tenth class examinations
-
పరీక్ష కేంద్రాల పరిసరాల టవర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ఇప్పుడున్న భద్రతతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జరిగే పరీక్షల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో చురుకైన, సమర్థులైన అధికారులనే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లాల నుంచి కొంతమంది అధికారుల పేర్లు తెప్పించింది. పరీక్ష కేంద్రాల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో రాష్ట్రస్థాయి నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నపత్రాల చేరవేత నుంచి జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించే వరకూ గట్టి నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పోలీసు అధికారులు సాంకేతిక కోణంలో నిఘాను పెంచుతున్నారు. అనుమానిత కేంద్రాల వద్ద సెల్‌ఫోన్ టవర్ల ద్వారా అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్‌కు అందే కీలకమైన సమాచారం విశ్లేషించి, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెల్‌ఫోన్ టవర్స్‌పై నిఘా పెంచి కాల్స్‌ను గుర్తించాలని నిర్ణయించారు. లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక బృందాలు ♦ టెన్త్ పరీక్షల కోసం ప్రతీ జిల్లాలో ప్రత్యేక అధికారుల బృందాన్ని గురువారం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, ఫ్లయింగ్ స్వా్కడ్స్, ఇన్విజిలేటర్లపై వీరి ఆజమాయిషీ ఉంటుంది. జిల్లా పరిధిలో పరీక్షల కేంద్రాలకు వీరి ద్వారా అవసరమైన సమాచారం వెళ్తుంది. తనిఖీ బృందాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెప్పించుకునే ప్రత్యేక అధికారం వీరికి ఉంటుంది. ♦ తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాల్లో వివిధ జోన్లుగా విభజించి వీరికి బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రం నుంచి సమాచారం తెలుసుకుని, అవసరమైన సంకేతాలివ్వడం, అనుమానం ఉంటే తక్షణమే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వీరి బాధ్యత. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్వా్కడ్స్ ఉండగా లీకేజీల నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యాశాఖ జిల్లాస్థాయి అధికారులుంటారు. డివిజన్ల వారీగా వీరు విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు పోలీసు శాఖ నుంచీ ప్రత్యేక ఫ్లయింగ్ స్వా్కడ్ ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాస్థాయిలో బృందాలుగా వెళ్లి పనిచేస్తాయి. సమస్యాత్మక కేంద్రాల విశ్లేషణ రాష్ట్రంలోని 2,652 పరీక్ష కేంద్రాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ కేంద్రాల జాబితాను తయారు చేశారు. రాజకీయంగా సమస్యలున్న ప్రాంతాల్లోని కేంద్రాల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు. అక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కొత్త వ్యక్తులు వస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య తెలిపారు. -
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. 9.30 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన ఎవరినీ అనుమతించబోమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. www.bse.ap.gov.in లో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను చూడొచ్చన్నారు. అన్ని పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు సూచనలు.. ♦ హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి. ♦ విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు. ♦ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ♦ విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్లెట్లు ఇస్తారు. ♦ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ♦ ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ♦ పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు. ♦ విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు. ♦ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు. -
AP SSC Supplementary 2022: సప్లిమెంటరీలో పాసైనా 'రెగ్యులరే'
సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని ఆవేదన, ఆందోళన చెందాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోని టెన్త్ 2022 బ్యాచ్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది. అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు. ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్ పాస్’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీచేయనుంది. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించింది. అయితే ఫెయిలైన సబ్జెక్టులకు పదివరకు గ్రేస్ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం టెన్త్ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది. సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. 20 వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వచ్చిన మార్కుల పరిగణన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్మెంట్ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. -
టెన్త్ విద్యార్థులకు ‘పరీక్షే’!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న లక్షలాది మందిలో ఇలాంటి ఆందోళనే కనిపిస్తోందని ఉపాధ్యాయులు చెప్తున్నా రు. గత రెండేళ్లలో ప్రత్యక్ష తరగతులు లేక, ఆన్లైన్ తరగతులు అర్థంకాక, నెట్వర్క్ సమస్యలతో అసలు పాఠాలే వినలేని పరిస్థితులతో ఇప్పుడు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,08,110 మంది విద్యార్థులు, 1,165 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అయితే పరీక్షలు ఎలా రాస్తామో.. మంచి గ్రేడ్ వస్తుందో? రాదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక ప్రణాళికతో సన్నద్ధం.. విద్యాశాఖ 70% సిలబస్‌తో, 50% చాయిస్ ఉం డేలా పరీక్షలను నిర్వహిస్తోంది. సబ్జెక్టుకు ఒకే పేప రును పెట్టింది. జిల్లాల్లో ప్రత్యేక తరగతులు నిర్వ హిస్తోంది. టీచర్లంతా పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా అవగాహన కల్పిస్తున్నారు. మోడల్ పేపర్లతో సిద్ధం చేస్తున్నారు. అయినా 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కు ఉన్న నేప థ్యంలో పాస్ అవడంపై నమ్మకంగా ఉన్నా మంచి గ్రేడ్‌పైనే భరోసా కుదరడం లేదని అంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా.. ► ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను తీసుకొని కమిటీ వేసి 25 మార్కులతో పరీక్ష పేపర్ తయారు చేయించారు. రోజూ ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యా ర్థులపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ► కరీంనగర్ జిల్లాలో మార్చి వరకు సిలబస్‌ను పూర్తి చేశారు. అప్పటి నుంచి సాయంత్రం ప్రత్యేకంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయి స్తున్నారు. జగిత్యాల జిల్లాలో జూమ్ మీటింగ్ ద్వారా కూడా తరగతులను నిర్వ హిస్తున్నారు. ► ఖమ్మం జిల్లాలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున ఈనెల 21 వరకు బోధన నిర్వ హించేలా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పరీక్షల పట్ల భయం పోయేలా విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలను నిర్వహించారు. ► నిజామాబాద్ జిల్లాలో సబ్జెక్టులను పార్ట్–ఏ, బీ కింద విభజించారు. నెలరోజులు పాఠ్యాంశా లను పునశ్చరణ చేయించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ► వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో రోజుకో సబ్జెక్టు టీచర్ ప్రత్యేకంగా బోధిస్తున్నారు. విద్యా ర్థుల సందేహాలను తీర్చడంతోపాటు రివిజన్ చేయిస్తున్నారు. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో వెనుకబడిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పరీక్షలంటే భయం పోయేలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కనీసం పాస్ అయ్యేలా మోడల్ ప్రశ్నలు ఇచ్చి సాధన చేయిస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉపాధ్యాయులే విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. సందేహాలుంటే నివృత్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. ► మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే నివృత్తి చేసేలా చర్యలు చేపట్టారు. జూమ్ మీటింగ్ ద్వారా తరగతులు తల్లిదండ్రులకు మొబైల్‌ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వ హిస్తూ విద్యార్థులకు సూచ నలు చేస్తున్నాం. జూమ్ మీటింగ్ ద్వారా కూడా తరగతులను నిర్వహిస్తున్నాం. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ప్రిపేర్ చేయిస్తున్నాం. – పల్లె శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్, సారంగాపూర్, జగిత్యాల భయం పోగొట్టేలా ప్రయత్నం విద్యార్థుల్లో పరీక్షలంటే సహజంగా భయం ఉం టుంది. దానిని పోగొట్టేం దుకు చర్యలు చేపడుతున్నాం. పరీక్షలు బాగా రాసేలా సిద్ధం చేస్తున్నాం. స్కూల్లో నిర్వహించే అన్ని టెస్టులకు హాజరయ్యేలా చూస్తున్నాం. – కనకదుర్గ, విద్యార్థి తల్లి, కొత్తగూడెం మంచి జీపీఏ వస్తుందో రాదో పరీక్షల్లో కనీసం 9 జీపీఏ రావాలి. కానీ వస్తుందో రాదో.. కరోనాతో స్కూల్‌కు సరిగ్గా వెళ్ల లేదు. టీవీ పాఠాలు అర్థ మయ్యేవి కావు. చదువు పైనా శ్రద్ధ తగ్గింది. అందుకే వెనకబడ్డాం. – వన్నె సైదురాజు, టెన్త్ విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, కోటగిరి, నిజామాబాద్ -
బాలికతో పరీక్ష రాయించిన ‘దిశ’
రామాపురం: పదో తరగతి పరీక్షలు రాయనీయకుండా నిర్బంధించిన తండ్రిపై ఓ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను పరీక్ష కేంద్రంలో హాజరుపర్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయునిచెరువు పంచాయతీ మూగిరెడ్డిగారిపల్లెకు చెందిన బాలిక నీలకంట్రావుపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. మూడు పరీక్షలు రాశాక.. పరీక్షలకు వెళ్లొద్దంటూ తండ్రి సోమవారం ఇంట్లో నిర్బంధించాడు. దీంతో ఆ బాలిక దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్ వచ్చి బాలికతో పరీక్ష రాయించారు. -
షెడ్యూల్ ప్రకారమే ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైన కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో లేదా ఇతర మార్గాల్లో ఎవరికైనా వస్తే పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా, మండల విద్యాశాఖాధికారులు కూడా ప్రశ్నపత్రాలు షేర్ చేస్తున్నవారి నంబర్లను పోలీసులకు తెలియజేయాలన్నారు. మీడియా కూడా ఇందుకు సహకరించాలని కోరారు. పరీక్ష కేంద్రంలో డ్యూటీలో ఉన్నవారు కాకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఉంటే చీఫ్ సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఇంకా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించాల్సి ఉందన్నారు. రంజాన్‌ను ఏ తేదీన జరుపుకుంటున్నప్పటికీ మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రానికి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తున్నామని తెలిపారు. పరీక్ష సమయానికి కేవలం గంట ముందు మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి పకడ్బందీగా పరీక్ష కేంద్రాలకు చేరుస్తున్నామని పేర్కొన్నారు. పరీక్షల చట్టం ప్రకారం కేసులు.. పరీక్ష ప్రారంభమయ్యాక కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం పరీక్ష కేంద్రాల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను ఫోన్‌తో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతున్నారన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్‌ను తప్ప మిగిలినవారి ఫోన్లను లోపలికి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నా ఇలా చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నపత్రాలను షేర్ చేసేవారిపై పరీక్షల చట్టం 25/97 ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. నంద్యాల జిల్లాలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు ఏడుగురిని, సత్యసాయి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. పేపర్ల లీకేజీ, కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు మంత్రి బొత్స శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో టీడీపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. నంద్యాలలో కూడా పలువురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రశ్నపత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన టీడీపీ నేతకు చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీకి చెందినవారు అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ.. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నాయుడుకు ఉందా? అని నిలదీశారు. -
ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం
శ్రీకాకుళం న్యూకాలనీ/సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షళంత్రితోపాటు కొత్తకోట కేంద్రాల్లో పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీకైందంటూ తప్పుడు ప్రచారం చేయడం విద్యార్థుల్లో కలకలం సృష్టించింది. ఇలా లేనిపోని వార్తలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ హెచ్చరించారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ రిపోర్టర్‌ను విచారించారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పారు. మరి చానెల్లో స్క్రోలింగ్ ఎలా వచ్చిందని అధికారులు ప్రశ్నించారు. రిపోర్టర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం, రిపోర్టర్, తదితరులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి గార పగడాలమ్మ ఎస్పీ జీఆర్ రాధికకు ఫిర్యాదు ఇచ్చారు. అంతకుముందు పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ ఎం.జ్యోతికుమారి, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఆర్.జయప్రకాష్, రెవెన్యూ అధికారులు సందర్శించారు. పోలీసుల సహకారంతో క్షుణ్నంగా పరిశీలించాక ఎలాంటి లీకేజీ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. -
పాత జ్ఞాపకం: ఆ కాలంలో పరీక్షలు
టెన్త్ క్లాస్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో మొదలయ్యాయి. తెలంగాణలో ఇంకా మొదలుకావాల్సి ఉంది ఈ పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలకు మంచి మార్కుల గురించి తల్లిదండ్రులకు వారి ఆరోగ్యం గురించి టెన్షన్. కాని ఒకప్పుడు పరీక్షలు ఎంతో చిత్ర విచిత్రంగా జరిగేవి. రకరకాల సెంటిమెంట్లు ఉండేవి. ఎన్నో సరదాలు చోటు చేసుకునేవి. ఈనాటి పరీక్షల సందర్భంగా ఆనాటి పరీక్షల రీవిజిట్... కొంచెం రిలీఫ్ కోసం. ఇప్పుడేముంది పిల్లలు ఛాయిస్‌తో సహా అన్నీ రాసేసేంత చదివేస్తున్నారుగానీ పూర్వం పరీక్షలంటే ప్రాణ హరీక్షలే. టీచర్లు రెడ్ ఇంక్ పెన్ తీసేది ఈ పేపర్లు దిద్దడానికే. సరిగ్గా మధ్యకు మడిచిన ఆన్సర్ షీట్ల కట్టతో సార్లు క్లాసులో అడుగుపెడితే పిల్లల పై ప్రాణాలు పైనే పోయేవి. టీచర్లు, సార్లు కూడా పిల్లల్ని టెన్షన్ పెట్టడంలో సృజనాత్మకత చూపేవారు. మొదట క్లాస్ టాపర్ పేపరు ఇచ్చేవారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్ వచ్చినవాళ్ల పేపర్లు. 25కు పదిహేను మార్కులు తెచ్చుకున్నవారందరూ సేఫ్ జోన్లో ఉండేవారు. 15 కంటే తక్కువ వచ్చిన వారి పేపర్లు రాగానే సార్ల చేతిలో బెత్తం ప్రత్యక్షమయ్యేది. 14,13,12... మార్కులు తగ్గేకొద్దీ వీపులు చిట్లుతూ ఉండేది. చివరి పేపర్ వైపు అందరూ బిక్కుబిక్కుమంటూ చూసేవారు. ఆ పేపరు ఒకటో రెండో మార్కులు వచ్చిన స్టూడెంట్‌ది. ఆ స్టూడెంట్ పెట్టే పెడబొబ్బలను వినలేక స్కూల్ అటెండర్ టంగ్ టంగ్‌మని బెల్ కొట్టేస్తే తప్ప కోటింగ్ నిలిచేది కాదు. పది మొదలు.. టెన్షన్ మొదలు సరే. పదో క్లాసులో చేరినప్పటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ టెన్షన్ విద్యార్థుల్లో ఊరూ వాడా దానయ్య దానమ్మ అందరూ ప్రవేశ పెట్టేవారు. టెన్త్ ఫెయిల్ కావడం అవమానం. ఫెయిల్ తప్పక చేసే రెండు సబ్జెక్ట్‌లు ఇంగ్లిష్, గణితం ఎలాగూ ఉండేవి. ఒకరికి ఇంగ్లిష్ అంటే కోల్డ్ అండ్ ఫీవర్. మరొకరికి లెక్కలంటే వామ్టింగ్స్ అండ్ మోషన్స్. ఆ రోజుల్లో ఎంత పేద తల్లిదండ్రులైనా టెన్త్ క్లాస్‌కు వచ్చిన తమ పిల్లల్ని ట్యూషన్లో చేర్పించేవారు. లెక్కలు రాకపోతే స్కూల్లో ఎలాగూ దెబ్బలు పడేవి. ట్యూషన్లో కూడా అవే లెక్కలు రావు కనుక అక్కడా దెబ్బలు పడేవి. సాయంత్రం ఆరు నుంచి ఎనిదిన్నర వరకూ వదలకుండా ట్యూబ్లైట్ల వెలుతురులో తెగ చదివించేవారు. వారంలో ఆరురోజులు స్కూల్లో చదివితే ఆదివారం ట్యూషన్లో చదవాల్సి వచ్చేది. ఇంగ్లిష్ పొయెమ్ అప్పజెప్పడం అన్నింటి కంటే పెద్ద టార్చర్. మొదటి రెండు లైన్లు చెప్పాక మూడో లైను దగ్గర ఆగి దిక్కులు చూస్తే చాక్‌పీస్ ముక్క గురి చూసి వచ్చి ముక్కుకు తగిలేది. చెక్క డస్టర్ నెత్తిని టప్‌టప్‌మని తాకేది. వెదురు బెత్తం దూకుడు ఏకుడు మీదుండేది. ట్యూషన్లు కాకుండా పాఠశాల, రాఘవేంద్ర, బూన్ గైడ్లు తల కింద పెట్టుకుని పడుకున్నా ఏమీ ఎక్కేది కాదు. టెన్త్ పాసైతే కాలేజీకి వెళ్లొచ్చు. కాని టెన్త్ పాసవడం చాలా పెద్ద విషయం. 100కి 35 మార్కులు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో విద్యార్థులది 35 మార్కుల కల. పరీక్షలు... క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్స్ మొదలవుతుండగా టెన్త్ చదివే పిల్లల డాబాల మీద, పెరళ్లల్లో బల్బులు లాగి వెలిగించేవారు. రాత్రిళ్లు తల్లులు టీ పెట్టి ఇచ్చేవారు. కంబైన్డ్ స్టడీలో పిల్లలు ఎవరేం చదువుతున్నారో తెలియనంత పెద్దగా చదివేవారు. ఆ తర్వాత హాల్‌టికెట్లు వస్తే వాటిని దేవుడి దగ్గర తప్ప మరెక్కడా పెట్టేవారు కాదు. దేవుడికి ఇదంతా టెన్షనే. అయితే మెయిన్ పేపర్ కాకుంటే బిట్ పేపర్‌గా ఆ రోజుల్లో పరీక్షలు సాగేవి. మెయిన్ పేపర్ సరిగ్గా రాయలేకపోయినా వారినీ వీరిని అడిగి బిట్ పేపర్ ఏ, బి, సి, డిలు పెడితే ఎలాగోలా పాస్ అయిపోతామని భావించేవారు. నిజం కూడా. చాలామంది ఇన్విజిలేటర్లు 3 గంటల ఎగ్జామ్‌లో మొదటి రెండున్నర గంటలు స్ట్రిక్ట్‌గా ఉండి చివరి అరగంట చూసీ చూడనట్టు ఉండేవారు. అప్పుడు అందరూ బిట్లు చెప్పుకునేవారు. ఈలోపు ఏ గారాలబిడ్డ తండ్రో బిట్ పేపర్ సంపాదించి బయట నుంచి మొత్తం 30 బిట్ల ఆన్సర్‌ను ఒక చిట్టి మీద రాసి లోపల వేయించేవాడు. అంటే 30కి 30 వచ్చేస్తాయన్నమాట. ఇక సెంటిమెంట్ చొక్కా, సెంటిమెంట్ పెన్, సెంటిమెంట్ ప్యాడ్... ఇవన్నీ తప్పనిసరి. పరీక్షలు జరిగినన్ని రోజులు ‘పేపర్ ఈజీనా టఫ్ఫా’ అనే ప్రశ్న వినబడుతూనే ఉండేది. అందరూ ఈజీగా పరీక్ష రాసేస్తే కొందరు స్టూడెంట్స్‌కు నచ్చేది కాదు. టఫ్‌గా వచ్చిన రోజు క్లెవర్లు ముసిముసి గా నవ్వుకుంటూ ఇల్లు చేరేవారు. జీవితంలో మంచి ఉపాధి పొందడం తప్పనిసరి. కాని ఒక నిర్దిష్ట సమయంలో చూపే తెలివితేటలే మన మొత్తం తెలివికి కొలమానాలు కాబోవు. చిన్న చిన్న తప్పొప్పులు పరీక్షల్లో సహజం. కనుక మనకు వచ్చింది హాయిగా రాసి భారం కాలం మీద వేయడమే పరీక్షలు జరిగేన్ని రోజులు చేయవలసిన పని. అందరూ బాగా పరీక్షలు రాయాలని కోరుకుందాం. టెన్త్ బాగా చదివి పాస్ కావడానికి తల్లిదండ్రులు గిఫ్ట్‌ల ఆశ చూపేవారు. అబ్బాయిలకు సైకిల్ కొనిపెట్టడం చాలా పెద్ద గిఫ్ట్. అమ్మాయిలకు పట్టుపావడ, పాపిట బిళ్ల, కొత్త గజ్జెలు... ఇలాంటి తాయిలాల వరుస ఉండేది. డబ్బున్న తల్లిదండ్రులు ‘నువ్వు పాసైతే వెయ్యి రూపాయలు ఇస్తా’ అనేది ఆ రోజుల్లో రికార్డు మొత్తం లంచం. వీరే కాకుండా మేనత్త మేనమామలు కొత్త బట్టలు కొనిస్తామని, హెచ్ఎంటి వాచీ అని, తిరపతి తీసుకెళతామని... ఉపాధ్యాయులు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ‘హీరో పెన్’కొనిస్తామని హామీ ఇచ్చేవారు. ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసినరోజు సినిమాకు, ఐస్‌క్రీమ్‌కు వంద రూపాయలు ఇవ్వడం అనేది కామనాతి కామన్. -
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి మే 20 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. -
జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు
కడప సిటీ: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు జూన్ 7 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో పదో తరగతి సిలబస్ మొత్తం పూర్తయినందున విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ఇస్తున్నామన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు బడికి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. కడప కలెక్టరేట్లో సోమవారం కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30 జూనియర్ కళాశాలలకు, పదో తరగతి విద్యార్థులకు చివరి పని దినమని చెప్పారు. విద్యార్థులు సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలని సూచించారు. అవసరమైన మేరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ›ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎల్లో మీడియా కావాలనే కోవిడ్‌పై రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
-
టెన్త్ మోడల్ పేపర్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విద్యా శాఖ.. కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 11 పేపర్లను ఆరుకు కుదించిన ఎస్ఎస్సీ బోర్డు అందుకు సంబంధించిన సెక్షన్లు, ప్రశ్నల తీరు, మార్కులు ఎలా ఉంటాయో పేర్కొంటూ ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ మాదిరి పత్రాలను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. శనివారం తెలుగు, హిందీ మార్కుల మాదిరి పత్రాలతో పాటు ఆయా పేపర్లకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేసినట్లు బోర్డు డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆ వివరాలివీ.. ► తెలుగు పేపర్ సమయం 3.15 గంటలు. గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు. అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్–1 మార్కులకు, పేపర్–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► హిందీ పేపర్లోని మార్కుల మాదిరి ప్రశ్నపత్రాన్ని బోర్డు విడుదల చేసింది. ఇందులో 4 నిబంధనాత్మక ప్రశ్నలు 36 మార్కులకు ఉంటాయి. లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 28 మార్కులకు 6 ఉంటాయి. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 8 ఉప విభాగాలుగా 24 మార్కులకు ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు 12 మార్కులకు ఉంటాయి. ఇవీ మార్గదర్శకాలు ► టెన్త్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎస్సీ బోర్డు అన్ని జిల్లాల డీఈవోలకు మార్గదర్శకాలు పంపింది. ► కోవిడ్–19 నేపథ్యంలో అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు వీలుగా అనువైన పాఠశాలలతోపాటుజూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలను కూడా గుర్తించాలని పేర్కొంది. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని సంస్థలను కూడా గుర్తించాలని స్పష్టం చేసింది. ► డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్లతో కూడిన బృందం కోవిడ్–19 ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఆయా సంస్థలను గుర్తించాలని, ఒక్కో బృందం 20 సెంటర్లను సందర్శించాలి. ► కోవిడ్–19 కోసం క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న వాటిని మినహాయించాలి. ► ఈనెల 18వ తేదీ నాటికి ఆయా కేంద్రాల సమాచారాన్ని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలి. -
ఏపీ: టెన్త్ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్లెట్ల రవాణాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో సీటింగ్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ తెలిపింది. పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు, జర్వం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు) -
మేమే రాస్తాం.. సాయం వద్దు!
సాక్షి, హైదరాబాద్/వెంగళ్రావునగర్: అవిభక్త కవలలు వీణావాణిలు ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ వేర్వేరుగా జారీ చేసిన హాల్ టికెట్లను పాఠశాల అధ్యాపకులు శుక్రవారం వారికి అందజేశారు. జబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వీణావాణిలకు మినహాయింపునిచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వారిద్దరికీ వెంగళ్ రావునగర్ స్టేట్‌హోంకు సమీపంలోని మధురానగర్‌కాలనీలో ప్రతిభా హైస్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అధికారుల పర్యవేక్షణలో నేలపై కూర్చొని పరీక్ష రాయనున్నారు. వేర్వేరు హాల్‌టికెట్లు.. మహిళా శిశుసంక్షే మ అధికారులు 2018లో వీణావాణిలకు వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు ఇచ్చారు. ఇటీవల వారు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఇద్దరికీ వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారు కోరితే స్క్రైబ్(సహాయకులు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని వీణావాణిలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రత్యేక గదిని సిద్ధం చేస్తాం వీణావాణిలు మా పాఠశాలలో పరీక్షలు రాయనున్నట్లు ఈరోజే తెలిసింది. విద్యాశాఖ వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయమని సూచిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. – రాంబాబు, ప్రతిభా హైస్కూల్ చైర్మన్ -
నేటి నుంచి దిద్దుబాట
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్‌లోని సెయింట్జాన్ పాఠశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలోని విద్యార్థుల జవాబు పత్రాల మూల్యంకనం జరుగనుంది. మూల్యంకనానికి కొందరు ఉపాధ్యాయులు హాజరయ్యేందుకు వెనుకాడుతున్నారు. నాలుగు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. గతేడాది ఆయా జిల్లాల పరిధిలో అనేక మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఉన్నతాధికారులు వారికి నోటిసులు జారీ చేసినా.. ఎలాంటి ఫలితం కనిపించలేదు.. తాజాగా ప్రారంభం కానున్న మూల్యంకన ప్రక్రియకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరు కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో 11 రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు రాకపోతే మూల్యాకంనం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఈనెల 3వ తేదీన పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. వేరే జిల్లాలవి మన దగ్గరకు వస్తాయి. వీటిని మూల్యంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జవాబుపత్రాల దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లకు అప్పగించగా, వారి సహాయకులుగా ఎస్జీటీలకు విధులు కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కరీంనగర్‌లోనే మూల్యాంకనం చేపడుతున్నారు. మూడేళ్ల క్రితం జిల్లాల విభజన జరగడంతో ఆయా జిల్లాలోనే నిర్వహించాలని పలు డిమాండ్లు వినిపించాయి. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే నిర్వహించాలని సూచించడంతో కరీంనగర్‌లోనే నిర్వహిస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందరు అనారోగ్య కారణాలరీత్యా రాకపోగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు రాకపోతే ఉన్నవారిపై భారం పడటంతోపాటు మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు అస్కారం ఉంటుంది. 11 రోజులు మూల్యాంకనం.. సోమవారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకన ప్రక్రియ ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13,727 మంది ఉపాధ్యాయులు ఉండగా ప్రశ్నపత్రాల మూల్యంకనానికి జిల్లా వ్యాప్తంగా చీఫ్ ఎగ్జామినర్లు, ఉపాధ్యాయులు, అసిస్టెంట్ సహాయకులుగా 4 వేల మంది ఇప్పటికే విధుల్లోకి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొంత మంది ఉపాధ్యాయులు అనారోగ్యంతోపాటు రకరకాల కారణాలు తెలుపుతూ విధుల్లో చేరేందుకు అనాసక్తి చూపుతున్నారు. 11 రోజులుగా ఇక్కడే ఉండాలంటే ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో కోందరు ఉపాధ్యాయులు వివిధ కారణాల చూపుతూ విధులను తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో వాటిని దిద్దే ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. నిర్దేశిత సమయంలో పూర్తికావాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యమైనట్లు సమాచారం. గతేడాది తెలుగు, సాంఘికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడ్డాడు. ఆలస్యమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు హైరానపడ్డారు. ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో హాజరైన ఉపాధ్యాయులు అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం జరిగింది. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సబ్జెక్టు ఉపాధ్యాయులు ఈ విధులకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ .. కొందరు బేఖాతరు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరు కావడం అనుమానంగానే ఉంది. హాజరు కావాల్సిందే... జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి మూల్యాంకన ప్రక్రియకు హాజరు కావాలని ఇప్పటికే ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రత్యేక సహాయకులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి. లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. –ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి -
సోషల్ మీడియాలో టెన్త్ క్వశ్చన్ పేపర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరుగున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. సోమవారం ఉదయం జరగాల్సిన గణిత ప్రశ్నాపత్రం... వైఎస్సార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పరీక్షకు అరగంట ముందే లీకైందంటూ తెలుస్తోంది. సోషల్ మీడియా మ్యాథ్స్ పేపర్ వైరల్ అవుతుంది. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన వార్తలతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే అధికారులు మాత్రం పేపర్ లీకు అయినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల తెలియల్సి ఉంది. -
9.35 వరకు అనుమతి..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయని, విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. పరీక్షల నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాల వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాల్‌టికెట్ పోగొట్టుకుంటే www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తితే 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూంకు (040–23230942) ఫోన్‌చేసి తెలపాలని సూచించారు. పరీక్ష రాసేందుకు అవసరమైన రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తీసుకెళ్లాలని, ఓఎంఆర్ షీట్ తమదేనా.. కాదా అని సరి చూసుకొని పరీక్ష రాయాలన్నారు. మెయిన్ ఆన్సర్ షీట్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను మాత్రమే అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లపై వేయాలని వివరించారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు హాల్లోకి తీసుకెళ్లొద్దని, హాల్‌టికెట్ తప్ప మరే కాగితాలు వెంట తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పేరు, సంతకం, గుర్తింపు చిహ్నాలు, స్లోగన్లు జవాబు పత్రంలో ఎక్కడా రాయొద్దని సూచించారు. -
22వ తేదీ టెన్త్ పరీక్ష వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పదో తరగతి పరీక్షల విభాగం చేస్తోంది. హాల్‌టికెట్ల ముద్రణ పనులు చివరి దశకు చేరడంతో బుధవారం నుంచి పాఠశాలలకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22న జరగాల్సిన ఆంగ్లం పేపర్–2 పరీక్షను వాయిదా వేసింది. 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల అధికారి సూచన మేరకు పరీక్ష తేదీని మార్చింది. ఆ పరీక్షను వచ్చే నెల 3న నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రివైజ్డ్ టైం టేబుల్‌ను జారీ చేసి, ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పరీక్ష ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటుందని, ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్ఎస్సీ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయని వివరించింది. ఎస్సెస్సీ వొకేషనల్ థియరీ పరీక్ష మాత్రం ఉదయం 11:30 గంటలకే పూర్తవుతుందని తెలిపింది. -
ముందుగా టెన్త్ ప్రధాన పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల టైం టేబుల్ మారింది. ఓరియంటల్ ఎస్సెస్సీ సబ్జెక్టులతో పరీక్ష లు ప్రారంభమయ్యేలా గతంలో టైం టేబుల్ జారీ చేయగా, తాజాగా ప్రధాన పరీక్షలు తొలుత ప్రారంభించేలా టైం టేబుల్‌ను సవరించి విద్యాశాఖ షెడ్యూల్ జారీ చేసింది. దీంతో 2018 మార్చి 15న ప్రథమ భాష పేపరు–1తో పరీక్షలు ప్రారంభమవుతాయి.గతంలో ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మార్చి 26న గణితం పేప రు–2 పరీక్ష రోజే శ్రీరామనవమి ఉండ టం, ఏపీలో ప్రధాన సబ్జెక్టులను తొలుత జరిపేలా షెడ్యూల్ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ టైం టేబుల్‌ను మార్పు చేసింది. పాత టైం టేబుల్ ప్రకారం మార్చి 31తో పరీక్షలు ముగియనుండగా, తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. -
నెల్లూరులో పేపర్ లీకేజి నిజమే: మంత్రి
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో ఏపీ మంత్రులు, వియ్యంకులు అయిన నారాయణ, గంటా శ్రీనివాసరావు భిన్న ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజి అన్నదే లేదని మంత్రి నారాయణ చెబుతుండగా.. నెల్లూరులో పేపర్ లీకేజి వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్లకు వెళ్తారని ఆయన అన్నారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజి జరిగినట్లు వెల్లడి కావడం గమనార్హం. నెం. 4238 సెంటర్ అంటూ పక్కాగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టడంతో సర్కారుకు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లు అయ్యింది. దానికి తగ్గట్లుగానే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లీకేజిని నిర్ధారించడంతో ఇక ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. -
‘పది’ మూల్యాంకనంలో లోపాలు!
- 2 నుంచి 20 మార్కుల వరకు తేడాలు - రీ వెరిఫికేషన్‌తో బయటపడుతున్న వైనం - దరఖాస్తు చేసుకున్న8,352 మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో లోపాలతో విద్యార్థులు నష్టపోతున్నారు. రీ వెరిఫికేషన్ ద్వారా చాలా మంది విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో మార్కుల్లో తేడాలు బయటపడుతున్నాయి. ఉపాధ్యాయులు సరిగ్గా మూల్యాంకనం చేయకపోవడం, మార్కులను సరిగ్గా లెక్కించి వేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. గత మార్చిలో జరిగిన పరీక్షల్లో బాగానే రాసినా తక్కువ మార్కులు వచ్చాయని గుర్తించిన దాదాపు 8,352 మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్థుల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రతి జిల్లాలో ఆరు చొప్పున విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీల నేతృత్వంలో కొనసాగుతోంది. అయితే రీ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థుల్లో చాలా మంది మార్కులు మారినట్లు సమాచారం. మొదట్లో ఇచ్చిన మార్కులకు రీ వెరిఫికేషన్ ద్వారా వచ్చిన వాటికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు తేలింది. కమిటీలు పరిశీలించిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీలు, తేడా వచ్చిన మార్కుల వివరాలతో కూడిన నివేదికలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాయి. వాటిని పరీక్షల విభాగం కూడా మరోసారి పరిశీలన జరుపుతోంది. పూర్తయ్యింది 50 శాతమే.. జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు తేల్చిన నివేదికల ప్రకారం తొలుత ఇచ్చిన మార్కులకు, రీ వెరిఫికేషన్ అనంతరం వచ్చిన మార్కులకు మధ్య 15 నుంచి 20 మార్కుల వరకు తేడాలు కొంత మంది విద్యార్థుల విషయంలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. 2 నుంచి 15 వరకు మార్కుల్లో తేడా చాలా మంది విద్యార్థుల విషయంలో జరిగినట్లు సమాచారం. 50 శాతం దరఖాస్తుల విషయంలోనే ఈ తేడాలు రాగా, మిగిలిన వాటి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే టీచర్లు ఎలా చేసినా.. అది విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేయడంతోపాటు రీ వెరిఫికేషన్ దరఖాస్తుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి తెస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చర్యలు చేపడుతున్నా.. మూల్యాంకనంలో తప్పులు చేసే టీచర్లపై చర్యలు చేపడుతున్నా పొరపాట్లు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో దాదాపు 250 మందికి పైగా టీచర్ల ఇంక్రిమెంట్లలో కోత పడగా, వారు మళ్లీ స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
ఇప్పుడైతేనే సీటు!
♦ పది విద్యార్థులకు ఆఫర్ల పేరుతో ‘కార్పొరేట్’ ప్రలోభాలు ♦ పీఆర్ఓలను ఏర్పాటు చేసి మరీ అడ్మిషన్లు చేస్తున్న వైనం ♦ ఇప్పుడే రిజిష్టర్ చేసుకోవాలంటూ ఒత్తిడి ♦ ఇదేం గోల అని వాపోతున్న తల్లిదండ్రులు వైవీయూ : పదో తరగతి పరీక్షలు పూర్తయి రెండు రోజులు కూడా గడవక ముందే విద్యార్థుల వద్దకు కార్పొరేట్ గద్దలు వాలిపోయాయి. పది పరీక్షా కేంద్రాల వద్దనే కరపత్రాలతో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కళాశాలల ప్రతినిధులు.. అనంతరం విద్యార్థుల ఇళ్ల చుట్టూ జోరీగల్లా తిరుగుతున్నారు. పది ఫలితాల్లో 10కి 10 జీపీఏ సాధిస్తే మా కళాశాలలో హాస్టల్ ఉచితమని ఓ కళాశాల.. స్వల్ప మొత్తంతో హాస్టల్ వసతి కూడా కల్పిస్తామంటూ మరో కళాశాల.. ఇలా ఆఫర్లతో మభ్యపెడుతున్నాయి. 9.0 పైన, అంతకంటే తక్కువ వచ్చిన వారికి కూడా కాస్తో కూస్తో తగ్గిస్తాం... అదీ ఇప్పుడు రిజిష్టర్ చేసుకుంటేనే అంటూ చెప్పిందే చెబుతూ పదే పదే ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పది పరీక్షలు రాసిన విద్యార్థుల చిరునామాలు, వారి తల్లిదండ్రుల సెల్ నెంబర్లు తెలుసుకుని మరీ విసిగిస్తుండటంతో తల్లిదండ్రులు ఇదేం గోలరా బాబూ అంటూ జుట్టు పీక్కుంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం రిజిష్టర్ చేయించుకుంటే ఫీజులో 10 శాతం రాయితీ కల్పిస్తామని తర్వాత అయితే ఏమీ చేయలేమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో లేనిపోని ఆందోళన సృష్టిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం ఇక్కడ పీఆర్ఓలను ఏర్పాటు చేసుకుని అడ్మిషన్లు నిర్వహించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. దీంతో పాటు ఓ కార్పొరేట్ కళాశాల తమ బ్రాంచ్‌లో పదోతరగతి విద్యార్థులకు పది రోజుల పాటు డిజిటల్ బోధన ఉచితంగా నిర్వహిస్తామని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రవేశాలు పొందవచ్చని పేర్కొనడం విశేషం. ‘విజయవాడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాల మహిళా బ్రాంచ్‌లో హాస్టల్లో సీటు రావడం మామూలు విషయం కాదు. ఈ వారంలో అడ్మిషన్ పొందితే అక్కడ హాస్టల్ సీటు గ్యారెంటీ’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. ఇంటెన్సివ్ బ్యాచ్, స్పెషల్ బ్యాచ్, ఐఐటీ బ్యాచ్, మెడికల్ అకాడ మి.. ఇలా వేర్వేరు పేర్లతో నిర్వహించే తరగతులకు లక్షలాది రూపాయల ఫీజు నిర్ధారించి.. ప్రవేశాలకు ఆఫర్లు చూపుతూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు స్థానిక కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం అడ్మిషన్లు చేయిస్తే వారికి ప్రోత్సాహకంగా కమీషన్ ముట్టచెబుతుండటం గమనార్హం. మీ పిల్లలు పరీక్షలు బాగా రాశారని తెలిసిందని.. ఎలాగూ మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి త్వరగా ప్రవేశాలు పొందాలని.. ఫలితాల కంటే ముందుగానే తరగతులు సైతం నిర్వహిస్తామని పేర్కొంటుండం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసేలా అడ్మిషన్లు నిర్వహించడం తగదు. ఇంటర్ మూల్యాంకనంలో ఉన్న మా దృష్టికి ఈ క్యాంపెయిన్ సమస్య రాలేదు. దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు చేపడతాం. కళాశాలల్లో ప్రవేశాలు, తరగతులు ముందుగా చేపడితే చర్యలకు ఉపక్రమిస్తాం. - రవి, ఆర్ఐఓ, కడప -
అంతా మా ఇష్టం
ఎన్పీకుంట : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల కోసం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జాబితాలోని ఇన్విజిలేటర్ల ఎంపికను డిపార్టు మెంటల్ ఆఫీసర్, చీఫ్‌లు అంతా మా ఇష్టం అన్నట్లు నిర్వహిస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడు తనకు అనుకూలంగా ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా కొనసాగాలనే ఉద్ధేశంతో పూర్తి తతంగం సాగించినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సోమవారం పరీక్షా కేంద్రం వద్దకు 13 మంది ఇన్విజిలేటర్లు రాగా వారిలో ఎవరిని తీసుకున్నది అధికారులు చివరి వరకు గోప్యంగా ఉంచడంపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. పరీక్షలకు ముందు రోజే ఎంపికైన ఇన్విజిలేటర్లను పిలిపించుకుని వారితో పరీక్షా కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వడంతో పాటు వారి నుంచి సంతకాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా డీఓ సాంబశివారెడ్డి, చీఫ్ తిరుపాల్ నాయక్ సమావేశం నిర్వహించకుండా సోమవారం 9 గంటల వరకు ఎవరిని ఇన్విజిలేటర్లుగా ఉన్నారో విషయం చెప్పకుండా ఒకే సారి గదులు కేటాయిస్తూ పేరు చెప్పడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుల మధ్య గొడవ మొదలైంది. 13 మంది ఇన్విజిలేటర్లలో తొమ్మిది మందిని మాత్రమే తీసుకుని తక్కిన నలుగురు అవసరం లేదంటూ చెప్పారు. -
టెన్త్ లో ‘ఇంగ్లిష్’ విద్యార్థుల హవా
♦ తెలుగు మీడియం కంటే ఇంగ్లిష్ మీడియం వారు 58,376 మంది అధికం ♦ క్రమంగా తగ్గుతున్న తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ♦ ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులు 50 వేల వరకు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు 5,67,478 మంది హాజరు అవుతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,21,046 మంది ఉండగా, 35,711 మంది ప్రైవేటు (వన్స్ ఫెయిల్డ్) విద్యార్థులు, 10,721 మంది ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,83,289 మంది, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు 2,33,509 మంది దరఖాస్తు చేశారు. ఇక గతేడాది కూడా తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే ఎక్కువ మంది పరీక్షలు రాశారు. అంటే రాష్ట్రంలో క్రమంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గి ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఉత్తీర్ణత శాతం ఇంగ్లిషు మీడియం విద్యార్థుల్లోనే ఎక్కువగా ఉంది. గతేడాది తెలుగు మీడియంలో పరీక్షలు రాసినవారిలో 1,79,221 మంది(73.32 శాతం) ఉత్తీర్ణులు కాగా, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన వారిలో 2,11,281 మం (82.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది 5,13,473 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఈసారి 5,21,046 మంది హాజరు కానున్నారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థుల కోసం 2,427 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థుల కోసం 188 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వేధిస్తున్న వసతుల కొరత
రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు కేంద్రాల్లో కనిపించని కనీస సదుపాయాలు హిందూపురం టౌన్: పట్టణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు సుమారు 3,220 మంది హాజరవుతారు. వారి కోసం అధికారులు పట్టణంలో 11 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేశారు. అయితే గతంలో పరీక్ష కేంద్రాల్లో కనీస సదుపాయాలు సైతం లేకపోవడంతో విద్యార్థి సంఘాల వారు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయినప్పటికీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు అరొకర వసతుల నడుమే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 11 కేంద్రాల్లో 3,220 మంది విద్యార్థులు పట్టణంలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 360 మంది, దీప్తిలో 200 మంది, అజీజియాలో 300 మంది, ఎంజీఎంలో 300 మంది, చిన్మయాలో 340 మంది, నేతాజీలో 260 మంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 280 మంది, సరస్వతీ విద్యామందిరంలో 320 మంది, బాలజీలో 300 మంది, బాలాయేసులో 300 మంది, బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 260 మంది విద్యార్థులు కలిపి మొత్తం 3220 మంది పట్టణంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. అరకొర వసతులు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్ష కేంద్రాల్లో అరొకర వసతులే ఉన్నాయి. బసవనపల్లిలో 150 బెంచీలు, నేతాజీలో 180, సరస్వతీ విద్యామందిరంలో 160, అజీజియాలో 150, ఎంజీఎంలో 120, కొట్నూరులో 150 బెంచీలు కొరతగా ఉన్నాయి. అంతేకాకుండా నేతాజీ పురపాలక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు చీకటి గానే ఉన్నాయి. ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతాయో తెలియని విధంగా దర ్శనమిస్తున్నాయి. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితులు నెలకొంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పట్టణంలో 11 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల సహకారంతో కొన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలు కూడా సమకూర్చాం. - గంగప్ప, ఎంఈఓ, హిందూపురం