varalakshmi vratham
-
Varalakshmi Vratham: లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న నేటి వర మహాలక్ష్ములు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో పోటెత్తిన ఆలయాలు ... భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు (ఫోటోలు)
-
పూల ధరలకు రెక్కలు
-
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
వరలక్ష్మి పూజలో తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)
-
తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరు(తిరుపతి జిల్లా): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సహస్రనామార్చన, నిత్యార్చన, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించిన ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అషో్టత్తర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హారతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి రథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
వరలక్ష్మీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజా విధానమేంటి?
Varalakshmi Vratham 2023: శ్రావణమాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’అంటే శ్రేష్ఠమైంది అని అర్థం వస్తుంది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం విశేషాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు. అది శ్రేష్టం కూడా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా వివరించారు. వరలక్ష్మీ వ్రత కథ : కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది.స్వామీ! ప్రీలు సుఖసౌఖ్యాలను, పుత్రపొత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. పరమేశ్వరుడు సమాధానమిస్తూ 'స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయ్యాక వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు. పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూచుకుంటూ ఉందేది. గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉందేది. చారుమతి సద్దుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది. చారుమతీ! నీ సత్ప్రవర్తనకు, సద్ద్గుణాలకు ప్రసన్నురాలిని అయ్యాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు. అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా ప్రీలందరూ వేకువ రూమననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది. ఆనాటి నుంచి ఆనవాయితీగా.. శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం 'ప్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు. వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి. వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన 'బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. -
ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు (ఫొటోలు)
-
వరలక్ష్మీ వ్రతం.. బంగారం కొనుగోలుకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం
-
దీపికా పాటిల్ నిజంగా ధైర్యే సాహసే లక్ష్మి!
సాక్షి , విజయనగరం: సమస్త ప్రకృతినీ స్త్రీ మూర్తిగా ఆరాధించే సంప్రదాయం భారతీయులది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ ఉత్తమ సమాజం పరిఢవిల్లుతుంది. అందుకు భిన్నంగా కొందరు కామాంధులు మహిళలు, యువతులు, చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పైశాచిక వ్యక్తుల పీచమణచడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘దిశ’ చట్టంతో నాంది పలికింది. మహిళా ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది. మౌనరోదన వీడి మనోధైర్యంతో దిశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ లేదా స్పీడ్ డెయిల్తో సమాచారం ఇస్తే చాలు తగిన రక్షణ కల్పిస్తామని ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. శ్రావణ శుక్రవారంతో మహిళలు చైత న్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళా లోకానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘దిశ’పై బస్సుల్లో ప్రత్యేక వీడియో ప్రదర్శన... దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పించడానికి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. ఆండ్రాయి డ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి బస్సులు ఏర్పాటు చేశాం. అవి పోలీస్ శాఖకు సంబంధించినవి. సాధారణ ప్రయాణానికి వీలుకావు. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడాం. ఎంపిక చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తూ ప్రయాణికులకు దిశ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. విజయనగరం నుంచి ప్రతిరోజూ 165 వరకూ బస్సులు దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వాటిలో ఉండే టీవీల్లో ‘దిశ’పై ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఫిల్మ్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశాం. ఢిల్లీలో బస్సులో వెళ్తున్న యువతిపైన, పొరుగు రాష్ట్రంలో మహిళా డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యాల వంటివి చెక్ చెప్పేందుకు ఏపీ సర్కారు దిశ చట్టానికి అంకురార్పణ చేసింది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థినులకు దిశచట్టం, యాప్ వినియోగంపై చైతన్యం చేస్తున్నాం. మందుబాబుల ఆటకట్టు... జిల్లాలో మహిళలపై జరిగిన నేరాలను పరిశీలిస్తే ఎక్కువ అఘాయిత్యాలు మామిడి తోటలు, నగర శివార్లలోని లేఅవుట్లు, నిర్మానుష్యంగానున్న బహిరంగ ప్రదేశాల్లోనే చోటుచేసుకున్నాయి. అక్కడ బహిరంగ మద్యపానమే దీనికి కారణం. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ దృష్యానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. గత నెలలో రోజుకు వంద వరకూ ఉండేవి. పోలీసుల నిరంతర నిఘా ఫలితంగా ఇప్పుడు 50కి మించట్లేదు. వాటిని ఇంకా తగ్గించాలి. మందుబాబుల సమాచారం ఇవ్వాలని ఆయా లేఅవుట్లు, తోటల్లో ఉంటున్న వాచ్మన్లకు పోలీసులతో అవగాహన కల్పిస్తున్నాం. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై షీట్.. ఇటీవల గుర్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఓ 35 ఏళ్ల ఆటో డ్రైవర్ 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాచిపెంట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఉపాధ్యాయుడు బాలికపై లైంగిక వేధింపులకు తెగించాడు. సాధారణంగా వారి వయసును బట్టి చూస్తే వారు ఇలాంటి దారుణాలకు పాల్పడతారని ఎవరూ అనుమానించరు. అందుకే మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై పోలీసుస్టేషన్లో షీట్ తెరిచే ఉంటుంది. వారిపై నిరంతర నిఘా ఉంటుంది. వారి నేర తీరును కుటుంబసభ్యులకు ‘దిశ’ పోలీసులు చెబుతారు. పరిసర ప్రాంతాల వారినీ అప్రమత్తం చేస్తారు. నేరగాళ్లకు ప్రత్యేక కౌన్సెలింగ్... మహిళలపై ముఖ్యంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిలో పైశాచిక మనస్తత్వం ఉంటుంది. వారానికి ఒకసారి సైకాలజిస్టుతో కౌన్సెలింగ్ చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సైబర్ నేరాలపైనా అవగాహన... ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియాలో స్నేహాల పేరుతో మోసపోతున్న మహిళలు, యువతుల సంఖ్య మన జిల్లాలోనూ పెరుగుతోంది. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటీఎం కార్డు వినియోగం కూడా తెలియనివారు ఉన్నారు. మహిళలు, యువతులు సైబర్ నేరగాళ్ల బారినపడకుండా అవగాహన కల్పించే మూడు రోజుల ప్రత్యేక శిక్షణను త్వరలోనే ప్రారంభిస్తాం. మహిళా పోలీసులు, డ్వాక్రా మహిళల ప్రతినిధులు, టీచర్లు, బ్యాంకర్లు, పోలీసులను భాగస్వాములను చేస్తున్నాం. బాధితులకు ‘దిశ’ భరోసా... మహిళలు, యువతులు, బాలికలు తమపై జరిగిన అఘాయిత్యాలను ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. దీనివల్ల నేరగాళ్లపై సత్వరమే కేసు నమోదు చేస్తూ పోలీసు శాఖ ఆయా బాధితురాళ్లకు అండగా నిలబడుతుంది. దిశ కేసులకు ప్రత్యేకంగా ఒక డీఎస్సీని ప్రభుత్వం నియమించింది. దిశ పోలీసుస్టేషన్లో సగం మంది మహిళా పోలీసులే ఉంటారు. ఎస్సై కూడా మహిళే ఉన్నారు. ఆ కేసులను సత్వరమే పరిష్కరించడానికి ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీసులను ఒక ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి నియమించాం. హెల్స్ డెస్క్లోనూ మహిళనే ఉంచుతున్నాం. ‘దిశ’ సద్వినియోగంతోనే రక్షణ... పాచిపెంట ఘటనలో బాధితురాలు దిశ ఎస్వోఎస్ను పంపడం వల్లే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోగలిగాం. జిల్లాలో ఇప్పటివరకూ 3.38 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో స్మార్ట్ ఫోన్ల వాడకం తక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, సిగ్నల్స్ తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అందుకే అలాంటిచోట్ల సాధారణ ఫోన్లలో స్పీడ్ డయిల్ ఆప్షన్ పెట్టిస్తున్నాం. కీ ప్యాడ్‌పై 1 నంబరు నొక్కగానే పోలీసులకు లోకేషన్ సహా సమాచారం వచ్చేస్తుంది. మహిళలపై అఘాయిత్యాలు సాగవిక... అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్న చీకటి ప్రదేశాలు, మహిళలపై గతంలో తరచుగా దాడులు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాం. ఈవ్‌టీజింగ్ జరుగుతున్న కళాశాలల పరిసర ప్రాంతాలు, బస్టాప్‌లు, నగరాల్లో మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలు ఇలా... జిల్లాలో దాదాపు 225 వరకూ ఉన్నాయి. అక్కడ నిఘాకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ఫుట్ పెట్రోలింగ్ కూడా చేస్తారు. ఒకవేళ ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే దిశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ను పోలీసులకు ఏవిధంగా పంపించాలో బాధితులకు అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టిస్తున్నా. ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలకు పాల్పడితే ఎంతటి కఠిన శిక్షలు పడతాయో ఆకతాయిలకు హెచ్చరికలు కూడా ఉంటాయి. డ్రోన్‌తోనూ నిఘా ఉంచుతున్నాం. ప్రతి రోజూ ఏదొక ప్రదేశంపై డ్రోన్ సర్వైలెన్స్ ఉంటుంది. -
కఠినమైన వృత్తిలో ఉంటూనే వరలక్ష్మీ వ్రత పూజ
పొద్దున్న లేస్తే గొడవలు, పేచీలు, రాజీలు, సర్దుబాట్లు.. ఇన్నింటి మధ్య కొంత నిశ్శబ్దం కావాలి. ఒంటి మీద ఖాకీ పడింది మొదలు దొంగలు, నేరస్తులు, మోసగాళ్ల ఆటకట్టించడమే పని. వీరి నీడ కూడా పడని స్థలంలో కాసేపు గడపాలి. బయటే కాదు ఇంతులకు ఇంటిలోనూ జీవిత కాల ఉద్యోగమే కదా. ఆ తలనొప్పులు తప్పేలా మనసుకు ప్రశాంతత దొరకాలి. బాధలు, హోదాలు మరిచి దేవుడి సన్నిధిలో సేద తీరాలి. శ్రావణం ఆ సమయాన్నిస్తోంది. హడావుడిని కాస్త పక్కనపెట్టి నిమ్మళంగా పూజ గదిలో కూర్చుని వ్రతం చేసుకోవడానికి మన ‘ధైర్య’లక్ష్ములు ఇష్టపడుతున్నారు. వరలక్ష్మీ వ్రతాలకు సిద్ధమయ్యారు. పాలకొండ రూరల్/రాజాంసిటీ: శ్రావణం వచ్చిందంటే మహిళలకు ప్రతిరోజూ ఓ పండగే. ఈ పండగ రోజుల్ని జరుపుకునేందుకు ఎవరూ మినహాయింపు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ముఖ్యంగా ఈ శాఖలో పనిచేసే వాళ్లకు అనుక్షణం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాళ్లు అనేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది. కఠిన సమయాలు వాళ్లకు వెన్నంటి కాదు.. ఎదురు నిలిచి ఉంటాయి. అయితే ఇంత పని ఒత్తిడిలోనూ తమ వ్యక్తిగత జీవితానికి కాసింత సమయం కేటాయిస్తున్నారు. అటు వృత్తిని.. ఇటు సంప్రదాయాల్ని పాటిస్తూ లైఫ్ బ్యాలన్స్ చేసుకుంటున్నారు. శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం, నోములు నోచుకోవడం తమ జీవితంలో ఓ భాగమే అని మనసారా నమ్ముతున్నారు. వృత్తిలో అంతే కఠినంగా కూడా వ్యవహరిçస్తున్నారు. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వారి అభిప్రాయాల్ని ఇలా చెప్పుకొచ్చారు. సంప్రదాయాలకు పెద్దపీట.. నాకు మొదటి నుంచి ఆచార సంప్రదాయాలంటే మక్కు వ. చిన్ననాటి నుంచి దైవభక్తి అలవడింది. పూజ లు, వ్రతాలు కచ్చితంగా చేస్తా. ఎన్ని బందోబస్తు డ్యూటీలున్నా సరే వరలక్ష్మీ వ్రతానికి ప్రాధాన్యమిస్తా. పూజ చేస్తే ఏదో తెలియని సంతృప్తి. ప్రతిఏటా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పూజలో పాల్గొంటాం. అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తాం. ముందురోజే పూజా సామగ్రి కొనుగోలు చేస్తాను. డ్యూటీ సమయానికంటే ముందే పూజను ముగించేస్తాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందనేది నా నమ్మకం. పూజ ముగియగానే యూనిఫారమ్ ధరించి డ్యూటీకి సిద్ధమైపోతా. – ఎల్.రమణమ్మ, ఏఎస్ఐ, రాజాం వృత్తి.. దైవం వృత్తి.. దైవం.. ఈ రెండింటిని సమదృష్టితో చూస్తా. అలా చూసినప్పుడే సమాజంలో గుర్తింపు. పోలీస్ అధికారిగా సబ్ డివిజన్ ప్రజలకు రక్షణ కల్పించటంతో పాటు వారి సుఖశాంతుల కోసం భగవంతుడ్ని ప్రార్థిస్తా. విధినిర్వహణలో నిత్యం అంకితభావంతో పనిచేసే మాకు ఈ తరహా సంప్రదాయ పూజల్లో పాల్గొన్నప్పుడు కొంత సాంత్వన లభిస్తుంది. తెలుగు వారి సంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కడున్నా కచ్చితంగా ఆచరిస్తా. ఓ మహిళగా కుటుంబ సభ్యుల క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తా. ఇలాంటి కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించడం నాకు ఆనందాన్నిస్తుంది. –మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ ఒత్తిడి నుంచి దూరంగా.. వృత్తితోపాటు సంప్రదాయాలను గౌరవిస్తాను. వృత్తి రీత్యా విధి నిర్వహణలో కొంతమేర ఒత్తిడి తప్పదు. వరలక్ష్మీ వ్రతంలాంటి సంప్రదాయ పండగలు, పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకుంటున్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిత్యం యూనిఫాంలో ఉండే మేము ఇలాంటి సమయాల్లోనే సంప్రదాయ వస్త్రాలను ధరించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. నేను పాటిస్తేనే కదా.. నా తర్వాత తరం అలవాటు చేసుకుంటుంది. వృత్తి.. దైవం రెండు కళ్లుగా భావిస్తాను. ఎంతటి వారైనా కొన్ని సమయాల్లో భగవంతుడిపై నమ్మకం ఉంచక తప్పదు. – బి.ప్రభావతి, ఎస్ఐ, సీతంపేట -
వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము. ఒకవేళ ఈ రోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన నమ్మకం. ఈ వ్రతం ఎలా చేసుకోవాంటే ► వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ► ఇంటి గుమ్మాలకు పసుపుకుంకుమలను రాసుకోవాలి. ► ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ► లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మంచిదని చెబుతారు. కాబట్టి ఇంటి ఈశాన్యభాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ► ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి. ► ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.. దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను నిలపాలి. ►ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే! ► అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేస్తారు. ఇందుకోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ, తోరపూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒకో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ...అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలదీ తీపిపదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరువకూడదు. వరలక్ష్మీ పూజలో భాగంగా ఎలాగూ అష్టోత్తరశతనామావళి, మహాలక్ష్మి అష్టకమ్ తప్పకుండా చదువుతాము. వీటితో పాటుగా కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తయిదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తయిదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నింటినూ సాగే వరలక్ష్మీ వ్రతం ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళమూ జరగకుండా కాపాడి తీరుతుంది. -
తనిష్క్ ‘స్వరూపం’ ఆభరణాలు
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్ తనిష్క్.. వరలక్ష్మీవ్రత పూజల సందర్భంగా ‘స్వరూపం’ పేరుతో ప్రత్యేక ఆభరణాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీల్లో 25 శాతం తగ్గింపునిస్తున్నట్టు ప్రకటించింది. పాత బంగారం ఆభరణాలు ఎటువంటివైనా కానీ మార్చుకుంటే నూరు శాతం విలువను కడుతున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా తనిష్క్ స్టోర్లలో ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఆభరణాల కొనుగోలుపై ఈ ఆఫర్లు అమలవుతాయని పేర్కొంది. -
వీక్షకులు పంపిన వరలక్ష్మీ వ్రతం ఫొటోలు
-
వరలక్ష్మీ వ్రతం.. కొండెక్కిన పూలు !
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో పూల ధరలు గురువారం చుక్కలనంటాయి. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నా నగరవాసులు ఏమాత్రం భయపడకుండా మార్కెట్‌కు పోటెత్తారు. దాంతో పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మీ వ్రతం కావడంతో ఇళ్లలో ప్రత్యేక పూజలు, ఇతర వ్రతాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ క్రమంలో గురువారం మార్కెట్‌కు వెళ్లిన నగర వాసులకు ఆయా ధరలు చూసి ఒక్కసారిగా మూర్చపోయినంత పనైయింది. ముఖ్యంగా నగరంలోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ.1000 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు కేవలం రూ.500 మాత్రమే పలికింది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కనకాంబం ధర ఐదు రెట్లు పెరిగింది. పూలధరలకు రెక్కలు మల్లెపూలు మంగళవారం కిలో రూ.200 ఉండగా గురువారం రూ.600 పలికింది. అదేవిధంగా సన్నజాజులు కూడా రూ.200 నుంచి 600 లకు పెరిగింది. అలాగే చామంతి పూలు గురువారం రూ. 300 నుంచి 400 వరకు విక్రయించారు. బంతిపూలు రూ.150, గులాబీ కిలో రూ.300, లిల్లీ రూ.200, హైబ్రీడ్ గులాబీ రూ.100 నుంచి 200 చొప్పున పలికాయి. వాటితో పాటుగా బెంగళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట రూ.200 పలికింది. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. కరోనాను సైతం లెక్కచేయని వైనం.. నగరంలో కరోనా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నా వాటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా మార్కెట్లకు తరలివస్తున్నారు. పూలమార్కెట్లో కనీసం అడుగు దూరం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ మరీ పూలు కొనుగోలు చేశారు. గత ఏడాది సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉందో అదేవిధంగా గురువారం కూడా పూలమార్కెట్ దర్శనమిచ్చింది. పండ్ల ధరలు సైతం పైపైనే.. మార్కెట్లో పండ్ల ధరలకు సైతం ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు వాయినాలు ఇవ్వడం పరిపాటి. అందులో ఒకటీ, రెండు పండ్లు జతచేసి వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా వాటిని కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు వాటి ధరలు చూసి అవాక్కయ్యారు. బుధవారం సాధారణ అరటిపండ్లు డజను రూ.35కు విక్రయించగా వాటిని గురువారం రూ.60కు తక్కువ లేదంటూ వ్యాపారులు తెగేసి చెప్పి మరీ విక్రయాలు చేశారు. అలాగే ద్రాక్ష సాధారణ రోజుల్లో రూ.100 పలికితే గురువారం రూ.140లుగా వినిపించింది. అదేవిధంగా బత్తాయి, దానిమ్మ, జామ, యాపిల్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. కిటకిటలాడిన నగర మార్కెట్లు నగరంలోని పండ్లు, పూలు, ఇతర పూజా సామగ్రి విక్రయించే మార్కెట్లు కిటకిటలాడాయి. కనీసం అడుగుతీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేకుండా వినియోగదారులు ఆయా మార్కెట్లకు పోటెత్తారు. ముఖ్యంగా వన్‌టౌన్‌లోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్లో లోపలకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి కనీసం పావుగంటకు పైగా సమయం పట్టిందంటే రద్దీ ఎంతగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, బీసెంట్‌రోడ్డు తదితరప్రాంతాల్లో సైతం పండ్ల, పూల మార్కెట్లకు నగరవాసులు పోటెత్తారు. మార్కెట్ల రద్దీ కారణంగా ఆయా ప్రాంతాల్లో పాదచారుల రాకపోకలకు ఇబ్బ ందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలు మార్లు ట్రాఫిక్ స్తంభించింది. మళ్లీ కళకళ.. శ్రావణ శుక్రవారం, బక్రీద్ పర్వదినాల నేపథ్యంలో విజయవాడలో వస్త్ర, బంగారం దుకాణాలు కళకళలాడాయి. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా వెలవెలబోయిన దుకాణాలు కస్టమర్లతో నూతన శోభతో కనిపించాయి. కరోనా ముందు పరిస్థితులు మళ్లీ కళ్లముందు కదలాడాయి. ఏ దుకాణంలో చూసినా కొనుగోలు దారులు కనిపించారు. వ్యాపారులు సైతం ఆశ్చర్యానందానికి లోనయ్యారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరిపారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
విజయవాడ : మార్కెట్లో శ్రావణ శుక్రవారం రద్దీ
-
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు
-
మార్కెట్లోలో వరలక్ష్మి వ్రతం సందడి
-
శుభప్రద శ్రావణం
కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతోనో.. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములు వ్రతాలతో నెలంతా సందడి చేసే శుభప్రద శ్రావణం రానే వచ్చేసింది. తొలిరోజే అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక సన్నాహాలు చేపట్టారు. నాగుల చవితి..గౌరీ పంచమి.. మంగళగౌరి వ్రతం.. వరలక్ష్మీ వ్రతం.. కృష్ణాష్టమి.. రాఖీపౌర్ణిమ తదితర ప్రధాన పండుగలు ఈ మాసం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం వచ్చిదంటే అందరిలో.. ముఖ్యంగా మహిళలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి సాక్షి, అనంతపురం : గురువారం నాటి అమావాస్య రాకతో ఆషాఢానికి వీడ్కోలు పలుకుతూ శుభ శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం నుంచే అమావాస్య వచ్చేసింది. గురువారం మధ్యాహ్నానికి వెళ్లిపోతుంది. అయితే సూర్యోదయంతో తిథి వార నక్షత్రాల లెక్కింపు ఉన్నందున శుక్రవారం వారం నుంచే శ్రావణ మాసం ఆరంభమవుతుందని పండితులంటున్నారు. శ్రావణమొస్తోందంటే అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొంటుంది. ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతన, శుభకార్యాలు నిర్వహిస్తే పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని వేదపండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే బలరామకృష్ణ్లు జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి వంటివి భక్తిభావాలను మరింత పెంచనున్నాయి. గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో కన్నుల పండువగా జరుగుతాయి. శ్రావణ బహుళ విధియనాడు మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు మొదటిరోడ్డులోని మఠంలో శోభాయమానంగా జరుగుతాయి. సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసం చివరి రోజు రానుంది. హరిహరబేధం లేని మాసం అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు చేస్తే పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మగువలు సుమంగళిగా జీవించాలని కోరుకుంటూ చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలూ పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. శ్రావణంలో వచ్చే పర్వదినాలివే: ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 02 నుండి 29వ తేదీ వరకూ ఉంటుంది. ఇందులో ఆగస్టు 4న నాగుల చవితితో పండుగలు ప్రారంభమవుతాయి. అదే క్రమంలో 6న మంగళగౌరీ వ్రతం, 9న వరలక్ష్మీవ్రతం, 15న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు రాఖీ పౌర్ణిమ, ఇదే రోజు నుంచి ఐదు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, 19న సంకష్టహర చతుర్థి, 23న శ్రీ కృష్ణాష్టమి, 24న వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు రానున్నాయి. 30న పొలాల అమావాస్యతో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ప్రధానంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి ఆలయాలలో, శ్రావణ శనివారాలు జిల్లా వ్యాప్తంగా శ్రీవైష్ణవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటాయి. శ్రావణ నోములకు చాలా ప్రాధాన్యత శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, మరెంతో ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని ఒసిగే మాసంగా దీనిని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రావణమంటే ఎంతో శుభమని భావించడం పరిపాటి. అయితే ఈసారి నెలంతా శుభముహూర్తాలు లేకపోవడం ప్రత్యేకంగా గుర్తించాలి. గత నెల 9న వచ్చిన శుక్రమూఢమి సెప్టెంబరు 19 వరకూ ఉంటుంది. తర్వాత కూడా పదిరోజులు పితృపక్షాలు రానున్నాయి. అదే నెల 29న ఆశ్వీజం పుట్టే వరకూ శుభ కార్యాలు చేయడానికి వీలులేదు. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు లేవు. -
అనుగ్రహ మాధుర్యం
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల ఆచారాలకు అనుగుణంగా పూజా విధానం ఉంటుంది. కొందరు నారికేళానికి పసుపుకుంకుమలు అలంకరించి కలశం మీద ఉంచి పూజిస్తారు. మరికొందరు నారికేళానికి మైదా పిండితో కళ్లు, ముక్కు, చెవులు అలంకరించి కలÔ¶ ం మీద ఉంచి అర్చిస్తారు. ఇంకొందరు నారికేళాన్ని అమ్మవారిగా అలంకరించి, ఒక పెద్ద బిందెకు పట్టు చీర కట్టి అచ్చు బాల వరలక్ష్మిలా అలంకరించి వ్రతం చేసుకుంటారు. ఈ పూజను స్త్రీలందరూ పవిత్రంగా చేసుకుంటారు. ఈ పండుగనాడు కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రకాల పిండి వంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, పరమాన్నం, ఆవిరి కుడుములు, బూరెలు, పచ్చి చలిమిడి, పానకం, వడ పప్పు, నారికేళం, గారెలు వంటివి నివేదన చేస్తారు. ప్రాంతాలకు అతీతంగా ఇంటింటా పులిహోర బూరెలు/బొబ్బట్లు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కొందరు రవ్వకేసరి వంటి మధుర పదార్థాలు కూడా తయారు చేస్తారు. శక్త్యానుసారం పిండివంటలు తయారుచేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఏవి చేసినా చేయకపోయినా, పూర్ణం బూరెలను మాత్రం తప్పనిసరిగా తయారు చేస్తారు. అందుకోసం కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా; మినప్పప్పు – అర కప్పు; బియ్యం – రెండు కప్పులు; ఉప్పు – చిటికెడు; నూనె – బూరెలు వేయించడానికి తగినంత తయారీ: ∙ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యం కలిపి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, ఉప్పు జత చేసి గ్రైండర్లో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి ∙సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙ఉడికిన పప్పును బయటకు తీసి, నీరు ఉంటే పూర్తిగా ఒంపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బెల్లం తరుగు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి ∙(పల్చగా వస్తే, ఒకసారి స్టౌ మీద ఉంచి, గట్టిపడేవరకు ఉడికించాలి) ఏలకుల పొడి జత చేయాలి ∙చిన్న చిన్న పూర్ణాలు (ఉండలు) గా చేసి పక్కన ఉంచాలి∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను, పిండిలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙అమ్మవారికి నివేదన చేసి, తొమ్మిది బూరెలను వాయనంగా ఇవ్వాలి. -
రావమ్మా వరలక్ష్మీ తల్లీ రావమ్మా
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటేæ కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద లాంటివి కూడా. వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని కంగారు పడనక్కరలేదు. మన ఇంటికి ఎవరైనా బాగా కావలసిన ఒక ముఖ్య అతిథి వచ్చారనుకోండి, మనం వారిని సాదరంగా ఆహ్వానించి, ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో ఎలా గౌరవించి, ఎంత మర్యాదగా సాగనంపుతామో అలా శ్రద్ధగా, భక్తిగా, నిష్ఠగా పూజ చేసుకోవాలి. చేతనైన పిండివంటలు చేయాలి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తోరం ఎందుకు? వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం ఉంది! ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు, ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం...అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని విశ్వాసం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, మరొకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అందుకే నవసూత్రం కట్టుకుంటారు. కొందరు ఐదు ముడులు కూడా వేసుకుంటారు. ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ! ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి. దీనినే తోరగ్రంథిపూజ అంటారు. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథిపూజ. ఇందుకోసం ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమ: చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్షై్మనమ: పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామిఓం విశ్వసాక్షిణ్యై నమ: సప్తమ గ్రంథిం పూజయామి ఓం చంద్రోసహోదర్యై నమ: అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి అని చదువుతూ ఒకో ముడినీ పూజించాలి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత...! బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే’!!అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలి. అంతేకాదు, ఇలా ధరించిన తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవడం మంచిది. పూజకు కావలసినవి పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెబట్ట, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి. వ్రత విధానం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యపుపిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమ లేదా ఫొటో అమర్చుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని, నివేదన, హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని ధ్యాన ఆవాహనాది శోడశోపచారాలతో పూజించుకోవాలి. వ్రత కథ చదువుకుని, అక్షతలు శిరస్సున ధరించాలి. ముత్తయిదువలకు వాయినాలు, తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం బంధుమిత్రులతో కలసి భుజించాలి. – డి.వి.ఆర్. -
వరాల పట్టు
వరమహాలక్ష్మికి ఇంపైన పట్టుశ్రీ మహాలక్ష్మికి సొంపైన పట్టుకమలాయతాక్షికి కోమలమైన పట్టు శ్రావణలక్ష్మికి సొగసైన పట్టుఏ పట్టు కట్టినా కోరినన్ని వరాలు ఆ ఇంట కురిసినట్టే! లైట్ వెయిట్ రంగుల హంగులు, పువ్వుల డిజైన్లు లేదంటే ప్లెయిన్‌గా అలరించే ప్రత్యేకత లైట్‌వెయిట్ పట్టు చీరల ప్రత్యేకత. వీటికి మోడర్న్ టచ్ ఇవ్వాలంటే ప్లెయిన్, కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే స్లీవ్‌లెస్ బ్లౌజ్ సరైన ఎంపిక అవుతంది. ఈ తరం మగువ కోరుకునే కాంబినేషన్ కట్టు. ఇది. పొడవాటి గౌన్కూ జోడీ దుపట్టా పట్టు పండగ వేళ పసుపు, పచ్చ, ఎరుపు కాంతిమంతమైన రంగులు ముంగిళ్లను కళకళలాడేలా చేస్తాయి. అందుకే ఆ హంగులు నింపుకున్న పట్టు డ్రెస్సులు పండగ అందాన్ని Ðð య్యింతలు చేస్తాయి. పొడవాటి పటోలా గౌన్ మీదకు పట్టు దుపట్టా ఓ ప్రధాన ఆకర్షణ. లెహంగాతో పట్టు జత కట్టు ప్లెయిన్ కుచ్చుల లెహంగా మీదకు పట్టు ఓణీ ధరిస్తే ఓ కళ. లేదంటే ప్లెయిన్ పట్టు లెహంగా మీద ఎంబ్రాయిడరీ చేస్తే మరో ఆకర్షణీయమైన కళ. అనార్కలీకి తోడు పటోలా పట్టు ప్లెయిన్ లాంగ్ అనార్కలీకి మెరుపు తీసుకురావాలంటే పువ్వుల ప్రింట్లు ఉన్న పట్టు దుపట్టా లేదంటే ఇక్కత్, పటోలా పట్టును ఎంపికచేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పట్టు చీర మగ్గం వర్క్ పెద్దంచు అవీ యాంటిక్ లుక్‌తో ఆకట్టుకునే పట్టు చీరలు ఇప్పటి ట్రెండ్. వీటికి డిజైనర్ బ్లౌజ్‌ను జత చేర్చితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. పండగ వేళ పట్టు ఎప్పుడూ ఎవర్గ్రీన్ కాన్సెప్టే. శ్రావణ మాసాన వరలక్ష్మీ వ్రతాలు, నోములు, పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు.. ప్రతీది సంబరమే! ప్రతీది సంప్రదాయమే. పువ్వులు–పండ్లు, మామిడితోరణాలు, పసుపు–కుంకుమలతో పాటు పట్టు ఆభరణమై ఎన్నో విధాల జత కట్టచ్చు. పట్టు చీర కడితే చాలు అనుకునే రోజులు కావివి. పట్టును దేనితో జత కట్టవచ్చు అని ఆలోచించే రోజులు. అందుకు డిజైనర్లు సైతం తమ పనితనానికి మెరుగులు పెడుతుంటారు. పట్టును ఎలా ధరించినా కళ ఉట్టిపడుతుంది. కుర్తా, అనార్కలీ, పొడవాటి గౌను మీద పట్టు దుపట్టా, లెహెంగా మీదకు పట్టు ఓణీ జత చేసినా చాలు పండగ కళ వెయ్యింతలు అవుతుంది. - నిర్వహణ ఎన్.ఆర్. -
వ్రత గామిని వరదాయిని
‘వర’ అంటే ‘కోరుకున్నది’ అనీ. శ్రేష్ఠమైనది అనీ అర్థం. అంటే అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ వరలక్ష్మి. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి. కలశం: సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం. కలశ వస్త్రం: వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పిత దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్నిదేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్త్రానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా చంద్రుడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. రేపు రాబోయే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజా ద్రవ్యాలపై అవగాహనకు... మామిడి ఆకులు: కలశానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తాం. మామిడి ప్రాణశక్తిని అందిస్తుంది. చెడును పరిహరిస్తుంది. అందుకే బంధుమిత్రులు వచ్చే సమయంలో... శుభకార్యాలవేళలో మామిడి తోరణాలు తప్పనిసరి. కొబ్బరికాయ: నిస్వార్థమైన జీవితానికి, అందులోని నీరు మనం పొందాల్సిన ఆనందానికి సంకేతాలు. కష్టపడి కోయడం, పెచ్చుతీయడం, పగులగొట్టి పెంకు తొలగించడం... ఇవన్నీ చేస్తే కానీ కొబ్బరి, తియ్యని నీళ్లు రావు. ‘‘ఆ కష్టం మాకు తెలుసు, అయినప్పటికీ అన్ని సందర్భాల్లో మేం ఆ స్థాయిని ప్రదర్శించలేం. అలంకరించిన ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాం. స్వీకరించి మాకు శుభాలనివ్వు తల్లీ!’’ అంటూ వరలక్ష్మిని కోరుకోవడమే నారికేళం విశిష్టత. పసుపు కుంకుమలు: ఎరుపు అనురాగానికి ప్రతీక. పసుపు త్యాగాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా, సాఫీగా సాగడానికి ఈ రెండూ అవసరం. అవి కుటుంబంలోని అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి. పానకం, వడపప్పు: ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పుల్ని తట్టుకోవడానికి స్త్రీలకు శక్తి కావాలి. శరీరానికి చలవ అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టే పెసరపప్పు, పానకంలో అవి లభిస్తాయి. పెసరపప్పు శక్తినిస్తుంది. పానకం చలవ. తేనె భార్యభర్తల అనురాగాన్ని.. పాలు.. ఆత్మీయ అనుబంధాన్నీ సూచిస్తాయి. పూలసేవ: వరలక్ష్మీదేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే. అష్టోత్తర శతనామాలు: అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లకీ‡్ష్మ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహత్వం: లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు కానీ, ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయి. వాస్తవానికి ‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం – ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. ఈ అనంత విశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి – అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. పరమేశ్వర శక్తితో జరిగే సృష్టి స్థితి లయలే ‘ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ‘భృగు’వారమనీ వ్యవహరిస్తారు. భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణు దయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు.