utham kumar reddy
-
పేలవంగా రాష్ట్రపతి ప్రసంగం: ఉత్తమ్
ఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చాలా పేలవంగా ఉందని, చాలా సమస్యలపై స్పష్టత లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో నిరుద్యోగ సమస్య గురించి, రైతుల సమస్య గురించి రాష్ట్రపతి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని పొగడటానికే సరిపోయిందని చెప్పారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రాష్ట్రపతితో అనిపించడం బాధాకరమన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైన ప్రభుత్వాలని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలకు అద్భుతమైన, స్వచ్ఛమైన పాలనను అందించాయని చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశం ఆర్ధికాభివృద్ధి చెందింది.. దాని కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో మాత్రం 2014 తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ ప్రస్తావనే లేదని అన్నారు. ప్రతిసంవత్సరం దేశంలో లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. దాని నివారణ చర్యల గురించి పట్టించుకోలేదని తెలిపారు. ‘విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో మాట్లాడలేదు. బిహార్‌లో 110 మంది చిన్నపిల్లలు చనిపోతే దాని గురించి ప్రసంగంలో లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న బీజేపీ దానిని ఏవిధంగా అమలు చేస్తారో చెప్పలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన చట్టంలో తెలంగాణాకు రావాల్సిన అంశాలపై ప్రసంగంలో ప్రవేశపెట్టలేదు. ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలంగాణాకి మొండి చెయ్యే అని స్పష్టంగా తెలుస్తుంద’ని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నీచంగా, వికృతంగా, గలీజు రాజకీయాలు చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రహస్య ప్రదేశంలో విలీన ప్రక్రియ పిటిషన్ తీసుకొని, మూడు గంటల్లోనే ప్రక్రియను ముగించారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా దళితుడు ఉండొద్దా అని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతో అనైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న భ్రష్టు రాజకీయాలను తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. గురువారం రాత్రి విలీన ప్రక్రియకు సంబంధించి బులెటిన్ వెలువడిన అనంతరం ఆయన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలతో కలసి గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని చూడటం నీచమన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎంత తొక్కితే అంతగా బలపడతామని, చరిత్ర ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నటికైనా టీఆర్ఎస్ను గద్దె దించేది కాంగ్రెస్ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టిన స్పీకర్... ఫిరాయింపు ఎమ్మెల్యేలు విలీన లేఖ ఇచ్చిన గంటల్లోనే సానుకూల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఉదయం నుంచి స్పీకర్‌ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. కాంట్రాక్టుల సొమ్ము చెల్లిస్తామని ఉపేందర్‌రెడ్డిని, రూ. 26 కోట్ల పరిహారం ఇస్తామని హర్షవర్ధన్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్న టీఆర్ఎస్... రోహిత్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి పార్టీలోకి రప్పించుకుందని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న అక్రమాలను శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నించ కూడదని ఫిరాయింపులు చేస్తున్నారా లేక కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు పంచాయితీ వస్తే ఎమ్మెల్యేలు హరీశ్ దగ్గరకు వెళ్తారన్న భయంతో ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ విలీన ప్రక్రియపై హైకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ వెలువడే తీర్పునుబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలు జరిగాయో రుజువులతో సహా అక్కడే నిరూపిస్తామన్నారు. విలీన ప్రక్రియకు నిరసనగా ఈ నెల 8న ఇందిరా చౌక్‌లో భట్టి విక్రమార్క నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ పేరుతో 36 గంటలపాటు దీక్ష చేస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: భట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం నేరమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని, ఒకవేళ పార్టీ మారితే వారిని అనర్హులుగా ప్రకటించాలి తప్ప పార్టీ మారిన వారి నుంచే విలీనపత్రం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విధానం యావత్ దేశం పాకితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమయం ఇవ్వకుండా, అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని స్పీకర్ ఆదేశించడం దారుణమన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడానికే విలీనం చేశారని దుయ్యబట్టారు. -
అక్రమం, అన్యాయం, అప్రజాస్వామికం...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని అధికార టీఆర్ఎస్లో విలీనం ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. అప్రజా స్వామికంగా, అనైతికంగా, అక్రమ పద్ధతుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోం దంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి వినతిపత్రం ఇవ్వడంతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నిరసనలకు దిగింది. తమ పార్టీ ఇచ్చిన లేఖను ఆమోదించరాదని, ఇప్పటికే తాము పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన లేఖపై స్పందించాలని కోరేందుకు స్పీకర్ కార్యాలయాన్ని సంప్రదించినా బదులు రాకపోవడంతో సీనియర్ నేతలు అసెంబ్లీ సాక్షిగా నిరసనకు దిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నినదించారు. పాదయాత్రగా ప్రగతి భవన్‌కు వెళ్లాలని నిర్ణయించడంతో పోలీసులు అసెంబ్లీ ముందు బైఠాయించిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా విలీనంపై నిర్ణయమా? తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియ కోసం లేఖ ఇస్తున్నారని తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది తెలపడంతో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఫోన్లో సూచించారు. అలాగే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఇచ్చిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఫిరాయింపు ఎమ్మెలేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని మీడియా ముందు డిమాండ్ చేశారు. మమ్మల్ని కలిసేందుకు స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగారు. విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. అసెంబ్లీ ముందు కాంగ్రెస్ నిరసన.. అప్రజాస్వామికంగా సీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి నిరసనకు దిగారు. గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని భట్టి భావించినా అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు అసెంబ్లీ గేటుకు ఎదురుగా రోడ్డుపై కూర్చొని నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. రెండు గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలుపొంది సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు వేయాలని నేతలు డిమాండ్ చేశారు. వారికి మరికొంత మంది కాంగ్రెస్ నేతలు జతకావడంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయా నేతలు సీఎం తీరును నిరసిస్తూ ప్రగతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఆ కసరత్తు జరుగుతుండగానే అప్రమత్తమైన పోలీసులు... ఉత్తమ్, భట్టి, షబ్బీర్, శ్రీధర్‌బాబు, మల్లు రవి, అంజన్, ఇతర నేతలను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు: ఉత్తమ్ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీనే నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని మర్చిపోయి, జాతీయ పార్టీని విలీనం చేయాలనుకోవడం దుర్గార్గమని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ఎల్పీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎంను నిలబెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆశ చూపి, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పద్ధతులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. అత్యంత అప్రజాస్వామికంగా, అనైతికంగా సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విపరీత చర్యల కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం దాపురించిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనలకు పీసీసీ పిలుపు... తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులు చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ వ్యబిచారం చేస్తోందని టీపీసీసీ దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దిగజారుడు రాజకీయాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరింది. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సూచించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని, అక్రమ అరెస్టులను ఖండించాలని కోరింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విచ్చలవిడితనంపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు స్పందించాలని విన్నవించింది. -
అలాగైతే ప్రలోభాలకు గురిచేస్తారు: ఉత్తమ్
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈసీని కలిసిన అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికకు 40 రోజుల గడువు పెడితే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని, అలా చేయవద్దని కోరినట్లు చెప్పారు. ఫలితాలు వచ్చిన 3 రోజుల్లో చైర్మన్ల ఎంపిక జరిగేటట్లు చూడాలని కోరామన్నారు. బ్లాక్ మనీ, పోలీసులను ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను అప్రజాస్వామిక పద్ధతిలో ఇదివరకే చేర్చుకున్నారని ఆరోపించారు. మే 27న కౌంటింగ్ చేసి 3 రోజుల్లో చైర్మన్ల ఎంపిక చేసి జూలై5 తర్వాత ఛార్జ్ తీసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు. చట్టాలంటే కేసీఆర్‌కు గౌరవం లేదు: ఎల్ రమణ(టీటీడీపీ అధ్యక్షులు) చట్టాల పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మన్ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఫలితాల తర్వాత చైర్మన్ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల 538 ఎంపీపీలు, 28 జెడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్సే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం కూనీ: షబ్బీర్ అలీ కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నారని మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిగా కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. -
పీక్లానాయక్ తండాలో ఉద్రిక్తత
-
పీక్లానాయక్ తండాలో ఉద్రిక్తత
సూర్యాపేట: చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీక్లానాయక్ తండాలో పాల్గొన్నారు. ఉత్తమ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణం మారిపోయింది. ప్రతీకారంగా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ వర్గ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. పరస్పర దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. -
అవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెండు విషయాలపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. కనీస పరిపాలనా సమర్థత కేసీఆర్‌కు లేదని విమర్శించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వ్యాక్యానించారు. అందరికీ న్యాయం జరిగేలా మరోసారి ఫలితాలు పున: సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, కారకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. వెంటనే భర్తరఫ్ చేయాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌తో సంబంధం లేకుండా సీఎల్పీ విలీనం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ను నిన్న గాక మొన్న పుట్టిన టీఆర్ఎస్లో విలీనమా...సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కోట్లు పెట్టి, పదవులు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం: భట్టి గవర్నర్ ను కలిసిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందని అన్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని భట్టి అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెను సవాల్ విసిరారని భట్టి అన్నారు. కేసీఆర్ ఆగడాలు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే ఫిరాయింపు చట్టాన్ని వర్తింపచేయలని భట్టి చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. -
80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్
-
80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దాదాపు 80 సీట్లతో ప్రజా కూటమి ఈ నెల 12న ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. గోల్కొండ హోటల్లో కూటమి నేతలతో కలిసి మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్‌పై ప్రచారం చేసుకుంటున్నారు.. విజయంపై మాకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా క్షమాపణలు చెప్పారని అన్నారు. ఓట్ల లెక్కింపులో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనేక మంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఓటరు లిస్టులను సరి చేయకుండా ఎన్నికలు ఇంత త్వరగా నిర్వహించడాన్ని తప్పుపట్టారు. టీఆర్ఎస్ 35కు మించి రావని చెప్పారు. నాలుగున్నరేళ్లు ప్రజల్ని మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నారని వ్యాక్యానించారు. మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ప్రజలకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. కూటమి బాగా పనిచేసిందని కొనియాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గడ్డం ఎప్పుడు తీసున్నారని విలేకరులు ప్రశ్నించగా..తీసే సమయం వచ్చిందని చమత్కరించారు. జమిలి ఎన్నికలు అని చెప్పిన కేసీఆర్ ముందే ఎన్నికలకు పోవడానికి కారణమేంటో చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. ప్రజల గొంతుకను కేసీఆర్ నొక్కే ప్రయత్నం చేశారని రమణ విమర్శించారు. కూటమితో ప్రజల గొంతుకను వినిపించామన్నారు. వంశీచంద్ రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంశీచంద్ రెడ్డికి పరామర్శ అంతకు ముందు బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తిలో మా అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ గూండాలు పాశవికంగా దాడి చేశారని చెప్పారు. వంశీ చంద్ గాయాల నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. ఏది ఏమైనా తమకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాల సర్వే అంతా అబద్ధమని వ్యాఖ్యానించారు. తను కూడా వ్యక్తిగతంగా సర్వేలను నమ్మటం లేదని ఇండియాటుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తనతో చెప్పటమే కాదు, ట్వీట్ కూడా చేశారని వెల్లడించారు. -
‘కేసీఆర్ ఫ్యామిలీని 10 కిలోమీటర్ల లోతుకు తొక్కాలి’
హైదరాబాద్: ప్రజాస్వామ్యం, ఫ్రీడం ఆఫ్ ప్రెస్ స్వాతంత్ర్యానంతరం మన దేశంలో తప్ప ఎక్కడా లేదు కానీ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణచివేత మొదలైందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాక్యానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ..వరంగల్ సభలో సీఎం కేసీఆర్ చిల్లరగా మీడియాను 10 కిలోమీటర్ల లోతుకు తొక్కుతా అన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు మీడియాకు అవకాశం వచ్చిందని, కేసీఆర్ కుటుంబాన్ని 10 కిలోమీటర్ల లోతుకు తొక్కేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీడియా యాజమాన్యాలకు ఫోన్ చేసి వార్తలు ఇలా రావాలి అలా రావాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం, మంత్రులు ఎప్పుడైనా అలా చేశారా అని ప్రశ్నించారు. మమ్మల్ని కేసీఆర్ తిడితే బ్యానర్లు పెట్టారని, అదే తాము తిడితే మీడియా అసలు పట్టించుకోలేదని చెప్పారు. మీడియా సంస్థల యాజమాన్యాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ అందరినీ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నువ్వూ, నీ కుమారుడు, నీ బిడ్డనే తెలంగాణా వాళ్లా? మిగిలిన వాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎవరిని అడిగి రూ.వందల కోట్లతో ఇళ్లు కట్టావు..ఖరీదైన కార్లలో తిరుగుతున్నావని సూటిగా అడిగారు. సోనియా గాంధీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబం మీ కంటే ఎంతో సాధాసీదాగా బతుకుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్నా ప్రధాని కాలేదు..ఇందిరా, రాజీవ్‌లు ఎలా చనిపోయారు తెలుసుగా..అలాంటి కుటుంబంపై కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు. ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మండలస్థాయి రిపోర్టర్ నుంచి ప్రతి జర్నలిస్టుకు అన్నిరకాల మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఘోరీ కట్టే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
రేపు కాంగ్రెస్ జాబితాను విడుదల చేస్తాం
-
ఆ జాబితా నిజం కాదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని, జాబితాపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం కాలేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ న్యూస్ ఛానల్స్, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తోన్న జాబితాలు నిజం కాదని, ఇంకా ఎటువంటి జాబితా సిద్ధం కాలేదని ఉత్తమ్ వెల్లడించారు. ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని, అవి ఊహాజనీతం, కల్పితం మాత్రమేనని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు(శుక్రవారం) విడుదల చేస్తామని వివరించారు. అధికారికంగా జాబితా విడుదల అయ్యే వరకు ఎలాంటి జాబితాలు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని ఉత్తమ్ వ్యాక్యానించారు. -
ప్రైవేటు విద్యాసంస్థల మూత కేసీఆర్ ఘనతే
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనత కారణంగానే తెలంగాణాలో ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సాధన, టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్ సీఎం అవ్వటంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఏర్పాటు ముందు ఒకలా ఏర్పాటు తర్వాత మరోలా అందరినీ దూరం పెట్టారని విమర్శించారు. చిన్న చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసి ఆదుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడాల్సింది పోయి అవమానపరిచి నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. కోళ్ల ఫారాలలో విద్యాసంస్థలు నడుపుతారా అని కేసీఆర్ శాసనసభలో నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. పోలీసుల సోదాలతో వేధించారని, మీ భార్యలు కూడా మీకు ఓటెయ్యరని కేటీఆర్‌ను అవమానించారని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడతామని హామీ ఇస్తున్నామని, ఏ ఏడాది కా ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు విద్యాసంస్థల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రమాద బీమా, గృహ వసతి కల్పిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యుత్ ఛార్జీలు డొమెస్టిక్ కింద మార్చుతామని తెలిపారు. బడ్జెట్ వీళ్ల అబ్బ సొమ్ముగా జేబుల నుంచి తీసి ఇస్తున్నట్లు దుర్మార్గంగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో విశ్వ విద్యాలయాలను పెద్ద ఎత్తున నిధులతో బలోపేతం చేసి గ్లోబల్ యూనివర్సిటీలుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేలా 100 రోజుల్లో 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. -
కేసీఆర్‌ని బట్టేబాజ్ అని బరాబర్ అంటాం: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని బట్టేబాజ్ అని బరాబర్ అంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నిరాహార దీక్ష చేసే సమయంలో కేసీఆర్ కేవలం గడ్డం మాత్రమే పెంచుకున్నాడని, నిమ్స్ ఆసుపత్రి ఇచ్చిన నివేదిక చూస్తే కేసీఆర్ బాగోతం బయటపడుతుందని వెల్లడించారు. అవసరం లేకపోయినా ప్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఆరోపించారు. ఇలాంటి దొంగ దీక్షలు చేసి తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేందుకు సిగ్గూ శరం ఉండాలని ధ్వజమెత్తారు. నిజామాబాద్ సభలో తన గురించి అడ్డగోలుగా మాట్లాడాడని విమర్శించారు. తాను దేశం కోసం సరిహద్దులో పైలట్‌గా పనిచేస్తే... కేసీఆర్ మాత్రం దుబాయికి దొంగ పాసుపోర్టుల ఏజెంట్‌గా పనిచేశాడని ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పటి ఎంపీ ఎమ్మెస్సార్ విడిపించాడని గుర్తు చేశారు. తనకు పిల్లలు లేరని.. ప్రజలే తమ వారసులు ఉత్తమ్ పేర్కొన్నారు. సిగ్గూ లజ్జ లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్నేని తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ నాయకుల జయంతి రోజున వారికి పూలమాల వేసే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదన్న కేసీఆర్, మహా కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ముదనష్టపు కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. -
సీట్లపై చర్చ జరగలేదు: ఉత్తమ్
హైదరాబాద్: ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్ అజెండా ఫైనల్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మ్యానిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని అన్నారు. వివిధ పార్టీలకు వివిధ మ్యానిఫెస్టోలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా కామన్ అజెండా ఉంటుందని వెల్లడించారు. ఈ కూటమి మహాకూటమి కాదని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. బీజేపీతో వెళతారన్న ప్రశ్నకి కోదండరాం సమాధానం దాటవేశారు. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అజెండా అమలు చేస్తామని వివరించారు. కోడ్ అమలులో ఉండగా మంత్రులు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఒక అవగాహనకు రాకుండా ఏ పార్టీ వాళ్లు ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారు..అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని విమర్శించారు. నష్టపోయిన అన్ని వర్గాల వారికి మ్యానిఫెస్టోలో న్యాయం చేస్తామని అన్నారు. తమది గ్రాండ్ అలయన్స్ అన వ్యాఖ్యానంచారు. -
సీట్ల కేటాయింపు పై ఎలంటి చర్చా జరగలేదు
-
60 రోజులు కష్టపడితే అధికారం మనదే
సాక్షి, హైదరాబాద్: రాబోయే రెండు నెలలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక సమయమని, ఈ 60 రోజుల పాటు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో అధికారం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని.. వచ్చే ప్రభుత్వంలో వారిని తగిన విధంగా గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఫేస్బుక్ లైవ్, టెలి కాన్ఫరెన్స్‌లో దాదాపు లక్ష మందితో 3 గంటల పాటు ఆయన ప్రసంగించారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, వారి కష్టంతోనే కాంగ్రెస్ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదిగిందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, తనకున్న సమాచారం మేరకు అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్.. నవంబర్ చివర్లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. డిసెంబర్లో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25 ఓటర్ల జాబితా నమోదుకు, మార్పులు, పరిశీలనకు చివరి తేదీ కాబట్టి ప్రతీ కార్యకర్త ఓటర్ జాబితాను పరిశీలించాలని, పేర్లు లేని వారు కచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే 26 నుంచి ఈవీఎంల పరిశీలన కూడా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలను పరిశీలించి ఎలాంటి అనుమానాలున్నా, అక్కడే నివృత్తి చేసుకోవాలని సూచించారు. త్యాగాలు వారివి.. భోగాలు వీరివి యువకులు, సబ్బండ వర్ణాల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందని ఉత్తమ్ ఆరోపించారు. యువకులు త్యాగాలు చేస్తే కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవించిందని వ్యాఖ్యానించారు. విలాసవంతంగా నిర్మించిన ప్రగతిభవన్‌కే పరిమితమైన కేసీఆర్.. సచివాలయానికి రాకుండా రెండేళ్ల పాటు గడీలోనే పాలన సాగించారని విమర్శించారు. డబుల్ బెడ్రూం, దళితులు, గిరిజనులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, వివిధ వర్గాలకు రిజర్వేషన్లు లాంటి అనేక హామీల్లో కేసీఆర్ ఏ ఒక్క దానిని నెరవేర్చలేదని ఆరోపించారు. ఇంటింటికీ మంచి నీరు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ 8 నెలల ముందే పాలన చేతగాక తప్పుకున్నారని దుయ్యబట్టారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఉత్తమ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని హామీనిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర, యువకులకు లక్ష ఉద్యోగాలు మొదటి ఏడాదిలో కల్పిస్తామని చెప్పారు. అలాగే 10 లక్షల మంది యువకులకు నిరుద్యోగ భృతి, పేదలకు ఉచిత సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర వస్తువులు, 6 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల నగదును రెట్టింపు చేస్తామని, 7 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహిస్తామని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఉత్తమ్ భరోసానిచ్చారు. -
టికెట్లు అమ్ముకునే వాళ్లా షోకాజ్లిచ్చేది?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొందరు సొంత ప్రయోజనాలు, స్వార్థం కోసం తమ లాంటి యువకులను, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని బలిచేస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తనను చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో ఒకటి చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే వారితో షోకాజ్ నోటీసులు పంపుతారా? అని నిలదీశారు. ‘పార్టీలో పోస్టులు అమ్ముకుంటారు. కమిటీలు వేసేందుకు డబ్బులు తీసుకుంటారు. టికెట్లు అమ్ముకుంటారు. పక్క పార్టీలతో కుమ్మక్కవుతారు. అలాంటి వాళ్లా నాకు షోకాజ్ నోటీసులిచ్చేది’అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు ఏమిటో తెలియని వారు నాకు నోటీసులిస్తారా? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని గుర్తించకుండా రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటారా? అని ప్రశ్నలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు పార్టీ కమిటీలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసేందుకుగల కారణాలను వివరించారు. కేసీఆర్‌ను తిడితేనే పదవులా? పార్టీలో అంతర్గతంగా మాట్లాడి సూచనలు చేస్తే పట్టించుకోరని, బలంగా ఏదైనా చెబితే పక్కనపెడతారని, అందుకనే బహిరంగంగా మట్లాడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం ఆవేదనతో కూడినవేనని చెప్పారు. తన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో పార్టీ సీనియర్లు గుండెలపై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేస్తామని, తమ లాంటి యువ నాయకులను, కేసీఆర్‌పై గట్టిగా కొట్లాడుతున్న వారిని ముందు పెట్టాలని అడిగడం తప్పేనా? అని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు తమను బలంగా కోరుకుటంన్నారని, అది మరచిపోయి అనర్హులు, పార్టీ మారిన వారు, జైళ్లకు పోయిన వారిని కమిటీల్లో నియమించారని దుయ్యబట్టారు. కమిటీలో కేవలం 25 శాతం మందే అర్హులున్నారని, మిగతా వారంతా అనర్హులేనన్నారు. బూతు పురాణం మాట్లాడితే, కేసీఆర్‌ను తిడితేనా పదవులు ఇస్తారా? అని అడిగారు. రాష్ట్రంలో బలంగా టీఆర్ఎస్ వ్యతిరేక వపనాలు వీస్తున్నాయని, ఈ సమయంలో సత్తా ఉన్న నేతలను ముందుపెట్టాలని కోరారు. ‘మీరే ముఖ్యమంత్రులు, మంత్రులు అవ్వండి. మాకెలాంటి పదవులు వద్దు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. కానీ మాలాంటి యువకులను ప్రోత్సహించండి. మా సేవలు వాడుకోండి. మంచి వాళ్లకు టికెట్లివ్వండి’అని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. పార్టీ నిద్రపోతోంది... కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందని, అయితే పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లోనూ సమన్వయం లేకనే పార్టీ ఓడిందన్నారు. పార్టీలో అందరూ ముఖ్యమంత్రి, మంత్రులు కావాలని కోరుకుంటున్న వారు తప్పితే కష్టపడ్డ వారిని ప్రోత్సహించే ఆలోచన ఎవరిలోనూ లేదన్నారు. టీఆర్ఎస్లో చేరిన కె.ఆర్. సురేశ్‌రెడ్డి పేరు పార్టీ కమిటీల్లో ఉందంటేనే పార్టీ నిద్రపోతోందని అర్థమవుతోందని, కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారని, కమిటీలు ఇష్టారీతిగా నియమించారని ఆరోపించారు. ఎన్నికల కమిటీలో 41 మంది ఏమిటని, అంత మంది ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా కమిటీని 9 మందికి కుదించాలన్నారు. ఎన్నికల హామీలన్నీ ఉత్తమ్ చెప్పేశాక మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల చొప్పున రుణ మాఫీ, అందరికీ సన్న బియ్యం, ఉద్యోగాలు, పింఛన్లు పెంపు తదితర హామీలను ప్రకటించాక మెనిఫెస్టో కమిటీ ఏం చేస్తుందన్నారు. వ్యతిరేక శక్తులను ఉత్తమ్ తయారు చేశారు ... పార్టీ నుంచి తనను బయటకు పంపే ఆలోచన రాష్ట్ర ఇన్చార్జి కుంతియాకుగానీ, అధిష్టానానికి కానీ లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులే బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము, ధైర్యం స్వార్ధపరులకు లేదన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో తనకు వ్యతిరేక శక్తులుగా కొందరిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తయారు చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు చెబితే బయటకు పంపి మీ కళ్లను మీరే పొడుచుకుంటారా..? అని ప్రశ్నించారు. తనలాంటి వారిని బయటకు పంపితే పార్టీకే నష్టమన్నారు. సీనియర్ నేతలను సమన్వయం చేయడంలో కుంతియా విఫలమవుతున్నారని, తనలాంటి యువకుల సూచనలు వినకుండా ఉత్తమ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. దీనిపై హైకమాండ్ ఆలోచించాలన్నారు. పార్టీలో కోవర్టులున్నారు... కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని రాజగోపాల్‌రెడ్డి మరో బాంబు పేల్చారు. ఎదుటి పార్టీ అభ్యర్థిపై బలహీన వ్యక్తలను రంగంలోకి దింపే ప్రయత్నాలను కోవర్టులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గత ఎన్నికల్లో పార్టీని ఓడించారని, ఇప్పుడూ అదే చేయబోతున్నారన్నారు. తాను పార్టీ మారబోతున్నానన్నది ప్రచారమేనని, తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవి ఉందని, అయితే పార్టీ పోటీ చేయమంటేనే మునుగోడు నుంచి చేస్తానని లేదంటే చేయనన్నారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై లేఖ రూపంలో వివరణ ఇస్తానని, దానిపై పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. -
గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు
నిజామాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసుకోకపోతే ఆయనే సన్నాసుల్లో కలిసిపోతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నగరంలో బుధవారం మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..గడ్డం ఉన్న ప్రతీ ఒక్కరూ గబ్బర్ సింగ్‌లు అయిపోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దింపాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా లేక రైతులకు రుణ మాఫీ చేస్తున్నందుకా లేక రైతు బంధు పెట్టుబడులు ఇచ్చినందుకా అని ప్రశ్నించారు. 60 ఏండ్ల దరిద్రం నాలుగేళ్లలో పోతుందా అని సూటిగా అడిగారు. మా అధిష్టానం ఢిల్లీ ఉండదు..గల్లీలో ఉంటుందని అన్నారు. విజయవాడ వెళ్లి చంద్రబాబు కాళ్లపై మోకరిల్లే వారితో తెలంగాణ అభివృద్ధి సాధ్యమా లేక టీఆర్ఎస్తో సాధ్యమా ప్రజలు ఆలోచించాలన్నారు. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్ సర్కార్‌పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ అధికారంలోకి వస్తే ఒకటే సారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారు..మరి కర్ణాటకలో నాలుగు దశల్లో ఎందుకో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద విమానాశ్రమ ఏర్పాటు, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
యుద్ధవిమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం?
హైదరాబాద్: రాఫెల్ ఫ్రెంచ్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వీటి కొనుగోళ్లలో అనేక అనుమానాలున్నాయని అన్నారు. తాను కూడా ఓ పైలట్‌నేనని, యుద్ధ విమానంలో ట్రైనర్‌ని అని, చైనా, పాకిస్తాన్ సరిహద్దులో కూడా పనిచేశానని వ్యాఖ్యానించారు. యుద్ధ విమాన పరికరాల ధరలు తెలపడం వల్ల దేశభద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని తెలిపారు. ప్రధాన మంత్రి , రక్షణ శాఖా మంత్రి ధరలు సీక్రెట్ అని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఆపరేషన్ వివరాలు మాత్రమే సీక్రెట్ ఉండాలని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ధరపై స్పష్టత ఇచ్చినట్లే మిగతా వాటి వివరాలు కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో యుద్ధ సామగ్రి కొనుగోలు చేసేటప్పుడు సీక్రెట్ మెయింటేన్ చేయలేదని..మరి ఇప్పుడు అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనిల్ అంబానీకి ట్రాన్స్పర్ చేయడంలో మతలబు ఏమిటి..? అనిల్ అంబానీ ఎప్పుడు డిఫెన్స్ సామగ్రి విభాగంలో లేడు..హెచ్ఏఎల్ కంపెనీతో నరేంద్ర మోదీ ప్రధాని కాకముందే నుంచే ఒప్పంద ఉంది..అయినా సరే హెచ్ఏఎల్ కంపెనీని కాదని అనిల్ అంబానీ కంపెనీకి ఇవ్వడం వెనక మతలబేంటని ప్రశ్నించారు. -
రాబంధుల్లాగా దోచుకుంటున్నారు
హైదరాబాద్ : నెరేళ్ల సంఘటన జరిగిన ఏడాది కావస్తున్న సందర్భంలో బాధితులతో కలిసి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ పోయిన ఏడాది జూలైలో సిరిసిల్లలో ఇసుక లారీ కింద పడి గిరిజనుడు చనిపోతే..నిరసన తెలియజేయడానికి వచ్చిన దళితులను పోలీసులు థర్డ్ డిగ్రీతో వేధించారు. ఎంత మంది చనిపోయినా కూడా మా అక్రమ సంపాదన మాదే అన్నట్లు కల్వకుంట్ల కుటుంబం తయారైంది. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు రాబంధుల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పోయిన జూలై తర్వాత మరలా అనేక మంది ఇసుక లారీల కింద పడి చనిపోయారు. ఎంత మంది చచ్చినా మాకు అక్కర్లేదు అన్నట్లు కేసీఆర్ కుటుంబం ప్రవర్తిస్తున్నది. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోగపోగా..బాధితులపై ఒత్తిడి తేవడం, వారికే లంచాలు ఇవ్వడం లాంటివి ప్రభుత్వం చేస్తుంది’ అని ఆరోపించారు. ‘కేసీఆర్ కుమారుడు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బాగా ప్రమేయం ఉన్న ఎస్పీకి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ వెయ్యలేదు. కేసు డ్రాప్ కూడా చెయ్యలేదు. మీ కాలం దగ్గర పడ్డది కాబట్టే.. మీ చేష్టలు ఇలా ఉన్నాయి. నేరేళ్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ ఆదుకుంటుంది. హైకోర్టులో కూడా వీళ్లపై కేసు పెండింగ్‌లో ఉంది. అక్కడ కూడా వీరికి న్యాయం జరగడం లేదు. ఏడాది తర్వాత కూడా న్యాయం జరగలేదు అని చెప్పడానికి మా ప్రయత్నం చేస్తున్నామని’ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నేరేళ్ల బాధితులు మాకు కాంగ్రెస్ వల్ల కొంచెం న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. అక్కడ తిరుగుతున్న లారీలన్నీ కేసీఆర్ కుటుంబానికి చెందినవే. ఎంత మంది చచ్చిపోయినా కనీసం లారీ డ్రైవర్లు, ఓనర్ల మీద కేసు పెట్టడం లేదు. షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. ఆ సమయంలో బెటాలియన్ మొత్తం అక్కడే ఉంది. ఎస్పీ, పశువులాగా ప్రవర్తించాడు. ఇదంతా చేయించింది కేటీఆరే. బానయ్య, మాజీ సర్పంచ్ పోలీసు శాఖలోకి వెళ్దామనుకున్నా..పోలీసుల తీరు చూసి సిగ్గేస్తోంది. దేనికీ పనికి రాకుండా కొట్టారు. మేము టెర్రరిస్టులం కాదు. ఏడాది గడిచినా కూడా మాకు న్యాయం జరగలేదు. - హరీష్ -
కేసీఆర్‌దే కపటప్రేమ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ దీటైన కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిందించే అర్హత కేసీఆర్‌కు లేదని, బీసీలపై టీఆర్ఎస్దే కపట ప్రేమ అని ఆరోపించింది. తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ బట్టకాల్చి మా మీద వేసి మమ్మల్ని బదనాం చేయాలనే దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడింది. నిజంగా సీఎం కేసీఆర్‌కు బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తాము బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తాము కోర్టులో కేసు వేశామని చెప్పడం శుద్ధ అబద్ధమని, అసలు ఆ కేసులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడగా.. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 52 శాతం పెట్టాల్సింది: దాసోజు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేసీఆర్‌కు ఇష్టం లేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ‘1999లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టి చట్టాన్ని ఆమోదిస్తే 2018లోనూ ఇదే శాతాన్ని పెట్టడం వెనుక ఔచిత్యం ఏంటి? శాస్త్రీయ పద్ధతి కాకుండా పాత చట్టాన్ని కాపీ చేయడం ఏ మేరకు న్యాయం? జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అనేక వేదికల మీద విజ్ఞప్తి చేశాం. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలున్నారని చెప్పి 34 శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టంలో ఏ ప్రాతిపదికన పెట్టారు? అంటే మిగిలిన 18 శాతం మందికి రిజర్వేషన్లు అవసరం లేదని అనుకుంటున్నారా?’అని మండిపడ్డారు. ‘ఈ విషయంలో బీసీ ప్రజలు, కుల సంఘాలు లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి ఉంది. 34 శాతం ఎలా ఇచ్చారో కొట్లాడాలి. పోరాటం చేయాలి. బీసీ కులాల వర్గీకరణ జరిగితే ముస్లింలు కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలయ్యే అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. ‘స్వప్నారెడ్డి అనే వ్యక్తి కేసు వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. స్వప్నారెడ్డి అంటే కాంగ్రెస్ వ్యక్తి అంటున్నారు. మరి గోపాల్‌రెడ్డి ఎవరు? నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని గున్యాగుల ఎంపీటీసీనా కాదా.. ఆయన టీఆర్ఎస్ సభ్యుడా కాదా చెప్పాలి. మరి మీ సభ్యుడు కేసు ఎలా వేశారు.. మీరేమైనా వేయమని చెప్పారా?’అని ప్రశ్నించారు. కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదు: షబ్బీర్, పొంగులేటి కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదని షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘2013 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 50 శాతం నిబంధనను పక్కనపెట్టి 61 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ పక్షాన ఎందుకు హాజరు కాలేదు. నేను చెప్పిందే చట్టం అని కేసీఆర్ అనుకుంటున్నందునే ఈ సమస్య. ఇప్పటికైనా ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి’అని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌వి బోగస్ మాటలు: ఉత్తమ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు’అని ఉత్తమ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిజర్వేషన్లపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎవరో హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరఫున సరిగా వాదనలు వినిపించలేక తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి చర్చ లేకుండా పంచాయతీరాజ్ చట్టం బిల్లు ఆమోదింపజేసుకున్నారు. చర్చ జరిగి ఉంటే బాగుండేది. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ముఖేశ్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్‌తో టీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు భేటీ అయ్యారు. ముఖేష్‌గౌడ్ నివాసంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మైనంపల్లి హన్మంతరావు, ముఖేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మైనంపల్లి హన్మంతరావు రహస్య చర్చలు జరిపారని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన జాంబాగ్‌లోని ముఖేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ భవన్లో మాట్లాడుకుందాం రమ్మంటూ ఆహ్వానించి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ముఖేశ్ గౌడ్ ఇదివరకే మీడియాకు కూడా తెలిపారు. దాని తర్వాత మైనంపల్లి వచ్చి ప్రత్యేకంగా భేటీ కావడంతో ముఖేశ్ గౌడ్ పార్టీ మారతారనే చర్చ ఊపందుకుంది. కొంతకాలంగా గాంధీభవన్‌లో జరిగే సమావేశాలకు కూడా ముఖేశ్ గౌడ్, ఆయన కుమారుడు హాజరుకావడం లేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు కూడా తండ్రీకుమారులు గైర్హాజరు కావడంతో పార్టీ మారతారనే అనుమానం రెట్టింపైంది. -
కేసీఆర్‌పై మండిపడ్డ పీసీసీ చీఫ్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..రైతు బంధు పథకంపై దేశ వ్యాప్తంగా ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల ప్రచారంతో తెలంగాణ రైతుల సొమ్మును దుబారా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘ నాలుగేళ్లలో 4 వేల మంది ఆత్మహత్య చేసుకున్నా రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు లేవు. మద్దతు ధరకు బోనస్ ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం. వడగళ్ల వాన, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోలేక పోయిన ప్రభుత్వం . రైతులను టీఆరెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని విమర్శించారు. ‘ కేంద్రం ఇచ్చిన పంట నష్ట పరిహారం నిధులు వేరే వాటికి మళ్లించారు . మిర్చి రైతులకు బేడీలు వేశారు . ఎకరాకు 4వేలతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి. 25 శాతం అదనంగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపడం కాదు. రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇవ్వాలి. రూ.4 వేల ఇన్ పుట్ సబ్సిడీ మొదటి మూడేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల కోసమే ఈ ఏడాది ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారు . పంట బీమా పథకం మూలన పడేశారు. తెలంగాణ రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు . కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర అందిస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 70 శాతం కౌలు రైతులేనని తెలిపారు. కౌలు రైతులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. రైతు బంధు పథకం అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాదా బైనమా, ఆలయ భూములకు, అటవీ భూములకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ కిసాన్దళ్ అధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ..భూదాన్ భూములు, సీలింగ్ భూముల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కల్తీ విత్తనాలను ప్రభుత్వం అదుపు చేయలేక పోతుందని, కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో తన కుటుంబానికి సంబంధించిన భూములకు రైతు బంధు పథకం కింద సొమ్మును తీసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం నుంచి 140 టీఎంసీల నీళ్లు మూడు పంటలకు ఎలా ఇస్తారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. -
27న ఓయూకు రాహుల్ గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 27న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం. అదే విధంగా ఈనెల 28న వరంగల్ లో రాహుల్ సభ ఉంటుందన్నారు. దాంతో పాటు అదే జిల్లాలోని భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో ముఖాముఖి ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఓయూకు రావాలిన కోరిన వారిలో వర్సిటీ జేఏసీ నేతలు కూడా ఉన్నారు.