Thota Trimurthulu
-
కూటమి సర్కారువన్నీ బూటకపు హామీలే : త్రిమూర్తులు
-
మండలి: పంట నష్టపరిహారం ఇచ్చేదెప్పుడు?: వైఎస్సార్సీపీ నిలదీత
సాక్షి, గుంటూరు: శానస మండలిలో పంట నష్టపరిహారంపై కూటమి సర్కార్‌ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని.. కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు.52 లక్షల మంది రైతులకు 10,500 కోట్లకు పైగా ఇవ్వాలని.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు పెట్టారన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. రైతులకు ఎప్పుడు నుంచి పెట్టుబడి సాయం అందిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ రామససుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో కలిపి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ పోయింది కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ యంత్రాంగం 200 మంది పోలీసులతో నా కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేసింది. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అధికారులు అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తా. రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడ: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో తన కుటుంబానికి చెందిన 11 ఎకరాల భూమి విషయంలో అధికారుల అత్యుత్సాహమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తుల భూతగాదాలు, రాజకీయ నాయకుల మధ్య జరిగే వివాదాల తరహాలో ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం వ్యవహరించి 200 మంది పోలీసులతో తన కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని త్రిమూర్తులు ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా అధికారులు వ్యవహరించారంటూ ఆయన ధ్వజమెత్తారు. నిజానికి.. 2005లో తిప్పసాని మహాలక్ష్మి, నూనె శ్రీదేవిల నుంచి ఆ భూములను కొనుగోలు చేశామన్నారు. భూమి కొన్న సమయంలో రెవెన్యూ రికార్డులతో పాటు రిజి్రస్టేషన్ శాఖ ద్వారా కూడా అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు, ల్యాండ్ సీలింగ్ సమస్యలు లేవని తేలాకే ఆ భూమిని కొనుగోలు చేశామన్నారు. చట్ట విరుద్ధంగా.. రాజకీయ కక్షతో.. ఇక సుమారు 19 ఏళ్లుగా తమ ఆ«దీనంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డులలో కూడా తమ పేర్లతో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే, ఆ భూములకు పన్నులు చెల్లిస్తున్నామని, చెరువులకు అనుమతులు కూడా ఇచ్చారని చెప్పారు. ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో అధికారులు అప్పటికప్పుడు నోటీసు ఇచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని త్రిమూర్తులు ప్రశి్నంచారు. ఇలాంటి విధ్వంసకర చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. చట్ట విరుద్ధంగా రాజకీయ కక్షతో చేసిన ఈ వ్యవహారంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. పార్టీ మారేందుకు ప్రయతి్నస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. -
గుర్తుంచుకో బాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు: తోట త్రిమూర్తులు
సాక్షి, కాకినాడ జిల్లా: దేశమంతా డా.బిర్.అంబేద్కర్ రచించిన రాజ్యంగం నడుస్తుంటే.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో తమ బంధువుల చెరువులను ధ్వంసం చేయించారు. 34 ఎకరాల్లో 11 ఎకరాలు సీలింగ్‌లో ఉందని ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ధ్వంసానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.‘‘భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా అధికారులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్సీపీ వ్యక్తిని కాబట్టే నాపై కక్ష కట్టారు. ప్రభుత్వాలు, అధికారం ఎల్లకాలం ఉండదు. ఇది సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌కు చెబుతున్నా.. చట్టపరంగా ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు’’ అని తోట త్రిమూర్తులు అన్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
జగన్ సైనికులుగా మా పోరాటం: YSRCP ఎమ్మెల్సీలు
సాక్షి, గుంటూరు: శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారని ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ వరదు కల్యాణి మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తాం. మొన్నటి ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించినా మాట వాస్తవమే. ఎక్కడ పొరపాట్లు జరిగాయో పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు అండతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలి.ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి. వైఎస్ జగన్ సైనికులుగా మేము పని చేస్తాం. ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేస్తాం’అని అన్నారు.మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతాం: తోట త్రిమూర్తులుశాసన మండలిలో వైఎస్సార్సీపీకే మెజార్టీ ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలకు మేలు కలిగే అంశాలను సమర్ధిస్తామని అన్నారు. -
ఈ వయసులో అలాంటి మాటలు... చంద్రబాబు పై తోట త్రిమూర్తులు ఫైర్
-
చంద్రబాబూ.. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
చంద్రబాబూ.. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు: ఎమ్మెల్సీ తోట
సాక్షి, కోనసీమ జిల్లా: ప్రభుత్వంపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మండపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాలు అభినందించాయి. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ‘‘ఏరోజైనా చంద్రబాబు పేదవాడికి సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా?. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మహానేత వైఎస్సార్. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. గడపగడపకూ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలన గురించి అడగండి. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి’’ అని తోట హితవు పలికారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? ‘‘మండపేటలో టీడీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం దోచుకున్నారో చర్చకు నేను సిద్ధం. ఇసుకను ఎవరు దోచేసుకున్నారో ప్రజలే చెబుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరింది. ఆనాడు పెన్షన్లు మీ హయాంలో ఎలా వచ్చాయి.. ఇప్పుడు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందుతోంది. వలంటీర్లు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వలంటీర్లు ప్రజలకు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులకు కూడా లేని అనుభవం క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు ఉంది’’ అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. -
ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?: ఎమ్మెల్సీ తోట
సాక్షి, విజయవాడ: కాపు ఉద్యమంలో ముద్రగడ ఏనాడూ లబ్ధి పొందలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాపు ఉద్యమం రాజకీయ లబ్ధి కోసమే అనడం దారుణం.. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ రాజకీయంగా నష్టపోయారని ఆయన అన్నారు. ‘‘ముద్రగడ స్ఫూర్తిగా మేమంతా ముందుకెళ్తాం. 30 ఏళ్ల క్రితం ముద్రగడ చేసిన ఉద్యమం ఈ జనరేషన్‌కు తెలియదు. సీఎం అయ్యే అర్హత, సంఖ్యా బలం తనకు లేదని పవన్ చెప్పారు. ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?. 2019లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ మాదిరిగా వ్యక్తిగతంగా మేం మాట్లాడం పవన్ మాపై ఎందుకు కక్ష పెంచుకున్నారో అర్ధం కావట్లేదు’’ అంటూ ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యానించారు. చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్ -
మండపేట నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
ఏపీ: పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, తాడేపల్లి: విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని.. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలో మండపేట(డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి.. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తుకు వచ్చేవి. తప్పుడు ప్రచారాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. దీనికి మళ్లీ గెలిపించుకుంటాం. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే శాయశక్తులా కృషి చేస్తాం. కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీఎం జగన్ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇదీ చదవండి: ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ -
కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధ్యానత ఇచ్చారు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
టీడీపీ ఎమ్మెల్యే నోటి దూల మాటలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అదిరిపోయే కౌంటర్
-
తండ్రిని చంపి.. కుమారుడిని పరామర్శిస్తారా?
మండపేట: తండ్రిని చంపిన వ్యక్తి.. తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాను చంద్రబాబు పరామర్శించడంపై ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తోట మీడియాతో మాట్లాడారు. రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబునాయుడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అటువంటి వ్యక్తి రాధాను పరామర్శించడం వల్ల రంగా ఆత్మ మరింత క్షోభిస్తుందని అన్నారు. రంగా అన్ని సామాజికవర్గాలూ అభిమానించే వ్యక్తని, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు కావస్తున్నా నేటికీ అందరి హృదయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన కుమారుడు రాధా ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రెక్కీ జరిగిన విషయాన్ని రాధా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అవసరమైన రక్షణ కల్పిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించిందని చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు తనకు తెలుసునని, బాబు మాటల్లోని మంచి, చెడును ఆలోచించుకుని అడుగులు వేయాలని తన సోదరుడైన రాధాకు సూచన చేస్తున్నానని తోట అన్నారు. -
నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం: సజ్జల
అమరావతి: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసి, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోను అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తుచేశారు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. అలానే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇలానే సామాజిక న్యాయం పాటిస్తున్నామని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్ ఎంత కచ్చితంగా నిలబడతారో ఇదే నిదర్శనమని గుర్తుచేశారు. శాసన మండలిలో టీడీపీ అడ్డంకులు ఇక ఉండవని, ప్రభుత్వ పాలసీల అమలు ఇక నుంచి సులభతరం అవుతుందని అన్నారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్‌రెడ్డిది అని అన్నారు. పార్టీ జెండా మోసిన నమ్మకాస్తులకు అవకాశాలు ఇచ్చే నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.2006లో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారని, 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకే తనకు సీఎం జగన్ దేవుడు లాంటివారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తొలిసారి తమ నాయుకుడు, సీఎం జగన్ శాసన మండలిలో అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు.అన్ని సామాజికవర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ మోషేన్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని అన్నారు.బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా దక్కేలా చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. కడప జిల్లాలో తొలిసారి బీసీ యాదవ వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు. సమాన్యుడైన తనను చట్టసభలుకు పంపింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కుమారుడు తోట పృద్వీరాజ్ కూడా ఉన్నారు. కాగా, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. అంతకుముందు.. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. చదవండి: కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ నూతన విద్యా విధానంతో ఎనలేని మేలు: సీఎం జగన్ -
కాపులకు బాబు ద్రోహంపై నోరెత్తలేదేం?
