Tiruvalluru
-
Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి
సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్. రెడ్‌హిల్స్ సమీపంలోని ఆర్వీఎస్ పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరాడు. రెండో సెమిస్టర్ పూర్తయిన తరువాత లోకేష్ హిజ్రాగా మారి గెజిట్‌లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్ అలియాస్ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది. అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్‌గా రాణిస్తానని మీడియాకు వివరించింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) -
ప్రియురాలి విషయంలో వాగ్వాదం.. స్నేహితుడే హంతకుడు
సాక్షి, చెన్నై: ప్రియురాలి విషయంలో జరిగిన వాగ్వాదంలో స్నేహితుడిని హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో గత జూలై12న ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి బాలాజీ జిల్లా పిచ్చాటూరు గ్రామానికి చెందిన అర్జున్‌గా గుర్తించారు. మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు సాధారణ విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో యువకుడిని కొట్టి హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. అర్జున్ చివరి సారిగా ఫోన్లో మాట్లాడిన తిరునిండ్రవూర్‌కు చెందిన దినేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో దినేష్, అర్జున్ ఒకే చోట పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరికి తిరువళ్లూరు జిల్లా పాక్కంలోని స్వచ్ఛంద సంస్థలో పని చేసే యువతులతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన రోజు తిరునిండ్రవూర్‌కు సమీపంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో దినేష్ ప్రియురాలి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో దినేష్ చేతిలో అర్జున్ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. చదవండి: చదువుకోవడం ఇష్టం లేక... మర్డర్ ప్లాన్ చేసిన విద్యార్థి! -
ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు మృతి
సాక్షి, చెన్నై: ప్రియురాలితో కలిసి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు ప్రాంతానికి చెందిన కుప్పన్ కుమారుడు శాంతకుమార్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమ వ్యవహరం తెలిసి ఇరు కుటుంబీకులు ఇటీవల నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి శాంతకుమార్ శనివారం రాత్రి ఈకాడులోని బంధువుల ఇంటికి బైక్‌లో బయలుదేరాడు. తిరువళ్లూరు సమీపంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తిరువళ్లూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుప్పన్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!) -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్(40) స్వీట్‌స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్‌కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): తాళి కట్టిన గంటలోనే తనను నడిరోడ్డుపై వదిలేశాడని..తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మెయ్యూరు గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె లక్ష్మి(23) నర్సింగ్ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. సమీప బంధువైన అదే గ్రామానికి చెందిన చిన్నరాజ్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చిన్నరాజ్ నమ్మించడంతో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత డిసెంబర్లో యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. వడమధురైకి చెందిన వేరే యువతితో చిన్నరాజ్‌కు పెళ్లి సంబంధం కుదుర్చారు. విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధామిచ్చాడు. దీంతో డిసెంబర్ 18న ఊత్తుకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది జనవరి 8న ఊత్తుకోటలోని చర్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళతానంటూ ఊత్తుకోట దాటిన తరువాత లక్ష్మిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెలన్నర తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి రావడంతో లక్ష్మి అతడి ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన చిన్నరాజ్ బంధువులు యువతిపై దాడి చేసి ఇంటి లోపలికి రానివ్వకుండా తాళం వేశారు. దీంతో చేసేదేమి లేక తనకు న్యాయం చేయాలని యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. యువతికి ఐద్వా సంఘం నేతలు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఊత్తుకోట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
నిప్పంటించుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు
తిరువళ్లూరు: శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి.. వ్యక్తి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా నెమిలిచ్చేరిలో చోటు చేసుకుంది. చెన్నై విల్లివాక్కం ప్రాంతానికి చెందిన బాలాజీకి సత్యనారాయణ (26), సూర్యనారాయణ (24) కుమారులు ఉన్నారు. సూర్యనారాయణకు వివాహం కాగా, సత్యనారాయణకు కాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తిరునిండ్రవూర్‌లోని మేన మామ ఇంట్లో ఉంటూ శంకరమఠంలో పనిచేస్తున్నాడు. సోమవారం నెమిలిచ్చేరి బ్రిడ్జిపైకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా.. -
తల్లితో వివాహేతర సంబంధం.. బిడ్డను గర్భవతి చేసిన డ్రైవర్
తిరువళ్లూరు: నాలుగు నెలలుగా పరారీలో ఉన్న ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన డ్రైవర్ చరణ్‌రాజ్ అలియాస్ చరణ్‌రాజ్ (50) శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనితో పాటు సత్తరై గ్రామానికి చెందిన కుప్పుస్వామి (45) బస్సు క్లీనర్‌గా పని చేస్తాడు. ఈ నేపథ్యంలో చరణ్‌రాజ్‌కు కుప్పుస్వామి భార్య కోమదితో అక్రమ సంబంధం ఏర్పడింది. భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కోమది తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో చరణ్‌రాజ్‌తో కలిసి కొత్తకాపురం పెట్టింది. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా, గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. చరణ్‌రాజ్ తరచూ బెదిరింపులకు గురి చేసి అత్యాచారం చేశాడని బాలిక చెప్పగా కోమది దీనిపై తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్లో నాలుగు నెలల కింద ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పరారీలో ఉన్న చరణ్‌రాజ్ తిరువణ్ణామలైలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం తిరువళ్లూరు న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. చరణ్‌రాజ్ వల్ల గర్భం దాల్చిన బాలిక రెండు వారాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధంగా స్నేహితులకు విందు
తిరువళ్లూరు : జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా కొంతమంది యువకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆరుగురు యువకులు నిబంధనలు ఉల్లంఘించి విందు చేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపుగా ఒకచోట చేరకూడదని నిబంధన విధించారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ పెనాలూరుపేట సమీపంలోని తన్నీకుళం గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఒకేచోట బిర్యానీ చేసుకొని భౌతిక దూరం పాటించకుండా ఒకేచోట కూర్చుని తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ సంఘటన ఎస్పీ అరవిందన్ దృష్టికి రావడంతో యువకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో పెనాలూరుపేట పోలీసులు విందులో పాల్గొన్న యువకులను గుర్తించి అరెస్టు చేశారు. -
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు
సాక్షి, తిరువళ్లూరు(చిత్తూరు) : భర్తను హత్య చేసినందుకు ఓ మహిళకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఐదు వేలు రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి దీప్తి అరువునిధి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చిత్తూరు జిల్లా నాగాలాపురం బీసీ కాలనీకి చెందిన గౌరి(23)కి తిరువళ్లూరు జిల్లా పట్టాభిరాం తండరై ప్రాంతానికి చెందిన రాజీ(27)తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన రాజీ తరచూ గౌరీని వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 13న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజీ భార్యతో ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులను తట్టుకోలేనీ గౌరి అతని తలపై రుబ్బురోలు రాయితో కొట్టి హత్య చేసింది. తిరువళ్లూరు జిల్లా అదనపు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి దీప్తి అరువునిధి తీర్పును వెలువరించారు. గౌరికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రావు మీడియాకు వివరించారు. అనంతరం ముద్దాయిని పుళల్ జైలుకు తరలించారు. -
బీఎస్పీ నేత అరెస్ట్ అన్యాయం
తిరువళ్లూరు: బీఎస్పీ నేతపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోర్టు ఆవరణలోకి దూసుకెళ్లడానికి మహిళలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లాలో బీఎస్పీ ఉపకార్యదర్శిగా ప్రేమ్‌ను సోమవారం ఉదయం పోలీసులు విచారణ పేరిట తీసుకెళ్లారు. అనంతరం ప్రేమ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇదే విషయం స్థానికులకు తెలియడంతో పెద్దఎత్తున కోర్టు ఆవరణలోకి చేరుకున్న మహిళలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇదే సమయంలో కోర్టు నుంచి జైలుకు ప్రేమ్‌ను తీసుకెళుతున్న వాహనం రావడంతో మహిళలు పోలీసుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. గతంలో ప్రేమ్‌పై పలు ఆరోపణలు, కేసులు ఉన్నాయని వివరించిన మహిళలు, ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్న అతనిపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన మహిళలను పక్కకు తప్పించిన పోలీసులు ప్రేమ్‌ను రిమాండ్‌కు తరలించారు. కోర్టు ఆవరణలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత నెలకొంది. -
పరామర్శ
► వర్దా బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన ► పరామర్శలు...పలకరింపులు ►షార్ట్‌ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన ► వ్యవసాయరుణాలు రద్దు చేయాలని డిమాండ్ తిరువళ్లూరు : వర్దా తుపాను సృష్టించిన బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ అన్నారు. వర్దా తుపాను బీభత్సానికి భారీ నష్టం ఏర్పడడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యం లో తిరువళ్లూరు జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించి బాధితులకు సహాయకాలను పంపిణీ చేయడంతో పాటు రైతులను పరామర్శించారు. మొదట కొండంజేరి ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే పదికిలోల బియ్యం, దుప్పటితో పాటు పలు సహాయకాలను పంపిణీ చేశారు. అనంతరం సత్రం వద్ద రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. అక్కడి నుంచి విడయూర్‌కు వెళ్లగా మధ్యలో కన్నిమానగర్ ప్రజలు తమ సమస్యలను స్టాలిన్ దృష్టికి తెచ్చారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. అనంతరం విడయూర్, తిరువళ్లూరు, వల్లువర్పురం ప్రాంతాల్లో స్టాలిన్పర్యటించి సహాయకాలను అందజేశారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి : సహాయకాల పంపిణీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వర్దా తుపాను వల్ల కాంచీపురం, తిరువళ్లూరులో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, వారికి అండగా నిలిచేం దుకు రుణాలను రద్దు చేయడంతో పాటు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్దా తుపానుకు తిరువళ్లూరు తీవ్రంగా నష్టపోయినా సహాయకాలు మాత్రం అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి తమిళనాడులో తరచూ విపత్తులు సంభవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం వర్దా తుపానుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విపత్తు సంభవించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి సరిపుచ్చుకుంటుందని విమర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా కలిసి నష్టాన్ని వివరించి నిధులను రాబట్టాలని సూచించారు. వర్దా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుఉ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఐఏఎస్‌లతో ప్రత్యేక కమిటీని నియమించి కేంద్రం సాయం కోరాలని సూచించారు. వర్దా తుపానుతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకునీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షార్ట్ ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాలిన్ పర్యటన పరామర్శలు, పలకరింపులతో సాగింది. ప్రతి చోటా ఐదు నిమిషాలు మాత్రమే ఆగిన స్టాలిన్, ఆ ప్రాంతాల్లో ప్రజల కష్టాలను వింటూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు వినడం, కార్యకర్తలకు పలకరింపు, డీఎంకే నేతలకు సూచన, మీడియా పోలీసుల హడావిడి కనిపించింది. మొత్తానికి స్టాలిన్ పర్యటన షార్ట్ ఫిల్‌్మలా సాగింది. -
తిరువళ్లూరులో వర్ద బీభత్సం
తిరువళ్లూరు:తిరువళ్లూరు జిల్లాను వార్దా తుపాన్ అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో జిల్లాలో బీభత్స పరిస్థితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లాలో వార్దా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందుకు రెట్టింపు ప్రభావాన్ని చూపింది. జిల్లాలో ఆదివారం రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం సామవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో రాత్రి నుంచే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అంధకారంగా మారింది. జిల్లా అంతా నిర్మాణుష్యంగా మారింది. దీంతో పాటు సెల్ఫోన్లు, ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఉదయం నుంచే భారీ వర్షం పడడంతో ఆవడి, పట్టాభిరాం, ఏకాటూరు తదితర ప్రాంతాల్లో రైలు తీగలు తెగిపడడంతో రైలు సేవలను పూర్తిగా నిలిపి వేశారు. దీంతో వేలాది మంది ప్రయాఇకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు పెట్టేల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి తాగునీరు, అన్నంతో పాటు ఇతర వస్తువులు దొరక్కపోవడంతో అవస్థలు పడ్డారు. జిల్లా నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపి వేశారు. రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తరలించారు. మత్స్యకారులను చేపల వేటకు అనుమతించకపోవడంతో పాటు సముద్రతీర ప్రాం తాలకు చెందిన ప్రజలను ఎప్పటికప్పడు అధికారులు అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ను సిద్ధంగా ఉంచారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పోలీవాక్కం, కడంబత్తూరు తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ఇలా వుండగా జిల్లాలో నీ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉదయం నుంచే కారు చీకటి కమ్ముకుంది. ఉదయం నుంచి స్వల్పగాలులు వీచినా మధ్యాహ్ననానికి గాలి మరింత పెరిగి బీభత్సం సృష్టించింది. ఇప్పటికే జిల్లా అంతటా వందలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మరో రెండు రోజుల వరకు విద్యుత్ వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు వెల్లడించారు. అచ్చిరాని డిసెంబర్: తిరువళ్లూరు జిల్లాకు డిసెంబర్ నెల అచ్చిరావడం లేదన్న అభిప్రాయం ఉంది. గత డిసంబర్‌లో కురుసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేయగా, ప్రస్తుతం భారీ ఈదురు గాలీతో తమ ప్రతాపాన్ని చూపింది. దీంతో జిల్లాలో డిసెంబర్ నెలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
