TOUR SCHEDULE
-
తెలంగాణలో మోదీ పర్యటన..పూర్తి షెడ్యూల్ ఇదే..
-
సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్
-
పీఎం మోదీ అయోధ్య టూర్ షెడ్యూల్
-
రేపు మాచర్లకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం బుధవారం మాచర్లలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ మాచర్ల షెడ్యూల్ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను లైన్ క్లియర్ అయ్యింది. దాదాపు రూ.340.26 కోట్లతో జరగబోయే పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తోంది జగనన్న ప్రభుత్వం. చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల -
వైఎస్సార్ జిల్లా పర్యటన..షెడ్యూల్ ఇదే
-
ఈ నెల 7న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
-
రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు
-
ప్రధాని మోదీ నిజామాబాద్ టూర్ షెడ్యూల్
-
సీఎం జగన్ విజయనగరం టూర్ షెడ్యూల్
-
16న రాత్రే నగరానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 16న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ మెస్ నుంచి రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి 11 గంటల దాకా హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్, సీఐఎప్ఎఫ్ ఇతర పోలీసు బలగాల వందనం స్వీకరిస్తారు. అనంతరం రోడ్డుమార్గాన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11.50 నిమిషాలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. -
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి, వైఎస్సార్ జిల్లా: జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు. 9వ తేదీ పర్యటన రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్.. గండిపేట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని.. గరండాల కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టిఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట! 10వ తేదీ పర్యటన మూడోరోజూ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. చదవండి: లోకేష్ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం -
సీఎం జగన్ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం-మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా షెడ్యూల్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్ 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు. విశాఖపట్నం పర్యటన మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 11న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. కాగా, ఈ నెల 13న ప్రధాని మోదీ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెలాఖరున జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణలో ఇద్దరు అగ్ర నేతలు పర్యటించనున్నారు. చదవండి: Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శుక్రవారం(డిసెంబర్ 30) అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం, సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన వివరాలు ఇవే.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. ఉదయం 11.15-12.50 మధ్య జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన. తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటిలక్ హీట్ పుట్టిస్తోంది. పీఎం మోదీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, పర్యటనలో భాగంగా మోదీ.. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. - నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేసుకుంటారు. - 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్ (అనధికార సమావేశం) - 2.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం బయలుదేరుతారు. - 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. - 4.15 నుంచి 5.15 గంటల వరకు రామగుండంలో సభ - 5.30 గంటలకు రామగుండం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. - 6.35 గంటలకు బేగంపేట చేరుకుంటారు. - 6.40 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ బయట మోదీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పరిశీలిస్తున్నారు. గత పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ.. ఐబీఎం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ప్రధాని మాట్లాడారు. సమతా మూర్తి విగ్రహం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. అలాగే, హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. -
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
-
సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం 6.20 గంటలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు. (చదవండి: సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు) (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) -
18న కర్నూలుకు సీఎం జగన్.. షెడ్యూల్ ఖరారు
సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ► ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు ►అక్కడ నుంచి 10.30 నిమిషాలకు ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని హెలీకాఫ్టర్లో కర్నూలు ఎస్ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అనంతరం రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్లో సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్‌కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్ అధికారులను సత్కరించనున్నారు. ► 11.20 నిమిషాలకు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ►12.50 నిమిషాలకు ఎస్టీబీసీ గ్రౌండ్ నుంచి బయలుదేరి ఎస్ఏసీ క్యాంపులో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►1.20 నిమిషాలకు ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి విమానంలో 2.30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని సీఎం తన నివాసానికి వెళతారు. -
మేకపాటి ఢిల్లీ పర్యటన ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా ఆరుగురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. తొలిరోజైన బుధవారం కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, అరవింద్ గణపత్, అనురాగ్ ఠాకూర్లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి అందించే ఆర్థికసాయం, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఐటీ ఇండస్ట్రీ పాలసీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి కూడా మాట్లాడనున్నారు. రెండోరోజైన బుధవారం కేంద్రమంత్రులు రాజ్‌కుమార్ సింగ్, రామేశ్వర్ తేలిలను కలిసే అవకాశం ఉంది. -
రేపు వారణాసిలో ప్రధాని పర్యటన
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని రెండు భారీ జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. 34 కిలోమీటర్ల పరిధిలో రూ 1571 కోట్లతో వీటిని నిర్మించారు. వారణాసి రింగ్ రోడ్డు తొలి దశను 16.55 కిలోమీటర్లలో రూ 759.36 కోట్లతో చేపట్టారు. రూ 812 కోట్లతో 17 కిలోమీటర్ల పొడవైన బబత్‌పూర్-వారణాసి రోడ్డును 56వ నెంబర్ జాతీయ రహదారిపై పూర్తిచేసినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇక కేంద్ర ప్రభుత్వ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా గంగా నదిపై మల్టీ మోడల్ వాటర్‌వేస్ టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. పర్యావరణ హితంగా సరుకుల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతోంది. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని వెంట యూపీ గవర్నర్‌రామ్ నాయక్, సీఎం యోగి ఆదిత్యానాథ్ పలువురు కేంద్ర మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 24 వరకూ దావోస్‌లో చంద్రబాబు పర్యటిస్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట 9 మంది సభ్యుల బృందం వెళ్లనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా దావోస్ పర్యటన ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాల సమాచారం. -
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి
* వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళి * ఓపెన్ చర్చిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలసి క్రిస్మస్ ప్రార్థనలు సాక్షి, కడప: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కొద్దిసేపు మౌనంగా అక్కడే మోకరిల్లారు. సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, బ్రదర్ అనిల్, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కూడా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, భారతమ్మలు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇడుపులపాయలోని ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏటా క్రిస్మస్కు ముందురోజు వైఎస్సార్ కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో కలసి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి, వైఎస్ సోదరులు వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతమ్మ, జగన్మోహన్రెడ్డి మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దంపతులు, వైఎస్ భాస్కర్‌రెడ్డి దంపతులు, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి దంపతులు, ఇతర కుటుంబసభ్యులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రెవరెండ్ ఫాదర్ నరేష్, బెనహర్‌బాబు, మృత్యుంజయ తదితర ఫాస్టర్లు క్రిస్మస్ పర్వదిన విశిష్టతను వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని వారు ప్రార్థించారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జగన్ ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం ప్రొద్దుటూరుకు వెళ్లిన వైఎస్ జగన్‌కు పట్టణ శివారులో వైఎస్సార్సీపీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకుడు ముక్తియార్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరికీ వైఎస్ జగన్.. మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులున్నారు. -
వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్
వైఎస్సార్ జిల్లా: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటలో భాగంగా ఈ నెల 24 నుంచి 27 వరకు ఆయన వైఎస్ఆర్ జిల్లా ఇడుపలపాయలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి... నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్... తొలి రోజు పర్యటన (డిసెంబర్ 24, 2015) ► డిసెంబర్ 24 న ఉదయం 7.30 లకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు ఆర్పిస్తారు. ► ఉదయం 9 గంటలకు ప్రార్థన సమావేశాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. ► మధ్యాహ్నం 12.30 లకు ప్రొద్దుటూర్‌లోని ఎఫ్జీ ఫంక్షన్ హాల్లో పులివెందుల కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ కూతురి వివాహానికి హాజరవుతారు. ► మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూర్‌లో కొవ్వూరు రామసుబ్బారెడ్డి కల్యాణమండపంలో జరిగే వినోద్ కుమార్ రెడ్డి మ్యారెజ్ రిసెప్షన్ కు హాజరవుతారు. ► సాయంత్రం 4 గంటలకు కొండారెడ్డిపల్లికి చేరుకుని అక్కడి సర్పంచ్ శివ ప్రసాద్ రెడ్డి కుమారుడు నారాయణ రెడ్డిని వైఎస్ జగన్ అశ్వీరదీస్తారు. రెండో రోజు పర్యటన (డిసెంబర్ 25, 2015) ► ఉదయం 8.30 గంటలకు పులివెందుల చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు ►ఉదయం 11 గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు ► సాయంత్రం 5.30 లకు పులివెందులలోని అంకాలమ్మ గుడి సమీపంలో ఉన్న దివంగత జయ లక్ష్మి టీచర్ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ► సాయంత్రం 6 గంటలకు పులివెందులలోని అంకాలమ్మ గుడి వద్ద పీరవళ్లి (తండ్రి గంట మస్తానాయ్య) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మూడో రోజు పర్యటన (డిసెంబర్ 26, 2015) ► ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని పాల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెండ్లూరి ఈశ్వరరెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి వివాహానికి హాజరవుతారు. ► ఉదయం 9 గంటలకు తొందూరు శివాలయంలో జరిగే గంగరాజు వివాహానికి హాజరవుతారు. ► ఉదయం 10 గంలకు భద్రంపల్లికి చేరుకుని అక్కడి అరుణ్‌కాంత్ రెడ్డి, రామ్ మెహన్ రెడ్డి, చిన్న కేశవరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. ► ఉదయం 11 గంలకు లింగాల మండలంలోని అంకెవానిపల్లిలో శ్రీ వీరా చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు ► మధ్యాహ్నం 12 గంలకు పులివెందులలోని తన నివాసంలో వైఎస్ జగన్ భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2 గంలకు చక్రాయపేట మండలం మారెళ్ల మాదాకలో ఇటీవల పెళ్లిచేసుకున్న రామాంజనేయ రెడ్డి నివాసానికి వెళ్లి అభినందిస్తారు. ► మధ్నాహ్నం 3 గంలకు సిద్ధారెడ్డిపల్లిలో చక్రాయపేట మండలంలో మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవల పెళ్లైన ఆయన కుమారుడు బయా రెడ్డిని అభినందిస్తారు. అనంతరం దివంగత లక్ష్మి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను, దివంగత రైతు శ్రీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాల్గో రోజు పర్యటన (డిసెంబర్ 27, 2015) ► ఉదయం 9 గంటలకు వెంపల్లిలో జెడ్పీటీసీ షబ్బీర్ వివాహానికి హాజరవుతారు. -
సీఎం పర్యటనలో మార్పు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొదట శ్రీకాకుళం పట్టణంలో పర్యట ఉంటుందని ఆధికారులు, జిల్లాకు చెందిన నాయకులు భావించి పర్యటన తాత్కాలిక ప్రొగ్రాంను సిద్ధం చేశారు. మార్పుల అనంతరం నరసన్నపేట, ఎచ్చెర్లమండలాల్లో పర్యటిస్తారని తుదిషెడ్యూల్‌ను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం వెల్లడించారు. పర్యటన ఇలా... శనివారం 9.50 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌పై 10.30 గంటలకు నరసన్నపేట మండలం తామరాపల్లికి చేరుకుంటారు. 10.35 గంటలకు తామరాపల్లిలోని అటవీమొక్కల పెంపకం కేంద్రం వద్దకు చేరుకుంటారు. 11 గంటల వరకు మొక్కలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 11.05 గంటలకు నరసన్నపేటలోని ఇందిరానగర్‌కాలనీకి వస్తారు. 11.35 వరకు ఇందిరానగర్‌కాలనీలో స్మార్ట్వార్డుపై స్థానికులతో మాటామంతీ చేస్తారు. 11.40 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 1.40 వరకు అక్కడ స్టాల్స్ పరిశీలన, పథకాల పంపిణీ, బహిరంగ సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి జమ్ములో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకొని జమ్ములో మధ్యాహ్న భోజనం చేస్తారు. 2.10 గంటలకు జమ్ము నుంచి హెలికాఫ్టర్‌పై బయలుదేరి ఎచ్చెర్ల పోలీస్ మైదానానికి 2.25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా చిలకపాలెం వద్ద ఉన్న శివానీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. 2.30 గంటల నుంచి 4.20 గంటల వరకు యువతతో స్కిల్స్డెవలప్మెంట్పై చర్చిస్తారు. అక్కడి నుంచి 4.25 గంటలకు పోలీస్ మైదానానికి చేరుకుని 4.30 గంటలకు హెలికాఫ్టర్‌పై విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వెళ్తారు. -
రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
* చిత్తూరులో ఆస్పత్రి ప్రారంభం * పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ * అధికారికంగా విడుదల కాని టూర్ షెడ్యూల్ చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ విడుదల కాకపోయినా జిల్లా యంత్రాంగం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ సిద్దార్థజైన్, ట్రైనీ కలెక్టర్ శ్రుతి ఓజా, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనపై టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్‌లో మురకంబట్టులోని సీతమ్స్ కళాశాల వద్దకు చేరుకుంటారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన టాయ్లెట్లు ప్రారంభిస్తారు. అనంతరం హై రోడ్డు మీదుగా పీసీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఓవర్ బ్రిడ్జి నుంచి ఠాణా వరకు ఉన్న రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్‌గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కొంగారెడ్డిపల్లె కూరగాయల మార్కెట్ వద్ద మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చిత్తూరులో రూ 5.కోట్లతో నిర్మించనున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, రూ.2 కోట్లతో నిర్మించనున్న సహకార భవనం, బీసీల భవనం, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ సెమినార్ భవ నాలకు శంకుస్థాపనలు చేస్తారు. బహిరంగ సమావేశం అనంతరం మెసానికల్ మైదానానికి చేరుకుని హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. అధికారులతో జేసీ సమావేశం చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జేసీ భరత్‌గుప్త మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన విధులను వివిధ శాఖలకు కేటాయించారు.