Twitter Trending
-
పాలస్తీనాకు కాంగ్రెస్ సపోర్ట్.. సోషల్ మీడియాలో పొలిటికల్ వార్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైతం.. గాజాపై ఎదురుదాడికి దిగింది. ప్రతిదాడులు చేస్తూ మిలిటెంట్లను తరమికొడుతోంది. మరోవైపు.. భారత్ సహా కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ఇక, భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. దీంతో.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా మాటల పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పాలస్తీనీయులకు మద్దతుగా తీర్మానం చేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్ ఉగ్రవాదులకు ఊతమిస్తోందని, వారికి మద్దతుగా నిలుస్తోందని పలువురు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ బెంగళూరు పార్లమెంటు సభ్యుడు, బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య చేసిన ట్వీట్ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సోషల్ మీడియా వార్.. కాగా, తేజస్వీ సూర్య ట్విట్టర్ వేదికగా.. ‘ఇజ్రాయెల్ ముద్ధంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టేసింది. మోదీ రాకతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. దీనికి కాంగ్రెస్ కౌంటరిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన పాత లేఖ ఒకదాన్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. గత ఏడాది నవంబరు 22న రాసిన ఈ లేఖ పాలస్తీనీయులను ఉద్దేశించింది కావడం గమనార్హం. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ పాలస్తీనా సందర్భంగా రాసిన ఈ లేఖలో పాలస్తీనా కారణానికి భారత్ గట్టిగా మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను ఈ లేఖలో ప్రస్తావించారు. పాలస్తీనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ చేస్తున్న సాయాన్ని ప్రస్తావించారు. అయితే.. తాజాగా పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం మొదలైన సందర్భంగా మోదీ.. ఇజ్రాయెల్‌కు మద్దతు పలకడం విశేషం. హమాస్ జరిపిన ఆకస్మిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతో, బీజేపీ డబుల్ గేమ్ విధానాలను కాంగ్రెస్ ఎత్తిచూపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Congress’s CWC resolution on Israel war is a classic example of how Indian foreign policy was hostage to Congress’s minority vote bank politics, until Modi happened. Also, a reminder on how quickly things will go back to zero if we aren’t vigilant in 2024. https://t.co/nJYk3mDCwq — Tejasvi Surya (@Tejasvi_Surya) October 9, 2023 -
ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం..
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్సీపీ ఎగైన్ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. దీంతో, పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. తన నాలుగేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్వీట్ చేశారు. వీటికి దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వచ్చాయి. ఇటీవలి కాలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతేడాది సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 2024 Jagananna Once More #YSRCPAgain2024 pic.twitter.com/iEsKITKHCx — Rise Of YSJagan (@RiseofYSJagan) May 22, 2023 ఇది కూడా చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. -
‘గెట్‌అవుట్‌రవి’.. వాకౌట్ చేసిన గవర్నర్‌పై తమిళుల నిరసన గళం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది. ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని వ్యాఖ్యనించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెన్నైలో ట్విట్టర్ నంబర్ 1 ట్రెండింగ్ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు. This one is ultimate #GetOutRavi pic.twitter.com/Q1B080wW0N — Vignesh Anand (@VigneshAnand_Vm) January 9, 2023 ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’ -
CM Jagan Birthday: ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా #HBDYSJagan
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి. Happy birthday to a truly magnificent leader @ysjagan anna. Your approach and passion to achieve what you set out to do for the people of Andhra Pradesh are so remarkable. you will be our forever inspiration and we stand by u till our last breath.#HBDYSJagan pic.twitter.com/nDAXudwGvm — Dr.Anil Kumar Yadav (@AKYOnline) December 21, 2022 ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ట్విటర్లో సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 100K Tweets 🔥#HBDYSJagan pic.twitter.com/Mga1mdzrgP — Kodali Nani (@IamKodaliNani) December 20, 2022 కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! My heartiest birthday wishes to the young & dynamic @AndhraPradeshCM Sh Y.S. Jaganmohan Reddy. May blessings of Lord Venkateshwara always be upon you, and may you continue to take #AndhraPradesh to new heights of growth & development.#HBDYSJagan pic.twitter.com/9oFhE5yJCN — Parimal Nathwani (@mpparimal) December 21, 2022 వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: (సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు) -
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్‌లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్‌గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్‌ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్‌లైన్‌కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్‌పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
Rishi Sunak: సార్.. కోహినూర్!
బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ భారత క్రికెటర్ అశిష్ నెహ్రా.. రిషి సునాక్ కవలలు అంటూ మొదలైన మీమ్స్ ఫెస్టివల్.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా భారత్‌కు పంపించాలని. అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్మెన్ ఉండడం.. ఇలా దేశీ టచ్‌ను మీమ్స్‌కు జత చేసి హిలేరియస్ ఫన్ను పుట్టిస్తున్నారు. మరోవైపు రిషి సునాక్ ప్రధాని అయ్యాడు కాబట్టి.. ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్‌కు బర్నల్ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్ స్ట్రీట్ కాస్త తీన్ మూర్తి భవనం(రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు. Meanwhile in UK :) pic.twitter.com/nnOuU2b0FQ — Switty (@Switty2020) October 25, 2022 If NRN and Sudha move into Dus Number, perhaps it can be called Teen Murti Bhavan — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2022 Our first mission is to bring back our ' Kohinoor '. let's goo #Sunak #Kohinoor pic.twitter.com/UvEwXp6cjt — Teju (@tejasflyingmac) October 24, 2022 As #RishiSunak is about become UK PM ,India to send trucks full of Burnol to Pakistan pic.twitter.com/GSm3qbI3O3 — 𝒮𝒽𝒶𝒾𝓁𝑒𝓈𝒽_𝐼𝒩𝒟 भारत🇮🇳 (@Shailesh__IND) October 24, 2022 Meanwhile in UK 😀 pic.twitter.com/JxYC7Qz14k — Porinju Veliyath (@porinju) October 25, 2022 Congratulations Rishi Sunak! The new PM of Britain pic.twitter.com/JWhLJVTwMA — Syed Zain Raza (@SydZainRaza) October 25, 2022 -
సచిన్ బాటలో జెలెన్స్కీ!! అంతా ట్రెండ్ మహిమ
ఈరోజుల్లో విషయం ఎలాంటిదైనా సరే దావానంలా వ్యాపిస్తోంది సోషల్ మీడియా వల్లే. మనిషిని సామాజిక మాధ్యమాలకు అంతగా అతుక్కుపోయేలా చేసింది స్మార్ట్‌ఫోన్. రంగం ఏదైనా సరే మంచి-చెడు రెండింటి గురించి ఇక్కడే ఎక్కువ చర్చ నడుస్తోంది. అలాగే ఛాలెంజ్‌లు, ట్రెండింగ్, ట్రెండ్ల విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. తాజాగా జస్ట్ వన్ వర్డ్ అంటూ ట్విటర్లో ఒక్క ముక్కలో చెప్పాలనుకునే ట్రెండ్ ఒకటి నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కూడా భాగం అయ్యారు. ఆరు నెలలకు పైనే గడుస్తున్నా.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నగరాలు బాంబులు, రష్యా క్షిపణులతో దిబ్బలుగా మారిపోయాయి. రష్యా బలగాలతో పోలిస్తే ఎన్నో రెట్లు బలహీనమైన ఉక్రెయిన్.. ఇంతకాలం పాటు రష్యాను నిలవరించడం ఆశ్చర్యపరిచేదే. పాశ్చాత్య దేశాల మద్దతు వల్లనో.. ఉక్రెయిన్ బలగాల మనోధైర్యం వల్లనో ఈ యుద్ధం ముందుకు సాగుతోంది. అయితే.. తాజాగా వన్ వర్డ్ ట్రెండ్‌లో భాగంగా.. ‘ఫ్రీడమ్’ అంటూ తన ట్విటర్ అకౌంటర్లో సందేశం ఉంచారు జెలెన్స్కీ. Freedom — Володимир Зеленський (@ZelenskyyUa) September 2, 2022 జెలెన్స్కీ చేసిన ఒక్క పదం.. ఇప్పుడు నెటిజన్స్ మనుసు దోచుకుంటోంది. ఉక్రెయిన్‌కు ఏం కావాలో ఒక్క మాటలో జెలెన్స్కీ చేసిన ట్వీట్ ఆంతర్యమన్నది క్లియర్‌గా తెలిసిపోతోంది. రష్యా నుంచి తమ దేశం స్వాతంత్రం కోరుకుంటోందని చెప్పడమే అవుతుంది దానికి అర్థం. ప్రస్తుతం ఈ ట్వీట్‌కు రికార్డు స్థాయిలో లైకులు దక్కడం గమనార్హం. ఏంటీ వన్ వర్డ్ ట్రెండ్.. ట్విటర్‌ను ప్రస్తుతం One-Word Trend కుదిపేస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్‌గా ఒక్క పదంలో చెప్పడం ఈ ట్రెండ్ ఉద్దేశం. అమెరికా రైల్వే సర్వీస్ ప్రొవైడర్ అమ్ట్రాక్ గురువారం ‘ట్రెయిన్స్’ అనే పదం ఉంచింది. అక్కడి నుంచి ఈ వన్ వర్డ్ ట్రెండ్ మొదలైందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు సచిన్ లాంటి ప్రముఖ స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా ఇందులో పాల్గొన్నారు. వన్ వర్డ్ ట్రెండ్.. ఇప్పుడు ట్విటర్లో అద్భుతాలు చేస్తోంది. ఆసక్తులు, నమ్మకాలు.. తెలిసిన విషయాలు.. ఇలా ఏదైనా సరే ఒకేఒక్క ముక్కలో చెప్పే మార్గం ఇది. స్టార్‌బక్స్, డోమినోస్.. నాసా.. ఇలా అన్నీ ట్విటర్లో ఈ ట్రెండ్‌లో పాల్గొన్నాయ్ కూడా. democracy — President Biden (@POTUS) September 2, 2022 cricket — Sachin Tendulkar (@sachin_rt) September 2, 2022 coffee — Starbucks Coffee (@Starbucks) September 1, 2022 pineapple — Domino's Pizza (@dominos) September 1, 2022 universe — NASA (@NASA) September 1, 2022 -
ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. ఏకంగా 36వేల ట్వీట్స్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పేరు ఇప్పుడు ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. 'దిల్‌రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్ చేశారు. ఉన్నట్లుండి దిల్‌రాజు పేరు నెట్టింట పేరు వైరల్ కావడానికి కారణమేమిటి? తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్8న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క పోస్టర్ని మూవీ టీం రిలీజ్ చేసింది. షూటింగ్ ప్రారంభించి ఏడాది కావొస్తున్నా RC15 నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ట్విట్టర్ వేదికగా మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిల్రాజును ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో దిల్‌రాజు పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్‌తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్‌కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్‌పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్‌తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్‌ను హర్షవర్ధన్‌తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్‌గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్‌గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్‌కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్‌ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్‌ను కల్యాణ్ రామ్‌కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్‌లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నా సినిమాను బాయ్‌కాట్ చేయొద్దు: అమీర్ ఖాన్
Aamir Khan Reacts To Boycott Laal Singh Chaddha Twitter Trend: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ మరోసారి జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్లో సూపర్ హిట్టయిన 'ఫారెస్ట్ గంప్' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇటీవల బాయ్‌కాట్ సెగ తగిలింది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. తాజాగా ఈ బాయ్‌కాట్ నిరసనపై అమీర్ ఖాన్ స్పందించాడు. తన చిత్రాన్ని ఎవరూ బహిష్కరించవద్దని కోరాడు. ''నాపై, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. అందుకు నాకు చాలా విచారంగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్పాల్సింది ఒక్కటే.. మీరు ఎంతో దృఢంగా నమ్ముతున్న ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించవద్దు'' అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. Don't feel safe here then why release movie here? Go to your safe place as we know where you're heart lies#BoycottLaalSinghChaddha pic.twitter.com/ezhxuttiEp — hindu_unnity (@hindu_unitty) August 1, 2022 Would you support ?#BoycottbollywoodForever#BoycottLaalSinghChaddha pic.twitter.com/Y4plcIiSaZ — Jaydip Dhameliya (@Jaydip_2001) July 30, 2022 #BoycottLaalSinghChaddha Who do you want on screen Choose please #BoycottbollywoodForever pic.twitter.com/bx49oBZ03s — सदैव देश प्रथम (@afighteroftruth) July 30, 2022 Internet never forgets. #BoycottLaalSinghChaddha pic.twitter.com/6CP35cgWP4 — Punit Doshi (@doshipunit) July 22, 2022 Support only those who support you.#JusticeForKanhaiyaLal#BoycottLaalSinghChaddha pic.twitter.com/jKzR8M1AgG — Kreately.in (@KreatelyMedia) July 1, 2022 #BoycottLaalSinghChaddha What your opinion about movie: Amir lal singh chaadi movie pic.twitter.com/mgT9aU2RjU — vaibhav pandey (@vaibhav06457792) July 30, 2022 -
ఎలాన్ మస్క్ మాటంటే..మాటే! పడిపోతున్న ట్విటర్, టెస్లా షేర్లు!
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌పై కోర్టుకు వెళ్లడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ న్యాయపోరు ఓ కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్, టెస్లా షేర్లు సోమవారం గణనీయంగా క్షీణించాయి. ట్విటర్ షేరు ఒక దశలో 8 శాతం పైగా తగ్గి 33.71 డాలర్లకు, టెస్లా 6 శాతం పైగా క్షీణించి 706.25 డాలర్ల స్థాయికి పడిపోయాయి. వివాదం వివరాల్లోకి వెడితే షేరు ఒక్కింటికి రూ. 54.20 డాలర్ల రేటు చొప్పున 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ కొన్నాళ్ల క్రితం మస్క్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ డీల్ రద్దు చేసుకుంటే ఆయన 1 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నకిలీ ఖాతాల లెక్క సరిగ్గా చెప్పడం లేదని ఆరోపిస్తూ ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఈమధ్య ప్రకటించారు. కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించినప్పట్నుంచీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ట్విటర్ .. ఈ తాజా ప్రకటనపై మండిపడింది. తాము అన్ని వివరాలు సరిగ్గానే ఇచ్చినప్పటికీ మస్క్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించింది. -
ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు
పెంపుడు కుక్కను ఈవినింగ్ వాక్ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం, ఆ ఐఏఎస్ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించడం.. నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా.. ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ. అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్లో కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఐఏఎస్ జంట అయిన సంజీవ్ ఖీరావర్, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్‌ను లడఖ్, దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌ను బదిలీ చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ శిక్ష విధించింది. Karmo ka fal babu-bhaiya.#Ladakh 🤝 #ArunachalPradesh ❤️ Kutta kiske sath jayega????😉#Delhi #IASCouple #Dog pic.twitter.com/bEh1qpI7qB — Roshan Singh🚩 (@Yogi_Bhkt) May 27, 2022 ఈ తరుణంలో.. నెట్లో కుక్క మీమ్స్ నవ్వులు పూస్తున్నాయి. పూల్ ఔర్ కాంటే సినిమాలోని అజయ్ దేవగణ్ ఫేమస్ స్టంట్‌ను ఈ జంటపై ప్రయోగించాడు ఓ నెటిజన్. అక్కడి నుంచి మొదలైన.. కుక్క ట్రెండ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. Kutta right now -:#IASOfficer pic.twitter.com/OAO7A4JNCp — 𝙆𝘼𝙆𝘼𝙎𝙃𝙄𝙄 (@_meherbaaa_) May 27, 2022 ఇద్దరూ చెరోవైపు వెళ్లారని, పాపం ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని ఫన్ పుట్టిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. త్యాగరాజ్ స్టేడియంలో ఈ జంట కోసం అథ్లెట్లను వెళ్లగొట్టిన ఘటనపై ఢిల్లీ సీఎస్ దగ్గరి నుంచి నివేదిక తెప్పించుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆపైనే బదిలీ చర్యలు తీసుకుంది. Meanwhile dog #Kutta #IASOfficer pic.twitter.com/uDejS64GUO — Hardev Singh (@hardevsingh93) May 27, 2022 #WhereWillTheDogGo #Kutta #8Years_Of_Disaster Actually what was the problem, IAS couple providing security cover for the dog, or the dog not getting SPG cover😂😂 pic.twitter.com/gL1DtyNZLQ — Anoasku (@Anoasku) May 27, 2022 సంబంధిత వార్త: స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. -
Samantha Latest Photos: గుండెల్లో గిటార్ మోగిస్తున్న సమంత (ఫొటోస్)
-
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్‌ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్‌తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్‌ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్‌గానీ కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్‌ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
#MonkeyVsDoge: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్‌లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్‌లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ట్విటర్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్ ట్యాగ్‌తో గ్రూప్‌లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తయరు చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్ వర్సెస్ డాగ్ గ్రూప్’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు. Monkeys when they are going to Dog areas #MonkeyVsDoge pic.twitter.com/oIFIkZhuuc — Mr X (@tweets_of_X) December 18, 2021 The Biggest reason behind #MonkeyVsDoge gangwar 😂😂😂😂😂😂😂 pic.twitter.com/98NnuPlftc — 𝗔ɴᴋɪᴛ ❁ (@FanOfMySellf) December 18, 2021 Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP — Ankush (@_James_Bong) December 18, 2021 #MonkeyVsDoge https://t.co/QduTYnHIzq pic.twitter.com/c78WHkSVEx — सिया 🥀 || (@HayeSiyapa) December 18, 2021 Dogs vs Monkeys #MonkeyVsDoge I support both of them check the next vid in the thread 🙏❤️ pic.twitter.com/vTl2sxKSES — Vishupedia (@vishupedia) December 18, 2021 Joe biden has decided to make a peace agreement between monke and doge Thanq biden 👏 #MonkeyVsDoge pic.twitter.com/oTGzAPnY3c — SM (@lolsaalam) December 18, 2021 -
టారిఫ్‌ల పెంపు.. ‘ట్రాయ్ నిద్రపోతోందా?’
BoycottJioVodaAirtel Twitter Trend Amid Tariffs Hike: పరిణామాలు ఏవైనా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసరాలు మొదలుకుని.. ప్రతీదానిపైనే బాదుడు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మొబైల్ టారిఫ్‌ల పెంపుపైనా వ్యతిరేక గళం వినిపిస్తోంది. భారత జనాభాలో సగానికి కంటే ఎక్కువగా(దాదాపు 60 శాతంపైనే అని సర్వేలు చెప్తున్నాయి) మొబైల్ ఇంటర్నెట్నే ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో ధరల పెంపు పెద్దషాక్ అనే చెప్పాలి. ఈ తరుణంలో టెలికాం కంపెనీలను నియంత్రించలేని ట్రాయ్ (TRAI) నిద్రపోతోందా? అంటూ తీవ్ర విమర్శలను దిగుతున్నారు నెటిజనులు. నష్టాల సాకును చూపిస్తూ.. టెలికామ్ కంపెనీలన్నీ సగటు భారతీయుల డబ్బును దోచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎయిర్‌లెట్, వొడాఫోన్-ఐడియా, జియో కంపెనీలు 20రూ. మినిమమ్ పెంపుతో రెగ్యులర్, డాటా టారిఫ్ ప్యాకేజీలన్నింటిని సవరించడం సామాన్యుడికి దెబ్బే అని చెప్పాలి. పేద దేశమైనా సుడాన్ సూపరహే.. 1 జీబీకి ఎంత ఖర్చంటే.. ఇక ఎయిర్టెల్, వొడాఫోన్, జియో కంపెనీలు టారిఫ్‌లను అమాంతం పెంచేయడంపై నిరసన తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. అదే టైంలో ఈ నిరసన సరదా కోణంలోనూ నడుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇంటర్నెట్తోనే ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్నారంటూ సరదా కామెంట్లు కనిపిస్తున్నారు. పరుషంగా తిట్టలేక మీమ్స్ టెంప్లెట్స్‌తో విమర్శిస్తున్నారు కొందరు. పెరిగిన జియో టారిఫ్ ధరల పూర్తి వివరాలు VI పెంచిన ధరలు ఇవే! ఎయిర్టెల్ బాదుడు.. ఇలా ఉంది మరికొందరేమో బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లడం మంచిదేమోనని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్‌పరం చేయొద్దని, అలాగని ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ (సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ ఆధారంగా) పోర్ట్ కావాలంటూ పిలుపు ఇస్తున్నారు నెటిజన్స్. ట్విటర్లో ఈ ట్రెండ్‌ను మీరూ చూసేయండి. #BoycottJioVodaAirtel In the past jio hiked the prices then after all the telecom companies hiked,but now airtel hiked then after suddenly jio hiked something is fishy, #Airtel #Jio #VI these fu.... Companies wanted to create monopoly in the market — VAMSHI RUDRA (@VAMSHIRUDRA2) November 29, 2021 #BoycottJioVodaAirtel is trending People who are using BSNL right now reaction of #BSNL user..💪 pic.twitter.com/ZXCMPA4EHR — Rakesh prajapat (@Rakeshp8290) November 29, 2021 #BoycottJioVodaAirtel We will go to BSNL network — prakash (@sibdumercury) November 29, 2021 #BoycottJioVodaAirtel People in this corona situation lost their jobs and all the investments. In this difficult situation the telecom operators are ruthlessly increasing their tariff price. 😡😡🤬🤬😤😤😤🤧🤧 @JioCare @reliancejio — Satnam Singh (@SatnamS1995) November 29, 2021 Why @TRAI is sleeping? all telecome companies are extending their money is it easy to paid by poor people? wake up TRAI.#BoycottJioVodaAirtel pic.twitter.com/L6CKCy3m4k — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Jio Raises Prepaid Rates By Up To 20% After Airtel, Vodafone Idea. Where is @TRAI in all this loot?#BoycottJioVodaAirtel — Ajeet Kushwaha (@AjeetKushwaha33) November 29, 2021 Meanwhile me to those who are trending: #BoycottJioVodaAirtel pic.twitter.com/yk8POQ387W — All in One 🇮🇳 (@mayankm94847123) November 29, 2021 This woman got so busy on her mobile that she left her child at the hotel. Just think from where did this mobile reach us #BoycottJioVodaAirtel #Vellore #VirgilAbloh #NZvsIND #bimbisarateaser pic.twitter.com/svBgJczqSV — Imtiyaz Ahamad (@ahamad1_imtiyaz) November 29, 2021 -
మళ్లీ బ్రేక్‌డౌన్! ఫేస్బుక్ సేవలకు అంతరాయం
Instadown Trend Amid Instagram Down Again: ఫేస్బుక్ సర్వీసులకు మరోసారి విఘాతం కలిగింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు గంటలసేపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మరోసారి అసహనానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ యాప్ రిఫ్రెష్ కాకపోవడం, ఫీడ్స్ ఆగిపోవడం, ఫేస్బుక్ మెసేంజర్ పని చేయకపోవడంతో పాటు ఫేస్బుక్ కార్యాలయంలోనూ పలు సేవలు ఆగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ అంతరాయంపై యూజర్లకు ఫేస్బుక్ క్షమాపణలు చెప్పింది. ఇంకోవైపు Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్ కావడంతో ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఫేస్బుక్ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం రాత్రి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు సుమారు ఆరేడు గంటలు ఆగిపోవడంతో కోట్ల మంది యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్, టెలిగ్రామ్ సర్వీసుల వైపు మళ్లారు. ఈ అంతరాయం ఫలితంగా ఫేస్‌బుక్‌తో పాటు చిరువ్యాపారస్తులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక శుక్రవారం రాత్రి ఏర్పడిన అంతరాయానికి, సోమవారం ఏర్పడిన అంతరాయానికి ఒకే కారణం కాదని ప్రకటించిన ఫేస్బుక్.. అంతరాయానికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు. అయితే సమస్యను పరిష్కరించినట్లు, ఇప్పుడంతా సర్దుకుందని మాత్రం ప్రకటించింది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. We know some of you may be having some issues using Instagram right now (🥲). We’re so sorry and are working as quickly as possible to fix. — Instagram Comms (@InstagramComms) October 8, 2021 things have been fixed, and everything should be back to normal now. thank you for bearing with us (and for all the memes this week 🙃) — Instagram Comms (@InstagramComms) October 8, 2021 మరోవైపు ఒకేవారంలో రెండుసార్లు షట్‌డౌన్ కావడంపై యూజర్లు అసహనంతో పాటు సెటైర్లు పేల్చారు. శుక్రవారం రాత్రి ఆ రెండుగంటలపాటు ట్విటర్లో మీమ్స్‌తో ఫేస్బుక్ మీద విరుచుకుపడ్డారు. అందులో కొన్ని మీకోసం.. I call the master#instadown pic.twitter.com/Udi4ftuRvG — ΔΝΔSIK (@ilnasik) October 8, 2021 Situation right now when #instadown Instagram Twitter pic.twitter.com/qTT52Ojaar — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 People coming to Twitter again to check whether insta is down again #instagram #instadown pic.twitter.com/yhVgyLDpSP — Garry Gill (@garrygill1112) October 8, 2021 #instadown insta down go to Twitter pic.twitter.com/9GoCbTzRVz — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 Mark zuckerberg after taking insta down 2 times in a week #DeleteInstagram #instadown #instagramdown pic.twitter.com/sjW0PHgpW2 — Khizer (@khiz_7) October 8, 2021 #instadown I'm waiting when it will ok pic.twitter.com/1YNjkWFiiE — Ashutosh Srivastava (@ashutosh_sri8) October 8, 2021 చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. జుకర్‌బర్గ్‌ను ముంచిన ఆ ఒక్కడు -
బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..
Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్ ఎమోషన్స్ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5లో గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5.. 18 మంది కంటెస్టెంట్లతో అక్టోబర్ 3న ప్రారంభమైంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్లో ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్, మోడల్ కమ్ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత. #NamithaMarimuthu 😟😟 Paavam la 😐 First time... BB la oru life story paarthu tears😪 Life is not easy for them😔 Hope this society atleast give comfortable space for them to live like us 💫❤#BBTamilSeason5 #BiggBossTamil5 — Yuna ᴹᴵ (@Yuna_Chillz) October 7, 2021 ఇది కదా చర్చించాల్సింది! సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది. Thalaivar Kalaignar Karunanidhi will be Remembered Forever for such Works.. Proud 😍🔥#KalaignarForever #NamithaMarimuthu #BiggBoss5Tamil pic.twitter.com/An4Du5FGXu — நிதன் சிற்றரசு (@Srinileaks) October 8, 2021 మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ.. కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు కూడా సింగిల్ కట్ లేకుండా, ఎడిట్ చేయకుండా!, బీప్ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్ ఎమోషన్స్ సైతం చాలామందిని కదిలించాయి. ట్విటర్లో నమిత.. బిగ్‌బాస్ హౌజ్ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్లోనూ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్ తక్కువతో కలర్ఫుల్గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు. The pain in #NamithaMarimuthu’s story.💔 Not an ordinary struggle mentally and physically. Jus to hear only was so #exhausing. Can’t imagine what she must have gone through. More power to her and many more achievers from #LGBTQ.#BiggBossTamil #BiggBossTamil5 pic.twitter.com/FaZqJpgRrd — Ajay Ashok🅰️🅰️ (@AjayAsho) October 7, 2021 Her story says how we failed as a society 😭😭 #NamithaMarimuthu #BiggBossTamil5 pic.twitter.com/BY8pGKRxkm — Charan (@Charan_Soz) October 7, 2021 #BiggBossTamil5 She won 17❤️ from #BiggBoss house Million ❤️❤️❤️ from outside the house 🏠#NamithaMarimuthu pic.twitter.com/VQ6gcHzndE — Stay Positive37 (@helothamizha) October 7, 2021 Nameetha Marimuththu She is an icon to showcase the world -People Themselves are more beautiful - She spoke louder her inner feelings and respect @vijaytelevision for not editing her speech ♥️ She is the way beautiful - She is #NamithaMarimuthu #transgenderpride pic.twitter.com/M3NPwIaokl — Bigg Boss Tamil Season 5 (@biggbosstamil_5) October 7, 2021 చదవండి: తెలుగు బిగ్‌బాస్.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ -
జస్టిస్ ఫర్ లీసా: ట్విటర్లో పెను విధ్వంసం
Justice For Lisa Twitter Trend: అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో నిరూపించే ఘటన ఇది. ఓ పాప్ సింగర్ కోసం కోట్ల మంది కదిలారు. #justiceforlisa.. ఇప్పుడు ట్విటర్లో మోత మోగిపోతున్న హ్యాష్‌ట్యాగ్. లీసా అనే యంగ్ ర్యాపర్‌కు న్యాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఓవైపు పాత ట్వీట్లు డిలీట్ చేస్తుంటే.. లక్షల కొద్దీ కొత్త ట్వీట్లు పుట్టుకొస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటికే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు దాటిపోయాయి మరి! దక్షిణ కొరియా పాప్ గ్రూప్ ‘బ్లాక్‌పింక్’కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ గ్రూప్‌లోని నలుగురు సింగర్స్‌లో లీసా మనోబల్(24) ఒకరు. ఆమె అసలు పేరు ప్రణ్ప్రియా మనోబల్. థాయ్‌లాండ్‌లో పుట్టి, పెరిగిన లీసా.. 2010లో పదమూడేళ్ల వయసుకి వైజీ ఎంటర్టైన్మెంట్ లేబుల్‌లో చేరింది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు మకాం మార్చేసి.. 2016 నుంచి బ్లాక్‌పింక్‌లో సింగర్‌గా కొనసాగుతోంది. బ్లాక్‌పింక్‌లో స్టార్డమ్, వరల్డ్‌వైడ్ ఫ్యాన్‌ఫాలోయింగ్, బ్రాండ్ అంబాసిడర్ల లిస్ట్.. ఇలా ఎందులో చూసుకున్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ. అలాంటిది.. కొద్దికాలంగా బ్లాక్‌పింక్ ఈవెంట్లకు లీసా పూర్తిగా దూరంగా ఉంటోంది. ఈమధ్య బివిల్‌గరి ఫ్యాషన్వీక్తో పాటు మరికొన్ని షోస్‌కు లీసాను వైజీ ఎంటర్టైన్మెంట్ ప్రమోట్ చేయలేదు. మిగతా ముగ్గురు సింగర్స్ జీసూ, జెన్నీ, రోజ్‌లను మాత్రం ప్రతీదానికి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారంపై లీసా అభిమానుల నుంచి నిరసర వ్యక్తంకాగా.. స్పందించిన వైజీ ఎంటర్టైన్మెంట్ కరోనా నిబంధనల కారణంగానే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అగ్గిరాజుకుంది. లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్.. #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్‌ట్యాగ్‌లను నడిపిస్తున్నారు. స్వదేశం నుంచి ఫ్రాన్స్‌కు లీసాను రప్పించడం, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆమెకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. మిగతా సింగర్స్ విషయంలో లేని ఆంక్షలు, అభ్యంతరాలు.. లీసాకు మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్రుగా ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. అయితే బివిల్‌గరి సీఈవో జీన్ క్రిస్టోఫె బాబిన్ స్పందిస్తూ.. కొవిడ్ నిబంధనలు, పైగా ఆమె(లీసా) సొంత ఏజెన్సీ సూచనల మేరకే లీసా దూరంగా ఉంటోందని వెల్లడించారు. తెరపైకి రేసిజం! ఇక ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తెస్తున్నారు కొందరు. దక్షిణ కొరియా వ్యాపారవేత్త, వైజీ ఎంటర్టైన్మెంట్ సీఈవో వాంగ్బోక్యుంగ్ జాత్యాహంకారంతో లీసాను పక్కనపెట్టిందనేది వాళ్ల వాదన. లీసా థాయ్‌లాండ్ ర్యాపర్ కావడం వల్లే ఈ వివక్ష అని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వాంగ్బోక్ మీద RIP పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు వైజీ ఎంటర్టైన్మెంట్ తన షేర్లు పతనం కాకుండా ఉండేందుకు #justiceforlisa ట్వీట్లను డిలీట్ చేయిస్తోందన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో లీసా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ట్వీట్లేస్తున్నారు. కేవలం మ్యూజిక్ కేటగిరీలోనే ఒకటిన్నర మిలియన్ల ట్వీట్లు రాగా, మొత్తంగా నాలుగు మిలియన్లకు పైనే లీసా మద్దతు ట్వీట్లు పోస్ట్ అయ్యి ఉంటాయని తెలుస్తోంది. #YGLetLisadoHerWork Pinche vieja ojalá y se valla al infierno. pic.twitter.com/GyQzTYeKt0 — lililie🇲🇽 (@Lili_valdezz) October 6, 2021 YG prefers to delete our hashtag instead of giving us a statement as to why they are restricting lisa's work and as far as i remember they never even moved this fast to clean up the mess when lisa was being dragged by antis 🤭 JUSTICE FOR LISA#YGLetLisadoHerWork — ʟᴇᴍᴏɴ (@Lmonart_) October 6, 2021 సింగిల్‌గా దుమ్మురేపింది వైజీ ఎంటర్టైన్మెంట్తో కొద్దికాలంగా ఆమెకు పొసగడం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాల నడుమే ఆమె బ్లాక్‌పింక్ నుంచి బయటకు వచ్చేస్తుందంటూ కథనాలూ వెలువడ్డాయి. కానీ, లీసా ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇదిలా ఉండగానే సెప్టెంబర్‌లో లాలిసా పేరుతో సోలో ఆల్బమ్ రిలీజ్ చేసింది లీసా. సౌత్ కొరియాలో ఏడున్నర లక్షల కాపీలు అమ్ముడుపోయి.. రికార్డు సృష్టించాయి. అంతేకాదు యూట్యూబ్ ఒక్కరోజులో 76.3 మిలియన్ల వ్యూస్ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ రెచ్చిపోతున్న క్రమంలో ఆమె ఇంకా బ్లాక్పింక్లోనే కొనసాగుతుందా? లేకపోతే బయటకు వచ్చేస్తుందా? అనేది చూడాలి. -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లు.. బోల్డ్ నటిపై గరం గరం
Boycott Radhika Apte Trend: బాయ్‌కాట్ రాధికా ఆప్టే.. హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్‌ను ట్రెండింగ్ ద్వారా కుదిపేస్తోంది. వెల్లువలా వేల కొద్దీ ట్వీట్లు ఆమెకి వ్యతిరేకంగా పోస్ట్ అవుతున్నాయి. భారత సంప్రదాయాలను కించపరిచేలా 35 ఏళ్ల రాధిక నటిస్తోందన్నది ఆ ట్వీట్లు చేసేవాళ్ల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు ఇంతలా దిగజారుతున్న వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్‌పైన గరం అవుతున్నారు ట్విటర్ యూజర్లు. రాధికా ఆప్టే బాలీవుడ్లో బోల్డ్ నటిగా పేరు సంపాదించుకుంది. హిందీ చిత్రం ‘వహ్! లైఫ్ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధిక.. తెలుగులో రక్త చరిత్ర రెండు పార్ట్లు, ధోనీ, లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఇక బాలీవుడ్లో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రాధిక. మరోపక్క మీటూ ఉద్యమానికి మద్ధతు తెలిపే క్రమంలో ఎన్నో సంచలన స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే కేవలం డబ్బు కోసమే రాధికా ఆప్టే నటిస్తోందని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని విమర్శలకు దిగారు కొందరు. ఇక అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని బాలీవుడ్‌ను మరికొందరు కోరుతుండగా.. వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు మరికొందరు. చదవండి: కుప్పలుగా షూటింగ్‌కు జనం.. సినిమా యూనిట్‌కు ఫైన్ బాలీవుడ్లో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు కొందరు బాలీవుడ్ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకు రావడం తెలిసిందే. అయితే వ్యాపారవేత్త, బాలీవుడ్ ప్రముఖ ఫైనాన్షియర్ రాజ్‌కుంద్రా ‘పోర్న్ రాకెట్’ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో కొందరు నెటిజన్స్.. రాధికతో పాటు మరికొందరు తారలను తెర మీదకు తెచ్చి విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల ప్రస్తావన లేవనెత్తి ఈ #BoycottRadhikaApte ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. When it comes to Kathua entire #Bollywood gang was with Placard Why these people silent on #RajKundra ? Habit of bollywood to defame degrad our culture #BoycottRadhikaApte pic.twitter.com/icQ3Kp1TIi#BoycottRadhikaApte — Rahul Jaiswal (@Rahul22578409) August 13, 2021 It's Time To Boycott All Actors , Who Are Against Indian Culture . #BoycottRadhikaApte — Arun Yadav (@beingarun28) August 13, 2021 -
Viral Video: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్!
-
సిగ్నల్ దగ్గర యువతి ఓవరాక్షన్.. కుదిపేస్తున్న వీడియో
సోషల్ మీడియా అంటే వైరల్ వీడియోలకు హబ్. ప్రేమ-పగ-దాడి.. అదీ ఇదీ అనే తేడా లేకుండా ఏదైనా హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి చితకబాదడం అందులో ఉంది. నాన్ స్టాప్‌గా అతన్ని కొడుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్‌ను లాక్కుని మరీ పగలకొట్టింది ఆ యువతి. అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్ లాగి మరీ బాదేసింది. ఈ టైంలో భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని ‘నీకేం పనిరా’ అంటూ మరీ బాదింది. ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాను కుదిపిస్తోంది. సరిగ్గా ఏ తేదీన జరిగిన ఘటనో తెలియదుగానీ.. ‘మేఘ్ అప్డేట్స్’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్ కొనసాగుతోంది. అసలేం జరిగింది అనేదానిపై లక్నో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.. -
ఏంటీ.. జనమంతా మోదీకి మొక్కులు తీర్చుకుంటున్నారా?
ఎదురుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్లు, ఫ్లెక్సీలు.. వాటికి ఎదురుగా నిల్చుని జనాలు దణ్ణం పెడుతున్న ఫొటోలు. సోషల్ మీడియాలో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త ట్రెండ్ #ThankYouModiJiChallenge. బంకుల్లో ఆ ఫొటోలు చూస్తే చాలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈ ఛాలెంజ్ నడుస్తోందని చెప్పనక్కర్లేదు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic #ThankYouModiJiChallenge#NationAgainstPrivatization pic.twitter.com/qC3ZC6EDX8 — PM Naeem (@PMNaeem) July 19, 2021 Join the campaign#ThankYouModiJiChallenge pic.twitter.com/TrnJaql6P1 — Umar A Siddiqui (Shelley Ώïṉḋ)™) (@uashfaq) July 19, 2021 ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అనేది స్పష్టత లేదుగానీ, సరదా కోసమైనా కొందరు ఈ ఛాలెంజ్ పాల్గొంటున్నారు. యూపీఏ పాలనలో మోదీ చేసిన ట్వీట్లను తెరపైకి తెస్తూ.. ఏడేళ్ల పాలనలో ధరల పెంపును ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్‌తో మరికొందరు ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic pic.twitter.com/Jx0RImRPVR#NationAgainstPrivatization — Ashwani Bhatia (@bhatia_movies) July 19, 2021 Thank you modi ji for hike petrol prices#ThankYouModiJiChallenge pic.twitter.com/x5wLmU9JNO — ParacetamoL150MG (@MgL150) July 19, 2021 ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ తమ విమర్శలకు ఈ ట్రెండ్‌ను వాడేసుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టడం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ కొనసాగిస్తున్న ఈ నెగెటివ్ ట్రెండ్‌ను పాజిటివ్‌గా మార్చేచే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మద్ధతుదారులు. How do you "FEEL" when you see this picture ‼🤔#ThankYouModiJiChallenge#PetrolPriceHike pic.twitter.com/p8C0HWklYd — Jagdish Solanki (@iJagdishSolanki) July 18, 2021 #MonsoonSession | Trinamool Congress (TMC) MPs cycled to the Parliament today in protest against the rise in #FuelPrices. (ANI) pic.twitter.com/JA8N1AnAtp — NDTV (@ndtv) July 19, 2021 #ThankYouModiJiChallenge With this golden opertunity i have filled my fuel tank at 105/ltr. I express tons n thousands of guilty to have a Pradhan sevak like u.. pic.twitter.com/tYht98NJxz — Tarique Anjum (@TariqueRainy) July 19, 2021 ఇక ఈరోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మొత్తం మెట్రో నగరాల్లో ముంబైలో గరిష్టంగా పెట్రోల్ లీటర్ ధర రూ.107.83 కాగా, డీజిల్ ధర రూ.97.45గా ఉంది.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. -
ట్విటర్ ట్రెండ్: ఈ సినిమాను అస్సలు చూడకండి!
Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం. Trending in India 🇮🇳 Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1 — Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021 Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz — कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021 ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది. It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN — Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021