supari
-
సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి
జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్‌లోని డబుల్ బెడ్రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు. కల్పనకు మన్సాన్పల్లికి చెందిన మస్కూరి మహేశ్‌తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్‌కి వివరించింది. దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు. హత్య జరిగిందిలా.. వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
కోటి సుపారీ: ‘హత్యకు కుట్ర.. అతనిపైనే అనుమానం’
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్‌రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు. బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్‌రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్‌రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు -
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్‌తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్‌డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే...
ఆమె... ఆరుగురు పిల్లల తల్లి. భర్త దుబాయ్ వెళ్లడంతో మరొకనితో సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక ఎవరూ ఊహించనంతటి ఘోరానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా లాఢ్‌పుర్ గ్రామంలో చేపల విక్రేత మొహమ్మద్ మియా గత మే22న హత్యకు గురయ్యాడు. పోలీసుల దర్యాప్తులో పలు విస్తుగొలిపే వివరాలు వెల్లడయ్యాయి.ఈ ఉదంతంలో మృతుని భార్య నూర్జహాన్ ఖాతూన్, ఆమె ప్రియుడు నౌషద్ ఆలం నిందితులుగా తేలింది. వీరిద్దరూ సుపారీ కిల్లర్ సాయంతో ఈ హత్య చేయించినట్లు వెల్లడయ్యింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.7,500 నగదు, ఒక తుపాకీ, 3 బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోను, బైకు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ మియా భార్య నూర్జహాన్ ఖాతూన్..నౌషద్ ఆలంతో వివాహేతర సంబంధం కలిగివుంది. ఇది తెలిసిన మొహమ్మద్ తన భార్యను కొడుతుండేవాడు. ఈ నేపధ్యంలోనే నూర్జహాన్, ఆమె ప్రియుడు నౌషద్ కలిసి, ఇద్దరు సుపారీ కిల్లర్ల సాయంతో మొహమ్మద్ మియాను హత్య చేయించారు. పోలీసులు సుపారీ కిల్లర్ మన్సూర్ ఆలం, పర్వేజ్ ఆలంలను ప్రశ్నించగా ఆరుగురు పిల్లలకు తల్లి అయిన నూర్జహాన్ రూ.50 వేలు తమకు ఇచ్చి, ఆమె భర్త మొహమ్మద్ మియాను హత్య చేయించేందుకు పురిగొల్పిందన్నారు.ఈ సొమ్ములోని రూ. 28 వేలతో ఒక తుపాకీ, 4 బుల్లెట్లు కొనుగోలు చేశామన్నారు. ఘటన జరిగినరోజు రాత్రి నూర్జహాన్ మొబైల్ ఫోనులో హత్య ఎలా చేయాలో తెలియజేసిందన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేపల విక్రేత మొహమ్మద్ మియా ఆరోజు ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. ఇంతలో అతని భార్య నూర్జహాన్ సుపారీ కిల్లర్లకు ఫోను చేసి హత్యకు పురమాయించింది. కాగా మొహమ్మద్ మియా గతంలో కొంతకాలం దుబాయ్‌లో ఉండి ఇంటికి తిరిగివచ్చాడు.ఈ సమయంలోనే అతని భార్య నూర్జహాన్.. నౌషద్‌తో సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం గత 21 ఏళ్లుగా సాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా నిందితురాలు నూర్జహాన్ పోలీసుల దర్యాప్తులో తన భర్త తనను సరిగా చూడటం లేదని తెలిపింది. తరచూ కొడుతుంటాడని ఆరోపించింది. ఇకపై తాను తన ఆరుగురు పిల్లలతో పాటు తన ప్రియుడు నౌషద్ దగ్గరే ఉంటానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కసాయి కొడుకు..తండ్రి హత్యకు రూ. కోటి సుపారీ
సాక్షి, కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఓ కొడుకు కిరాయి హంతకులతో కలిసి తండ్రి హత్యకు ఏకంగా రూ.కోటి సుపారీ ఇచ్చాడు. ఈ ఘటనలో కుమారుడితో పాటు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 13న నారాయణస్వామి (70) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు విచారణ చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. నారాయణస్వామి కుమారుడు మణికంఠ తండ్రిని హత్య చేయాలని కిరాయి హంతకులకు రూ. కోటి ఒప్పందం చేసుకున్నాడు. నారాయణ స్వామిని కిరాయి మనుషులు మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో దారుణంగా నరికి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికంఠతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది. (చదవండి: కిడ్నీ అమ్ముతా.. కొంటారా?) -
రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర..
కోరుట్ల: ఆర్థిక లావాదేవీలు.. వృత్తిపరమైన పోటీని తట్టుకోలేక ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి సహా నలుగురు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి 2 కార్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ధనకంటి సంపత్(35) ఆర్ఎంపీగా పనిచేసూ్తనే చిట్టీలు, ఫర్నీచర్ షాపు నిర్వహించేవాడు. సంపత్ సొంత బావమరిది, రాయికల్‌కు చెందిన సంకోజి విష్ణువర్ధన్(32) తన బావమరిది అజయ్(28)తో కలిసి చిట్టీలు, ఫర్నీచర్ షాపు నడపడంలో సంపత్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. ఫర్నీచర్ షాపు, చిట్టీల వ్యవహరంలో సంపత్‌కు అతడి బావమరిది విష్ణువర్ధన్, అజయ్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వీటితోపాటు తన కుటుంబంలో విష్ణువర్ధన్ తరచూ జోక్యం చేసుకోవడం సంపత్‌కు కంటగింపుగా మారిది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌తోపాటు అజయ్‌ను అడ్డుతొలగిస్తే అత్తగారి ఆస్తి మొత్తం తనకు కలిసివస్తుందన్న దురాశ సంపత్లో కలిగింది. రెండేళ్ల క్రితం విష్ణువర్ధన్ అనారోగ్యానికి గురికాగా, సంపత్ వైద్యం అందించి కావాలని ఓవర్‌డోస్ ఇంజక్షన్లు ఇచ్చి హత్యకు యత్నించాడు. ఆ తర్వాత విష్ణువర్ధన్ కోలుకోగా తన ప్రయత్నం ఫలించలేదని భావించిన సంపత్.. నాలుగు నెలల క్రితం ఓ హత్యాయత్నం కేసులో నిందితుడైన పైడిమడుగు గ్రామానికి చెందిన క్యాతం శేఖర్(26)ను కలిసి విష్ణువర్ధన్, అజయ్‌తోపాటు వృత్తిలో పోటీగా ఉన్న పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్‌ను హత్య చేయడానికి తనకు సహకరించాలని కోరాడు. రూ.14లక్షల సుపారీకి ఒప్పందం.. క్యాతం శేఖర్ పైడిమడుగుకు చెందిన మేదిని శ్రీకాంత్(28), కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు(40), ఆకుల అశోక్‌తో కలిసి విష్ణువర్ధన్, అజయ్, రాజేందర్‌ను చంపడానికి రూ.14 లక్షల సుపారీకి సంపత్తో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రాజేందర్‌ను చంపితే రూ.4లక్షలు, తర్వాత విష్ణువర్ధన్, అజయ్‌ను చంపితే మిగిలిన రూ.10 లక్షలు ఇస్తానని సంపత్తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బులు చెల్లించడంలో సంపత్ జాప్యం చేశాడు. డిసెంబర్ 5వ తేదీన సంపత్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆకుల అశోక్, మేదిని శ్రీకాంత్.. హత్య కుట్రలో ఒకరైన పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బయటకు పిలిచారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో ఇరుగుపొరు రావడంతో అశోక్, శ్రీకాంత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆర్ఎంపీ రాజేందర్, సంకోజి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్సైలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, సుధీర్‌రావు, రాంచంద్రం.. సుపారీ ఒప్పందం చేసుకుని హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, మేదిని శ్రీకాంత్, ఆకుల అశోక్, విత్తనాల నాగరాజు, క్యాతం శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరి హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, సుపారీ గ్యాంగ్ సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్పోన్లు స్వా«ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులకు రివార్డు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ వివరించారు. చదవండి: భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు.. -
తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ
సాక్షి, హుజూర్నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు. మూడోసారి.. సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ఆధారంగా... ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు. -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
దారుణం.. కూతుర్ని చంపమని సుపారీ ఇచ్చిన తండ్రి..
లక్నో: కన్నతండ్రే కూతురి పాలిట విలన్‌గా మారాడు. ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి మందలించాడు. అతడ్ని దూరం పెట్టమని పదే పదే హెచ్చరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కిరాతక ఆలోచన చేశాడు. తన కుమార్తెను చంపమని హాస్పిటల్లో వార్డు బాయ్‌కి రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. దీంతో అతడు ఆమెకు పోటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. ఫలితంగా యువతి తీవ్ర అనారోగ్యం పాలైంది. తండ్రితో పాటు వార్డు బాయ్, అతనికి సహకరించిన ఆస్పత్రిలో ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కూతురు ప్రేమలో ఉందని తెలిసి నవీన్ కుమార్ అనే తండ్రి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తాను చెప్పినా వినడం లేదని ఆమెను హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి ఆనారోగ్యంపాలైందని శుక్రవారం రాత్రి మొరాదాబాద్ జిల్లా కంకర్ఖేడాలోని ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమెను ఫ్యూచర్ ఆస్పత్రికి మార్చాడు. కానీ కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పొటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వార్డు బాయ్‌గా పనిచేసే నరేశ్ కుమార్ యువతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతడికి ఓ మహిళా ఉద్యోగి సహకరించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు యువతి తండ్రితో పాటు వార్డు బాయ్ నరేశ్ కుమార్, మహిళా ఉద్యోగిని అరెస్టు చేశారు. నరేశ్ నుంచి రూ.90వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణతో తండ్రి నేరం అంగీకరించాడు. అంతేకాదు తన కూతురు కోతులను చూసి భయపడిందని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని, కానీ నిజానికి ఆమె ఇంటిపై నుంచి దూకిందని వెల్లడించాడు. చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
ఆస్తి పంచాయితీ.. రూ.50 వేలు సుపారీ ఇచ్చి సొంత తమ్ముడినే..
యశవంతపుర: అక్క సొంత తమ్మున్ని హత్య చేయించిన ఘటన కలబురిగిలో జరిగింది. నగరంలోని గాజీపూర లేఔట్‌కు చెందిన నాగరాజ్ మటమారి జులై 28న కలబురిగి నగరం నుండి ఆళంద వెళ్తూ మార్గమధ్యలో కెరెభూసగా గ్రామం వద్ద శవమై తేలాడు. దుండగులు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆస్తి కలహాలతో నాగరాజ్ అక్క సునీత రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయిందని చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్‌ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే. భార్య ప్రియుడైన యశ్వంత్‌తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి యశ్వంత్ తో పాటు ఆమె ప్రియుడ్ని చంపించాడు భర్త శ్రీనివాస్. భార్య కళ్ల ముందే యశ్వంత్‌ను దారుణంగా హతమార్చిన భర్త.. అక్కడితో ఆగలేదు. తనను చంపొద్దని బతిమాలినా భార్య జ్యోతిని సైతం వదలకుండా హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆపై శవాలను అక్కడే పడేసి సుపారీ గ్యాంగ్‌తో పాటు వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి.. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా ఇద్దరినీ హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వార్త: యశ్వంత్-జ్యోతి వివాహేతర సంబంధం భరించలేక.. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు
సాక్షి హైదరాబాద్: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడలో చోటు చేసుకున్న రియల్టర్ల జంట హత్యలు కిరాయి హంతకుల పనిగా తేలింది. ఇలాంటి ఉదంతాలు రాజధానిలో అనేకం వెలుగు చూస్తున్నాయి. హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని తీసుకునే మెుత్తాన్ని సుపారీ అంటారు. ఇది ముంబై మాఫియా సామ్రాజ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పదం. అక్కడ కిరాయి హత్య చేయడానికి సిద్ధమైన వ్యక్తికి డబ్బుతో పాటు ఓ సుపారీ ఇస్తారు. అందుకే కిరాయి హత్యలు సుపారీలు ప్రాచుర్యం పొందాయి. హత్యలకు సుపారీ తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కిరాయి హంతకులు కొన్ని రోజులు ఆశ్రయం పొందుతున్నారు. దీనికో సం హోటళ్లు, లాడ్జిల్ని ఆశ్రయిస్తున్నారు. అక్కడి నుంచే రెక్కీ, పథక రచన, దానిని అమలు చేస్తున్నా రు. తమ టార్గెట్ కదలికల్ని గమనించడానికి వారి ఇల్లు, వ్యాపార ప్రదేశాలకు సమీపంలో ఉన్న లా డ్జిల్లో హంతక ముఠాలు దిగుతున్నాయి. ఆపై అదు ను చూసుకుని తెగబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జిలను ఆ స్టేషన్ సిబ్బంది రాత్రిపూట తనిఖీ చేయాలి. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా వా టిపై నిఘా ఉంచాలి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి ఇది ఎంతో అవసరం. నిఘా ప్రక్రియ మెుక్కుబడిగా సాగడంతో అనేక కేసుల్లో ఏదైనా ఉదంతం జరిగిన అనంతరమే పోలీసులు గుర్తించగలుగుతున్నారు. ఒకసారి కిరాయి హత్యకు పాల్పడిన, కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు ఆపై చేతులు దులుపుకుంటున్నారు. ఆ నేర గాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? అనే అంశాల్ని అవసరమైన స్థాయిలో పర్యవేక్షించడం లేదు. చైన్ స్నాచర్, పిక్ పాకెటర్‌పై ఉన్న నిఘా కూడా వీరిపై ఉండట్లేదు. అందుకు అవసరమైన సిబ్బంది, నిఘా యంత్రాంగం కూడా అందుబాటులో లేదు. వారిపై నిఘా కొరవడినందుకే నేరం జరిగిన తరవాతే పట్టుబడుతున్నారు. అరుదైన సందర్భాల్లోనే నేరం చేయడానికి ముందు దొరుకుతున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులకు బందోబస్తులు, రోటీన్ డ్యూటీల మినహా మిగిలిన వ్యవహారాలు చూడటం కష్టసాధ్యంగా మారిపోవడం సైతం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ కిరాయి హంతకులు ఎక్కువగా నాటు తుపాకులనే వాడుతున్నారు. వీరికి ఈ ఆయుధాలన్నీ ప్రధానంగా ఉత్తరాది నుంచి వచ్చి చేరుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కొన్ని చోట్ల నాటు తుపాకులు, కత్తులు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి విక్రయించే ముఠాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో వ్యవస్థీకృతంగా కిరాయి హత్యలు చేసే వాళ్లు అరుదు. ఈ నేపథ్యంలోనే పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి పని పూర్తి చేసుకువెళ్లే ఎక్కువగా ఉంటున్నారు. (చదవండి: మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్) -
రమ పథకం బెడిసికొట్టింది.. అసలు ఏం జరిగిందంటే..?
