Tipper
-
∙రాత్రంతా చెట్టుపైనే..
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ నుంచి ఒడిశా వెళుతోన్న టిప్పర్ వరదనీటిలో చిక్కుకోగా డ్రైవర్ రాత్రంతా చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మర్రి నవీన్ తెలంగాణలోని సత్తుపల్లికి చెందిన టిప్పర్‌ను ఒడిశాలో అప్పగించేందుకు ఆదివారం బయలుదేరాడు. గూగుల్ మ్యాప్ సాయంతో టిప్పర్‌ను నడుపుతున్న నవీన్ అర్ధరాత్రి చింతూరు మండలం నిమ్మలగూడెంకు చేరుకున్నాడు. అప్పటికే ఒడిశాకు వెళ్లే జాతీయ రహదారి–326పై భారీగా వరదనీరు నిలిచి ఉంది. ఈ విషయాన్ని గమనించని నవీన్ వేగంగా టిప్పర్‌ను నీటిలోకి దింపడంతో అది దూసుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో భయపడిన అతను లారీ క్యాబిన్పైకి ఎక్కగా వరదనీరు క్రమేపీ క్యాబిన్ పైకి కూడా రావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పక్కనే ఉన్న తాటిచెట్టు ఎక్కాడు. రాత్రంతా అతను చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడపగా ఉదయం అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పడవ సాయంతో డ్రైవర్‌ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. -
టిప్పర్ యూటర్న్ తీసుకుంటుండగా..
కరీంనగర్: మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారు వరదకాల్వ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన వెలుమల దీక్ష(23) నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని తన అక్క వద్దకు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. తన అక్క భర్త దిలీప్ ద్విచక్రవాహనంపై మెట్పల్లి వైపు వస్తుండగా.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ వైపు నుంచి వరదకాల్వ మీదుగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్ రాజేశ్వర్రావుపేట బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దీక్ష, ఆమె బావ తప్పించుకునే క్రమంలో దీక్ష టిప్పర్ టైర్ కింద పడిపోయింది. టైర్ ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు టిప్పర్‌ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దిలీప్ ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ ప్రియాంకసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. ఇవి చదవండి: డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య.. -
కాలితో తన్నిన ఆఫీసర్.. యాచకుడి దుర్మరణం
సాక్షి, ఆర్మూర్: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారులో ఆర్మూర్ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్ లేవని బదులిచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ వెల్లడించారు. బిక్షం అడిగితే కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు. శివరాం డబ్బుల… pic.twitter.com/NQIi59uLYb — Telugu Scribe (@TeluguScribe) February 24, 2024 Video Credits: Telugu Scribe -
కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి
మెదక్ మున్సిపాలిటీ : దీపావళి ప్రతీ ఇంట్లో వెలుగులు తెస్తే.. ఆ కుటుంబంలోకి మాత్రం చీకటి తెచ్చింది. పండుగ రోజు టపాసులు కొనేందుకు తల్లి, ఇద్దరు కుమారులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు టైర్ కిందపడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి చెందిన అన్నపూర్ణ మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్నారు. భర్త శ్రీనివాస్ గతంలో మెదక్‌లోనే హోంగార్డ్‌గా పని చేసి, రెండేళ్ల క్రితం బొడ్మట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి అన్నపూర్ణ మెదక్‌లోని కేజీబీవీలో టీచర్‌గా పని చేస్తూ ఇద్దరు పిల్లలు పృధ్వీ తేజ్ (9), ప్రణయ్ తేజ్ (12) చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆదివారం దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనడానికి ఇద్దరు కుమారులతో కలిసి వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు స్కూటీపై వెళ్తుంది. మార్గమధ్యలో స్థానిక గోల్కొండ వీధిలో ప్రధాన రోడ్డుపై వీరి స్కూటీని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నపూర్ణ రోడ్డు పక్కన పడిపోగా, స్కూటీ వెనుకాల ఉన్న పృధ్వీ తేజ, ప్రణయ్ టిప్పర్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే కుమారులు చనిపోవడం చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి లేకుండానే అంత్యక్రియలు టేక్మాల్(మెదక్): మెదక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు చిన్నారుల అంత్యక్రియ లు స్వగ్రామమైన కాద్లూర్‌లో తల్లి లేకుండానే జరిగాయి. కళ్ల ముందే కొడుకులు చనిపోవడం చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లడంతో సంగారెడ్డిలోని పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందు తుంది. పండుగ రోజే ఇద్దరు మృతి చెందడంతో గ్రామ ంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ప్రణయ్‌తేజ్ (12) మెదక్ గీతా పాఠశాలలో 7వ తరగతి, పృధ్వీ తేజ్ (9) తుప్రాన్ గీతా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. -
టిప్పర్ ఢీకొని.. కాపాడండని వేడుకుని..
ఖమ్మం క్రైం: అతి వేగంతో వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొని ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. టిప్పర్ కింద చిక్కుకుపోయిన యువకుడు తనను కాపాడాలని వేడు కున్నాడు.. పోలీసులు స్పందించి యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరా లివి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన దొప్పా వీరబాబు కుమారుడు విజయ్‌కుమార్ ఖ మ్మంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖమ్మం శ్రీని వాసనగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం గదికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పక్కనే అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కుడివైపునకు తిరగడంతో విజయ్‌కుమార్‌ను ఢీకొంది. విజయ్ అదుపు తప్పి లారీ చక్రాల కింద పడిపోయాడు. ఆయన నడుం భాగంపైకి టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన ప్రాణాలు కాపా డాలని ఆ యువకుడు వేడు కున్నాడు. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ చేరుకుని విజయ్ను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్ బుడిగ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం గ్రామ శివారులో ఒక ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్ బస్సుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం
వల్లూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండల పరిధిలోని గోటూరు, తోల్లగంగనపల్లె బస్‌స్టాప్‌ల మధ్య సోమవారం వేకువజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరను అన్లోడ్ చేసిన టిప్పర్ వేకువజామున 3.15 గంటల సమయంలో కడప వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారిపైకి ఎక్కుతుండగా అనంతపురం వైపు ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో కారు సైతం వీటిని ఢీకొంది. దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ ధ్వంసమై మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో స్కార్పియో వాహనంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాకు చెందిన కూలీల్లో నలుగురు సజీవ దహనం కాగా.. అందులో ఉన్న ఎర్ర చందనం దుంగలు కాలిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మూర్తి అనే మరో కూలీ మృతి చెందాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి సజీవ దహనమైన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన రాజన్, సందిరన్, రామచంద్రన్‌గా తెలుస్తోంది. మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో టిప్పర్, స్కార్పియోతో పాటు మరో కారు కూడా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ కిందకు దూకి అపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన మరో కారు ఎవరిది, అందులో ప్రయాణిస్తున్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదంతో వెలుగులోకొచ్చిన స్మగ్లింగ్ అరుదైన ఎర్ర చందనం చెట్లు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్ల పరిధిలో దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 13 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. గతంలో కడప డివిజన్లోని సిద్ధవటం, రాయచోటి, వేంపల్లె, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్ర చందనం ఎక్కువగా స్మగ్లింగ్ అయ్యేది. ఆ తరువాత సద్దుమణిగినా.. ఈ ఘటనతో స్మగ్లర్ల ఉనికి మరోసారి వెలుగులోకి వచ్చింది. -
టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కన్నెపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యా యి. లక్సెట్టిపేట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ నుంచి కామారెడ్డికి ఇసుకలోడ్‌తో వెళ్తున్న టిప్పర్, హైదరాబాద్ నుంచి ఊట్నూర్‌కు 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొని బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ రవి (35) మృతి చెందగా, బస్సు డ్రైవర్ తిరుపతి, బస్సులో ప్రయాణిస్తున్న యశోద, త్రివేణి, శశికుమార్, ఉపేందర్‌తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్సులో లక్సెట్టిపేట, మంచిర్యాల ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ రవి క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతన్ని బయటకు తీశారు. తీవ్ర గాయాలైన రవిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ రవిని కామారెడ్డి జిల్లా యాచారం నివాసిగా గుర్తించారు. -
విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ దగ్ధం
-
జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి
-
టిప్పర్ బోల్తా: ఇద్దరు దుర్మరణం
రామకుప్పం: చిత్తూరుజిల్లా చెల్దిగానిపల్లె రహదారిలో ఆదివారం రాత్రి టిప్పర్ బోల్తా పడడంతో మధ్యప్రదేశ్‌లోని బీజాపుర్కు చెందిన ఇద్దరు మృతిచెందారు. చెల్దిగానిపల్లె వద్ద జరుగుతున్న రోడ్డు పనుల్లో బీజాపూర్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ ఇమామ్ (35), క్లీనర్ శ్రీశైలం (39) పాల్గొన్నారు. వీరు ఆదివారం టిప్పర్‌లో కర్ణాటక ప్రాంతం మాలూరు నుంచి కంకర తీసుకొని బయలుదేరారు. చెల్దిగానిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో టిప్పర్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో టిప్పర్ ముందు భాగంలోని అద్దాలు పగిలి ఇమామ్, శ్రీశైలంల శరీరంలోకి గుచ్చుకోవడంతోపాటు తలకు బలమైన గాయాలై, అక్కడిక్కడే మృతిచెందారు. వర్షం వస్తుండడంతో గ్రామస్తులు ఆలస్యగంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. -
ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీ
ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం చండ్రుగొండ: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చండ్రుగొండ– అన్నపురెడ్డిపల్లి మండలాల సరిహద్దులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు, బొగ్గు టిప్పర్ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 27 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తుండగా.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గులోడుతో వస్తున్న వోల్వో టిప్పర్ మద్దుకూరు వద్ద వేగంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన టిప్పర్ రోడ్డుదిగి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అది ముక్కలైంది. టిప్పర్ ఇంజన్, ట్రక్కు రెండు భాగాలుగా విడిపోయాయి. మరో వైపు అదేవేగంతో ముందుకు వెళ్లిన బస్సు రోడ్డుపక్కన తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన శంషున్నీసాబేగం(65), సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన టిప్పర్ క్లీనర్ కిచ్చపాటి వెంకటరెడ్డి (48) అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కొత్తగూడెంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఐ సంపత్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యుశకటం
♦ ఇంటర్ విద్యార్థినులపై దూసుకెళ్లిన టిప్పర్ ♦ ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు ♦ ఓర్వకల్లు వద్ద ఘటన ♦ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఉదయం తొమ్మిదిన్నర అవుతోంది. మరికొద్ది సేపట్లో కాలేజీ మొదలవుతుంది. దీంతో విద్యార్థినులంతా చకచకా నడుచుకుంటూ కాలేజీకి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. ఇంతలోనే టిప్పర్ రూపంలో మృత్యుశకటం దూసుకొచ్చింది. ఓ విద్యార్థినిని మాంసపు ముద్దలా మార్చేసింది. మరో ఏడుగురిని గాయపరిచింది. ఈ ఘటన మంగళవారం ఓర్వకల్లులో చోటుచేసుకుంది. ఓర్వకల్లు: ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 160 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆర్సీ ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. వీరు ప్రతిరోజూ ఆటోలు, బస్సుల్లో ఓర్వకల్లు బస్టాండుకు చేరుకుని.. అక్కడి నుంచి జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ కళాశాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం శకునాల గ్రామానికి చెందిన మహాలక్ష్మి, నిర్మల, శోభారాణి, మాధవి, హుశేనాపురం గ్రామానికి చెందిన శాంతకుమారి, మమత, కాల్వ గ్రామానికి చెందిన సుస్మిత, ఓర్వకల్లుకు చెందిన పరిమళ స్థానిక బస్టాండు వద్ద నుంచి రోడ్డు వెంట నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరారు. మరో రెండు నిమిషాలలో కళాశాలకు చేరుకుంటారు. అయితే.. ఈలోపే వెనుక వైపు నుంచి టిప్పర్ వేగంగా వచ్చి వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హుశేనాపురానికి చెందిన శాంతకుమారి(16) అక్కడికక్కడే చనిపోయింది. మిగతా ఏడుగురు గాయపడ్డారు. అదే సమయంలో రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ చంద్రబాబు నాయుడు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో శకునాలకు చెందిన మహాలక్ష్మి(16) పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణంరెడ్డి, అధ్యాపకులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వద్ద ఉన్న సెల్ నంబర్ల ఆధారంగా బాధిత పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని బోరున విలపించారు. శాంతకుమారి మృతదేహం మాంసం ముద్దలా ఉండడంతో అది చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శాంతకుమారి తండ్రి సోమన్న మరణించారు. తల్లి నీలమ్మ బధిరురాలు (మూగ–చెవిటి). దీంతో ఆమె అవ్వ వద్ద ఉంటూ చదువుకునేది. బోల్తా పడిన టిప్పర్ ప్రమాదానికి కారణమైన టిప్పర్ రోడ్డు పక్కనగల ఇనుప స్తంభాన్ని బలంగా ఢీకొని 20 అడుగుల దూరంలో బోల్తా పడింది. కాగా.. ఇది మండలంలోని వెంకటాపురం వద్దనున్న శ్రీలక్ష్మీ రోడ్డు మెటల్ కంపెనీకి చెందినది. ఈ కంకర కంపెనీని కర్నూలు మాధవనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి, బనగానపల్లెకు చెందిన మరో నలుగురు భాగస్వాములు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ సిమెంటు కంకర మిశ్రమాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రమాదానికి కారణమైంది. పరిస్థితిని గమనించిన టిప్పర్ డ్రైవర్ గోవిందు వాహనం అద్దాలను పగులగొట్టుకుని పరారయ్యాడు. అందులో లభించిన మద్యం సీసాను బట్టి అతను మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఇన్చార్జ్ సీఐ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రమాద విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, పాణ్యం బీజేపీ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కర్నూలు ఆర్డీఓ హుసేసాహెబ్, తహసీల్దార్ శ్రీనాథ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ, టీడీపీ మండల కన్వీనర్లు లక్ష్మీకాంతరెడ్డి, గోవిందరెడ్డి ,గ్రామ సర్పంచు పెద్దయ్య తదితరులు బాధితులను పరామర్శించారు. ఓర్వకల్లు రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి అన్నారు. ఇకమీదట పునరావృతం కాకుండా చూడాలన్నారు. గాయపడ్డ విద్యార్థినులకు మెరుగైన వైద్యం : కలెక్టర్ కర్నూలు(హాస్పిటల్): ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంటర్ విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. కర్నూలు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి అనే విద్యార్థిని పరిస్థితి ఆందోళనగా ఉందని, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారన్నారు. వీరందరికీ మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. -