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్క్రిప్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. ఆదివారం వారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదు.. ► కాపుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ పేర్కొనటం విడ్డూరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలతో లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేసింది. దీనిపై పవన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదు. మాటకు కట్టుబడి... ► టీడీపీ ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి కాపుల కోసం ఖర్చు చేసింది రూ.1,874 కోట్లు మాత్రమే. చంద్రబాబు తొలి ఏడాది పాలనలో కాపులకు కేటాయించింది సున్నా. పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు నోరెత్తలేదు? చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం 2,54,335 మంది లబ్ధి పొందితే సీఎం జగన్ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్ ద్వారా 22,89,319 మందికి లబ్ధి చేకూర్చారు. ► ఏటా రూ.2,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,392.43 కోట్లను కాపుల కోసం జగన్ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.1,377 కోట్లకుపైగా ఖర్చు చేశారు. సాయం లెక్కలు ఇవిగో.. ► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్లను సీఎం జగన్ ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారు. అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైఎస్సార్ రైతుభరోసా కింద 7,56,107 మందికి రూ.1,497.29 కోట్లు లబ్ధి కలిగింది. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు సాయం చేశారు. జగనన్న చేదోడు (దర్జీలకు) కింద 14,021 మందికి రూ.14.02 కోట్లు, వైఎస్సార్ నేతన్ననేస్తం కింద 2,577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైఎస్సార్ జగనన్న ఇళ్లపట్టాల కోసం 2,56,424 మందికి రూ. 663.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ బహిరంగంగా కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రం ఎందుకు? బాబు డ్రామాలతో కాపులు నష్టపోయారు ► కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. సుప్రీం తీర్పు వల్ల 50% మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసీ చంద్రబాబు ఆడిన డ్రామాలతో కాపులు నష్టపోయారు. జగన్ ధైర్యంగా, నిజాయితీగా ఈ విషయంపై మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని కాపు సోదరులు గమనించాలి. బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించటంపై తమ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’
సాక్షి, తూర్పుగోదావరి: కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మోసం చేయడంతో ప్రజలు 151 సీట్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే 45 నుంచి 60 ఏళ్లు ఉన్న కాపు మహిళలకు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. 2.40 లక్షల మంది కాపు మహిళలకు కాపు నేస్తం అందించామని చెప్పారు. ఇంకా అర్హత ఉన్నవారు నమోదు చేసుకునేందుకు నెల సమయం కూడా ఇచ్చామని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్‌కళ్యాణ్ అదే చెప్పారని ఎద్దేవా చేశారు.(అవన్నీ పవన్‌కు కనిపించడం లేదా: అవంతి) 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి జనసేన తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని తోట త్రిముర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెపప్పారు. ముద్రగడ ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా లేని విధంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని ధ్వజమెత్తారు. కంచం కొడితే కూడా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, గాజువాకలో కూడా కాపులే ఎక్కువగా ఉన్నాపవన్ కల్యాణ్‌ను ఓడించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తనలోని లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కాపులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తోట త్రిముర్తులు పేర్కొన్నారు. -
‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’
-
వైఎస్సార్సీపీలోకి తోట త్రిమూర్తులు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు రామచంద్రాపురం నాయకులు పి.బాబ్జి, వంటికూటి అబ్బు, విశ్వేశ్వరరావు, తోట పృథ్వీరాజ్, రేవు శ్రీను, పేకేరు బాబ్జీ, బాలాంతరం రాజా, రావూరు సుబ్బారావు, తోట బాబు, వారి అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు త్రిమూర్తులు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాల అమలుకు తనవంతు కృషి చేస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని అన్నారు. ఆయన ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు. అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. రాజకీయంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తాను పోటీ పడుతూ వచ్చామన్నారు. కులాల మధ్య గానీ, తమ మధ్య గానీ ఎలాంటి వైరం లేదని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. పార్టీలో సీనియర్లతో కలిసి పని చేస్తానని, అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ కాపుల తరపున మాట్లాడటం లేదని తోట త్రిమూర్తులు విమర్శించారు. అందుకే పవన్ కల్యాణ్‌పై కాపులకు నమ్మకం సడలిపోయిందని స్పష్టం చేశారు. త్రిమూర్తులు రాక సంతోషకరం: బోస్ తాను మొదటి నుంచీ వైఎస్సార్సీపీకి విధేయుడిగా ఉన్నానని, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో చరిత్ర పుటల్లో టీడీపీ కనిపించదని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో తీసుకున్న పీపీఎల నిర్ణయాలతో రోజుకు రూ.700 కోట్లు నుంచి రూ.1,000 కోట్ల నçష్టం జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. రానున్న రోజుల్లో చాలామంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, సి.వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ నేత పిల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మీ ఆత్మలు బీజేపీలో ఎందుకు చేరాయి