Warangal: ఎదురెదురుగా ఉన్న చిరు దుకాణాల వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోటీగా ఉన్న దుకాణాదారున్ని ఎలాగైన దెబ్బతీయాలనే ఉద్దేశంతో మహిళ ప్లాన్ చేసింది. వరంగల్‌కు చెందిన ఐదుగురికి రూ. 25వేలు ఇచ్చి సుపారికి ప్లాన్ చేసి దుకాణదారున్ని కొట్టి బెదిరించడానికి వచ్చి గొడవ జరుగగా ప్లాన్ బెడిసి కొట్టి సుపారి గ్యాంగ్‌లో ఒకరు దుకాణాదారు చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. మహదేవపూర్ సీఐ కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాళేశ్వరంలో ఎదురెదురుగా ఉన్న చిరు దుకాణదారులు వంగల శ్రీనివాస్, చల్ల రమలు ఒకరిపై ఒకరు కస్టమర్ల విషయంలో ద్వేషం పెంచుకున్నారు. దీంతో 20 రోజులు కిందట ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్‌ను దెబ్బతీసి కొట్టించాలని రమ పథకం వేసింది. దీంతో తనకు పరిచయమున్న వరంగల్‌కు చెందిన వంశీని ఆశ్రయించింది. రూ. 25వేలు అతనికి ఇచ్చి శ్రీనివాస్‌ను కొట్టి, భయపెట్టాలని చెప్పింది. వంశీ స్నేహితులైన వంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన ఎండీ అస్లాం, ఎస్కే వాసీమోద్దీన్, ఎండీ అల్తాఫ్, వెంకట్‌లను ఈ నెల 6 గురువారం కాళేశ్వరానికి రప్పించారు. అక్కడ పీకల్లోతు మద్యం సేవించారు. తర్వాత శ్రీనివాస్ దుకాణం వద్దకు రాత్రి వెళ్లి సిగరెట్ ధర విషయంలో గొడవకు దిగారు. దీంతో శ్రీనివాస్‌ను ముందుగా వీరు గ్యాస్‌స్టవ్‌తో కొట్టారు. అనంతరం అతని భార్య కస్తూరితో కలిసి ఇద్దరూ ఆ నలుగురు వ్యక్తులపై ఎదురు దాడి చేశారు. అందులో సాయితేజ అనే యువకున్ని గ్యాస్‌స్టవ్‌తో తలపై మోదగా అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, శ్రీనివాస్, అతని భార్య కస్తూరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎదురుగా ఉన్న దుకాణందారుతో తమకు గొడవలు ఉన్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న దుకాణందారు చల్ల రమను అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు బయటపడినట్లు సీఐ కిరణ్, ఎస్సై లక్ష్మణ్‌రావులు పేర్కొన్నారు. గొడవతో పాటు హత్య కేసులో ఉన్న భార్యభర్తలు, సుపారి గ్యాంగ్ ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. -
షాకింగ్: కన్న తండ్రి హత్యకు కొడుకు సుపారీ..
సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): ఈనెల 14న జోడీబిసలహళ్లిలో హత్యకు గురైన బిఎస్ శ్రీనివాసమూర్తి (59) కేసును పోలీసులు ఛేదించారు. రాత్రివేళ పొలంలో ఉన్న సమయంలో ఈయన హత్యకు గురయ్యాడు. వివరాలు... ఎస్ శ్రీనివాసమూర్తి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు. వ్యాపార అవసరాల కోసం పలుచోట్ల భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చాలని తరచూ వడ్డీ వ్యాపారస్తులు ఒత్తిడి తెచ్చేవారు. దీంతో శ్రీనివాసమూర్తి కుమారుడు రవికుమార్ ఈ అవమానాలను భరించలేక తండ్రిని హత్య చేయడానికి జోడీబిసలహళ్లికి చెందిన రంగనాథ్‌తో ఒప్పందం చేసుకుని రూ. 30 వేలు అడ్వాన్సు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.కోటి టోకరా.. -
సుపారీ: ఒక్క హత్యకు రూ.6 లక్షలు!
‘నిన్ను ఎక్కడో చూసినట్టుందే!’ బార్‌లోని ఏసీ సెక్షన్లోకి వెళ్లడంతోనే లోపల ఒంటరిగా కూర్చున్న ఒక వ్యక్తి వంక పరీక్షగా చూస్తూ అన్నాడు ప్రకాశ్. ఆ మాట విన్న ఆ వ్యక్తి నర్మగర్భంగా నవ్వుతూ ‘మీవంటి ధనవంతులకు సేవలందిస్తుంటాను. ఆ సందర్భంలో ఎక్కడో చూసి ఉంటారు నన్ను’ చెప్పాడు. అతని ముందు కూర్చుంటూ అడిగాడు ప్రశాశ్ ‘నువ్వు అందిస్తున్న సేవలు ఎలాంటివో?’ అంటూ. ‘హత్యలు’ కూల్‌గా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాట విన్న ప్రకాశ్ ఉలిక్కిపడ్డాడు. కంగారుగా అటూ ఇటూ చూశాడు. అది ఉదయం పదకొండు గంటల సమయం కావడంతో బార్లో బొత్తిగా జనం లేరు. తమ మాటలను వినేవారెవరూ లేరని గ్రహించాక ‘నీ పేరేంటి?’ అని అతణ్ణి అడిగాడు ప్రకాశ్. ‘నా పేరు మారుతూ ఉంటుంది.. ప్రస్తుతానికైతే నేను రాజును’ చెప్పాడు అతను. ప్రకాశ్ ఆత్రంగా ముందుకు వంగి స్వరం బాగా తగ్గించి అడిగాడు ‘నా కోసం ఒక హత్య చేస్తావా?’ అంటూ. మళ్లీ నవ్వాడు రాజు. అర్థం కానట్టుగా చూశాడు ప్రకాశ్. అర్థమయ్యేలా చెప్పాడు రాజు ‘నేను ఎవరి కోసమూ హత్యలు చేయను. కేవలం డబ్బు కోసమే చేస్తాను’ అని. ‘ఓకే.. ఎంత కావాలో చెప్పు?’ అన్నాడు ప్రకాశ్. ‘ఎవరిని చంపాలి? ఎలా చంపాలి? ఆ పనిలో ఉన్న రిస్క్ ఎంత? అనే దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తా’ చెప్పాడు నింపాదిగా. ‘ఇందులో రిస్క్ చాలా తక్కువ. చంపవలసిన వ్యక్తి గొప్పవాడేమీ కాదు. అతని పేరు వినోద్. ఓ విలేఖరి. గాంధీనగర్‌లోని చర్చి ఎదురుగా ఉన్న ప్రియా అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో ఉంటాడు. మూడు రోజుల కిందటే అతని భార్య, పిల్లలు బంధువుల పెళ్లికి వెళ్లారు. ప్రస్తుతం వినోద్ ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. ఇంకో విషయం.. ఆ రెండో అంతస్తులో వినోద్ ఫ్లాట్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి అతణ్ణి పట్టపగలు చంపినా ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. అతణ్ణి చంపి ఇంట్లో దోపిడీ జరిగినట్టు వాతావరణం సృష్టిస్తే చాలు... దోపిడీ కోసం జరిగిన హత్యనే అనుకుంటారు పోలీసులు’ వివరించాడు ప్రకాశ్. ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు రాజు ‘మామూలుగా నేను ఒక హత్యకు పది లక్షలు తీసుకుంటాను. ఇందులో రిస్క్ తక్కువ కాబట్టి ఎనిమిది లక్షలు ఇవ్వండి’ అని. ‘చాలా ఎక్కువ అడుగుతున్నావ్. ఆరు లక్షలు ఇస్తాను’ స్థిరంగా ఉంది ప్రకాశ్ స్వరం. ‘ఊ...’ అని నసుగుతూ రెండు చేతులతో తల రుద్దుకుంటూ ‘సరే.. కానీ మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేయాలి. పనయ్యాక నేను కన్పించను ’ అన్నాడు రాజు. ‘నేను కోరుకునేదీ అదే. మొత్తం డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను చెప్పిన పని కూడా ఈ రోజే ముగించాలి. ఎందుకంటే రేపు వినోద్ ఫ్యామిలీ తిరిగొచ్చేసిందనుకో.. కష్టం అవుతుంది. నేనూ ఈ మధ్యాహ్నం ఫ్లయిట్‌కి ఢిల్లీ వెళ్లిపోతున్నా. హత్య జరిగిన రోజు నేను ఇక్కడ లేనట్టు ఎలిబీ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి పోలీసులకు నా మీద అనుమానం రాదు’ చెప్పాడు ప్రకాశ్. ‘సరే.. ఆ వినోద్ ఫొటో ఉంటే ఇవ్వండి’ అడిగాడు రాజు. ‘ఉన్న ఒక్క ఫొటో మహేశ్‌కి ఇచ్చేశా. అయినా ఫొటో అక్కర్లేదు. ఎందుకంటే ప్రియా అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో ఉండేది వినోద్ ఒక్కడే. సాయంత్రం ఆరుగంటల కల్లా అతను తన ఫ్లాట్‌కి చేరకుంటాడు. అక్కడే అతణ్ణి చంపాలి. శబ్దాలు వినపడకుండా పని ముగించాలి’ అన్నాడు ప్రకాశ్. ‘డోంట్ వర్రీ. నా దగ్గర సైలెన్సర్ సెట్ చేసిన పిస్తోల్ ఉంది. సైలెంట్‌గానే పని ముగిస్తాను’ ధీమాగా చెప్పాడు రాజు. ప్రకాశ్ తన బ్యాగ్ తెరచి ఆరు లక్షల రూపాయలు రాజుకు ఇచ్చాడు. రాజు ఆ డబ్బును షర్టులో కుక్కుకొని పై నుంచి హుడీ వేసుకొని వెళ్లిపోయాడు. ప్రకాశ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అవినీతి, అక్రమాలతో బాగా డబ్బు సంపాదించాడు. ఈ వ్యవహారంలోనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వినోద్ అతనికి తలనొప్పిగా మారాడు. వినోద్ వల్ల తన గుట్టంతా ఎక్కడ బయటపడు తుందోననే భయం పట్టుకుంది ప్రకాశ్‌కి. డబ్బు ఎర చూపి వినోద్ నోరు మూయించాలని ప్రయత్నించాడు. కానీ వినోద్ లొంగలేదు. అందుకే ఏకంగా అతని హత్యకే ప్లాన్ చేశాడు ప్రకాశ్. రాజు కన్న ముందే మహేశ్ అనే కిల్లర్‌కి సుపారీ ఇచ్చాడు. మూడు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. తీరా పని మొదలుపెట్టే సమయానికి ఒక పాత కేసు విచారణ కోసం మహేశ్‌ను పట్టుకుపోయారు పోలీసులు. అతనెప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఈ లోపు వినోద్ కుటుంబం వచ్చేస్తే అతని మర్డర్ కష్టమవుతుంది. అందుకే వెంటనే ఆ సుపారీని రాజుకి బదలాయించాడు ప్రకాశ్.. ఆలస్యం కాకుండా వినోద్‌ను మట్టుబెట్టేందుకు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే రాజు గాంధీనగర్‌లోని ప్రియా అపార్ట్మెంట్స్ దగ్గరికి చేరుకున్నాడు. తన ముఖం కనపడకుండా కోవిడ్ మాస్క్‌తో పాటు కూలింగ్ గ్లాసెస్ ధరించాడు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. నాలుగు అంతస్తులున్న ప్రియా అపార్ట్మెంట్స్ ఓ పాత బిల్డింగ్. ఒక్కో అంతస్తులో ఒక్కో ఫ్లాట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌కి తాళం వేసి ఉంది. పైకి వెళ్లడానికి ఓ పక్క లిఫ్ట్, మరోపక్క మెట్లు ఉన్నాయి. బిల్డింగ్ కాంపౌండ్‌లో వాచ్మెన్ గాని, సీసీటీవీ కెమెరాలు గానీ లేవు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు రాజు. బిల్డింగ్‌కి కొద్ది దూరంలో నిల్చొని వినోద్ కోసం ఎదురు చూడసాగాడు. అరగంట గడిచాక మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ప్రియా అపార్ట్మెంట్ కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. నేరుగా లిఫ్ట్‌లో పైకి వెళ్లాడు. రాజు వెంటనే ఆ లిఫ్ట్ దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ కనిపించిన నంబర్‌ను బట్టి ఆ వ్యక్తి రెండో అంతస్తుకి వెళ్లాడని అర్థమైంది రాజుకి. దాంతో ఆ వ్యక్తి వినోద్ అని నిర్ధారించుకున్నాడు. మెట్ల గుండా గబగబా రెండో అంతస్తుకి చేరుకున్నాడు రాజు. ఫ్లాట్ ద్వారాన్ని సమీపించి జేబులోంచి సైలెన్సర్ అమర్చిన పిస్తోల్‌ను బయటకు తీశాడు. చిన్నగా తలుపు నెట్టి చూశాడు. లోపల గడియ లేకపోవడంతో తలుపు తెరుచుకుంది. చప్పుడు చేయకుండా లోపలికి నడిచాడు. ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు రాజు. ఇందాకా లిఫ్ట్‌లో పైకి వచ్చిన మాస్క్ వ్యక్తి పిస్తోల్ పట్టుకొని షూట్ చేసేందుకు పొజిషన్లో నిలబడి ఉన్నాడు. రాజును చూడగానే అతను ట్రిగ్గర్ నొక్కేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా అసంకల్పితంగా రాజు చేతిలోని పిస్తోల్ కూడా పేలింది. ఇద్దరూ గురి తప్పలేదు. ఒకరి పిస్తోల్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ మరొకరి గుండెలోకి చొచ్చుకొని పోయింది. ఇద్దరూ ఆర్తనాదాలు చేస్తూ నేలకొరిగి ప్రాణాలు విడిచారు. ‘నిన్న నగరంలోని గాంధీనగర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వినోద్ ఫ్లాట్‌లో ఇద్దరు వ్యక్తులు పిస్తోళ్లతో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు. ఆ సమయంలో వినోద్ ఇంట్లో లేడు. చనిపోయిన ఇద్దరిలో ఒకవ్యక్తిని పాత నేరస్తుడు మహేశ్‌గా గుర్తించారు పోలీసులు. అతనొక సుపారీ కిల్లర్ అని పోలీసుల అనుమానం. ఓ పాతకేసులో విచారణ కోసమని నాలుగు రోజుల కిందటే పోలీసులు అతణ్ణి తీసుకెళ్లారు. కాని సరైన సాక్ష్యాధారాలు లేక నిన్న మధ్యాహ్నం వదిలేశారు. నిన్న సాయంకాలం అతను వినోద్‌ను హతమార్చడానికి ఆ ఫ్లాట్‌కి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వినోద్ ఇంటికి చేరేకంటే ముందే మహేశ్ మారు తాళం చెవితో ఆ ఫ్లాట్‌కు వెళ్లి వినోద్ కోసం కాపు కాశాడు. అంతలోకే మరో అజ్ఞాత వ్యక్తి వినోద్‌ను చంపడానికి అక్కడికి వచ్చాడు. ఒకరిని చూసి మరొకరు వినోద్ అని పొరబడి పిస్తోళ్లు పేల్చి ఉంటారని అనుకుంటున్నారు పోలీసులు. బుల్లెట్లు సూటిగా ఇద్దరి గుండెల్లోకి చొచ్చుకుపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఆ ఇద్దరూ వినోద్‌ను చంపడానికి వచ్చిన సుపారీ కిల్లర్లే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సుపారీ ఇచ్చిన వారి కోసం గాలిస్తున్నారు. నగరంలోని ఓ బార్‌లోని ఏసీ గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాక పోలీసులకు ఓ క్లూ దొరికినట్టు తెలుస్తోంది. దాంతో ఈ హత్య వెనుక గల మిస్టరీని త్వరలో ఛేదిస్తామని పోలీసులు ప్రకటించారు.’ ఢిల్లీలో ఉన్న ప్రకాశ్ టీవీలో వస్తున్న ఈ వార్తను చూడగానే అసహనంతో జుట్టు పీక్కున్నాడు. చదవండి: ఆమె నా భార్య కాదు! -
సోదరుడికి సుపారీ ఇచ్చి.. కొడుకుని చంపించి
సాక్షి, వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి కర్కశంగా ప్రవర్తించింది. తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడని కన్న కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ సంఘటన వికారాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. వికారాబాద్, కోహ్లీ ప్రాంతానికి చెందిన శివప్రసాద్ అనే మైనర్ బాలుడు తాగొచ్చి ప్రతి రోజు తల్లిని వేధింపులకు గురిచేస్తున్నాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేకపోయిన తల్లి అతడ్ని చంపాలని నిశ్చయించుకుంది. సోదరుడితో కలిసి కుమారుడి హత్యకు పథకం రచించింది. ( ‘రంగరాయ’లో దొంగాట) ఇందుకోసం సోదరుడికే సుపారీ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం శివ ప్రసాద్ మేనమామ అతడి గొంతుకు టవల్ బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని నీళ్లులేని బావిలో పూడ్చిపెట్టాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బావిలో శివ ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతుడి తల్లి,మేనమామల విషయం వెలుగుచూసింది. దీంతో వికారాబాద్ పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. -
ఇంటికి రావడం లేదని భర్త కిడ్నాప్!
సాక్షి, బెంగళూరు: భర్త రెండో పెళ్లి చేసుకుని దూరమవడంతో.. ఓ భార్య అతనికి దగ్గరయ్యేందుకు కిడ్నాప్ పథకం రచించింది. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలిచ్చి భర్తను కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సయ్యద్ షేక్, రోమా షేక్ దంపతులు మరథాహళ్లిలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం రత్న కౌతం అనే మహిళను సయ్యద్ రెండోపెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి మొదటి భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. రోమా వద్ద ఉన్న ఆభరణాలు, నగదును కూడా రత్నకు సయ్యద్ ఇచ్చేశాడు. ఎంత చెప్పినా భర్త ప్రవర్తనలో మార్పురాలేదు. సయ్యద్‌ను తన వద్దకు రప్పించుకోవాలని రోమా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ బెడిసికొట్టాయి. చివరికి బలవంతంగానైనా సయ్యద్‌ను ఇంటికి రప్పించాలని ఆమె ప్లాన్ వేసింది. అభిపేక్, భరత్, ప్రకాశ్, చెలువరాజు సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి భర్త కిడ్నాప్‌నకు ఒప్పందం చేసుకుంది. వారికి రెండు లక్షలు ముట్టజెప్పింది. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం సమయంలో సయ్యద్ కూరగాయల కోసం బయటకొచ్చాడు. కారులో వచ్చిన నిందితులు అతన్ని అపహరించారు. అతని రెండో భార్య రత్నకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆమె బాగలగుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నాగమంగళ తాలూకా బీజీఎస్ టోల్ వద్ద నిందితులను అరెస్ట్ చేసి సయ్యద్ షేక్‌ను రక్షించారు. మొదటి భార్య వద్ద ఉన్న డబ్బు, బంగారు నగలను సయ్యద్ తీసుకెళ్లి రెండోభార్యకు ఇచ్చినందువల్లనే అపహరించినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రాణం తీసిన చేప) -
ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇచ్చాడు
జైపూర్ : ఎవరైనా తనకు పగ ఉన్నవారిని లేదా నచ్చని వారిని హత్య చేయించడానికి సుపారీ ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తన హత్యకు తానే సుపారీ చెల్లించాడు. ఎలా చంపాలో స్కెచ్ వేసి మరీ హత్య చేయించుకున్నాడు. అయితే ఇదంతా తన కుటుంబం కోసమే చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తోచక హత్య చేయించుకున్నాడు. తాను చనిపోతే తన పేరు మీద ఉన్న రూ.50 లక్షల బీమా డబ్బులతో తన కుటుంబం కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుందని భావించి ఆ వ్యక్తి ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని భిల్వారాకు చెందిన బాల్బీర్ వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకోసం భారీ వడ్డీకి రూ.20 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. గత ఆరు నెలల నుంచి ఆ కుటుంబ పరిస్థితి అత్యంత అద్వాన్నంగా తయారైంది. దీంతో తాను తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయాడు. దిక్కుతోచని స్థితిలో తనను హత్య చేయించుకుంటే తన కుటుంబం బాగుపడుతుందని ఆలోచించాడు. తాను చనిపోతే తన పేరు మీద ఉన్న రూ.50లక్షల వ్యక్తిగత బీమా కుటుంబానికి అందుతుందని, దీంతో తన అప్పులన్నీ తీరిపోతాయనుకున్నాడు. వెంటనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిరాయి హంతకుడు సునీల్ యాదవ్‌ను పిలిపించి తన హత్యకు రూ. 80 వేలు సుపారీ ఇచ్చాడు. సునీల్ తోడుగా మరో హంతకుడు రాజ్‌వీర్‌ను పిలిపించుకొని బల్బీర్‌ను హత్య చేశాడు. హత్యకు రెండు రోజుల ముందు.. తనను ఎక్కడ చంపాలో ఆ ప్రాంతాన్ని హంతకులకు చూపించాడు బాల్బీర్. మొత్తానికి అనుకున్నట్టుగానే బాల్బీర్‌ను కిరాయి హంతకులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాల్బీర్. కుటుంబాన్ని అప్పుల నుంచి విముక్తి చేసి.. వారు మంచి జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే బాల్బీర్ ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావించారు. -
భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం
అనంతపురం, తాడిపత్రి: వేరు కాపురానికి ఒప్పుకోని భర్తను హత్య చేయించేందుకు ఓ భార్య చేసిన కుట్ర అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. మంగళవారం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ స్వామి, డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఘటన వివరాలు మీడియాకు వెల్లడించారు. అనంతపురంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న నిసారుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పట్టణానికి చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నిసారుద్దీన్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసినా ససేమిరా అన్నాడు. దీంతో 2016లో గౌసియా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త ఉద్యోగంతో పాటు, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్‌పై కన్నేసింది. భర్తను హత్య చేయిస్తే కారుణ్య నియామకం కింద ఉద్యోగంతో పాటు బీమా సొమ్ము మొత్తం తనకే చెందుతుందనే దురుద్దేశంతో హత్యకు వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా అనంతపురంలోనే నివాసం ఉంటున్న అఖిల భారత ప్రగతి శీల మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్‌ను సంప్రదించింది. రూ.10 లక్షల సుపారీ తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్తో గౌసియా ఒప్పందం చేసుకుంది. డబ్బు కోసం గౌసియా తన తల్లి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించింది. వచ్చిన డబ్బులో రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా నిర్మలమ్మకు చెల్లించింది. నిసారుద్దీన్‌ను హత్య చేసేందుకు నిర్మలమ్మ, కులశేఖర్ గార్లదిన్నెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణారెడ్డితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.1.80 లక్షలు చెల్లించారు. రమణారెడ్డి ఈ బాధ్యతను తాడిపత్రి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న కడపకు చెందిన మురళీకృష్ణారెడ్డికి అప్పగించాడు. ఇతనికి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పాడు. మురళీకృష్ణారెడ్డి, నాగేంద్రుడు, మరో వ్యక్తి కలిసి నిసారుద్దీన్ ఇంటి వద్ద హత్యకు రెక్కీ నిర్వహించారు. అయితే వీరు తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కుట్ర బయటపడింది. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా.. నిర్మలమ్మ, కులశేఖర్, మురళీకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. -
‘ఆర్ఎక్స్ 100’ హీరో ఫైర్..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరో కార్తికేయ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ప్రస్తుతం కార్తికేయతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ బైలింగ్యువల్ సినిమాకు ఓకె చెప్పిన కార్తికేయ ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కార్తికేయ నటించిన మరో సినిమా రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. సుపారి పేరుతో తెరకెక్కిన సినిమాలో కార్తికేయ నటించాడన్నదే ఆ వార్తల సారాంశం. అంతేకాదు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల లిస్ట్‌తో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. సినిమాకు కార్తికేయ పాత్ర హైలెట్ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. అయితే హీరో కార్తికేయ వెర్షన్ మరోలా ఉంది. అసలు తాను ఆ సినిమాలో నటించలేదంటున్నాడు కార్తికేయ. ‘ఆ వీడియో లో ఉన్నది నేనే. కానీ నేను ఆ సినిమాలో నటించలేదు. కేవలం డెమో రీల్ అని షూట్ చేసి దాన్ని సినిమాకి వాడుకున్నారు. షూటింగ్ త్వరలో స్టార్ చేస్తామన్నారు కానీ చేయలేదు. నేను సుపారి సినిమాలో నటించలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇక ఈ నాన్సెన్స్ ఆపాలంటూ సుపారి చిత్రయూనిట్‌ను కోరారు. అయితే సుపారి నిర్మాతలు మాత్రం కార్తికేయ ఆర్ఎక్స్ 100 సక్సెస్ తరువాత మొహం చాటేశాడంటున్నారు. This is fake.Its not my https://t.co/NHhJAc1kU6 was supposed to be DEMO shoot for a movie which the director said would start soon but never started .Now shots of that demo are used for some other movie and being picturised as if i acted in it.I request them to stop this nonsense pic.twitter.com/tXhdPTKWdr — Kartikeya (@ActorKartikeya) 3 September 2018 -
ఎవరు? ఎవరికి?
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కథానాయకుడు కార్తికేయ. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సుపారి’. తేజరెడ్డి, ఆకర్ష కథానాయికలు. నటుడు వినోద్ కుమార్ ప్రత్యేక పాత్ర చేశారు. జె.మోహన్‌కాంత్ దర్శకత్వంలో పండు యాదవ్ సమర్పణలో కేయస్ఆర్ క్రియేషన్స్ పతాకంపై కె.శంకర్‌రాజ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది. కె.శంకర్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఎవరు? ఎవరికి? ఎందుకు సుపారి ఇచ్చారన్నదే చిత్రకథ. రొమాన్స్, లవ్, యాక్షన్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. కార్తికేయ పాత్ర ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా నిలుస్తుంది. వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే మా సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, ‘గబ్బర్‌సింగ్’ చంద్ర, సూర్య, అప్పు, రామారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయ జి. రామిరెడ్డి, సంగీతం: రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ గంటాడి.