Vijaysethupathi
-
విజయ్‌సేతుపతి ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్
కోలీవుడ్ హీరో విజయ్‌సేతుపతి నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా నిత్యామీనన్ ఇంతకుముందు తను నటించిన 'తిరుచ్చిట్రంఫలం' తెలుగులో 'తిరు' చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అలాంటి వీరి కాంబినేషన్లో చిత్రం అంటే భారీ అంచనాలు నెలకొంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.ఇద్దరూ కూడా కథలో ప్రాధాన్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నటులే.. అలాంటి క్రేజీ కాంబోలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ ఒక చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్ కథ, దర్శకత్వం వహించనున్నారు. 1950 నుంచి ఎంజీఆర్, శివాజీగణేశన్, రజనీకాంత్, కమలహాసన్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌తో దర్శకుడు పాండిరాజ్, విజయ్‌సేతుపతి కొలాబ్రేట్ కావడం విశేషం. కథకు ప్రాముఖ్యతనిస్తూ ఆరు నుంచి అరవై ఏళ్ల వారిని అలరించేలా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్న నిత్యామీనన్ నాయకిగా నటించడం మరో విశేషం అని చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్లో నిత్యామీనన్ త్వరలో పాల్గొంటారని పేర్కొన్నాయి. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సత్యజ్యోతి ఫిలింస్ నిర్వాహకులు తెలిపారు. -
కొత్త టాలెంట్‌ను బయటకు తీసిన విజయ్‌సేతుపతి
స్టార్ హీరోలు పాటలు పాడడం పరిపాటిగా మారింది. కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా మరో మల్టీ టాలెంటెండ్ హీరో విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన 'కరా' అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా. దీని విశేషం ఏమిటంటే మొసలి ఇతి వృత్తంతో రూ పొందడం. ఈ చిత్రం ద్వారా నటి సాహిబా బాసిన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు జీవా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్, సేలం వేంగై కె.అయ్యనార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై రాజేంద్రకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని, గీరీశన్ ఏజీఏ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మొసలి తమిళ పేరు కరా అని చెప్పారు. ఈ చిత్రం కోసం నటుడు విజయ్‌సేతుపతి పాడిన కాదల్ కుమారు వైరల్ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
ఇలాగైతే... ఎలా మాస్టర్?
చిత్రం:‘మాస్టర్’ తారాగణం: విజయ్, విజయ్ సేతుపతి మాటలు: రాజేశ్ ఎ. మూర్తి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్ రిలీజ్: జనవరి 13 దాదాపు ఏణ్ణర్ధం శ్రమ... లాక్ డౌన్ అనంతర ప్రపంచంలో తమిళనాట విడుదలవుతున్న తొలి బిగ్ బడ్జెట్, బిగ్ రిలీజ్ ఫిల్మ్! తమిళంలో తయారై, తెలుగులోనూ రిలీజైన విజయ్ ‘మాస్టర్’ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్లుగా వెలుగుతున్న హీరో విజయ్, విలక్షణ నటుడు సేతుపతి ప్రత్యర్థులుగా రూపొందిన చిత్రం ఇది. కానీ ఆ స్టార్లు మినహా ‘మాస్టర్’లో ఇంకేముందంటే జవాబు కష్టం. కథేమిటంటే..: వరంగల్‌లో చిన్నప్పుడే కొందరు దుర్మార్గుల వల్ల తల్లితండ్రులను కోల్పోయి, పిల్లల జైలులో పెరిగి, కసి కొద్దీ దుష్టుడిగా మారిన వ్యక్తి భవాని (విజయ్ సేతుపతి). ఆ బాల నేరస్థుల అబ్జర్వేషన్ హోమ్‌లోని వాళ్ళందరికీ గంజాయి, మందు అలవాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ ఉంటాడు. మరోపక్క స్టూడెంట్స్ ప్రేమించే ఓ కాలేజీ ప్రొఫెసర్ జె.డి. (విజయ్). ఆ పిల్లల జైలును ఒక దారిలో పెట్టే పని అనుకోకుండా ఆ మాస్టర్ చేతిలో పడుతుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, మద్యానికి బానిసైన హీరోలో వచ్చిన మార్పు, చివరకు అతను భవాని ఆట కట్టించిన తీరు – మూడు గంటల ‘మాస్టర్’ చిత్రం. ఎలా చేశారంటే..: హీరో విజయ్ తన స్టార్ హోదాకు తగ్గట్లు నటించారు. సినిమానంతా తన భుజాల మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అలాగే, సేతుపతి విలన్ పాత్రను తనదైన పద్ధతిలో పండించారు. కానీ, ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న సీన్లలో ఉన్నంత బిల్డప్ స్క్రిప్టులో, సినిమాలో లేకపోవడం విషాదం. హీరోకు ప్రత్యేకించి హీరోయినంటూ లేని ఈ సినిమాలో మాళవికా మోహనన్ ఉన్నంతలో హీరోయిన్ అనుకోవాలి. బాణాలు పట్టుకొని, నటి ఆండ్రియా ఎదురవుతారు. కానీ, ఈ నటీమణులెవరివీ కీలకపాత్రలు కాకపోవడం విచిత్రం. ఎలా తీశారంటే..: గతంలో సందీప్ కిషన్‌తో ‘నగరం’, కార్తీతో ‘ఖైదీ’ లాంటి చిత్రాలు అందించిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు ఇది ముచ్చటగా మూడో సినిమా. మొదటి రెండు సినిమాలనూ కథ, కథన బలాలతో నడిపించిన ఈ యువ దర్శకుడు ఈసారి మాత్రం ‘మాస్టర్’ కథను రాసుకోవడంలో, తీయడంలో రాజీపడ్డట్టుంది. సేతుపతి, విజయ్– ఇలా ఇద్దరు హాట్ స్టార్లను తీసుకున్నాక, ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ, వారిని కథలో ఇరికించడానికే ఎక్కువ ఎనర్జీ పెట్టినట్టుంది. వెరసి, ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ‘మాస్టర్’గా కాకుండా మా ‘స్టార్’గా తీశారు. అదే ఈ సినిమాకు పెద్ద బలహీనత. అలాగే, తెర మీది భావోద్వేగాలను కథలా చూపడమే తప్ప, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలోనూ డైరెక్టర్ ఫెయిలయ్యారు. విలన్, హీరోల పరిచయానికే అరగంట తీసుకున్న ఈ సినిమాలో అసలు కథ కన్నా పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్, ప్రతి సన్నివేశానికీ బిల్డప్పులపైనే శ్రద్ధ పెట్టారు. మంచివాడిగా మొదలై పిల్లల జైలులో చెడ్డవాడిగా ఎదిగిన విలన్ లక్ష్యంలో క్లారిటీ లేదు. హీరో ఎందుకు తాగుబోతుగా మారాడో అర్థం కాదు. తాగుడు మానేసిన సీన్, సందర్భం కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. తమిళనాట విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా పొలిటికల్ డైలాగు లూ అక్కడక్కడా ఉన్నాయి. గతంలో కార్తీ ‘ఖైదీ’, తెలుగులో వై.ఎస్.ఆర్. బయోపిక్ ‘యాత్ర’ లాంటి వాటికి పనిచేసిన సత్యన్ సూర్యన్ కెమేరా వర్క్ బాగుంది. పి.సి. శ్రీరామ్ శిష్యుడైన సత్యన్ ఈసారి కూడా నైట్ ఎఫెక్ట్ షాట్స్, యాక్షన్ పార్టుల లాంటివి బాగా తీసినా, దాదాపు 3 గంటల క్లాసు పీకిన ‘మాస్టర్’ను అవి గట్టెక్కించలేవు. ప్రత్యేకించి హీరో – హీరోయిన్లకు డ్యూయట్లు, చెప్పుకోదగ్గ పాటలేవీ లేకుండా నేపథ్య సంగీతం మీదే ఆధారపడడంతో, ఈ సినిమాకు కొలవెరి ఫేమ్ అనిరుధ్ సంగీతం పరిస్థితీ అంతే. ఇక, విజయ్ చేసిన ‘గిల్లీ’ (మహేశ్ ‘ఒక్కడు’కు తమిళ రీమేక్)లోని కబడ్డీ సీన్ స్ఫూర్తితో ఈ సినిమాలోనూ తీసిన కబడ్డీ ఫైట్ లాంటి యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే, రాసుకున్న కథలో, తీస్తున్న విధానంలోనే దమ్ము లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నా ఏం లాభం! వెరసి, ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ స్టార్ ఈజ్ నాట్ బిగ్గర్ దేన్ సినిమా అనే పాఠం ఈ ‘మాస్టర్’ గట్టిగా చెబుతుంది. స్క్రిప్టు గనక బలంగా లేకపోతే, స్టార్లున్నా... నో యూజ్ మాస్టర్!! కొసమెరుపు: అన్నట్టు... మూడు గంటల క్లాసు తెరపై చూపించాక, విలన్‌పై విజయం సాధించిన హీరో ‘‘దూల తీరిపోయింది’’ అంటాడు. హాలులో నుంచి బయటకొస్తున్న జనం మనసులో మాట హీరోకి ఎలా తెలిసిందబ్బా? బలాలు: సేతుపతి, విజయ్‌ల స్టార్ పవర్ మెరిసే యాక్షన్, కెమేరా వర్క్ బలహీనతలు: í్రÜ్కప్టును మింగేసిన స్టార్ ఇమేజ్ నీరసమైన కథ, నిదా...నమైన కథనం హీరో, విలన్ మినహా అన్నీ అప్రధాన పాత్రలే వినోదం, పాటలు కొరవడడం – రెంటాల జయదేవ -
‘వీడు ముసలోడు అవ్వకూడదే’
మెగా వారసుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి హీరోహీరోయిన్లు దర్శకుడు బచ్చిబాబు సనా రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఉప్పెన టీజర్ విడుదల చేసింది. నిమిషం నిడివి గల ఈ టీజర్లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమా కథ లాగే పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ) ఇక టీజర్ విషయానికోస్తే.. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్ మీసాలు తిప్పుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించినా.. థియేటర్లు తెరుచుకొవడంతో సినిమాను బిగ్‌స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు) -
కోలీవుడ్: సిల్క్ స్మితగా అనసూయ..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై తళుక్కుమన్న అనసూయ భరద్వాజ్ అవకాశం వచ్చినప్పడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. అయితే సినిమాల సెలక్షన్స్‌లలో ఆనసూయ ఆచితూచి అడుగు వేస్తున్నారు. గ్లామర్ అయినా డీగ్లామరైన పాత్ర నచ్చితేనే ఒకే చెబుతారు. లేదంటే ఎంత పెద్ద దర్శకుడికైన మొహమాటం లేకుండా నో అంటారు. ఈ క్రమంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్లో నటించి మంచి మార్కులు కొట్టెసిన అనసూయ తాజాగా కోలీవుడ్‌లో కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను ఆదివారం సోషల్ మీడియలో పోస్టు చేశారు అనసూయ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేస్తూ.. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం.. కోలీవుడ్’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేగాక రిఫరెన్స్ సిల్క్ స్మిత గారు అంటూ ఆమె పేరును ట్యాగ్ చేశారు. ఈ ఫొటోలో అనసూయ అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఫొజు ఇచ్చి కనిపించారు. (చదవండి: సేతుపతితో రంగమ్మత్త?!) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అయితే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ సినిమా నాటి గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్‌గా రూపొందనుందని ఇందులో అనసూయ లీడ్‌రోల్ పోషిస్తున్నట్లు సమచారం. అనసూయ ఇప్పటికే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కూడా ఆమె ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజు రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో అనసూయ ముఖ్య పాత్ర పోషించడమే కాక ఓ స్పెషల్ సాంగ్‌లో రవితేజతో కలిసి చిందులేయన్నారంట. (చదవండి: అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి) -
మురళీధరన్‌గా విజయ్ సేతుపతి
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ఎంఎస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహించనుండగా...మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ పాత్రలో కనిపిస్తాడు. మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్ కూడా ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మురళీ బయోపిక్కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు. -
రేడియో మాధవ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్’. జయరామ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, ‘నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు. ‘ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు శ్రీ విష్ణుగారికి కృతజ్ఞతలు. గతంలో దుల్కర్ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశాం. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్’ని అందిస్తున్నాం. రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది’ అన్నారు కృష్ణస్వామి. ‘థియేటర్స్ పరిస్థితిని బట్టి విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడారు. -
విలన్ విజయ్
హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథానాయికగా కృతీ శెట్టి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో అంబాసిడర్ కారుకు ఆనుకొని నిలబడి ఓ లుక్ ఉండగా, సిగరెట్ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్న మరో లుక్‌లో విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. హీరోగా తమిళంలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న విజయ్ సేతుపతిది ఇందులో విలన్ పాత్ర కావడం విశేషం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి, సీఈవో: చెర్రీ, కెమెరా: శ్యామ్‌దత్ సైనుద్దీన్, సంగీత దర్శకుడు: దేవి శ్రీప్రసాద్. -
విజయ్ సేతుపతితో స్టార్డమ్ వస్తుంది
‘‘విజయ్ సేతుపతిలో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ‘విజయ్ సేతుపతి’ సినిమాతో తెలుగులో తనకు స్టార్డమ్ వస్తుందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు వి. సముద్ర అన్నారు. విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగ తమిళ్’. విజయా ప్రొడక్షన్స్‌పై భారతీరెడ్డి నిర్మించిన ఈ సినిమాని హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ ‘విజయ్ సేతుపతి’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏయమ్ రత్నంగారు పవన్ కళ్యాణ్‌గారి కాంబినేషన్లో సినిమా అనే వార్తలు వస్తున్నప్పుడు పవన్‌గారి కోసం ఈ కథ రాశా. ఆయన రాజకీయాల్లో ఉండటంతో కుదరలేదు. విజయ్ సేతుపతి కథ వినగానే మెచ్చుకున్నారు’’ అన్నారు విజయ్ చందర్ . -
పేరుతో సినిమా
తమిళంలో హిట్ సినిమా మీద హిట్ సినిమా చేస్తూ అక్కడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు హీరో విజయ్ సేతుపతి. ఇటీవల విడుదలైన ‘సైరా’ చిత్రంలో పాండిరాజ్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు తమిళ్లో ‘సంఘ తమిళన్’గా, తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించగా, తెలుగులో హర్షితా మూవీస్‌పై రావూరి. వి.శ్రీనివాస్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి విజయ చందర్ దర్శకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘విజయ్ సేతుపతి’ సినిమాను తెలుగులో విడుదల చేయటం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నాం’’ అన్నారు. -
ఏం జరిగిందంటే?
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తమిళ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్‌తో వైవిధ్యమైన పాత్రల్లో బాలనటుడిగా నవ్వులు పండించిన మహేంద్రన్‌ని నా చేతుల మీదుగా హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ప్రేమ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్‌గా చేసిన విజయ్ కుమార్‌గారు ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు, కర్ణ అందమైన విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మల్లేశం.వి, సుజాత.ఎం, రాజేష్.బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సోల్మన్. -
ఇంకోటి!
ఈ ఏడాది తమిళ నటుడు విజయ్ సేతుపతికి విభిన్నంగా సాగుతోంది. హీరోగా, విలన్‌గా, ట్రాన్స్‌జెండర్‌గా రకరకాల పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు కూడా అలానే ఉంటాయని అర్థం అవుతోంది. దానికి కారణం ఆ సినిమాల్లో సేతుపతి గెటప్సే. తాజాగా ‘కడైసి వివసాయి’ అనే సినిమాలో మానసికంగా ఆరోగ్యవంతంగా లేని పాత్రలో కనిపిస్తారట. మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు విజయ్ సేతుపతి. ఇందులో అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘కడైసి వివసాయి’ ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు
తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియో ప్రతినిధి శశికాంత్ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్ స్టూడియోస్ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు. -
మణిరత్నం చిత్రంలో మల్టీస్టారర్స్
సినిమా: మణిరత్నం తాజా చిత్రం స్టార్స్‌మయంగా మారుతోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌తో చిత్రం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే మణిరత్నంకు మల్టీస్టారర్ చిత్రాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన దళపతి చిత్రాన్నే రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామి, శోభన, భానుప్రియ వంటి ప్రముఖ నటీనటులతో చేసి విజయం సాధించారు. అదేవిధంగా ఇటీవల అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక వంటి స్టార్స్‌తో సెక్క సివందవానం చిత్రాన్ని తీసి సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని మల్టీస్టారర్స్‌తో చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఈ చిత్రాన్ని చాలా కాలం క్రితమే విజయ్, టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్ వంటి వారితో చేయ తలపెట్టారు. అయితే అది అప్పట్లో సెట్ కాలేదు. తాజాగా అదే చిత్రాన్ని మరింత భారీ తారాగణంతో రూపొందించడానికి రెడీ అయ్యారు. ఇందులో విక్రమ్, విజయ్‌సేతుపతి, జయంరవి, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, టాలీవుడ్ స్టార్ నటుడు మోహన్‌బాబు వంటి వారిని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా మరో స్టార్ నటుడు కార్తీ కూడా ఈ మల్టీస్టారర్ చిత్రంలో యాడ్ అవుతున్నట్లు తెలిసింది. త్వరలో సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఆ పొన్నియన్ సెల్వన్ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
సమంత.. కెరీర్లో తొలిసారిగా
తన కేరీర్‌లోనే తొలిసారిగా ఒక పాత్ర కోసం కష్టపడి నటించినట్లు నటి సమంత పేర్కొంది. ఈ అమ్మడు అంతగా కష్టపడి నటించిన చిత్రం ఏంటబ్బా! సమంత బహుభాషా నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది. గతేడాది నటించిన చిత్రాలన్నీ సమంతను సక్సెస్ బాటలో నడిపించాయి. ఈ ఏడాది అది రిపీట్ చేయాలని సమంత ఆశ పడుతోంది. అలా ఇటీవల తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం తెరపైకి రానుంది. దీని విజయం సమంతకు చాలా ముఖ్యం. అయితే ఈ బ్యూటీ కష్టపడి నటించిన చిత్రం మాత్రం అది కాదు. తమిళంలో అరండకాండం చిత్రం ఫేమ్ త్యాగరాజన్ కామరాజా దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా సూపర్ డీలక్స్ చిత్రంలో నటిస్తోంది. (ఆ పాత్రకు నో చెప్పిన సమంత..!) ఇందులో ఫాహత్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఇందులో విజయ్‌సేతుపతి తొలిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు తళుక్కుమననున్నారు. కాగా నటి సమంత పాత్రా చాలా వైవిధ్యంగా ఉంటుందట. కథనే విభిన్నంగా ఉండటంతో అందులో నటించడానికి ఇంతకు ముందెప్పుడూ లేనంతగా చాలా కష్టపడినట్లు సమంత ఒటీవల ఒక భేటీలో పేర్కొంది. ఇందులోని వేంబు అనే పాత్ర కోసం దర్శకుడి సలహా మేరకు రిహార్సల్స్ చేసి నటించానని, ఈ చిత్రంలోని పాత్ర తనకే కాకుండా తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది.కాగా సూపర్ డీలక్స్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. -
వేసవి నుంచి వేగం
2018లో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘96’ ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషించనున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ లవ్ స్టోరీని తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. హీరోయిన్గా సమంత యాక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం, పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం, వారిలో ఓ ప్రేమ జంట వాళ్ల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఇలా సినిమా కథ సాగుతుంది. వేసవి నుంచి ఈ షూటింగ్లో జాయిన్ అయి జ్ఞాపకాల్లో వేగంగా వెనక్కి వెళ్తారన్నమాట శర్వానంద్. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు శర్వానంద్. -
బుల్లితెర టైమ్ వచ్చింది!
