Start up
-
మీ దగ్గర ఐడియా ఉందా..! ఐతే చలో అంటున్న స్టార్ట్ అప్
‘వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. డబ్బు లేదు’ అనే వాళ్లలో చాలామందికి ఐడియా ఉండదు. అంటే... ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి... మొదలైన విషయాలపై అవగాహన ఉండదు. ‘అద్భుతమైన ఐడియా’ మన దగ్గర ఉంటే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి అనేది పెద్ద సమస్య కాదని యువతరంలో ఎంతోమంది నిరూపించారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ నుంచి ‘ఇండియన్ స్టార్టప్ స్టోరీస్’ లాంటి ఎన్నో టీవీ షోల ద్వారా స్ఫూర్తి పాంది ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కంటున్న యువతరం ఆ కల దగ్గరే ఆగిపోవడం లేదు. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా కష్టపడుతున్నారు... ‘షార్క్ ట్యాంక్ అమెరికా కార్యక్రమాన్ని ఇష్టంగా చూసేదాన్ని. డల్లాస్ మావరిక్స్ ఓనర్ మార్క్ క్యూబన్, బ్రాక్ సిస్టమ్స్ ఫౌండర్ రాబర్ట్ హర్జెవెక్, ఫర్ యువర్ ఈజీ వోన్లీ ఫౌండర్, ప్రెసిడెంట్ లారీ గ్రైనర్లు ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లు కావడానికి సహాయం అందించారు. షార్క్‌ట్యాంక్ ఇండియన్ వెర్షన్ విషయంలో మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత మాత్రం ఆసక్తి పెరిగింది’ అంటుంది ముంబైకి చెందిన సైకాలజీ స్టూడెంట్ అహానా గుప్తా. ‘ఒక స్టార్టప్ విజయవంతం కావడానికి ఏ అంశాలు తోడ్పడతాయి, మార్కెట్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏమిటి, వెంచర్ క్యాపిటలిస్ట్ను ఒప్పించడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి... మొదలైనవి షార్క్ ట్యాంక్లాంటి టీవీ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్నాను’ అంటుంది కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ సుతీర్థ సుహా. ‘డిస్కవరీ ప్లస్‌లో ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ చూశాను. చూస్తున్న క్రమంలో నాకు తెలియకుండానే బిజినెస్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ విషయాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది చెన్నైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్’ శ్రేయా ఘోష్. ‘స్టార్టప్‌లకు సంబంధించిన పరిజ్ఞానానికి పెద్ద నగరాలలో చదవాల్సిన పనిలేదని, ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే స్టార్టప్‌లను విజయవంతంగా సృష్టించగలవనే మూస ధోరణిని స్టారప్లను దృష్టిలో పెట్టుకొని రూపాందించిన టీవీ కార్యక్రమాలు బ్రేక్ చేస్తున్నాయి’ అంటుంది దిల్లీకి చెందిన స్టాటిస్టిక్స్ స్టూడెంట్ సప్తర్షి. ‘ఒక కంపెనీ ఈక్విటీ, వాల్యుయేషన్‌ను అర్థం చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడతాయి, మార్కెట్ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటీ... వంటివి షార్క్ ట్యాంక్ ద్వారా తెలుసుకున్నాను’ అంటుంది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ సహేలి సాహు. అహానా, సుతీర్థ, శ్రేయ, సప్తర్షి, సహేలి మాత్రమే కాదు... ఇంజినీరింగ్, కామర్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్... తాము చదువుతున్నది ఏదైనా సరే దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టూడెంట్స్ స్టార్టప్‌లకు సంబంధించి టీవీలో వచ్చే రకరకాల కార్యక్రమాల ద్వారా ్రపాక్టికల్–లైఫ్ బిజినెస్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ స్ట్రాటజీల గురించి వివరంగా తెలుసుకోవడమే కాదు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. షార్క్ ట్యాంక్ మాత్రమే కాదు బిలియన్ డాలర్ బయర్(వూట్ టీవీ నెట్వర్క్), సిలికాన్ వ్యాలీ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ (డిస్కవరీ ప్లస్), స్టార్టప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అప్‌స్టార్స్ (నెట్‌ఫ్లిక్స్), ప్లానెట్ ఆఫ్ ది యాప్స్(యాపిల్ టీవీ). గర్ల్‌బాస్–టీవీ సిరీస్ (నెట్‌ఫ్లిక్స్)... మొదలైన షోలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి. ది క్వర్కీ నారీ మదురైకి చెందిన మాళవిక సక్సేనాకు మనసుకు నచ్చిన ఫుట్‌వేర్ కనిపించేది కాదు. ఏది చూసినా ‘ఇది నాకు కరెక్ట్ కాదు’ అనిపించేది. కొత్తదనం లోపించిన ఫుట్వేర్లను చూసీ చూసీ చివరికి హ్యాండ్–పెయింటెడ్ షూ బ్రాండ్ ‘ది క్వర్కీ నారీ’ని లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్ చేసింది. ఇన్ఫ్లూయెన్సర్ల సహాయం తీసుకుంది. ‘షార్క్ ఇండియా’లో ‘ది క్వర్కీ నారీ’ 35 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ‘ఎపిసోడ్ ప్రసారం కాగానే ఇన్స్టాగ్రామ్ ఖాతాకు పదివేల మంది కొత్త ఫాలోవర్లు యాడ్ అయ్యారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో అమ్మకాలు బాగా పెరిగాయి’ అంటుంది మాళవిక సక్సేనా. హార్ట్ అప్ మై స్లీవ్స్ సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన రియాకు ‘ఫ్యాషన్’ అంటే ఇష్టం. ఫ్యాషన్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన కల. 18–33 ఏళ్ల వయసు ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని పదివేల రూపాయల పెట్టుబడితో ‘హార్ట్ అప్ మై స్లీవ్స్’ కంపెనీ మొదలుపెట్టింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో తన ఐడియాను వినిపించిన తరువాత ఇన్వెస్టర్లు వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్ నుంచి రూ. 25 లక్షల ఫండ్ అందుకుంది. ‘ఎన్నో డ్రెస్‌లు ఉన్నా ఏది వేసుకోవాలో అనే దాని గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను... అనే మాట చాలా మంది మహిళల నోటి నుంచి విన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్లీవ్స్ ద్వారా ప్రతి డ్రెస్‌కు గ్లామరస్ లుక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారంలో వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్‌లకు ఉన్న అనుభవం, సలహాలు మా వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి అని నమ్ముతున్నాను’ అంటుంది రియా. కవచ్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లో ఫండ్స్ అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది 13 సంవత్సరాల అనౌష్కా జాలీ. ఆరవ తరగతిలో యాంటీ–బుల్లీయింగ్ స్క్వాడ్(ఎబీఎస్) అనే వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసింది. మూడు సంవత్సరాల పాటు యాంటీ–బుల్లీయింగ్ సెషన్స్ నిర్వహించిన అనౌష్క ఆ తరువాత బుల్లీయింగ్‌పై ఫైట్ చేయడానికి ‘కవచ్’ అనే యాప్‌ను రూపొందించింది. ‘షార్క్ ట్యాంక్’లో ‘కవచ్’ 50 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ఇది చదవండి: దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..? -
ఇండిగో ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా బిజినెస్, ఎగబడి ఆర్టర్డ్స్ వస్తున్నాయి
మనకు నచ్చిన రంగు రంగుల చాక్లెట్ రేపర్స్ నుంచి మనం ఇష్టపడే వారు ఇచ్చిన పువ్వులు, నెమలీకల వరకు ప్రతి చిన్న వస్తువును పుస్తకాల్లో అపురూపంగా దాచుకునేవాళ్లం. అప్పుడప్పుడు వాటిని చూసుకుని తెగ మురిసిపోయిన సందర్భాలు ఎన్నో. ఇవి కొన్నేళ్ల పాటు ఉన్నప్పటికీ తర్వాత ఆ పుస్తకాలను దాచుకునే ప్లేసు లేక వాటన్నింటిని కోల్పోయి బాధపడుతుంటాము. ‘‘ఇక ముందు మీరు దిగులు పడాల్సిన పనిలేదు. మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని రెజిన్ ఆర్ట్‌లో ఎప్పటికీ దాచుకోవచ్చు’’ అని చెబుతోంది 31 ఏళ్ల ఆకాంక్ష సెహగల్. గులాబీ రేకులను సైతం ఏళ్ల పాటు దాచుకునేలా అందమైన ఆకృతిలో రెజిన్ క్రాఫ్ట్స్‌ను రూపొందిస్తోంది. రెజిన్ ఆర్టిస్ట్ అయ్యేందుకు ఇండిగో ఉద్యోగాన్నే వదిలేసింది ఆకాంక్ష. నాగపూర్‌కు చెందిన ఆకాంక్ష సెహగల్ అనుకున్నది సాధించేవరకు కష్టపడుతుంది. ఆ మనస్తత్వమే ఆమెని రెజిన్ క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్‌గా మార్చింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తయ్యాక రేడియో మిర్చిలో సెలబ్రెటీ మేనేజర్‌గా చేరింది. ఎందుకో గానీ ఆ ఉద్యోగం ఆమెకు తృప్తినివ్వలేదు. దాంతో విమానంలో ఎగరాలని చిన్నప్పటినుంచి తాను కంటున్న కలలను నెరవేర్చుకునేందుకు విమానంలో ఉద్యోగం చేయాలనుకుంది. అందుకు తగ్గట్టుగా కష్టపడి ఇండిగోలో క్యాబిన్ క్రూ ఉద్యోగాన్ని సాధించింది. కల నిజమైనప్పటికీ... క్యాబిన్ క్రూగా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆకాంక్షకు క్రూగా కొంతకాలం మాత్రమే పనిచేస్తామని ఆ తరువాత పేపర్ వర్క్ పనిచేయాల్సి ఉంటుంది అని తెలిసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఆవిరైంది. కొంతకాలం పనిచేసిన తరువాత నేను క్రూ గా ఉండలేను. పేపర్ వర్క్ చేయడం ఇష్టం లేదు. దీంతో తనకు నచ్చిన, ఎప్పటికీ ఉండే వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుని మళ్లీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒకపక్క క్యాబిన్ క్రూగా బాధ్యతలు నిర్వహిస్తూనే తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. యునిక్ రెజిన్ క్రియేషన్స్.. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌పై మక్కువ ఉన్న ఆకాంక్ష.. తనకి కాబోయే భర్తకు రెజిన్ క్రాఫ్ట్ తయారు చేసి బహుమతిగా ఇచ్చింది. అది చూసిన ఆకాంక్ష కాబోయే భర్త చాలా బావుంది. రెజిన్ క్రాఫ్ట్స్ తయారీలో నీకు మంచి నైపుణ్యం ఉంది. క్రాఫ్ట్స్ కోర్సు చెయ్యి అని ప్రోత్సహించాడు. దీంతో ఇండిగోలో ఉద్యోగం చేస్తూనే చిన్నచిన్న రెజిన్ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా తయారు చేసేందుకు ఇండిగో ఉద్యోగాన్ని వదిలేసి యూనిక్ రెజిన్ క్రియేషన్స్ పేరిట బ్రాండ్‌ను ప్రారంభించింది. తడిసినా పాడవకుండా ఉండే రెజిన్ పదార్థానికి రంగులు జోడించి అందమైన ఆకృతుల్లో ప్రత్యేకంగా ఉండే గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ కుటుంబం సహాయంతో తన బ్రాండ్‌ను చక్కగా నిర్వహిస్తోంది ఆకాంక్ష. మరింత ప్రత్యేకంగా... మిగతా బహుమతులకంటే రెజిన్క్రాఫ్ట్స్ ద్వారా అపురూప జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. పెళ్లిదండలు, ఇష్టమైన వారు ఇచ్చిన పూలు, వాటి తాలుకా రేకులు, పుష్పగుచ్ఛాలు, శిశువు బొడ్డు తాడు వంటి వాటిని మరింత ప్రత్యేకంగా దాచుకునేలా రూపొందిస్తోంది. ఈ క్రాఫ్ట్స్ ఆకర్షణీయంగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి మరీ ఆర్డర్లు ఇస్తున్నారు ఆకాంక్షకు ఇంత చిన్నవయసులో రెండు ఉద్యోగాలను అవలీలగా సాధించి, తనని తాను నిరూపించుకుంది. చివరికి తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తూ రెజిన్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్‌గా మారి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. -
పెట్రోల్ బంకుల వద్ద క్యూ.. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు
బారెడు బారెడు ‘క్యూ’లు అంటే భయం లేనిది ఎవరికి?ఎందుకంటే బోలెడు టైమ్ వృథా అవుతుంది. అసహనం పెట్రోల్ ధరలా పెరుగుతుంది. ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద ‘క్యూ’లను చూసిన, వాహనదారుల అసహనాన్ని విన్న అనుభవంతో వైభవ్ కౌశిక్ తన స్నేహితులు ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి స్టార్ట్ చేసిన ‘నవ్గతీ’ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్రేటర్ నోయిడాకు చెందిన వైభవ్ కౌశిక్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబ్ ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద క్యూ ఉంది. చాలా టైమ్ తరువాత బండి రోడ్డు పైకి వచ్చింది.‘ఇలా అయితే కష్టం కదా’ అని డ్రైవర్‌తో మాటలు కలిపాడు వైభవ్.‘ఎప్పుడూ ఇదే కష్టం. టైమ్ వృథా అవుతుంది. బేరాలు పోతున్నాయి’ అసంతృప్తిగా అన్నాడు డ్రైవర్. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు వైభవ్. కొద్దిసేపటి తరువాత అతనిలో ఒక ఐడియా మెరిసింది. అదే నవ్గతీ. తన కాలేజీ ఫ్రెండ్స్ ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి వైభవ్ కౌశిక్ స్టార్ట్ చేసిన నవ్గతీ (మార్గదర్శనం) స్టార్టప్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇంధన స్టేషన్ల దగ్గర రద్దీ వల్ల వాహనదారుల టైమ్ వృథా కాకుండా, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వన్–స్టాప్ ఫ్యూయల్ అగ్రిగేటర్ ΄ప్లాట్‌ఫామ్ రియల్–టైమ్ అప్డేట్స్ను అందిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్‌స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. డాటా–బ్యాక్డ్ ప్లాట్‌ఫామ్ ఆవెగ్, ఫ్యూయలింగ్ యాప్ అనే రెండు సర్వీసులను ఆఫర్ చేస్తోంది నవ్గతీ. బీ2సీ ఫ్యూయల్ డిస్కవరీ యాప్ ఫ్యూయల్ రేటు, అందుబాటు, సర్వ్ టైమ్...మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ స్టేషన్‌కు సంబంధించి రివ్యూకు అవకాశం కల్పిస్తుంది. ఇక ‘ఆవేగ్’ ద్వారా ఫ్యూయల్ స్టేషన్లకు సంబంధించి రవాణా సమయం, వెయిటింగ్ టైమ్, సర్వింగ్ టైమ్, వనరుల వినియోగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా... సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయల్ స్టేషన్లు తమ సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ‘గతంలో ఫ్యూయల్ స్టేషన్లు కాంప్లయెన్స్ డిటైల్స్, లావాదేవీలు, అటెండెన్స్... వాటికి సంబంధించి డే–టు–డే డాటాను మాన్యువల్‌గా రికార్డ్ చేసేవి. ఇప్పుడు మాత్రం ‘ఆవేగ్’ రూపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని యాక్టివిటీలను ఆటోమేట్ చేయవచ్చు. దీనివల్ల ఫ్యూయల్ స్టేషన్లు తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవచ్చు’ అంటున్నాడు వైభవ్ కౌశిక్. ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్–దిల్లీ, మహానగర్ గ్యాస్ లిమిటెడ్–ముంబైకి సంబంధించిన 150 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ స్టార్టప్ తమ ఎడ్జ్ కంట్రోలర్లను ఇన్స్టాల్ చేసింది. దేశంలోని పెద్ద పట్ణణాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంది.మొదట్లో సూపర్ యూజర్లతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. కొత్త ఫీచర్లను పరీక్షించడానికి, మెరుగు పరచడానికి ఈ గ్రూప్ బీటా టెస్టింగ్ గ్రూప్‌గా ఉపయోగపడింది. ఏకాంత ఆలోచనల్లో నుంచే కాదు చూసే సమస్యల్లో నుంచి కూడా స్టార్టప్ ఐడియాలు పుడతాయని, గట్టి కృషి చేస్తే సార్టప్ కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ‘నవ్గతీ’ స్టార్టప్ ఒక ఉదాహరణ. View this post on Instagram A post shared by Vaibhav Kaushik (@_vaibhavkaushik) తెలియక పోయినా పట్టుదలతో... ఇరవై సంవత్సరాల వయసులో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. స్టార్టప్ ప్రపంచం ముఖ్యంగా ఫ్యూయల్–టెక్ గురించి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నాం. సవాలుకు సక్సెస్‌తోనే జవాబు ఇవ్వాలనుకున్నాం. ‘ఐడియా బాగానే ఉందిగానీ వర్కవుట్ అవుతుందా?’ అని సందేహించిన వారికి కూడా మా సక్సెస్‌తో సమాధానం చెప్పాం. – వైభవ్ కౌశిక్, కో–ఫౌండర్, సీయివో నవ్గతీ స్టార్టప్ -
కంప్యూటర్ సైన్స్ వదిలేసి 'జెప్టో' స్టార్టప్.. యంగెస్ట్ మిలీయనీర్స్గా
బెంగళూరుకు చెందిన కైవల్య వోహ్ర, ముంబైకి చెందిన అదిత్ పలీచా స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీని మధ్యలోనే వదిలేసి ‘ఏదైనా సాధించాలి’ అనే లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు. ‘జెప్టో’ స్టార్టప్‌తో తిరుగులేని విజయాన్ని సాధించారు. తాజాగా లింక్డిన్ ‘టాప్ 25 స్టార్టప్’ల జాబితాలో ఇ–కామర్స్ గ్రాసరీ ΄ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న వయసులోనే తమ స్టార్టప్ ‘జెప్టో’ను యూనికార్న్ స్టేటస్‌కు తీసుకెళ్లిన కైవల్య వోహ్రా, అదిత్ పలీచాలు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు... లాక్డౌన్ సమయంలో తమకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటే బహుశా ‘జెప్టో’ స్టార్టప్ పుట్టేది కాదేమో. ఆ సమయంలో ముంబైలోని అద్దె ఇంట్లో ఉంటున్న కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు నిత్యావసర వస్తువులకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో నుంచే ‘కిరాణామార్ట్’ స్టార్టప్ పుట్టింది. ఇదే ఆ తరువాత ‘జెప్టో’ రూపంలో విశ్వరూపాన్ని చూపించింది. తిరుగు లేని విజయాలు సాధించడానికి వయసు అడ్డు కాదని, అనుభవం అత్యవసరం కానక్కర్లేదని, కృషి పట్టుదల ఉంటే సరిపోతుందని ‘జెప్టో’ అసాధారణ విజయం నిరూపించింది. ఆరోజుల్లోకి వెళితే...‘మాకు సవాలు విసిరిన టైమ్ అది. నిజానికి కిరాణాషాప్‌ల గురించి మాకు అంతగా తెలియదు. క్రాష్ కోర్సులు కాలేజీల్లోనే కాదు వాటికి అవతల కూడా ఉంటాయి! రోజూ పొద్దున్నే పది నుంచి ఇరవై కిరాణాషాప్లకు వెళ్లి యజమానులతో వివరంగా మాట్లాడి మా కాన్సెప్ట్ చెప్పేవాళ్లం. పిల్లలేదో చెబుతున్నారు...విందాం...అన్నట్లుగా వినేవారు తప్ప మాపై వారికి అంతగా నమ్మకం ఉన్నట్లుగా అనిపించేది కాదు. మా యాప్‌ను కొద్దిమంది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అంగీకరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు కైవల్య వోహ్ర.పరిస్థితులను చూస్తుంటే...‘అబ్బే ఇదేదో మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు. మిత్రమా...రథం వెనుక్కు మళ్లించు’ అనుకునే పరిస్థితి. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ‘సక్సెస్ మంత్రా’లో ఒక రూల్....యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించకు. రణస్థలి వరకు మాత్రమే వెళ్లారు. ఇంకా యుద్ధం మొదలే కాలేదు.వారి కృషి ఫలితంగా మెల్లగా యాప్ ఊపందుకుంది. ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబ్బై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణాదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరీ చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి.ఇప్పుడు...‘జెప్టో’ మన దేశంలోని ప్రధాన నగరాలలో మూడు వేలకు పైగా గ్రాసరీ ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేస్తుంది. గంటలు దాటని, కస్టమర్ ఓపికను పరీక్షించని అతి తక్కువ సమయ డెలివరీ టైమ్‌ను నిర్దేశించుకుంది. ఇద్దరితో మొదలైన ‘జెప్టో’లో ఇప్పుడు వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారు. ‘జెప్టో’ సక్సెస్‌లో ‘యూజర్ ఎక్స్‌పీరియెన్స్’ కీలక భూమిక పోషించింది, ‘విజయానికి త్యాగానికి సంబంధం ఉందా?’ అని అడిగితే ‘కచ్చితంగా ఉంది’ అంటాడు కైవల్య వోహ్ర. ‘ఏ వయసు ముచ్చట ఆ వయసులో’ అంటారు. ఆడి పాడాల్సిన రోజుల్లో, సినిమాలు, షికార్లు, స్నేహితులే ప్రధానమనిపించే రోజుల్లో అన్నీ విడిచిపెట్టి ‘మా స్టార్టపే మా ప్రపంచం’ అన్నట్లుగా పగలు,రాత్రి కష్టపడ్డారు.‘మనం ఒక రంగంలో విజయం సాధించాలంటే మన ఇష్టాలకు దూరంగా ఉండక తప్పదు. దీన్ని త్యాగం అనుకోవచ్చు’ అంటాడు కైవల్య వోహ్ర. మన దేశ గ్రాసరీ సెగ్మెంట్లో తమదైన ముద్ర వేసిన కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు ‘యంగెస్ట్ సెల్ఫ్–మేడ్ మిలీయనీర్స్’గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు. ∙ ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరి చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ కొత్త బిజినెస్.. సీఈవో కోసం అన్వేషణ!
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది. సీఈవో కోసం అన్వేషణ సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్కార్ట్కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు. విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు. -
దేహాత్ రూ.486 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్ దేహాత్ రూ.486 కోట్ల నిధులను సమీకరించింది. సోఫినా వెంచర్స్, టెమసెక్తోపాటు ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఆర్టీపీ గ్లోబల్ పార్ట్నర్స్, ప్రోసస్ వెంచర్స్, లైట్‌రాక్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. కంపెనీ నిధులు సమీకరించడం గడిచిన రెండేళ్లలో ఇది మూడోసారి. 2012లో దేహాత్ ఏర్పాటైంది. 10,000లకు పైచిలుకు దేహాత్ సెంటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 15 లక్షల మంది రైతులను డిజిటల్ వేదికగా కొనుగోలుదార్లతో అనుసంధానించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
వెంచర్ క్యాటలిస్ట్స్ నుంచి మూడు యూనికార్న్‌లు
ముంబై: దేశంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘వెంచర్ క్యాటలిస్ట్స్ గ్రూపు’.. తన పోర్ట్‌ఫోలియోలోని 54 స్టార్టప్‌లు ఈ ఏడాది 50 మిలియన్ డాలర్ల విలువను (రూ.405 కోట్లు) అధగమించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫండింగ్ 70 శాతం పడిపోయిన సవాళ్ల వాతావరణంలోనూ ఈ సానుకూల పరిణామం చోటుచేసుకన్నట్టు పేర్కొంది. వెంచర్ క్యాట లిస్ట్స్ ఇప్పటి వరకు 33 సూనికార్న్లు, 100కు పైగా మినీకార్న్లకు వేదికగా నిలిచింది. విడిగా చూస్తే రెండు డజన్లకు పైగా కంపెనీలు 100 మిలియన్ డాలర్ల వ్యాల్యూషన్‌ను అధిగమించినట్టు సంస్థ తెలిపింది. ఇందులో షిప్ రాకెట్, భారత్ పే, వేదాంతు గత ఏడాది కాలంలో యూనికార్న్ హోదా పొందినట్టు వెల్లడించింది. చదవండి: బాబోయ్, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే! -
ఫైబర్ హెల్మెట్: క్షేమంగా... లాభంగా.. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉంటేనే!
బ్రాండ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఆల్పన పరీదా రైడర్ సెంట్రిక్ స్టార్టప్‌తో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ‘యువత మనసుతో ఆలోచిస్తాను’ అని చెప్పే పరీదా తన స్నేహితురాలు, వ్యాపార దిగ్గజం ఫల్గుణీ నాయర్ చెప్పిన మాటను శిరోధార్యంగా భావిస్తుంది. ‘ఆసక్తి మాత్రమే కాదు. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉండాలి’ అంటూ ముందుకు సాగుతోంది. బ్రాండ్ డిజైన్, డిజైన్ థింకింగ్ ఏజెన్సీ ‘డివై వర్క్స్’లో పనిచేయడానికి ఆల్పన పరీదా బెంగళూరు నుంచి ముంబైకి వెళుతున్నప్పుడు తన మదిలో ఎన్నో ఆలోచనలు. అందులో అనుకూలమైన వాటితోపాటు ప్రతికూలమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ‘డివై వర్క్స్’లో చేరిన తరువాత తాను ఉద్యోగి మాత్రమే కాలేదు. విద్యార్థి కూడా అయింది. ‘డిజైన్ అనేది కస్టమర్‌ను ఎలా ఆకట్టుకుంటుంది, ప్రాడక్ట్ వైపు వచ్చేలా ఎలా చేస్తుంది...మొదలైన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను’ అంటుంది పరీదా. ఫ్రానెస్కో ముట్టి అనే పాస్తా, పిజ్జా సాస్ తయారీ కంపెనీ కోసం తాను పని చేయాల్సి వచ్చింది. దీనికోసం క్షేత్రస్థాయిలో ఎంతోమందిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చాలామంది కస్టమర్స్ గ్లాస్ జార్స్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న ఆ కంపెనీ గ్లాస్ బాటిల్స్‌లో సాస్ అమ్మడం మొదలుపెట్టింది. ఇది సత్ఫలితాన్నిచ్చింది. సొంతంగా కంపెనీ ఐఐఎం, అహ్మదాబాద్‌లో పీజీడిఎం(పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్) చేసింది పరీదా. ‘ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేయలేకపోతున్నాననే బాధ మహిళల్లో ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడేమో, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అందుకే ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అంటుంది పరీదా. మార్కెటింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన పరీదాకు సొంతంగా కంపెనీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తాను నేర్చుకున్న విషయం గుర్తొచ్చింది. ‘ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేవి ప్రాడక్ట్ విషయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఆ తరువాతే... విజువల్ ఐడెంటిటీ, బ్రాండ్ గురించి ఆలోచించాలి’ ఆ సమయంలో తన దృష్టి హెల్మెట్లపై పడింది. మన దేశం టూ–వీలర్స్ రైడర్స్‌కు పెట్టింది పేరు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ బైక్‌లతో పోల్చితే హెల్మెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు. ‘టీవ్ర’కు శ్రీకారం తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంతోమంది రైడర్స్‌తో మాట్లాడి హెల్మెట్ల విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ‘ప్లాస్టిక్ అనేది బకెట్స్కు బాగుంటుంది. మన తలను రక్షించడానికి కాదు. అందుకే ట్రాక్రైడర్స్ అందరూ కాంపోజిట్ ఫైబర్ హెల్మెట్లనే వాడతారు’ అంటున్న పరీదా టూ–వీలర్స్ కోసం ‘టీవ్ర’కు శ్రీకారం చుట్టింది. గ్లాస్ ఫైబర్ అండ్ కార్బన్ ఫైబర్ హెల్మెట్ల తయారీ కంపెనీ ఇది. తక్కువ బరువు ఉండడం ఈ హెల్మెట్ల ప్రత్యేకత. సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘నైకా’ వ్యవస్థాకురాలు ఫల్గుణీ నాయర్ పరీదాకు ఐఐఎం–అహ్మదాబాద్‌లో క్లాస్మేట్. ఒక విధంగా చెప్పాలంటే పరీదాకు స్ఫూర్తిని ఇచ్చింది నాయరే. పరీదా సాధించిన విజయాలను బట్టి, ఆమెలో ఉత్సాహం మాత్రమే లేదని, సవాళ్లను ఎదుర్కొనే సాహసం మెండుగా ఉందని, ఆ సాహసమే తన వ్యాపారాన్ని ముందుకు నడిపించే ఇంధనమని అర్థం అవుతుంది. చదవండి: SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. -
దటీజ్ రతన్ టాటా... ఆయన పోన్ కాల్ కంపెనీ స్థితినే మార్చింది
రెపోస్ ఎనర్జీ అనేది స్టార్టప్ కంపెనీ. ఇది యాప్ ద్వారా డీజిల్‌ని ఇంటికి డెలివరీ చేస్తుంది. టాటా మోటర్స్ నుంచి సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అందుకున్న కంపెనీ కూడా. ఐతే రతన్ టాటా నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్ తమ కంపెనీ స్థితిని ఏవిధంగా మారిందో రెపోస్ ఎనర్జీ సహా వ్యవస్థాపకురాలు అదితి భోసలే వాలుంజ్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు అదితి భోసలే వాలుంజ్ మాట్లాడుతూ....కొన్నేళ్ల క్రితం తాను తన భర్త చేతన్ వాలుంజ్ రెపోస్ ఎనర్జీని ప్రారంభించాలనుకున్నారు. తమ సంస్థ బాగా ఎదగాలంటే మంచి మార్గనిర్దేశం చేసే వ్యక్తి అవసరమని అనుకున్నారు. వారిద్దరు రోల్‌మోడల్‌గా తీసుకునేది రతన్ టాటానే. అందుకని ఆయన్నే కలుద్దాం అని అదితి తన భర్తతో అంది. ఐతే ఆయన ఏమి మన పక్కంటి వ్యక్తి కాదు సులభంగా కలవడానికి అని ఆమె భర్త వ్యగ్యంగా అన్నారు. అంతేగాక చాలామంది కూడా అసాధ్యం అని నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ అదితి తన పట్టువదల్లేదు. ఎలాగైన కలవాలనుకుంది. అందుకోసం తన రెపోస్ కంపెనీ ఉద్దేశాన్ని వివరిస్తూ...త్రిడీ ప్రెజెంటేషన్ సిద్దం చేసింది. అంతేగాక రతన్ టాటా ఇంటి బయట భార్యభర్తలిద్దరూ పడిగాపులు కాయడమే గాక రాతపూర్వకంగా ఒక లేఖను కూడా రతన్ టాటాకు అందేలా కొందరి సాయం తీసుకుంది. అయినా ప్రయోజనం ఏమి లేకపోయింది. చివరికి రతన్ టాటి ఇంటి వద్ద చాలా సేపు వెయిట్ చేసి ఇక నిరాశగా హెటల్‌కి వెళ్తుండగా సుమారు రాత్రి 10 గం.ల సమయంలో రతన్ టాటా నుంచి వారికి ఫోన్ వచ్చింది. ఇక వారి ఆనందానికి అవధులే లేవు. అంతేకాదు రతన్ టాటా ఫోన్లో 'హయ్ నేను రతన్ టాటా' అదితితో మాట్లాడవచ్చా! అని అడిగారు. ఐతే అదితికి నమ్మశక్యంగా అనిపించకపోవడంతో ఎవరూ మీరంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం అవగతమైంది. మరుసటి రోజే రతన్‌ని కలిసి తన కంపెనీ గురించి వివరించింది. ఐతే టాటా తన నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగారు. తమకు దేశానికి సేవ చేయడంలో సాయం చేయడమే గాక వ్యాపారంలో మార్గనిర్దేశం చేయమని అడిగాం అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు అదితి భోసలే. ఆ రోజు తర్వాత నుంచి తమ కంపెనీ దిశ మారిపోయిందని అన్నారు. (చదవండి: శ్రీలంకలా మారిని బంగ్లాదేశ్... భగ్గుమంటున్న నిరసన సెగలు) -
ఇది ఆరంభం మాత్రమే.. భారత్‌లో 75వేల స్టార్టప్‌లు
న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం 75,000 పైచిలుకు స్టార్టప్‌లకు భారత్ నెలవుగా మారిందని ఆయన వెల్లడించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో ఈ ఘనత సాధించడం .. దార్శనికత శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలను భారత్ సాధిస్తుందని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో మంత్రి ట్వీట్ చేశారు. కొద్ది కాసులకు ఆశపడి విదేశాల బాట పట్టకుండా దేశీయంగానే లిస్టింగ్ చేయడంపై దృష్టి పెట్టాలని అంకుర సంస్థలకు ఆయన ఇటీవలే సూచించారు. చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి! -
ఓయూలో ఐడియాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్(ఉస్మానియా యూనివర్సిటీ): ఓయూ టెక్నాలజీ కాలేజీ (సాంకేతిక విద్య) వివిధ రకాల న్యూ ఐడియాలను (కొత్త ఆలోచనలు) ఆహ్వానిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు మాట్లాడుతూ కొత్త ఆలోచణలు, ఆవిష్కరణల అభివృద్ధికి కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు తోడ్పడేలా ఎవరైనా ఎలాంటి ఐడియాలు ఉన్నా తమతో షేర్ చేసుకోవచ్చన్నారు. స్వీకరించిన ఐడియాలపై పరిశోధనలు జరిపి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడేలా చేస్తామన్నారు. దీనిపై 9959167505, 9849636589 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభత్వ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఐడియా హ్యాకథాన్‌కు ఓయూ టెక్నాలజీ కాలేజీ నుంచి 10 కొత్త ఐడియాలను పంపించామన్నారు. అందులో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, ప్రొ.తాటి జ్యోతి, పరిశోధక విద్యార్థి అభిలాష్ సమర్పించిన వ్యర్థ జలాల శుద్ధి, మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి తయారు అనే ఐడియాలు ఎంపికయ్యాయని వివరించారు. ఓయూ క్యాంపస్ టెక్నాలజీ కాలేజీలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో కొత్తగా బీఫార్మసీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు, టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సులో 30 నుంచి 60 సీట్లకు పెంచుతున్నట్లు ప్రిన్సిపాల్ సాయిలు వివరించారు. చదవండి: నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి: రాజాసింగ్ -
Nimish Goel: విరాట్ కోహ్లీని కలిసి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు! ఆ తర్వాత..
అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే వేరే ఎవరైనా ఏం కోరిక కోరుతారో తెలియదుగానీ...అభిమాని మాత్రం ‘నా ఫెవరెట్ స్టార్ నాతో మాట్లాడాలని ఉంది. నెరవేర్చు ప్లీజ్’ అంటాడు. మన దేశంలో ఎన్నో రంగాల సెలిబ్రిటీలకు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘ట్రూఫ్యాన్’ అనేది ఇప్పుడు వారి పాలిట అద్బుతదీపం అయింది... ఇంకా రెండురోజుల్లో తాను ఒక వివాహ వేడుకకు వెళ్లాలి. ఆరోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు నిమిష్ గోయెల్. నిజానికి అతని ఆసక్తి వివాహవేడుక గురించి కాదు. ఆ వివాహనికి హాజరుకాబోతున్న విరాట్ కోహ్లీ గురించి. కోహ్లీకి తాను వీరాభిమాని. ఆరోజు రానే వచ్చింది. అతి కష్టం మీద విరాట్ కోహ్లీని కలిసి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అది తనకు మరిచిపోలేని సమయం. పదేపదే గుర్తుతెచ్చుకుంటూ ఎప్పటికీ గుర్తుండిపోయే సమయం. నిజానికి ఆ సమయమే తన టైమ్‌ను మార్చింది. తనకంటూ ఒక మంచి టైమ్‌ను తీసుకువచ్చింది. ఏదో మామూలు ఉద్యోగం చేసుకునే తనను స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ‘ట్రూఫ్యాన్’కు కో–ఫౌండర్, సీయివోను చేసింది. కోహ్లీని కలుసుకున్న శుభసందర్భంలో తనలాంటి అభిమానుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నిమిష్. అభిమానికి, ఫెవరెట్స్టార్కు మధ్య ఇంటరాక్షన్‌కు వీలయ్యే ఒక వేదిక గురించి ఆలోచించాడు. ఎన్.అగర్వాల్, దేవేందర్ బిందల్‌తో కలిసి ‘ట్రూఫ్యాన్’ అనే సెలిబ్రిటీ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టాడు. ఫండ్‌రైజింగ్‌లో భాగంగా ఎర్లీ–స్టేజ్ ఇన్వెస్టర్లను సంప్రదించారు. వారు ఓకే అనడంతో బండి పట్టాలకెక్కింది. ‘ట్రూఫ్యాన్’ ద్వారా తమ ఫెవరెట్ స్టార్‌తో ఇంటరాక్ట్ కావడానికి చిన్నపాటి క్విజ్‌లో విజేత కావాల్సి ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు...మొదలైన సందర్భాల్లో మాత్రమే కాదు వ్యక్తిగత సలహాలు తీసుకోవడం నుంచి మొదలు తమ ఫెవరెట్స్టార్కు విన్నపాలు వినిపించుకునే అవకాశం వరకు ఉంటుంది. ‘ట్రూఫ్యాన్’కు 1.5 మిలియన్‌కు పైగా యూజర్స్ ఉన్నారు. రణ్వీర్సింగ్లాంటి స్టార్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇదే మార్కెట్లో ఇతర ప్లాట్‌ఫామ్‌ల ఏటీపి(అవరేజ్ టికెట్ ప్రైస్) వెయ్యి నుంచి అయిదువేల వరకు ఉంటే ‘ట్రూఫ్యాన్’లో మాత్రం మూడువందల నుంచి అయిదు వందల రూపాయల వరకు ఉంది. ఐఐటీ–ఖరగ్‌పూర్ విద్యార్థి అయిన నిమిష్ ‘మన దేశంలో ఫ్యాన్స్–సెలబ్రిటీలకు సంబంధించి శక్తివంతమైన మార్కెట్‌ను సృష్టించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు. చదవండి: Porgai Art: ట్రైబల్ హార్ట్.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం! -
అబ్బాయి గెటప్‌లో పాపులర్.. తనకిష్టమైన స్టైలే ఆర్థికంగా నిలబెట్టింది!
పుట్టుకతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదుగుతారు చాలామంది. కొంతమంది మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలు ఏవీలేనప్పటికీ.. తమలోని ప్రతిభానైపుణ్యాలతో వారంతటవారే అవకాశాలను సృష్టించుకుని నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ కోవకు చెందిన అమ్మాయే రతన్ చౌహాన్. అమ్మాయిగా పుట్టినప్పటికీ, అబ్బాయిలా పెరిగింది. అబ్బాయి గెటప్‌లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇంటి బాధ్యతలను చేపట్టి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది రతన్. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల రతన్ చౌహాన్ ఝుంఝనులోని మాండ్వా గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. రతన్ అమ్మకడుపులో ఉండగానే తల్లిదండ్రులు అమ్మాయి లేదా అబ్బాయి ఎవరు పుట్టినా పేరు ‘నవరతన్’ అని పెట్టాలనుకున్నారు. రతన్ పుట్టిన తరువాత కూడా అదే పేరు కొనసాగించారు. స్కూలుకెళ్లాక అమ్మాయికి ఈ పేరు నప్పదని చెప్పి టీచర్ రతన్‌గా మార్చింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే రతన్‌కు అమ్మాయిలంతా ఎంతో ఇష్టపడే పొడవైన జడ ఉండేది. కానీ ఆమెకు మాత్రం అబ్బాయిల్లా చిన్న జుట్టునే ఇష్టపడేది. ఇంట్లో జుట్టు కత్తిరించుకుంటానని అడిగితే ఒప్పుకునేవారు కాదు. చివరికి ఇంటర్మీడియట్లో ధైర్యం చేసి జుట్టు కత్తిరించేసింది. అబ్బాయిల హెయిర్‌స్టైల్, చేతులు, మెడమీద టాటూలతో అబ్బాయిల్లా డ్రెస్‌లు వేసుకోవడం ప్రారంభించింది. నడకను, ఆహార్యాన్ని పూర్తిగా మగపిల్లాడిలా మార్చేసింది. నాన్నకు ఇష్టం లేకపోయినప్పటికీ.. అబ్బాయిలా హావభావాలు, ఆహార్యంతో స్టైల్‌గా ఉంటూనే జైపూర్‌లో బీకామ్ పూర్తిచేసింది రతన్. బ్యాంక్ ఉద్యోగం చేయాలని ఆమె తండ్రి కోరుకునేవారు. కానీ రతన్‌కు సింగింగ్, డ్యాన్సింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. స్కూలు, కాలేజీలలో ప్రతి కార్యక్రమంలో ఎంతో యాక్టివ్‌గా పాల్గొనేది. ఈ అలవాటుతోనే సింగింగ్, డ్యాన్సింగ్ వీడియోలను రూపొందించేది. నాన్నకు ఇష్టం లేదని తెలిసినా పట్టించుకోకుండా వీడియోలు తీసేది. టిక్‌టాక్ ఉన్న సమయంలో రతన్ తన వీడియోలను పోస్టు చేసేది. వ్యూవర్స్ నుంచి మంచి స్పందన వుండడంతో సొంతంగా పాటలు, మాటలు రాసుకుని వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేది. ఇలా పెడుతూ ఒకసారి పోస్టుచేసిన వీడియో షేర్లో ఆల్బమ్‌లోని మహ్రో రాజస్థాన్ పాటకు ఆరులక్షమందికి పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో రతన్ బాగా పాపులర్ అయ్యింది. టిక్‌టాక్ ఉన్నంత కాలంలో టిక్టాక్స్టార్గా ఓ వెలుగు వెలిగింది. టిక్‌టాక్‌ను ఇండియాలో నిషేధించాక, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలమంది అభిమానులు, మంచి ఆదాయంతో రాణించేది. ఒకపక్క కరోనా.. మరోపక్క నాన్న అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ రతన్ జీవితాన్ని కుదుపునకు గురిచేసింది. అప్పటిదాకా వీడియోలు పోస్టుచేస్తూ అంతో యింతో ఆదాయం ఆర్జిస్తోన్న రతన్‌కి... లాక్‌డౌన్‌తో వీడియోలు రూపొందించడం కుదరక ఆదాయం కాస్తా అడుగంటిపోయింది. దీనికితోడు తండ్రి ఆరోగ్యం బాగా పాడవడంతో ఏడాదిపాటు ఆక్సిజన్ సిలిండర్ మీదే ఉండాల్సిన పరిస్థితి. దీంతో కుటుంబ పోషణకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. తండ్రికి మందులు, ఆక్సిజన్ సిలిండర్ ఎలా కొనాలో తెలియలేదు. అప్పుడే రతన్ మనసులో ‘కర్ని ఫ్యాషన్’ ఆలోచన వచ్చింది. రతన్ ఏ డ్రెస్ వేసుకున్నా ‘‘నీ డ్రెస్, డ్రెస్సింగ్ స్టైల్ బావుందని అంతా పొగిడేవారు. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు’’ అని అడిగేవారు. ఆ విషయం గుర్తుకొచ్చి తను వాడే జైపూర్ ప్రింట్స్ షర్ట్స్‌ను విక్రయించాలనుకుంది. ఈ క్రమంలోనే కర్నిఫ్యాషన్ స్టార్టప్‌ను ప్రారంభించింది. జైపూర్‌లో ఓ షాపు పెట్టి తను వేసుకునే జైపూర్ ప్రింట్ షర్ట్స్‌ను విక్రయించి కుటుంబాన్ని పోషిస్తోంది. తనకిష్టమైన స్టైలే ఈ రోజు రతన్ జీవితంతోపాటు, కుటుంబాన్నీ ఆర్థికంగా నిలబెట్టింది. అందుకే ఎవరెన్ని చెప్పినా మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అనుకున్న పనిని మనసుపెట్టి వందశాతం కష్టపడి చేస్తే విజయం సాధించవచ్చని రతన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: Hoovu Fresh: విరులై.. కురిసిన సిరులు.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు! -
Gorilla Fan: ఈ ఫ్యాన్‌తో కరెంటు బిల్లు తక్కువ! అందుకే ఇలా!
‘ఫ్యాన్ కంపెనీ స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను’ అని మనోజ్ మీనా తన ఆలోచనను చెబితే నవ్వి తేలికగా తీసుకున్నవారే తప్ప భుజం తట్టినవారు తక్కువ. ‘ఇప్పటికే మార్కెట్లో బోలెడు ఫ్యాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల సంగతి సరే సరే. వాటిని వదిలి మీ ఫ్యాన్ కోసం జనాలు వస్తారా?’ అడిగాడు ఒక మిత్రుడు. నిజమే మరీ...బోలెడు పోటీ! ఇలాంటి సమయంలోనే ‘మా ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే వారి ప్రత్యేకతే కంపెనీ విజయానికి బాటలు వేసింది. మనోజ్ మీనా, శిబబ్రత్దాస్లు ఐఐటీ, బాంబే గ్రాడ్యూయెట్స్. మనోజ్ మీనా ఫౌండర్‌గా ‘ఆటంబెర్గ్ టెక్నాజీస్’ మొదలైంది. తరువాత దాస్ కో–ఫౌండర్‌గా చేరాడు. ఇద్దరికీ కాలేజిరోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించిన కార్యక్రమాలు, పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆటంబెర్గ్ టెక్నాజీస్ వారి ‘గొరిల్లా ఫ్యాన్’ విజయవంతం కావడానికి కారణం... సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లతో పోల్చితే ఇవి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కరెంటు బిల్లు బరువును తగ్గిస్తాయి. ఈ ఫ్యాన్‌ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, స్పీడ్ తగ్గించాలన్నా, పెంచాలన్నా గోడకు ఉన్న స్విచ్ దాకా వెళ్లనక్కర్లేదు. చేతిలో ఉన్న స్మార్ట్ రిమోట్‌తో చేయవచ్చు. సామాన్యుడికి ఇంతకంటే కావాల్సింది ఏమిటి! సామాన్యులే కాదు ఈ ఫ్యాన్లను ఇన్ఫోసిస్, ఆదిత్య బిర్లా గ్రూప్...లాంటి పెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం. బంగ్లాదేశ్, నైజీరియా...మొదలైన దేశాలకు గొరిల్లా ఫ్యాన్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ మేడిన్–ఇండియా కంపెనీ 2017లో నేషనల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ అవార్డ్ గెలుచుకుంది. ఇక్కడితో ఆగిపోలేదు. గ్లోబల్ క్లైమెట్ సాల్వర్ అవార్డ్(వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) గెలుచుకుంది. గ్లోబల్ క్లీన్టెక్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ విన్నర్‌గా నిలిచింది. ప్రధానమంత్రి నీతి ఆయోగ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ 30 అండర్ 30 ‘సైన్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీ’ విభాగంలో, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా ‘ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ’ విభాగంలో చోటు సంపాదించింది. ‘మార్కెట్ బజ్వర్డ్స్ను గుడ్డిగా ఫాలో కావద్దు. ఉదాహరణకు...ఆటోమేషన్ అనేది మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్ బజ్‌వర్డ్. తరువాత ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) బజ్‌వర్డ్‌గా మారింది. వాటి వెంట పరుగులు తీసేముందు... వినియోగదారులకు వాటిని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమంజసమైన ధరలలో ప్రాడక్ట్‌ను వినియోగదారులకు చేరువ చేయగలిగితే ఆ ప్రాడక్ట్ మార్కెట్లో బెస్ట్‌సెల్లర్‌గా నిలుస్తుంది’ అంటాడు ‘ఆటంబెర్గ్ టెక్నాలజీస్’ కో–ఫౌండర్ దాస్. ఇక ఇన్వెస్టర్స్ గురించి ఫౌండర్ మనోజ్ మీనా ఇలా అంటాడు... ‘మన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయమే అయినా సరిౖయెన ఇన్వెస్టర్స్‌ను ఎంపిక చేసుకోవడం అనేది ఒక సవాలు’. అయితే ముంబై కేంద్రంగా మొదలైన ‘ఆటంబెర్గ్’ కంపెనీ మొదట్లో అనూహ్యమైన విజయమేమీ సాధించలేదు. మొదటి ఆరు నెలలు జీరోరెవెన్యూ వెక్కిరించింది. మరోవైపు రకరకాల ఆర్థిక ఒత్తిళ్లు. ఇద్దరినీ తీవ్రమైన నిరాశ కమ్మేసింది. ఆ సమయంలో తాత్వికుల మాట ‘ఆగనంత వరకు నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగుతుంది అనేది ముఖ్యం కాదు’ పదేపదే గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవారు. ఆర్ అండ్ బీ, ట్రైనింగ్, ఫండ్ రైజింగ్, భాగస్వాములను వెదుక్కోవడం....ఒక్కటా రెండా, ఎన్నెన్నో విషయాలు తలకు మించిన భారం అయ్యాయి. అయినప్పటికీ భయానికి ఎక్కడా తలవంచలేదు. వారి ఆశ వృథా పోలేదు. మెల్లగా అయినా సరే కంపెనీ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. కూలర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఏసీ...మొదలైన అప్లికేషన్లపై పనిచేస్తున్న ‘ఆటంబెర్గ్’ భవిష్యత్‌లో హౌజ్‌హోల్డ్ కన్జ్యూమర్ అప్లికేషన్లలో అత్యున్నతస్థాయి విజయాలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. చదవండి: ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..! -
6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!
ఇరవై ఎనిమిదేళ్ల ఓషియానాకు వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా ఉంది. కానీ ‘‘ఇంట్లో ఎవరూ వ్యాపారస్థులు లేరు, ఏ అనుభవం లేకుండా వ్యాపారం ఎలా చేస్తావు’’ అంటూ తల్లిదండ్రులు ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లారు. అయితే అక్కడితో తన ఆశను వదిలేయకుండా, వాళ్లను ఎలాగో ఒప్పించి ఓ స్టార్టప్ ను ప్రారంభించింది. అనుభవం లేకపోయినా అంకిత భావం ఉండటం వల్ల ప్రారంభంలో ఎదురైన అనేక ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోయింది. ఫలితం.. ఇప్పుడామె ఆదాయం నెలకు కొన్ని లక్షలు. అలా వ్యాపారం చేయాలన్న ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోంది ఓషియానా. ఢిల్లీకి చెందిన ఓషియానా ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ‘ఫ్యాషన్ ఎక్స్పోర్ట్ హౌజ్’లో చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తోంది కానీ మనసులో మాత్రం బిజినెస్ చేయాలని బాగా కోరిక. తన కోరికను తల్లిదండ్రుల ముందుంచితే ‘‘ఉద్యోగంలో ఎటువంటి రిస్కూ ఉండదు. వ్యాపారం అయితే లాభనష్టాలతో కూడుకున్నది. ఎక్కువ ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగం చెయ్యి’’ అని ప్రభుత్వ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు ఆమెను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఓషియానా వారి అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తన మనసులో ఉన్న బిజినెస్ ప్లాన్ గురించి వివరించి ‘‘మీరు నాకు ఆరునెలలు సమయం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అది జరగని పక్షంలో మీరన్నట్లే చేస్తాను’’ అని చెప్పి ఒప్పించింది. ఫ్రెండ్‌తో కలిసి.. తల్లిదండ్రులు ఒప్పుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా 2019 ఫిబ్రవరిలో తన స్నేహితుడు సౌరభ్ తోకస్తో కలిసి ‘మోడ్రన్ మిత్’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఓషియానా ఉద్యోగం చేసేటప్పుడు దాచుకున్న డబ్బులు, ఇంకా సౌరభ్ తెచ్చిన కొంత మొత్తం కలిపి ఆరు లక్షల రూపాయలతో.. నాలుగు కుట్టు మిషన్లు, నలుగురు కళాకారులతో రెగ్జిన్ , కార్క్, కాటన్ , పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్ వంటి వీగన్ పదార్థాలతో బ్యాగ్‌ల తయారీ మొదలు పెట్టింది. చూడటానికి చాలా మోడర్న్‌గా ఉంటూ మన్నికగా ఉండే ఈ బ్యాగ్‌లకు మంచి ఆదరణ లభించింది. విక్రయాలు బాగా జరిగేవి. అలా వచ్చిన లాభాన్ని మళ్లీ దానిలోనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చింది. నేడు 15 మంది హస్త కళాకారులు, పది మిషన్లతో మోడ్రన్ మిత్ దూసుకుపోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మిత్ కస్టమర్లకు నాణ్యమైన బ్యాగ్‌లు అందించేందుకు ప్రస్తుతం అందుబాటు లో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్లను వాడుకుని నెలకు 14 నుంచి 20 లక్షల వరకు ఓషియానా ఆర్జిస్తోంది. డిజైన్ , నాణ్యతే మా ప్రత్యేకత ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో డిజైన్ తోపాటు నాణ్యత చాలా ముఖ్యం. అందుకే నేను ముందు మంచి హస్తకళాకారులను అన్వేషించాను. తరతరాలుగా అదే పనిచేస్తోన్న కుటుంబాలకు చెందిన కళాకారులను ఎంపికచేశాను. నా కంపెనీలో పనిచేస్తోన్న కళాకారుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీళ్లు చేతితోనే అందమైన డిజైన్లు రూపొందిస్తారు. రెగ్జిన్ , కార్క్, కాటన్ లను ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించి అందమైన బ్యాగ్‌లు రూపొందిస్తున్నాము. పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్‌ను కూడా తయారీలో వాడుతున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని కలగదు. మా దగ్గర 130 రకాల బ్యాగ్‌లు తయారవుతాయి. వీటిలో హ్యాండ్ బ్యాగ్స్, టాట్స్, స్లింగ్ బ్యాగ్స్, మేకప్ పౌచ్‌లు, ట్రావెలింగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార అనుభవం లేని అమ్మాయిగా ప్రారంభంలో నాకు చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సౌరభ్ సాయంతో అన్నింటినీ అధిగమించగలిగాను. మా ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా నేరుగా కస్టమర్లకు చేరుస్తూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తున్నాను. ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ముందు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకోవాలి. తర్వాత తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దానిపై పట్టు సాధించాక అంచెలంచెలుగా దానిని పెంచుకోవాలి’’ అని స్టార్టప్ ఔత్సాహికులకు సూచిస్తోంది ఓషియానా. -
ఎనిమిది నిమిషాల్లో!!.. ప్రాణాలు నిలబెట్టేందుకు ఉరుకులు
పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరుగులు తీయాల్సిందే. ఎంత త్వరగా సేవలు అందితే.. అంత త్వరగా ఎదగవచ్చనే అంచనాకి వచ్చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఫుడ్, గ్రాసరీ స్టార్టప్‌లు.. 2021లో ‘పది నిమిషాల’ మార్క్‌తో నయా ట్రెండ్‌ను ఫాలో అయ్యాయి. అయితే ఇప్పుడు హెల్త్ సర్వీసులు.. అది మనిషి ప్రాణం నిలబెట్టగలిగే ఆంబులెన్స్ సర్వీసులకు పాకింది. ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది స్టాన్‌ఫ్లస్. పైగా ఇది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కావడం మరో విశేషం. స్టాన్‌ఫ్లస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్.. ఎమర్జెన్సీ మెడికల్ రెస్సాన్స్ స్టార్టప్. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సేవల కోసం ఈ స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ఈ స్టార్టప్ 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.148 కోట్లపైనే) ఫండింగ్ దాటేసింది. ఢిల్లీ కేంద్రంగా హెల్త్‌క్వాడ్, కలారీక్యాపిటల్(బెంగళూరు), హెల్త్‌ఎక్స్ సింగపూర్(సింగపూర్) వరుసగా ఫండింగ్‌కు వెళ్లడంతో ఈ ఘనత సాధించింది స్టాన్‌ఫ్లస్. ఈ హుషారులో నగరంలో 500 ఆస్పత్రులకు తమ సేవలకు విస్తరించేందుకు స్టాన్‌ఫ్లస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు తమ సేవల నిడివి సమయాన్ని 15 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్య ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే కేవలం 8 నిమిషాల్లో మనిషి ప్రాణం నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేయబోతుందన్నమాట. 2016లో మొదలైన ఈ స్టార్టప్.. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌లో 3 వేల ఆంబులెన్స్‌లు ఉండగా.. అందులో స్టాన్ఫ్లస్కు 200 సొంత ఆంబులెన్స్‌లు ఉన్నాయి. ఎనిమిదే ఎందుకు? ప్రస్తుతం గ్రాసరీ డెలివరీ కోసం 10 నిమిషాలు మార్క్‌ను ప్రకటించుకున్నాయి స్టార్టప్‌లు. అయితే ఆంబులెన్స్ సేవలను అందించే వియషంలో ఆ సమయం మరీ ఎక్కువగా(45 నిమిషాల దాకా) ఉంటోంది. అందుకే మనిషి ప్రాణాలు నిలబెట్టగలిగే ఈ విషయంపై ఫోకస్ చేసినట్లు స్టాన్‌ఫ్లస్ సీఈవో ప్రభ్‌దీప్ సింగ్ చెప్తున్నారు. ‘ఫస్ట్ మినిట్.. లాస్ట్ మైల్’ హెల్త్‌కేర్ పేరుతో గరిష్ఠంగా 15 నిమిషాలు.. కనిష్ఠంగా 8 నిమిషాల ఆంబులెన్స్ సేవల్ని అందించే ప్రయత్నం చేయబోతున్నారు. ఎఫెక్ట్.. దేశంలో ఫుడ్, గ్రాసరీ యాప్‌ల తరహాలో.. త్వరగతిన ఆంబులెన్స్ సర్వీసులను అందించేందుకు మరికొన్ని స్టార్టప్‌లు ఉన్నాయి. ముంబైకి చెందిన డయల్4242, హైదరాబాద్‌కి చెందిన ఫస్ట్ కన్సల్ట్ టెక్నాలజీస్ ‘అంబీ’ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. అలాగే స్టాన్‌ఫ్లస్ ఎఫెక్ట్‌తో 8 నిమిషాల లిమిట్‌ను పరిగణనలోకి తీసుకుని మరికొన్ని స్టార్టప్‌లు తక్కువ కాలపరిమితి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘8 నిమిషాల’ మీదే ఇప్పుడు మిగతా స్టార్టప్‌ల దృష్టి కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమర్శకుల స్పందన ఫుడ్ డెలివరీ యాప్‌ల విషయంలో 10 నిమిషాల గడువు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిజీ టైంలో ప్రమాదాలకు కారణమవుతుందని కొన్ని అభ్యంతరాలను సైతం లేవనెత్తారు. అయితే ప్రస్తుతం ఆంబులెన్స్‌ల విషయంలో మాత్రం విమర్శకులు.. వేరే గళం వినిపిస్తున్నారు. కరోనాలాంటి సంక్షోభాల నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి హెల్త్‌కేర్ సర్వీసుల అవసరం అవసరం ఉందనే చెప్తున్నారు. చదవండి: ఫ్లిప్‌కార్ట్ మాజీల స్టార్టప్ అట్టర్ ఫ్లాప్.. రూ. 66 కోట్ల పెట్టుబడి వెనక్కి -
స్టార్టప్‌లకు కేంద్రబిందువుగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌లకు.. ముఖ్యంగా రక్షణ, వైమానిక రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రబిందువు అవుతోందని హైదరాబాద్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. 2008 నాటికి భారత్, అమెరికా మధ్య రక్షణ రంగ వ్యాపారం దాదాపు శూన్యం కాగా ఇప్పుడు వందల కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైన ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్క్‌షాప్’లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ, వైమానిక రంగాల్లోని స్టార్టప్ కంపెనీలు తమ ఆలోచనలను వస్తు, సేవల రూపంలోకి తీసుకొచ్చేలా తోడ్పాటునందించేందుకు అమెరికన్ కాన్సులేట్ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వర్క్‌షాప్‌లో సుమారు 25 స్టార్టప్‌లు పాల్గొంటున్నాయని.. వీటన్నింటినీ 35 ఏళ్ల లోపు వయసు వారు ప్రారంభించారని చెప్పారు. ఇందులో అత్యధికం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనివేనని, ఇందులోనూ మహిళల నేతృత్వంలో నడుస్తున్నవి ఎక్కువుండటం గర్వకారణమని కొనియాడారు. డిసెంబరు 9న మొదలైన ఈ వర్క్‌షాప్ 11న ముగియనుంది. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ సంస్థలూ ఇప్పుడు స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. డీఆర్డీవో, కేంద్ర రక్షణ శాఖలు వేర్వేరుగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. మహిళా స్టార్టప్‌లలో కొన్ని.. ఆర్మ్స్ 4 ఏఐ భౌతిక శాస్త్రవేత్త జాగృతి దబాస్ ఈ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకురాలు. హైదరాబాద్‌లోని వీ హబ్ కేంద్రంగా పనిచేస్తోందీ కంపెనీ. ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి భూమ్మీద ఏ వస్తువు ఎక్కడుందో క్షణాల్లో చెప్పే టెక్నాలజీని సిద్ధం చేసింది. వాహనాల కదలికలు.. ఆయా ప్రాంతాల్లో సమయంతో పాటు వచ్చే మార్పులు, పంటలు, భూ పర్యవేక్షణ, ప్రకృతి విపత్తులకు లోనైన ప్రాంతాల పరిశీలనలో పని చేస్తోంది. మోర్ఫెడో టెక్నాలజీస్ దేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానం కీలక విడి భాగం తయారీకి ఎంపికైన స్టార్టప్ ఇది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో అసోసియేట్ డిజైన్ ఇంజినీర్ మిలన్ భట్నాగర్. తేజస్‌లో దాదాపు 358 లైన్ రిప్లేస్మెంట్ యూనిట్లు (ఎల్‌ఆర్‌యూ) ఉండగా వీటిల్లో 47 శాతం యూనిట్లు భారత్‌లో తయారు కావట్లేదు. ఈ లోటును పూరించడంలో భాగంగానే టోటల్ ఎయిర్ టెంపరేచర్ ప్రోబ్ ఎల్ఆర్యూను తయారు చేసే అవకాశం మోర్ఫెడోకు దక్కింది. పీఎస్–1925 మేకిన్ ఇండియాలో భాగంగా వ్యవసాయం, వైమానిక రంగాల్లో డ్రోన్లను తయారు చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరు షెఫాలీ వినోద్ రామ్టెకే. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే 2 వేల మంది రైతులకు సేవలందిస్తున్నారు. హెక్టారు భూమిలోని పంటకు మందులు కొట్టేందుకు రూ.2 వేలకే డ్రోన్లు సమకూరుస్తున్నారు. రక్షణ, ఈ–కామర్స్, ఆరోగ్య, రవాణా రంగలకూ ఉపయోగపడేలా డ్రోన్లు తయారు చేసే పనిలో ఉన్నారు. ఫ్లై అట్ మ్యాట్ ఇన్నోవేషన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ డ్రోన్ల తయారీ రంగంలో ఉంది. ఎంఎస్ ఉత్తర దీనికి టెక్నికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. జీఐఎస్ సర్వే, సొంతంగా మ్యాపులు సిద్ధం చేసే డ్రోన్లతో పాటు వరద వంటి ప్రకృతి విపత్తుల్లో సహాయంగా ఉండే యూఏవీలనూ తయారు చేస్తోందీ కంపెనీ. -
భార్యను ట్రోల్ చేస్తే ఊరుకుంటాడా.. ఏం చేశాడో తెలుసా?