వానర ప్రేమ
తిరువళ్లూరు: అమ్మ ప్రేమకు మించి ఏదీ లేదన్నది వాస్తవం. చనిపోయిన తన పిల్లను ఎత్తుకుని రెండు రోజుల నుంచి ఓ వానరం తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తిరుగుతున్న వైనం అందరినీ కలిచి వేస్తోంది. ఈ ఘటన తల్లీబిడ్డలకు మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం చిన్న వానరం రెండుతస్తుల భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. నిర్జీవంగా పడి ఉన్న చిన్న వానరం శరీరాన్ని తనతోపాటు ఉంచుకుని తిరుగుతూనే ఉంది. పది నిమిషాలు అటుఇటూ తిరిగిన తరువాత మృతి చెందిన వానరాన్ని లేపడానికి తల్లి కోతి చేయని ప్రయత్నం లేదు. ఎంత ప్రయత్నించినా నిర్జీవంగా ఉన్న చిన్న వానరంలో చలనం లేకపోవడంతో తల్లికోతి తల్లడిల్లిపోతోంది. ఈ సంఘటన కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారి కంట తడి పెట్టించింది. రెండు రోజులైనా తల్లి వానరం తన బిడ్డ లేస్తుందన్న నమ్మకంతో చేయని ప్రయత్నం లేదు. బహుశా తల్లి వానరానికి తెలియదేమో తన బిడ్డ చనిపోయిందని. -
ఇద్దరు నకిలీ డాక్టర్ల అరెస్ట్
తిరువళ్లూరు : అనుమతి లేకుండా క్లినిక్‌లు నిర్వహించడంతో పాటు అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వైద్యశాఖ అధికారులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల డెంగీ వేగంగా విస్తరించడంతో దాదాపు 12 మంది మృత్యవాత పడిన సంఘటన తెలిసిం దే. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం ఏర్పరచిన నేపథ్యంలో అధికారులు న కిలీ డాక్టర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పరిధిలోని వెన్‌మనముదూర్‌లో నకలీ డాక్టర్ ఉన్నట్టు అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెన్‌మనముదూర్ గ్రామానికి చెందిన గణేషన్ కుమారుడు వసంత్‌కుమార్ ప్లస్‌టూ వరకు చదివి క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించి అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఇదే విధంగా పేరంబాక్కం గ్రామానికి చెందిన కోమగన్. ఇతను ఫిజియోథెరపీ పూర్తీ చేసి ఏడేళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తని ఖీల్లో గుర్తించి వారిని సైతం అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేసిన వైద్యశాఖ అధికారులు శుక్రవారం రాత్రి మరో ఇద్దరిని అరెస్టు చేయడం జిల్లాలో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 35కు చేరింది. -
తమ్ముడిని కడతేర్చిన అన్న
తిరువళ్లూరు : అన్నాతమ్ముళ్ల మద్య ఏర్పడిన గొడవలో మద్యం మత్తులో ఉన్న అన్న కత్తితో పొడిచి తమ్ముడిని హత్య చేశాడు. ఈ సంఘటన తిరువళ్లూరులోని మాపోసి నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని మాపోసి నగర్‌కు చెందిన మదన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతనికి జయబుద్ధన్, సిద్ధార్థన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు జయబుద్ధన్ కెమెరా మెకానిక్‌గా పనిచేస్తుండగా చిన్న కొడుకు సిద్ధార్థన్ తిరుపతిలోని లా కళాశాలో బీఎల్ చదువుతున్నాడు. మద్యానికి బానిసైన జయబుద్ధన్ నిత్యం ఘర్షణ పడేవాడని తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అన్నాదమ్ముళ్లు ఇద్దరు ఘర్షణ పడ్డారు. దీంతో సిద్ధార్థన్ జయబుద్ధన్‌పై దాడి చేయడంతో ఆగ్రహించిన జయబుద్ధన్ తమ్ముడు సిద్ధార్థన్‌పై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మద్యం మత్తులో తమ్ముడిని హత్య చేసిన జయబుద్ధన్‌ను పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
పోలీసులు వర్సెస్ న్యాయవాదులు
తిరువళ్లూరు: న్యాయవాదులకు వ్యతిరేకంగా తమిళనాడులో చట్టాన్ని రూపొం దించడానికి తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ తిరువళ్లూరు జిల్లా బార్ అసోసియేషన్ ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగి కోర్టుకు హాజరు కాకూడదు, కేసును వాదించే సమయంలో న్యాయమూర్తిని కించపరిచేలా వ్యవహరించకూడదు, తప్పులు చేసే న్యాయవాదిని బార్ అసోసియేషన్‌కు సంబంధం లేకుండా న్యాయమూర్తే చర్యలు తీసుకుకోవచ్చనే వెసులుబాటును కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి కౌల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలను నిరసిస్తూ రెండు వారాల నుంచి న్యాయవాదులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. దశల వారి ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రైలురోకో చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరులో న్యాయవాదుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైలురోకోకు యత్నించారు. న్యాయవాదుల హక్కులను హరించేలా చట్టాలను రూపొందిస్తున్న కౌల్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చట్టాలను వెంటనే వెనుక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం రైలురోకోకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర స్తాయిలో వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్సన్, అదనపు ఎస్పీ స్టాలిన్, డీఎస్పీ విజయకుమార్ న్యాయవాదులతో చర్చలు జరిపి న్యాయవాదులను వదలిపెట్టారు. -
అన్నాడీఎంకేలో అంతర్గత పోరు
తిరువళ్లూరు: ఐదేళ్లుగా బయటకు పొక్కని అధికార పార్టీ అంతర్గత విభేదాలు ఒక్క సారిగా భగ్గుమనడంతోపాటు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి రావడంతో పార్టీ పరువు బజారున పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. క్రమశిక్షణ గలిగిన పార్టీగా పేరున్న అన్నాడీఎంకేలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు లేవు. గతంలో గ్రూపు రాజకీయాలు ఉన్నా, మాజీ మంత్రి రమణ జిల్లా కార్యదర్శి పదవిని చేపట్టిన తరువాత వాటికి చెక్ పెట్టి పార్టీనీ ఏకతాటిపై నడిపించారు. చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటినీ తానే చక్కదిద్దేవారు. అయితే రమణ తన సతీమణితో ఏకాంతంగా వున్న పోటోలు బయటకు రావడంతో మంత్రి పదవి, జిల్లా కార్యదర్శి తదితర జోడు పదవుల నుంచి ముఖ్యమంత్రి జయలలిత రమణనూ తొలగించారు. దీంతో రమణ జిల్లా రాజకీయాలకు దూరంగా వుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక విధిలేనీ పరిస్థితుల్లో కాంచీపురం జిల్లా కన్వీనర్‌గా వున్న వాలాజాబాద్ గణేషన్‌కు జిల్లా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం గణేష్‌కు రెండు జిల్లాల బాధ్యతలను చూడడం కష్టంగా మారింది. పైగా నియోజకవర్గం ప్రచారంలోనూ బిజీగా ఉండడంతో అయన తిరువళ్లూరుపై పెద్దగా దృష్టి పెట్టలేనీ పరిస్థితి ఏర్పడి ంది. ఈ నేపథ్యంలో రమణ ఉన్నంత వరకు నిశ్శబ్దంగా వున్న అంతర్గత విభేదాలు రమణ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. గత రెండు వారాల క్రితం జరిగిన అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో అంతర్గత విబేధాలు బయటపడి ఇరువర్గాలు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విభేదాలు అధికార పార్టీలో రావడంతో ఒక్క సారీగా పార్టీ నేతలు షాక్ తిన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో వర్గాలుగా చీలి ఘర్షణ పడడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు సీనీయర్ నేతలు సైతం వాపోతున్నారు. చైర్మన్‌పై ఫేస్బుక్లో ప్రచారం: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానీకి ఆసక్తి ఉన్న నేతల నుంచి అన్నాడీఎంకే దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ చైర్మన్ భాస్కరన్, ఇటీవల ఇంటర్వ్యూలకు సైతం హాజరయ్యారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పరిస్థితి వున్న నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాస్కరన్‌ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జయలలితకు థ్యాంక్స్ అంటూ కొందరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. క్షణాల్లో సంబంధిత పోస్టు షేర్ కావడంతో పాటు అన్నాడీఎంకే పేజ్‌లోనే షేర్ చేశారు. వీటిని గమనించిన అధిష్టానం, మీకు ఎవరు సీటు ఇచ్చారు, సీటు ఇవ్వకుండానే ఇదేమీ ప్రచారం అంటూ నిలదీసినట్టు తెలిసింది. దీంతో తనకు సీటు రాకుండా తన వ్యతిరేక వర్గం ఇలా చేసిందని భావించిన భాస్కరన్ డీఎస్పీ విజయకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తనపై ఫేస్బుక్లో వచ్చిన పోస్టింగ్‌ను వెంటనే నిలిపివేయడంతోపాటు పోస్టింగ్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. నన్ను బెదించారు: భాస్కరన్‌పై వచ్చిన పోస్టింగ్‌ను తిరువళ్లూరు యువజన అన్నాడీఎంకే కార్యదర్శి జయవీరన్ పెట్టినట్టు గుర్తించారు. ఇతను భాస్కరన్ వ్యతిరేక వర్గం లో కొనసాగుతున్నట్టు గుర్తించిన భాస్కరన్ అతని ఇంటి వద్దకు వెళ్లి హత్య చేస్తానని బెదిరించారనీ తిరువళ్లూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించడంతో పాటు హత్య చేస్తాననీ బెదిరించిన మున్సిపల్ చైర్మన్‌ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు వర్గాల వద్ద విచారణ చేపడుతున్నారు. ఇది ఇలా వుండగా ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి కూడా లేని పక్షంలో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు బయటకురావడం చర్చీనీయాం శంగా మారింది. అధికార పార్టీలో నానాటికీ పెరుగుతున్న కుమ్మలాటల వల్ల పార్టీకి ఎలాంటి పరిస్థితి పడుతుందోనన్న ఆందోళన కరుడుగట్టిన పార్టీ నేతల్లో ఏర్పడింది. -
లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా
తిరువళ్లూరు: లింగ నిర్ధారణ చేసి ఆడ శిశువుల భ్రూణహత్యలకు ప్రోత్సహించే కేంద్రాలపై నిఘా ఉంచినట్టు తిరువళ్లూరు డీఎస్పీ విజయకుమార్ వివరించారు. జాతీయ ఆడ శిశు దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీ డాక్టర్ దయాళన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డీఎస్పీ విజయకుమార్, విశిష్టఅతిథిగా భాస్కరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం భ్రూణహత్యలు తగ్గినట్టు పలు నివేదికలు ఇచ్చిన వివరాలను గుర్తు చేశారు. అయితే తిరువళ్లూరులోని స్కానింగ్ సెంటర్లపై ఇప్పటికీ నిఘా ఉందని వివరించారు. హర్యానా, పంజాబ్‌లలో ఆడ శిశు జననాల సంఖ్య ఆశాజనంగా ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో అంతటి స్థాయిలో ఆడ శిశువులు లేరన్న అంశాన్ని ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో ఆడశిశువు పెంపకంతో పాటు వివాహ సమయంలో కట్న కానుకలంటూ వస్తున్న దోపిడే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని ఆయన వివరించారు. అనంతరం చైర్మన్ భాస్కరన్ మాట్లాడుతూ ఆడ శిశువులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణించే సత్తా వారికుందని తెలిపారు. భారతదేశంలో నేడు పురుషులకు సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇటీవల మైనర్ నిందితుడి వయసును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చట్టాన్ని ప్రజలందరూ ఆహ్వానించాలని చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు యోగేంద్ర, జగదీషన్‌తో పలువురు పాల్గొన్నారు. ఆడ శిశువులకు ప్రభుత్వ కిట్‌తో పాటు ఇతర సహాయకాలను వారికి అందజేశారు. -
12 రోజుల తరువాత మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం
- అనుమానాలను నివృత్తి చేయండి తిరువళ్లూరు : మహిళ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ 12 రోజుల క్రితం మృతి చెందిన మహిళా మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. చెన్నై సమీపంలోని మణపాక్కం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె గాయత్రికి తిరువళ్లూరు జిల్లా కొత్తియంబాక్కం గ్రామానికి చెందిన విల్లర్‌కు ఎనిమిదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సామువేల్(7), సాల్మన్(5) ఇద్దరు పిల్లలు. విల్లర్ న్యాయవాదినని అబద్దం చెప్పి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. విషయం తెలిసి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తెలిసింది. ప్రస్తుతం విల్లర్ పూంద మల్లిలోని ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ రాత్రుళ్లు మద్యం సేవించి అదనపు క ట్నం కోసం తరచూ భార్యను వేధించేవాడని గాయత్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో గాయత్రి నాలుగవ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఐదున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నేపథ్యంలో గాయత్రి మృతదేహం నుంచి రక్తం రావడంతో అనుమానించిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం డీఎస్పీ విజయకుమార్, పూందమల్లి తహశీల్దార్ అభిషేకం పర్యవేక్షణలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ర్పాటు చేశారు. -
భర్తపై చర్యలు తీసుకోండి
తిరువళ్లూరు : మగసంతానం లేదన్న కారణంతో రెండో పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళ ఆందోళన చేసింది. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రామమూర్తి(33). ఇతను అదే ప్రాంతానికి చెందిన పునితా(28)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి విశాలి(07), మనీషా(05), శిరీషా(03) ముగ్గురు ఆడపిల్లలు. పునితాకు ముగ్గురూ ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం లేదని తరచూ భార్యను వేధించేవాడు. తనకు మగ సంతానం కలగనందున పుట్టింటి నుంచి మూడు లక్షల రూపాయలను కట్నంగా తేవాలని బలవంతపెట్టేవాడు. అంతేగాక గత జనవరి 23న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామానికి సమీపంలో ఉన్న అత్తకూతూరు వేదవతిని రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పునితా తన బంధువులతో కలిసి గత జనవరి 30న ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆశ్రయించింది. అయితే ఎస్పీకి ఇంతవరకు స్పందించలేదు. ఆగ్రహించిన పునితా తన ముగ్గరు పిల్లలతో వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయడంతో పాటు భర్తను అప్పగించాలని రోదించింది. -
భార్యను హత్య చేసి ఆత్మహత్య
తిరువళ్లూరు: భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త ఆ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేపంబట్టులోని వల్లలార్ నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టు గ్రామానికి చెందిన రాజేష్‌కుమార్(24) కాల్ టాక్సీ డ్రైవర్. ఇదే ప్రాంతానికి చెందిన కోదండరామన్ చెన్నైలో ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె తమిళ్‌సెల్వి శ్రీపెరంబదూరులోని శ్రీవెంకటేశ్వరా కళాశాలలో ఈసీఈ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతూ వుంది. ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్‌కు తమిళ్‌సెల్వికి మధ్య వున్న పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాలుడు వున్నాడు. వివాహ మైనప్పటి నుంచి అత్తారింటిలో వున్న రాజేష్‌కుమార్ దంపతులు మూడు రోజుల కిందట వేపంబట్టులోని వల్లలార్ నగర్లో అద్దెకు దిగారు. ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్ తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం పది గంటలు దాటుతున్నా బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఇంటి యజమాని తలుపులు తెరిచి చూసి షాక్‌కు గురయ్యాడు. రక్తపు మడుగులో వున్న తమిళ్‌సెల్వి, ఉరి వేసుకుని రాజేష్‌కుమార్ మృతి చెంది వుండడాన్ని గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా తమిళ్‌సెల్వి గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం రాజేష్‌కుమార్ సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు భావించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రాజేష్కుమా ర్ తమిళ్‌సెల్విల వైవాహిక జీవితం సజావుగా సాగినా ఆరు నెలల నుంచి తర చూ ఘర్షణ పడేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రాజేష్‌కుమార్ తన వదినతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారన్న అనుమానంతో భార్యభర్తలు ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారని పోలీసులు వివరించారు. అయితే తల్లి హత్యకు గురి కావడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఐదు నెలల చిన్నారి అనాథగా మారిపోయింది. విగతజీవులుగా పడి వున్న తల్లి వద్ద పాలు కోసం ఏడూస్తూ చిన్నారి రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
ఆగిన లాల్బాగ్
ఇంజిన్‌లో సాంకేతిక లోపం రెండు గంటలు ఆగిన ఎక్స్‌ప్రెస్ ఆందోళనకు దిగిన ప్రయాణికులు తిరువళ్లూరు : లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా దాదాపు రెండు గంటల పాటు రైలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చెన్నై నుంచి బెంగళూరుకు లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరింది. ఎక్స్‌ప్రెస్ సెవ్వాపేట దాటి పుట్లూరు వైపు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో రైలు పశువును ఢీ కొట్టింది. దీంతో పశువు మృతదేహం తిరువళ్లూరు వైపు వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో చిక్కుకుంది. దీంతో సెవ్వాపేట- పుట్లూరు మధ్యలో 4.15 గంటలకు రైలు ఇంజిన్‌కు వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంట సమయం దాటుతున్నా రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ఇంజిన్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజన్లో సాంకేతిక లోపం వుందని, వాటిని సరి చేయడానికి మరో గంట సమయం పడుతుందనీ డ్రైవర్ వివరణ ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేసి తిరువళ్లూరు వైపు వెళుతున్న రైలును ఆపడాన్ని యత్నించారు. అనంతరం డ్రైవర్ అరక్కోణం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి రైలును 6 గంటలకు ముందుకు కదిలించారు. -
వానరాల సేవకుడు
సమయం ఉదయం ఏడు గంటలు.... అసలే పర్యాటక ప్రాంతం... సమీపంలోని మ్యూజియంకు పర్యాటకుల రాక అప్పుడే మొదలై ఎవరి హడావిడిలో వారున్నారు....తనకేమీ పట్టనట్టు ఓ యువకుడు మాత్రం ఎదురుచూస్తున్నాడు. నిన్న డల్‌గా కనిపించిన చిన్నారి వానరం జాడలేదు.....మొన్న పర్యాటకుని చేతిలో గాయపడిన వానరం ఎటూ పోయి ఉందో అంటూ తన సేననూ లెక్కగట్టసాగాడు .... ఇంతలోనే ఒక వ్యక్తి సార్ నాకు ఈ అడ్రస్ కాస్త చెబుతారా అంటూ అడగ్గా...ఐదు నిమిషాలు ఆగండి.... పెద్ద వానరాలు రాకముందే చిన్నవాటికి బిస్కెట్లు(టిఫిన్) పెట్టాలి...పెద్దవి వస్తే చిన్నవాటికి ముక్క కూడా దొరకదు అంటూ తన పెంపుడు కోతుల సేవలో నిమగ్నమయ్యాడు వెంకటేశ్. నాలుగేళ్ల నుంచి దాదాపు 50 కోతులకు ఆకలి తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడి కథలోకి వెళితే... తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పీడబ్ల్యూడీ అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్. హోంగార్డుగా రెండేళ్ల క్రితం వరకు విధులు నిర్వహించి రాజీనామా చేసి ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, పిల్లలు తరుణ్, రేష్మ ఉన్నారు. తండ్రి పీడబ్ల్యూడీ అధికారి కావడంతో డ్యూటీ మొత్తం పూండి రిజర్వాయర్ వద్దే సాగేది. ఇలా రిజర్వాయర్ వద్ద విధులు నిర్వహిస్తున్న తండ్రికి భోజనం తీసుకె ళ్లే తల్లితో పాటు వెళ్లే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న పాట్లు వెంకటేశ్‌ను కంటతడి పెట్టించాయి. అప్పుడే రోజుకు కనీసం పది రూపాయలకు బిస్కెట్లను కొనిపెట్టి కొన్నింటికి అయినా ఆకలి తీర్చేవారు. అప్పుడే నిర్ణరుుంచుకున్నాడు పదేళ్ల తరువాతైనా రోజుకు కనీసం 50 కోతులకైనా ఆకలి తీర్చాలని. పార్టటైమ్ పని చేసి.. తన లక్ష్యం ప్రకారం నాలుగేళ్ల నుంచి కోతులకు బిస్కెట్లు పెట్టడం ప్రారంభించారు. అయితే హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం ఇంటికి తన పెంపుడు కోతులకు కుటుంబానికి సరిపడకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్‌టైమ్‌గా చేసి తద్వారా వచ్చే ఆదాయంతో వానరాలను పెంచుతున్నట్టు వివరించారు వెంకటేశన్. తాను కోతులను పెంచడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా కేవలం పదేళ్లపాటు మాత్రమే జీవించగలిగే కోతులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై వుందన్నదే తన ఆశయంగా వివరించేవాడు. వెంకటేశన్ ఏమంటున్నారంటే.... కోతులు దాడి చేస్తాయని వాటిని శారీరకంగా హింసించడాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. వాస్తవానికి సహజంగా దొరికే ఆహారం కోతులకు దొరకనప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. సర్కస్‌కు, యాచనకు కోతులను ఉపయోగించే వారు వాటి ద్వారా వచ్చే సంపాదనలో కేవలం పది శాతం మాత్రమే వాటికి ఖర్చు చేస్తారు. తన యజమాని తన కోసం చూపిన ఆప్యాయతనూ దృష్టిలో వుంచుకుని అతను చెప్పిందల్లా కోతులు చేస్తున్నారుు. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకున్నా భవిష్యత్తులో మానవుడు ఉద్భవించిన తీరును వివరించడానికి వుపయోగపడుతుంది. నాలుగేళ్ల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాను. బ్లూ క్రాస్ నుంచి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెడితే, మరి కొందరు కోతుల నుంచి ఇబ్బందులు వున్నాయని నాపై గొడవలకు దిగారు. దీంతో వేరే ప్రాంతంలో పెంచుతున్నాను. తన దరఖాస్తుకు స్పందించి కోతుల పెంపకానికి బ్లూక్రాస్ అనుమతి ఇస్తే ఇష్టంగా పెంచుకుంటాను. ఐదు గంటలు గడిపేస్తా ఒక్క రోజు నా రాముడు, లక్ష్మీ, పెరుమాల్, శివ, అజిత్, జిమ్మీ(ఇవి కోతుల పేర్లు) చూడకపోతే ఏదోలా వుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా రాత్రికంతా వానరాల వద్దకు వచ్చి విజిల్ వేస్తే ఎక్కడున్నా అవే పరిగెత్తుకొస్తాయి. ఇలా నా కోసం 50 ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించి బిస్కెట్లు వేయడానికి వస్తుంటా ను. నేను ఒక్క రోజు రాకుంటే వానరాలు ఎదురుచూస్తున్నాయని ఫ్రెండ్స్ నాకు చెబుతుంటే, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క రోజు సెలవు దొరికితే ఐదు గంటల పాటు వాటితోనే గడిపేస్తాను. -
భార్య నుంచి రక్షణ కల్పించండి
తిరువళ్లూరు:ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద భర్త నిరాహార దీక్షకు పూనుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా కొట్టయూర్ ప్రాంతానికి చెందిన త్యాగరాజన్ కుమారుడు విజయమూర్తికి తిరుత్తణికి చెందిన భాగ్యలక్ష్మీకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన జానకి రామన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి పద్ధతి మార్చుకోవాలని భార్యను పలు సార్లు హెచ్చరించాడు. దీంతో భాగ్యలక్ష్మి తన ప్రియుడు జానకిరామన్‌తో సహజీనం చేస్తుండగా, విజయమూర్తి తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తిరుత్తణిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న విజయమూర్తిని భార్య భాగ్యలక్ష్మీ, ఆమె ప్రియుడు జానకి రామన్, అతని స్నేహితులు రవి, బలరామన్ కలిసి ఈనెల 17న తిరుత్తణిలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి సమయంలో విజయ మూర్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడి 108 ద్వారా తిరుత్తణి వైద్యశాలకు తరలించారు. ఇతనికి తల, కాళ్లు, చేతులు తదితర ప్రాంతాల్లో బలమైన గాయాలు వున్నాయి. ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ తన పై దాడి చేసిన భార్య, ఆమె ప్రియుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని విజయమూర్తి తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో బాధితుడు, తల్లి, తండ్రి, అన్నతో కలిసి బుధవారం ఉదయం ఎస్పీ శరవణన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన విజయమూర్తి, గురువారం ఉదయం కలెక్టర్ కారుకు ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, తమ కేసుపై ఉదాసీనతగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి వారిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఆయన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కోరిక తీర్చలేదని ప్రియురాలిని హతమార్చాడు
తిరువళ్లూరు: కోరిక తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేశాడు. యువకుడిని పెనాలూరు పేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమారై చాముండేశ్వరి(19). ఈమె మనవాలనగర్‌లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇంటి సమీపంలోని చాముండేశ్వరి ముళ్లపొదల్లోకి వెళ్లింది. ఆమె ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుప్పన్ సమీప ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు. ముళ్లపొదల్లో చాముండేశ్వరి హత్యకు గురైనట్టు గుర్తించిన గ్రామస్తులు, పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు గ్రామస్తులు నిరాకరించారు. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, నిందితుడిని పట్టుకోవడానికి డాగ్‌స్వాడ్‌ను రప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ;ప్రియుడి అరెస్ట్: ఈ హత్య కేసులో అసలైన నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొదట చాముండేశ్వరి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరిగా చాముండేశ్వరి మాట్లాడిన నెంబర్లపై ఆరా తీశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో గంటల తరబడి మాట్లాడడంతో పాటు చివరి కాల్ యువకుడితో మాట్లాడినట్టు నిర్ధారించారు. దీంతో రాజ్‌కుమార్ ను నిందితుడిగా గుర్తించి గాలింపు చర్యలు చేట్టారు. ఊత్తుకోట వద్ద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో చాముండేశ్వరి, రాజ్‌కుమార్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్ ను దూరంగా ఉంచినట్టు తెలిపాడు. చివరి సారిగా మాట్లాడాలని పిలిపించిన రాజ్‌కుమార్, తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్టు తెలిసింది. ఇందుకు చాముండేశ్వరి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన రాజ్‌కుమార్ బండరాయిని తలపై మోది హత్య చేసినట్టు విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.