Surgeries
-
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
పెరుగుతున్న మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా @ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు.మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్‌ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి గానీ, మహిళలు, పిల్లల్లోనూ కనిపిస్తుంది.గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక కార్యదర్శి, ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్గంటి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి, ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యూటీఐ, ఎస్టీఐ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే అసలు మూత్రనాళం ఏర్పడదు. ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు క్యాథటర్స్ అమర్చుకోవడం, అదనపు వ్యాధులు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది” అని తెలిపారు. సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే.. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది.ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఏడాదికి 50 కేసులే చేసేవాళ్లం. ఇప్పుడు 200-250 వరకు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో మేం అగ్రస్థానంలో ఉన్నాం. నిపుణుల నుంచి నేర్చుకుని, శిక్షణ పొందడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, వీటిలో వైఫల్యాల రేటు ఎక్కువ. రోగుల కోణం నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు, నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. యూకే, ఉగాండా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, థాయ్ లాండ్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలోనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగణ్యులుగా పేరొందిన పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ప్రధానంగా ఈ సదస్సులో మాట్లాడారు. ఐఎస్బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఏఐఎన్‌యూ గురించి భారతదేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్వర్కులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి.యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మమిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది. యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, రోబోటిక్ యూరాలజీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది. -
కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?
ఓ చిన్నారి పుట్టుకతో ముక్కు లేకుండా జన్మించాడు. ఆ చిన్నారి తల్లికి 20 వారాల గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డలో ఏదో సమస్య ఉందని తెలిసింది. ఆ తర్వాత స్కానింగ్‌లో బిడ్డ ముక్కు కనిపించ లేదని, అలాగే బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేడని చెప్పారు వైద్యులు. అయితే ఆ తల్లి అబార్షన్ చేయించుకునేందకు ఇష్టపడలేదు. ఎలా ఉన్నా.. భూమ్మీదకు తీసుకురావాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. చివరికీ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించాడు. ఆ బిడ్డ బతికే క్షణాలు కూడా తక్కవే అని పెదవి విరిచారు డాక్టర్లు. సీన్ కట్ చేస్తే..22 ఏళ్ల తర్వాత.. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన జాన్, మేరీ జో దంపతులు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీ జో సరిగ్గా 20 వారాల గర్భతగా ఉండగా.. ఏదో సమస్య తలెత్తుందని అనిపించింది. వారి ఊహించినదే నిజమైంది. స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డ మెదడు సరిగా అభివృద్ధి చెందలేదని, అలాగే ముక్కు కూడా లేదని తేలింది. శిశువు పుట్టిన బతకడం కష్టం అని గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా మేరీ జోకి సూచించారు. అయితే అందుకు ఆ దంపతుల మనసు అంగీకరించ లేదు. దీంతో వారు ఏం జరిగినా ఆ బిడ్డను ఈ భూమ్మీదకు తెచ్చి పెంచుకుందామని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అయితే ఆ బిడ్డ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించడం జరిగింది. అదీకూడా డెలీవెరీకి ఐదువారాల ముందుగానే సీజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఇక ఆ శిశువుకి పుట్టడంతోనే ముక్కు, కనురెప్పలు ఏర్పడలేదు. పైగా శిశువు మెదడులో ఎడమవైపు భాగం కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆ శిశువు పాదాలకు వేళ్లు కూడా లేవు. దీంతో డాక్టర్లు ఎంతసేపో ఆ శిశువు బతకదని పెదవి విరిచారు. ఎందుకంటే? ముక్కు లేదు కాబట్టి అస్సలు శ్వాస పీల్చుకోగలుగుతుందా లేదనది ఒక ప్రశ్న అయితే ఆక్సిజన్ మెదడకు సక్రమంగా అందకపోతే బతికే ఛాన్స్ అనేది కచ్చితంగా ఉండదు. ఈ రసవత్తరకరమైన ఆందోళనల మధ్య ఓ అద్భుతంలా ఆ శిశువు శ్వాస పీల్చుకోవడం బతకడం చకచక జరిగిపోయింది. వైద్యులు కూడా ఊహించని రీతీలో ఆ శిశువు కోలుకుంటూ..జస్ట్ డెలివరీ అయిన ఒక్క వారంలోనే డిశ్చార్చ్ అయ్యి తల్లిదండ్రలతో వెళ్లిపోయాడు. అయితే తల్లిదండ్రలు ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ అత్యంత భద్రంగా పెంచారు. ఎందుకంటే ముక్కులేదు కాబట్టి రంధ్రంగా ఉన్న ఆ ప్లేస్‌లో ఒక సన్నని నెట్మాదిరి క్లాత్‌ని అడ్డంగా ఉంచేవారు. అలాగే కళ్లకు రెప్పలు లేవు కాబట్టి నిద్ర వచ్చే సమయంలో వైద్యులు ఇచ్చిన ఒక రకమైన ద్రవాన్ని రక్షణగా ఉంచేవారు. అలా ఆ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు ఓ గాజు ముక్కలా కాపడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే వరకు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 సర్జరీలు దాక చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 22 ఏళ్లు. ఇప్పుడు అతను అందరిలానే సంగీతం, బేస్‌బాల్ వంటి ఆటలు ఆడుతూ హాయిగా గడుపుతున్నాడు. ఆ చిన్నారికి పేరు గ్రే కెనాల్స్. పుట్టుకతో ముక్కు లేకపోవడంతో కేవలం దీని పునర్నిర్మాణం కోసం ఏకంగా 11 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా కొద్దిమందికి మాత్రమే జరగుతుందని వైద్యులు చెబుతున్నారు. పైగా పూర్తి ముక్కుని పునర్నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన సర్జరీ కూడా. అలాగే అతడి తల్లిందండ్రులు కూడా అతడు ఎదిగే క్రమంలో తన తోటి పిల్లలతో చులకనకు గురవ్వకూడదని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు. అలాగే తన పట్ల ఎవ్వరూ జాలి చూపకుండా ఎలా మసులుకోవాలో కూడా కెన్నాల్కి తల్లిదండ్రులు నేర్పించారు. అంతేగాదు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి బాధపకడ పోగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేకమైన తల్లిదండ్రులకే ఇస్తాడని సగర్వంగా చెప్పారు. పైగా వైకల్యంతో పుట్టిన పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు వ్యవహరించాలనేందుకు స్ఫూర్తిగా నిలిచారు ఆ దంపతులు. బిడ్డ సమస్యను ముందు తల్లిదండ్రులే ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీ అయితేనే బిడ్డలో స్థైర్యాన్ని నిపంగలమని చాటి చెప్పారు. ఇక కెన్నాల్ కూడా తాను ఇన్ని సర్జరీలు చేసి నరకయాతన చూసిన తల్లిదండ్రులు ఇచ్చిన స్థైర్యాన్ని ఆశని వదులకోకపోవడం విశేషం. ఇక కెనాల్స్ కూడా ఈ సర్జరీల వల్ల తన జీవితానికి కలుగుతున్న అంతరాయన్ని అధిగమించి చక్కగా ముందుకు సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. మరీ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా!. (చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..) -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
ఈ చిన్న సర్జరీతో ఆంటీలను అందంగా మార్చవచ్చు
-
16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా దీని భారిన పడుతున్నారు. అయితే.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా. గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన డా. గౌరవ్ గాంధీ అంటే ఆ ప్రాంతంలో తెలియనివారుండరు. ఆయన చేతితో ఎన్నో గుండె ఆపరేషన్లు చేశారు. ఎందరి ప్రాణాలనో రక్షించారు. గుండెకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూచనలు చేసేవారు. కేవలం నాలుగు పదుల వయస్సులోనే సుప్రసిద్ధ కార్డియాలజిస్టుగా పేరుగాంచారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే గుండెపోటుతో మరణించారు. సుమారు 16 వేల ఆపరేషన్లు ఆయన ఇప్పటివరకు చేశారు. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రి పనులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి చేరారు. రోజూలానే భోజనం పూర్తి చేసుకుని నిద్రకు వెళ్లారు. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని స్పష్టం చేశారు. రాత్రి నిద్రకు వెళ్లే సమయంలో ఎలాంటి అసౌకర్యంగా ఆయన కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలుపారు. ఆయన మంచి ఆహారాన్నే తీసుకున్నారని వెల్లడించారు. డా. గాంధీ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి:కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. వారి ఐదు డిమాండ్లు ఇవే..! -
లక్షలాది అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా వారున్న చోటుకే పింఛను డబ్బు పంపిస్తున్నారు. మరో పక్క వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా మలి వయసులో చూపు మసకబారిన అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ సమయంలో కొంత అవరోధం కలిగింది. కోవిడ్ ప్రభావం తగ్గగానే మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. 56,88,424 మంది అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 31,77,994 మందికి పరీక్షలు చేశారు. 11,46,659 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు 8,81,659 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి కూడా కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చారు. 1,86,628 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని గుర్తించగా ఇప్పటి వరకు 53,416 మందికి ఉచితంగా ఈ సర్జరీలు చేసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చారు. త్వరగా సర్జరీలు చేయండి సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి వైఎస్సార్ కంటి వెలుగు కింద అవ్వా తాతలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కంటి పరీక్షల బృందం గ్రామాల పర్యటన షెడ్యూల్‌ను ముందుగానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకొని క్యాటరాక్ట్ సర్జరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా అధికారులు పక్షం రోజుల్లోనే 3,650 శస్త్రచికిత్సలు చేయించారని చెప్పారు. మిగతా జిల్లాలు కూడా ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున మొబిలైజేషన్ నిధులను విడుదల చేశామన్నారు. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమం పురోగతిని పక్షం రోజులకోసారి పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. కంటి వెలుగుతో చూపు మాది పేద కుటుంబం. భర్త చనిపోయాడు. ఎవరూ లేరు. జగనన్న ఇస్తున్న పింఛను మీద జీవిస్తున్నాను. ఒక రోజు కంటిలో మసక వచ్చింది. వస్తువులు కనపడడంలేదు. మా ప్రాంతంలోని ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ రత్నంను సంప్రదించగా, కంటికి క్యాటరాక్ట్ సమస్య ఉందని చెప్పారు. దాని కి ఖర్చు భరించలేనని చెప్పడంతో వెంటనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా చేస్తామన్నారు. మార్చి 29న ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కన్ను బాగా కనిపిస్తోంది. నా పని నేను చేసుకుంటున్నాను. జగనన్న ఇస్తున్న పింఛన్ డబ్బులు, కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా జీవిస్తున్నాను. –డి. లక్ష్మీ నారాయణమ్మ, 65 సంవత్సరాలు, మధురవాడ,బాపూజీ నగర్, విశాఖపట్నం -
12 రకాల సర్జరీలు.. లక్షల డాలర్లు ఖర్చు..తీరా చూస్తే ప్రాణం పోయింది!
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో దవడకు అమర్చిన ఇంప్లాంట్లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్ఫెక్షన్కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను దక్షిణ కొరియా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
ఎట్టకేలకు ముసుగు తీసి.. ముఖం చూపెట్టింది
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్ అయ్యింది ఒక యువతి(21). అయితే ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అదీ జైలు నుంచి విడుదలైన తర్వాతే!. ఇరాన్‌కు చెందిన సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించిన వికృతంగా మారినట్లు తబర్పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం. మహ్సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. మసిహ్ అలినెజద్ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది. హిజాబ్ విషయంలో ఆమె చేసిన ఒక చిన్న జోక్.. ఆమెను కటకటాల పాల్జేసింది. ఆమె కన్నతల్లి రోజూ కన్నీరు కార్చింది. ఈ వ్యవహారంలో నటి ఏంజెలీనా కలగజేసుకోవాలని మసిహ్ అలినెజద్ కోరారు కూడా. అయితే.. హిజాబ్ వ్యతిరేక నిరసనల నడుమ జైలు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇక బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాక.. తబర్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది. గతంలో ముఖానికి తాను కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనని, అయితే.. వికృతంగా రూపం మాత్రం మారలేదని ఆమె వెల్లడించింది. సోషల్ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే.. 2017లో సర్జరీలు వికటించడంతో దెయ్యంలా మారిందంటూ తబర్ గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా ఆమెకు సోషల్ మీడియాలో పేరు ముద్రపడిపోయింది. తబర్ అసలు పేరు ఫతేమెహ్ కిష్వంద్. సుమారు 50 సర్జరీలు చేయించుకున్నట్లు.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు అబద్ధం చెప్పింది. ఒక హీరోయిన్గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చన్న ఆలోచన కొంతమేర వర్కవుట్ అయినా.. ఆపై బెడిసి కొట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
కాకినాడ జీజీహెచ్‌లో 100కు చేరిన బ్లాక్ ఫంగస్ సర్జరీలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్ ఫంగస్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. -
సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడింది. గాంధీ, నిమ్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటళ్లు సహా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలకు బ్రేక్ పడింది. అత్యవసర ఆపరేషన్లు మినహా మిగతా అన్నింటినీ డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల నుంచి ఆపరేషన్ థియేటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సోకుతోంది. తాజాగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సర్జరీలను నిలిపేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన బాధితులను కూడా కరోనా తీవ్రత తగ్గి, పరిస్థితులు మెరుగయ్యాక రావాల్సిందిగా చెప్పి పంపేస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేక సర్జరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌కు తాళం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 650 నుంచి 700 మంది రోగులు వస్తుంటారు. ముక్కులో కండ పెరిగి శ్వాసకు ఇబ్బందికావడం, చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి, కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు వంటి ఆపరేషన్లు.. రోజుకు సగటున 20 నుంచి 25 వరకు జరిగేవి. అయితే ఆపరేషన్ థియేటర్లో పనిచేసే అనస్థీషియన్, సిస్టర్లకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బుధవారం నుంచి సర్జరీలు వాయిదా వేసి, ఆపరేషన్ థియేటర్లకు తాళం వేశారు. ఇప్పటికే చికిత్స కోసం ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న వారికి.. వారం పది రోజుల తర్వాత రావాలంటూ డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు. ఉస్మానియా, గాంధీలో 60 శాతానికి పడిపోయిన సర్జరీలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 11 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. వాటన్నింటిలో కలిపి రోజుకు సగటున వంద మైనర్, 25 మేజర్ ఆపరేషన్లు జరుగుతుంటాయి. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రస్తుతం అత్యవసరమైనవి మినహా సాధారణ చికిత్సలను చేయడం లేదు. దీంతో ప్రస్తుతం రోజుకు 40లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక గాంధీ ఆస్పత్రిలో 28 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. చిన్నా పెద్దా అన్నీ కలిపి గతంలో రోజుకు సగటున 150 శస్త్రచికిత్సలు జరిగేవి. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో గత మార్చి నుంచి డిసెంబర్ వరకు ఆపరేషన్ థియేటర్లను మొత్తంగా మూసేశారు. ప్రాక్టీస్‌కు దూరమవుతున్నామన్న వైద్య విద్యార్థుల ఆందోళనతో జనవరి తర్వాత పునరుద్ధరించారు. అయినా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు సహా ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రుల్లోనూ సర్జరీలు చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కుటుంబ నియంత్రణ శిబిరాలు కూడా వాయిదా పడ్డాయి. నిలిచిన ట్రాన్స్ప్లాంటేషన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొంతమేర అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నప్పటికీ...ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాగా తగ్గిపోయాయి. నిమ్స్ మూత్రపిండాల విభాగంలో గతంలో వారానికి నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేవారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఒకటి రెండే చేస్తున్నారు. కీలకమైన గుండె మారి్పడి, కాలేయ మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ టెస్టులతోపాటు స్టెంట్ ప్రొసీజర్లు కూడా సగానికి పడిపోయాయి. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8,633 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 4,383 మంది కిడ్నీ కోసం, 3,950 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం వేచి ఉన్నారు. గతంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలే కాకుండా లైవ్ డోనర్ల (బంధువులు) నుంచి కూడా అవయవాలు తీసుకుని బాధితులకు అమర్చేవారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అసలు గత ఏడాది కాలంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్క గుండె, కాలేయ మార్పిడి చికిత్స కూడా జరగకపోవడం గమనార్హం. ఈ బాలుడి పేరు మణిదీప్. ముక్కు లో కండరాలు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆపరేషన్ థియేటర్లు (ఓటీ) మూసివేశామని.. ఫ్యూమిగేషన్ తర్వాత రీఓపెన్ చేసి, చికిత్స చేస్తామని చెప్పారు. ఆ బాలుడేమో నోటితోనే శ్వాస తీసుకోవాల్సి వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వారం తర్వాత రమ్మన్నారు కన్నుకు, దవడకు మధ్య గాయమైంది. చర్మంతోపాటు కండరాలు దెబ్బతిన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక 15 రోజుల కింద గాంధీ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షించి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. మందులు రాసి పంపారు. డాక్టర్లు చెప్పిన మేరకు బుధవారం మళ్లీ గాం«దీకి వచ్చాను. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరో వారం తర్వాత వస్తే.. అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –వాజిద్, ఖమ్మం వైద్యులు కూడా భయపడుతున్నారు కరోనా శకం ముగిసిపోయిందని అంతా సంతోషపడ్తున్న సమయంలోనే సెకండ్ వేవ్ మొదలైంది. వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఏ స్ట్రెయిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక వైద్యులు సైతం భయపడుతున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేందుకే వెనుకాడుతున్నారు. ఫలితంగా సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి అంతా టీకా వేయించుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. విధిగా మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. వ్యక్తిగత శుభ్రతతోపాటు పౌష్టికాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. –డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు చదవండి: మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి కరోనా కేసులపై వైద్యశాఖ కీలక నిర్ణయం..! -
టేబుళ్లు.. కత్తెర్లు కరువు! రోగుల నిరీక్షణ!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ చికిత్సలతో పోలిస్తే స్పైన్, స్పాండలైటిస్, మెదడులో కణుతుల చికిత్సలు కొంత క్లిష్టమైనవి. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే వీటిని చేయగలుగుతారు. నిమ్స్ న్యూరో సర్జరీ విభాగం ఈ చికిత్సలకు ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి రోగులు పోటెత్తుతుంటారు. ఈ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, 60 పడకలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సర్జరీలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్యపరికరాలు కొనుగోలు చేయకపోగా, ఏళ్ల క్రితం కొనుగోలు చేసినవి కూడా సాంకేతిక లోపాలు తలెత్తి మూలకు చేరాయి. ఏడాది క్రితం 35 లక్షల రూపాయల ఖరీదు చేసే అనస్థీషియా వర్క్ స్టేషన్, ఓటీ లైట్లు పాడైపోవడంతో అప్పటి నుంచి సర్జరీలకు విఘాతం కలుగుతోంది. డ్రిల్లింగ్ మిషన్ లేక సర్జరీలు వాయిదా.. ఎముకలను కత్తిరించే డ్రిల్లింగ్ మిషన్ (రూ.15 లక్షలు ఖరీదు చేసే) పాడైపోయి ఐదు నెలలైంది. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న వారికి మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. ఇలా ఒక్క స్పైన్ అండ్ స్పాండలైటిస్‌తో బాధపడుతున్న బాధితులే 60 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఇక మెదడులో కణతులు, రక్తంగడ్డకట్టిన బాధితులు మరో వంద మందికి పైగా ఉన్నారు. కింది చిత్రంలో కన్పిస్తున్న ఆయన పేరు కొప్పొజు శేఖరాచారి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం. ఫ్లోరైడ్ కారణంగా మెడ, వెన్నెముక వంగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స కోసం ఇటీవల నిమ్స్ వైద్యులను సంప్రదించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఆయన్ను పరీక్షించి... సీసీఎం, సీ4, సీ5, సీ6 సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ రాసి, ఆ మేరకు సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. నెలరోజులైంది కానీ ఇప్పటికీ సర్జరీ చేయలేదు. అదేమంటే ఆపరేషన్ టేబుల్ ఖాళీ లేదని ఒకసారి..బోన్ కటింగ్ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ లేదని మరోసారి తిప్పిపంపారు. సర్జరీ ఎప్పుడు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు’..ఇలా ఒక్క శేఖరాచారి మాత్రమే కాదు మెదడులో కణుతులు, మెడ, వెన్నె ముఖ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది చికిత్సల కోసం నాలుగైదు మాసాలు నిరీక్షించాల్సి వస్తోంది. చికిత్సలో జాప్యం వల్ల సమస్య మరింత ముదిరి చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. -
‘మత్తు’ డాక్టర్లు కావలెను
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడు అనస్తీషియా వైద్యుల పోస్టులు ఉండగా ఒక్కరే అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్ సీహెచ్‌సీతో పాటు భైంసా ఏరియా ఆస్పత్రిలో మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆపరేషన్లు చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్స చేయాలంటే మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో ఉండాల్సిందే. ఆపరేషన్ థియేటర్లో సర్జన్‌తో పాటు అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి. వ్యాధి తీవ్రత, రోగి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మత్తుమందు ఇస్తారు. మత్తు ఎక్కడ ఇవ్వాలనేది అనస్తీషియనే నిర్ణయిస్తాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మాత్రమే ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇందులో ఒకరు ఒక వారం పాటు ప్రసూతి ఆస్పత్రిలో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 21 మందికి ఆరుగురు మాత్రమే జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 అనస్తీషియా వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో కీలకమైంది జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి. జిల్లా ఆస్పత్రి, బైంసా ఏరియా ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్‌తో పాటు డిప్యూటీ సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే అసిస్టెంట్ సివిల్ సర్జన్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరో అనస్తీషియా పోస్ట్ ఖాళీగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడుగురికి ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖానాపూర్ సీహెచ్‌సీలో మూడు అనస్తీసియా పోస్టులకుగానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తున్నా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి సారించకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. వైద్యుల కొరతతో ఇబ్బందులు జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 4,676 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,688 సిజేరియన్లు, 988 సాధారణ కాన్పులు. జిల్లా ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 2,150 ఆపరేషన్లు చేశారు. గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు 1089, గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు 2643. కానీ అనస్తీషియా వైద్యులు సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఖాళీగా ఉన్న అనస్తీసియా పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – దేవేందర్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ -
లేజర్ ట్రీట్మెంట్: 'అమ్మాయిగా అనిపించట్లేదు'
లండన్: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది. 2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్ అనే బ్యూటీషియన్ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్ ట్రీట్మెంట్ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్ చేసింది. చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు -
కరోనా టైమ్.. రోబోటిక్ సర్జరీలకు ఊపు
వైద్య రంగంలో రోబోలు ప్రవేశించి దశాబ్దాలు గడిచింది. వాటి వినియోగం కూడా దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో.. చాలా రంగాల్లో పెను మార్పులు తెచ్చిన కరోనా వైద్య రంగంలో కూడా అనేక మార్పులకు కారణమైంది. అందులో ఒకటి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ(ఆర్ఎఎస్)లకు మరింత ఆదరణ పెంచడం. నగరంలో మరింత మందికి రోబోల సాయంతో చేసే శస్త్ర చికిత్సలపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్‌లో వాటి అవసరాన్ని గుర్తించేలా చేసింది కరోనా. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన రోబోటిక్ సర్జరీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల్లోనే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్‌కతాల్లో ఆర్ఏఎస్లు ఊపందుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ ప్రకటించిన 4 నెలల్లోపు బెంగళూర్లోనే 400కిపైగా ఆర్ఏఎస్లు నిర్వహించారు. అలాగే మిగిలిన మెట్రోల్లో కూడా లాక్డౌన్ టైమ్‌లో రోబోల వినియోగం బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ కారణంగా అత్యవసరం కాని సర్జరీలను ఇన్ఫెక్షన్ భయంతో ఆస్పత్రులు ఆపి ఉంచాయని నగరానికి చెందిన ఓ సర్జన్ చెప్పారు. తక్కువ సంఖ్యలో వైద్య సిబ్బంది, పేషెంట్‌కు దూరంగా సర్జన్ ఓ కన్సోల్ మీద కూర్చుని ఉండి చేయవచ్చు కాబట్టి.. తప్పనిసరిగా చేయాల్సిన సర్జరీను మాత్రం లాక్డౌన్ టైమ్‌లో రోబోల సహకారంతో నిర్వర్తించామన్నారని ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో గడిపే కాలం తగ్గడం ఓపెన్ సర్జరీ చేస్తే కొన్ని రోజుల పాటు తప్పకుండా ఆస్పత్తిలో ఉండాల్సి ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీ చేస్తే సర్జరీ చేసిన తర్వాత కేవలం ఒక్కరోజులో డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చు. దీని ద్వారా కనీసం వారం రోజుల వ్యవధి తేడా వస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు కూడా ఆ మేరకు తగ్గినట్టే అవుతుంది. అయితే మరి ధరలో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. తక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం ద్వారా రోజువారీ వ్యయాలు చాలా తగ్గుతాయి. కాబట్టి పెద్ద తేడా అనిపించదు. పైగా నొప్పి కూడా తక్కువ ఉంటుంది. సర్జన్ల కొరత.. పెరిగిన శిక్షణ ఒకప్పుడు భయపడేవారు ఇప్పుడు తగ్గింది. చివరి దశలో ఉన్నవారు కూడా రోబోటిక్ సర్జరీ చేయాలంటున్నారు. రోబోటిక్ సర్జరీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా సదరు సర్జరీలపై మరింత మంది వైద్యులకు శిక్షణ అవసరం అవుతోంది. నగరంలో ఈ శిక్షణ పొందిన సర్జన్లు రెండంకెలలోపే ఉంటారని అంచనా. గతంలో ఈ శిక్షణ అమెరికా, పారిస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా లభిస్తోంది. అయితే రెగ్యులర్ సర్జరీల్లో తగినంత అనుభవం వచ్చిన తర్వాతనే ఈ శిక్షణ ఇస్తారు. ‘తెలుగు రాష్ట్రాలలో రోబోటిక్ సర్జరీలు చేసేవారి సంఖ్య 20లోపే ఉండొచ్చు. పరిస్థితుల కారణంగా శిక్షణ కార్యక్రమాలు కూడా పెరిగాయి. నేనూ ఇటీవలే విశాఖ వెళ్లి శిక్షణ ఇచ్చి వచ్చాను’ అని అపోలో వైద్యులు డా.చినబాబు చెప్పారు. సోషల్ డిస్టెన్స్‌కి మేలు.. ⇔ సాధారణంగా ల్యాప్రొస్కపీ, ఓపెన్ హార్ట్ తదితర సర్జరీలకు సర్జన్ సహా అందరూ పక్కపక్కనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే రోబోట్రిక్స్లో ఆ అవసరం ఉండదు. కనీసం 8 నుంచి 10 అడుగుల దూరం వరకూ ఉండే సర్జరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కరోనా టైమ్‌లో రోబోల వినియోగంవైపు బాగా మొగ్గు చూపుతున్నారు. ⇔ ప్రస్తుతం గైనిక్ కేన్సర్స్, పెద్దపేగు, అన్నవాహిక, ప్రోస్టేట్ కేన్సర్లకు అవసరమైన సర్జరీలు చేయడంలో ఎక్కువగా రోబోటిక్స్ సహకారం తీసుకుంటున్నారు. అలాగే గర్భసంచి తొలగించడానికి కూడా రోబోటిక్ సర్జరీ ఎంచుకుంటున్నారు. కరోనా పరిస్థితుల్లో ఉపయుక్తమే.. నాకు 8 ఏళ్ల నుంచి రోబోటిక్ సర్జరీలు చేస్తున్న అనుభవం ఉంది. కోవిడ్ కారణంగా కొంత వరకూ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీల శాతం పెరిగిందనేది నిజమే. సోషల్ డిస్టెన్స్‌కి, అలాగే ఆస్పత్రుల్లో తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం వల్ల కోవిడ్ పరిస్థితుల్లో ఈ సర్జరీలు చాలా ఉపయుక్తంగా మారాయి. రోగుల్లో కూడా రోబోటిక్ సర్జరీలపై బాగా అవగాహన పెరిగింది. వారే స్వయంగా ఈ పద్ధతిలో సర్జరీ గురించి అడిగే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే రోబోలకు సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలూ వెలుగు చూస్తున్నాయి. – డాక్టర్ చినబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ అంకాలజిస్ట్, అపోలో కేన్సర్ ఇన్స్టిట్యూట్ -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్ సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకే కాకుండా నేటి వరకు కూడా దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గక పోవడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థలు అత్యవసరం కాని సర్జరీ కేసులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి. మే 31వ తేదీ నాటికి నాలుగవ దశ లాక్డౌన్ కొనసాగుతుంది. ఐదవ దశ లాక్‌డౌన్‌ను విధిస్తారా, లేదా? అన్న విషయంతో ప్రస్తుతానికి స్పష్టత లేదు. లాక్‌డౌన్‌ను పొడిగించినా, లేకపోయిన వాయిదా వేస్తూ వస్తోన్న సర్జరీలను వెంటనే అనుమతించక పోయినట్లయితే వారిలో ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎలక్టివ్ సర్జరీలో ఎలక్టివ్ అనే ఆంగ్లపదం ‘ఎలిగెరి’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎలిగెరి అంటే ఎంపిక చేసిన అని అర్థం. ఎలక్టివ్ సర్జరీలంటే అత్యవసరం కాకపోయినప్పటికీ సర్జరీ ద్వారా ప్రాణాలను కాపాడాల్సిన కేసులే. ఈ సర్జరీలను ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, రోగుల పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ఎప్పుడు సర్జరీ చేయాలో ముందుగానే నిర్ధారిస్తారు. వాటి కోవలోకి హెర్నియా, అపెండిక్స్, కిడ్నీ, గాల్ బ్లాడర్ సర్జరీలను వాయిదా వేయవచ్చు. అయితే మరింత ఆలస్యమైతే రోగుల పరిస్థితి దుర్భరం అవుతుంది. ► కార్డియాక్ సర్జరీలు : యాంజీయోగ్రాఫీ లేదా స్టెంట్లు వేయడానికి ముందుగానే ముందుగానే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలలు ఆలస్యమైతే రోగి ప్రాణాలే పోవచ్చు. ► క్యాన్సర్ : మొదట్లోనే గుర్తించి సర్జరీ చేస్తే నయం అవుతుంది. ఆలస్యం అయినకొద్దీ ముదిరి ప్రాణం మీదకు తెస్తుంది. ► మధుమేహ రోగులకు అయిన గాయాలకు, ఇన్ఫెక్షన్లకు సకాలంలో వైద్య పోయినట్లయితే ఇన్ఫెక్షన్లు తీవ్రమై శరీర అవయవాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మే 18వ తేదీ నాటికి దేశంలో 5,05,800 అత్యవసరం కాని సర్జరీలు, 51,100 క్యాన్సర్ సర్జరీలు, 27,700 ఆబ్స్టెరిక్ సర్జరీలు (స్త్రీల అంగం, అండాశయం, గర్భాశ్రయంకు సంబంధించిన) పెండింగ్‌లో ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెల్సింది. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ’ కూడా దాదాపు ఇంతే సంఖ్యను మే 12వ తేదీన వెల్లడించింది. భారత ప్రభుత్వం సూచనల ప్రకారం మొదటి వారంలో 48,725 సర్జరీలు వాయిదా పడ్డాయని, ఆ లెక్కన 12 వారాలకు(దాదాపు మూడు నెలల కాలానికి) 5,85,000 సర్జరీలు వాయిదా పడి ఉంటాయని ఆ పత్రిక పేర్కొంది. అలా ప్రపంచవ్యాప్తంగా 2.84 కోట్ల సర్జరీలు వాయిదా పడి ఉంటాయని అంచనా వేసింది. (చదవండి : ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన) కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఎలక్టివ్ సర్జరీలు ఎక్కువగా వాయిదా పడ్డాయి. ఇలాంటి కేసుల విషయంలో అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం వచ్చిందని, ఆలస్యం చేసినట్లయితే రోగుల అవయవాలు దెబ్బతింటాయని, తద్వారా వారి ప్రాణాలకు కూడా ముప్పుందని ముంబైలోని ‘టీఎన్ మెడికల్ కాలేజ్ అండ్ బీవైఎల్ నాయర్ ఆస్పటల్’ సర్జరీ విభాగం అధిపతి, ‘మహారాష్ట్ర చాప్టర్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’ కార్యదర్శి సతీష్ ధారప్ హెచ్చరించారు. -
మహమ్మారితో ఆ‘పరేషాన్’లు..
లండన్ : కోవిడ్-19 ప్రభావంతో భారత్‌లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా జాప్యానికి గురయ్యాయని అంతర్జాతీయ కన్సార్షియం చేపట్టిన అథ్యయనం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆస్పత్రి సేవలకు 12 వారాల పాటు తీవ్ర అంతరాయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. దీంతో రోగులు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్జికల్ కేర్‌పై కోవిడ్-19 ప్రభావం గురించి 120 దేశాలకు చెందిన 5000 మంది సర్జన్లతో కూడిన కోవిడ్సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధనను నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అథ్యయనం సాగింది. ఆస్పత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పడటమో, రద్దవడమో జరుగుతాయని అథ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. చదవండి : మరో సరికొత్త ఆవిష్కరణ కోవిడ్-19 అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన 72.3 శాతం సర్జరీలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సరేతర ఆపరేషన్లే వీటిలో అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇక భారత్‌లో కోవిడ్-19 కలకలంతో 12 వారాల సమయంలో 5,84,737మంది రోగులకు ఆపరేషన్లు వాయిదా పడ్డాయని అథ్యయనం అంచనా వేసింది. ఇక ఈ 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు రద్దయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు. -
‘ఆసరా’తో ఆదుకుంటాం
మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా.. – సీఎం జగన్ సాక్షి, అమరావతి బ్యూరో: మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నామని సోమవారం గుంటూరులో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామని సీఎం వివరించారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చేసి అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకోసం రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. మాట నిలబెట్టుకుంటున్నా... ‘నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. గుంటూరు వేదికగా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పేదలు ఆపరేషన్ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి కడుపు నిండటం కోసం మళ్లీ పనుల కోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్ని మారుస్తూ శస్త్రచికిత్స అనంతరం రోగిని ఆప్యాయంగా పలుకరిస్తూ కోలుకునేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా దీన్ని ప్రారంభించాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులు ఇంట్లో పస్తులు ఉండకుండా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల వరకు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర ఈ జీవనోపాధి భృతిని అందజేస్తాం. ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సహాయం ఎంత కాలం ఇవ్వాలన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్ణయిస్తారు. సంపాదించే వ్యక్తి రోగాలతో బాధపడుతుంటే ఆ కుటుంబాలు ఆదాయం లేక ఎంత సతమతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఆ కుటుంబాలన్నింటికీ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను...’’ అని ఆ రోజు చెప్పా. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సభలో హాజరైన ప్రజలు జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. 3,648 కిలోమీటర్ల మేర సాగిన నా పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే.. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును పొందుపరుస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తాం. తొలిదశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మూడు మహానగరాల్లోనూ వర్తింపు వచ్చే ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే మంచి అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. మంచి ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది పడకుండా చెక్కు మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి తెస్తాం. ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో నవంబర్ 1 నుంచే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలి. ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘ఏ’ ప్లస్ గ్రేడ్‌కి ఆర్నెళ్లలో మారాలి. అలా మారని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ నుంచి తొలగిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ ‘వైఎస్సార్ కంటి వెలుగు’.. ఆర్నెళ్లు తిరగక ముందే ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఓ వర్గాన్ని ఈ పథకంలోకి తెస్తాం. విద్యార్థుల తర్వాత అవ్వా తాతలకు దీన్ని వర్తింపజేస్తాం. ఆ తర్వాత ఆర్నెళ్లకు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తానికి పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో 510 రకాల ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 15వతేదీ నుంచి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలను మాత్రమే అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్ రోగులకు మన ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం. బోధకాలు, కిడ్నీ బాధితుల(స్టేజ్ 3, 4, 5)ను రూ.5 వేల పెన్షన్ కేటగిరీలోకి తెస్తాం. లెప్రసీ బాధితులను రూ.3 వేల పెన్షన్ కేటగిరీలోకి తెచ్చి ప్రతి రోగికీ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తాం. కేన్సర్ పేషెంట్లను కూడా మార్పులతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. వారికి ఎన్ని దశల చికిత్స అవసరమైన పూర్తిగా భరిస్తాం. పుట్టుకతో మూగ, చెవుడు లోపం కలిగిన చిన్నారులకు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అందచేస్తాం. అలవాట్లు మారినప్పుడే... ప్రజల అలవాట్లు మారినప్పుడే వైద్యంపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. అందుకనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. దాదాపు 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్‌రూంలు లేకుండా చేశాం. 4,500 మద్యం షాపులను 3,500కి తగ్గించాం. పర్మిట్ రూమ్‌లు లేకుండా చేస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం షాపులను మూసివేస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారుల్లాగా లాభాపేక్ష ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేశాం. బార్లను కూడా 40 శాతం తగ్గించేశాం. మద్యం ధరలు షాక్ కొట్టేలాగే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతున్నాం. మూడేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం డిసెంబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చిస్తాం. విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం. మే నెల నాటికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఈ అడుగులు ఒకవైపు వేస్తూనే ఒక మంచి సమాజం ఉండాలనే ఉద్దేశంతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. నిధుల కొరత ఉన్నా, నావద్ద ఎలాంటి మంత్రదండం లేకున్నా.. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజల దీవెనతో అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’