ద్రాక్షారామ (రామచంద్రపురం): ‘మీ ఆత్మలుగా వ్యవహరించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి ఎందుకు వెళ్లారనే విషయమై టీడీపీ శ్రేణులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది చంద్రబాబు గారూ. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఆ ఇద్దరితోపాటు గరికపాటి రామ్మోహనరావు, టీజీ వెంకటేష్ టీడీపీ ఓటమి పాలైన 15 రోజుల్లోనే బీజేపీలో చేరారు. ఆ నలుగురూ మీ కంట్రోల్లో ఉంటూ మీకు సన్నిహితంగా మెలిగేవారు. మీకు చెప్పకుండానే పార్టీ మారారా. దీనిపై మీరెందుకు నోరు మెదపటం లేదు’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత తోట త్రిమూర్తులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరుతో మనస్తాపం చెందిన తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంతోమంది పార్టీలోకి వస్తారు, పనులు చేయించుకుని వెళ్లిపోతుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై త్రిమూర్తులు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తానెప్పుడు సొంత ప్రయోజనాలు ఆశించలేదని చెప్పారు. చంద్రబాబు వద్ద సొంత ప్రయోజనాల కోసం ఒక్క పని చేయించుకున్నట్లు నిరూపించినా.. అందరి సమక్షంలో ఎక్కడైనా సమాధానం చెబుతానన్నారు. -
టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా
-
తూర్పు గోదావరిలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ రామచంద్రాపురంలో ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్న తోట త్రిమూర్తులు.. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు వైఖరివల్లే తోట త్రిమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
గంటా శ్రీనివాస్‌తో తోట త్రిమూర్తులు భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నాయకులు తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వీరు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ వీరి భవిష్యతు కార్యచరణపై స్పష్టత రాలేదు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌తో తోట త్రిమూర్తులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశానికి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ నాయకుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. మరోవైపు తోట త్రిమూర్తులుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులు గంటాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గంటా బీజేపీలోకి వెళ్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీపై టీడీపీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. -
కాపు కల్యాణ మంటపం స్థలం కబ్జా
సాక్షి, రామచంద్రపురం: నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సొంత సామాజిక వర్గం కాపుల ఓట్లతోపదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. కాపు కల్యాణ మంటపం కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఆయన బంధువులకు కట్టబెట్టారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామిశెట్టి గంగాపురుషోత్తం ఆరోపించారు. పట్టణంలోని వినయ్‌దుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇష్టదైవం ప్రసన్నాంజనేయస్వామి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. కాపులను కేవలం ఓట్ల కోసమే తప్ప కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏనాడు పాటు పడలేదన్నారు. అమలాపురంలో పశువుల వ్యాపారం చేసుకునే ఆయన 1994లో నియోజకవర్గానికి వచ్చారన్నారు. కల్యాణ మంటపం కట్టుకోవాలంటూ కాపులను ఏకం చేసిన ఆయన.. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇండిపెండెంట్‌గా కాపుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తొలిసారి ఇండిపెండెంట్‌గా ఆయన గెలిచిన సమయంలో తాను తోట వద్దే ఉన్నానని, ఆ సమయంలో ద్రాక్షారామలో కాపులకు కల్యాణ మంటపం నిర్మించేందుకు దేవస్థానం భూమిని తీసుకున్నట్టు ఆయన వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాపులకు మాత్రం కల్యాణ మంటపాన్ని మాత్రం నిర్మించలేదని విమర్శించారు. అప్పట్లో సేకరించిన ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.70కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ విషయంలో కాపులను ఆయన నిలువునా మోసం చేశారని విమర్శించారు. తిరిగి కాపులను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో కాపులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తుంటే అప్పుడేందుకు మాట్లాడలేదని గంగాపురుషోత్తం ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల ఓట్లు ఆయనకు కావాల్సి వచ్చాయన్నారు. ఇప్పటికైనా కాపులు మోసపోకుండా ఉండాలని ఆయన కోరారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలకాలన్నారు. కాపు నాయకులు తొగరు మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సంఘీయులు హాజరయ్యారు.