులు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, పదకవితాపితామహుడు అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్యపదాలు, నారాయణతీర్థుల తరంగాలతో పాటు ఆదిశంకరుల స్తోత్రసాహిత్యాలకు నృత్యరూపకాలు కళాదర్పణం పట్టాయి. నాట్యశాస్త్రం పంచమవేదమని కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్ నృత్యోత్సవానికి జ్యోతిప్రకాశనం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నాట్యశాస్త్రాన్ని బోధించిన భరతముని పేరులో మొదటి అక్షరమైన ‘భ’–భావాన్ని, ‘ర’ రాగాన్ని, ‘త’ తాళాన్ని తెలియచేస్తుందన్నారు. తాన్సేన్ సంగీతంతో వర్షంకురిపించాడన్నారు. నృత్యరూపకాలన్నిటిలో సనాతన భారతీయ వైభవాన్ని చాటడానికే ప్రయత్నించామన్నారు. ప్రతి రూపకం.. రసపూరితం.. తొలి నృత్యరూపకం సంగీత నాట్యామృత వైభవంలో భారతీయ సంగీత, నాట్యవైభవాలను చాటిచెప్పారు. గోరుగంతు లక్ష్మీదీపిక ప్రదర్శించిన ‘భామనే, సత్యభామనే, ఇంతినే, చామంతినే’ ఆకట్టుకుంది. ‘బ్రోచేవారెవరురా’, ‘మత్స్య, కూర్మ,వరాహ, మనుష్యసింహవామనా’ కీర్తనలకు కళాకారులు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. రెండోదైన సనాతన సాంప్రదాయ వైభవం రూపకంలో త్రిమూర్తుల్లో ఎక్కువతక్కువలు లేవని, జగన్మాత వలనే ముగ్గురికీ శక్తి కలుగుతోందన్న సందేశాన్ని ఇచ్చారు. ‘దశరథవర కుమారుడవయితివి’, ‘శంభో శివశంభో’, కీర్తనలకు, ఆదిశంకరుల‘అయిగిరి నందిని’ వంటిశ్లోకాలతో పాటు మహాకవి కాళిదాసు విచిత ‘చేటీభవన్నిఖిల కోటీ’ శ్లోకాన్ని వినిపించారు, ప్రదర్శించారు. దుర్గాసప్తశతి శ్లోకాలకు చిన్నారులు ప్రదర్శించిన అభినయనం ఆకట్టుకుంది. సనాతన గురువైభవం రూపకం ద్వారా భారతీయ సనాతన ధర్మంలో గురువు వైభవాన్ని తెలియచేశారు. ‘ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో’, ‘తక్కువేమి మనకు, రాముండొక్కడు తోడుండు వరకు’ ‘కృష్ణం వందే జగద్గురుం’ వాడవాడలా వెంట వసంతము’ వంటి కీర్తనలకు చక్కటి అభినయనాన్ని ప్రదర్శించారు. సాయి మహిమామృతం రూపకంలో సద్గురు సాయినాథుడు భక్తులకు తమ ఇష్టదైవం రూపంలో కనిపించడం వృత్తాంతం. ద్వాదశరాశి వైభవంలో యదువంశసుధాంబుధి చంద్ర, స్వామిరారా వంటికీర్తనలతో 12 రాశుల ప్రభావాన్ని కళ్లకు కట్టించారు. శ్రీశంకరవైభవంలో పరమేశ్వరుని ముఖం నుంచి ఉద్భవించిన పంచభూతాలు, సప్తస్వరాలు, పంచ వాయిద్యాలు, పంచతన్మాత్రలు, పది ఇంద్రియాలు,4 అంతఃకరణలు–ఇలా మొత్తం 36 తత్త్వాలను అభినయించారు. నక్షత్రమాలికాచరితంలో పదకవితా పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలతో, 27 నక్షత్రాలను వర్ణించారు. ఖగోళశాస్త్రం ఘనతను, త్రిమూర్తుల జీవన పరిమాణాన్ని వివరించారు. చివరిగా ,కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ రూపొందించిన గోదావరి హారతి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. రికార్డులకెక్కిన ప్రదర్శన ఏడు నృత్యరూపకాలను ఒకే ఆహార్యంతో ఉన్న 63 మంది కళాకారులు 12 గంటల 23 నిమిషాల ఒక సెకండులో పూర్తి చేశారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైనట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ప్రదర్శన ముగిశాక జరిగిన సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ పసుమర్తి శేషుబాబు మాట్లాడుతూ, దివినుంచి దిగి వచ్చిన అప్సరసలు చేసిన నాట్యం తిలకించిన అనుభూతి కలిగిందన్నారు. నిర్వాహకులను అభినందించారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన సినీ నటులు పూర్ణిమ, కిన్నెర కళాకారులను అభినందించారు. రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్, విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళాక్షేత్ర నిర్వాహకులు గోరుగంతు నారాయణ, గోరుగంతు ఉమాజయశ్రీ, ప్రపంచరికార్డుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
కూలిన భవనం.. ఏడుగురు మృతి..
డార్జలింగ్ః పశ్చిమ బెంగాల్ లో భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. డార్జలింగ్ పట్టణంలోని ఓ మూడంతస్థుల పురాతన భవనం కుప్పకూలిన ప్రమాదంలో మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయాలైనవారిని డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ.. అమిత్ జవల్గీ తెలిపారు. పురాతన భవనం కుప్పకూలడంతో పశ్చిమబెంగాల్ డార్జలింగ్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో శిథిలాల కింద పడి ఏడుగురు మరణించగా, ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిని స్థానిక డాక్టర్ జకీర్ హుస్సేన్ బస్తీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శిథిలాలకింద పడి చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు మహిళలే ఉన్నట్లు తెలిపారు. 1968 లో సదరు భవనం నిర్మాణం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. ఇన్నేళ్ళుగా భవనానికి ఎటువంటి రిపేర్లు చేయించలేదని, పునాదులు కూడా బాగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్నాళ్ళుగా కురుస్తున్న వర్షాలకు భవనం కూలిపోయినట్లు చెప్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికీ 2 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి వైద్యం నిమిత్తం 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాక మృతి చెందినవారి అంత్య క్రియలకోసం వారి కుటుంబాలకు ప్రత్యేకంగా 10,000 రూపాయలు వెంటనే అందించే ఏర్పాటు చేసింది. -
టాప్-10లో ఏడు మారుతీ కార్లే!!
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ... దేశీ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ప్యాసెంజర్ కార్లలో ఏడు మారుతీవే కావటం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదలైన ఈ గణాంకాల్లో మారుతీ అల్టో అగ్రస్థానంలో ఉంది. దీని విక్రయాలు 16,583 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆటో మొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తాజా అల్టో తర్వాతి స్థానాల్లో మారుతీ స్విఫ్ట్ (15,661 యూనిట్లు), మారుతీ వేగన్ ఆర్ (15,323 యూనిట్లు), హ్యుందాయ్ ఎలైట్ ఐ20 (11,147 యూనిట్లు), మారుతీ డిజైర్ (10,083 యూనిట్లు), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,840 యూనిట్లు), రెనో క్విడ్ (9,795 యూనిట్లు), మారుతీ బాలెనో (9,562 యూనిట్లు), మారుతీ సెలెరియో (8,548 యూనిట్లు), మారుతీ ఓమ్ని వ్యాన్ (8,356 యూనిట్లు) వరుసగా ఉన్నాయి. కాగా గతేడాది ఇదే సమయంలో జాబితాలో స్థానం పొందిన హోండా సిటీ, మహీంద్రా బొలెరో, హ్యుందాయ్ ఇయాన్ కార్లు ఈసారి ఆ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
25 లక్షలమంది వికలాంగులకు శిక్షణ
న్యూ ఢిల్లీ: వచ్చే ఏడేళ్ళలో 25లక్షల మంది వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం సమైక్యతకు, సమానత్వానికి ఎంతో విలువనిస్తుందని, వసుధైక కుటుంబం అంటూ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించడం మనదేశ సిద్ధాంతమని ఆయన అన్నారు. అదే సిద్ధాంతం మన చుట్టుపక్కల వాతావరణానికి, జీవితాలకు అన్వయిస్తుందన్నారు. భారతదేశ జనాభాలో వికలాంగులు సింహభాగం ఉన్నారని, వారికి అర్థవంతమైన ఉపాధి మార్గాలను కల్పించడం అవసరమని మోదీ తెలిపారు. వచ్చే ఏడేళ్ళలో వైకల్యాలున్న 25 లక్షల మందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు నైంత్ వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ డిజయబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ (డీపీఐ) సందర్భంలో మోదీ ఓ సందేశాన్నిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఈ అంశం మోదీ వ్యక్తిగత ఆసక్తిని కనబరచిందని సామాజిక న్యాయం, సాధికారత శాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలతోపాటు మొత్తం 70 దేశాలనుంచి 200 మందికి పైగా వైకల్యాలున్న వారు హాజరౌతున్నట్లు 150 దేశాల్లో సభ్యత్వం ఉన్న వికలాంగుల మానవ హక్కుల సంస్థ తెలిపింది. -
ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
పిఠాపురం : ఎప్పుడు వెళ్లేదే కదా ఎలాగైనా వచ్చేస్తారన్న నమ్మకంతో ఇంత హడావిడి జరుగుతున్నా తమ వారి కోసం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయారు వారంతా. కానీ అందరూ తిరిగొచ్చారు. వీరి జాడమాత్రం పది రోజులైనా లేకుండా పోయింది. దీంతో ఆందోళన కట్టలు తెంచుకుంది ఆ మత్స్యకార కుటుంబాల్లో. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్తపట్నానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నెల 16న కొత్తపట్నానికి చెందిన పట్టా సూర్యారావు ఫైబర్ బోటుపై అతడితో పాటు అదే గ్రామానికి చెందిన చక్కా సూరిబాబు, చక్కా నాగేశ్వరరావు, పట్టా చంద్రరావు, పట్టా ప్రభుదాస్, పాత్రి దావీదు, సూర్యమళ్ల వెంకటరమణ చేపల వేటకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన బోట్లన్నీ బుధవారం నాటికి తిరిగొచ్చాయి. వీరి బోటు మాత్రం రాక పోవడంతో మత్స్యకారుల కుటుంబాల వారు ఆందోళనకు గురై మీడియాకు సమాచారం అందించారు. వేటకు వెళ్లిన రోజు ఉదయం 11 గంటల వరకూ సెల్‌ఫోన్ పనిచేసిందని, మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్టు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదన్నారు. తమవారు తిరిగొస్తారన్న నమ్మకంతో ఉన్నామని, అందుకే ఎవరికీ చెప్పలేదని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. బోటులో ఇంజన్ పాడై, తెరచాప సాయంతో వచ్చేందుకు పది రోజులుగా కష్టపడుతున్నారేమోనని భావించామన్నారు. మత్స్యకారుల జాడ లేకపోవడంతో వారికేమైనా ప్రమాదం సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉండవచ్చని, అవి పనిచేయకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. బోటు యజమాని సహా వీరంతా మూడు కుటుంబాలకు చెందిన వారే.