Tarun Katial to launch women-only platform Eve World: విదేశాలతో పోలిస్తే.. మన దేశంలో మహిళలకు సంబంధించిన యాప్స్(ప్రైవేట్) చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన యాప్స్ వేళ్ల మీద లెక్కపెట్టేవిగా ఉన్నాయి. ఈ తరుణంలో మీడియా దిగ్గజం తరుణ్ కటియాల్ ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే రూపొందించాడు. అందుకు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది.. స్వయంగా ఆయన భార్యకి ఎదురైన అనుభమే!. ఈవ్ వరల్డ్.. మహిళల భద్రత కోసం రూపొందించిన ప్లాట్‌ఫామ్. ఈ ప్రపంచంలోకి కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆడవాళ్లు తమ అనుభవాల్ని పంచుకోవడం, ఓదార్పు కోరుకోవడం, సలహాలు ఇచ్చుకోవడం, ఇతర సమస్యలపై చర్చించుకోవడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఒక స్పేస్ ఏర్పాటు చేయడం ద్వారా అసలు సమస్య పరిష్కారం అవుతుందా? వాళ్లకు ఉపశమనం దొరుకుతుందా? అనే ప్రశ్నలకు.. తరుణ్ కటియాల్ సమాధానమిస్తున్నారు. ‘‘మేం వాళ్ల(మహిళల) ప్రపంచాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు. కానీ, ఎంతో కొంత మంచి మాత్రం చేస్తాం. ఇదే మా ట్యాగ్ లైన్ కూడా అని చెప్తున్నారాయన. సమస్యకు పరిష్కారం చూపలేకపోయినా ఇంటర్నెట్లో, సంప్రదాయ సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఎదుర్కొనే వేధింపుల గురించి మహిళలు బహిరంగంగా(పురుష సమాజంతో సంబంధం లేకుండా) చర్చించుకునేందుకు ఒక వేదికను అందిస్తున్నామని అంటున్నారాయన. భారత్‌లో మహిళల మీద ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయి. గతంలో ఫిర్యాదులు 300 వచ్చేవి. కరోనా టైం నుంచి ఆ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువైంది. - నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ తరుణ్ కటియాల్ గతంలో బిగ్ ఎఫ్ఎం, జీ5కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. స్టార్ ఇండియా, సోనీ ఎంటర్టైన్మెంట్, రియలన్స్ బ్రాడ్కాస్ట్ నెట్‌వర్క్‌లోనూ పని చేసిన అనుభవం ఉందాయనకు. ఆయన భార్య మోనిషా సింగ్ కటియాల్ కూడా మీడియా రంగంలోనే కొనసాగుతున్నారు. ఓసారి కొందరు వ్యక్తులు ఆమె నెంబర్ వాట్సాప్‌కి సందేశాలు పంపుతూ ట్రోల్ చేశారట. దీంతో పోలీసులను ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ, ‘ఫిర్యాదు చేసినా అతనిపై(నిందితుడి) ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి’ అంటూ భార్య చెప్పిన మాటలతో తరుణ్ కటియాల్ ఆలోచనలో పడ్డారట. అలా ఈవ్ వరల్డ్‌కు బీజం పడిందని చెప్తున్నారాయన. (క్లిక్: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!) ఈవ్ వరల్డ్.. జూన్ 2021 నుంచి రియాలిటీలోకి వచ్చింది. ఇందులో మొదటి యూజర్‌గా చేరింది మోనిషా సింగ్ కటియాల్. మహిళా సాధికారికత సాధన ధ్యేయంగా రూపొందించిన ఈ ప్లాట్ఫామ్లో.. మహిళలు నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. కంటెంట్‌తో పాటు కమ్యూనిటీలను సైతం క్రియేట్ చేసుకోవచ్చు. పరిణామాలు, పర్యవసనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. పైగా ఈవ్ వరల్డ్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. అదనంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని సైతం జత చేశారు. తద్వారా యూజర్ ప్రతీ చర్యకూ రివార్డులు దక్కుతుంటాయి. అవి పాయింట్లు, లేదంటే వర్చువల్ టోకెన్ల రూపంలో అందిస్తారు. వాటిని డాక్టర్ కన్సల్టింగ్ కోసం, మానసిక వైద్యులను సంప్రదించడం కోసం, షాపింగ్ లేదంటే ఎన్ఎఫ్టీలు కొనుగోలు చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. తద్వారా యూజర్‌తో పాటు ఈవ్ వరల్డ్‌కి ప్రమోషన్ ద్వారా ఆదాయమూ జనరేట్ అవుతుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!) - సాక్షి, వెబ్ స్పెషల్ -
బైజూస్ గూటికి జియోజెబ్రా
న్యూఢిల్లీ: ఇటీవల ఇతర సంస్థలను చేజిక్కించుకోవడంలో వేగం చూపుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తు న్న జియోజెబ్రాను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువను బైజూస్ వెల్లడించలేదు. లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 11.5 కోట్ల మంది విద్యా ర్ధులకు సేవలందిస్తున్న బైజూస్ తాజా కొనుగోలుతో ప్రస్తుత మాథమాటిక్స్ పోర్ట్‌ఫోలియోకు మరిన్ని అభ్యాసన విధానాలను జత చేసుకోనుంది. అంతేకాకుండా కొత్త ప్రొడక్టులను సైతం ప్ర వేశపెట్టనుంది. కాగా.. మాథమాటిక్స్ లెర్నిం గ్లో పటిష్ట ప్లాట్‌ఫామ్స్ కలిగిన జియోజెబ్రా ఇకపైన కూడా వ్యవస్థాపకుడు, డెవలపర్ మార్కస్ హోహెన్వార్టర్ ఆధ్వర్యంలో స్వతంత్ర యూనిట్‌గా కొనసాగనున్నట్లు బైజూస్ పేర్కొంది. -
రికార్డెంట్.. చిన్న, మధ్యస్థాయి సంస్థలకు వారధి
సురేష్ అండ్‌కో... చాలా చిన్న సంస్థ. అందులో కేవలం 10 మంది ఉద్యోగులు. కస్టమర్ల బకాయిలు, ఇన్వాయిస్లు, పేమెంట్స్ ఇవన్నీ చూడాలి. పైగా బిజినెస్ డెవలప్కోసం ఫైనాన్స్ కూడా అవసరం. రమేష్ టెక్నాలజీస్.. ఇదికూడా చిన్న సంస్థ. ఈజీగా ఓ 30మంది ఉద్యోగులు ఉంటారు. కస్టమర్ల బకాయిలు, ఇన్వాయిస్లు, పేమెంట్స్ వ్యవహారాల్ని చూసుకునేందుకు ఉద్యోగి కావాలి. కోవిడ్ వల్ల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే అన్నీ తానై నడిపిస్తున్నాడు రమేష్. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే 20 రోజులు ముందునుంచే పనులన్నీ మానుకొని అకౌంట్స్ చెక్ చేసుకుంటున్నాడు. అదే సయమంలో రమేష్ ఓ సాఫ్ట్వేర్, లేదంటే కంపెనీ ఉంటే బాగుంటుందని అనుకోని సందర్భంలేదు. అదిగో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకే పుట్టుకొచ్చిందే ఫిన్‌టెక్ సంస్థ రికార్డెంట్. ఈ స్టార్టప్‌లో మనదేశంతో పాటు ఇతర ఏంజెల్ ఇన్వెస్టర్ల నుండి $400,000 సేకరించింది. ఆ ఫండింగ్‌తో ప్రణాళికలకు అనుగుణంగా, వ్యాపారాలకు ఫైనాన్సింగ్ అందించడం, ఇన్వాయిస్లను అందించేలా పనిచేస్తుంది. 50పైగా చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పనిచేస్తుంది. కస్టమర్ల నుంచి బకాయిల్ని వసూలు చేయడం, క్రెడిట్ రిస్క్‌ని తగ్గిస్తుంది. 11,000 వ్యాపార సంస్థలకు 50 వేలకుపైగా కస్టమర్లకు రూ. 2,500 కోట్లకుపైగా మంజూరు చేసింది. 2021లో ప్లాట్‌ఫారమ్ 220% వృద్ధిని నమోదు చేసింది. వచ్చే ఏడాది నాటికి తన నెట్ వర్క్‌ను విస్తరించే పనిలో పడింది. -
పది నిమిషాల్లోపే డెలివరీ! లేకుంటే..
Zepto Grocery Deliver App Founders Inspirational Success Story: వయసు 19 ఏళ్లు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఉన్నత విద్యాలయం చదువుల్ని పక్కనపెట్టి.. ఒకే లక్క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేవలం పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే యాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తద్వారా గ్రోఫర్స్, డుంజో, స్విగ్గీలాంటి సర్వీసులతో పోటీ పడుతున్నారు. అయితే ఇంత చిన్నవయసులో దాపు 450 కోట్ల పెట్టుబడి ఎలా సమీకరించుకోగలిగారు?.. మార్కెట్లో దాని విలువను 2 వేల కోట్లకుపైగా(ప్రస్తుతం) ఎలా చేర్చగలిగారు?.. అదెలాగో.. జెప్టో యాప్ కథ చదివితే తెలుస్తుంది. ముంబై బేస్డ్గా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది జెప్టో యాప్. డెలివరీ యాప్ స్టార్టప్‌లో ఇప్పుడు ఇదొక సంచలనం. బచ్పన్ దోస్తులైన ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా.. ఇద్దరు కుర్రాళ్లు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. లొకేషన్‌ను బట్టి ETA(ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ ఎరైవల్) కేవలం 6 నుంచి 7 నిమిషాల్లోనే సరుకుల్ని డెలివరీ చేయిస్తుండడం ఈ యాప్ ప్రత్యేకత. మొత్తం మీద 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ అయ్యేలా చూడడం ఈ యాప్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. మరి ఆ టైంలోపు డెలివరీ చేయకపోతే.. పండ్లు, మాంసం, మందులు, ఇతర కిరాణా సామాన్లు.. జెప్టో యాప్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా సర్వీసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ పది నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే.. సంబంధిత సరుకుల మీద డిస్కౌంట్స్‌తో పాటు, ఇతరత్ర ఇన్సెంటివ్స్ యాప్ యూజర్లకు అందిస్తారు. వాటికి అయ్యే ఖర్చు జెప్టో యాప్ నిర్వాహకులే భరిస్తున్నారు. ఇక ఈ యాప్ ద్వారా జరుగుతున్న డెలివరీలు ప్రస్తుతానికైతే ఛార్జీలు వసూలు చేయడం లేదు. అతిపెద్ద ఛాలెంజ్.. ఈ స్థాయికి చేరుకుంటారని ఏ దశలోనూ అనుకోలేదు పలిచా, వోహ్రాలు. ఈ బాల్య స్నేహితులు కలిసే పెరిగారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోసం ఇద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. యూనివర్సిటీలో ఉండగానే గ్రాసరీ డెలివరీ యాప్‌ను ప్రయోగాత్మకంగా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఆ సరదా ప్రయోగం వర్కవుట్ కావడంతో పర్ఫెక్ట్ మోడల్ కోసం మూడు నెలలు కష్టపడ్డారు. భారత్‌లో డెలివరీ స్టార్టప్‌లకు మంచి గిరాకీ ఉందని గుర్తించి.. కాలేజీ చదువుల్ని పక్కనపెట్టి స్వస్థలానికి చేశారు. క్విక్ డెలివరీ అంటే 45 నిమిషాలనే ఆలోచన ఉందట మొదట వీళ్లిద్దరికీ. కానీ, ఒపినీయన్ సర్వేలో జనాలు 10-15 నిమిషాలు అనేసరికి.. భయం భయంగానే యాప్‌ను మొదలుపెట్టారు. అంత తక్కువ టైంలో యాక్సిడెంట్లు కాకుండా రైడర్లు డెలివరీ చేయడం మరో పెద్ద టాస్క్. అదే టైంలో డెలివరీకి తగ్గట్లు లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా రిస్క్ తీసుకోకుండా యాప్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నారు. ఇన్వెస్టర్లను మెప్పించి.. యాప్ మార్కెట్లోకి తేవడానికి వీళ్లిద్దరూ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ముందు తమ సర్వీస్ వేగాన్ని ఇన్వెస్టర్లకే రుచి చూపించారు వీళ్లు. అలా ఆర్నేళ్లపాటు కష్టపడి 450 కోట్ల రూపాయల పెట్టుబడి సమీకరణతో జెప్టోను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ విలువ 200-300 మిలియన్ డాలర్లుగా ఉంది(రెండు వేల కోట్లరూపాయలకుపైనే). వై కాంబినేటర్, గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్‌తో పాటు ఇన్వెస్టర్లు లాచీ గ్రూమ్, నీరజ్అరోరా పెట్టుబడులు ఉన్నాయి జెప్టో స్టార్టప్‌లో. టాలెంట్‌కి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చని, విజయం అందుకోవాలంటే అమితమైన ఆత్మవిశ్వాసమూ, నమ్మకమూ, కెరీర్లో ముందడుగు వేసే ధైర్యమూ ఉండాలని చెబుతోంది ఈ ఇద్దరి మిత్రుల సక్సెస్ కథ. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఇండియాలో ఫ్లైయింగ్ కారు... వచ్చేది ఎప్పుడంటే ?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంటే అందుకు భిన్నంగా ఏకంగా ఆకాశంలో ఎగిరే కారు తయారీలో బిజీగా ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు. అందులో ఇండియాకి చెందిన ఓ కంపెనీ అయితే అక్టోబరులో తమ తొలి మోడల్ కారును ప్రదర్శనకు సిద్ధం చేస్తోంది. అక్టోబరు 5 కల్లా సిద్ధం చెన్నై బేస్డ్ వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ ఎగిరే కార్ల తయారీలో మరో కీలక ఘట్టాన్ని దాటేసింది. ఎగిరే కారు కాన్సెప్టుకు సంబంధించి పూర్తి డిజైన్ని పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకూలిస్తే 2021 అక్టోబరు 5న లండన్‌లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్లో ఈ కారు దర్శనం ఇవ్వనుంది. ఇద్దరు ప్యాసింజర్లు వినత ఎయిరో మొబిలిటీ రూపొందిస్తోన్న ఫ్లైయింగ్ కారు బరువు 1100 కేజీలు ఉంటుంది. మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్‌గా టేకాఫ్ ల్యాండింగ్ అవడం ఈ ఫ్లైయింగ్ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నారు. కారు ఎగిరేందుకు బయో ప్యూయల్ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీని కూడా వాడుకుంటుంది. 3,000 అడుగుల వరకు ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్ క్వాడ రోటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారు ప్యానెల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్క సారి ఫ్యూయల్ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఫస్ట్ ఏషియన్ ఇప్పటి వరకు ఫ్లైయింగ్ కార్లకు సంబంధించి యూరప్, అమెరికా కంపెనీలదే పై చేయిగా ఉంది. ఏషియా నుంచి హ్యుందాయ్ సంస్థ కూడా ఫ్లైయింగ్ కారు టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. అయితే డిజైన్ పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రోటోటైప్ సిద్ధం చేసిన మొదటి ఏషియా కంపెనీగా రికార్డు సృష్టించేందుకు వినత సిద్ధమవుతోంది. -
యూపీఎస్సి అభ్యర్ధులకు ఉచిత కోర్సులు..
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపధ్యంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్సి) పరీక్షల కోసం ప్రిపేరవుతున్న విద్యార్ధులకు ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ యుఫేబర్ చేయూతని అందిస్తోంది. దీనిలో భాగంగా దాదాపు 5 వేల మందికి ఉచితంగా కోర్సులను అందించనుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌తో పాటు నిపుణులతో కౌన్సిలింగ్, దఫాల వారీ టెస్టులు.. వీటన్నింటితో మేళవించిన తమ యుపీఎస్సీ ప్రిలిమ్స్ కోర్సులకు సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా వీరికి శిక్షణ అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలచినవారు యూపీఎస్సీ పాఠశాల డాట్‌కామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. -
అటు ఓలా స్కూటర్... ఇటు ఓల్ట్రో సైకిల్...
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్లో ఓల్ట్రో దూసుకొస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్ ఓల్ట్రో. ఓల్ట్రో ఓల్ట్రో స్టార్టప్ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ నుంచి ఓల్ట్రాన్ పేరుతో ఇ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్ని డిజైన్ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ ఓల్ట్రో సైకిల్లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సగటున ఒక యూనిట్ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ధర ఎంతంటే ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్‌పై వన్ ఇయర్ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్‌గడ్‌లో ఈ సంస్థకు సైకిల్ తయారీ యూనిట్ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది. వారంటీ సైకిల్‌కి సంబంధించిన కంట్రోలర్, మోటార్లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్‌నే రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్ రిపేర్ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. -
మస్క్ కాస్కో.. టెస్లాకు పోటీగా ఇండియన్ కార్
రౌద్రం, రణం, రుధిరం సింపుల్‌గా ఆర్ఆర్ఆర్ భారతీయ మూవీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మీన్ మెటల్ మోటార్ సింపుల్‌గా ఎంఎంఎం. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తాజాగా ఆసక్తి రేపిన స్టార్టప్. ఫస్ట్ ఇండియన్ సూపర్ కార్ తెస్తామంటూ రూట్‌మ్యాప్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన టెస్లాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శర్‌తక్‌పాల్. టెస్లా ఎస్ ప్లెయిడ్ 3ని మించిన ఫీచర్లతో కారు తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. టెస్లాకు సవాల్ విసిరాడు. సాక్షి, వెబ్‌డెస్క్: రెండు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకునే నేర్పు... గరిష్ట వేగం గంటకి 350 కిలోమీటర్లు.... 100 హార్స్ పవర్ కలిగిన శక్తివంతమైన ఇంజన్.... ఒక్క సారి రీఛార్జీ చేస్తే చాలు 700 కి.మీల ప్రయాణం చేయగల సామర్థ్యం, .. ఇవన్నీ చదువుతుంటే టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ 3 ఎలక్ట్రిక్ కారు గుర్తొస్తుందా.. కానీ ఇది ఎస్ ప్లెయిడ్ కాదు ఎంఎంఎం అజానీ ఎలక్ట్రిక్ కారు. తయారు చేస్తోంది ఏ విదేశీ కంపెనీయో కాదు పక్కా భారతీయ సంస్థ. దాని ఓనర్ శర్‌తక్‌పాల్. ఇండియా వర్సెస్ టెస్లా భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువని, వాటిని తగ్గిస్తే ఇండియాలో టెస్లా ఈవీ కార్లనె తెస్తామంటూ టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. దీనికి ప్రతిగా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ గురించి ఆలోచిస్తామంటూ భారత ప్రభుత్వం ఫీలర్ వదిలింది. మరోవైపు ఈవీ వెహికల్స్ తయారు చేసే సత్తా భారతీయులకు ఉందంటూ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అధినేత భవీష్ అగర్వాల్ స్పందించారు. టెస్లాకి సవాల్ ఈవీ వాహనాలు.. ఎలన్‌మస్క్... భారత్‌ల మధ్య రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ఎలన్‌మస్క్‌కు షాక్ ఇచ్చే న్యూస్ మరో భారతీయుడైన శర్‌తక్‌పాల్ నుంచి వచ్చింది. ఎలన్‌మస్క్ తనకు ఆదర్శమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టెస్లా ఓ బ్రాండ్ అని.. కానీ తాము బ్రాండ్ కిల్లర్ అంటూ సవాల్‌కు సై అన్నాడు. త్వరలో తన కంపెనీ నుంచి రాబోతున్న సూపర్ ఎలక్ట్రిక్ కారు విశేషాలను తెలియజేశాడు. భారత సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఎంఎంఎం మీన్ మెటల్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్‌గా ఎంఎంఎం. ఈ స్టార్టప్‌ని ముగ్గురు మిత్రులతో కలిసి 19 ఏళ్ల శర్‌తక్‌పాల్ 2012లో నెలకొల్పాడు. ఆ తర్వాత 2014లోనే భవిష్యత్తును అంచనా వేసి అజానీ అనే బ్రాండ్ నేమ్‌తో ఇండియన్ మేడ్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని ఎంఎంఎ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టార్టప్‌లో శ్రమిస్తున్న వారి సంఖ్య నాలుగు నుంచి ఇరవైరెండుకి పెరగగా.... ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్టు చివరి చేరుకుంది. త్వరలోనే అజానీ కారుతో సంచలనాలు సృష్టిస్తామంటూ తమ మార్కెట్ స్ట్రాటజీని ఇటీవల ఎంఎంఎ వెల్లడించింది. ఎంఎంఎం అజానీ ఎంఎఎం ప్రైవేట్ లిమిలెడ్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారుగా వస్తోన్న అజానీ గరిష్ట వేగం గంటలకు 350 కిలోమీటర్లు, ఇందులో అమర్చిన 120 కిలోవాట్ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు స్పీడ్ మోడ్‌లను బట్టి కనిష్టంగా 550 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 986 బ్రేక్‌హార్స్ పవర్ ఇంజన్‌తో కేవలం రెండు సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగల నేర్పు దీని స్వంతం. మార్కెట్లో హల్చల్ చేస్తోన్న స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కారుని డిజైన్ ఉంటుంది. కంపెనీ రిలీజ్ చేసిన ఫోటోలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మార్కెట్‌కి వచ్చేది అప్పుడే అజానీ కారు 2022 ద్వితియార్థంలో అజానీ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఎంఎంఎం ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. అనంతరం 2023 ప్రారంభంలో యూకేలో ఈ కారుని ఫస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి ఏడాది యూఏఈలో అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతిన తర్వాత 2025లో ఇండియాకు అజానీని తీసుకువస్తామని చెబుతున్నారు. ఇండియాలో ఈ కారు ధర ఇండియాలో కనిష్టంగా 89 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అన్నింటా భిన్నమే ప్రస్తుతం కార్ మాన్యుఫ్యాక్లరింగ్ యూనిట్లో ఐదో వంతు ఉండే యూనిట్‌తోనే అజానీ కార్లు తయారు చేయబోతున్నట్టు ఎంఎంఎం ప్రకటించింది. ఈ మేరకు కారు ఎయిరోడైనమిక్స్, రీసెచ్చ్ అండ్ డెవలప్మెంట్లకు సంబంధించి ఎంఎంఎం టీమ్ సభ్యులు అమెరికా, జర్మనీలకు చెందిన ఇంజనీర్లతో కలసికట్టుగా పని చేస్తున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నారు. రెండేళ్లలో మార్పు ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇటు ప్రభుత్వం, అటు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. మౌలిక సదుపాయల కొరత ఎక్కువని ఎంఎంఎం సీఈవో శర్‌తక్‌పాల్ అంటున్నారు. రెండేళ్లలో ఈ సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించి పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియా వెనుకబడి ఉందని, అజానీ రాకతో ఈ పరిస్థితులో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.