Vijaydevarakonda
-
విజయ్ దేవరకొండ సాయం.. ట్రాన్స్ జెండర్ కంటతడి
చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు వారు చేసిన సాయాన్ని చెప్పుకోరు. ఇందులో ప్రథమంగా వినిపించే పేరు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అని వెంటనే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లో విజయ దేవరకొండ చేరిపోయారు. తన ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్ ఎప్పుడూ తను చేసిన సాయాన్ని చెప్పుకోలేదు. అయితే తాజాగా ఆహా తెలుగు ఓటీటీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ 3లో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు తాము విజయ్ నుంచి సాయం పొందినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.విజయ్ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ముఖ్యంగా లాక్డౌన్లో తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేశారు. పేదలకు నిత్యవసర సరకులను అందజేశారు. గతేడాదిలో ఖుషి సినిమా సమయంలో కూడా 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ. కోటి రూపాయలు అందచేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇండియన్ ఐడల్ 3లో గెస్ట్‌గా విజయ్ దేవరకొండ వెళ్లారు. ఆయన గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్‌జెండర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.'నేను ఒక ట్రాన్స్జెండర్ని సర్. మీకు థ్యాంక్స్ చెప్పాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. మేము భిక్షాటనతోనే జీవిస్తాం. కానీ, కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల మేము ఇంటికే పరిమితం అయ్యాం. అప్పుడు మాకు మూడు పూటల తినేందుకు ఆహారం కూడా లేదు. అలాంటి సమయంలో సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలుసుకుని నాకు సాయం చేయాలని ధరఖాస్తు చేసుకున్నాను. కొన్ని నిమిషాల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో నాతో పాటు మరో 18 మంది ట్రాన్స్ జెండర్స్‌కు మీరు సాయం చేశారు. ఆ తర్వాత నా కుటుంబానికి కూడా సాయం అందించారు. అప్పుడు నాకు అనిపించిన మాట కనిపించని దేవుడు ఎక్కడో లేడు.. మీలోనే ఉన్నాడని అనిపించింది.' అంటూ ఆ ట్రాన్స్ జెండర్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో విజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది రూ. 500, రూ.1000 తమకు తోచిన వరకు ఇచ్చారు. అలా వారందరి వల్లనే ఇది సాధ్యమైంని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.'మిడిల్ క్లాస్ ఫండ్స్' పేరుతో విరాళాలులాక్డౌన్ సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేసే లక్ష్యంతో దేవరకొండ ఫౌండేషన్ స్థాపించబడింది. ఫౌండేషన్‌కు సుమారు రూ. 2 కోట్ల నిధులు వచ్చాయి. అందులో విజయ్ దేవరకొండ నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. 'మిడిల్ క్లాస్ ఫండ్స్' పేరుతో ఆయన విరాళాలు సేకరించి చాలా కుటుంబాలకు అండగా నిలిచారు. ఆ సమయంలో సుమారు 10వేలకు పైగా కుటుంబాలకు విజయ్ సాయం చేశారు.Thanks cheppakarledhu, if you're fine, it's enough - @TheDeverakonda The man with a golden heart ❤️#VijayDeverakonda pic.twitter.com/HArOPAcGOZ— Suresh PRO (@SureshPRO_) July 9, 2024 -
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్‌తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్‌ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్‌లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్‌ప్లాన్‌లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!) -
పెళ్లి కబురుతో ఫోటో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో విజయ్ దేవరకొండ (34) కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య శర్వానంద్, వరుణ్‌తేజ్ పెళ్లి తంతు తెరపైకి వచ్చిన వెంటనే విజయ్ పెళ్లి ఎప్పుడు అని ఆయన్నే డైరెక్ట్‌గా చాలామంది అడిగారు. అందుకు సమాధానంగా ఆయన కూడా త్వరలో ఆ శుభకార్యం జరగబోతుందని కూడా చెప్పాడు. ఖుషి సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నరేష్ కుమారుడు) తాజాగ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ చేయి మరొకరి చేతిలో ఉంది. మరోకరు ఎవరనేది ఆయన రివీల్ చేయలేదు. కానీ ఆ ఫోటోకు విజయ్ ఇచ్చిన క్యాప్షన్ మాత్రం ఇలా ఉంది. 'జీవితంలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తా.' అని విజయ్ పేర్కొన్నారు. ఈ విదమైన విషయాలను తన సోషల్‌మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ షేర్ చేయలేదు. దీంతో ఇది ఖచ్చితంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఆ చెయి రష్మికదేనా.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలో ఉన్న మరో చెయి రష్మికదే అని పలువరు పేర్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్ తల్లిదండ్రులను రష్మిక కలిసిన విషయం తెలిసిందే. దీంతో వారి సందేహాలు కూడా మరింత బలంగా ఉన్నాయి. ముందే క్లూ ఇచ్చిన విజయ్ త్వరలో పెళ్లి చేసుకుంటానని ఖుషి సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనందల నటించిన 'బేబీ' సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమానికి రష్మిక వచ్చారు. అప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందరూ వదిన.. వదిన అంటూ గట్టిగా అరిచినా ఆమె తనలో తాను నవ్వుకుంటూ ఉండింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గీత గోవిందం,డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలా వారిద్దరు ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
సూపర్ హిట్ సినిమాను వదులుకున్న బన్నీ?
టాలీవుడ్లో ఒక్కోసారి చాలామంది హీరోలు వారి వద్దకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందులో కంటెంట్ నచ్చకనో, కథలో కొన్ని సన్నివేశాలు సెట్ కావనే సందేహమో తెలియదు.. ఆ సినిమాలే భారీ హిట్స్ అవుతుంటాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క కారణం వల్ల సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: సైతాన్ ట్రైలర్లో పచ్చిబూతులు, అసభ్య సన్నివేశాలు.. డైరెక్టర్ ఏమన్నాడంటే?) విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అర్జున్ రెడ్డి' కథను ముందుగా బన్నీకి చెప్పాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. కథ రాసుకునే సమయంలోనే బన్నీని ఫిక్స్ చేసుకున్నాడట. అయితే, ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అంతే కాకుండా కచ్చితంగా లిప్ కిస్ ఇవ్వాల్సిందే అంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టాడట. దీంతో వెంటనే అల్లు అర్జున్ పదేపదే కిస్ చేయటం వల్ల తన ఇమేజ్ ఎక్కడ డామేజ్ అయిపోతుందో అని ఈ సినిమాకు నో చెప్పేశాడని సమాచారం. తర్వాత శర్వానంద్ దగ్గరికి సందీప్ రెడ్డి వెళ్తే.. అదే కారణంతో రిజక్ట్ చేశాడట. చివరిగా విజయ్ దేవరకొండ ఓకే చెప్పడం ఆ తర్వాత భారీ హిట్ కొట్టడమే కాకుండా తనకు ఆ సినిమా విపరీతమైన ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. (ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) -
ఒకరితో బ్రేకప్!.. ఇంకొకరితో స్టార్టప్!.. ఏది నిజం..?
-
విజయదేవరకొండతో నటించాలని ఉంది
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ‘విశాఖ అంటే చాలా ఇష్టం..ఇక్కడ అందాలకు ఫిదా అయ్యా’ అని వర్ధమాన నటి ప్రగ్యా నయన్ పేర్కొన్నారు. దిల్వాలే సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా నయన్‌తో ‘సాక్షి’తో చిట్‌చాట్. సినిమా రంగానికి ఎలా వచ్చారు? మోడలింగ్‌లో రాణించడంతో నాపై నమ్మకం కలిగింది. క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిని సది్వనియోగం చేసుకుంటున్నా. ఇంతవరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? మూడు చిత్రాల్లో నటించా. సురాపానం నా తొలిచిత్రం..మంచి పేరు వచ్చింది. చక్రవ్యూహం మార్చిలో విడుదల కానుంది. మూడో చిత్రం దిల్వాలే. మరో సినిమా కూడా ఈనెల 26న ప్రారంభం కానుంది. మీకిష్టమైన హీరో బన్నీ అంటే ఇష్టం. టాలీవుడ్లో అందరు హీరోలతో పనిచేయాలని ఉంది. ముఖ్యంగా విజయదేవరకొండ, పవన్ కల్యాణ్ వంటి స్టార్లతో నటించాలని ఉంది. మీ గురించి చెప్పండి బెంగళూరులో చదువుకున్నా..అక్కడే విప్రోలో ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేశా..అలా సినిమా అవకాశాలు రావడంతో ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టా. వైజాగ్ ఎలా ఉంది వావ్ అద్భుతంగా ఉంది. ఇక్కడ బీచ్, పర్యాటక ప్రాంతాలు నా మనస్సు దోచుకున్నాయి. ఐ లవ్ వైజాగ్. -
పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు
-
లక్ష మందికి ఉపాధి
‘‘ఇలాంటి ఒక సమస్య మన ముందుకు వస్తుందని ఎవరం ఊహించలేదు. కానీ మనందరం యోధులం. కలసికట్టుగా దీనిపై పోరాటం చేద్దాం’’ అంటున్నారు విజయ్ దేవరకొండ. కరోనా కష్ట సమయంలో సమాజానికి తన వంతు సహాయంగా రెండు ప్రకటనలు విడుదల చేశారు విజయ్. ఈ రెండు ప్రకటనలను ఒకటి అత్యవసరంగా కావాల్సినవి, భవిష్యత్తులో కావాల్సినవిగా విభజించారాయన. మొదటిది ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం. గత ఏడాదిగా వర్కవుట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం లక్ష మంది యువతకు ఉపాధి కల్పించడమే అని పేర్కొన్నారు. దీనికోసం కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు విజయ్ తెలిపారు. రెండవది ‘మిడిల్ క్లాస్ ఫండ్’. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని మధ్య తరగతి కుటుంబాలకు ఈ ఫండ్ ద్వారా సహాయం చేయనున్నారు ఆయన. దీనికోసం 25 లక్షలు ప్రకటించారు. అవసరం ఉన్నవారు ‘ది దేవరకొండ ఫౌండేషన్.ఆర్గ్’ ద్వారా టీమ్‌ను సంప్రదించవచ్చన్నారు. ‘‘లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటి దగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు. అందుకే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్న షాప్‌లో సరుకులు కొనవచ్చు. ఆ బిల్‌ను మేము ‘ది మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి చెల్లిస్తాం. ఈ సమయంలో మనందరికీ కావాల్సింది ప్రేమ. ఒకరి నుంచి ఒకరికి భరోసా’’ అన్నారు విజయ్. ‘మిడిల్ క్లాస్ ఫండ్’కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించారు. విజయ్ చేస్తున్న ఈ పనిని దర్శకులు కొరటాల శివ, పూరి జగన్నాథ్ అభినందించారు. -
రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్ మసాజ్..
-
స్టయిలిష్ ఫైటర్
పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం ‘ఫైటర్’ కోసం విజయ్ దేవరకొండను ఫైటర్‌లా మారుస్తున్నారు. ఈ ఫైటర్‌ను ఫీల్డ్‌లో దింపే టైమ్‌ను రెడీ చేసుకున్నారు పూరి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న చిత్రం ‘ఫైటర్’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్నారని తెలిసింది. జనవరి 13న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఎక్కువ శాతం షూటింగ్ ముంబైలోనే జరగనుంది. ఈ సినిమాలో విజయ్ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ‘సాహో’లో ప్రభాస్‌కు స్టయిలింగ్ చేశారు ఆలిమ్ హకీమ్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్‌కు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్ దేవరకొండకు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించనున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానున్న ఈ సినిమాను పూరి, ఛార్మీ నిర్మిస్తారు. -
ప్రేమికుల రోజున..
ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒకటికి మించి లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్. -
పవర్ఫుల్ పాత్రలో
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్బస్టర్హిట్ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో విజయ్ హీరోగా ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది
‘‘కొత్త సినిమాకి నిర్మాత దొరక్కపోతే ఎంత కష్టం అనేది ‘పెళ్ళి చూపులు’ టైమ్‌లో చూశా. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే.. ఇప్పుడు నేను ఉన్న ఈ స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చని ‘మీకు మాత్రమే చెప్తా‘ సినిమా నిర్మించా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీరు హీరోగా ఎందుకు నటించలేదు? నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా చేసిన తర్వాత షామీర్ సుల్తాన్, ‘మీకు మాత్రమే చెబుతా’ కో– డైరెక్టర్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకున్నా చాలా రిచ్‌గా తీశారు. వాళ్ల ప్రతిభ చూసి ఓ సినిమా చేస్తానని చెప్పా. ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకముందు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. నేను కూడా చేద్దామనుకున్నాను. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత నేనీ సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. వేరే నిర్మాతల కోసం తిరుగుతున్నాం కానీ వర్కవుట్ కాలేదని ఆ ఇద్దరూ అన్నారు. కథపై, వారిపై ఉన్న నమ్మకంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా. ► మీ ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్‌నే ఈ సినిమాకిæహీరోగా పెట్టుకోవడానికి కారణం? ఈ చిత్రంలోని రాకేశ్ పాత్రకి నవీన్ పొలిశెట్టి, తరుణ్ భాస్కర్ సరిపోతారనిపించింది. ‘పెళ్ళిచూ పులు’ సినిమా చేస్తున్నప్పుడు ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తరుణ్ చేసి చూపించేవాడు. ఆ సమయంలో నిజంగా మాకంటే బాగా నటించేవాడు. అందుకే తరుణ్‌ని లీడ్ రోల్ చేయమని అడిగాను. ఏదో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నానే కానీ లీడ్ రోల్ కష్టం, నా దృష్టి డైరెక్షన్పైనే అన్నాడు. ఓ సారి కథ వినమని చెప్పా. విన్నాక ఒప్పుకున్నాడు. ► ఈ సినిమా కథలో మీరు కల్పించుకున్నారా ? స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఎక్కడా కల్పించుకోలేదు. సెట్‌కి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా ఓ సారి వస్తే బాగుంటుంది అని వారు అడిగితేనే వెళ్లా. సంగీతం గురించి మాత్రమే నాతో చర్చించేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. మిగిలినవాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. అల్లు అరవింద్‌గారి వంటి నిర్మాత కూడా సెట్స్‌లో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. మా యూనిట్‌కి నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ► నిర్మాణం రిస్క్ అనుకోలేదా? నేనిప్పటివరకూ చేసిన కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ‘మీకు మాత్రమే చెప్తా’కి పెట్టాను. ‘ఇప్పుడు మనకెందుకురా ప్రొడక్షన్’ అని మా నాన్న (వర్థన్) అన్నారు. అయితే కథ బాగుంది.. ఈ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంది. పైగా డబ్బులు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చనే నమ్మకంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో నెలకు రూ. 3000 అద్దె కట్టుకుంటూ, తర్వాతి నెల ఎలా? అంటూ ఇబ్బందులు పడేవాణ్ణి. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిందేంటి? ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా మా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తే నాకు తృప్తి. ఈ రోజుల్లో వినోదం వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ప్రేక్షకులు భావిస్తారు. ► కొత్తవాళ్లతో ఇంకా సినిమాలు నిర్మిస్తుంటారా? ముందు ముందు కూడా చేయాలని ఉంది. మా సినిమాని సునీల్ నారంగ్‌గారు అడ్వాన్స్ ఇచ్చి కొన్నప్పుడు మా నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇవన్నీ జరిగిన తీరు చూస్తుంటే ఇంకో సినిమా చేయడానికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ► మీరు హీరోగా చేస్తున్న సినిమాల గురించి... క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎనిమిది రోజులు షూటింగ్ మిగిలి ఉంది. పూరి జగన్నాథ్‌గారితో చేయబోయే ‘ఫైటర్’ జనవరిలో ప్రారంభమవుతుంది. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో చేస్తోన్న ‘హీరో’ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది. -
టాక్సీవాలా రీమేక్
పాత కారు, అందులో దెయ్యం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విజయ్ దేవరకొండ చిత్రం ‘టాక్సీవాలా’. రిలీజ్‌కు ముందే పైరసీ అయినప్పటికీ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోందని సమాచారం. బాలీవుడ్ యంగ్ హీరో, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా ‘కాలీ పీలీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనన్యా పాండే హీరోయిన్. మక్బూల్ ఖాన్ దర్శుకుడు. ఈ సినిమాలో టాక్సీ కూడా ప్రధాన పాత్ర అని సమాచారం. తాజా సమాచారం ఏంటంటే ‘కాలీ పీలీ’ చిత్రం ‘టాక్సీవాలా’ చిత్రం ఆధారంగా రూపొందుతోందని తెలిసింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్. ఇషాన్ గత సినిమా ‘ధడక్’ కూడా మరాఠీ సినిమాకు రీమేకే. -
ఏసియన్ ఆఫీస్‌లో రౌడీ సందడి
-
రేసింగ్ హీరో!
బైక్ రేసర్‌గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారట విజయ్ దేవరకొండ. బైక్ రైడింగ్ కోసం ఆల్రెyీ స్పెషల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట విజయ్. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నారు. తమిళం చిత్రం ‘కాకముటై్ట’కు డైలాగ్ రైటర్‌గా పని చేశారట ఆనంద్. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మాళవిక మోహనన్ కనిపిస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్‌నే హీరోగా నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో కెరీర్లో టాప్‌గేర్ వేశారు విజయ్. -
ప్రీతి ఎక్కడ అర్జున్?!
అర్జున్‌రెడ్డి తెలుగులో దుమ్ము రేపింది.ఆ దుమ్ము కోలీవుడ్‌లో, బాలీవుడ్లో దుమారం రేపింది.రీమేక్ చేస్తున్నారు. అయితే అదంత ఈజీ కావడం లేదు!పెద్ద హిట్ సినిమాను రీమేక్ చేయడానికి ఉండే తంటాలే ఇవి. ఇప్పటికింకా..అర్జున్‌రెడ్డి రీమేకింగ్లోనే ఉన్నాడు. హీరోయిన్లు ఫైనల్ అయినా..ఫైనల్ వరకు వాళ్లు ప్రీతిలా చేయగలరా?రీమేక్ అర్జున్‌రెడ్డికి ఒర్జినల్ ప్రీతి కనిపిస్తుందా? తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో లవర్ గర్ల్ పాత్ర కోసం షాలినీ పాండేకు (సినిమాలో ప్రీతి) ముందు డైరెక్టర్ ఎంతమందిని వడపోశారో తెలీదు. తమిళ్ అర్జున్‌రెడ్డికి మాత్రం మొదట మేఘా చౌదరిని అనుకున్నారు. ఆమెతో పూర్తి సినిమా తీశారు. ఆ షూట్‌ని పక్కన పడేసి జాహ్నవిని అనుకున్నారు. అది వర్కవుట్ కాలేదు. బనితా సందూని తీసుకున్నారు. ఆమెతో ఫ్రెష్‌గా షూటింగ్ మొదలు పెట్టారు. హిందీ అర్జున్‌రెడ్డికి కూడా మొదట తీసుకోవాలనుకున్నది అనన్య పాండేను. తర్వాత తీసుకున్నది కియారా అద్వానీని. ఎందుకిలా హీరోయిన్లను మార్చేస్తున్నారు. ప్రీతిలా కనిపిస్తారో లేదోనన్న సందేహమా? మరేమైనా కారణాలా?! ఫిబ్రవరి 15న రిలీజ్ కావాలి ‘వర్మా’. కాలేదు.‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ వెర్షనే ‘వర్మా’. ధ్రువ్ హీరో. విక్రమ్ కొడుకు. ఎందుకు విడుదల కాలేదు?ఫస్ట్ కాపీ వచ్చింది. ధ్రువ్ హీరోలా ఉన్నాడు. విక్రమ్‌లా ఉన్నాడు. కానీ అర్జున్‌రెడ్డిలా లేడు!అర్జున్‌రెడ్డిలా ఉండడం అంటే విజయ్ దేవరకొండలా ఉండడం. అది ఆశించారు నిర్మాతలు. అలా ఉండదేమో అని కూడా అనుమానించారు. మామూలుగా తీశాడా, మామూలుగా చూపించాడా అర్జున్‌రెడ్డిని, దేవరకొండని.. మన డైరెక్టర్ సందీప్ వంగ! పిక్చర్ పదహారు జూన్‌లో మొదలై, పదిహేడు జూన్‌లో ఫినిష్ అయింది. ఆ వెంటనే ఆగస్టులో విడుదలైంది. బడ్జెట్ నాలుగు కోట్లు. బాక్సాఫీస్ ఇచ్చింది యాభై కోట్లు! డబ్బు అలా ఉంచండి. ఎంత రొద! రణగొణధ్వని.‘వర్మా’ను పద్దెనిమిది మార్చిలో మొదలు పెట్టి ఏడు నెలల్లో ఫినిష్ చేశాడు డైరెక్టర్ బాలా. ఫస్ట్ కాపీ చూసి, ‘‘రిలీజ్ చెయ్యడం లేదు. మళ్లీ మొత్తం షూట్ చేస్తున్నాం’’ అని ‘ఇ4’ (నిర్మాణ సంస్థ) రిలీజ్‌కు ముందు ప్రకటన ఇచ్చింది! కొత్త వెర్షన్ రిలీజ్ టైమ్ కూడా ఇచ్చేసింది. ఈ ఇయర్ జూన్‌లో ఏదో ఒక ఫ్రైడే. ఈసారి డైరెక్టర్ బాలా మాత్రం కాదు. వేరెవరైనా! రెండు రోజుల క్రితం ఆ వేరెవరైనా అనే వ్యక్తి దొరికాడు. గిరీశ్ అయా. తెలుగు అర్జున్‌రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అతడు!ఇ4 బాలాకు ముందే చెప్పింది. ‘వర్మా’.. సేమ్ ఒరిజినల్లా ఉండాలని. అంటే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లా. కానీ తమిళ్‌కి ఒక ఒరిజినల్ ఉంటుందిగా. ఆ ఒరిజినాలిటీని పట్టుకున్నట్టున్నాడు బాలా. ఇ4కి అది నచ్చలేదు. వద్దనుకుంది. రద్దు ప్రకటన రిలీజ్ చేసింది. తర్వాత బాలా కూడా ఒక నోట్ రిలీజ్ చేశాడు. తను చెప్పడం.. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ అని. డబ్బులిచ్చి తీయించేవాడు నిర్మాత, డబ్బులు తీసుకుని నిర్మించేవాడు దర్శకుడు. ‘వర్మా’లో కొన్ని సీన్లప్పుడు ఇద్దరి మధ్య డబ్బుకు బదులు ‘ఇగో’ ముఖ్యపాత్ర పోషించింది. ఫిల్మ్ ముక్కలయింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాల్సింది. సింగిల్ కాపీ ఉన్న బాక్సే బద్దలైపోయింది!∙∙ బాలా.. సందీప్ కన్నా సీనియర్. ట్వంటీ ఇయర్స్ ఇండస్త్రీ. లాంగ్ కెరియర్. ‘శివపుత్రుడు, వాడు–వీడు, నేనే దేవుడు’.. మంచి మంచి హిట్స్. çసందీప్‌కి ‘అర్జున్‌రెడ్డి’ తొలి చిత్రం. రెండో సినిమా ఇంకా రాలేదు. అర్జున్రెడ్డినే హిందీలో ‘కబీర్ సింగ్’గా తీస్తున్నాడు సందీప్. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. పిక్చర్ పూర్తయితే జూన్ 21న విడుదల. ‘వర్మా’ను తియ్యడానికి నిజానికి బాలా అంత సీనియర్ అవసరం లేదు. అర్జున్‌రెడ్డిలా ఉండాలి అనుకున్నప్పుడు ఇ4 సంస్థ సందీప్‌నే డైరెక్టర్‌గా తీసుకుని ఉండాలి. మన దగ్గరే ‘సీనియర్ సందీప్’ ఉన్నప్పుడు చెన్నై నుంచి హైద్రాబాద్ వెళ్లడం ఎందుకనుకున్నారు నిర్మాతలు. ఇంకోటి కూడా పని చేసింది. విక్రమ్‌కి ‘సేతు’తో బ్రేక్ ఇచ్చిన బాలా.. విక్రమ్ కొడుకు ధ్రువ్కీ ‘వర్మా’తో అలాంటి బ్రేకే ఇవ్వొచ్చని ఒక సెంటిమెంట్. అయితే సినిమా తీస్తున్నప్పుడే ‘వర్మా’కు బ్రేక్‌లు వచ్చాయి. ‘‘నన్ను స్వేచ్ఛగా తియ్యనివ్వలేదు. ధ్రువ్ కెరీర్ దెబ్బతినకూడదని.. దీన్నిక వివాదం చేయదలచుకోలేదు’’ అని బాలా తన నోట్ స్టేట్మెంట్ను ముగించారు. ఏం నచ్చి ఉండకపోవచ్చు ఇ4కి ‘వర్మా’ ఫస్ట్ కాపీలో? ఏదీ నచ్చలేదట! రీషూట్‌కి ధ్రువ్ ఒక్కణ్నీ ఉంచుకుని మొత్తం టీమ్‌ని మార్చేశారు. ఆఖరికి హీరోయిన్ని కూడా. మొదట ఉన్న బెంగాలీ అమ్మాయి మేఘా చౌదరి ప్లేస్‌లోకి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్‌ని అనుకున్నారు. బోనీ ‘ఎస్’ అని ఉంటే.. జాహ్నవీనే ఫైనల్. కానీ కరెక్టేనా ఆమె ఎంపిక! కాదనిపించినట్లుంది. ఆమె ప్లేస్‌లోకి బినితా సంధూ వచ్చింది.అర్జున్‌రెడ్డి అబ్సెషన్లో ఉన్న ఇ4కి జాహ్నవి కన్నా మేఘ చౌదరే కరెక్ట్ అనిపించాలి. మేఘ పల్చగా ఉంటుంది కానీ, చూడ్డానికి షాలినీ పాండేలాగే ఉంటుంది. అదే కదా కావలసింది. మేఘలో ఇంకో ప్లస్.. కొత్త ముఖం. ఆ కొత్తదనం టికెట్లను అమ్మిపెడుతుంది. జాహ్నవి దేశం మొత్తానికీ తెలుసు. అలాంటప్పుడు రీల్ రీల్‌కీ కొత్తదనం ఉండే అర్జున్‌రెడ్డి థీమ్‌కి ఆమె ఎలా సెట్ అవుతుంది? ఇదే ఈక్వేషన్ పొరపాటున హిందీ అర్జున్‌రెడ్డి ‘కబీర్ సింగ్’కి పని చేస్తే కనుక అది ‘ఫట్’ అనే ప్రమాదం ఉంది. తెలుగు అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండది ఫ్రెష్ ఫేస్. కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ది సేమ్ ఓల్డ్ ఫేస్. అందులో హీరోయిన్ కైరా అద్వాని. (మొదట అనుకున్న పేరు అనన్యా పాండే). కైరా నటించింది నాలుగు సినిమాలే అయినా ఆమెనూ చాలాకాలంగా చూస్తున్నట్లనిపిస్తుంది. సందీప్ ధైర్యం ఏమిటో మరి! నిర్మాతలకేం పర్వాలేదు. వారికి సందీప్ ఉన్నాడన్న ధైర్యం ఉంది. ∙∙ జూన్‌లోనే విడుదల అవబోతున్న తమిళ్ అర్జున్‌రెడ్డి, హిందీ అర్జున్‌రెడ్డి.. తెలుగు అర్జున్‌రెడ్డిలా హిట్ అవుతాయా.. లేదా చెప్పలేం. కానీ తెలుగు అర్జున్‌రెడ్డి ట్రైలర్స్ వచ్చినప్పుడే చాలామంది చెప్పేశారు. ఇదేదో బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని. పిక్చర్ కోసం ఎదురు చూసేలా చేసిన ట్రైలర్స్ అవి. సినిమా అంతా అర్జున్‌రెడ్డి చుట్టూ తిరుగుతుంది. అర్జున్‌రెడ్డి సినిమా అంతా షాలిని చుట్టు తిరుగుతాడు. అర్జున్‌రెడ్డి గొంతు, అతడి మాట ఓ రకంగా ఉండడం కూడా ఆడియెన్స్‌కి ఎక్కింది. ట్రైలర్లో.. ‘‘చూడండీ.. మీకో విషయం చెప్పడానికొచ్చిన. అధ్యాపకురాలికి అర్థం గాకుండా, ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను సరిగా వినండి’’ అని అర్జున్‌రెడ్డి.. క్లాస్‌రూమ్‌కి వెళ్లి చెప్పే సీన్, ఫుట్‌బాల్‌లో కోర్టులో ‘ఏయ్.. అమిత్’ అని పిలిచి అమిత్‌ని అర్జున్‌రెడ్డిని రెచ్చగొట్టే సీన్.. సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసేలా చేశాయి. అర్జున్‌రెడ్డి ట్రైలర్‌ని చూసిన కళ్లతో, వర్మా ట్రైలర్‌ని చూడలేకపోయారు ఆడియన్స్. తెలుగు ఆడియన్సే కాదు, తమిళ్ ఆడియన్స్ కూడా! బాలా సినిమాల్లోని సైకో సీన్లు, లస్ట్ సీన్లు చూస్తున్నట్లే ఉంది కానీ, కొత్తదనం లేదు. బాలా క్రియేటివ్ డైరెక్టర్. ఆయన్ని తీసుకొచ్చి తర్జుమా చేసి పెట్టి ‘గురూ నీ స్టయిల్లో చెయ్యి’ అంటే ఇలానే ఉంటుంది. గుడ్ డైరెక్టర్ రాంగ్ చాయిస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి లాంటి ‘కల్ట్’ మూవీలను సబ్ టైటిల్స్‌తో సరిపెట్టుకోవాలి. రీమేక్ చేసుకుంటే కల్ట్ మిస్ అయి, మూవీ మాత్రమే మిగులుతుంది. అర్జున్‌రెడ్డి హీరోయిన్లు తెలుగు: షాలినీ పాండే (25) చెప్పేదేముందీ! ప్రీతి క్యారెక్టర్‌కు భలే సరిపోయింది. అర్జున్‌రెడ్డి తొలి చిత్రం. ఆ తర్వాత నాలుగు చిత్రాల్లో నటించారు. మరో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళం: మేఘా చౌదరి (26) మేఘ బెంగాలీ అమ్మాయి. మోడల్. ఆరేడు తమిళ చిత్రాల్లో నటించారు. ‘వర్మా’లో లవర్ గర్ల్‌గా బాగా సెట్ అయ్యారు. ప్ఛ్. ఆ సినిమాను మళ్లీ తీస్తున్నారు. మళ్లీ ఆమెనే తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది కానీ, నిర్మాతలు జాహ్నవి వైపు చూస్తున్నారు. చివరికి బిన్నిత దగ్గర సెటిల్ అయ్యారు. జాహ్నవీ కపూర్ (21) ‘వర్మా’ రీషూట్‌లో మేఘకు బదులుగా జాహ్నవిని అనుకున్నారు. బాలీవుడ్ మూవీ ‘ధడక్’తో సినిమాల్లోకి వచ్చారు జాహ్నవి. ఎక్స్ప్రెషన్స్ ఇంకా కుదురుకోలేదు. అర్జున్‌రెడ్డిలోని లాస్ట్ సీన్లో (గర్భిణిగా ఉన్నప్పుడు అర్జున్‌రెడ్డితో పార్కులో ఎమోషనల్‌గా మాట్లాడే సీన్) ఆమె ఎలా చేస్తారన్నది రాబోయే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు జాహ్నవి లేదు. ఆమె స్థానంలోకే బనితా వచ్చింది. బనితా సంధూ (21) టీవీ సీరియళ్లు, డబుల్ మింట్ చూయింగ్ గమ్, ఓడాఫోన్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. పదకొండో ఏట నుంచే సీరియళ్లలో నటిస్తోంది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘అక్టోబర్’ సినిమాలో నటించింది. అనన్యా పాండే (19) ఈ ఏడాది మే లో విడుదల అవుతున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో నటిస్తోంది. నటుడు చుంకీ పాండే కూతురు. కరణ్ జోహార్ తాజా చాట్ షోలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. వాటిని తేలిగ్గా తీసుకుని నవ్వగలుగుతోంది అనన్య. హిందీ: కైరా అద్వానీ (26) ఈ నలుగురిలోనూ సీనియర్. ‘కబీర్ సింగ్’ హీరోయిన్. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించారు. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖంలో ముగ్ధత్వమేం కనిపించదు. పరిణతి ఉంటుంది. మరి అర్జున్‌రెడ్డి హీరోయిన్గా సరిపోతుందా! సందీప్ తంటాలు పడుతున్నాడుగా. పడనివ్వండి. -
ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద విజయాలు, ఊహించని పాపులారిటీని సంపాదించారు విజయ్ దేవరకొండ. యూత్‌లో ఫాలోయింగ్, సొంత దుస్తుల సంస్థ, వంద కోట్ల క్లబ్ (‘గీత గోవిందం’ సినిమా)తో 2018ని సక్సెస్‌ఫుల్‌గా ముగించారు విజయ్ దేవరకొండ. తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా 30 ఏళ్ల వయసులోపు వివిధ రంగాల్లో సూపర్ సక్సెస్‌ను, పాపులారిటీను ఎంజాయ్ చేస్తున్న వారి పేర్లను ఓ జాబితాగా ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేస్తుంది. తాజా ఎడిషన్‌లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో విజయ్ దేవరకొండ చోటు సంపాదించారు. ‘‘తెలుగు సినిమాల్లో రైజింగ్ స్టార్ విజయ్. తను చాలా సింపుల్‌గా, గ్రౌండెడ్‌గా ఉంటారు. ఎటు వెళ్లాలో తనకు క్లియర్‌గా తెలుసు’’ అంటూ ఆ మేగజీన్ పేర్కొంది. -
‘అందుకే నన్ను రిజెక్ట్ చేశారు’
గండర గండ సోగ్గాడివంట..కండలు తిరిగిన పోరగానివంట..‘బందిపోటు దొంగలు’ సినిమాలో పాట ఇది.విజయ్ దేవరకొండ ఏం తక్కువ బందిపోటు కాదు.బుట్టల కొద్దీ మనసులు దోచుకుంటున్నాడు..కట్టల కొద్దీ లవ్ లెటర్స్ దాచుకుంటున్నాడు.ఎవరికీ దొరకనంటాడు..‘సాక్షి’ రీడర్‌కి దొరికాడు. ‘2018 నాదే’ అని హ్యాపీగా చెప్పుకునేలా ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి రెండు హిట్స్ ఇచ్చారు. ఈ ఏడాది గురించి మీ ఒపీనియన్? విజయ్: ఈ సంవత్సరం చాలా పని చేశాను. అటే అంత పని చేశానని కంప్లైంట్లా చెప్పడంలేదు. నాలుగు రిలీజులు, వాటిలో రెండు లీకైన సినిమాలు, విజయాలు, అపజయాలు, ప్లేబ్యాక్ సింగింగ్, సమస్యలు, సమస్యలను అధిగమించడం, నా సొంత ‘క్లాతింగ్ లైన్’ని ఆరంభించడం, నిర్మాణ సంస్థను ప్రారంభించడం... వీటన్నిటితో బిజీ బిజీగా చాలా లైవ్లీగా 2018 గడిచింది. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలేమైనా? నేనెప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. అనిపించింది చెయ్యాలి... ఇష్టంగా చెయ్యాలి. పూర్తిగా బతకాలి. నేను ప్రతిరోజూ ట్రై చేసేది ఇదే. 100 కోట్ల క్లబ్ (‘గీత గోవిందం’)లో ఇంత త్వరగా చేరుకుంటానని అనుకున్నారా? మనందరం మన గురించి ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకుంటుంటాం. నేను ఏం చేసినా నచ్చి చేశాను కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ప్రతి రిజల్ట్ నాకేం చెప్పిందంటే ‘రేయ్.. ఇది జరుగుతుంది అని అనుకోకుండా నువ్వు ఇది చేసి ఉంటే.. నువ్వింకా పెద్దవి సాధించే సత్తా నీలో ఉంది’ అని. అందుకే నేనింకా పెద్ద కలలు కంటూ, నన్ను ఇంకా ముందుకు పుష్ చేసుకుంటున్నాను. మీరీ రేంజ్‌కి రావటం వెనక దాదాపు ఏడేళ్ల కష్టం, నిరీక్షణ ఉన్నాయి. ఆ టైమ్‌లో మానసికంగా మీరు డౌన్ అయిన సందర్భాలు ఏమైనా? ఉండేవి ఎలానూ ఉంటాయి. కానీ జీవితం అన్నాక మినిమమ్ ఆ మాత్రం డ్రామా ఉంటేనే మనకు రోజులు గడుస్తాయి. ఆ కష్టాలను, ఎత్తుపల్లాలను అధిగమించి సక్సెస్ అయినప్పుడే మనకి ఒక ఎత్తు, ఒక సంతృప్తి, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. మీ లుక్స్ బాగుంటాయి కాబట్టి ‘ఫేస్ అద్దంలో చూసుకున్నావా’ అని మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు. మరి చాన్సుల కోసం వెళ్లినప్పుడు ఏ కారణంతో మిమ్మల్ని రిజెక్ట్ చేశారు? మనుషులెప్పుడూ వాళ్ల ఫేస్ వల్ల రిజెక్ట్ అవ్వరు. వాళ్లు ‘నో వన్’ (ఏమీ కారు) అనే కారణంతో తిరస్కరణకు గురవుతారు. అప్పుడు నేను ‘నో వన్’. అందుకే నన్ను రిజెక్ట్ చేశారు. కొందరు యూత్ వెంటనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మీ లైఫ్ నుంచి వారికి ఇచ్చే సలహా? నేను సలహాలు ఇచ్చే బిజినెస్‌లో లేను (నవ్వేస్తూ). ఒకవేళ మీరు ఓవర్ నైట్ స్టార్ అయ్యుంటే ఇంత హ్యాపీనెస్ ఉండేదా? ఓపిక వహించి సక్సెస్ కొట్టడంలోనే ఎక్కువ మజా ఉందా? హ్యాపీనెస్ స్టార్ అవ్వడంలో లేదు. ఆనందం ఎందులో ఉంటుందంటే.. తినడానికి, ఖర్చులకు డబ్బులు ఉండటం, ఉండటానికి ఇల్లు, డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు భయంతో కాకుండా నచ్చింది చేయడం, అమ్మానాన్న, నా ఫ్రెండ్స్ ఫేసెస్‌లో గర్వం, సంతోషం చూడటంలో ఉంటుంది. సో ఇవి ఎలా వచ్చినా, ఎప్పుడు వచ్చినా నాకు ఓకే. బ్యాగ్రౌండ్ ఉండటం చాలా మంచిదంటారు. కానీ బ్యాగ్రౌండ్ కన్నా టాలెంట్ పెద్దదైతే అప్పుడు ఏ బ్యాగ్రౌండ్ అక్కర్లేదనడానికి మీరో ఎగ్జాంపుల్. మీరేమంటారు? ప్రకృతి ఎప్పుడూ ‘డిమాండ్ అండ్ సప్లై’ మీద నడుస్తుంటుంది. ఉన్నవాళ్లకి డిమాండ్ ఉంటుంది. నేను నా అంతట నాకు డిమాండ్ క్రియేట్ చేసుకుని, సప్లై అయ్యాను. రౌడీ బాయ్స్ అండ్ గాళ్స్ అంటూ ఫ్యాన్స్‌ని సంబోధిస్తుంటారు. ఫ్యాన్స్‌ని ఇలా సంబోధించాలనే ఆలోచన ఎక్కడిది? ఫ్యాన్స్ అనే పదంతో నాక్కొంచెం ఇబ్బంది. ఆ పదానికి బదులు వేరే ఏదో ఉంటే బాగుంటుందనుకున్నా. అది బై చాన్స్ ‘రౌడీ’ అయ్యింది (నవ్వుతూ). ఒకరి ఫెయిల్యూర్ని ఇంకొకరు సెలబ్రేట్ చేసుకుంటూన్నారంటే.. ఫెయిల్యూర్ని ఎదుర్కొన్న వ్యక్తి టాప్‌లో ఉన్నట్టే. మరి మీ సినిమా ఫెయిల్యూర్‌కి పార్టీ చేసుకున్న వాళ్ల గురించి ఏమంటారు? హహ్హహ్హ... అసూయ, పోటీతత్వం అనేవి సహజమైన ఎమోషన్స్. ఆ ఫీలింగ్స్ నుంచే ఇంకా వర్క్ చేద్దాం, ఇంకా ఏదైనా ట్రై చేద్దాం, ఇంకా.. ఇంకా అనే బోలెడన్ని మంచి ఫీలింగ్స్ వస్తుంటాయి. అందుకని అలాంటివి జరగడం మంచిదే. కాంపిటీషన్‌ని డీల్ చేయడం, స్టార్‌డమ్‌ని హ్యాండిల్ చేయడంలో ఉన్న కష్టాల? సినిమా ప్రపంచం చాలా విచిత్రమైనది. ఓ యాక్టర్‌గా జీవితం చాలా అసహజంగా ఉంటుంది. అందుకే నాకు నేను ఎప్పటికప్పుడు ‘మనం ఇక్కడ ఉన్నది నటించడానికి మాత్రమే. పోటీని ఎదుర్కోడానికి, స్టార్‌డమ్‌ని హ్యాండిల్ చేయడానికి కాదు’ అని గుర్తు చేసుకుంటుంటాను. మన పని మనం చెయ్యాలంతే. మీ డ్రెస్ కోడ్ విచిత్రంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడంలో ఇది ఓ భాగమా? వేసుకునే బట్టల గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదని నా ఫీలింగ్. ఎవరు ఏ బట్టలు వేసుకున్నా మనకెందుకు? వాళ్లు హ్యాపీగా ఉండి, ప్రెజెంటబుల్‌గా ఉంటే చాలనుకుంటాను. ఒక రెండేళ్ల క్రితం మీ బొమ్మ బయట ఏ గోడ మీదా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఈ రోడ్డు మీద ఉన్న బొమ్మ నుంచి ‘డిటాచ్’ అయిపోయా. ఆ గోడ మీద ఉన్న అతను నాకు కేవలం ఒక నటుడు మాత్రమే. అతను అతని పని చేసుకుంటున్నాడు అనుకుంటా. అతన్ని చూసినప్పుడు నాకెలాంటి ఫీలింగ్స్ ఉండవు. మీ కెరీర్ ఎదుగుదలలో ఎవరికైనా కృతజ్ఞతగా ఉండాలంటే.. చెప్పడానికి ఏమైనా పేర్లున్నాయా? కృతజ్ఞతలు తెలపడం మాత్రమే కాదు దాన్ని ‘రీపే’ చేసి తీరుస్తా. ఇవాళ నేను ఏంటి? నేను ఎక్కడున్నాను? అనే ఈ జర్నీలో తెలిసీ తెలియక చాలామంది వ్యక్తులు కీలకపాత్ర పోషించారు. నా శక్తి మేరకు వాళ్ల జీవితాలకు తిరిగి ఏదైనా చేయడానికి ట్రై చేస్తా. యూత్‌ఫుల్ హీరోని సీరియస్ క్వొశ్చన్స్ అడుగుతున్నాం. ఇప్పుడు మీ ఏజ్‌కి తగ్గట్టు పార్టీయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ యు ఏ పార్టీ యానిమల్? నాకు ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేయడం ఇష్టం. అలాగే వాళ్లతో స్పోర్ట్స్ ఆడటం ఇష్టం. నా ఇంటి టెర్రస్ మీద రాత్రుళ్లు గంటల తరబడి మాట్లాడంలో ఓ మజా ఉంటుంది. పార్టీయింగ్ అనే కాన్సెప్ట్ నాకు లేదు. లవ్ ఫెయిల్యూర్ అయితే ‘అర్జున్ రెడ్డి’లో డ్రగ్స్ తీసుకున్నారు. మరి రియల్ లైఫ్‌లో ఎవరైనా అలా చేస్తే? అది సినిమాలో క్యారెక్టర్. అంతే.. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ చేయరు. బుద్ధి ఉన్నోళ్లు వాటి వైపు వెళ్లరు కూడా. ఒకవేళ మీరు లవ్‌లో ఫెయిల్ అయితే దేవదాస్ అవుతారా? ఏమో.. ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు అందుకున్న లవ్ లెటర్స్‌లో మిమ్మల్ని బాగా ఎగై్జట్ చేసిన లెటర్? నాకు రాసిన ప్రతి లెటర్ని చదివేటప్పుడు నేను ఎమోషనల్ అవుతా. అందుకే అన్ని లెటర్స్‌ని జాగ్రత్తగా దాచుకోవాలని డిసైడ్ అయ్యాను. ‘నా పంతం ఎంతా.. ఈ విశ్వమంతా..’ అని ‘అర్జున్‌రెడ్డి’లో పాడారు. అమ్మాయిల్లో మీ ఫాలోయింగ్ విశ్వమంత. మరి ‘నన్నే పెళ్లాడాలని’ ఎవరైనా పంతం పడితే? పెళ్లికి నేను రెడీగా లేను. సో.. ఇప్పుడు ఏమీ చేయలేను. కొడుకు సక్సెస్ తల్లికి బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది. మీ అమ్మ గురించి చెప్పండి? పట్టలేనంత ఆనందం, సంతృప్తి అరుదుగా కలుగుతుంటాయి. అమ్మ కళ్లలో ఆనందం చూసినప్పుడు నేనలా ఫీలవుతాను. నా సినిమాలు హిట్టయినప్పుడు కూడా పెద్దగా ఏమీ అనిపించదు. మా అమ్మానాన్నకు పెద్ద పెద్ద కోరికలు ఏవీ లేవు. ఒక్క సొంత ఇల్లు తప్ప నన్ను ఏమీ అడగలేదు. నా సక్సెస్‌ని వాళ్లు బాగా ఎంజాయ్ చేయాలని, కొత్త కొత్తవి కొనుక్కోవాలని, ట్రావెల్ చేయాలనీ ఉంటుంది. కానీ వాళ్లు ఇవన్నీ కాకుండా జస్ట్ నా వర్క్, ప్రేక్షకుల నుంచి నాకు దక్కుతున్న ప్రేమను చూసి ఆనందపడుతున్నారు. ఆ మధ్య మీ అమ్మకు బాలేనప్పుడు దగ్గరుండలేకపోతున్నా. ఈ కెరీర్ ఎందుకు అనుకున్నారట? ఏమో.. అప్పుడున్న పరిస్థితిలో అలా అనిపించింది. అమ్మానాన్న నా ప్రపంచం. ఇంత చేసి వాళ్లతో ఉండలేకపోతే ఏం లాభం అని కోపం వచ్చింది. ఆ ఎమోషన్లో అలా అనుకున్నాను. ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు? మా నాన్నగారు ఊళ్లో వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు ఊళ్లో నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. సో.. అక్కడ ఏదైనా ప్లాన్ చేసుకునేవాడిని. హీరోగానేనా? వేరే లక్ష్యాలేమైనా? నా క్లాతింగ్ లైన్ ‘రౌడీ వియర్’ ఎదుగుతోంది. రానున్న రెండేళ్లలో అది 100 కోట్ల కంపెనీ అవుతుంది. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. త్వరలో ఈ సంస్థ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ గురించి అందరూ వింటారు. 2018లో న్యూ టాలెంట్ వచ్చింది. 2019లోనూ జరుగుతుందా? కచ్చితంగా.. ఎప్పుడూ న్యూ టాలెంట్ వస్తూనే ఉంటుంది. అది ఇండస్ట్రీకి మంచిది. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా. ఫైనల్లీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెబుతారా? ఈరోజు (శనివారం) వెళ్లిపోతున్నా. ఏ ప్రాంతానికి వెళుతున్నానో చెప్పను. ఫోన్ పని చేయని చోటు అది. ఓ దీవిలో బోటులో ఉంటాను. ఒక్క పది రోజులు ఎవరికీ అందకుండా కొత్త ప్రపంచాన్ని చూసి వస్తా. – డి.జి.భవాని పుస్తకాలు చదువుతారా? చదివితే.. ఎలాంటి పుస్తకాలు? చదువుతాను. అయితే ఇప్పుడు తక్కువైంది. కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. లవ్‌స్టోరీలు తప్ప అన్ని రకాల పుస్తకాలు చదువుతాను. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఆలోచిస్తాను. ఏదైనా మన మనసుని బట్టే ఉంటుంది. -
నన్ను వదిలేయండి ప్లీజ్
‘‘మొన్ననే ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్.. ఇప్పుడు ‘నోటా’ ప్రమోషన్స్. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రమోషన్స్‌తో చాలా అలసిపోయాను. శుక్రవారంతో ఈ ప్రమోషన్స్‌కి స్వస్తి చెబుతా. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదు. అయినా ఇది చాలా మంచి అనుభూతినిస్తోంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా, మెహరీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► రాజకీయాలంటే ఇష్టం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని దింపుతారు. అప్పుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ‘నోటా’ కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే నటనంటే నాకూ ఇష్టమే. ఇందులో కొన్ని సొసైటీలో జరిగిన సంఘటనలున్నాయి. ‘నోటా’ని ఎంకరేజ్ చేయాలన్నది మా సినిమా ఉద్దేశం కాదు. టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం. ► ‘నోటా’ కథ విన్నప్పుడు తమిళ రాజకీయాల గురించి తెలియదు. కథ వినగానే కనెక్ట్ అయ్యా. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మా సినిమా చూశాక ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ సినిమా తెలంగాణలోని ఓ పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. వివాదం చేసేకొద్దీ మా చిత్రానికి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి (నవ్వుతూ). అయినా వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ► నటుడిగా బిజీ కాకపోతే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళదామని గతంలోనే బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నా. జనరల్‌గా సినిమా రిలీజయ్యాక పైరసీ చేయడం కామన్. అయితే ‘గీత గోవిందం’ 2.30 గంటలు లీక్ అయింది. ప్రేక్షక్షులు థియేటర్‌కి రారేమో? అనుకున్నా. ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్ అయింది. ఈ రెండు సినిమాల కోసం ఏడాదిన్నర్ర పనిచేశా. ఇలా లీక్ చేస్తే సినిమా చేసి ఏం లాభం? అనిపించింది. ► తమిళ్లో మంచి సినిమాలు చేస్తున్నారని మనవాళ్లు అంటున్నారు. కానీ, తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి..’ వంటి ఎన్నో మంచి సినిమాలొస్తున్నాయి. మంచి నటీనటులు, రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు గ్రాండ్‌గా ఉంటున్నాయి. చక్కటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ► ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్ అవుతుందని నేను, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్ చేస్తా. ► ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. ‘నోటా’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోల్లో మీతో కలిసి ఉన్న ఫారిన్ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు.. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. వేరే ఎవరో అని చెప్పను. తను ఓ మంచి అమ్మాయి’ అని నవ్వేశారు. -
ఇక మాలీవుడ్‌లోనూ!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. అలాగే షాహిద్ కపూర్ హీరోగా హిందీ ‘అర్జున్ రెడ్డి’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్‌రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో చర్చ జరగడం ఖాయం. -
నోటా : డిఫరెంట్ లుక్‌లో విజయ్ దేవరకొండ
-
నా పెళ్లి ఆగిందని విని నవ్వుకున్నా
‘‘నాకు బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, త్రో బాల్ అంటే ఇష్టమే. కానీ, ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఆ ఆట నాకు అర్థం కాదు. అయితే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో క్రికెటర్‌గానే నటించాల్సి వచ్చింది. అందుకే క్రికెట్ నేర్చుకుంటుంటే దానిపై ఫోకస్ పెరిగినట్టు అనిపించింది’’ అని రష్మికా మండన్న అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి రష్మికా మండన్న గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘గీత గోవిందం’ సినిమాకి నాకంటే ముందు వేరే హీరోయిన్లను సంప్రదించారు. వాళ్లు ఎందుకు కాదన్నారో తెలీదు. నేను మాత్రం డేట్లు టైట్‌గా ఉన్నా అడ్జస్ట్ చేసుకుని చేశా. ఇప్పుడు సూపర్ హ్యాపీగా ఉన్నా. నాకొచ్చే ప్రతి సినిమా గురించి మా ఇంట్లో, నా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తా. రియల్‌గా నేను చాలా సరదాగా ఉంటాను. ఎంత కోపం ఉన్నా లోపల దాచుకోవడానికే ప్రయత్నిస్తా. ‘గీత గోవిందం’ కోసం ఏడు నెలలు కోపంగానే నటించా. సినిమా చివరి 15 రోజులు సరదాగా ఉన్నా. సెట్లో విజయ్ దేవరకొండ ‘మేడమ్ మేడమ్’ అంటుంటే నవ్వు వచ్చేది. మానిటర్లో సినిమా చూసుకునే అలవాటు నాకు లేదు. ప్రేక్షకులతో కలిసే చూస్తా. ‘గీత గోవిందం’ అలాగే చూశా. స్క్రీన్ మీద నేను ఉన్నాననే ధ్యాసే లేదు. అంత బాగా ఎంజాయ్ చేశా. అనవసరంగా చేసే విమర్శల గురించి స్పందిస్తూ నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు, రక్షిత్‌కి పెళ్లి జరగదనే వార్తలు విని నవ్వుకున్నా. ఎందుకంటే మేమేంటో మాకు బాగా తెలుసు. నిశ్చితార్థం జరిగినప్పుడు రెండున్నరేళ్లలో చేసుకుందామనుకున్నాం. ఇప్పుడు ఇద్దరం వృత్తిపరంగా బిజీగా ఉన్నాం. అందుకే ఇంకా తేదీలు అనుకోలేదు. నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కన్నడ ప్రజలే. అందుకే అక్కడ సినిమాలు తగ్గించాలనుకోవడం లేదు. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా, మరో రెండు సంతకాలు జరుగుతున్నాయి. కథ నాకు నచ్చితే ఏ భాషలో సినిమా చేయడానికైనా రెడీ. అసలు గ్లామర్ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల్లో నేను ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో ‘డియర్ కామ్రేడ్, ‘దేవదాస్’ చిత్రాల్లో నటిస్తున్నా. నన్ను దృష్టిలో పెట్టుకుని ఓ నెగటివ్ పాత్ర రాయమని దర్శకుడు పరశురామ్‌కి చెప్పా. పీరియాడికల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది. -
హీరోలు చేస్తే ఒప్పా?
టాలీవుడ్లో కథానాయికగా అడుగుపెట్టడానికి ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. రక్షిత్‌తో ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. ‘ఛలో’ తర్వాత తెలుగులో ఆమె చేసిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత సినిమాలో మితి మీరిన రొమాన్స్ అవసరమా? అంటూ కొందరు నెటిజన్స్ రష్మికపై కామెంట్స్ విసిరారు. ఈ కామెంట్స్ గురించి రష్మిక స్పందన ఇలా ఉంది. ‘‘గీత గోవిదం’ పోస్టర్స్ చూసి కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. యాక్టర్‌గా నా ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? అనిపిస్తోంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్‌తో హీరోలు రొమాన్స్ చేస్తున్నారు కదా? అది తప్పు కాదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్స్ రొమాన్స్ చేస్తే మాత్రం వాళ్ల గౌరవం తగ్గిపోతుందా? ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నేను రక్షిత్‌తో ఎంగేజ్ అయ్యానని, విజయ్ దేవర కొండతో యాక్ట్ చేస్తున్నానని అసూయ పడేవాళ్లే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారే మో’’ అన్నారు రష్మిక. -
ఇప్పుడు హీరోగా!
విజయ్ దేవరకొండ కెరీర్ దూసుకెళ్తోంది. ఆల్రెడీ హీరోగా రెండు ప్రాజెక్ట్స్ (నోటా, డియర్ కామ్రేడ్)తో బిజీగా ఉన్న విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘అలా మొదలైంది’ ఫేమ్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుందట. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లో చేసిన ఇంపార్టెంట్ రోల్ విజయ్ దేవర కొండను బాగా పాపులర్ చేసింది. అదే బేనర్లో ఇటీవల విడుదలైన ‘మహానటి’ సినిమాలో కీలక పాత్ర చేశారు విజయ్. ఇప్పుడీ బేనర్లో హీరోగా నటించనుండటం విశేషం. విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది.