Super Star
-
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
పడిలేచిన కెరటం.. చిల్లిగవ్వ లేకుండా ముంబైకి.. ఇప్పుడేమో వేలకోట్లు ఆస్తి! (ఫొటోలు)
-
రజినీకాంత్ 'వెట్టైయాన్'.. ట్రైలర్ వచ్చేసింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!) కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్.. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ సార్ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్ విడుదల చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டு குணமடைந்து வரும் சூப்பர் ஸ்டார் திரு. @rajinikanth sir அவர்கள் விரைவில் பூரண உடல்நலத்துடன் வீடு திரும்ப வேண்டும் என்று உளமார இறைவனை வேண்டுகிறேன்.— TVK Vijay (@tvkvijayhq) October 1, 2024 -
Mahesh Babu Rare Photos: టాలీవుడ్ ప్రిన్స్.. బాల్యంలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)
-
Sitara Ghattamaneni: సితార బర్త్‌డే స్పెషల్.. అందంలో తండ్రిని మించిపోతుందేమో! (ఫొటోలు)
-
Ranveer Singh: ఆ ఠీవీ, ఆ దర్పం.. మహారాజులా ఉన్నాడే! (ఫోటోలు)
-
ఒక్క సినిమాతో తెలుగోళ్లకు నచ్చేశాడు.. శివరాజ్ కుమార్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Mahesh Babu: మహేశ్ స్టైలిష్ లుక్స్ వైరల్ (ఫోటోలు)
-
ఎకానమీ క్లాస్‌లో సూపర్ స్టార్.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్‌పోర్ట్‌లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్‌లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్‌తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) #Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0 — Suresh balaji (@surbalutwt) February 29, 2024 -
హాట్‌టాపిక్‌గా మారిన మహేశ్ బాబు టీషర్ట్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేశ్ తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్‌లో క్లాసీ లుక్స్‌తో కనిపించాడు. దీంతో మహేశ్ ధరించిన టీ షర్ట్ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్ బాబు యానిమల్ ఈవెంట్‌కు ధరించిన టీషర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది 'గివెంచి' బ్రాండ్‌కు సంబంధించినది.చూడటానికి సింపుల్‌గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్ టీషర్ట్ ఏకంగా ఇంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
మహేష్ బాబు నా కోసం ఏదైనా చేస్తాడు ఎందుకంటే..
-
'గుంటూరు కారం' పోస్టర్.. మహేశ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రేజీ లుక్‌లో మహేశ్ బాబు అందులో మహేశ్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. లుంగీ, షర్ట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బీడీ కాలుస్తూ క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్టర్లో మహేశ్ బాబు వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇది ఏ బ్రాండ్? దీని ధరెంత అంటూ నెట్టింట సెర్చ్ చేశారు. సాధారణంగానే సెలబ్రిటీలు వాడిన కాస్ట్యూమ్స్, వాచెస్, షూస్ వంటి వస్తువులను ట్రై చేయాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా.. ఈ క్రమంలో మహేశ్ వేసుకున్న క్యాజువల్ షర్ట్ గురించి గూగుల్ చేయగా వారికి దిమ్మతిరిగే బొమ్మ కనిపించింది. ఎందుకంటే గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్లో మహేశ్ వేసుకున్న షర్ట్ ధర అక్షరాల రూ.74,509. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ R13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌లో మహేశ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇంత సింపుల్ షర్ట్ అంత కాస్ట్లీనా అని కొందరు షాక్ అవుతుంటే, మహేశ్ రేంజ్‌కి ఆ మాత్రం ఉండాలిగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 -
HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఏమున్నాడు రా బాబు.. మహేశ్ అందానికి సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్ కటౌట్ అంటూ మహేశ్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్‌మ్‌గా, ఛార్మింగ్ లుక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు మన సూపర్‌స్టార్. దీంతో ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్ యంగ్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్నెస్, డైట్ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ టైంలో మహేశ్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్ స్వయంగా తెలిపాడు. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్ మూన్ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. సుధీర్ఘ కాలం నుంచి మహేశ్ ఈ మూన్ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్‌గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇక ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్ బాబు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడట. ఇక మహేశ్ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి అనే డాక్టర్ గత కొన్నాళ్లుగా మహేశ్‌కు పర్సనల్ డెర్మలాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
Mahesh Babu Family London Vacation Photos: లండన్‌లో వేకేషన్లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?
కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ ఎవరనే రచ్చ మళ్లీ రగులుతోంది. గతంలో త్యాగరాజన్ భాగవతార్ తొలి సూపర్‌స్టార్‌గా వెలిగారు. ఆ తర్వాత మక్కల్ తిలకం ఎంజీఆర్‌కు ఆ పట్టాన్ని అభిమానులు అందించారు. అనంతరం కమలహాసన్, రజినీకాంత్ పోటీ పడుతూ వచ్చారు కానీ మాస్ ఫాలోయింగ్‌తో రజనీకాంత్‌నే గత నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. విశ్వనటుడుగా పేరుగాంచిన కమలహాసన్ దాని జోలికి వెళ్లలేదు. అలాంటిది ఇటీవల వారీసు తెలుగు వెర్షన్ వారసుడు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఆ చిత్ర నిర్మాత కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ అని పేర్కొనడం చర్చకు కాదు కాదు పెద్ద వివాదానికే తెరలేపింది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వంటి కొందరు కూడా దీనికి వంత పాడారు. అలా కొన్నిరోజులు సాగిన ఈ దుమారం ఆ తర్వాత చల్లబడింది. అలాంటిది ఇప్పుడు మరోసారి సూపర్‌స్టార్ ఎవరన్న అంశంపై రచ్చ వేడెక్కింది. ఇందుకు కారణం లేకపోలేదు నటుడు రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్ కేరళ రాష్ట్రంలో అయిన వ్యాపారం కంటే నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న లియో చిత్ర బిజినెస్ అధికంగా జరిగిందని సమాచారం. మరో కారణం కూడా ఉంది. విజయ్ ప్రస్తుతం రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. రజనీకాంత్ కూడా అంతే పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. (చదవండి: ఆ డైరెక్టర్ అంతే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాడు: ఉదయనిధి స్టాలిన్) అయితే విజయ్ తన 68వ చిత్రానికి రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలా ఏవిధంగా చూసినా విజయ్ నే సూపర్‌స్టార్ అనే ఒక వర్గం గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చలోకి నటుడు కమలహాసన్ పేరు కూడా చేరింది. ఇటీవల ఈయన నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. అదేవిధంగా ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్–2 చిత్రానికి రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకపక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్స్ అత్యధిక తీసుకుంటున్నారని, ఇంకోపక్క నిర్మాతగా వరుసగా చిత్రాలు నిర్మించడంతో ఈయన వార్షిక ఆదాయం రజనీకాంత్, విజయ్ కంటే చాలా ఎక్కువ అని కాబట్టి కమలహాసన్‌నే సూపర్‌స్టార్ అని ఆయన అభిమానులు గళమెత్తుతున్నారు. -
తెరపైకి తమిళనాడు తొలి సూపర్‌స్టార్ బయోపిక్
తమిళసినిమా: సినిమా అనుభవం ఉన్న ఎవరైనా తొలి తమిళ సినీ సూపర్‌స్టార్ ఎవరంటే పేరు టక్కున చెప్పే పేరు ఎం.కె త్యాగరాజ భాగవతార్. ఆయన్ని ఇండస్ట్రీలో ఎంకేటీ అని పిలిచేవారు. త్యాగరాజ భాగవతర్ నటించిన హరిదాసు చిత్రం 1944లో దీపావళి సందర్భంగా విడుదలై మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆ కాలంలో ప్రఖ్యాతి గాంచిన నటుడు త్యాగరాజ భాగవతార్. అలాంటి గొప్ప నటుడు తన 49వ ఏటనే అంటే 1959వ లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత బుధవారం త్యాగరాజ భాగవతర్ 114వ జయంతి. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు పార్థిబన్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ‘తమిళనాడు తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొంది రాజభోగాలు అనుభవించిన నటుడు త్యాగరాజ భాగవతార్. పన్నీరుతో స్నానమాడి, కన్నీళ్లతో ముఖం తుడుచుకున్న నటుడు. చివరి దశలో దుర్భర జీవితం అనుభవించారు. ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కథా, కథనాలను కూడా సిద్ధం చేశాను‘ అని తెలిపారు. త్యాగరాజ భాగవతార్ బయో పిక్‌ను ఎప్పుడు తీస్తారు? అన్న ప్రశ్నకు పార్థిబన్ బదులిస్తూ కథ, స్క్రీన్‌ప్లే కూడా సిద్ధం చేశానని, అయితే బయోపిక్‌లను, పిరియడ్ కథా చిత్రాలను సాధారణ బడ్జెట్‌తో రూపొందించడం సాధ్యం కాదని, భారీ బడ్జెట్ అవసరం అవుతుందన్నారు. అలాంటి నిర్మాత లభించినప్పుడు త్యాగ రాజ భాగవతర్ బయోపిక్‌ను కచ్చితంగా తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు. -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
Dilip Kumar: హైదరాబాద్‌కు అల్లుడయ్యారు.. కానీ రెండేళ్లకే!
‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’... అతని సినిమా ప్రయాణం అతి సుందరం. ‘ఏ మేరా దీవానాపన్ హై..’ నటన పట్ల అతని ఉన్మత్తతా అతి సుందరం. ‘మధుబన్ మే రాధికా నాచెరే’... వెండితెరపై ఆ లీలా వినోదమూ సుందరమే. ‘యూసఫ్ ఖాన్’ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. జగతి ‘దిలీప్ కుమార్’ అని పిలుచుకుంది. భారత ఉపఖండం ఎల్లలు గీసుకొని ఉండొచ్చు. కాని అతణ్ణి అభిమానించడంలో గీతలన్నీ దారులుగా మారడం అతి సుందరం. కొందరు పట్టాభిషేకం వల్ల చక్రవర్తులు అవుతారు. కొందరు ప్రజల అభిషేకం వల్ల. దిలీప్ కుమార్‌ను ‘సినీ మొఘల్ ఏ ఆజమ్’ అని పూమాల వేసుకోవడం బహు సుందరం. ట్రాజెడీ కింగ్... కామెడీ స్టార్... రొమాంటిక్ హీరో... మెథడ్ యాక్టర్... పేర్లు ఏవైనా అతడు పలకడం సుందరం. మేకప్ వేసుకున్న కోహినూర్ వ్రజ్రం ఇన్నాళ్లు వెండితెరపై మెరిసి ఇకపై నింగిలో తళుకులీననుంది. ఖదీర్ ‘‘జనం ఆకలితో మాడుతుంటే మనం వాళ్లకు దక్కాల్సిన తిండి గింజల్ని రేట్లు పెంచి అమ్ముకుని మన బొక్కసాన్ని నింపుకున్నాం. ఊళ్లో మహమ్మారి కమ్ముకుంటే మనం మందుల్ని దాచిపెట్టి వాటి రేట్లు పెంచేశాం. పోలీసులు దాడి చేస్తారని తెలియగానే అవే మందుల్ని మురుక్కాలవల్లో పారబోశాం. మనిషికి దక్కాల్సిందేదీ మనిషికి దక్కకుండా చేస్తున్నాం’’ – ఫుట్‌పాత్ (1953) ‘‘అనార్కలి సమాధి మీద నాలుగు కాళ్లు నిలబెట్టి తప్ప మీ సింహాసనం నిలవదు అని మీరనుకుంటే జహాపనా... ఈ సలీమ్ అటువంటి సింహాసనాన్ని ఎప్పటికీ కోరుకోడు’’ – మొఘల్ ఏ ఆజమ్ (1960) ‘‘ఏదో ఒక ఉపాయం ఆలోచించు దొరబాబూ. ఊళ్లో మీరూ ఉండేలా మేమూ ఉండేలా. యంత్రాలూ పరికరాలతోపాటు మనుషులు కూడా ఉండేలా. అందరం కలిసి బతికే మార్గం ఆలోచించు’’ – నయాదౌర్ (1957) ‘‘ఎవడయ్యా ఆ బడుద్దాయి.. వేదన తట్టుకోవడానికి తాగేది? నేను తాగుతున్నానంటే కారణం కనీసం ఊపిరన్నా ఆడుతుందని’’ – దేవదాస్ (1954) ‘రైట్ బ్రదర్స్’ ప్రపంచానికి ఎగరడం నేర్పించారు. అదొక రికార్డు. దిలీప్ కుమార్ ఈ దేశంలో నటులను నేలన నడవడం నేర్పించాడు. అదీ రికార్డే. నాటకం చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి వినిపించేలా అరిచి డైలాగులు చెప్పే రోజులు పోయాయి. అరవొద్దు. దూరం నుంచి కనిపించేలా ముఖమంతా కదిలించే భావాలు చూపించాల్సిన అవసరం లేదు. చూపించొద్దు. ఇది సినిమా. దీనికి వేరేగా చేయాలి... నాలా చేయాలి అని చేసి చూపించాడు దిలీప్ కుమార్. ఒక కాలం ఉంటుంది. అరణ్యాలు మార్గాలు తొలుచుకునే కాలం. కొత్తది ఒకటి ఏర్పడే కాలం. అలాంటి కాలంలో అలాంటి వాళ్లు పుడతారు. సినిమా సంగీతం ఇలా ఉండాలి అని నౌషాద్ వచ్చాడు. సినిమా పాట ఇంత లలితంగా ఉండాలి అని లతా వచ్చింది. సినిమా దర్శకత్వం ఇలా ఉండాలి అని మహబూబ్ ఖాన్ వచ్చాడు. సినిమా నటన ఇలా ఉండాలని దిలీప్ కుమార్ వచ్చాడు. ‘దీదార్’ (1951) సినిమాలో దిలీప్ కుమార్ అంధుడు. అప్పటివరకూ సినిమాల్లో అంధులు వేగంగా కనురెప్పలు మూస్తూ కంటి కింద నల్ల చారలతో నటించేవారు. అదొక స్టీరియోటైప్. దిలీప్ ఆ సినిమాలో కళ్లు తెరిచి అంధుడుగా నటించాడు. శరీర కదలికా, మాట, నడక వల్ల తాను అంధుడు అని ప్రేక్షకులకు చెప్పాడు. సినిమా అంటే ఆ పూటకు మేకప్ వేసుకుని, ఆ రోజుకు సీన్ పేపర్ చదువుకుని, ఆ షాట్లో చెప్పాల్సిన డైలాగ్ చెప్పి మధ్యాహ్నం షెడ్యూల్‌కు ఇంకో స్టూడియోకు పరిగెత్తి పోవడం కాదు అని వృత్తి ఏకాగ్రతను మొదట పాటించినవాడు దిలీప్ కుమార్. తెర మీద నీలా కనిపిస్తున్నావా నీ పాత్రలా కనిపిస్తున్నావా అని అందుకై మధనపడ్డ వాడు దిలీప్ కుమార్. ఒక కాలంలో ఒకే సినిమా అని అతడు పాటించిన సూత్రాన్ని దాదాపు 50 ఏళ్ల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ పాటించి విజయాలు సాధించి ఆపై అందరు హీరోలు అదే ధోరణికి వచ్చేలా చేశారు. వీరి దారికి మ్యాప్ ఇచ్చినవాడు దిలీప్ కుమార్. ∙∙ ‘చేతులు ఎక్కడ పెట్టుకోవాలి?’ ఇది తెలిస్తే నటులైపోతారు. ఒక నటుడు నటించడానికి చేతులే పెద్ద అడ్డం అని నటులకు మాత్రమే తెలుస్తుంది. ఆ చేతుల్ని అలా జార్చి వదల్లేము. చీటికి మాటికి కదిలించలేము. ఈ చేతుల్ని హ్యాండిల్ చేయడానికి కొందరు వాటిని విసురుతూ నటిస్తే, కొందరు కాలర్ దగ్గరకు తెచ్చి నటిస్తే, కొందరు ఒక చేతిని సగం మడిచి, మరికొందరు బెల్ట్ పట్టుకుని నటించడం చూశాం. వారి నటనలో చేతులు రిజిస్టర్ అవుతాయి. దిలీప్ కుమార్ నటనను చూడండి. అతడు రిజిస్టర్ అవుతాడు. చేతులు కాదు. భారతదేశ నటులందరిలోనూ చేతులను సరిగ్గా పెట్టి నటించడం తెలిసిన మొదటి నటుడు దిలీప్ కుమార్. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లలో అందుకై అతడి సినిమాలు చూపిస్తారు. ∙∙ ‘నా విజయం నీ గుండెల్లో గడబిడ పుట్టిస్తే అంతే చాలు. నీ ఇనాం నీ దగ్గరే పెట్టుకో. నా విజయాన్ని నేను తీసుకెళ్తా’ అని ‘ఆన్’ (1952) సినిమాలో దిలీప్ కుమార్ అంటాడు. విజయం సాధిస్తే అలా సాధించాలి అనుకున్నవాడు దిలీప్ కుమార్. పెషావర్‌లో పుట్టి (1922) మరో పదేళ్ల తర్వాత కుటుంబం ముంబైకి వలస రావడం వల్ల అక్కడే చదువుకున్న దిలీప్ కుమార్ కాలేజ్‌లో రాజ్ కపూర్‌కు క్లాస్మేట్. చదువుకుని సొంతగా బతకాలనుకునే ఖాన్ల స్వభావం చదువు పూర్తి కావడంతోటే అతణ్ణి పూణెకి తీసుకెళ్లింది. అక్కడ సొంతంగా డ్రైఫ్రూట్స్ షాప్ పెట్టాడు. సంవత్సర కాలంలోనే లాభంతో తండ్రి దగ్గరకు వస్తే తండ్రి సంతోషించాడు. అయితే ఈ అందగాణ్ణి, చక్కటి మాట ఉన్నవాణ్ణి, మర్యాదపూర్వక ప్రవర్తన ఉన్నవాణ్ణి, మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నవాణ్ణి నటి దేవికా రాణి చూసింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్. బాంబే టాకిస్ స్టూడియో ఓనర్. కొత్త హీరోలతో సినిమాలు తీయాలని వెతుకుతోంది ఆమె. ‘నీ జీతం 1250 రూపాయలు’ అని దిలీప్ కుమార్‌తో దేవికా రాణి చెప్తే అది నెలకా సంవత్సరానికా అర్థం కాలేదు దిలీప్‌కు. 1944లో 150 రూపాయలు పెద్ద జీతం. ‘నాకు మా స్టూడియోలో నెలకు 150 ఇస్తున్నారు. నీకు అది సంవత్సరానికి అయి ఉంటుంది’ అని రాజ్ కపూర్ ఆ సందేహానికి జవాబు చెప్పాడు. కాని తప్పు. నెలకు 1250 రూపాయలు ఆఫర్ చేసింది దిలీప్ కుమార్‌కు దేవికా రాణి. అలాంటి బ్యాంగ్‌తో మొదలయ్యాడు దిలీప్ కుమార్. కాలేజ్‌లో ఫుట్‌బాల్‌ను స్పోర్ట్స్ ప్రిఫెరెన్స్గా తీసుకున్న దిలీప్ కుమార్, ఎప్పుడూ నాటకాలు వేయని దిలీప్ కుమార్, హాలీవుడ్ సినిమాలు తలమునకలుగా చూసి ఎరగని దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌కు ఉన్నట్టుగా గ్రెగెరి పెక్ మోడల్ లేని దిలీప్ కుమార్, రాజ్ కపూర్‌కు ఉన్నట్టుగా సురభి నాటక సంస్థ లాంటిది లేని దిలీప్ కుమార్ అంత మంచి నటుడు ఎలా అయ్యాడు. అది రహస్యం. ఎప్పుడూ ఎవరికీ తెలియదు. అయ్యాడు. అవడానికే అతడు నిరంతరం శ్రమించాడు. దేవికా రాణి అతణ్ణి పెట్టి తీసిన మొదటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాని ఇలా కొత్త తరహా నటన చూపుతున్న నటుణ్ణి అందరూ గుర్తించారు. మహబూబ్ ఖాన్ మల్టీస్టారర్‌గా రాజ్‌కపూర్, నర్గిస్, దిలీప్ కుమార్‌లను పెట్టి తీసిన ‘అందాజ్’ (1949)తో దిలీప్ కుమార్ తన ఊనికిని పూర్తిగా నిరూపించాడు. వరుసగా వచ్చిన మూడు సినిమాలు ‘దీదార్’ (1951), ‘తరానా’ (1951), ‘దాగ్’ (1952) దిలీప్ కుమార్‌ను ట్రాజెడీ కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాయి. అంతిమంగా ‘దేవదాస్’ (1955) అతణ్ణి ‘ట్రాజెడీ కింగ్’ను చేసింది. మెథడ్ యాక్టింగ్ అంటే పాత్రను మననం చేసుకుంటూ ఉండటం. మామూలు వ్యక్తిగా తక్కువ పాత్రగా ఎక్కువ ఉండటం. దిలీప్ కుమార్ ఈ పాత్రలతో ఎంత మమేకం అయ్యాడంటే ఆ కథలతో తనకు ఏ సంబంధం లేకున్నా ఆ విషాదం కమ్ముకుని డిప్రెషన్ రాసాగింది. డాక్టర్లు ‘ఇక మానెయ్. సరదా పాత్రలు చెయ్’ అంటే దిలీప్ దారి మార్చాడు. ఆజాద్ (1955), నయాదౌర్ (1957), మధుమతి (1958) అతణ్ణి చలాకీగా దూకుడుగా చూపించాయి. కాని అతడేంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరెస్ట్ ఎక్కాల్సి ఉంది. ఆ ఎవరెస్టే ‘మొఘల్ ఏ ఆజమ్’. హీరోలు డ్యూయెట్లు పాడుతూ ప్రేమిస్తారు. విడిపోతే విరహగీతాలు ఆలపిస్తారు. చివర్లో నాలుగు ఫైట్లు చేసి హీరోయిన్ని సొంతం చేసుకుంటారు. ఇదీ ప్రేమంటే. కాని ‘మొఘల్ ఏ ఆజమ్’లో సలీమ్‌గా దిలీప్ కుమార్ చూపిన ప్రేమ వేరు. ప్రేమ అంత గంభీరంగా ఉంటుందని, అంత గాఢంగా ఉంటుందని, అంత తెగింపుగా ఉంటుందని, అంత గర్జనతో ఉంటుందని, ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించే సత్తాను చిన్న గుండెలో ఇముడ్చుకుని ఉంటుందని దిలీప్ కుమార్ చూపించాడు. ఆ పాత్రకు అంతకు ముందు ఎలాంటి మోడల్ లేదు. ఏ మోడల్ అయినా అతడే చూపాడు. ‘జంజీర్’తో యాంగ్రీ యంగ్ మేన్ వచ్చాడని అమితాబ్‌ని చూపి అంటారు. నిజానికి యాంగ్రీ యంగ్‌మేన్ 1960లోనే వచ్చాడు. అతడు దిలీప్ కుమార్. రాజ్ కపూర్ వినోదం, సందేశం చూపే ప్రయత్నం చేశాడు. దేవ్ ఆనంద్ ఒట్టి వినోదమే. దిలీప్ కుమార్ వినోదం, సందేశం మాత్రమే కాదు అర్థవంతమైన ఒక జీవన అనుసరణను తన పాత్రల ద్వారా ఇస్తూ పోయాడు. మనం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్‌ల పాత్రలను వారి సినీ ఇమేజ్ను ఒక అనుసరణీయతకు తీసుకోలేము. దిలీప్ కుమార్‌ను తీసుకోగలము. హీరోగా తన వయసు అయిపోయింది సరైన పాత్రలకు తగిన సంసిద్ధత తీసుకోవాలని 5 సంవత్సరాలు కెమెరా ముఖం చూడకుండా ఇంట్లో కూచున్నవాడు దిలీప్ కుమార్. ఆ తర్వాత కెమెరా ముందుకు వస్తే? అదొక ‘క్రాంతి’ (1981), ‘శక్తి’ (1982), ‘విధాత’ (1984), ‘కర్మ’ (1986), ‘సౌదాగర్’ (1991) అయ్యాయి. నువ్వొక మణివి. అవును. దానికి విలువుంది. అవును. కాని చీటికి మాటికి దానిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కిరీటంలోనే పెట్టాలి. అలా పెట్టి బతికినవాడు దిలీప్. అందుకే యాభై ఏళ్ల కెరీర్లో కేవలం 60 సినిమాలు మాత్రమే చేశాడు. దిలీప్ కుమార్ ‘నయాదౌర్’లో డాన్స్ చేశాడు. అరె అన్నారు. ‘రామ్ ఔర్ శ్యామ్’లో కామెడీ చేశాడు. పడీ పడీ నవ్వారు. ‘గంగా జమున’లో న్యాయం కోసం ఆయుధం పట్టిన గ్రామీణుడిగా చూసి అతని పక్షం వహించారు. ‘మషాల్’లో అర్ధరాత్రి వాన కురిసిన ముంబై వీధుల్లో చావు బతుకుల్లో ఉన్న భార్యను బతికించుకోవడానికి దారిన పోయే కార్లను ఆపుతూ పరిగెత్తుతూ ‘ఏయ్ భాయ్’ అని అరుస్తూ ఉంటే ఉద్వేగంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అతడు రాజేసిన స్పందనలకు నెత్తిన పెట్టుకున్నారు. చిల్లర మల్లర సినిమాలు చేయకుండా, చిల్లర మల్లర యాడ్స్‌లో నటించకుండా, రాజకీయ పదవుల కోసం చిల్లర మల్లర నాయకులతో స్నేహం నటించకుండా, చిల్లర మల్లర డబ్బు తీసుకుని శ్రీమంతుల పెళ్లిళ్లలో డాన్సులు చేయకుండా, చిల్లర మల్లర వాగుడు వాగకుండా, చిల్లర మల్లర ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, షోస్ చేయకుండా నటుడికి ఉండాల్సిన సంస్కారం కోసం, జ్ఞానం కోసం, శీలం కోసం, నడవడిక కోసం తన ఎదుట ఒక బెత్తం ఉన్నట్టుగా దేవుని బెత్తమో ప్రేక్షకుని బెత్తమో... దానికి జవాబుదారిౖయె ఉండటానికి ప్రయత్నించడమే దిలీప్ కుమార్ గొప్పతనం. అతడి లాంటి వాణ్ణి చూసి నేర్చుకోవాలంటే అతడి లాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రారు. అలా ఎదిగే ఐశ్వర్యం అందరికీ అబ్బదు. ఒక్కడే దిలీప్ కుమార్. ఆజ్ పురానే రాహోన్ సే కోయి ముఝె ఆవాజ్ న దే దర్ద్ మె డూబె గీత్ న దే ఘమ్ కా సిసక్తా సాజ్ న దే ► మధుబాలతో ప్రేమ..అనార్కలి దక్కలేదు దిలీప్ కుమార్, మధుబాల కలిసిన నటించిన మొదటి సినిమా ‘తరానా’ (1951) ఫ్లాప్. వాళ్ల రెండో సినిమా ‘సంగ్ దిల్’ (1952) బిలో యావరేజ్. మూడో సినిమా ‘అమర్’ (1954) యావరేజ్. వాళ్లు కలిసి నటించిన ఒకే ఒక్క సూపర్‌హిట్ సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’ (1960). దురదృష్ట వశాత్తూ ఆ సినిమా నాటికి వాళ్ల ప్రేమ ముగిసింది. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అని మొఘల్ ఏ ఆజమ్ సినిమాలో హిట్ పాట. దిలీప్‌కుమార్, మధుబాల కూడా తమ ప్రేమను దాచుకోలేదు. కలిసి మెలిసే తిరిగారు. కాని మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్‌కు దిలీప్‌తో మధుబాల ప్రేమ నచ్చలేదు. దానికి కారణం మధుబాల కూడా హీరోయిన్లలో సూపర్‌స్టార్ కావడం. ఇంకా ఆమె ఎదుట చాలా కెరీర్ ఉండటం. ఆమె సంపాదన కుటుంబానికి ముఖ్యం కావడం. ఒక రకంగా తండ్రికీ దిలీప్‌కి మధ్య మధుబాల నలిగిపోయింది. ఇది ‘నయాదౌర్’ (1957) సినిమాతో పతాక స్థాయికి చేరింది. ఆ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న మధుబాలాను షూటింగ్ అవుట్ డోర్ అనేసరికి తండ్రి నిలువరించాడు. ఔట్‌డోర్‌లో దిలీప్ ఉంటాడు కనుక తన కంట్రోల్ ఉండదు అని భయపడ్డాడు. షూటింగ్ ఆగిపోయేసరికి ఒళ్లు మండిన దర్శకుడు బి.ఆర్.చోప్రా కోర్టుకెక్కాడు. ఆ సమయంలో తండ్రి మర్యాద దిలీప్ కాపాడాలని మధుబాల ఆశించింది. కాని దిలీప్ మధుబాలకు ఆమె తండ్రికి వ్యతిరేకంగా బి.ఆర్. చోప్రా పక్షాన సాక్ష్యం చెప్పాడు. దీంతో ఆమె మనసు ముక్కలయ్యింది. ‘మొఘల్ ఏ ఆజమ్’ షూటింగ్ సమయానికి వారి మధ్య మాటలు లేవు. ‘ఒక్కసారి మా నాన్నకు సారీ చెప్పు చాలు’ అని మధుబాల అంది. దిలీప్ చెప్పలేదు. ఆ వాక్యూమ్‌ను నింపుకోవడానికి ఆమె హడావిడిగా వివాహితుడైన కిశోర్ కుమార్‌ను పెళ్లి (1960) చేసుకుంది. కాని దిలీప్, మధుబాల తమ టర్మ్స్ బాగలేకపోయినా ఎంతో ప్రొఫెషనలిజమ్‌తో మొఘల్ ఏ ఆజమ్‌లో నటించారు. ఉద్యానవనంలో ఎక్కడో దూరంగా తాన్సేన్ పాడుతూ ఉండగా వారి మధ్య ప్రణయ సన్నివేశం ఒకటి నడుస్తుంది. దానిని చూసిన వారెవరైనా వారు మాటలు మానుకున్న ప్రేమికులు అనుకోగలరా? వారి ప్రేమ కనీసం తెర మీదైనా పండింది. మధుబాలతో... ఆమె అతణ్ణే తన బిడ్డ అనుకుంది ప్రేమికులు మొండిగా ఉంటారు. మధుబాలను ప్రేమించిన దిలీప్ కుమార్ ఆమెతో పెళ్లి ఇక జరగదని అర్థమయ్యాక (1957) దాదాపు 11 ఏళ్ల పాటు మరో ప్రేమకథ వైపు చూళ్లేదు. ఆ కాలంలో అతని జీవితం లో ఏ స్త్రీ ఉందో కూడా ఎవరికీ తెలియదు. కాని తన 44 ఏళ్ల వయసులో తన కంటే 22 ఏళ్లు చిన్నది అయిన సైరా బానుతో ప్రేమలో పడ్డాడు. ఆమె హైస్కూల్ రోజుల నుంచి దిలీప్ ఫ్యాన్. చేసుకుంటే ఇలాంటి వాణ్ణే చేసుకోవాలి అనేదట. దిలీప్ కుమార్‌ని కలవడానికే సినిమా రంగంలోకి వచ్చిందట. కాని దిలీప్‌కు ఆమె పట్ల ఎటువంటి భావాలూ లేవు. ‘బచ్చీ’ (చిన్న పిల్ల) అని దూరం పెడుతూ వచ్చాడు. సినిమాల్లో తన పక్కన చాలా రోజుల తర్వాతగానీ తీసుకోలేదు. కాని సైరా ప్రేమ దిలీప్ కుమార్ పట్ల గట్టిది. వాళ్లు 1966లో వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ మగ దురహంకారి కాడు. పెళ్లయ్యాక సైరాబాను నటిగా కొనసాగడానికి అతడు ఏ అడ్డంకీ చెప్పలేదు. పెళ్లి తర్వాత సైరా దాదాపు పదేళ్లు హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్లో హిట్స్‌గా నిలిచిన ‘పడోసన్’, ‘విక్టోరియా నం.203’ వంటివి పెళ్లి తర్వాతే వచ్చాయి. సైరాకు దూకుడు ఎక్కువ. గర్భం దాల్చిన తర్వాత కూడా షూటింగ్లలో పాల్గొంది. ఆ సమయంలో చేసిన హార్స్ రైడింగ్ ఆమెకు ప్రమాదం తెచ్చి పెట్టిందని అంటారు. కడుపులో బిడ్డకు ఎనిమిది నెలల వయసులో ఆమెకు హై బ్లడ్ ప్రెషర్ వల్ల అబార్షన్ చేయాల్సి వచ్చింది. అంత లేటు అబార్షన్ కావడం వల్ల సైరా మళ్లీ గర్భం దాల్చే శక్తిని కోల్పోయింది. కాని దిలీప్ కాని సైరా కాని దీని గురించి ఎటువంటి ఫిర్యాదు లేకుండా జీవించారు. సైరా తనే దిలీప్‌కు తల్లయ్యింది. అతణ్ణే బిడ్డగా చేసుకుని అనుక్షణం చూసుకుంది. 98వ ఏట ఆఖరి నిమిషం వరకూ కూడా దిలీప్ కోసం పాకులాడిందామె. దిలీప్ మరణంతో ఆమె జీవితంలో అతి పెద్ద శూన్యం రానుంది. సైరాబానుతో పెళ్లి హీరోలకు హీరో హీరో అంటే ఎవరు? ఇన్‌స్పయిర్ చేసేవాడు. దేశంలో నటన విషయంలో దిలీప్ ఇన్‌స్పయిర్ చేసినట్టుగా మరో నటుడు చేయలేదు. నటుడు ధర్మేంద్ర పంజాబ్‌లో కాలేజీకి వెళ్లి వస్తూ దిలీప్‌కుమార్ సినిమాలు చూస్తూ ఇతనిలా హీరో అవ్వాలి అనుకుని హీరో అయ్యాడు. దిలీప్ అంటే ధర్మేంద్రకు చాలా గౌరవం. ఒక కడుపున పుట్టని తమ్ముణ్ణి అని చెప్పుకునేవాడు. దిలీప్ కుమార్ ధర్మేంద్రతో ‘దేవుడు నన్నెందుకు నీ అంత అందంగా పుట్టించలేదు’ అనేవాడు. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి ఢిల్లీ శిబిరంలో ఉన్న ఒక బాలుడు సినిమాకు వెళ్లి అందులోని దిలీప్‌ను చూసి హీరో అవ్వాలనుకున్నాడు. ఆ సినిమాలో దిలీప్ పేరు మనోజ్. అదే తన పేరుగా చేసుకున్నాడు. అతడే మనోజ్ కుమార్. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ఇద్దరూ దిలీప్ కుమార్ సినిమాలు చూసి నటనను నేర్చుకున్నామని బహిరంగంగా చెప్పారు, ఆయనను ఇమిటేట్ చేస్తూ నటిస్తారు కూడా. చిన్న గొంతుతో ఇంటెన్స్‌గా నటించడం దిలీప్ మొదట చూపెట్టాడు. అమితాబ్, షారూక్ అలాంటి సన్నివేశాల్లో దిలీప్ మార్గమే పాటిస్తారు. ‘మాకో కొడుకు పుట్టి ఉంటే అచ్చు నీలా ఉండేవాడు’ అని సైరా షారూక్‌తో అంది. ధర్మేంద్రతో..., మనోజ్ కుమార్‌తో.., అమితాబ్, షారూక్‌తో.. హైదరాబాద్ అల్లుడు దిలీప్ కుమార్ హైదరాబాద్ అల్లుడు. అవును. అయితే రెండేళ్లే. 1981–83 మధ్య అతడు తన జీవితంలోకి ఇంకో స్త్రీని ఆహ్వానించాడు. ఆమె హైదరాబాద్‌కు చెందిన అస్మా రహమాన్. ‘నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఆమెను వివాహం చేసుకోవడమే’ అన్నాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథ ‘ది సబ్‌స్టాన్స్ అండ్ షాడో’లో. హైదరాబాద్‌లో ఒక క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన దిలీప్‌కుమార్‌కు అతని చెల్లెళ్లు అస్మా రహమాన్‌ను పరిచయం చేశారు. అప్పటికే ఆమెకు వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు. కాని ఆమె దిలీప్‌కు చాలా పెద్ద ఫ్యాన్. దిలీప్‌తో విపరీతంగా ప్రేమలో ఉన్న ఆమె అతణ్ణి పెళ్లాడడానికి భర్తకు విడాకులు ఇచ్చింది. దిలీప్ కూడా సైరా నుంచి దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. 1981 లో జరిగిన ఈ వివాహం 1983లో ముగిసింది. సైరా దిలీప్‌ను క్షమించింది. ముంబై నుంచి తిరిగి వచ్చిన అస్మా తిరిగి మునుపటి భర్తను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడిందని కథనం. ఆస్మా రహమాన్‌తో... నీ కంటే పెద్దవాడు ఉంటాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథలో ఇలా రాశాడు. ‘ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నాను. సాధారణంగా నా పక్క సీటు వాళ్లు నన్ను గుర్తుపట్టి కొంత హంగామా సృష్టిస్తుంటారు. నా పక్కన కూచున్న పెద్ద మనిషి అలా ఏమీ చేయలేదు. కిటికీలో నుంచి చూస్తూ కూచున్నాడు. నేనే ఆయనతో మాట కలిపాను. ఇద్దరం టీ తాగాం. ఆయన ఇంకా నన్ను గుర్తించడం లేదేమిటా అనుకున్నాను. ‘సినిమాలు చూస్తారా?’ అని అడిగాను. ఎప్పుడైనా ఒకసారి అన్నాడాయన. ‘నేను సినిమాల్లో పని చేస్తాను’ అని చెప్పాను. ‘ఓ అలాగా. ఏం చేస్తారు’ అని ఆయన అడిగాడు. ‘నటుణ్ణి’ అని చెప్పాను. ఆయన అంతకుమించి ఏమీ అడగలేదు. విమానం ల్యాండ్ అయ్యాక ఇక తట్టుకోలేక నా పేరు చెప్పాను – ‘నేను దిలీప్ కుమార్‌ని’ అని. ‘నేను జె.ఆర్.డి టాటాని’ అన్నాడాయన. అప్పుడు అర్థం అయ్యింది నాకు... నువ్వు ఎంతైనా ఎదుగు నీ కంటే పెద్దవాడు ఉంటాడు అని. విర్రవీగడం సరి కాదని. ఈ ఘటన నన్ను ఇంకా వినమ్రుడిని చేసింది... అని రాసుకున్నాడాయన. -
ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్
పెరంబూరు: నటుడు సూపర్‌స్టార్ శ్రీనివాసన్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌గా మార్చేశారు. సినిమా క్రేజ్ ఉంది కదా అని అందరూ రాజకీయ నాయకులైపోయి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. అలా ఆశపడిన హాస్యనటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఓటర్ల చేతిలో ఘోరంగా భంగపడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దక్షిణ చెన్నై స్థానానికి పోటీ చేశారు. తన విజయం ఖాయమని, లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు పొందారు. కేవలం 670 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్ అని అభిమానులు ఎగతాలి చేస్తున్నారు. -
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర
-
నాన్నా.. రజనీకీ ఓ లవ్ స్టోరీ ఉంది
సాక్షి, చెన్నై : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్.. తలైవాగా తంబీలతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన పుట్టినరోజు నేడు. 67వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయనకు సబంధించి కొత్తగా చెప్పుకోవాటానికి ఏముంటుంది చెప్పండి. ప్రతీ పుట్టినరోజుకి ఆయన వయస్సు తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. ఇక లత రజనీకాంత్‌తో ఆయనది ప్రేమ వివాహమని.. అది ఎంత గమ్మత్తుగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. తొలిచూపులోనే... అది 1980. తిల్లు మల్లు చిత్ర షూటింగ్లో సూపర్ స్టార్ పాల్గొంటున్నాడు. 70వ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రానికి ఇది రీమేక్. పూర్తి హస్యభరితంగా ఆ చిత్రం ఉంటుంది. షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకామె వచ్చారని ఆయన అసిస్టెంట్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న రజనీ ఇంటర్వ్యూ కోసం పక్కకి వెళ్లారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరో కాదు.. లతా రంగాచారి. అప్పుడే ఆ మరుక్షణమే ఆమెకు చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. అప్పుడే రజనీ డిసైడ్ అయ్యాడంట... ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పింది. అయితే రజనీ ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన లత సోదరి సుధ భర్త కావటం విశేషం. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం ఏడ్పించారంట. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రజనీకాంత్
-
చెన్నైలో తారాస్థాయికి చేరిన కబాలి ఫీవర్
-
రజనీ సోదరుడిపై అభిమానుల ఆరోపణలు
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై మదురైలోని రజనీకాంత్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పోస్టర్లు అంటించి కలకలానికి తెరలేపారు. మదురై జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు జిల్లా శేఖర్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టర్లలో రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్, లింగా చిత్రాల అపజయాలకు, ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడానికి కారణం సత్యనారాయణేనని పేర్కొన్నాడు. అంతే కాకుండా 2015 ఏప్రిల్ 23న చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తాను చెప్పిన విషయాన్ని సత్యనారాయణ రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లలేదని అందుకు తాను ఆదివారం మదురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మదురై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టుకు రజనీ గైర్హాజరు
చెన్నై: లింగా చిత్ర వ్యవహారంలో కోర్టు విచారణకు మంగళవారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరుపై న్యాయవాదులు వివరణ ఇచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసులో బోల్తాపడడంతో వ్యవహారం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అలాగే ఆ చిత్ర కథ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో విచారణ జరుగుతూ వస్తుంది. ఈ విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు రావాలని రజనీకాంత్, చిత్ర నిర్మాతకు, దర్శకులకు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారం రజనీకాంత్‌తోపాటు ముగ్గురు గైర్హాజరయ్యారు. అయితే రజనీ తరపు న్యాయవాది హాజ రై గైర్హాజరుకు అయిన కారణాలను కోర్టుకు వివరించారు. -
ఈ ఫొటో చూసి ‘నో’ అన్నారు!
ఏ సూపర్ స్టార్ అయినా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మామూలు వ్యక్తే. ఎన్నో తిరస్కరణలకు గురై, ఎలాగోలా అవకాశాలు సంపాదించుకుని, చివరికి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటారు. అదృష్టవంతులకు ఈ పాట్లు ఉండవనుకోండి. ఆ సంగతలా ఉంచితే... అష్టకష్టాలు పడి పైకొచ్చిన నటుల్లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ముందు చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా ఎంటరై, ఆనక ‘సూపర్ స్టార్’ అనిపించుకున్నారు. అవకాశాలు సంపాదించుకోవడం కోసం ఆయన తన ఫొటోలను ‘ట్యాలెంట్ హంట్’ కోసం పంపించేవారట. అలా అప్పట్లో పంపించిన ఓ ఫొటోను ఇప్పుడు అమితాబ్ బయటపెట్టారు. ‘‘ఓ ట్యాలెంట్ హంట్‌లో తిరస్కరణకు గురైన నా ఫొటో ఇది. ఈ ఫొటోని చూశాక, అప్పట్లో వాళ్ళు నన్ను తిరస్కరించడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదు కదూ’’ అని ఆయన పేర్కొన్నారు. తిరస్కరణకు గురయ్యాక, ఆయనలో ఓ పట్టుదల ఏర్పడింది. కోల్‌కతాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, అవకాశాల కోసం పూర్తిగా ముంబయ్‌లో ఉండటానికి డిసైడ్ అయ్యారు. ‘‘ముంబయ్‌లో అడుగుపెట్టాక రాజేశ్ ఖన్నాని చూసినప్పుడు అలాంటివాళ్లు ఉండగా మనలాంటివాళ్లకు అవకాశాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అనిపించింది’’ అని ఆనాటి విషయాలను తల్చుకున్నారు అమితాబ్. చివరికి 1968 ఫిబ్రవరి 15న ‘సాత్ హిందుస్తానీ’ సినిమా ఆడిషన్స్ కోసం రచయిత - దర్శకుడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఆఫీసుకు వెళ్లారాయన. ‘‘ఆ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్స్ చేశారు. నన్ను సెలక్ట్ చేశారు. ఆ విధంగా నటుడిగా నాకు ఎంట్రీ దొరికింది. ఇది జరిగి 47 ఏళ్లు అయ్యింది’’ అని అమితాబ్ పేర్కొన్నారు. -
ఐఫా ఫంక్షన్లో మహేష్ బాబు సందడి
-
ఒకేఒక్కడు మోనగాడు
-
సామాన్యుడిగా మొదలై అసమాన్యుడిగా
హీరో అంటే వెండితెర మీద విలన్లపై చెలరేగిపోవటం కాదు. నిజజీవితంలోనూ గెలవాలి. అట్టడుగు స్థాయి నుంచి ...అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి. చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. ఎంతో మందికి స్ఫూర్తి నివ్వాలి. తనకున్నంతలో కొంత మందికైన జీవితాన్ని ఇవ్వగలగాలి. అలాంటి వ్యక్తే నిజమైన హీరో. అటువంటి హీరో అభిమానుల గుండెల్లో నిలిచిపోతాడు. దైవసమానుడై నీరాజనాలు అందుకుంటాడు. అలా సామన్యుడిగా మొదలై అసమాన్యుడిగా ఎదిగిన సినీ శిఖరం రజనీకాంత్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. భారతీయ సినీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అంతర్జాతీయ స్థాయి నటుడు రజనీకాంత్. బస్సు కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. సినిమా వ్యాపారాన్ని తిరగరాసి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగిన రజనీ కాంత్ జీవితం.. స్ఫూర్తినిచ్చే సజీవ కావ్యం. రజనీ సినీ జీవితం చిన్న చిన్న విలన్ పాత్రలతో మొదలైంది. క్యారెక్టర్ రోల్స్‌తో కొత్త పుంతలు తొక్కింది. హీరో పాత్రలతో తారా పథాన్ని అందుకుంది. అయితే, ఈ ఆరోహణ అవలీలగా సాధ్యమైంది కాదు. ఆయన హీరోచిత ప్రస్థానం వెనుక కఠోర శ్రమ ఉంది. నిరాడంబరమైన దీక్ష ఉంది. చిన్నా పెద్దా అందరికీ.. ఓ బాషా కావాలి. ఓ రోబో కావాలి.. అలాంటివే ఇంకా ఇంకా కావాలి. ఈ రోజున రజనీ ఈ స్ధాయి కి చేరుకున్నాడంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. రజనీ జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. అవకాశాల కోసం మొదట్లో అనేక కష్టాలు పడ్డాడు. 1949 డిసెంబర్ 12 న బెంగుళూరులో ఒక మరాఠీ కుటుంబం లో జన్మించిన రజనీ కాంత్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీ రావ్ గైక్వాడ్. తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేసేవారు, తల్లి జిజీబాయ్. అయిదేళ్ళ వయసులోనే తల్లిని పోగొట్టుకున్న రజనీకాంత్ చిన్నప్పట్నుంచే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. బెంగుళూరులోని రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైస్కూల్ విద్యకు ఫుల్ స్టాప్ పెట్టి బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేశాడు. తర్వాత బెంగుళూరులో బస్ కండక్టర్‌గా రూట్ నెంబర్ 10 Aలో పనిచేశాడు.. బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ తమిళ వెర్షన్లో రజనీ సెకండ్ హీరోగా నటించాడు. క్యాన్సర్ రోగిగా ఆయన పోషించిన పాత్రకు పెద్దగాగుర్తింపు రాలేదు .ఆ తరవాత కన్నడంలో పుట్టన్న కన్నంగళ్ దర్శకత్వం వహించిన కథా సంగమం చిత్రంలో హీరోగా చేశాడు. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ దశలో మళ్ళీ బాలచందర్ నుంచి వచ్చిన పిలుపు రజనీ జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. తమిళంలో అవర్ ఒరు తోడర్ కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలలో రజనీ పోషించిన పాత్ర సూపర్ హిట్. ఈ చిత్రంలో రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టయిల్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత విలన్, హీరో అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు రజనీ కాంత్ . ఆయన మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం భైరవి. ఆ చిత్రం 1978లో విడుదలైంది. తన చిత్రాల రికార్డులను తానే బద్దలు కొట్టడం రజనీ స్టయిల్. బాషా, అన్నామలై, ముత్తు, అరుణాచలం, నరసింహ, ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ముత్తు సినిమాతో ఆయన సినిమాలు జపనీస్‌లోకి డబ్బింగ్ అవడం మొదలైంది. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ స్టార్ సినిమాకూ రావన్నది అక్షర సత్యం. సూపర్ స్టార్ గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ నిరాడంబరంగానే ఉంటాడు. మేకప్ తీసేస్తే ఆయన ఓ సాదా సీదా మనిషి. మంచితనంతో మూర్తీభవించిన ఉన్నతమైన వ్యక్తి. తనను అభిమానించే ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ప్రతి సారి నేనున్నానంటూ స్పందించటం రజనీకి అలవాటు అందుకే ఆయన అభిమానుల గుండెల్లో దైవంగా నిలిచాడు. తెర మీద రజనీ స్టైల్‌కే కాదు, తెర వెనుక రజనీ వ్యక్తిత్వానికి కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ ఏడాది చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తిన కారణంగా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు రజనీ. ఇప్పటికీ తన అభిమానులను అలరించటమే లక్ష్యం అంటున్న రజనీకాంత్ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిద్దాం. -
‘లోఫర్’ చిత్రం పాటల వేడుక
-
సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి
- ప్రభాస్ ‘‘స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరీగారి చేతుల్లో పడితే చాలు. అందుకే నేను ‘బుజ్జిగాడు’ కోసం ఆరు నెలల వెయిట్ చేశా. వరుణ్ వాళ్ల బాబాయి (పవన్ కల్యాణ్)లా కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’’ అని హీరో ప్రభాస్ అన్నారు. వరుణ్‌తేజ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘లోఫర్’. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ప్రభాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీ రాయగల ఒకే ఒక్క బెస్ట్ రైటర్ పూరీగారు. ‘నేను సీన్ తీయాలంటే వంద రోజులు తీయాలి. కానీ ఆ సీన్‌ని పూరి ఓ డైలాగ్‌లో రాస్తారు’ అని రాజమౌళి అన్నారు. దటీజ్ పూరి జగన్నాథ్’’ అని అన్నారు. పూరి తనలోని షేడ్స్ అన్నీ తెర మీద అద్భుతంగా చూపిస్తాడని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ‘‘నేను కొన్నేళ్ల క్రి తం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ తీశా. రామూగారు అప్పుడే ముంబై నుంచి మా ఆఫీసుకు వచ్చారు. ఏ సినిమా తీస్తున్నావంటే టైటిల్ చెప్పాను. వెంటనే తిట్టారు. ఆయనకు అలాంటి కథలు ఇష్టం ఉండవు. కానీ ఈ ‘లోఫర్’ సినిమా చూసి టైటిల్ మార్చి, ‘మా అమ్మ మహాలక్ష్మి’ అని పెట్టమన్నారు. నేనప్పుడే సక్సెస్ అయ్యాననుకున్నా. చాలా కాలం తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ సినిమా ఇది. వరుణ్ చిన్నతనం నుంచి మా ముందే పెరిగాడు. అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబుగారిని ‘ఏంటండీ... మీ అబ్బాయి హీరో అవుతాడా?’ అంటే ‘నాకు తెలీదు, వాడికీ తెలియట్లేదు ’అని అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నా దగ్గరకు వచ్చి డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరతానన్నాడు. కానీ, చివరికి నాకు డెరైక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. వరుణ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. త్వరలో పెద్ద స్టార్ అవుతాడు. నాకిష్టమైన డార్లింగ్ ప్రభాస్ ఈ ఆడియో వేడుకకు వచ్చినందకు అతనికి థ్యాంక్స్. నేను చాలామంది హీరోయిన్లను హగ్ చేసుకుంటాను. కానీ, ప్రభాస్‌ని హగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది’’ అని చెప్పారు (నవ్వుతూ). సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ప్రభాస్‌కూ, నాకూ ఓ విచిత్రమైన అనుబంధం ఉంది. తన ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’లో నేను విలన్‌గా నటించా. అప్పటి నుంచి పరిచయం. ‘లోఫర్’తో పూరి నాకో సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నాడు. వరుణ్ భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్‌గారు వచ్చాక ఈ వేడుకకు కళ వచ్చింది. ‘ఈశ్వర్’ సినిమా నుంచి నేనాయనకు అభిమానిని. ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరదామని వెళ్లాను. పూరీగారు తర్వాత రోజు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోగా చేయడం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్’’ అని అన్నారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ చిత్రాల్లోని డైలాగ్స్‌తో సరదాగా ఓ లక్కీ డిప్ నిర్వహించారు. అతిథులతో ఒక్కో డైలాగ్ చెప్పించారు. నాగబాబు, అలీ, నిర్మాతలు డి.సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి, అశోక్‌కుమార్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నటి రేవతి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
రజనీకాంత్ నా దేవుడు
ఏలూరు : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు దేవుడులాంటి వ్యక్తి అని సినీనటుడు సుమన్ అన్నారు. తాడేపల్లిగూడెం స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలిసారిగా ఇక్కడకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న మిత్రులకు సాయం చేసే వ్యక్తి రజనీకాంత్ అని, తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రజనీ తోడ్పాటునందించారన్నారు. ఆయన మార్గాన్నే తాను అనుసరిస్తున్నానని చెప్పారు. రజనీకాంత్ ప్రోత్సాహంతోనే శివాజీ చిత్రంలో విలన్‌గా నటించి అవార్డును అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. అన్నమయ్య చిత్రంలో పోషించిన వేంకటేశ్వరస్వామి పాత్రను ఎన్నటికీ మరువలేనని అన్నారు. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలతో పాటు హిందీలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ పాత్రలు పోషించడం తన చిరకాల కోరిక అన్నారు. మరో 12 ఏళ్లపాటు సినిమాల్లో నటించాలని ఉందని, అప్పటికి 50 ఏళ్ల సినీ జీవితం పూర్తవుతుందన్నారు. ఇప్పటివరకు 400 సినిమాల్లో నటించానని సుమన్ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్‌పై ప్రచారం ఇటీవల సమాజంలో చైన్ స్నాచింగ్‌లు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సుమన్ అన్నారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాలేజీ రోజుల్లోనే కరాటేపై మక్కువ పెంచుకున్నానని, ఈ కారణంగానే తమిళనాడులో కరాటే సుమన్‌గా తనకు పేరు వచ్చిందన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక క్రమశిక్షణ అలవడుతుందని, జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. తన భార్యకు శస్త్రచికిత్స చేయూల్సి వచ్చినా, పాపకు జ్వరం ఉన్న మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరిక మేరకు బ్రాండ్ అంబాసిడర్‌గా తొలి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానని సుమన్ తెలిపారు. -
మహేష్ క్రేజ్ చూసి షాకైన బాద్ షా
-
ఘట్టమనేని వారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీ సినిమాగా వచ్చిన 'మనం' చాలా మంది నటులను ఆలోచనలో పడేసింది. ఈ సినిమాతో తరతరాలుగా సినీరంగంలో ఉన్న చాలా కుటుంబాలు అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా ఈ ప్రయత్రాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకులు కూడా ఆ తరహా కథలను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడు తరాల నటులు కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్.. కృష్ణ, మహేష్, గౌతమ్‌లతో ఓ సినిమా తెరకెక్కించాడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా వినిపించిన ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా రెడీ చేసే పనిలో ఉన్నాడట. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆ తరువాత హీరో అయ్యాక కూడా పలు సినిమాల్లో కృష్ణ, మహేష్‌లు కలిసి నటించారు. అయితే ఘట్టమనేని మూడోతరం వారసుడిగా '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ పరిచయం కావడంతో.. ఈ మూడు తరాల నటులు కలిసి నటిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో చూడాలి. -
FNCCలో ఓ భవనానికి అబ్దుల్ కలాం పేరు
-
వస్తారు కానీ... స్టెప్పులు వేయరట
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించే 'సంగీత్' కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టెప్పులు వేస్తారంటూ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. అయితే మంచు వారి వివాహ వేడుకల్లో రజనీ మాత్రం స్టెప్పులు వేయరంటా. ఇదే విషయాన్ని హీరో మోహన్ బాబు కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు వెల్లడించారు. ఇవన్నీ వట్టి పుకార్లు అంటూ కొట్టి పారేశారు. రజనీ, మోహన్‌బాబు మంచి స్నేహితులు ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ వివాహ వేడుకలకు రజనీ హజరవుతారు. కానీ ఆయన స్టెప్పులు మాత్రం వేయరన్నారు. ఇదే విషయంపై రజనీకి అత్యంత సన్నిహితులు కూడా స్పందించారు. రజనీ తన ఇద్దరు కుమార్తెల వివాహం జరిగిన సమయంలోనే ఆయన స్టెప్పులు వెయ్యలేదన్న సంగతి వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో మంచు వారి వివాహనికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ వివాహ వేడుకలు మే 14 వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శంషాబాద్‌లోని మోహన్ బాబు నివాసంలో ఈ 'సంగీత్' వేడుకకు వేదిక కానుంది. వరుసగా ఐదు రోజులపాటు ధూమ్ ధామ్‌గా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో ప్రతిరోజు 'సంగీత్' ఉంటుంది. -
రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల అభినందనలు
చెన్నై: లింగా చిత్ర నష్టపరిహారం వ్యవహారంలో రూ. 10 కోట్లు తిరిగి చెల్లించడానికి సహకరించిన ఆ చిత్ర కథా నాయకుడు రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలిపారు. లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందంటూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నెత్తి నోరు బాదుకుంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రూ.33 కోట్ల నష్టానికి పది శాతం అంటే మూడు కోట్లు పరిహారం చెల్లిస్తానన్న లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు థాను దక్షిణ భారతచలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రజనీకాంత్ సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా తీర్మానం చేశారు. ఇందుకు కృషి చేసిన రజనీకాంత్‌కు, కలైపులి ఎస్.థానుకు, శరత్‌కుమార్‌కు డిస్ట్రిబ్యూటర్లు అభినందనలు తెలిపారు. -
చిక్కుల్లో లింగా
సూపర్ స్టార్ చిత్రానికీ చిక్కులు తప్పలేదు. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉండడం గమనార్హం. ఆ చిత్ర కథ తనదని ఒకరు కోర్టుకు వెళ్లి, రూ.10కోట్లు కోర్టులో డిపాజిట్ చేసేలా చేశారు. మరోవైపు చిత్ర నిర్మాతలకు, సినీ థియేటర్ యాజమాన్యాలకు విభేదాలు తలెత్తడంతో కొన్ని చోట్ల చిత్ర ప్రదర్శనపై అయోమయం నెలకొంది. దీంతో అభిమానుల్లో అసంతృప్తి నిండిపోయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే అదే సమయంలో అనేక చిక్కుముడులను ఛేదించుకోవాల్సి వచ్చింది. రోబో తరువాత రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ స్థితిలో రజనీ స్టరుుల్ మసాలా ఫార్ములాతో కూడిన లింగా చిత్రం షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ వారిలో ఉత్సాహం రెట్టింపైంది. అయితే లింగా చిత్రాన్ని చుట్టుముట్టిన అనేక వివాదాలు అభిమానుల ఆనందంపై నీళ్లు చల్లాయి. రూ.10 కోట్లు చెల్లిస్తేనే విడుదల: లింగా చిత్ర కథ తనదంటూ మదురై హైకోర్టులో రవిరత్నం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం తలె త్తింది. తాను రచించిన ముల్లైవనంలోని కథాంశాన్ని లింగాకు వాడుకున్నందున చిత్రం విడుదలపై స్టే విధించాలని కోరాడు. చిత్రం విడుదల కాకుండానే ఆ చిత్ర కథను అనుమానించడం తగదయి, విడుదల తర్వాత నిర్ధారణైతే కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చని కోర్టు సూచించి వాయిదావేసింది. దీంతో పిటిషన్‌దారుడు మద్రాసు హైకోర్టులో అదే రీతిన కేసువేసినా చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు కోర్టు తిరస్కరించింది. రవిరత్నం పిటిషన్ మదురై హైకోర్టులో గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. హైకోర్టు రిజిస్ట్రారు వద్ద లింగా నిర్మాతలు రూ.10 కోట్లు డిపాజిట్టు చేసి చిత్రాన్ని విడుదల చేసుకోవాలని న్యాయమూర్తులు ధనబాలన్, వేలుమణి ఆదేశించారు. శుక్రవారం (12వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల్లోగా ఈ సొమ్ము చెల్లించాలని షరతు విధించారు. ఈ నిబంధనకు లోబడే చిత్రాన్ని విడుదల చేసుకోవాలని స్పష్టం చేశారు. చిత్రం కథ తనదైన పక్షంలో పిటిషన్‌దారుడు రవిరత్నం కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చని న్యాయమూర్తులు పునరుద్ఘాటించారు. మరోవైపు లింగా చిత్రం హక్కుల అమ్మకాల్లో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తింది. అధికరేటును చెప్పడంతో థియేటర్ యాజమాన్యాలు వెనక్కుతగ్గాయి. ఈ కారణంగా రాష్ట్రంలోని అనేక థియేటర్లలో లింగా చిత్రాన్ని ప్రదర్శిస్తారో లేదో అనే అనుమానాలు మొదలయ్యూయి. తిరుచ్చిలో గురువారం వరకు లింగా ప్రదర్శనకు థియేటర్లు ఖరారు కాలేదు. ఈ పరిణామాలతో రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా విడుదలను అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. 5వేల థియేటర్లలో విడుదలకు సిద్ధం కోర్టులో పిటిషన్లు, వివాదాలు నడుమ లింగా చిత్రం విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 5వేల థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 328 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో 7వేల థియేటర్లు లింగా కోసం సిద్ధమయ్యూయి. ఈ సందర్భంగా తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సహాయ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ, సహజంగా డిసెంబరులో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తాయి. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని తెలిపారు. అయితే ఈ ఏడాది లింగా చిత్రం విడుదల కావడంతో ఎన్నడూ లేని సందడి నెలకొందన్నారు. రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే వారం రోజులకు ఫుల్ అయిపోయినట్లు ఆయన తెలిపాడు. ఇదిలా ఉండగా రజనీ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు సిద్ధమయ్యూరు. రజనీకాంత్ 65వ పుట్టిన రోజునే లింగా చిత్రం విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. కటౌట్లు, పతాకాలతో నగరాలను అలకరించి పండుగ వాతావరణం సృష్టించారు. రక్తదానం, అన్నదానం, చీరలు, పంచెలు, స్వీట్లు పంపిణీ వంటి సేవాకార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోవడం విశేషం. -
తెలిసింది గోరంత...తెలియాల్సింది కొండంత!
సినిమా హాలు లోపలికెళ్లగానే తలుపులు మూసేస్తారు. అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో బొమ్మ పడుతుంది వెండి తెర మీద. బొమ్మ పడగానే చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్లల్లో వెలుగు నిండుతుంది. ఎవణై్నతే చూడాలని వ్యయప్రయాసలకోర్చి వచ్చామో, వాడిని చూడగానే కనిపించే వెలుగు అది. ప్రేక్షకుడు వాడిని చూస్తాడు. వాడిలోని వాడిని చూస్తాడు. వేడిని చూస్తాడు. తన వాడిలో తనని తాను చూసుకుంటాడు. ఆ వెలుగు పంచిన ఆనందంలో కాస్సేపు తన జీవితాన్ని తను మర్చిపోతాడు. అలా చీకటిలో వెలుగును పంచేవాడే రజనీకాంత్. రజని అంటే చీకటి. కాంత్ అంటే వెలుగునిచ్చేవాడు. ఒక సాధారణ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అనడానికి కొలమానం రజనీకాంత్. ఒక అసాధారణ వ్యక్తి ఎంత ఒదిగి ఉండవచ్చు అన్నదానికీ కొలమానం రజనీకాంత్. కింద నుంచి పైకొచ్చినా, పై నుండి కిందికొచ్చినా, తల కిందులుగా తపస్సు చేసినా రజనీకాంత్‌ని కొట్టేవాడు ఈ తరంలో లేడు. ఎందుకంటే రజనీకాంత్ ఎవణై్ననా కొట్టేయగలడు కాబట్టి. ఇదంతా ఎందుకంటే... ఇవ్వాళ రజనీకాంత్ పుట్టిన రోజు. ‘లింగ’గా మరోసారి పుట్టిన రోజు. రజనీ ఒక పుట్టిన రోజే ఎంతో ఘనంగా ఉంటుంది. రెండు పుట్టిన రోజులు ఒకే రోజొస్తే ఇంకెంత ఘనంగా ఉంటుందో? చాలా మంది నటులకి పాత్ర పూనుకుంది అంటాం. వాళ్లు కూడా ఫలానా పాత్ర చాలా కాలం నాలో ఉండిపోయింది, అలాగే బిహేవ్ చేసేవాణ్ణి అనడం వింటాం. ఒక్కసారయినా రజనీ సార్ బాషా లాగో, బాబా లాగో, రోబో లాగో, నరసింహలాగో, ముత్తులాగో, అరుణాచలం లాగో, శివాజీలాగో, లింగాలాగో కొన్ని రోజులుంటే ఎంత బావుణ్ణు. సమాజంలో ఎన్ని వ్యవస్థలు ఆదరాబాదరాగా ప్రక్షాళనై పోయేవి? స్వచ్ఛభారత్ ఎంత తొందరగా సాధ్యమై పోయేది? అనిపిస్తుంటుంది నాకు. ఈయన మరీ డౌన్ టు ఎర్త్ - పాత్ర ఎత్తు ఆకాశమంత హైగా ఉంటుంది. ప్యాకప్ చెప్పగానే మనిషి పాతాళమంత లోతైన భావజాలంతో ఒదిగిపోయి ఉంటాడు. చాలా రోజులు ఆయన్ని ఆయన చూసుకోవడం వల్ల కలిగిన ఇన్సెక్యూరిటీ కారణం అనుకునే వాణ్ణి. కానీ కాదు. ఏ ప్రభావమూ తనపైన పడలేని, పడనీయని యోగ స్థితి అది. సినిమాయే జీవితంగా చెన్నై వచ్చిన బస్ కండక్టర్... సీఎమ్ కాన్వాయ్ వస్తుందని తనని ఇంటికెళ్లనీయకపోతే, కారు దిగి, సీఎమ్‌కే ట్రాఫిక్ జామ్ రుచి చూపించిన సూపర్‌స్టార్. ఒకటి అసలు - ఒకటి నకిలీ. నకిలీని అసలనుకుని భ్రమ పడకుండా, అసలుని నకిలీగా భావించకుండా - ఏ మకిలీ అంటని స్వచ్ఛతని మనసులోను, మెదడులోను, మాటలోను, నడవడిలోను, నిజాయతీలోను నింపుకున్న వ్యక్తి రజనీ మాత్రమే. అందుకే ఆయనలో అంత వెలుగు. అందుకే ఆయన్ని చూసిన ప్రేక్షకుడి కళ్లల్లో మరింత వెలుగు. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ రిచ్‌నెస్ - అంటే, రజనీకాంత్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఆయన అంత సింపుల్. అలాగే ఆయన ఎన్నో మంచి లక్షణాలకి శాంపిల్. మరెన్నో రుగ్మతలకి పిల్. అశావహ దృక్ఫథం మనిషికి ఆక్సిజన్ లాంటిది. రజనీకాంత్ ఆ ఆక్సిజన్. రజనీ కాంత్ ఒక రెడ్ బుల్. రజనీకాంత్‌ని విశ్లేషించలేము. విసుగొచ్చేదాకా విశేషణాలతో పొగడగలము. జీసస్, బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి... వీళ్లందరినీ మానవుల రూపంలో ఉన్న దేవుళ్లుగా కొలుస్తాం. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే అవకాశం తర్వాతి తరంలో ఎవరికైనా ఉంటే అది రజనీ సార్కే. కమర్షియల్ సినిమా నుంచి ఈ స్థితి సాధించడం మరీ కష్టమైన విషయం. ఆయనకి అందరు హీరోలకీ ఉన్నట్టు ఫ్యాన్స్ లేరు. చాలామంది దేవుళ్లకున్నట్టు భక్తులున్నారు. ఆయనకి గుడి లేదు. కటౌట్లకి పాలాభిషేకాలు, రక్తంతో తిలకాలూ లేవు. ధార్మిక సేవా కార్యక్రమాలున్నాయి. ఆయనకి పబ్లిసిటీ లేదు. ఆయన వెనకే పబ్లిక్ ఉన్నారు. ఆయనకి రాజకీయాలు తెలీదు. రాజకీయాల్లో ఆయనున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, నిలబెట్టగలరు. కానీ దాని జోలికెళ్లరు. డబ్బు సంపాదించాక పక్క వ్యాపారాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న ఎంతోమంది స్టార్లున్నారు. కానీ ఆయన ఏ ఐపిఎల్ టీమ్కీ ఫ్రాంఛైజీ కాదు. ఏ వ్యాపారానికీ అధినేత కాదు. ఆయనకి స్కీముల్లేవు. అందుకే ఏ స్కాముల్లోనూ లేరు. ఆయనకి ఈ రోజు ఎలా బతకాలో తెలుసు. నిన్న తనేమిటో గుర్తు. రేపటి గురించిన ఆలోచన లేదు. అందుకే అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. తన మీద, తన వయసు మీద తనే జోకులేసుకోగలుగుతున్నారు. నటనే జీవితమయ్యాక కూడా, జీవితంలో నటించకుండా ఉండగలుగుతున్నారు. రజనీ ఒక స్ఫూర్తి పాఠం. రజనీ ఒక అతీత శక్తి. రజనీ ఒక జనాకర్షణ యంత్రం. రజనీ ఒక తారకమంత్రం. మనిషి నుంచి మనీషిగా మారే ప్రయాణం రజనీకాంత్. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాడు. రజనీకాంత్ అంటే చీకటిలో వెలుగు నింపేవాడు. అందుకే రజనీకాంత్ - ఒక గురువు. ప్రతి మనిషీ బ్రతకడానికి నేర్చుకోవలసిన తప్పనిసరి పాఠం రజనీకాంత్. ఈ పాఠం చదువుతున్నా, విన్నా, వెండితెర మీద చూసినా ఆనందం. తాదాత్మ్యం. దటీజ్ రజనీ సర్. లాంగ్ లివ్ రజనీ సర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సర్. మీ...వి.ఎన్. ఆదిత్య దర్శకుడు -
‘సచిన్’ ఆడియో రిలీజ్
-
మలయాళ మ్యాజిక్..!
నటనలో సూపర్ స్టార్ అయినా.. అంతర్లీనంగా ఉన్న కళ మోహన్‌లాల్‌ను నిద్దర పోనిచ్చినట్టు లేదు. ఆ మధ్య ఎప్పుడో మెజీషియన్ గోపీనాథ్ ముకుంద్తో కలసి ‘డేరింగ్ ఎస్కేప్’ యాక్ట్ చేయబోయి.. రాష్ట్రమంతా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గాడు. ఎట్టకేలకు చాలా ఏళ్ల తరువాత రీసెంట్గా త్రివేండ్రంలో మ్యాజిక్ చేసి తనలోని మరో కోణాన్ని సంతృప్తి పరిచాడు. మెజీషియన్ జనియా భుంగారాతో ‘ఫ్లోటింగ్ లేడీ’ ట్రిక్ ప్రదర్శించి ఆడియన్స్ చప్పట్లు అందుకున్నాడట ఈ మలయాళ మెగాస్టార్. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - పూరీ జగన్నాథ్
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కృష్ణ వంశీ
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సూర్య
-
సూపర్‌స్టార్ సినిమానే కాదంది!!
-
సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడొస్తున్నాడు!
-
మహేష్‌నే ఫాలో అవుతున్న పవర్‌స్టార్!
-
సుదీప్ అత్తారింటికి దారేది
కన్నడ అగ్రశ్రేణి నటుడు సుదీప్‌కు దక్షిణాది అంతటా అభిమానులున్నారు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సుదీప్ సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా... కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య’ పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు సుదీప్. ఇదే జోష్‌లో మరో రీమేక్‌కి కూడా ఆయన పచ్చ జెండా ఊపేశారు. తెలుగులో రికార్డులు తిరగరాసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కన్నడంలో ఆయన చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయ్యాక సినిమాకు సంబంధించిన వివరాలు తెలుపుతానని సుదీప్ చెప్పారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎన్టీఆర్
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మాధురీ దీక్షిత్
-
స్టార్లకే... స్టార్!
ప్రపంచంలో కనిపించేదంతా నమ్మకం మాత్రమే. అమ్మ ఒక్కటే నిజం. అందుకే... ఈ జగత్తులో అమ్మని మించిన సెలబ్రిటీ వేరొకరు లేరు. ఆఖరుకు... దేవుడైనా అమ్మ తర్వాతే. ‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే’ అని సినారె ఊరకే అన్నారా! ఈ రోజు మాతృ దినోత్సవం. నిజానికి అమ్మ రోజు కానిది ఏది? ఏడాదిలోని అన్ని రోజులూ అమ్మవే. కానీ... ప్రత్యేకించి ఒక రోజుని అమ్మకు ఎందుకు కేటాయించారు? దానికి సమాధానం ఒక్కటే.. ఆమెను స్మరించుకోవడానికీ, పూజించుకోడానికి. అలా చూస్తే... కేలండర్లోని పండగలన్నింటిలో అతి పెద్ద పండుగ ఇదే. ఇక్కడున్న స్టిల్స్ చూడండి... సినీ ప్రముఖులందరూ తమ అమ్మలతో ఎంత ముచ్చటగా పోజులిచ్చారో. వీళ్లందరూ కేవలం స్టార్లు. కానీ అమ్మ... ‘సూపర్ స్టార్లకే సూపర్‌స్టార్’.. ఏమంటారు? -
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో లింగా..?
ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలోనే లింగా చిత్రం తెరకెక్కిందని కోలీవుడ్ టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడైయాన్ తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం లింగా. ఇందులో రజనీ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మల యాళ దర్శకుడు రూపొందిస్తున్న డ్యామ్ 999 చిత్రానికి పోటీగా నిర్మిస్తున్నట్లు సమాచారం. పెరియార్ డ్యామ్ ను బెన్ని క్విక్ అనే ఆంగ్లే య ఇంజినీర్ నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా పలు భూములు సాగులోకి వచ్చారుు. ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది. నీటి ఒత్తిడి పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో సాగే లింగా చిత్రంలో రజనీ ఆంగ్లేయ ఇంజినీర్ బెన్ని క్విక్‌గా నటిస్తున్నారని, వ్యవసాయ సాగు కోసం డ్యామ్‌ను నిర్మించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆయన కొడుకుగా మరో పాత్రను నవతరం యువకుడిగా రజనీ నటిస్తున్నారట. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న డ్యామ్‌ను పునర్నిర్మించడానికి పోరాడే పాత్ర ఇదని తెలుస్తోంది. ఈ చిత్రం లో హాస్యనటులు వడివేలు, సంతానం ఇద్దరు రజనీ కాంత్‌లతో నటిస్తున్నట్లు సమాచారం. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి
బాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆదిశేషగిరిరావు పార్టీలో చేరారు. సూపర్ స్టార్ కృష్ణకు స్వయాన సోదరుడైన ఆదిశేషగిరిరావు పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - దివ్యభారతి
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కె. విశ్వనాథ్
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్-రవితేజ
-
ఎయిటీస్ స్టార్స జాయ్‌ఫుల్ నైట్
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : ఎయిటీస్ స్టార్స్ నైట్ పార్టీని దక్షిణాది ప్రముఖ తారలు జాయ్‌ఫుల్‌గా గడిపారు. వీరం తా ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1980లో కేరీర్‌ను ప్రారంభించిన తారలందరూ ఏడాదికో రోజును సమష్టిగా, సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జాయ్‌ఫుల్ డే ఐదేళ్ల క్రితమే ప్రారంభమైంది. 1980లో నటీనటులందరూ ఒక కుటుంబంలా ఒక చోట కలుసుకుని తమ అంతరంగాలను పంచుకుంటూ ఆహ్లాదంగా గడపడానికి చెన్నైని వేదికగా ఎంచుకున్నారు. దీనికి 80స్ ఫిలింస్టార్ గెట్ టు గెదర్ అనే పేరును పెట్టుకున్నారు. ఈ ఏడాదికి గాను శనివారం రాత్రి చెన్నై ఇంజంబాక్కం ఈస్ట్‌కోస్ట్ లోని ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ గెస్ట్ హౌస్‌లో దక్షిణాది ప్రముఖ తారలు కలిసి ఎంజాయ్ చేశారు. వీరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మోహన్‌లాల్, జయరామ్, అంబరీష్, అర్జున్, సుమన్, రమేష్ అరవింద్, మోహన్, నరేష్, భాను చందర్, నటీమణులు సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, రేవతి, విజి ప్రియదర్శన్, సరిత, సుమలత, రాధిక, అంభిక, పూర్ణిమ భాగ్యరాజ్, తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేకంగా జరుపుకుంటున్న ఈ తారల గెట్టు గెదర్ కార్యక్రమానికి మూల కారణం నటి సుహాసిని, విజి ప్రియదర్శన్ నట. ఈ ఐడియా వారిదేనట. వీరు ఈ తరహా తారల పార్టీకి 2009లోనే శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నటుడు మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన ఈ విందు సందడికి నటి సుహాసిని బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పార్టీలో పాల్గొనడానికి ఎలాంటి సభ్యత్వం అవసరం లేదని ఈమె పేర్కొన్నారు. ఈ పార్టీ కేవలం 80 కాలఘట్టంలోని తారలకే పరిమితం అన్నారు. అలాగే దర్శక, నిర్మాతలు లాంటి వారికి అనుమతి లేదని కూడా సుహాసిని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ విందులో పాల్గొన్న రజనీకాంత్, చిరంజీవిలతో సహా అందరు కలర్‌ఫుల్ దుస్తుల్లో పాల్గొనడం, గెట్ టు గెదర్ చివరి దశకు చేరుకున్న తరువాత మోహన్‌లాల్ అందరికీ అందమైన పెయింటింగ్‌లను బహుమతిగా అందించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్-సల్మాన్ ఖాన్
-
స్టార్ స్టార్ సూపర్‌స్టార్-ప్రబాస్
-
సినీమాయణం: సూపర్ స్టార్