slow over rate
-
హార్దిక్ పాండ్యాపై రూ. 12 లక్షలు జరిమానా
ముల్లాన్‌పూర్: ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షలు జరిమానా విధించింది. ముల్లాన్‌పూర్‌లో గురువారం పంజాబ్ కింగ్స్ జట్టుతో ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో పూర్తి 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. దాంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసినందుకు హార్దిక్‌పై పెనాల్టీని విధించారు. తాజా సీజన్లో ఇప్పటి వరకు స్లో ఓవర్‌రేట్ కారణంగా రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్–2 సార్లు), శుబ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్), సంజూ సామ్సన్ (రాజస్తాన్ రాయల్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)లపై జరిమానా విధించారు. -
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్.. కొంపమునిగేదే..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన ఆసక్తికర సమరంలో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపు ఇచ్చిన జోష్‌ను ఎంజాబ్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం (స్లో ఓవర్ రేట్) కావడంతో హార్దిక్ నామమాత్రపు జరిమానాతో తప్పించుకున్నాడు. ఇది మళ్లీ రిపీటైతే కెప్టెన్ హార్దిక్‌తో పాటు జట్టు సభ్యులందరూ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇటీవల దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొంటుంది. జరిమానాతో పోతే సరిపోయింది.. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్‌లు సైతం చేజారుతున్నాయి. నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయకపోతే 30 యార్డ్స్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. సహజంగా చివరి రెండు ఓవర్లలో 30 యార్డ్స్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను పెడతారు. మ్యాచ్ కీలక దశలో (చివరి ఓవర్లలో) ఔట్ సైడ్ ద సర్కిల్ ఓ ఫీల్డర్ తక్కువ పడితే అది గెలుపోటములను తారుమారు చేస్తుంది. 30 యార్డ్స్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టడంతో ఇదే సీజన్లో కొన్ని జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాయి. ఇంచుమించు ఇలాంటి పరిస్థితే నిన్నటి మ్యాచ్‌లో ముంబై కూడా ఎదుర్కొంది. చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు బౌండరీల వద్ద నలుగురు ఫీల్డర్లతోనే ఆడింది. నిపంజాబ్కు గనుక చేతిలో వికెట్లు ఉంటే సునాయాసంగా సర్కిల్లో ఉన్న ఫీల్డర్ల పైనుంచి బంతులను పంపి పరుగులు రాబట్టేది. ఫలితంగా ముంబై మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చేది. అయితే నిన్నటి మ్యాచ్‌లో ముంబై లక్కీగా బయటపడింది. -
పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఐపీఎల్ గవర్వింగ్ కౌన్సిల్ రూ. 24 లక్షల జరిమానా విధించింది. విశాఖపట్నంలో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బౌలర్లు నిర్ణీత సమయంలో కనీస ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు రెండోసారి స్లో ఓవర్‌రేట్ నమోదు చేసింది. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది. కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. -
KKR VS PBKS: విజయానందంలో ఉన్న కేకేఆర్ కెప్టెన్ భారీ షాక్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్.. రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్ -
RCB VS KKR: డేంజర్ జోన్లో విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి డేంజర్ జోన్లో ఉన్నాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 26) జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే, కెప్టెన్‌గా కోహ్లిపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో పాటు అతను 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. అలాగే జట్టులోని మిగతా సభ్యులంతా (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను (రెంటిలో ఏది తక్కువైతే అది) ఎదుర్కోవాల్సి ఉంటుంది. గనుక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దిష్ట సమయంలో (90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే దాని ప్రభావం కోహ్లిపై పడుతుంది. ఒకవేళ జట్టు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఉన్నా అతనికి కూడా ఇదే వర్తిస్తుంది. (ICC WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే) స్లో ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు నిర్దిష్ట సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకపోతే, తొలిసారి జట్టు కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా, రెండో దఫా కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత (ఏది తక్కువైతే అది), మూడోసారి కెప్టెన్‌కు 30 లక్షలతో పాటు ఒక మ్యాచ్ నిషేధం, జట్టు సభ్యులకు 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత (ఏది తక్కువైతే అది) విధించబడుతుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికతో ఐదో స్థానంలో ఉండగా.. కేకేఆర్7 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో (8) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. (GT VS MI: ముంబై చెత్త రికార్డు.. గుజరాత్ ఐపీఎల్ రికార్డు) -
విరాట్ కోహ్లికి భారీ జరిమానా
IPL 2023 RCB VS RR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2023లో భాగంగా ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు (స్లో ఓవర్ రేట్) ఉల్లంఘించినందుకు గాను, అతనితో పాటు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ (ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు) కంతా భారీ జరిమానా పడింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం రెండోసారి కావడంతో కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం (రెంటిలో ఏది ఎక్కువైతే అది) కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ వెల్లడించారు. ఈ పరిస్థితి మరోసారి రిపీట్ అయితే, ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరు ఉన్నా అతనిపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుత ఐపీఎల్లో 24 లక్షల జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది. -
LSG VS RR: విజయానందంలో ఉన్న కేఎల్ రాహుల్‌కు భారీ షాక్
మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 19) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఊహించిన ఈ గెలుపును ఎంజాయ్ చేస్తున్న లక్నో టీమ్‌కు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ అధికారికంగా వెల్లడించింది. చదవండి: కెప్టెన్‌గా ఏదో తప్పు చేసినట్లున్నాను.. అందుకే ఒకటి పీకారు..! కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలవాల్సింది. అయితే స్వయంకృతాపరాధాల కారణంగా ఆ జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో లక్నో పేసర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్‌ను గెలవనీయకుండా చేశాడు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), కైల్ మేయర్స్ (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టోయినిస్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), పూరన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగుల ఓ మోస్తరు స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ (4-1-16-1), సందీప్ శర్మ (4-0-32-1), అశ్విన్ (4-0-23-2), హోల్డర్ (4-0-38-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (41 బంతుల్లో 40; 4 ఫోర్లు, సిక్స్) అదిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆవేశ్ ఖాన్ (4-0-25-3), స్టోయినిస్ (4-0-28-2), నవీన్ ఉల్ హాక్ (4-0-19-0) రాయల్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. చదవండి: 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 'ఇలా' తొలిసారి -
గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! ఎందుకంటే?
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన రాజస్తాన్.. టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక గెలుపు జోషల్‌లో ఉన్న రాజస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. ఈ సీజన్లో రాయల్స్ చేసిన తొలి తప్పిదం కారణం శాంసన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడింది. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు ఫైన్ విధించారు. ఇదే తప్పు రెండోసారి జరిగితే రాజస్తాన్ కెప్టెన్ సంజూపై ఒక్క మ్యాచ్ నిషేధం పడనుంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండవ కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. కాగా ఐపీఎల్లో స్లో ఓవర్‌రేట్ కారణంగా శాంసన్‌కు జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2021 సీజన్లో రెండు సార్లు అతడిపై ఫైన్ పడింది. ఇక ఈ మ్యాచ్‌లో సంజూ తీవ్రంగ నిరాశ పరిచాడు. జడేజా బౌలింగ్‌లో డకౌట్‌గా శాంసన్ వెనుదిరిగాడు. చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని -
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు.. కివీస్‌తో రెండో వన్డే వర్షార్పణం, అంతలోనే మరో షాక్
2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్‌తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. -
రోహిత్, బాబర్ సేనలకు భారీ షాక్
IND VS PAK: ఆసియా కప్-2022లో భాగంగా గత ఆదివారం పాక్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసినందుకు గాను ఐసీసీ భారత్, పాక్‌లకు జరిమానా విధించింది. ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం.. మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తో పాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు కోటా సమయాన్ని (గంటన్నర) దాటి అరగంట ఇన్నింగ్స్‌ను పొడిగించారు. దీంతో ఆ అరగంట సమయంలో ఇరు జట్లు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్‌తో బరిలో నిలిచాయి. దీని ప్రభావం భారత్‌తో పోలిస్తే పాక్‌పై అధికంగా పడింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ నిబంధనే పాక్ కొంపముంచింది. ఛేదనలో హార్ధిక్ చెలరేగడానికి ఈ నిబంధన పరోక్ష కారణంగా చెప్పవచ్చు. ఆఖరి మూడు ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని హార్ధిక్ అడ్వాంటేజ్‌గా తీసుకుని చెలరేగిపోయాడు. సిక్సర్ కొట్టి మరీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, ఆగస్ట్ 28న పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: మరో బిగ్ సండే.. వచ్చే ఆదివారం మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా..! -
ఫీల్డింగ్ పరిమితుల గొడవేంటి.. ఐసీసీ కొత్త రూల్స్ ఏంటంటే!
ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చేజింగ్‌లో హార్దిక్ దాటిగా ఆడడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఇరుజట్లు మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్లో ఓవర్ రేట్‌తో పాటు సర్కిల్ బయట ఫీల్డింగ్‌పై పరిమితులు అనే కొత్త పదం వినిపించింది. అంటే నిర్ణీత ఓవర్లలోగా ఇన్నింగ్స్ పూర్తి చేయలేకపోతే.. మిగిలి ఉన్న ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఈ అంశం భారత్-పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత వార్తల్లో నిలిచింది. -సాక్షి, వెబ్‌డెస్క్ అయితే ఈ నిబంధనను గత సంవత్సరమే ఐసీసీ క్రికెట్ కమిటీ మార్పును సిఫార్సు చేసింది. ఇది అన్ని ఫార్మాట్లలో ఆట యొక్క వేగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఐసీసీ సవరించిన ఈ రూల్స్‌తో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఐర్లాండ్ల మధ్య జనవరిలో సబీనా పార్క్‌లో జరిగింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22లో పేర్కొన్న ప్రకారం ఒక మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తోపాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్‌లో కూడా ఇదే నిబంధన అమలు కానుంది. ఇక ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన టీమిండియా నిర్ణీత సమయం ముగిసేలోగా 18 ఓవర్లు మాత్రమే పూర్తి చేసింది. దీంతో మిగిలిన రెండు ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండడంతో పాక్ టెయిలెండర్లు స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా టీమిండియా ఇన్నింగ్స్‌ను పూర్తి చేసి ఉంటే పాకిస్తాన్ 130 పరుగులలోపే చేసి ఉండేది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కూడా అదే తప్పు చేసింది. నిర్ణీత సమయంలో పాక్ తమ కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లించుకుంది. నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ వేసిన చివరి ఓవర్లలో 30 అడుగుల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు అంపైర్లు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉండటంతో భారత్ ఆఖరి 3 ఓవర్లలో భారీగా పరుగుల రాబట్టి (18 బంతుల్లో 32 పరుగులు) విజయం అందుకుంది. చదవండి: Asia Cup 2022: సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.. హార్దిక్‌కు అఫ్గనిస్తాన్ అభిమాని ‘ముద్దులు’! -
పాక్ ఓటమికి అది కూడా ఒక కారణమే..!
కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు.. నిన్న ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. టాస్ ఓడటం దగ్గరి నుండి బ్యాటింగ్ వైఫల్యం.. బౌలింగ్‌లో అనుభవలేమి.. కీలక సమయంలో ఒత్తిడి తట్టుకోలేకపోవడం.. ప్రతీదానికి అప్పీల్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే దాయాది ఓటమికి చాలా కారణాలు కనిపిస్తాయి. వీటన్నిటితో పాటు పాక్ మరో ఘోర తప్పిదం కూడా చేసింది. నిర్ణీత సమయంలో పాక్ తమ కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లించుకుంది. నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ వేసిన చివరి ఓవర్లలో 30 అడుగుల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు అంపైర్లు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉండటంతో భారత్ ఆఖరి 3 ఓవర్లలో భారీగా పరుగుల రాబట్టి (18 బంతుల్లో 32 పరుగులు) విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ కూడా ఇదే పొరపాటు చేసింది. అందుకు పెనాల్టీగా చివరి ఓవర్లో 30 అడుగుల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతో మాత్రమే ఆడింది. పాక్ టెయిలెండర్ చివరి ఓవర్లో చెలరేగడానికి ఇదే కారణం. ఏదిఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రతిభను తప్పక అభినందించాల్సిందే. తొలుత బౌలింగ్‌లో భువీ, హార్ధిక్, ఆర్షదీప్, ఆవేశ్ ఖాన్ చెలరేగడం.. అనంతరం ఛేదనలో కోహ్లి, జడేజా, హార్ధిక్ సమయస్పూర్తితో రాణించడం టీమిండియాను విజేతగా నిలబెట్టాయి. కరుడుగట్టిన పాక్ అభిమానులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన విషయం విధితమే. చదవండి: Ind Vs Pak: ‘కేవలం లక్ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు? -
తొలి టీ20లో టీమిండియాతో ఓటమి.. వెస్టిండీస్‌కు మరో భారీ షాక్!
భారత్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ 68 పరుగల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే విండీస్‌కు మరో షాక్ తగిలింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం (జూలై 29) జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో విండీస్ జట్టుకు 20 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి వెస్టిండీస్ ఒక ఓవర్ వెనుకబడింది. కాగా ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. "ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున విండీస్ జట్టుకు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించడం జరుగుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం జరగనుంది. చదవండి: ZIM vs IND: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..? -
IPL 2022: భారీ మూల్యం చెల్లించుకోనున్న ముంబై కెప్టెన్..!
ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈ సీజన్లో రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత ధీన స్థితిని ఎదుర్కొంటుంది. ఇది చాలదన్నట్లుగా ఆ జట్టును మరో సమస్య భయపెడుతుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే 2 మ్యాచ్‌ల్లో ఫైన్లతో గట్టెక్కిన ఆ జట్టు సారధి.. సేమ్ సీన్ మరో మ్యాచ్‌లో రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే, జట్టుగా సారధి రోహిత్ శర్మపై ఓ మ్యాచ్ నిషేధం తప్పనిసరి అవుతుంది. కాగా, నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేని కారణంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు 24 లక్షల జరిమానా విధించారు. అతనితో పాటు జట్టు సభ్యులందరికీ తలో 6 లక్షల ఫైన్ వేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌కు 12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ ఇదే సీన్ మూడోసారి రిపీటైతే ఐపీఎల్ సవరించిన రూల్స్ ప్రకారం 30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. చదవండి: ఐపీఎల్లో కరోనా కలకలం.. సీజన్లో తొలి కేసు నమోదు..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్!
ఐపీఎల్-2022లో వరుస ఓటుముల బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు మరోసారి భారీ జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా ఐపీఎల్ నిర్వహకులు విధించారు. అతడితో పాటు జట్టు సభ్యలుకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ స్లో ఓవర్‌రేట్ కారణంగా ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. ఇక రోహిత్ మూడో సారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు. "ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో సారి స్లో ఓవర్ రేటు తప్పిదానికి పాల్పడింది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు జరిమానా, టీమ్ సభ్యులకు రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం" అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఐపీఎల్-2022లో వరుసగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై పరాజాయం పాలైంది. చదవండి: IPL 2022 MI Vs PBKS: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియాతో ఓటమి.. వెస్టిండీస్‌కు మరో భారీ షాక్!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే వెస్టిండీస్‌కు మరో భారీ షాక్ తగిలింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంతో విండీస్ జట్టుకు 40 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి వెస్టిండీస్ రెండు ఓవర్లు వెనుకబడింది. ఆర్టికల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే ఆటగాళ్లకు, జట్టు సహాయకి సిబ్బందికి ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. అయితే విండీస్ జట్టు 2 ఓవర్లు వెనుకబడింది కనుక 40 శాతం జరిమానా విధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును! -
టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన
దుబాయ్: అంతర్జాతీయ టి20ల్లో ఓవర్‌రేట్ ఇటీవల చాలా సమస్యగా మారిపోయింది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, జరిమానాలు విధించినా జట్లు ఓవర్లు పూర్తి చేసేందుకు నిర్ణీత షెడ్యూల్‌కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో వ్యూహ ప్రతివ్యూహల కోసం సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో ఇది మారడం లేదు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. జరిమానాలకంటే ఆ తప్పునకు మైదానంలోనే శిక్ష విధించాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తారు. ఇప్పటి వరకు ఐదు మందికి అవకాశం ఉండగా నలుగురినే అనుమతిస్తారు. కీలక సమయంలో బౌండరీ వద్ద ఒక ఫీల్డర్ తగ్గడం స్కోరింగ్‌పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జట్లు ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాయని ఐసీసీ భావిస్తోంది. సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్ కోత పడుతుంది. అయితే చివరి ఓవర్‌ను 85వ నిమిషంలోనే ప్రారంభిస్తే ఆ ఓవర్ కాస్త ఆలస్యంగా సాగినా చర్యలు ఉండవు. మూడో అంపైర్ ఈ టైమింగ్‌ను పర్యవేక్షిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగితే మాత్రం దానికి అనుగుణంగా సమయాన్ని సరి చేస్తారు. టి20 ఇన్నింగ్స్ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన. ఈ నెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ కు మరో భారీ షాక్..
అబుదాబి: స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు అతడిపై రూ. 24 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. టీమ్ సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ. 6 లక్షల (ఏది తక్కువైతే అది) కోతను విధించారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సామ్సన్ స్లో ఓవర్‌రేట్ కారణంగా తొలిసారి ఫైన్‌ను ఎదుర్కొన్నాడు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. చదవండి: Sanju Samson: టార్గెట్ చేధిస్తాం అనుకున్నా.. ఓడిపోవడం బాధగా ఉంది -
వరుస ఓటములు.. శ్రీలంకకు మరో భారీ షాక్!
కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రంజన్.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. అయితే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్‌ను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ (69) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది. -
మళ్లీ అదే రిపీట్ అయితే.. ఈసారి నిషేధమే
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై నిషేధపు కత్తి వేలాడుతూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్లీ అదే సీన్(స్లో ఓవర్ రేట్) రిపీట్ అయితే.. ఈసారి ధోనిపై తాత్కాలిక నిషేధం విధించే ప్రమాదం ఉంది. బీసీసీఐ రూపొందించిన కొత్త రూల్స్ ప్రకారం నేటి మ్యాచ్‌లో ధోని సేన.. తమ 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయని పక్షంలో ధోనిపై కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. సవరించిన రూల్స్ గురించి లీగ్ ఆరంభానికి ముందు నుంచే అన్ని ఫ్రాంఛైజీలను హెచ్చరిస్తున్నప్పటికీ.. కొన్ని ఫ్రాంఛైజీలు తేలికగా తీసుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ కొరడా ఝుళిపించాలని నిర్ణయించుకుంది. అయితే స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన జట్టు కెప్టెన్‌పై ఎన్ని మ్యాచ్‌ల నిషేధం విధించాలన్న నిర్ణయాన్ని మ్యాచ్ రిఫరీ విచక్షణకే వదిలి పెట్టింది. అసలే ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకున్న బాధలో ఉన్న ధోని సేనకు.. ఈ అంశం మరింత కలవరపెడుతుంది. కాగా, ముంబై వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఉరకలేస్తుండగా.. ధోని సేన మాత్రం ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకుని నిరాశలో కూరుకుపోయింది. చదవండి: సన్‌రైజర్స్ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్.. -
కెప్టెన్లు జర భద్రం...లేదంటే భారీ మూల్యం
ముంబై: ఐపీఎల్... ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తుంది. స్టేడియంలో మెరుపులు మెరిపిస్తుంది. అభిమానుల్ని మురిపిస్తుంది. ప్రేక్షకుల్ని యేటికేడు అలరిస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ సీజన్లో కెప్టెన్లకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇక ముందులా తీరిగ్గా బౌలింగ్ చేస్తే కుదరదు. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను కచ్చితంగా పూర్తిచేయాలి. లేదంటే భారీ మూల్యమే కాదు... డగౌట్‌కు (నిషేధం) పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చింది. ఐపీఎల్ నియమావళిని అనుసరించి మందకొడిగా (స్లో ఓవర్ రేట్) బౌలింగ్ చేస్తే మొదటిసారి ఆ జట్టు కెప్టెన్‌పై రూ. 12 లక్షలు జరిమానా వేస్తారు. రెండోమారు పునరావృతమైతే రూ. 24 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే తుదిజట్టులోని ప్రతి ఆటగాడిపై కూడా రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా పడుతుంది. ఒకే సీజన్లో మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే రూ. 30 లక్షలు జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్ నిషేధం కూడా విధిస్తారు. అలాగే తుది జట్టు ఆటగాళ్లపై రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా విధిస్తారు. -
మ్యాచ్ చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు మరో షాక్..
అహ్మదాబాద్: టీమిండియాతో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20ని చేజార్చుకున్న బాధలో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ ఇంగ్లండ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి హామీ ఇచ్చాడు. కాగా, ఇదే సిరీస్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో చేసుకుంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా ఆదివారం జరుగనుంది. -
టీమిండియాకు మరో షాక్
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో ఓవర్ రేట్ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ రిఫరీ జరిమానా విధించాడు. ఐసీసీ నిబంధనలో భాగంగా ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆసీస్ టూర్లో విరాట్ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకముందు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?) కాగా మూడో టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మన్లలో మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ రాణించారు. అనంతరం 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి జరగనుంది. (చదవండి : వైరల్ : తండ్రిపై స్టోక్స్ ఉద్వేగభరిత పోస్ట్)