భారత్‌కు స్కానియా హై టెక్నాలజీ ట్రక్కులు
♦ ప్రీమియం విభాగంలోనే కొనసాగుతాం ♦ సాక్షితో కంపెనీ డైరెక్టర్ హనా జోహన్సన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ట్రక్ విపణిలో ప్రీమియం విభాగంలోనే కొనసాగుతామని స్కానియా కమర్షియల్ వెహికిల్స్ ఇండియా వెల్ల డించింది. ఈ విభాగంలో మొదటి రెండు స్థానాల్లోనే ఉంటామని కంపెనీ డైరెక్టర్ హనా జోహన్సన్ మంగళవారం తెలిపారు. పి–440 యూ–బాడీ టిప్పర్‌ను మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా సేల్స్ డైరెక్టర్ శ్రీనివాసన్ రాఘవన్‌తో కలిసి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. భారత మైనింగ్ రంగం కోసం ప్రత్యేకంగా పి–440 మోడల్‌ను డిజైన్ చేసినట్టు చెప్పారు. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఇతర మోడళ్లను దేశీ మార్కెట్ కోసం ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం బెంగళూరులోని పరిశోధన, అభివృద్ధి కేంద్రం నిమగ్నమైందని చెప్పారు. భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన మోడళ్లను ఈ కేంద్రం డిజైన్ చేస్తుందని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. స్కానియా అంతర్జాతీయంగా అందుబాటులోకి తెచ్చిన హై టెక్నాలజీ వాహనాలను ఇక్కడా పరిచయం చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్ మార్కెట్లలో భారత్ ఒకటని గుర్తు చేశారు. తక్కువ వ్యయంతో ఉత్తమ పనితీరు కనబరిచే వాహనాలనే విక్రయిస్తామని తెలిపారు. కాగా, ప్రతి వాహనాన్ని కస్టమర్ అవసరాన్నిబట్టి డిజైన్ చేస్తారు. భారత్‌లో ఏటా 2,500 ట్రక్కులు, 1,000 బస్సుల తయారీ సామర్థ్యం గల రెండు ప్లాంట్లు కంపెనీకి ఉన్నాయి. -
దుమ్మెత్తిపోస్తున్న వాహనాలు
► శాపంగా మారినరహదారి విస్తరణ పనులు ► ఆగ్రహంతో టిప్పర్లు అడ్డుకున్న గ్రామస్తులు కాల్వశ్రీరాంపూర్: సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి గంగారం బ్రాడ్జిక్రాస్ రోడ్డు వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో వాహనాలు వెదజల్లుతున్న దుమ్ముతో ప్రయాణికులు, గ్రామీణ ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అస్తమా పేషెంట్లు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు తేడాలేకుండా దుమ్ముతో ఊపిరాడక ఇబ్బందులపాలవుతున్నారు. ఊపిరితిత్తుల్లో దుమ్ముచేరి ఆస్పత్రులకు పరుగులుతీస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా రోడ్లపై నీరు చల్లాల్సి ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా, ఆరేసిన దుస్తులపై, వండుకున్న వంటలపైకి చేరడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతోంది. మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మండలంలోని పెగడపల్లిలోని దళితకాలనీ వాసులు రోడ్డు పనుల కోసం కంకర తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ప్రయాణికులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిన రోడ్లపై దుమ్ములేవకుండా ప్రతీరోజూ మూడుపూటలా నీళ్లుచల్లించాలని వేడుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఇదే వరుస చాలారోజుల నుంచి ఇదే వరుస. దుమ్ములేస్తూ ఇళ్లపైనే కాకుండా ఆరేసిన బట్టలపై, ఇంట్లో వండుకున్న వంటలపై దుమ్ము పడుతుంది. టిప్పర్లు కంకర, మొరం, తారు చేరవేస్తుండటంతో దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. – కుమార్, వార్డు సభ్యుడు, పెగడపల్లి దమ్ము రోగం వత్తాంది రోడ్లు పనులు ఎప్పుడు పూర్తయితవో కానీ ఇప్పడు రోజూ మాప్రాణాలు పోతున్నయి. పిల్లలకు, పెద్దోలకు ఊపిరాడత లేదు. దవాఖాన్లకు పోతే మిషన్ పెట్టి ఊపిరితిత్తుల్లో పేరుకు పోయిన దుమ్ము తీస్తున్నామని ఫీజు గుంజుతున్నరు. దుమ్ముతో దమ్మురోగం వత్తాంది. – స్వామి, సర్వారాంపల్లి -
వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం : టిప్పర్ టైర్లు వ్యక్తి తలపైకి ఎక్కడంతో అతను మృతిచెందిన సంఘటన మండలంలోని రేబాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. రేబాల వద్ద బొల్లినేని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముంబయి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సికరా ప్రాంతానికి చెందిన గంగాప్రసాద్‌యాదవ్ ( 60) తన కుమారుడితో కలిసి కొంతకాలంగా రహదారి పనులు చేస్తున్నాడు. రేబాల వద్ద శుక్రవారం మట్టిని అన్లోడ్ చేసే క్రమంలో టిప్పర్ టైర్లు గంగా ప్రసాద్ తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరి మృతి
రేణిగుంట(చిత్తూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి వద్ద శనివారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
తల్లిని చూసేందుకు వెళుతూ...
చల్లపల్లి/ఘంటసాల : టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బత్తుల వెంకటేశ్వరమ్మ (37) మృతి చెందింది. చల్లపల్లికి చెందిన బత్తుల రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి మొవ్వ మండలం యద్దనపూడి వెళుతున్నారు. ఘంటసాల మండలం చిట్టూ ర్పు కోళ్లఫారాల వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ వీరి ౖబైక్‌వైపు దూసుకువచ్చింది. ప్రమాదాన్ని గమనించి బైక్‌ను పొదల్లోకి తిప్పేశాడు. లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో రామకృష్ణ డ్రైవర్‌గా, వెంకటేశ్వరమ్మ వంటమనిషిగా పనిచేసేవారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు బయలుదేగా ఈ ప్రమాదం జరిగింది. -
టిప్పర్ల వేగాన్ని నియంత్రించండి
హయత్‌నగర్ మండలం బలిజగూడ గ్రామం మీదుగా వెళ్తున్న టిప్పర్ల అతివేగానికి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ గ్రామస్తులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేస్తూ టిప్పర్ల అడ్డుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న క్రషర్మిషన్లు, రెడీమిక్స్, బీటీమిక్స్ ప్లాంట్లకు సంబంధించిన వందలాది టిప్పర్లు తమ గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్నాయని, అయితే ఈ టిప్పర్లన్నీ అతివేగంతో నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ క్రమంలోనే గత మూడు రోజుల క్రితం టిప్పర్ వేగానికి గ్రామానికి చెందిన ఓ యువకులు బలి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు, ఆర్టీఓ అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి టిప్పర్ల వేగానికి కళ్లెం వేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర జ్ఞానేశ్వర్‌గౌడ్, ఉప్పు వెంకటేష్, బల్లెపు సతీష్‌లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
చావలి చెక్‌పోస్టు వద్ద లారీ–టిప్పర్ ఢీ
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై చావలి చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి ఎదురెదురుగా టిప్పర్, లారీ ఢీకొన్నాయి. ఈఘటనలో ఇరులారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి.పేపర్ లోడుతో ఖమ్మం నుంచి శివకాశీ వెళుతున్న లారీని చిత్తూరు జిల్లా తొట్టంబేడు నుంచి కంకర లోడుతో నాయుడుపేటకు వెళుతున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి సుమారు గంటసేపు నరకయాతన పడ్డాడు. తీవ్రగాయాల పాలైన ఆయనను పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. పేపర్ లారీ డ్రైవర్ చిన్నా కూడా గాయపడ్డాడు, ఇద్దరిని మొదట నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
విజయవాడ(ఆటోనగర్): రామవరప్పాడు రింగు వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొనటం తో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. పోలీసుల వివరాలు...సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని మహిళ రామవరప్పాడు రింగు వద్ద రోడ్డు దాటుతుం డగా టిప్పర్ ఢీకొంది. తలకు బలమైన గాయం తగలటంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ మృతి చెం దింది. పచ్చరంగు చీర, పసుపు జాకెట్టు, మెడలో తెలుపు ఎరుపు పూసల దండ వేసుకుందని, చేతులకు బంగారు రంగు గాజులున్నాయని, ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీసుస్టేçÙన్లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. -
టిప్పర్ ఢీకొని బాలుడి మృతి
సుల్తాన్‌పూర్‌తండా (మఠంపల్లి): టిప్పర్ ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌తండా పునరావాస కాలనీకి చెందిన భూక్యారెడ్య, బూలిల కుమారుడు భూక్యా విష్ణువర్థన్ (6) పెదవీడు విద్యాన్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు.రోజూ పాఠశాలకు చెందిన బస్సే విద్యార్థులను తీసుకెళ్లి మళ్లీ విడిచిపెడుతుంది. ఈ క్రమంలో ఉదయం విష్ణువర్ధన్ స్కూల్ బస్సు ఎక్కేందుకు తండాలోనే రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో పెదవీడు నుంచి మట్టపల్లి వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ విష్ణువర్ధన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 108 వాహనం ద్వారా హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సుల్తాన్‌పూర్‌తండాలో విషాదఛాయలు... ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో బాలుడి తల్లిదండ్రి గుండెలవిసేలా రోదించాడు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పునరావాస కాలనీ మధ్యలో నుంచి ప్రధాన రహదారి వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ టిప్పర్
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తూ టిప్పర్, బైక్‌లు శనివారం ఉదయం ఢీకొన్నాయి. అనంతరం అదుపుతప్పిన టిప్పర్ పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటీవలే చిన్నారి రమ్య కుటుంబం కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
వెంటాడిన మృత్యువు
♦ ఆగి ఉన్న కారును ఢీకొన్న టిప్పర్ ♦ మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘటన ♦ నలుగురు చిన్నారులతో సహా డ్రైవర్‌మృతి ♦ ఐదు నిండు ప్రాణాలు బలితీసుకున్న నిద్రమత్తు ♦ తిరుమలకు వె ళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు.. ♦ మరో నలుగురికి తీవ్రగాయాలు ♦ ఒకసారి ప్రమాదం తప్పించుకున్నా వదలని మృత్యువు మేదరమెట్ల : గుంటూరు జిల్లా పాతగుంటూరు మారుతీనగర్ ఒకటో లైన్‌కు చెందిన మాచర్ల వీరాస్వామి విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగి. తన కుమారుడు మురళీకృష్ణ మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మురళీకృష్ణ, మాధవి దంపతుల కుమార్తె నిత్య(తొమ్మిది నెలలు)కు పుట్టువెంట్రుకలు తీరుుంచేందుకు రెండు రోజుల క్రితమే గుంటూరు వచ్చారు. తిరుమలలో పుట్టువెంట్రుకలు తీరుుంచాలని నిర్ణరుుంచారు. జూన్ 28వ తేదీన వీరాస్వామి, గంగమ్మ దంపతులు మురళీకృష్ణ కుటుంబంతోపాటు తమ మరో కుమారుడు గోపీకృష్ణ, అల్లుడు కోటేశ్వరరావు, కోడలు మాధవి, కూతురు లక్ష్మీప్రసన్న, మనవరాళ్లు, మనుమళ్లు చిన్నకృష్ణ మనోహర్, చిన్నికృష్ణ వాసవి, శ్రీకృష్ణతో కలిసి మొత్తం 11 మంది టవేరా కారులో తిరుపతి బయలుదేరారు. మొక్కు తీర్చుకుని బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే కారులో ఇంటికి తిరుగు ప్రయూణమయ్యూరు. ఈ క్రమంలో కారు మేదరమెట్ల దక్షిణబైపాస్ సమీపానికి రాగానే రాత్రి 2 గంటల సమయంలో డ్రైవర్ నాగరాజు నిద్రమత్తులో ఉండి ముందు వెళ్తున్న వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టాడు. అంద రూ కేకలు వేయడంతో మేల్కొని ఒక్కసారిగా బ్రేక్ వేసి, కారును కంట్రోల్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంజిన్ ఆగిపోయి రోడ్డుపై నిలిచిన కారు ఎంతకీ స్టార్ట్ కాలేదు. టీ తాగి కొద్దిసేపు ఆగి వెళ్దామని చెప్పినా డ్రైవర్ వినకపోవడంతో మురళీకృష్ణ, గోపీకృష్ణ, కోటేశ్వరరావు కిందకు దిగి, రోడ్డుపై ఉన్న కారును పక్కకు నెడుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారును 150 అడుగుల వరకూ ఈడ్చుకెళ్లి దానిపైకిఎక్కింది. కారు పూర్తిగా టిప్పరు వెనుక చక్రాల కింద ఉండిపోయింది. టిప్పర్ పైకి రావడాన్ని కారు బయట ఉన్న ముగ్గురూ గమనించి కేకలు వేస్తూ పక్కకు తప్పుకున్నారు. కారు అద్దాల్లో నుంచి బయటకు ఎగిరిపడిన చిన్నారి... టిప్పర్ ఢీకొన్న సమయంలో కారు డోరు కిటికీ నుంచి బయటపడిన శ్రీకృష్ణ (3) రోడ్డుపై పడిపోయూడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నాగరాజు కూడా రోడ్డుపై పడిపోవడంతో అక్కడే మృతిచెందాడు. కిందకు దిగిన ముగ్గురు మినహా, కుటుంబ సభ్యులంతా కారులోనే ఇరుక్కుపోయారు. నాలుగు గంటల నరకయూతన... ప్రమాదం సమాచారం అందుకున్న అద్దంకి సీఐ బైతపూడి ప్రసాద్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్సైలు వై.పాండురంగారావు, వై.శ్రీనివాసరావు, ఎన్‌హెచ్ అంబులెన్స్ సిబ్బంది, జాతీయరహదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మూడు క్రేన్ల సహాయంతో కారుపై ఉన్న టిప్పర్‌ను పైకి లేపారు. కారును పక్కకు తీసి దానిలో ఇరుక్కు పోరుున వారిని బయటకు తీసేందుకు నాలుగు గంటలపాటు శ్రమించారు. ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో గ్యాస్ కట్టర్ తెప్పించి కారు రేకులను కత్తిరించి క్రేన్ ద్వారా కారులోని వారిని బయటకు తీశారు. విగత జీవులైన చిన్నారులు... కారు వెనుకభాగంలో ఉన్న చిన్నికృష్ణ మనోహర్ (5), చిన్నికృష్ణ వాసవి (4) తీవ్రగాయూలతో మృతిచెందారు. నిత్య వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందింది. తీవ్రగాయాలైన వీరాస్వామి, గంగమ్మ, లక్ష్మీపార్వతి, మాధవికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో గంగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు నుంచి గుంటూరు లలితా నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. గంగమ్మ వెంటిలేటర్లపై ఉంది. ఈమె పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. మిన్నంటిన రోదనలు.. ఒక వైపు తమ పిల్లలు మృతి, మరో వైపు చావు బతుకుల్లో మహిళలు.. ఈ పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయట పడిన మిగతా కుటుంబసభ్యులు సైతం నిశ్ఛేష్టులయ్యూరు. చిన్నారుల మృతదేహాలను చూసి రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. చనిపోయిన చిన్నారుల మృతదేహాలను వదిలి వెళ్లలేక.. తీవ్రంగా గాయపడిన వారి వెంట ఆస్పత్రికి వెళ్లలేక వారు పడిన వేదన వర్ణణాతీతం సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ... జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా మరో వ్యక్తి మరణించారన్న సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ త్రివిక్రంవర్మ, దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసకున్నారు. -
మేం ఎవరి కోసం బతకాలి?
♦ ఈ కడుపుకోత పగవారికి కూడా వద్దు ♦ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది.. ♦ ఆ భగవంతుడన్నా కనికరించకపోయే.. ♦ రోడ్డు ప్రమాద బాధితుల కన్నీటి రోదన డ్రైవర్ల నిద్రమత్తు ఐదు నిండుప్రాణాలు బలితీసుకుంది. ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారుల జీవితాలను చిదిమేసింది. ఒకసారి ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిని మృత్యువు టిప్పర్ రూపంలో వెంటాడి మరీ కబళించింది. గురువారం తెల్లవారుజామున మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది నెలల పసిపాప పుట్టువెంట్రుకలు తిరుమల వెంకన్నకు సమర్పించి వస్తున్న కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘అప్పటి వరకూ మా ఒడిలో ఉన్న బిడ్డలు క్షణాల్లో కళ్లముందే నిర్జీవంగా మారారు. దేవుడి దగ్గరకే కదా.. సార్ వచ్చాం. ఆయనన్నా కనికరించకపాయే. పసిబిడ్డలు సార్. ఒకరు కాదు నలుగురు. వారు పోయాక..మేం ఎవరికోసం బతకాలి.. ఏం సాధించాలి’ అంటూ మేదరమెట్ల రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. వారిని రిమ్స్‌లో ‘సాక్షి’ ప్రతినిధి గురువారం ఉదయం పలకరించారు. పలకరించగానే వారు దుఃఖం ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. మృతి చెందిన చిన్నారులు శ్రీకృష్ణ మనోహర్ (5), వాసవి(4)ల తండ్రి అల్లపు కోటేశ్వరరావు జరిగిన ఘటనను వివరించారు. ఆయన భార్య లక్ష్మీప్రసన్న కూడా గాయాలపాలై ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె గుంటూరు జిల్లా రేపల్లెలో దేవాదాయశాఖ ఈవోగా పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు బావమరిది మురళి ఇద్దరు బిడ్డలు శ్రీకృష్ణ (3), 9 నెలల నిత్య ఈ దుర్ఘటనలో మృతి చెందారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తిరుమల వెళ్లొస్తూ మృత్యువాత.. పాత గుంటూరు మారుతీనగర్ ఒకటో లైన్‌కు చెందిన మాచర్ల వీరాస్వామి కుమారుడు మురళి, మాధవి దంపతుల బిడ్డ నిత్యకు 9 నెలలు నిండటంతో ఆమెకు పుట్టు వెంట్రుకలు తీయించాలని నిర్ణయించారు. మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మురళి కుమార్తె వెంట్రుకల కార్యక్రమం కోసం రెండు రోజుల క్రితమే గుంటూరు వచ్చారు. అనంతరం వీరాస్వామి కుమారుడు మురళి, అల్లుడు కోటేశ్వరరావు కుటుంబాలతో కలిసి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో గుంటూరు నుంచి కారులో తిరుపతి బయల్దేరారు. 29న తిరుమలలో నిత్యకు వెంట్రుకలు తీయించి శ్రీకాళహస్తి దర్శించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. 2 గంటల ప్రాంతంలో మేదరమెట్లకు సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా డ్రైవర్ నాగరాజు నిద్రమత్తుతో ముందు వెళ్తున్న లారీని కారుతో స్వల్పంగా ఢీకొట్టాడు. కారులో ఉన్న వారు కేకలు వేయడంతో టక్కున మేల్కొని నాగరాజు కారును కంట్రోల్ చేసుకున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని తెలుసుకొని వారు కారు ఆపి టీ తాగించి నిద్రపోమ్మని చెప్పారు. అయినా అతను పట్టించుకోలేదు. లేకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. వారి మాటలు డ్రైవర్ విని ఉంటే.. 15 నిమిషాలు మాత్రమే కునుకు తీసిన డ్రైవర్ నాగరాజు ఇక వెళ్దామంటూ మరోమారు టీతాగి బయల్దేరాడు. గంట పడుకుని వెళ్దామని కారులో ఉన్న వారు చెప్పినా వినిపించుకోలేదు. కారు తిరిగి బయల్దేరి కిలోమీటర్ వెళ్లగానే మరమ్మతులకు గురై ఆగిపోయింది. పిల్లలను మాత్రమే కారులో పడుకోబెట్టి అందరూ కారు దిగారు. కారును నెడితే స్టార్ట్ అవుతుందోమోనని కొందరు డ్రైవర్‌తో చెప్పి నెడుతున్నారు. ఇంతలో హైవే విస్తరణ పనులు చేస్తున్న డీఎస్పీసీఐఎల్కు చెందిన టిప్పర్ మృత్యువులా దూసుకొచ్చింది. 50 మీటర్ల దూరం నుంచే టిప్పర్ కారు వైపు స్పీడుగా దూసుకొస్తుండటాన్ని గమనించిన వెంకటేశ్వర్లు, మురళీలతో పాటు మిగిలిన వారు పెద్దగా చేతులు ఊపుతూ కేకలు పెట్టారు. అయినా నిద్రమత్తో... లేక మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ బండిని నిలపకుండా వేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. టిప్పర్.. కారును 150 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. టిప్పర్ మొత్తం కారుపైకి ఎక్కేసింది. కారులోని నలుగురు పిల్లలతో పాటు కారు డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా మహిళలు గంగమ్మ, లక్ష్మీప్రసన్న, మాధవి తదితరులు గాయపడ్డారు. కళ్ల ముందే పసిబిడ్డలు చనిపోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. -
టిప్పర్ కింద నలిగిన పసికందు
♦ మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ♦ తూప్రాన్ బైపాస్‌లో ఘటన తూప్రాన్: యాభై రోజుల పసికందు టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పసికందును బంధువులు బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తూప్రాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... ములుగు మండలం కొక్కొండకు చెందిన సుధాకర్, కవిత దంపతులు. వీరికి యాభైరోజుల క్రితం వరుణ్ తేజ్ జన్మించాడు. డెలివరీ కోసం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లోని పుట్టింటికి వెళ్లిన కవిత అక్కడే ఉంటుంది. బుధవారం వరుణ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడి తీసుకుని అమ్మమ్మ పద్మ, మామ శివ బైక్‌పై తూప్రాన్ ఆసుపత్రికి బయలు దేరారు. పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గల పెద్ద చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఒక్కసారిగా చెరువు కట్టవైపు తిరిగింది. దీంతో వరుణ్ టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. బైక్‌తోపాటు శివ కూడా టైర్ల కింద ఇరుక్కుపోగా అమ్మమ్మ పద్మ రోడ్డు కిందకు ఎగిరిపడింది. చక్రాల కింద నలిగి వరుణ్‌తేజ్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా అమ్మమ్మ, మామ గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇరువురిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కన్నీరుమున్నీరైన కవిత... కొడుకు పుట్టి యాభైరోజులు కూడా కాకముందే ప్రాణాలు వదిలిన విషయాన్ని తెలుసుకున్న తల్లి కవిత కన్నీరుమున్నీరైంది. అచ్చటాముచ్చట తీరకముందే అనంత లోకాలకు పయనమైన కొడుకును చూసి తల్లడిల్లిపోయింది. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడిపెట్టించింది. కవిత పుట్టినింటితోపాటు మెట్టినింటి వారు సైతం ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
♦ టిప్పర్, డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం ♦ మృతుల్లో ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లావాసులు మేడ్చల్ రూరల్: డీసీఎం, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని బాసిరేగడి వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. వుహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వుండలం తునికీపూర్కు చెందిన వుువ్ముళ్ల రాజు(26), అతడి చిన్నాన్న కుమారుడు వుహబూ (21) మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని నవదీప్ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్నారు. డీసీఎం (ఏపీ 28 టీసీ 8509) డ్రైవర్‌గా రాజు, వుహబూ క్లీనర్‌గా జీవనం సాగిస్తున్నారు. మేడ్చల్ వుండలం గిర్మాపూర్ రాక్సాండ్లో జార్ఖాండ్‌కు చెందిన రితూ వుహతో(29) టిప్పర్ నడిపిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి డీసీఎం కూల్‌డ్రింక్ లోడ్‌తో దుండిగల్ -మేడ్చల్ దారిలో మేడ్చల్ వైపు వస్తుంది. టిప్పర్ కంకర లోడ్‌తో మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తుంది. వుండలంలోని బాసిరేగడి సమీపంలో టిప్పర్, డీసీఎం వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రీతూ వుహతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన డీసీఎం క్లీనర్ వుహబూబ్ను హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణం విడిచాడు. మృతదేహాలను మేడ్చల్ వూర్చురీకి తరలించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. -
డీసీఎం,టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి
శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసిరేగిడి వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిమైసమ్మ నుంచి మేడ్చల్ వైపు వెళ్తోన్న డీసీఎం మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తోన్న టిప్పర్ ఢీకొన్నాయి.ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రితులాల్ మహతో(జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు) అక్కడికక్కడే మృతిచెందగా..డీసీఎం క్లీనర్ మైబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కురవిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
కురవి(వరంగల్ జిల్లా): కురవి మండలం మూడుగుడిసెల తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు మైపాడు నుంచి కురవి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. మృతులు ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలవాసులుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టిప్పర్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి
వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను టిప్పర్ ఢీకొనడంతో.. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైకును ఢీకొట్టిన టిప్పర్: వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం(కృష్ణా): కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్ ఇమాం షా స్థానికంగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతడు మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇమాంషా అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టిప్పర్ ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి
ఎమ్మిగనూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు పండిన పంటను ఇంటికి తేవడం కోసం ట్రాక్టర్‌పై కూలీలతో వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నర్సయ్య(30) అక్కడికక్కడే మృతిచెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
టిప్పర్‌తో పరారైన వ్యక్తి అరెస్ట్
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టిప్పర్ మాయం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నార్సింగ్‌లో రెండు నెలల క్రితం టిప్పర్ అదృశ్యం కాగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితుడు శివాజీని పోలీసులు సోమవారం నార్సింగ్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
టిప్పర్ బోల్తా .. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం యమ్నంపేట ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘట్కేసర్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళుతున్న టిప్పర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనక ట్రక్ పైకి లేచింది. అది బ్రిడ్జిని తాకడంతో బోల్తాపడింది. టిప్పర్ డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్: ముగ్గురి మృతి
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల బైపాస్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా... హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న టిప్పర్ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంట్లోకి దూసుకెళ్ళిన టిప్పర్
చండ్రుగొండ (ఖమ్మం జిల్లా) : ఓపెన్ కాస్టుకు వెళుతున్న ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా చండ్రుగొండిలో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కొత్తగూడెం నుండి సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్టుకు వెళ్తున్న టిప్పర్ వేగంగా వెళ్తూ అదుపు తప్పింది. రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి నల్లమోతు మాధవరావు ఇంట్లోకి దూసుకెళ్లింది. దాంతో ఆ పెంకుటిల్లు ధ్వంసం అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సత్తుపల్లి- కొత్తగూడెం మధ్య నడుస్తున్న బొగ్గుటిప్పర్లు అతివేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతుండటంతో మండల ప్రజలు వణికిపోతున్నారు. -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
కల్లూరు (కర్నూలు జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ ఢీకొని కంకర క్వారీలో పని చేసే కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలోని క్వారీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల ప్రకారం..మల్లయ్య(50) అనే కార్మికుడు నాయకల్లు గ్రామంలోని కంకర క్వారీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి పని చేస్తుండగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో దాని కింద పడి మల్లయ్య మృతి చెందాడు. మల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క్వారీ యాజమాన్యం మల్లయ్య బంధువులకు సోమవారం సమాచారం అందించారు. దీంతో మల్లయ్య కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, టిప్పర్ ఢీ: ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం (కృష్ణా): ఆగి ఉన్న పైపుల లారీని టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున రోడ్డు మీద ఆగి ఉన్న పైపుల లారీని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పైపులు టిప్పర్లోకి దూసుకెళ్లాయి. దీంతో టిప్పర్‌లో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. డ్రైవర్ మేకల సురేష్‌కు గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందని 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించేందుకు గ్యాస్కట్టర్లను తెప్పించారు. -
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మహబూబ్‌నగర్ (అమర్చింత): టిప్పర్ ఢీకొనడంతో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమర్చింత మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు-అమర్చింత రహదారి విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో కంకర సరఫరా చేయడానికి వచ్చిన టిప్పర్ వాహనం శుక్రవారం మధ్యాహ్నం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వరుసగా ఏడు స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా లేని సమయం అవటంతో పెను ప్రమాదం తప్పింది. -
టిప్పర్‌ను ఢీ కొన్న కారు
ఒకరి మృతి, నలుగురికి గాయాలు తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమగోదావరి): జాతీయరహదారి-16పై వెళ్తున్న కారు డీవైడర్‌పై ఉన్న చెట్లకు నీటిని అందించే టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు కాగా, ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెం మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. విజయవాడకు చెందిన టి. వరప్రసాద్(45) కుటుంబసభ్యులతో కలిసి పెనుగొండలో ఉన్న బంధువుల ఇంటిలో వివాహానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఢివైడర్పై ఉన్న చెట్లకు నీటిని అందించే టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. అన్నపూర్ణ, సుజీత్, మాధవి, శ్రీదేవిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం విజయవాడకు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆటో, టిప్పర్ ఢీ; ఒకరు మృతి
హైదరాబాద్: లంగర్ హోజ్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున ఆటో. టిప్పర్ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మృత్యు ఘోష
టిప్పర్‌ను ఢీకొన్న కేఎస్ ఆర్టీసీ బస్సు 14 మంది మృతి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిబంధనలు అతిక్రమించి ఓవర్టెక్కు యత్నం ముళబాగలు : ఏడు కొండల వాడి దర్శనానికి కొందరు, సొంత ఊర్లకు మరి కొందరు...ఇలా ప్రయాణమైన వారిలో 14 మంది అసువులు బాశారు. కోలారు జిల్లా ముళబాగలు తాలూకా శ్రీరంగపుర గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుమకూరు డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి మొత్తం 31 మందితో బయలుదేరింది. ముళబాగలు వద్ద ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఓ వైపు రోడ్డు పనులు జరుగుతుండగా, మరో మార్గంలో అటు, ఇటు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ, ముందుగా పోతున్న ఇసుక టిప్పర్‌ను ఓవర్ టేక్ చేయబోయింది. అయితే కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇరుకైన రోడ్డులో బస్సు కుడి భాగం టిప్పర్‌ను వేగంగా రాసుకుంటూ పోయింది. దీంతో ఆ భాగమంతా చీల్చుకుపోయింది. అటు వైపు కూర్చున్న వారిలో ఐదుగురు మహిళలు, ఓ పదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని కోలారులోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం ఐదుగురు మరణించారు. బస్సు తుమకూరు డిపోదైనప్పటికీ, ఆ పట్టణానికి చెందిన వారెవరూ అందులో లేరు. బెంగళూరులో తిరుపతికి 15 మంది, చిత్తూరుకు ఆరుగురు, పలమనేరుకు నలుగురు టికెట్లు తీసుకున్నారని కండక్టర్ నరసింహమూర్తి తెలిపారు. స్వల్ప గాయాలతో అతను ముళబాగలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరులోని హెబ్బాళకు చెందిన సోమశేఖర్, భార్య, మనవడితో కలసి ప్రయాణించారు. తన భర్తకు ఏమైందో తెలియడం లేదని, తన మనవడు మాత్రం ఒకసారి ఫోనులో మాట్లాడాడని గృహిణి చెప్పారు. బస్సులో ఇంకా గౌరిబిదనూరుకు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యచారి, పలమనేరుకు చెందిన అమల ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మృతులు కోలారుకు చెందిన నాగేశ్ (35), బెంగళూరులోని కోడిహళ్లికి చెందిన నాగమణి (50), బెంగళూరుకు చెందిన నారాయణమ్మ, భారతి బ్రహ్మచారి (35), పలమనేరుకు చెందిన రాజశేఖర్ (35), లిఖిత్ కుమార్ (3), తుమకూరుకు చెందిన డ్రైవర్ గంగాధరయ్య (50), ముళబాగలుకు చెందిన విజయమ్మ (55) మృతుల్లో ఉన్నారు. ఇంకా ఐదు మృత దేహాలను గుర్తించాల్సి ఉంది. -
ముగ్గురిని బలిగొన్న టిప్పర్
పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం రూరల్) : టిప్పర్ ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన గెడ్డం వెంకటేశ్వరరావు అనే యాకోబు (18) అక్క విజయ నిశ్చితార్థం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పెదతాడేపల్లి శివారులోని పోశమ్మపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకునేందుకు యాకోబు మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా, అదే సెంటర్లో నెల్లూరు జిల్లాకు చెందిన సర్కస్ చేస్తూ భవాని కల్లి (15), భవాని ఏసు (17) తమను పెదతాడేపల్లిలో దింపాలని కోరారు. దీంతో వీరిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని వస్తుండగా భారతీయ విద్యాభవన్స్ సమీపంలోకి వచ్చేసరికి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో యాకోబు, భవాని కల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఏసుకు తీవ్రగాయాలు కావడంతో అతనిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. సొమ్మసిల్లిన అక్క ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టిన యాకోబు అందరితో చనువుగా ఉండేవాడు. అక్కలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. యాకోబు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి ఎస్తేరు సంరక్షణలో వీరు పెరిగారు. ఇద్దరు అక్కలకు గతంలో పెళ్లి జరగ్గా, చిన్న అక్కకు గురువారమే ఇంటి వద్ద నిశ్చితార్థం సందర్భంగా కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సమయంలో యాకోబు మృతి వార్త వారిని కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు ఎక్కడుకు వెళ్లావురా అంటూ అక్కలు కన్నీటిపర్యంతమయ్యారు. యాకోబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం వచ్చి.. నెల్లూరు జిల్లా నుంచి పొట్టకూటికోసం సర్కస్ ఫీట్లు చేసే సంచారజీవుల బతుకులు రోడ్డుప్రమాదంలో తెల్లారిపోయాయి. గుప్పెడు అన్నం కోసం జిల్లాలు దాటి వచ్చిన వీరిని తీరని ఆవేదనను మిగిల్చింది. పెదతాడేపల్లి శివారులో పదిరోజులుగా టెంట్లు వేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శనల ద్వారా పొట్టనింపుకుంటున్న వారిలో ఏసు, కల్లి ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలంలోని పలుగ్రామాల్లో సర్కస్ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేందుకు వాహనాలు లేకపోవడంతో అదే సమయంలో మోటారు సైకిల్‌తో ఒంటరిగా వెళుతున్న యాకోబు వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ అడిగితే కాదనలేకపోయాడు. ప్రమాదంలో వీరిద్దరూ దూరం కావడంతో సంచారజీవులు గుండెలవిసేలా రోదించారు. రూరల్ ఎస్సై కఠారి రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అడవి’లో ఘోరం
క్వారీ బండరాయి పడి ఇద్దరి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పెనుమూరు మండలం అడవిపల్లిలో ఘటన మృతులు యాదమరి మండలం గొల్లపల్లివాసులు పత్తాలేని క్వారీ యాజమాన్యం సాక్షి, చిత్తూరు/సిటీ/పెనుమూరు/యాదమరి: క్వారీ ప్రమాదంలో యాదమరి మండలం పావుకూరు గొల్లపల్లికి చెందిన సురేష్(28), కన్నయ్య(38) మృతి చెందారు. కందన్, జీ సురేశ్‌బాబు(32) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పెనుమూరు మండలం అడవిపల్లి క్వారీలో బుధవారం చోటుచేసుకుంది. కూలీలు..గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి దళితవాడకు చెందిన వారు పనికోసం అడవిపల్లి క్వారీకి వెళుతుంటారు. వారం, పదిరోజులు భార్యాబిడ్డలకు దూరంగా అడవిలోనే ఉంటారు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే 11 మంది సోమవారం పనికి వెళ్లారు. బుధవారం కూడా ఉదయం 6.30 గంటలకు క్వారీకి వెళ్లారు. ఉదయం 9.45-10 గంటల మధ్యలో 30 అడుగుల ఎత్తున్న చిట్టాబ్రౌన్ రకానికి చెందిన గ్రానైట్ గుండును బ్లాస్ట్ చేసేందుకు రంధ్రాలు వేశారు. గుండు కింద మట్టి అధికంగా ఉండడంతో బ్లాస్ట్ చేసినా గుండు కిందకు పడదని భావించి మట్టిని తవ్వేందుకు కూలీలు ప్రయత్నించారు. సురేష్, కన్నయ్య సమ్మెటతో మట్టిదిబ్బలు పగులగొడుతున్నారు. మిగిలిన వారు గుండు కింద మట్టిని తొలగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గుండు నై చీలి పగిలిపోయి ఒక్కసారిగా సురేష్, కన్నయ్యపై పడి కింద ఉన్న కూలీలపై పడింది. క్షణాల్లో సురేష్, కన్నయ్య ప్రాణాలు వదిలారు. మిగిలిన కూలీలు అరగంటపాటు మట్టిని తవ్వి హిటాచీ సాయంతో బండరాళ్లను తొలగించారు. టిప్పర్ రాకుండా యాజమాన్యం అడ్డు ఘటన జరిగిన తర్వాత మృతులను, గాయపడిన వారిని టిప్పర్‌లో వేసుకుని చిత్తూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు క్వారీ నుంచి టిప్పర్ రాకుండా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. సమస్యను ఇక్కడే పరిష్కరించుకుందాం’ అని చెప్పబోయారు. దీంతో సెల్వనాథన్ అనే కూలీతో పాటు తక్కిన కూలీలు గొడవచేసి టిప్పర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన మృతదేహాలను మధ్యాహ్నం 3 గంటల వరకు టిప్పర్‌లోనే ఉంచారు. గాయపడిన సురేష్‌బాబు, కందన్‌కు చికిత్స చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో మిన్నంటిన రోదనలు క్వారీ ప్రమాద ఘటనను తెలుసుకున్న గొల్లపల్లి వాసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులైన సురేష్, కన్నయ్యను చూసి వారి బంధువులు, పిల్లలు గుండెలలిసేలా రోదించా రు. సురేష్ తల్లిదండ్రులు చిన్నబ్బులు, సింగారమ్మ ఆయన భార్య శైలజను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ‘లే సురేశా,లెయ్ నాన్నా’ అంటూ సురేష్ తండ్రి అక్కడ కన్నీరుమున్నీరయ్యారు. సురేష్‌కు కుమారుడు నితీష్, కుమారై అర్చన ఉన్నారు. కన్నయ్య ప్రమాదవార్త తెలుసుకుని అతని భార్య బుజ్జి స్పృహ కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు. కన్నయ్య కుమారై మహేశ్వరి తండ్రి మృతదేహం వద్ద బోరున ఏడుస్తూ ఉండిపోయింది. కుమారుడు కిరణ్ బెంగళూరులో క్వారీ పనిచేస్తున్నాడు. రెండురోజుల కిందట అడవిపల్లి క్వారీకి వచ్చి ఒక రోజు తండ్రికి సాయంగా పనిచేశాడు. తండ్రి మరణవార్తను తె లుసుకుని స్వగ్రామానికి బయలు దేరాడు. ఆ చిన్నారికేం తెలుసు...నాన్న ఇక రాడని..! కొడుకు చనిపోయాడని సురేష్ తల్లి సింగారమ్మ, భర్త దూరమయ్యాడని శైలజ, కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక సురేష్ తండ్రి చిన్నబ్బులు గొల్లుమన్నారు. నాన్నమ్మ ఒడిలో కూర్చున్న సురేష్ కుమాైరె అర్చన మాత్రం వారు ఎందుకు ఏడుస్తున్నారో! ‘నాన్న పనికి పోయాడు...పండ్లు, మిఠాయిలు తీసుకుని ఇంటికి మళ్లీ వస్తాడు’ అనేలా అలా ఉండిపోయింది. రోదనల మధ్యలోనే నాన్నమ్మ ఒడిలో నిదురపోయింది. ఎంటెక్ చేశాడు...రాళ్లు కొట్టే పనికి పోతున్నాడు గాయపడిన సురేష్‌బాబు హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. సెయింట్‌మెరీస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేరాడు. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాడు. బతుకుదెరువు కోసం క్వారీ పనికి వెళుతున్నాడు. ఈ ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా నడుము, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. కనీస జాగ్రత్తలు ఏవీ? క్వారీ వద్ద యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కూలీలకు హెల్మెట్లు, చేతులకు గ్లౌజులు ఇవ్వలేదు. అంత పెద్దరాళ్లను పగులగొట్టే ముందు ఇంజినీర్లు పర్యవేక్షణ తప్పనిసరి. కూలీలు మినహా అక్కడ మరో వ్యక్తి ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగితే చిత్తూరుకు వచ్చేంత వరకు ప్రథమ చికిత్స కూడా ఉండదు. ప్రమాదం నుంచి బయటపడిన కూలీల్లో వినోద్, లాజర్, సంపత్, ప్రభు, సెల్వనాథన్, దుర్గయ్య, రాజ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పాకాల సీఐ రాఘవన్, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి, ఆర్ఐ మహేశ్వరి, వీఆర్వో కోదండరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. -
పొట్టకూటి కోసం వచ్చి..
తాండూరు రూరల్: పొట్టకూటి కోసం వచ్చిన ఓ యువకుడిని టిప్పర్ రూపంలో ఉన్న మృత్యువు కబళించింది. సంఘటన తాండూరు మండలంలోని మల్కాపూర్ గనుల్లో శనివారం చోటు చేసుకుంది. గని కార్మికులు, కరన్‌కోట్ ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన రాము(18) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఉంటున్న తన మేనమామ వెంకటన్న వద్ద ఉండి 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువు మానేసి స్థానికంగా కూలీపనులు చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా రాము మూడు వారాల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ గనుల్లో పని చేస్తున్న తన పెద్ద నాన్న కొడుకు నాగేష్ వద్దకు వచ్చాడు. ఇక్కడే టిప్పర్(కేఏ 01 పీ 3501) వాహనంపైన క్లీనర్‌గా పనికి కుదిరాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నాపరాతి గనిలో రాతిముక్కలను టిప్పర్లోకి లోడ్ చేశారు. టిప్పర్ ర్యాంప్ ఎక్కుతుండగా రాము వెనుకాల ఉండి డ్రైవర్‌కు సైడ్ చూపిస్తున్నాడు. టిప్పర్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వెనక్కి దూసుకొచ్చింది. రాము వాహనం కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గని కార్మికులు గమనించి వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాము అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. పోలీసులు శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి అక్క అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
టిప్పర్ బీభత్సం
=8 మందికి గాయాలు =ఇద్దరి పరిస్థితి విషమం నాలుగు వాహనాలు ధ్వంసం రాజేంద్రనగర్/మణికొండ, న్యూస్‌లైన్: వేగంగా వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలతో పాటు పార్కు చేసిన వాహనాలను, బస్సుకోసం వేచివున్న మహిళను, రోడ్డు పక్కన టీ తాగుతున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎనిమిది మంది గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. నార్సింగ్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం ఉదయం 11.30కి డ్రైవర్ అబ్దుల్నయాం (35) టిప్పర్ (ఏపీ 12 టి 4007)ను వేగంగా నడుపుకుంటూ లంగర్‌హౌస్ మీదుగా ఖాళీమందిర్ వైపు వస్తున్నాడు. హైదర్షాకోట్ సన్‌సిటీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు రాగానే టిప్పర్ అదుపుతప్పింది. వాహనాన్ని ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలై ముందు వెళ్తున్న బైక్ (ఏపీ 28 డిజె 0570)ను ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న మరో ఆక్టివా (ఏపీ 28 డిఎ 9636), ఆటో (ఏపీ 28 వి 2417)లను ఢీకొట్టింది. అంతటితో రోడ్డుపై వెళ్తున్న కారు ( ఏపీ 09 ఎఎ 2460)ను, బస్టాప్‌లో బస్సు కోసం వేచిచూస్తున్న మణెమ్మ(45), పక్కనే టీ తాగుతున్న ఫిలిప్స్(35)లను ఢీకొట్టింది. మణెమ్మ కాళ్లు నుజ్జునుజ్జు కాగా.. ఫిలిప్స్ ఎగిరి రోడ్డు పక్కన పడటంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. కారులో వెళ్తున్న గాయత్రినగర్ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు తీవ్రగాయాలయ్యాయి. వీరి తో పాటు పూడురు సుందర్, కొల్లూరు నగేశ్, కె.జె. నితానియల్, మహామూద్లతో పాటు మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వివిధ ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు పట్టరానికి కోసంతో టిప్పర్ డ్రైవర్ నయీమ్‌ను చితకబాదారు. సకాలంలో చేరుకున్న పోలీసులు స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరుగు తీసిన పాదచారులు, వాహనదారులు... ఆదివారం కావడంతో సన్‌సిటీ రోడ్డు వాహనాలు, పాదచారులతో కిటకిటలాడుతోంది. మృత్యుశకటంలా దూసుకొస్తున్న టిప్పర్‌ను చూసి పాదచారులతో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తమ వాహనాలు దిగి అక్కడి నుంచి పరుగు తీశారు. భయానకంగా ఘటనాస్థలం... చెల్లాచెదురైన వాహనాల విడిభాగాలు, అద్దాలు, క్షతగాత్రుల రక్తపుమరకలతో ఘటనా స్థలం భయానకంగా మారింది. కుమారుడు వాహనాన్ని మళ్లించేలోపు... బాకారం వెళ్లేందుకు మణెమ్మ తన కుమారుడు శ్రీకాంత్ ద్విచక్రవాహనంపై సన్‌సిటీ బస్టాప్‌కు వచ్చింది. కుమారుడు బస్టాప్‌లో దించి తన వాహనాన్ని మళ్లిస్తుండగానే టిప్పర్ మణెమ్మను ఢీకొట్టింది. ఈ సంఘటనను చూసిన శ్రీకాంత్ బోరున విలపించాడు. తల్లిని హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించాడు. టీ తాగేందుకు వచ్చి.... సన్‌సిటీ ప్రాంతంలో ఓ ఇంటికి రంగులు వేస్తున్న సఫిల్‌గూడకు చెందిన ఫిలిప్స్ ఉదయం టీ తాగేందుకు రోడ్డుపైకి వచ్చాడు. బస్టాప్ పక్కనే ఉన్న టీకొట్టు వద్ద టీ తాగుతుండగా టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన ఫిలిప్స్ చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. కారు నుజ్జునుజ్జైనా చిన్నపాటి గాయాలతో... బండ్లగూడ గాయత్రినగర్‌కు చెందిన మామాఅల్లుళ్లు సుదర్శన్, బాలబ్రహ్మంలు కారులో వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. కాగా, ముందు సీట్లో కూర్చున్న మామాఅల్లుళ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు.