shocking video
-
షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. శరవేగంతో వచ్చిన బస్సు ఆగి ఉన్న పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. నగరంలోని రోహిణి సౌత్ ఏరియాలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మితిమీరిన వేగంగో వచ్చిన డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు మొదట కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పేవ్మెంట్ దగ్గర పార్క్ చేసిన ఈ-రిక్షా, ద్విచక్ర వాహనాలపైకి దూసు కెళ్లింది. దీంతో అక్కడున్న వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు ప్రమాదానికి దారి తీసిన విషయంపై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతివేగంతోనే బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. #WATCH | One person died after being hit by a DTC bus in Delhi's Rohini area. Further investigation is underway: Delhi Police (CCTV visuals confirmed by police) pic.twitter.com/Bt1ipo9GYr — ANI (@ANI) November 4, 2023 -
మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన
ఇంపాల్: మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం సంచలనంగా మారింది. ఇక, ఈ విషాదకర ఘటన నేపథ్యంలో బాధితురాలి తల్లి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్తను, కుమారుడిని చంపేశారు. మణిపూర్‌లో హింసను ఆపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు ఇద్దరు మహిళలను గుంపునకు వదిలేశారని, దీంతో వారిని నగ్నంగా ఊరేగించారన్నారు. కొంత మంతి గుంపు మా ఇంటివైపు వచ్చి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘర్షణల్లో తన చిన్న కొడుకును కోల్పోయినట్టు కన్నీటిపర్యంతమయ్యారు. అతనికి మంచి చదువు చెప్పించడం కోసం తాపత్రయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం తన పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదన్నారు. ఇప్పుడు తన భర్త కూడా లేడని కంటతడి పెట్టారు. ఇప్పుడు మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎంతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై భయంగా ఉందన్నారు. ప్రస్తుతం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామన్నారు. మా ఊరికి వెళ్లడం ఇష్టం లేదు.. ఇదే సమయంలో మళ్లీ తాము తమ స్వగ్రామనికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం తన మనసులోనే లేదని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తమ ఇళ్లు తగులబెట్టారని, పొలాలను ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. అలాంటప్పుడు ఇక గ్రామానికి దేనికి వెళతామన్నారు. తమ గ్రామమే మంటల్లో కాలిపోయిందని, తన కుటుంబ భవిష్యత్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కాగా.. తన తండ్రిని, తమ్ముడిని చంపేయడం నా కూతురు తన కళ్లతో చూసింది. ఇది తన హృదయాన్ని బాగా గాయపరిచిందన్నారు. ఇక నుండి ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భగవంతుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని, కానీ దీని గురించి పగలు, రాత్రి ఆలోచిస్తున్నానని, మానసికంగా బలహీనంగా ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. "They Killed Her Father, Her Brother...": Mother Of Woman In Manipur Video https://t.co/BRYRwLbT56 pic.twitter.com/AGc5K2Rf6G — NDTV (@ndtv) July 21, 2023 సీఎం బీరెన్ వీడియో సందేశం మణిపూర్ కీచక పర్వంపై దేశం రగిలిపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ఉదయం లైవ్ ద్వారా స్పందించారు. ‘‘ఘటనపై బాధగా ఉంది. మానవత్వానికి వ్యతిరేకమైన ఈ ఘటనను.. ప్రతీ ఒక్కరూ ఖండించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాం. మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని తెలిపారు. ఇక, ఈ ఘటనకు పాల్పడిని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హెల్త్ వర్కర్‌ను గుర్తు తెలియని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడుతున్న మహిళను వెనుక వచ్చి బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయ్ జిల్లాలో బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆమె విధుల్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టి, కౌగిలించికున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ.. అతనెవరో నాకు తెలియదు. నన్ను మానసికంగా హింసించాడు. ఆసుపత్రి కాంపౌండ్ గోడ దూకి ఎందుకు వచ్చాడు. అతడు నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నేను ప్రతిఘటించాను. వెంటనే నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. కానీ, గోడ దూకి అతను పారిపోయాడు. దీనికి కారణమైన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉంది. ముళ్ల కంచె వేసి ఆసుపత్రికి తరచుగా వచ్చే మహిళలను రక్షించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
9 ఏళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేసిన వ్యక్తి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
తిరువనంతపురం: కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. కాసర్గడ్ జిల్లాలోని మంజేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించిన అతనికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉధ్యవరం నివాసి అబూబకర్ సిద్దిక్ (30)గా గుర్తించారు. చదవండి: పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు #CCTV: A 9-year-old #girl was thrown away by a man in #Kerala's #Kasargod. A girl #student was lifted and thrown on the ground without any reason near #Manjeshwar of Kasaragod. #Kerala pic.twitter.com/090DZ6qgNx — Harish Deshmukh (@DeshmukhHarish9) November 18, 2022 -
వైరల్ వీడియో: మైండ్ పనిచేయదా ఇలా ఎవరైనా చేస్తారా.. ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం!
-
మైండ్ పనిచేయదా ఇలా ఎవరైనా చేస్తారా.. ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం!
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు మాత్రం అవేవీ పట్టించుకోవడంలేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా ఎదుటివారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు. తాజాగా ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కళా కృష్ణస్వామి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక, ఈ వీడియోలో రోడ్డుపై ఆపిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. బైక్‌ను సడెన్‌గా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు ఆ యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రమాదం వీడియో 2017లో జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తున్నది. ఇక, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులను హెచ్చరించేందుకు డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ‘దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది మరో ప్రమాదం.. Recently same type of accident happened in Mysuru too... passengers in car should watch rear before they open door. pic.twitter.com/zftDK4R1WN — 🇮🇳 ಅಭಿಜ್ಞ ಎನ್ ಜಿ 🇮🇳 #FightCancer (@abhignang) September 28, 2022 -
లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు..
ఢిల్లీ: మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్ హాస్టల్లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి సైతం పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనపై హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ దృష్టికి చేరడంతో ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో డీసీడబ్ల్యూ రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB — Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022 వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేయాలని స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు. అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ డీసీపీ శ్వేతా చౌహాన్ వెల్లడించారు. Since the complainant is against giving a statement, legal opinion was taken&as per legal opinion & in light of video footage, FIR being registered suo motto by police: DCP Central Dist, Shweta Chauhan on a security guard molesting & manhandling girls at a PG hostel in Karol Bagh pic.twitter.com/GdzvVjnwZQ — ANI (@ANI) August 17, 2022 ఇదీ చదవండి: ఇది రూ. 500 మర్డర్!! తల నరికి.. -
పెళ్లి పీఠలపైనే పెళ్లి కూతుర్ని చితకొట్టిన పెళ్లి కొడుకు..!!
-
రైలు రావడం గమనించి మరీ పట్టాలపై తోసేశాడు..!
రైలు వస్తుండగా పట్టాలపై పడితే ఇక అంతే సంగతులు.. పొరపొటునో, ఆత్మహత్యాయత్నం చేసుకునే క్రమంలో రైలు కింద పడిన సందర్భాలు ఎక్కువగా వింటూ ఉంటాం. కాగా, ఒక మనిషిని హత్య చేయాలనే ఉద్దేశంతో రైలు పట్టాలపైకి తోసిన ఘటన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో ఏమౌతుందో అనిపించే ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే వీడియో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకెళ్తే...బ్రస్సెల్స్‌లో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసాడు. అయితే రైలు సకాలంలో ఆగిపోవడంతో మహిళ గాయపడకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బ్రస్సెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ దుండగుడు మహిళను పట్టాలపై తోసేయడానికి ముందు అక్కడ ఉన్న ఫ్లాట్‌ఫాం కలియ తిరుగుతాడు. ఆ తర్వాత ఆ మహిళ వద్దకు వచ్చి ఎదురుగా వస్తున్న రైలు ముందుకు తోస్తాడు. ఆ ఘటనతో షాక్‌కు గురైన మహిళ పట్టాలపై పడిపోయి షాక్‌లో ఉండిపోతుంది. అయితే ఆ ట్రైయిన్ డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేక్ వేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ దుండగడు మాత్రం ఆ మహిళను తోసేపి వెంటనే పారియినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. ఈ మేరకు బ్రస్సెల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆ దుండగుడిని వెంటనే వేరొక మెట్రో స్టేషన్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని తెలిపారు. -
కొట్టుకుపోయిన బ్రిడ్జి, షాకింగ్ వీడియో!
భోపాల్: వరద ఉద్ధృతికి మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. మణిఖేడ డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన గ్వాలియర్‌కి అనుసంధానించే మూడింటిలో ఈ వంతెన ఒకటి. అయితే ఇప్పటికే బాధిత గ్రామాలను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తగిన సాయం చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్ననేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయంపై ప్రధాని మోదీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. 2009లో నిర్మించిన దాతియా-రతన్‌గఢ్ దేవాలయాన్ని కలిపే ఇదే వంతన వద్ద 2013 అక్టోబరులో జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు. కాగా భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలముతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, గ్వాలియర్ చంబల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాలలో వైమానిక దళానికి చెందిన అనేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలోని 1100లకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొమ్మిదింటికి ఆరెంజ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు. సహాయ,రక్షణ బృందాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. Scary! Bridge connecting Datia to Ratangarh temple washed away, in flood fury following release of water from Manikheda Dam. Same bridge where in 2013 stampede had killed over 115 devotees @ndtvindia @ndtv @GargiRawat @manishndtv @alok_pandey pic.twitter.com/YTWoq0gr6o — Anurag Dwary (@Anurag_Dwary) August 3, 2021 -
మరీ ఇంత దిగజారాలా; వధువుపై యువకుడి ముద్దుల వర్షం!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ హవా నడుస్తుండడంతో రకారకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆతాజాగా వరుడు పక్కన ఉండగానే ఒక యువకుడు వధువు పక్కన కూర్చొని ఆమెకు ముద్దులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. విషయంలోకి వెళితే.. రిసెప్షన్ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
బంగీజంప్ వైరల్ వీడియో
-
‘ఓ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది’
-
ఫ్లోరిడాలో రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు
-
కార్గిల్‌లో అమానవీయ ఘటన
-
వైరల్ : హార్ట్ బ్రేకింగ్ వీడియో..!
న్యూఢిల్లీ : కార్గిల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడ్డ ఓ ఎలుగుబంటిపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అది ఓ కొండపై నుంచి నీటి కాలువలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఎలుగు జాడ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. 8 సెకన్ల నిడివి గల ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలు.. సమీప గ్రామంలో చొరబడ్డ ఓ ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమారు. అది వారి బారినుంచి తప్పించుకుని ఓ నీటి కాలువలోకి చేరింది. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి గట్టుకు చేరేందుకు కొండనెక్కడం మొదలుపెట్టింది. అయితే, పైనుంచి ఓ అల్లరిమూక దానిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో పట్టు కోల్పోయిన ఎలుగు అంతెత్తు పైనుంచి కిందపడింది. తీవ్ర గాయాలతో నీటిలో పడి కొట్టుకుపోయింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనను ఖండించారు. నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్గిల్ డిప్యూటీ కిమషనర్ బసీరుల్ హక్ చౌదరీ ఘటనపై విచారణలకు ఆదేశించారు. రాళ్లు విసిరిన వారిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని, ఎలుగు జాడ కనుగొనేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారామిచ్చామని వెల్లడించారు. -
వరదలు: షాకింగ్ వీడియో
బెంగళూరు: కేరళలో వరద బీభత్సం మరింత ఉగ్రరూపం దాల్చింది. గత ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కేరళను వణికిస్తున్నాయి. గత శతాబ్దంలో కురవని వర్షాలు రాష్ట్నాన్ని ముంచెత్తాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. మృతుల సంఖ్య 87కి చేరింది. చివరికి సహాయశిబిరాలు కూడా వరదల్లో చిక్కుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు కర్నాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొడగు జిల్లాకు సంబంధించిన ఒక షాకింగ్వీడియో వైరల్ గా మారింది. ఒక కొండ అంచున ఉన్న రెండు అంతస్థుల భవనం కొన్నిసెకన్లుపాటు అలా కదలిపోయింది. అతి ప్రమాదకర పరిస్థితిలో అలా ప్రవహిస్తూ మట్టితో పాటు కొట్టుకుపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. వరద పరిస్థితికి ఈ భయంకరమైన వీడియో అద్దం పడుతోంది. కర్నాటకలోని మూడు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో భవనంలో ఎవరూ లేరని జిల్లా పరిపాలక అధికారులు ప్రకటించారు. మడికేరికి సమీపంలోని కట్టకేరి, తంతితాల గ్రామాలలో దాదాపు 300 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి, సమీపంలోని కొండపైన, రక్షక చర్యలకోసం ఎదురు చూస్తున్నట్టు కొడగు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీవిద్యా తెలిపారు. కాగా వాతావరణ శాఖ లెక్కల ప్రాకరం కేరళలో జూన్ 1, ఆగష్టు 15 మధ్యకాలంలో 2091.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 1600 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 30.7శాతం ఎక్కువ. ఆగస్టు9, 15 మధ్య తేదీల్లో సగటున 98.5 మి.మీ.కు బదులుగా 352 మి.మీ సగటు వర్షపాతం నమోదయింది. ఇది 257 శాతం ఎక్కువ. ఇడుక్కి జిల్లాలో సాధారణంకంటే 447.6శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆర్మీ బృందం సహాయ రక్షక చర్యలకోసం గురువారం తిరువనంతపురం చేరుకుంది. -
వరద బీభత్సం: భయంకరమైన వీడియో
-
చావు, బతుక్కి మధ్య అర క్షణం; షాకింగ్ వీడియో
సెలేమ్(యూఎస్) : ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఓ పోలీసాయన దోస్తులతో కలిసి సరదాగా చేపలవేటకు వెళ్లి.. అట్నుంచే మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు! కొలంబియా నదిలో చిన్న చేపల పడవను భారీ స్పీడ్ బోటు ఢీకొట్టిన ఘటన తాలూకు వీడియో నెటిజన్లను గగుర్పాటుకు గురిచేస్తోంది. క్షణాల్లో కకావికలం : బ్రియాన్ మెస్ అనే పెద్దమనిషి ఆరెగాన్ రాష్ట్రంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ సెలవునాడు తన స్నేహితులైన రోనీ డుర్హామ్, క్రిస్టోఫర్ మెక్మహూన్లను వెంటేసుకుని కొలంబియా నదిలో చేపలవేటకు వెళ్లాడు. కాలం సరదాగా గడుస్తుండగా.. దూరం నుంచి తెల్లటి మృత్యుశకటం దూసుకొస్తున్నట్లు కనిపించింది. దాదాపు 30 అడుగుల పొడవున్న ఆ తెల్లటి స్పీడ్‌బోటు.. కొద్దిసేపట్లోనే చేపల పడవను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. పడవలోని ఆ ముగ్గురూ నీళ్లలోకి దూకడం క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయేవారే! డ్రైవర్ వింత వాదన.. బాధితుల భారీ దావా : 2017, ఆగస్టులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్పీడ్ బోటు యజమానిపై మార్లిన్ లార్సెన్‌పై కేసు నమోదయింది. అయితే జరిగినదాంట్లో తన తప్పేమీ లేదని, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు.. ఎదురుగా ఉన్న బోటు కనిపించలేదని లార్సెన్ వాదించాడు. తద్వారా పరిహారం చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బాధితులు మాత్రం ముమ్మాటికీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద సమయంలో స్పీడ్ బోటు డ్రైవర్ లార్సెన్.. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడని కోర్టుకు చెప్పారు. ఓ మోస్తారు గాయాలతో బయటపడిన బాధితులు ముగ్గురూ.. భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తూ స్పీడ్ బోటు డ్రైవర్‌పై మరో దావా వేశారు. -
చావుకు, బతుకుకు మధ్య అరక్షణం
-
వరంగల్‌లో షాకింగ్ వీడియో..
సాక్షి, వరంగల్ : నడిరాత్రి మొదలుకొని సరిగ్గా తెల్లవారే వరకు మిగితా వారంతా గాఢ నిద్రలో ఉండగా వారు మాత్రం కంటిపై రెప్పవేయకుండా పనిచేస్తుంటారు. శుభ్రతను వృత్తిగా తీసుకొని చెత్తాచెదారాన్ని ఊడ్చిపారేస్తుంటారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో.. వారు సురక్షితంగా ఇల్లు చేరే వరకు కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే నడి రోడ్డుపై వాళ్లు చెత్తను శుభ్రం చేసే పనుల్లో ఉండగా అటుగా వచ్చే వాహనాలు ఎలా వస్తుంటాయో ఎవరూ ఊహించలేరు. ఎవరు తాగి నడుపుతుంటారో, ఎవరు నిద్రపోయి డ్రైవ్ చేస్తుంటారో, ఎవరు కావాలని మీదకు వాహనాలు తోలుకొస్తారో అస్సలు ఊహించలేరు. ఇంకా చెప్పాలంటే పనిమీద ధ్యాసతో పాపం వారు పారిశుధ్య పనుల్లో నిమగ్నమవుతారు. అలా ఉన్న సమయంలో వారు అనేక ప్రమాదాలకు గురై ప్రాణాలుకోల్పోతుండటం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ ఘటన వరంగల్‌లో బుధవారం తెల్లవారు జామున 4.25గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఆ వీడియో చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. సుమలత అనే మహిళ వరంగల్ జిల్లా పరకాలలో నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె తెల్లవారు జామున రోడ్డు ఊడుస్తుండగా ఆమె వెనుకాలే వచ్చిన ఓ లారీ ఒళ్లు గొగుర్పొడిచేలా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లో ఎగిరి పడ్డారు. పక్కనే ఉన్న మరోకార్మికురాలు వెంటనే వెళ్లి ఆమెను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆ కార్మికురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత ఆమెకు దూరంగా వెళ్లిన లారీ అనూహ్యంగా ఆమె వైపు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని వీడియో చూసిన వాళ్లంతా అంటున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో వీక్షించండి -
అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్తుండగా షాకింగ్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ వెళ్తుంటే అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ట్రంప్ కాన్వాయ్ వైపుగా ఓ కారు ఒక్కసారిగా రోడ్డుమీదకు దూసుకొచ్చింది. అయితే ఏదో సాంకేతిక లోపంతో కారు అక్కడికక్కడే నిలిచిపోవడంతో చీఫ్ సెక్యూరిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా.. అధ్యక్షుడు ట్రంప్ మిస్సోరిలో ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇంతలో ఓ తెల్లకారు రోడ్డుమీదకు దూసుకొచ్చింది. అయితే చెట్ల వెనుక నుంచి కారు రోడ్డు మీదకు రావడం, అది కూడా ట్రంప్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో అధికారులు కంగుతిన్నారు. అప్పటికే ట్రంప్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు ముందుకెళ్లగా, సెక్యూరిటీకి సంబంధించిన ఓ వాహనం ఆగిన కారును సమీపించింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, బ్రేకులు ఫెయిలవడంతో సమీపంలోని బాస్ ప్రో వేర్ హౌస్ నుంచి వాహనం అదుపుతప్పి దూసుకువచ్చిందని తెలుసుకున్నారు. దాడులకు సంబంధించిన సూచనలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా క్లేట్ హెఫ్నర్ అనే వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. -
మంటగలిసిన మానవత్వం
-
మంటగలిసిన మానవత్వం
చెన్నై : చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కూడా లేని ఓ నిర్భాగ్యుడిపై నలుగురు యువకులు మద్యం మత్తులో తమ ప్రతాపం చూపించారు. ఇష్టానుసారంగా దాడి చేసి, అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నైలోని రంగరాజపురంలో ఇండియన్ బ్యాంక్ ఎదుట జూన్ 4న అర్థరాత్రి జాఫర్(50) అనే నిరాశ్రయుడు పడుకున్నాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు అటుగా వచ్చారు. వాళ్లు మద్యం మత్తులో సోయిమరిచి ఇష్టానుసారంగా జాఫర్‌పై దాడికి దిగారు. అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో యువకుడు పైపుతో కూడా దాడి చేసి పైశాచికానందాన్ని పొందారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటనలో జాఫర్‌పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. వీరిలో శ్యామ్, పుగాజెందీ, రాజేశ్‌లతో పాటూ మరో మైనర్ బాలుడు ఉన్నారు. జాఫర్‌పై దాడి చేసినట్టు ఈ నలుగురు యువకులు ఒప్పుకున్నట్టు సమాచారం. మద్యం మత్తులో ఉండటంతో ఏం చేస్తున్నామో తమకు తెలియలేదని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంఘటన అనంతరం బాధితుడు జాఫర్ కనిపించకుండా పోయాడు. అత్యంత క్రూరంగా వ్యవహించిన నలుగురిపై కేసు నమోదు చేయడానికి బాధితుడు జాఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నడి రోడ్డుపై అంత జరిగినా ఎవరూ ఆగలేదు
బీడ్(మహారాష్ట్ర): ఓ మనిషి నిలువునా తగులబడిపోతున్నా మానవత్వం బయటకు రాలేదు. రోడ్డున పోయే ఏ ఒక్కరు కనికరించలేదు. ఒక్క వాహనం కూడా అసలు ఏం జరుగుతుందా అని పరిశీలించే ప్రయత్నం చేయలేదు. అక్కడికి చేరిన నలుగురైదుగురు కూడా ఏం చక్కా తమ ఫోన్లకు పని పెట్టే వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ మనసు చివుక్కుమనే సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని ఓ రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ క్రమంలో అవతలి బైక్ వ్యక్తి గాయపడగా మరో బైక్‌పై ఉన్న వ్యక్తి మాత్రం ఆ బైకుకిందే చిక్కుకుపోయాడు. ఈ లోగా అనూహ్యంగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో అది కాస్త బడబాగ్నిలా చుట్టుముట్టి నడిరోడ్డుపైనే చితిమాదిరిగా మారిపోయింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఆ రోడ్డుపై వెళ్లే ఏ ఒక్కరూ స్పందించిన ఈ వ్యక్తి కూడా గాయాలతో బయటపడే అవకాశం ఉండేది. కానీ, అలా జరగకపోవడంతో కళ్లముందే సజీవంగా ఓ వ్యక్తి తన బైక్‌తో సహా తగులబడిపోయి భస్మంగా మారాల్సి వచ్చింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మానవతావాదులంతా కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బహుశా ఈ బైకుల్లో ఎవరో ఒకరు మద్యం తీసుకొని వెళుతుండొచ్చని, ఢీకొట్టడం కారణంగా అది మండి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.