ssc results
-
టెన్త్‌లో మళ్లీ నిర్మల్ టాప్.. అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరిగానే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్మెంటల్) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్‌గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి. 15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్ మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్ టిక్కెట్ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం ఫెయిల్ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘పది’లో సత్తా చాటిన గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత అత్యధికంగా జనరల్ సొసైటీలో 98.70శాతం పాస్ పెరుగుతున్న టెన్త్ ఉత్తీర్ణత – 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత – 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు – ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్ స్కూల్స్ -
TS SSC 2024 Results: ఒక్క క్లిక్‌తో టెన్త్ రిజల్ట్స్ చూస్కోండి
క్లిక్ చేయండి పదో తరగతి ఫలితాలు చెక్ చేస్కోండి -
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్‌గా రిజల్ట్‌ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. -
టెన్త్ రిజల్ట్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’.. ఫలితం ప్రకటించాలని విద్యార్థి వేడుకోలు
సాక్షి, హనుమకొండ: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచి్చన ఘటనలో కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి దండబోయిన హరీశ్ ఫలితంలో ‘మాల్‌ప్రాక్టీస్’అని వచి్చంది. ఏప్రిల్ 4న కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం ఔటైన ఘటనకు బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యా ర్థి హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేశారు. దీంతో అతను ఇంగ్లిష్, గణితం పరీక్షలు రాయలేకపోయాడు. అతడి తరఫున ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలుచేయగా మిగిలిన పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతిచి్చంది. దీంతో హరీశ్ సామాన్య, సాంఘికశాస్త్రం పరీక్షలు రాశాడు. అయితే, బుధవారం వెలువరించిన ఫలితాల్లో హరీశ్ రిజల్ట్స్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’అని ఉంది. తన ప్రమేయం లేకున్నా బలి చేశారని, తన ఫలితం ప్రకటించి న్యాయం చేయాలని హరీశ్ అధికారులను వేడుకుంటున్నాడు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు
సాక్షి, కరీంనగర్: కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే అన్నీ అయి చదివించారు. వాళ్ల శ్రమ వృథా కాలేదు. ఆ కవలలిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్లో ఔట్‌సోర్సింగ్‌లో ఎల్రక్టానిక్స్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు. దీంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్లో, 6వ తరగతి నుంచి మోడల్‌సూ్కల్‌లో చదివారు. బుధవారం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. ‘అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం’ అని శర్వాణి, ప్రజ్ఞాని చెప్పారు. చదవండి: టెన్త్‌లో 86.60% పాస్ -
విద్యాశాఖ కార్యాచరణ.. మే మొదటి వారంలో పది ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021–22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022–23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాల సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వచ్చేది. దీంతో భారీ ఎత్తున టీచర్లు అవసరమయ్యేవారు. అలాగే ఫలితాల వెల్లడిలోనూ ఆలస్యమయ్యేది. కేంద్రాల పెంపు వల్ల మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 22న రంజాన్ ఉండటంతో ఆ రోజు మూల్యాంకనం నుంచి ముస్లిం సిబ్బందికి మినహాయింపు ఇవ్వనున్నారు. మూల్యాంకనాన్ని 26న ముగించాక రెండు వారాల్లో వాటిని కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం.. కాగా పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. -
AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను www.sakshieducation.com లో చెక్ చేసుకోవచ్చు. టెన్త్ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైనవారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. -
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరి టెన్త్ ఫలితా ల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 87.61% మంది పాసయితే, బాలికలు 92.45% (4.84% ఎక్కువ) మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 90% ఉత్తీర్ణత నమోదయ్యింది. మొత్తం 3,007 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి. 15 స్కూళ్ళలో సున్నా ఉతీర్ణత నమోదైంది. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకూ జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. హైదరాబాద్‌లో అతితక్కువ ఉత్తీర్ణత మొత్తం 5,03,579 మంది టెన్త్ పరీక్షలు రాయగా 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,55,433 మంది బాలురకుగాను 2,23,779 మంది, 2,48,146 మంది బాలికలకుగాను 2,29,422 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలో సిద్దిపేట (97.85 శాతం), నిర్మల్ (97.73 శాతం) మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉత్తీర్ణత (79.63 శాతం) నమోదైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు 99.32 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 75.68 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 రోజుల్లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్.. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు జూలై 18లోగా సంబంధిత పాఠశాలలో పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఠీఠీఠీ. bట్ఛ. ్ట్ఛ ్చnజ్చn్చ. జౌఠి. జీn వెబ్సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కుల రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక క్లాసులు: మంత్రి సబిత టెన్త్ ఫలితాలపై మంత్రి సబిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల దాకా వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక క్లాసులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో అతి తక్కువ ఫలితాలు నమోదవ్వడంపై లోతైన పరిశీలన చేపడతామని చెప్పారు. ఉత్తీర్ణత ఇలా... మేనేజ్మెంట్ ఉత్తీర్ణత శాతం రెసిడెన్షియల్ 99.32 సోషల్ వెల్ఫేర్ 98.1 బీసీ వెల్ఫేర్ 97.45 మోడల్ స్కూల్స్ 97.25 ట్రైబల్ వెల్ఫేర్ 95.83 రెసిడెన్షియల్ (మినీ) 93.73 కేజీబీవీ 93.49 ప్రైవేటు 91.31 ఆశ్రమ 88.7 జెడ్పీ స్కూల్స్ 87.13 ఎయిడెడ్ 85.37 ప్రభుత్వ స్కూల్స్ 75.68 మొత్తం 90.00 -
విద్యావ్యవస్థకు ఒక షాక్ ట్రీట్మెంట్
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గిన నేపథ్యంలో రకరకాల చర్చలూ, విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి గత కొన్నేళ్లుగా పదో తరగతిలో పాస్ కాకపోవడం అనేది అలవాటు లేకుండా పోయింది. పరీక్షల సమయంలో చూసీచూడనట్టుగా పోవడమూ ఒక కారణం. ఈసారి కోవిడ్ మహమ్మారితో పాటు కొంత కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా ఫలితాలు తగ్గాయి. దీనివల్ల కొంపలేమీ మునగవు. సప్లిమెంటరీ ఉండనే ఉంది. అయితే ఫలితాల వాపెంతో, బలుపెంతో తెలుసుకొని, విద్యార్థులనూ, మొత్తంగా విద్యా వ్యవస్థనూ మున్ముందు దిద్దుకోవడానికి ఈ ఫలితాలు చక్కగా ఉపకరిస్తాయి. తప్పు పిల్లలదే కాదు... తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ ఫలితాలు అంటేనే చిట్టీలు రాసి పాస్ కావడం. విద్యా శాఖ అధికారులూ, కలెక్టర్లూ తమ జిల్లాలో తక్కువ మంది పాస్ అయితే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందోనని బోగస్ ఎగ్జామ్స్ నిర్వహించే వారు. కానీ ఈసారి ఎగ్జామ్స్ చాలా కఠినంగా నిర్వహించ డంతో అసలైన పరిస్థితి ఏమిటో బయటపడింది. గత 20, 30 ఏళ్ల నుంచీ విద్యా వ్యవస్థలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడింది. కలెక్లర్లు, అధికార్లు పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించే పరిస్థితుల్లో పరీక్షలు రాసే సమయంలోనే కొంత మెతక ధోరణిని విద్యార్థుల పట్ల ప్రదర్శించడం ఉండేది. పరీక్షా పేపర్లు దిద్దే సమయంలో కూడా ఆయా కేంద్రాల్లోని అధిపతులు టీచర్లను ప్రభావితం చేస్తారు. ‘‘బార్డర్లో ఉన్న విద్యార్థులను రెండు మూడు మార్కుల కోసం వారిని ఫెయిల్ చేయకండి... పాస్ చేయండి’’ వంటి ఒత్తిళ్లు ఉండేవి. పార్ట్ –ఏ, పార్ట్ –బీలో రెండు మూడు మార్కులు కలిపేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పరీక్షల సమయంలో కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అరెస్టు అయ్యారు. దీని ప్రభావం వారిపై పడింది. అరెస్టు కావడం అవమానకరంగా భావించి వారంతా పరీక్షల నిర్వహణలో కాపీ జరుగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక రెండోది... కోవిడ్ అంశం కూడా చెప్పుకోవాలి. కోవిడ్ సమయంలో విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి వీల్లేకపోవడం, విద్యార్థుల్లో ఉదాసీనత పెరగడంతో సీరియస్‌గా చదువు సాగలేదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు మరిచిపోయారు. ప్రధానంగా 8, 9 తరగతుల విద్యార్థులు ఎక్కువ ప్రభావిత మయ్యారు. దీంతో పదో తరగతి ఫలితాలు తగ్గాయి. దీర్ఘకాలంలో ఈ పరిణామం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలాంటి అవసరమైన షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విద్యార్థులు, టీచర్లలో సీరియస్‌నెస్ పెరుగుతుంది. కోవిడ్ వల్ల సరిగా చదవలేక పోయినందువల్ల ఆం్ర«ధప్రదేశ్ ప్రభుత్వం.. నెలరోజులు రెసిడెన్షియల్ తరహాలో సెలవుల సమయంలోనూ పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. దీంతో త్వరలో నిర్వహించనున్న çసప్లిమెంటరీ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత శాతం 95 శాతానికి వెళ్తుంది. విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా ఉండటానికి సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేయడం మంచి పరిణామం. పదవ తరగతిలో ఉత్తీర్ణతను రాజకీయ కోణంలో చూడవద్దు. దానిని విద్యాశాఖ అధికారులకు వదిలిపెట్టాలి. ఏపీలో విద్యా శాఖ అధికారులు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ‘నాడు–నేడు’ ‘జగన్ విద్యా కానుక’ సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న మద్దతుతో అధికారులు కొనసా గిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండగా ముందుకు వెళ్తోంది. ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని రాజకీయ కోణంలో చూడవద్దు. అలా చేస్తే విద్యా వ్యవస్థకు నష్టం చేసిన వారవుతారు. పదో తరగతి ఫలితాలు తగ్గడంలో తప్పు కేవలం పిల్లలదే కాదు... అది ప్రాధమ్యాలని బట్టి వరుసగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, మేధావులది. టీవీ సీరియళ్ల మీదా, దేవుని పూజల మీదా, అలంకారాల మీదా జీవితం పారేసుకున్న తల్లులూ; నాలుగురాళ్ల సంపాదన మీదా, మందు మీదా, స్నేహాలూ, బాతఖానీల మీదాజీవితం పరిచేసుకున్న తండ్రులూ; పీఆర్సీలూ, అదనపు సంపాదనలూ, సొంత బాదర బందీలూ, బాధ్యతలేని తనాలతో టీచర్లూ; పనికి రాని, అర్థం లేని, కాలానికి నిలబడలేని, ఆకర్షణ లేని పాఠ్యపుస్తకాలూ, టీచర్ల శిక్షణలతో ప్రభుత్వాలూ; సినిమాల గురించీ, దేవుళ్ల గురించీ, మతం గురించీ, దమ్మిడీ పనికిరాని సమాచారం గురించీ ప్రచారం చేస్తూ... సమీప పాఠశాలల్లోని పిల్లలతో ఎన్నడూ మాట్లాడని మేధావులూ... అందరూ బాధ్యత వహించాలి! ఇంజినీరింగ్ చదివే విదార్థికి కూడా ఒక వాక్యం ఇంగ్లిష్‌లోనో లేదా కనీసం మాతృభాషలోనైనా తప్పులేకుండా రాయలేని దుఃస్థితిలో ఉన్న పరిస్థితి మనది. చదువు విలువని సమర్థ వంతంగా నూరి పోయడంలో విఫలమైన సమాజం మనది. కేవలం చదువుకుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుందని నచ్చ జెప్పడంలో విఫలమైన వ్యవస్థ మనది. చదువులో మార్పు గురించో, పుస్తకాలలోని పాఠాల గురించో, సిలబస్ గురించో, చదువుచెప్పే టీచర్ల గురించో చర్చించుకోవడం కూడా రాజకీ యమైపోయిన పరిస్థితుల్లో బతుకుతున్నందుకు ముందు మనం సిగ్గుపడదాం. మార్పు గురించి మాట్లాడితే బూతులు మాత్రమే బదులిచ్చే సంస్కృతిని చూసి చచ్చిపోదాం! వ్యాసకర్త: ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్ అధికారి -
SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) -
AP 10th Result 2022: పదో తరగతి ఫలితాలు విడుదల
AP SSC 10th Result 2022: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 6వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వెల్లడించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం మంది పాస్ అయ్యారని పేర్కొన్నారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని మంత్రి బొత్స తెలిపారు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) వాస్తవానికి టెన్త్ ఫలితాలు జూన్ 4వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు విద్యాశాఖ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో కూడా చూడొచ్చు. -
ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. -
విద్యాశాఖ ప్రకటన.. ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఈ నెల 4న ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే.. -
తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారు బాలురు 2,62,917 బాలికలు 2,53,661 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535 పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. -
Telangana: వారంలో టెన్త్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వారం రోజుల్లో విద్యార్థులందరికీ గ్రేడ్లను, గ్రేడ్ పాయింట్లను, జీపీఏను కేటాయించి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కాగా, పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్ర సిలబస్ కలిగిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లకు బదులు రెండు ఎఫ్‌ఏలను నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఇంటర్నల్ అసెస్మెంట్) నిర్వహించారని పేర్కొన్నారు. 20 శాతం మార్కులతో నిర్వహించిన ఆ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి గ్రేడింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 20 శాతం మార్కులను 100 శాతానికి లెక్కించి గ్రేడ్లు ఖరారు చేయాలని స్పష్టం చేశారు. ఒక విద్యార్థికి ఎఫ్ఏ–1 ఒక సబ్జెక్టులో 20 మార్కులకు వచ్చిన మార్కులకు ఐదింతలు చేసి కేటాయిస్తారు. దీని ప్రకారం ఒక సబ్జెక్టులో 20 మార్కులు వస్తే ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో 100 మార్కులు వచ్చినట్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కుల పరిధి ఆధారంగా ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో వచ్చిన గ్రేడ్‌ను, ఆ గ్రేడ్‌కు ఇచ్చే గ్రేడ్ పాయింట్‌ను కేటాయిస్తారు. చివరకు అన్నీ కలిపి జీపీఏ ఇస్తారు. హిందీ సబ్జెక్టులో పాస్ మార్కులు తక్కువ కాబట్టి మార్కుల పరిధి మిగతా సబ్జెక్టుల కంటే వేరుగా ఉంటుంది. చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు! -
ఆన్లైన్లో టెన్త్ ‘గ్రేడ్’ వివరాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఉత్తీర్ణత చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రతిపదికన గ్రేడ్లను నిర్ణయించారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ వివరాలను సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్ వివరాలను www. bse.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. పాస్‌మెమో వివరాల్లో ఎవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి తెలిపారు. పని చేయని తెలంగాణ టెన్త్ మార్కుల గ్రేడ్ల సైట్ సోమవారం సాయంత్రం 3 గంటలకు మార్కుల మెమోలు ఆన్లైన్లో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులంతా సంబంధిత వెబ్సైట్ ఓపెన్ చేశారు. కానీ సాయంత్రం 5 గంటలైనా www.bsc.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
-
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
-
పదో తరగతి ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం
-
నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు
-
ఆణిముత్యాల్లాంటి పిల్లలనందించారు
కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించి అణిముత్యాల్లాంటి పిల్లలను తయారు చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం పీఆర్టీయూటీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పదోతరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులకు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హజరై విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ఉపాధ్యాయులను జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల విద్యాబోధనచే విద్యార్థులు 10 జీపీఏ సాధించడం సాధ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం వ్యవసాయం తరువాత విద్యపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 500లకు పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ సిద్దం వేణు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు, కార్పోరేటర్ సునీల్‌రావు, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఆదర్శన్‌రెడ్డి, సభ్యులు వెంకటరాజం, రవికుమార్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు, జనరల్ సెక్రెటరీ ముస్కు తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ బాధ్యులు గణేశ్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, మహేశ్, తిరుపతి, శ్రీధర్‌రెడ్డి, కిషన్,రాధకృష్ణ, శ్రవణ్‌కుమార్, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీని వాస్, కాళిదాస్, వేణు, చోటేమియా పాల్గొన్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాలు : బాలికలదే పైచేయి
-
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల..
సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లలో ఫలితాలను చూడవచ్చు. మొత్తం హాజరైన విద్యార్థులు : 6,13,378 ఉత్తీర్ణత శాతం : 94448 మొదటి స్థానం : ప్రకాశం జిల్లా (97.93 శాతం ) చివరి స్థానం : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (80.37 శాతం) బాలుర ఉత్తీర్ణతా శాతం : 94.41 బాలికాల ఉత్తీర్ణతా శాతం : 94.56 వంద శాతం ఉత్తీర్ణత సాధించిని పాఠశాలలు : 5,340 సున్నా శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలు : 17 ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం : 78.35 10జీపీ సాధించిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు : 26,475 10జీపీ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు : 3745 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ టెన్త్ ఫలితాలు నేడే..
సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లలో ఫలితాలను చూడవచ్చు. -
తెలంగాణ పదో తరగతి ఫలితాలు: బాలికలదే పైచేయి