unlock
-
చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది?
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. Hey Bangalore! What's going on in your city? I am traveling to your city and what do I see the unlock, download, and search buttons in garbage bins! Sigh. Explain please. #mysterybuttons pic.twitter.com/K8MitUa11n — Sapana Singh (@Sapanasinghj) July 11, 2023 ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక పబ్లిక్ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్ డిటాక్స్’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు మొబైల్ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. Just spotted massive 'Unlock', 'Uninstall', and 'Download' buttons for the first time, lying in the trash bins. Wondering what secrets they hold. @DeccanHerald, any guesses? #ButtonsDiscovered @NewIndianXpress pic.twitter.com/NAA8KtAYob — Balram Sharma (@Brsharma_In) July 11, 2023 ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు! -
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్‌వీవీఎస్‌ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్‌లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అన్‌లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్‌లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్‌లాక్ ఫీచర్‌తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
Twitter: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఖాతాను ట్విటర్ నిషేధించిన విషయం తెలిసిందే. ఖాతాను నిలిపివేయడంపై రాజకీయ దుమారం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో ట్విటర్ తలదూర్చిందని యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: రాజకీయాల్లో ట్విట్టర్ తలదూరుస్తోంది) విమర్శలు చేసిన మరుసటి రోజే శనివారం ట్విటర్ రాహుల్ ఖాతాను పునరుద్ధరించింది. రాహుల్ ఖాతాను తిరిగి తెరిచింది (అన్‌లాక్). ఇటీవల ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాహుల్ తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శి వారితో దిగిన ఫొటోలను ఆగస్ట్ 4వ తేదీన ట్విటర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్లో పోస్టులు చేశారు. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ట్విటర్ రాహుల్ గాంధీ ఖాతాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు 5 వేల మంది ఖాతాలను నిలిపివేసింది. కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా, రోహన్ గుప్తా, పవన్ ఖేరా, మాణిక్కం ఠాగూర్‌తో పాటు రాహుల్ వివాదాస్పద ట్వీట్లను డిలీట్ చేయడంతో ట్విటర్ వారి ఖాతాలను పునరుద్ధరించింది. రాహుల్‌ను రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ట్విటర్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇతరుల ప్రైవసీ.. భద్రత దృష్ట్యా మేం తప్పనిసరిగా నియమాలు పాటించాల్సి ఉంది. ఆ ఫొటో పోస్టు చేయడంపై మా ప్రతినిధులు పరిశీలించి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో భాగంగా చర్యలు తీసుకున్నాం. మా విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు.’ అని వివరించారు. రాహుల్ ఫొటో ఉంచడంపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబం ఫొటోలు ఉంచిన రాహులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ క్రమంలోనే రాహుల్ ట్విటర్ ఖాతాను నిలిపివేసినట్లు తెలిసింది. ఖాతా పునరుద్ధరణపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఒక్క వాక్యం ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది. అంటే చివరకు సత్యమే గెలిచిందని పేర్కొంటూ ఆ ట్వీట్ చేసింది. Satyameva Jayate — Congress (@INCIndia) August 14, 2021 -
సాక్షి కార్టూన్ 13-08-2021
-
అన్‌లాక్.. కరోనాకు ‘ప్లస్’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మంచిర్యాల/ బోధన్ రూరల్(బోధన్)/ మద్నూర్ (జుక్కల్): కరోనా డెల్టా వేరియంట్ ఇప్పటికే దేశాన్ని అతలాకుతలం చేయగా.. ఇప్పుడు దాని నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు రాకున్నా.. పొరుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న సరిహద్దు జిల్లాల ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి లాక్డౌన్ సమయంలో పోలీసు బందోబస్తు, రెవెన్యూ, వైద్య సిబ్బందితో కోవిడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చీపోయే వారిలో అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేయించి పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు పంపారు. లాక్డౌన్ ఎత్తివేశాక చెక్‌పోస్టులు తొలగించడంతో విస్తారంగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో కొత్త వేరియంట్ ఎక్కడ కమ్ముకుంటుందోనని స్థానికులు వాపోతున్నారు. దేశంలో నమోదైన డెల్టా ప్లస్ కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువ. సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ జిల్లాల్లో కేసులు భారీగా వచ్చాయి. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచీ రాకపోకలు మళ్లీ పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్‌హెచ్ 44 భోరజ్ సరిహద్దు, నిర్మల్ జిల్లా తానూరు సరిహద్దులో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం సమీపంలో కోవిడ్ చెక్‌పోస్టు ఎత్తేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత బ్రిడ్జి సమీపం లోని రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద మాత్రం మావోయిస్టులు వైద్యం కోసం వస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు కొనసాగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారిపై.. రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కర్ణాటకతో సరిహద్దులు ఉన్నాయి. గద్వాల పరిధిలోని బల్గెర–ఎర్రగేర, నందిన్నె–సింగనేడి, నారాయణపేట పరిధిలో గుడెబల్లూరు–దేవసుగురు, కానుకుర్తి ద్వారా రాకపోకలు జరుగుతాయి. ఇక 44వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. లాక్డౌన్ సమయంలో ఈ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కట్టడి లేదు. మళ్లీ కరోనా వస్తే ఎలా? రెండేళ్లలో కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. మహారాష్ట్ర వల్ల మా గ్రామంలో చాలా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ అని కొత్తరకం వస్తోందని చెప్తున్నారు. చాలా వాహనాలు వస్తున్నాయి. జనం వచ్చిపోతున్నారు. మహా రాష్ట్ర వల్ల మళ్లీ ఇక్కడ కరోనా కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలి. –కె.నారాయణ, రైతు, పంచాక్షరి, ప్రైవేటు లెక్చరర్ సాలూర గ్రామం, బోధన్ మండలం -
Unlock Effect : ఉత్సాహంలో కార్పోరేట్ కంపెనీలు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన స్థానిక లాక్డౌన్లను తాజాగా అన్‌లాక్ చేస్తుండడం కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎకానమీలో తిరిగి క్రియాశీలత ప్రారంభమయ్యిందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు ఫిక్కీ–ధృవా అడ్వైజర్స్ నిర్వహించిన ఒక సంయుక్త సర్వే తెలిపింది. కరోనా సెకండ్‌వేవ్ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై జరిపిన సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో ఎకానమీ మరింత క్రియాశీలమవుతుందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. ► స్థానికంగా రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ల వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు సర్వేల్లో పాల్గొన్న 212 కంపెనీల్లో 60 శాతం వెల్లడించాయి. ► సెకండ్ వేవ్ తీవ్రత, వివిధ రాష్ట్రాల్లో పలు విధాలైన ఆంక్షలు వినియోగ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్ భారీగా పడిపోయింది. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోసైతం వినియోగ డిమాండ్ దెబ్బతిందని సర్వేలో వెల్లడైంది. ► కొత్త కేసులు గణనీయంగా తగ్గుతుండడంతో తిరిగి వ్యాపారాలు, ఆర్థిక క్రియాశీతల ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని కార్పొరేట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ► అవసరమని సర్వేలో ప్రతినిధులు అభిప్రాయడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతితోపాటు భౌతిక దూరం పాటించడం, విధిగా మా స్క్‌లు ధరించడం వంటి సామాజిక బాధ్యతలకు అత్యధిక ప్రాధాన్యత అవసరమని పేర్కొన్నారు. ► తదుపరి వేవ్‌లను అరికట్టడానికి తీసుకోవాల్సిన మరో ఐదు ప్రధాన చర్యలను సర్వే సూచించింది. ఇందులో మొదటిది చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రతా మౌలిక రంగంపై పెట్టుబడులను పెంచాలి. రెండవది తగిన ఔషధాల నిల్వ అవసరం. తాత్కాలిక వైద్య ఏర్పాట్లు విస్తృతం చేయడం మూడవది. వ్యాధి నిర్థారణ కేంద్రాలు భారీగా ఏర్పాటు నాల్గవది. ఇక ఐదవ సూచన విషయానికి వస్తే, ప్రభుత్వ నిధులతో వ్యాక్సిన్ తయారీకి ఒక దేశీయ సంస్థ ఏర్పాటు. ►వ్యాక్సినేషన్ విస్తృతి కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, పాఠశాలలు, గ్రామీణ పంచాయితీ కార్యాలయాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. అలాగే పెద్దగా కదలడానికి ఇబ్బందిపడే వృద్ధులు, అంగవైకల్యం కలవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం అవసరమని సిఫారసు చేసింది. రికవరీకి మద్దతుగా పటిష్ట చర్యలు అవసరం: పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ రికవరికీ మద్దతునివ్వడానికి ప్రభుత్వ పరంగా పటిష్ట చర్యలు అవసరమని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించే విధంగానైనా పారిశ్రామిక ప్రధాన ముడి పదార్థాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే గత ఏడాదిగా 50 శాతంపైగా ధరలు పెరిగిన కొన్ని ప్రధాన కమోడిటీలపై ఎగుమతి సుంకాలను విధించాలని విజ్ఞప్తి చేశారు. 2021–22లో అధిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పునరుత్తేజం అవసరమని, ఇందుకు తగిన చర్యలు తప్పవని సూచించారు. ఈ దిశలో కుటుంబాల వినియోగ డిమాండ్ పెంచడానికీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో మూలధన పెట్టుబడుల విస్తృతితోనే ఇది సాధ్యమవుతుందని అగర్వాల్ విశ్లేషించారు. ఆయా అంశాల్లో లక్ష్యాలను సాధించడానికి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ పెట్టుబడులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంటి నుంచి పనులు, నిధుల కొరతల వల్ల ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులకు ఎటువంటి విఘాతం కలుగరాదన్నారు. వర్కింగ్ క్యాపిటల్ చట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందీ రాకూడదని స్పషం చేశారు. -
తెలంగాణ లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు
-
జాగ్రత్తగా ‘అన్‌లాక్’ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ఆంక్షల ఎత్తివేత లేదా సడలింపుల బాట పట్టాయి. అయితే, కోవిడ్ తాజా పరిస్థితులను నిశితంగా గమనించాకే అప్రమత్తతతో ‘అన్‌లాక్’ ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం శనివారం సూచించింది. ఆంక్షల సడలింపుల కారణంగా మార్కెట్లు, కొన్ని ప్రదేశాల్లో ప్రోటోకాల్‌ను గాలికొదిలేసి ప్రజలు గుమికూడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో అన్‌లాక్ అప్రమత్తతపై శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ట్రిపుల్ టి + వీ మంత్రం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంతోపాటు, కరోనా టెస్టింగ్–ట్రాకింగ్, ట్రీట్మెంట్(కోవిడ్ చికిత్స), టీకాలు, నిరంతర అప్రమత్తత ఇలా ఐదు అత్యంత ఆవశ్యకమైన నియమావళిని రాష్ట్రాలు తప్పక కొనసాగించాలని లేఖలో అజయ్ భల్లా సూచించారు. ‘వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలి. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను ఎత్తేయడమో, సడలించడమో చేస్తున్నాయి. అన్‌లాక్‌కు అనుగుణంగానే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆంక్షలపై నిర్ణయాలు తీసుకోండి. మరో వేవ్ రాకుండా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే’ అని భల్లా సూచించారు. సంక్రమణ రేటు, యాక్టివ్ కేసులపై నిఘా ‘ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదలగానీ పాజిటివిటీ రేటులో పెరుగుదల వంటి సంకేతాలను ప్రారంభదశలో గుర్తించాలి. ఏదైనా ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఆ ప్రాంతానికే వ్యాప్తిని పరిమితం చేయాలి’ అని భల్లా లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌తో సురక్షితం కరోనా వైరస్ కట్టడికి టీకా అతిపెద్ద ఆయుధమని కేంద్రం తెలిపింది. కరోనా గొలుసు సంక్రమణలను విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. రాష్ట్రాలు ఆంక్షలను సడలించుకోవచ్చని, అయితే కరోనా నిబంధనలను నిర్లక్ష్యంచేయొద్దని కోరింది. డాక్టర్లపై దాడులను ఉపేక్షించొద్దు ‘కోవిడ్ చికిత్స విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, ఆరోగ్యరంగంలోని వృత్తినిపుణులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కఠిన విపత్తు నిర్వహణ(సవరణ) చట్టం–2020 కింద కేసు నమోదుచేయండి. సిబ్బందిపై దాడి, బెదిరింపు తదితర ఘటనలు వారిలో నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని పెంచే ప్రమాదముంది. దాడికి పాల్పడే వారిపై కేసులు పెట్టి త్వరితగతిన శిక్షలుపడే చూడండి’ అని భల్లా పేర్కొన్నారు. విపత్తు చట్టం కింద గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే నిందితుడికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. -
లాక్డౌన్ ఎత్తేయగానే దోస్తులను కలుస్తాం.. మాల్స్‌కు పోతాం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్‌కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. -
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత
అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. సామాజిక, రాజకీయ, మతపర, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయాయి. ప్రార్థన స్థలాలు, సినిమా హాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, పబ్స్, జిమ్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉండదు. ‘‘లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు. జనజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను విధిగా అనుసరించాలి. పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి..’’ - ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్డౌన్ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూన్ 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్ క్లాసెస్) ప్రారంభించాలని సూచించింది. లాక్డౌన్ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు. గ్రామాల్లో ఆధునిక సెలూన్లు యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనే నిర్ణయించిన ప్రకారం క్షౌ ర వృత్తిలోని నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగా.. చేనేత, గీత కార్మికులు, ఇతర వృత్తి కులాల వారికి సైతం త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. మత్స్య, గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, ఎంబీసీ కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రోగుల రద్దీతో కిటకిటలాడుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా.. కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతమున్న ‘టిమ్స్’ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని.. కొత్తగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తీర్మానించింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ స్థలంలో మరొకటి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మధ్య మరొకటి నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు శివారు ప్రాంతాల్లోనే వైద్య సౌకర్యం అందుతుందని పేర్కొంది. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. -
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. థియేటర్స్ ఓపెన్.. ఇక జాతరే!
సినీ ప్రియులకు శుభవార్త. తెలంగాణలో ఆదివారం నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్‌డౌన్‌ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ని పూర్తి ఎత్తివేస్తున్నారు. దీంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది. కరోనా వల్ల.. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇకపోతే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడడంతో సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఆ లిస్ట్‌లో నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’. నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’. రవితేజ ‘ఖిలాడి’, విష్వక్ సేన్ ‘పాగల్’లతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. -
అక్కడ రెస్టారెంట్లకు ఓకే.. లిక్కర్‌కి నాట్ ఓకే
న్యూఢిల్లీ : మందుబాబులకు ఢిల్లీ సర్కారు ఝలక్ ఇచ్చింది. క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తూనే లిక్కర్ సర్వింగ్‌కి నో చెప్పింది. ట్రయల్ బేసిస్ మీద జూన్ 6 నుంచి 21 వరకు యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు తెరుచుకోవడంతో ఓ పెగ్గు వేద్దామని వెళ్లిన మందుబాబులకు నిరాశే ఎదురవుతోంది. రెస్టారెంట్లు, బార్లలో ఆల్కహాల్ అమ్మకాలకు చేయకూడదంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఉండటంతో చుక్క మందు కూడా వాళ్లకి దొరకలేదు. కఠిన చర్యలు కోవిడ కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ 19 నుంచి జూన్ 5 వరకు కఠిన లాక్డౌన్ అమలు చేసింది ఢిల్లీ సర్కార్. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగా రెస్టారెంట్లు ఓపెన్ చేసినా మందుకు మాత్రం నో చెప్పింది. ఢిల్లీ బాబులు బార్లలో గొంతు తడుపుకోవాలంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. బార్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆల్కహాల్ అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. త్వరగా ఇవ్వండి కరోనా కారణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల రంగం భారీ నష్టాలు చవి చూస్తోందని. పరిస్థితులను అంచనా వేసి త్వరగా తమకు లిక్కర్ అనుమతులు ఇవ్వాలంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి:‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి -
లాక్డౌన్ ఎత్తివేత.. రాత్రి కర్ఫ్యూ విధింపు
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ పలు రాష్ట్రాల్లో ఎత్తి వేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయలో లాక్డౌన్ విధిస్తూనే భారీగా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లో లాక్డౌన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50 శాతం మందితో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం పగటిపూట కర్ఫ్యూ కొనసాగింది. తాజాగా పగటిపూట కర్ఫ్యూను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఎత్తివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్డౌన్ ఎత్తివేసినా కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో దశ ముప్పు రాదని స్పష్టం చేశాయి. చదవండి: లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి
ప్రస్తుతం మన దేశంలో 5 ఏళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. ఇది ఒక ఐడీ ప్రూఫ్ లాగా మాత్రమే కాకుండా, చిరునామా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల కోసం ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి. అందుకే మన దేశంలో ఈ కార్డుకు ఉన్న మరే ఇతర కార్డుకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు అసాంఘిక శక్తుల కోసం మీ నెంబర్ కోసం ఉపయోగిస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎవరు ఉపయోగించలేరు. అలాగే లాక్ చేసిన ఆధార్‌ను ఆన్-లాక్ కూడా చేయవచ్చు. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ సహయంతో సులభంగా లాక్ చేయవచ్చు. మొదట మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి GETOTPAadhaar NUMBER-last-4-digits టైపు చేసి 1947కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని LOCKUIDAadhaar NUMBER-last 4-digitsOTP-6-digits అని టైపు చేసి మళ్లీ 1947కి మెసేజ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఉదాహరణకు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు 9123 అనుకుంటే GETOTP 9123 అని టైప్ చేయాల్సి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ 012345 అనుకుంటే LOCKUID 9123 012345 ఈ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు. అలాగే, ఆన్-లాక్ చేయాలంటే వర్చువల్ ఐడీ సహాయంతో చేయవచ్చు. చదవండి: కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే -
అన్‌లాక్, అంతర్జాతీయ అంశాలే కీలకం..!
ముంబై: కరోనా సంబంధిత వార్తలు, లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియ, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల రాక వార్తలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్‌ధరలు, రూపాయి ట్రేడింగ్, విదేశీ ఇన్వెస్టర్లు వైఖరి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ‘‘దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేస్తున్నాయి. కరోనా తగ్గేంత వరకు సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని గతవారంలో ఆర్బీఐ భరోసానిచ్చింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అంశాలన్నీ సూచీల రికార్డు ర్యాలీని కొనసాగించేలా ప్రోత్సహించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత వారంలో సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే.., సెంటిమెంట్‌ను బలపరుస్తున్న అన్‌లాక్ ప్రక్రియ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచే ‘అన్‌లాక్’ ప్రక్రియ ప్రారంభమైంది. మార్కెట్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. నేటి(సోమవారం)నుంచి మెట్రో రైళ్లు 50% రవాణా సామర్థ్యంతో ప్రయాణించనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కోవిడ్ నిబంధనలను ఐదు అంచెల్లో సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక రికవరీ తిరిగి గాడిన పడవచ్చనే ఆశలు మార్కెట్లో సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి... అమెరికా శుక్రవారం మే నెల ఉద్యోగ గణాంకాలను వెల్లడించింది. యూఎస్ ఆర్థికవేత్తలు మేలో 6.50 లక్షల ఉద్యోగాల సృష్టి జరగొచ్చని ఆశించగా, 5.59 లక్షల ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది. దీంతో ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని కఠినతరం చేయవచ్చనే ఆందోళనలు ఉపశమించాయి. జపాన్ ఈ మంగళవారం తొలి క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. చైనా బుధవారం మే నెల ద్రవ్యోల్బణ, పీపీఐ డేటాను వెల్లడించనుంది. ఈసీబీ (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్) గురువారం వడ్డీరేట్లను ప్రకటించనుంది. అదేరోజున(గురువారం) అమెరికా మే ద్రవ్యోల్బణ డేటాను, చైనా శుక్రవారం మే వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రుతుపవనాలు, క్యూ4 ఫలితాలు... దేశంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనా.., ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల విషయానికొస్తే.., ఇప్పటికే అధిక వెయిటేజీ షేర్లను కలిగిన కంపెనీలు ఫలితాలను వెల్లడించాయి. బాటా ఇండియా, గెయిల్, సెయిల్, భెల్, డీఎల్ఎఫ్ లాంటి కీలకమైన కంపెనీలు ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఐఐపీ గణాంకాలు శుక్రవారం విడుదల... ఇదే వారంలో శుక్రవారం ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. లో బేస్ కారణంగా వార్షిక ప్రాతిపదికన 186 శాతం వృద్ధి నమోదుకావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. నాలుగు రోజుల్లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు... భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జూన్ నెల తొలి నాలుగురోజుల్లోనే ఏకంగా రూ.8,000 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కరోనా కేసుల తగ్గుదల, కార్పొరేట్ల మెరుగైన ఆర్థిక ఫలితాలు కొనుగోళ్లను ప్రేరేపించాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక మేలో ఎఫ్ఐఐలు రూ.2,954 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. -
Maharashtra: నేటి నుంచి లాక్డౌన్ సడలింపులు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పౌరులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నమోదవుతున్న కొత్త కరోనా రోగుల సంఖ్య, రికవరీ శాతాన్ని బట్టి లాక్డౌన్ నిబంధనలు సడలించింది. దీంతో గత సంవత్సరం మార్చి నుంచి స్తంభించిపోయిన వ్యాపార ఆర్థిక లావాదేవీలు, ఉపాధి కోసం జనాల పరుగులు పుంజుకుంటాయి. సడలించిన నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్‌లాక్ ప్రటకనల గందరగోళం! రాష్ట్రంలో ఐదు దశల్లో అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నట్లు గురువారం సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం లాక్డౌన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. దీంతో తేరుకున్న వడెట్టివార్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ఈ వివాదస్పద ప్రకటనపై విజయ్ వడెట్టివార్ను ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన సంగతి విదితమే. ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తుందని, ఎన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి తీసుకునే అంతిమ నిర్ణయాన్నే అందరూ ఆమోదిస్తారని స్పష్టం చేశారు. లాక్డౌన్ ఎత్తివేసే అంశంపై ఆలోచిస్తున్నామని పవార్ వెల్లడించారు. చివరకు ఊహించిన విధంగానే లాక్డౌన్ నిబంధనలు పడలిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఐదు ఫేజ్‌లుగా అన్‌లాక్ అన్‌లాక్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఫేజ్‌లుగా విభజించింది. ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను మొదటి ఫేజ్‌గా గుర్తించింది. ఈ జిల్లాలను సోమవారం నుంచి పూర్తిగా అన్‌లాక్ చేసింది. ఇందులో రాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ సహా 12 జిల్లాలున్నాయి. కానీ ముంబై, థానే, పుణే నగరాలకు పెద్దగా ఊరట లభించలేదు. ముంబై లోకల్ రైళ్లలో సామాన్య ప్రజలకు అమలులో ఉన్న నిషేధాన్ని అలాగే కొనసాగించింది. దీంతో ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ముంబై, థానేలో మాల్స్, నాట్యగృహాలు, సినిమా హాళ్లు పూర్తిగా మూసే ఉంటాయి. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం హాజరుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాని దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇచ్చింది. కానీ దీనిపై బీఎంసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తరువాత కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ సమయంలో జనాలు ఇళ్ల నుంచి అనవసరంగా బయటకురావొద్దు. ఐదు ఫేజ్‌లు– జిల్లాలు ►ఫేజ్–1లో అన్ని నిబంధనలు రద్దు. ఇందులో నాగ్‌పూర్, అహ్మదాబాద్, చంద్రాపూర్, ధులే, గోందియా, జల్గావ్, జాల్నా, లాతూర్, నాందేడ్, యవత్మాల్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–2లో అనేక నిబంధనలు రద్దు. ఇందులో హింగోలి, నందూర్బార్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–3లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ఇందులో ముంబై, థానే, నాసిక్, పాల్ఘర్, వర్ధా, అకోలా, అమరావతి, ఔరంగాబాద్, బీడ్, భండారా, గడ్చిరోలి, ఉస్మానాబాద్, పర్భణీ, షోలాపూర్, వాషిం జిల్లాలున్నాయి. ►ఫేజ్–4లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇతర వ్యవహారాలకు అనుమతి లేదు. ఇందులో పుణే, బుల్డాణ, కోల్హాపూర్, రాయ్‌గడ్, రత్నగిరి, సాంగ్లీ, సాతారా, సిందుధుర్గ్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–5లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. ఇందులో ఇంతవరకూ ఏ జిల్లాలు లేవు. ఐదు ఫేజ్‌లు ►ఫేజ్–1లో వారంలో కరోనా రోగులు 5 శాతానికంటే తక్కువ నమోదు కావాలి. ఆక్సీజన్ బెడ్లలో 25 శాతానికి కంటే తక్కువ రోగులుండాలి. ►ఫేజ్–2లో వారంలో 5 శాతానికంటే తక్కువ రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 25–40 శాతం రోగులుండాలి. ►ఫేజ్–3లో వారంలో 5–10 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 40 శాతానికిపైగా రోగులుండాలి. ►ఫేజ్–4లో వారంలో 10–20 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్ల వినియోగం 60 శాతాని కంటే పైగా ఉండాలి. ►ఫేజ్–5లో వారంలో 20 శాతానికంటే ఎక్కువ రోగులు, ఆక్సిజన్ బెడ్లు 75 శాతానికిపైగా రోగులతో ఉండాలి. తాజా సడలింపులివీ.. ►అత్యవసర సేవలందించే షాపులు రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి. ►ఇతర షాపులు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి. శని, ఆదివారాలు మూసి ఉంటాయి. ►రెస్టారెంట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సిట్టింగ్‌తో నిర్వహించుకోవచ్చు. హోం డెలివరీ/ పార్సిల్ సేవలు కొనసాగించొచ్చు. ►సార్వజనిక మైదానాలు, ఉద్యాన వనాలు, వాకింగ్ ట్రాక్‌లు ఉదయం 5 నుంచి తొమ్మిది వరకు తెరిచి ఉంటాయి. ►వ్యాయామ శాలలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు సాయంత్రం 4 గంటల వరకు, 50 శాతం సిట్టింగు, ఏసీ షాపులు బంద్. ►సినిమాలు, సీరియళ్ల షూటింగులకు స్టూడియోల్లో సాయంత్రం 5 గంటల వరకు అనుమతి. ►సాంస్కృతిక కార్యక్రమాలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి. 50 శాతం సిట్టింగ్. ►పెళ్లిలు, ఇతర శుభ కార్యాలకు ఫంక్షన్ హాలు సామర్థ్యాన్ని బట్టి 50 శాతం అనుమతి. అంత్యక్రియలకు కేవలం 20 మందికే అనుమతి. ►బెస్ట్ బస్సుల్లో వంద శాతం అనుమతి, స్టాండింగ్‌కు అనుమతి లేదు. ►అన్ని రకాల ఆన్లైన్ కోనుగోళ్లకు పూర్తి స్థాయిలో అనుమతి. -
Maharashtra: అన్‌లాక్ ప్రకటనపై సర్కారు యూటర్న్!
మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠినంగా లాక్డౌన్ అమలు అవుతోంది. అయితే ప్రజలకు ఊరటనిచ్చేలా శుక్రవారం నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు స్వయంగా మంత్రి ప్రకటించడం.. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి విరుద్ధ ప్రకటన వెలువడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై శుక్రవారం ఉదయం మరోసారి స్పష్టమైన ప్రకటన వెలువడింది. ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేర కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించడానికి 5 స్థాయిల్లో అన్‌లాక్ ప్రణాళికను విధించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆయన నుంచి ప్రకటన వెలువడగానే మీడియా కథనాలు వచ్చాయి. దీంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సాయంత్రం పూట మహా సర్కార్ కీలక ప్రకటన చేసింది. తూచ్.. అటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకోబోదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. అయితే ఈ ప్రకటనపై విజయ్ వాడేటివార్ మరోసారి స్పందించారు. ఆక్సిజన్ బెడ్స్ లభ్యత, పాజిటివిటీ రేట్ తగ్గుదల పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే దీనిపై అధికారికంగా ఒక స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. ఇక భేటీలో అన్‌లాక్ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కేసులు, 285 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ పరిస్థితి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేయాలని కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
లాక్డౌన్ ఎత్తివేత?: అన్‌లాక్ వైపు ప్రభుత్వం మొగ్గు
బనశంకరి: రాష్ట్రంలో వారం నుంచి కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అన్‌లాక్ గురించి యోచిస్తోంది. రెండో దశ కోవిడ్ వికటాట్టహాసం చేసి భారీగా ప్రాణాలను బలిగొంటున్న తరుణంలో మే 10 నుంచి రెండో లాక్డౌన్ ఆరంభమైంది. జూన్ 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఒకనెల రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోగా కరోనా మెల్లగా అదుపులోకి వస్తోంది. బెంగళూరు కూడా కరోనా పీడ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అన్‌లాక్‌కు సన్నాహాలు చేస్తోంది. దిగ్బంధం వల్ల పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. దీంతో అన్‌లాక్ చేయడం యడియూరప్ప సర్కారుకు అనివార్యమైంది. జూన్ 7 నుంచి దశలవారీగా దిగ్బంధాన్ని సడలించి ఆర్థిక కార్యకలాపాలకు పచ్చజెండా ఊపడం తప్ప గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు సర్కారుకు సూచించారు. పొడిగించాలని కమిటీ నివేదిక జూన్ 7వ తేదీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలి అనే అంశాలతో కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే ఎన్నిరోజులు, అన్‌లాక్ ఎలా ఉండాలి తదితర అంశాలను పేర్కొంది. ఈ నివేదిక ను ఆరోగ్య మంత్రి సుధాకర్‌కు సమితి అందజేసింది. నివేదికను కృష్ణాలో సీఎం యడియూరప్పకు ఆయన అందజేశారు. మరో 14 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని సమితి నివేదికలో సిఫార్సు చేసింది. దీని గురించి ఇరువురూ చర్చించారు. జూన్ 4, 5 తేదీల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. 2-3 వేలకు తగ్గినప్పుడే: అశోక్ కోవిడ్ సలహాసమితి నివేదిక ఆధారంగా లాక్డౌన్ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ కేసుల సంఖ్య ఆధారంగా తీర్మానం చేస్తామని అన్నారు. బెంగళూరులో నిత్యం 500 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదు కావాలి, రాష్ట్రంలో వెయ్యి, మూడు వేల కేసుల స్థాయికి తగ్గినప్పుడే లాక్డౌన్ సడలింపుపై నిర్ణయానికి వస్తామన్నారు. దొడ్డబళ్లాపుర వద్ద అత్యాధునిక వసతులతో కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించామని, ఇందులో 100 పడకలు ఉంటాయని, ఐసీయూ, వెంటిలేటర్ వసతి ఉందని తెలిపారు. -
మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్.జీ అనిల్ బైజల్‌ను కలిసిన తర్వాత మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మే 31 నుంచి వ్యాపారాలకు సడలింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి ఒక వారం పాటు నగరంలో పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ వాటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిపుణులు, ప్రజల అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ప్రతి వారం అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తుందని అన్నారు. చదవండి: రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ -
ఢిల్లీలో దశలవారీగా లాక్ డౌన్ సడలింపు
-
లాక్డౌన్ ఎత్తేస్తారట !
ముంబై:లాక్డౌన్ సడలింపుల దిశగా మహరాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా ప్రమాదకర స్థాయి కిందికి చేరుకుంది. దీంతో లాక్డౌన్ ఎత్తివేయాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అయితే ఒకేసారి లాక్డౌన్ నిబంధనలు మొత్తం సడలించరని.. దశల వారీగానే అన్‌లాక్ ప్రక్రియ ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. 30 నాటికి అన్‌లాక్ పూర్తి మహరాష్ట్రలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు మంత్రి రాజేశ్‌తోపే. జూన్ 30 నాటికి అన్‌లాక్ పూర్తవుతుందని.. అయితే ఎప్పటి నుంచి అన్‌లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు అన్‌లాక్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు. 4 దశల్లో మొత్తం నాలుగు దశల్లో అన్‌లాక్ అమలు చేయనున్నారు. మొదటి దశలో నిత్యవసర వస్తువులు అమ్మే షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అలా ఒకర్కో రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ మొత్తం నాలుగు దశలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తారు. అయితే ఆగష్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో థర్ఢ్ వేవ్ ముప్పు సూచనలు ఉన్నందున పూర్తి స్థాయి అన్‌లాక్ చేయోద్దంటున్నారు వైద్య నిపుణులు. క్రమంగా దేశవ్యాప్తంగా అంతులేని విషాదం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ మహరాష్ట్ర నుంచే మొదలైంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు రావడంతో అందరి కంటే ముందుగా మహారాష్ట్ర లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కూడా మహరాష్ట్ర నుంచే మొదలు కానుంది. దీంతో దేశం క్రమంగా అన్‌లాక్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది -
హైదరాబాద్ మెట్రో.. అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పూర్తిస్థాయిలో అన్‌లాక్ అయినా మెట్రో ప్రయాణికుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెరగడంలేదు. లాక్‌డౌన్‌కు ముందు (ఈ ఏడాది మార్చి 22)తో పోలిస్తే ప్రస్తుతం మూడు రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 38 శాతం దాటకపోవడం గమనార్హం. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మార్చి నెలకు ముందు నిత్యం 3.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో నిత్యం 1.33 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. సువర్ణ ఆఫర్‌తో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీతోపాటు స్మార్ట్‌కార్డులో రీఛార్జీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలు చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య అరకొరగానే పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఆఫర్లు ప్రకటించినా.. దసరా, దీపావళి సందర్భంగా మెట్రోరైలు సంస్థ మెట్రో సువర్ణ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లో భాగంగా ఛార్జీల్లో రాయితీ కల్పించడంతోపాటు.. స్మార్ట్‌కార్డ్ రీఛార్జీపై క్యాష్‌బ్యాక్‌ఆఫర్ అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ ఆఫర్లు అమలుకానున్నాయి. అయితే ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్యను లాక్డౌన్ ముందున్న సంఖ్యకు చేర్చేందుకు మెట్రో అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలివే.. - సిటీజన్లలో కోవిడ్ భయాందోళనలు తొలగకపోవడం. కోవిడ్ సెకండ్‌వేవ్ మొదలౌతుందన్న ఆందోళన. - ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలవుతుండడం. - మెట్రో స్టేషన్ల వద్ద బైక్, కార్ల పార్కింగ్‌కు చెల్లించే ఛార్జీలు తడిసి మోపెడు కావడం. - మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు, బస్తీలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఆటో, క్యాబ్ ఛార్జీలతో జేబులు గుల్లకావడం. - వ్యక్తిగత వాహనాలపై వెళితే కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చన్న భావన. - మెట్రో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ.. ఏసీ బోగీల్లో సులభంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనలు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది నగరంలో మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్, సువర్ణ ఆఫర్ సత్ఫలితాన్నిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్లుగా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నగరం మినహా నూతనంగా మెట్రో ప్రారంభమైన మిగతా మెట్రోసిటీలతో పోలిస్తే నగరంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. – ఎన్వీఎస్రెడ్డి, హెచ్ఎంఆర్, ఎండీ -
అన్‌లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్ అన్నింటినీ అన్‌లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
ఇప్పట్లో థియేటర్‌కు వెళ్లే ఆలోచనే లేదు..!
న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు కేంద్రం వెసలుబాటు కల్పించినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు పడటం లేదు. మరికొన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించినా.. యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమంటూ ఎగ్జిబిటర్లు తేల్చిచెప్తున్నారు. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడ్డ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలను వెండితెర మీద ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరి, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు నిజంగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలానుకుంటున్నారా? రానున్న రెండు నెలల్లో కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్‌కు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అన్న అంశాలపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.(చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ అమలు) థియేటర్‌కు వెళ్లే ప్రసక్తే లేదు! ఈ ఆన్లైన్ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 8274 మంది అభిప్రాయాలు సేకరించగా.. వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో 4 శాతం మంది కేవలం కొత్త సినిమా రిలీజ్ అయితే మాత్రమే వెళ్తామని చెప్పగా, 3 శాతం మంది.. కొత్త, పాత అనే తేడా లేకుండా థియేటర్లో ఏ సినిమా అయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక అత్యధికంగా 74 శాతం మంది మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండగా, 2 శాతం మంది కచ్చితమైన అభిప్రాయమేదీ వెల్లడించలేదని సర్వే పేర్కొంది. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్లో సినిమా చూసే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేసినట్లు తెలిపింది. కాగా లోకల్‌సర్కిల్స్ జూలైలో నిర్వహించిన సర్వేలో, 72 శాతం మంది, ఆగష్టునాటి సర్వేలో 77 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో తాము థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందున ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతున్నట్లు పేర్కొంది. కాగా కోవిడ్ లాక్డౌన్ కారణంగా, గత ఏడు నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినీరంగం కుదేలైంది. సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కొంతమంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మళ్లగా, మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా ఈశాన్య రాష్ట్రాలు థియేటర్ల ఓపెనింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి.