singireddy niranjan reddy
-
రాజ్యాంగ పాలనా.. రాచరికమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగ పాలనకు బదులుగా రాచరిక పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ పారీ్టకి చెందిన పలువురు మాజీ మంత్రులు విమర్శించారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనలో రైతులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు చేసిన తిరుగుబాటును కుట్రగా పేర్కొంటూ.. రైతులు, విపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ డీకే అరుణను లగచర్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి మాత్రం 200 వాహనాల్లో తిరిగే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లో మాట్లాడారనే విషయాన్ని నేరంగా చూపుతూ పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామన్నా రు. రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ మూకుమ్మడి జైల్ భరోకు పిలుపునిస్తుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు.అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాని రేవంత్‌ను బీఆర్ఎస్ నిలదీస్తుండటంతో అరెస్టులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. లగచర్ల ఘటనలో కట్టు కథలు చెప్తూ.. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దాడులను ప్రోత్సహించడం బీఆర్ఎస్ విధానం కాదని, అధికారులు గ్రామాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం లేనందునే కొడంగల్ ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. -
రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
-
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
ప్రజలకు ‘విజయ’ మరింత చేరువ కావాలి
రాజేంద్రనగర్ (హైదరాబాద్): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కాంగ్రెస్ మొదటి నుంచీ ద్రోహపూరిత పాత్రనే పోషించిందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణను నిర్లక్ష్యమే చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనేది ప్రజల హక్కు తప్ప కాంగ్రెస్ ఇచ్చుడు, తీసుకునుడు అనే వాదన అర్థరహితమన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు తెలంగాణ అంటే ఎప్పుడూ పట్టదని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించారు. చరిత్రను అర్థం చేసుకోని అజ్ఞానులే కేసీఆర్‌ను బషీర్‌బాగ్ కాల్పులకు కారణమంటారని, తెలంగాణ మలి ఉద్యమానికి కరెంటు, వ్యవసాయ రంగ సమస్యలే కారణమని చెప్పారు. బషీర్‌బాగ్ కాల్పుల తర్వాత కేసీఆర్ రాసిన లేఖనే తెలంగాణ ఉద్యమానికి మలుపని పేర్కొన్నారు. గత తొమిదేళ్లలో కరెంటు పోయి దెబ్బతిన్న రంగం ఏమీలేదన్నారు. 15 నిమి షాలో, అరగంటో కరెంటు పోతే 24 గంటల కరెంటు లేన ట్టా అని ప్రశ్నించారు. కొన్ని సాంకేతిక కారణాల తో కరెంటు పోతే లాగ్ బుక్కులు అంటూ రాజకీయం చేస్తున్నారని, అజ్ఞానులే కరెంటు కొనుగోలుపై ఆరోపణలు చేస్తారన్నారు. రేవంత్ ముందే బయటపెట్టారు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వొద్దు అనే కాంగ్రెస్ హైకమాండ్ విధానాన్ని రేవంత్ ముందే బయటపెట్టారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో కూ డా రేవంత్ ఓటుకు నోటు కేసులో తొందర పడి చంద్రబాబును తట్టా బుట్టా సర్దుకుని వెళ్లేలా చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పేటెంట్ అని, ఉచిత విద్యుత్‌కు కాదని ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి గతంలో అనేక సవాళ్లు విసిరి పారిపోయారని, అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవ సరం లేదన్నారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో చంద్రబాబు అభిమానులు పెట్టిన మీటింగ్‌లో రేవంత్.. చంద్రబాబు ఎజెండానే మాట్లాడారని ఆరోపించారు. కరెంటు కొనుగోలు ఎలా జరుగుతుందో తెలియని అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి భూమిక కరెంటే అని తెలియక బెదిరింపులకు దిగుతున్నారన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
-
మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
ఆర్గానిక్ ఆలోచన భేష్ !
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడి వివాహాన్ని ప్లాస్టిక్‌కు దూరంగా, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల వంటలతో జరిపించారు. ఈ విషయమై ‘ఆదర్శ రైతు ఇంట.. ఆర్గానిక్ పెళ్లంట’శీర్షికన ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతు రామారావుకు సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్గానిక్ పెళ్లి చేయటం అభినందనీయమని చెబుతూ వధూవరులు కిరణ్, ఉదయశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు కోయచెలకలోని ఆర్గానిక్ క్షేత్రాన్ని సందర్శిస్తానని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కిరణ్ స్వయంగా ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. -
రైతు సేవలకే మొదటి ప్రాధాన్యం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మన్సూరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవాలను సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్య త ఉపాధ్యాయులపై ఉందని, విలువలతో కూడిన విద్య అందించడంలో కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్లో కోతలతో కొంత మేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని... అందుకే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. చదువులపై భారీగా ఖర్చు... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటాయిస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో ఆయన వివరించారు. విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు బడ్జెట్లో 10 శాతానికి పైగానే ఉంటున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదట అటవీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా 43 శాతం, తరువాత 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశంలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని, అందులో ఉపాధ్యాయులే అత్యధికంగా ఉన్నారన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తొలి నుంచీ ప్రభుత్వానికి అండగా ఉపాధ్యాయులు: మంత్రి సబిత ఉపాధ్యాయులు మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఎస్టీయూటీఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు ఎన్ని సమస్యలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల, ప్రమోషన్లు, బదిలీల విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు నూతన విద్యావ్యవస్థ ఏర్పాటుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ సావనీర్‌ను, డైరీని, వజ్రోత్సవ సీడీని, తెలంగాణ జాతిరత్నాలు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్య క్షుడు సదానందగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు, నరేంద్రారెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వర్రావు, ఏపీ సంఘం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, తిమ్మన్న, కమలారెడ్డి, కరుణాకర్, శ్రీధర్, సుధాకర్, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆగ్రోస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆగ్రోస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన కు ఆగ్రోస్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తిప్పన విజయసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గ్యాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: రాబోయే ఐదేళ్లలో తెలంగా ణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఆయిల్ పామ్‌తో పాటు వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్ తదితర నూనె గింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంట నూనెల తయారీకి అవసరమైన ముడి సరుకు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వంట నూనెల దిగు మతిని తగ్గించడంతో పాటు దేశీయంగా వంట నూనెల త యారీని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సదస్సు లో తొలి రోజు సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పది వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫుడ్ ప్రాసె సింగ్ జోన్లలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులతో వచ్చే వారికి ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వివి ధ రంగాల్లో సాధించిన విజయాలను వివరించడంతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయని, కానీ రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో పచ్చదనం విస్తీర్ణం 24 శాతం నుంచి 31.77 శాతానికి పెరిగిందని కేటీఆర్ వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగును పెంచుతాం: మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో భారత్, చైనాది సింహభాగం కాగా, ఏటా ప్రపంచ జనాభాకు 220 మిలియన్ టన్నుల నూనె గింజలు అవసరమవుతున్నాయని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. భారత్‌లో నూనె గింజల వినియోగం ఏటా 20 నుంచి 22 మిలియన్ టన్నులు కాగా, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా నూనె గింజల ఉత్పత్తి 50 శాతం కూడా లేదన్నారు. రూ.99 వేల కోట్లకు పైగా వెచ్చించి విదేశాల నుంచి వంట నూనె గింజలు దిగుమతి చేసుకుంటుండగా ఇందులో పామాయిల్ 65 శాతం ఉందని తెలిపారు. దేశంలో వేరు శన గ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు, ఆయి ల్ పామ్ సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్, ప్రతినిధులు బన్సల్, గుప్తాతో పాటు మలేసియా, థాయ్‌లాండ్, యూరోప్, యూకే ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
చిరుధాన్యాలకు మరింత ప్రాధాన్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చిరుధాన్యాల సాగుకు మరింత ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో పోషక విలువలు అధికంగా అందించగల వీటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన నాలుగో నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వీటిలో చిరుధాన్యాల విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి పోషకాలను అందించే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వీటిని అన్నివర్గాల వారికి అందివ్వగలిగితే డిమాండ్ పెరిగి ఎక్కువమంది రైతులు సాగు చేపట్టే అవకాశం ఉందని వివరించారు. చిరుధాన్యాల సాగుకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం కాగలదని సీనియర్ ఐఏఎస్ అధికారి, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో డాక్టర్ అశోక్ దళవాయి అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం 28 కోట్ల టన్నుల ధాన్యాలు పండుతుండగా, ఇందులో కనీసం మూడోవంతు చిరుధాన్యాలు ఉండేలా చేయగలిగితే భవిష్యత్తు అవసరాలను అందుకోగలమని చెప్పారు. కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అదనపు కమీషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న చిరుధాన్య ఉత్పత్తులు... నేషనల్ న్యూట్రీ సీరల్ కన్వెన్షన్ 4.0 సందర్భంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉత్కర్ ఫుడ్స్ అనే బెంగళూరు కంపెనీ చిరుధాన్యాలతో చేసిన వడియాలకు ఆయుర్వేద మూలికలైన శతావరి, నన్నారి (ఇండియన్ సార్స్ పరిల్లా)లను జోడించింది. నన్నారి కీళ్లనొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. శతావరి విషయానికొస్తే ఇది హార్మోన్ల సమతౌల్యానికి, మెనోపాజ్ సమస్యల పరిష్కారానికి అక్కరకొస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. మిబిల్స్ మురుకులు, మిక్స్చర్, లడ్డూలు, గోల్డెన్ మిల్లెట్స్, క్వికీలు నూడుల్స్, పాస్తాలను సిద్ధం చేసి అమ్ముతున్నాయి. వైస్ మామా చిరుధాన్యాలకు పండ్లు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్లు జోడిస్తోంది. -
‘కేసీఆర్ పాలన నేటి, రేపటి తరానికి వరం’
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి విక్టోరియా ఇంఛార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక, మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, పేదలు రెండు కళ్లుగా భావిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్. దేశంలో కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు.. నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని అన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. దేశంలో మత రాజకీయంతో విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు, అన్ని మతాల ప్రజలు సర్వతోముఖభివృద్ధి తో సంతోషంగా ఉన్నారని , నేటి కేసీఆర్ పథకాలు, సంస్కరణలు ప్రస్తుత, రేపటి తరాలకు వరం అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ , జై తెలంగాణ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సభ్యులు విశ్వామిత్ర, సతీష్, వినయ్ సన్నీ, ప్రవీణ్ లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయి యాదవ్, వేణు నాన, రాకేష్ , సాయి గుప్తా, సందీప్ నాయక్, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవం: మంత్రి నిరంజన్‌రెడ్డి
ఏజీవర్సిటీ: వ్యవసాయరంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలోని ఉంచుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటి సారిగా యారియాను ద్రవరూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిదని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎరువులు–రసాయనాల వాడకం–నానో యూరియా వినియోగం అవశ్యకతపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా గురించి రైతులకు వివరించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొన్నారని, 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలను పరిశీలించాక మార్కెట్ల్లో విడుదల చేశారని చెప్పారు. దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని, దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నానో యూరియా వల్ల రవాణా ఖర్చులు తగ్గి, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతుల భారం తప్పుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, మార్కెఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆసియాలోనే పెద్ద మార్కెట్
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ లే ఔట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్)కు టెండర్ అప్పగించామన్నారు. నమూనా లే ఔట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపామని, సోమవారం రెండు లే ఔట్లను పరిశీలించి, మార్పులు చేర్పులకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రముఖ మార్కెట్లైన ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్ కోట్, బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లేఔట్ల నమూనా తయారు చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో ఆర్ఆర్ఆర్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని ఆయన తెలిపారు. -
కాళేశ్వరానికి మీ సర్టిఫికెట్ అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలవనరుల విభాగం నిపుణులే ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీ నాయకుల సర్టిఫికెట్ అక్కరలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు నీళ్లుతాగి, పంటలు పండించుకుని.. లబ్ధిపొందిన ప్రజలే కాళేశ్వరానికి సర్టిఫికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎక్కడో నీటి లభ్యతలేని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ చేసి మేడిగడ్డకు మార్చారని చెప్పారు. అక్కడే ఇప్పుడు చూస్తున్న అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించడాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఇంత దుర్మార్గంగా ఈర్ష్యను ప్రదర్శించేవారు ఎవరూ ఉండరని, కాంగ్రెస్, బీజేపీ నేతల అక్కసుకు అవధులు లేవని మండిపడ్డారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడటం వారి తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎన్నడూ లేని వరద.. గోదావరికి ఎన్నడూ లేని రీతిలో వరదలు పోటెత్తడం వల్లనే ప్రాజెక్టులన్నీ నిండాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం కాళేశ్వరం వద్ద వరద నీటి మట్టం 103.5 మీటర్లు ఉంటే దానిని హెచ్చరికగా పరిగణిస్తారని, 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తే డేంజర్ లెవెల్ దాటినట్లని తెలిపారు. 1986లో కాళేశ్వరం వద్ద నమోదు అయిన అత్యధిక వరద మట్టం 107.05 మీటర్లు కావడంతో, ఆ ఎత్తును దృష్టిలో పెట్టుకొనే పంప్ హౌస్‌లు నిర్మించారన్నారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 14వ తేదీన కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 108.19 మీటర్లు నమోదు అయిందని వివరించారు. గతంలో శ్రీశైలానికి 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కర్నూలునగరం మునిగిందని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగిందని, కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు మునిగిందని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన జూరాల ప్రాజెక్టులో నీటిలభ్యత కేవలం ఆరు టీఎంసీలే కాబట్టి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో చేపట్టినట్లు తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చిందని, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని పార్లమెంటులో డిమాండ్ చేయాలన్నారు. -
తొలి రోజు రూ.586 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు. -
నేటి నుంచి ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులు, గొర్రె, మేక మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్పాదకతను పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్‌ను తట్టుకోగలమని పేర్కొన్నారు. చైనాలో ఎకరాకు వంద క్వింటాళ్లు పండిస్తే, మనదేశంలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించగలుగుతున్నామన్నారు. మాంసమైనా, వ్యవసాయ ఉత్పత్తులైనా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడగలుగుతామని స్పష్టం చేశారు. శనివారం చెంగిచెర్లలోని మాంసోత్పత్తి జాతీయ పరిశోధన కేంద్రంను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి సందర్శించి అక్కడ మొక్కనాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..దేశంలో 7.5కోట్ల గొర్రెలుంటే తెలంగాణలోనే 2కోట్ల గొర్రెలున్నాయని, దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6 కేజీలని, తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలుగా ఉందని తెలిపారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు ఉందని, ఇది 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయని మంత్రి అన్నారు. మంత్రితో పాటు మాంసోత్పత్తిపై జాతీయ పరిశోధన కేంద్రం సంచాలకుడు ఎస్బీ బుద్దే, ప్రిన్సిపల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) గురించి కనీస అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు.. కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం లేదు.. ఆయన బండి సంజయ్ కాదు.. బంగి సంజయ్..’ అని విమర్శలు గుప్పించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు చేపట్టే పనులు, నిధుల సమీకరణపై వివరాలు వెల్లడించడంతో పాటు ఆరు నెలల్లో ఎలా పనులు పూర్తి చేస్తారో కాగితం రాసివ్వాలని సవాలు చేశారు. గద్వాలలో జరిగిన బహిరంగసభలో ఆర్డీఎస్ ఆయకట్టుకు సంబం ధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. టీఆర్ఎస్ హయాంలో ‘తుమ్మిళ్ల’ బండి సంజయ్, బీజేపీ కర్ణాటక కో–ఇన్చార్జి డీకే అరుణ ఇద్దరూ కలిసి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు అంటే 87,500 ఎకరాలకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తుంగభద్రపై 1946లో మొదలై 1956లో పూర్తయిన ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఎన్నడూ 20 వేల ఎకరాలకు మించలేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003లో కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఫలితంగా 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటైందన్నారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు సాగు నీరు అందించడం లేదని కమిటీ నివేదిక ఇచ్చినా ఉమ్మడి పాలకులు స్పందించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. 50 వేల ఎకరాలకు సాగునీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ–డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. 2017లో జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.780 కోట్లతో చేపట్టి ప్రభుత్వం కేవలం పదినెలల్లో పూర్తి చేసిందని వెల్లడించారు. ఆర్డీఎస్ కాల్వ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తున్నామని.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని చెప్పారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి.. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హంద్రీనీవా నీళ్లకు హారతి పట్టిన డీకే అరుణను పక్కనపెట్టుకుని, బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.