కోలీవుడ్‌లో వెండితెరపై నటుడిగా సూపర్‌సక్సెస్ సాధించారు విజయ్ సేతుపతి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్‌గా ఓ ప్రముఖ చానల్లో ఓ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి అధికారికంగా వెల్లడించారు. ఈ షో త్వరలో మొదలుకానుంది. ఆల్రెడీ కమల్‌హాసన్ బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్గా శ్రుతీ హాసన్, విశాల్, వరలక్ష్మి బుల్లితెర కమిట్మెంట్కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేతుపతి వంతు వచ్చినట్లు ఉంది. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో జీతూ అనే కీలక పాత్ర చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల విజయ్‌సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
అంజలి సాహసం
నయనతార లీడ్ రోల్లో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ ‘అంజలి విక్రమాదిత్య’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో ఘన విజయం సాధించింది. నయనతార, అధర్వ, రాశీఖన్నాల నటన హైలైట్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశారు. ఇందులో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరవనున్నారు. అంజలి చేసే సాహసాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
తొంభయ్యారు.. తెలుగుకి తయారు
సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సహజం. కానీ తమిళంలో ఇంకా రిలీజ్ కాని ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘96’. ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో విజయ్‌సేతుపతి, టీచర్ పాత్రలో త్రిష కనిపిస్తారట. ఆల్రెడీ ఈ సినిమాను చూసి, రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు ‘దిల్’ రాజు. దీంతో తెలుగు రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నాని, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. ‘‘తమిళంలో అక్టోబర్ 4న విడుదల కాబోతున్న ‘96’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం. నటీనటులను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రేమికులు ఎవరో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదు. -
నవాబ్ వస్తున్నాడు
శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీరావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ ‘నవాబ్’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నారు. నాని ‘సెగ’, గౌతమ్‌మీనన్ ‘ఎర్ర గులాబీలు’ చిత్రాలను విడుదల చేయడంతో పాటు నాగశౌర్య ‘ఛలో’, రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశారు అశోక్. ‘నవాబ్’ గురించి అశోక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘చెక్క చివంద వానం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నవాబ్’ పేరుతో ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ పాల్గొంటారు’’ అన్నారు. -
మా ఉద్దేశం అది కాదు
సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ లేటెస్ట్ సినిమా ‘సర్కార్’ ఫస్ట్ లుక్ తమిళనాడులో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ పోస్టర్ తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ – ‘‘సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సినిమాలో పాత్రల కోసం యాక్టర్స్ ధూమపానం చేస్తారు తప్పితే కావాలని కాదు. యువతను తప్పు దోవ పట్టించాలని ఉద్దేశం కూడా కాదు. మా నాన్నకి సిగరెట్ అలవాటు ఉండేది. ఆయన్ను చూసి నేను అలవాటు చేసుకోలేదే? చెడుని తీసుకోవాలా? వద్దా? అనే విషయం మన మీద ఆధారపడి ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసం సినిమాల్లో పోస్టర్స్ గురించి మాట్లాడటం తప్పు. ఈ ప్రాబ్లమ్‌ని నిజంగా సాల్వ్ చేయాలనుకునేవాళ్లు సిగరెట్ తయారు చేసేవాళ్లను తప్పుపట్టండి’’ అన్నారు. -
మాటల్లేవ్!
ఒక్క డైలాగ్ కూడా లేదు.. దాదాపు 82 సెకన్ల టీజర్లో. కానీ ప్రేమ, మౌనం, ఆశ్చర్యం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్ కనిపించాయి. అవును... మాట్లాడుకోవడానికి భాష కావాలి కానీ ప్రేమించుకోవడానికి ఎందుకు? త్రిష, విజయ్ సేతుపతి జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘96’. ఈ సినిమాతో కెమెరామెన్ ప్రేమ్‌కుమార్ దర్శకునిగా మారారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ఫొటోగ్రాఫర్‌గా, త్రిష టీచర్ పాత్రలో నటించారట. లేటెస్ట్గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సింగిల్ డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ లవ్‌సాంగ్ వినిపిస్తోంది. టీజర్లో విజయ్ సేతుపతి డిఫరెంట్ డ్రెస్సెస్‌లో కనిపిస్తే త్రిష మాత్రం ఓన్లీ సింగిల్ డ్రెస్‌లోనే కనిపిస్తారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హ్యాట్రిక్‌పై గురి!
అరడజనకుపైగా సినిమాలు చేతిలో ఉంచుకుని మరో సినిమాకు పచ్చజెండా ఊపడం అంటే ఏ హీరోకైనా కాస్త ధైర్యం ఉండాలి. తమిళ హీరో విజయ్ సేతుపతి ఫుల్ డేరింగ్. అందుకే కొత్త సినిమాకు ఓకే అనేశారు. జీఎస్. అరుణ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇందులో తెలుగమ్మాయి అంజలి కథానాయిగా నటించనున్నారు. విజయ్ సేతుపతి, అరుణ్ కాంబోలో రూపొందనున్న థర్డ్ మూవీ ఇది. ఇది వరకు వీళ్ల కాంబోలో ‘పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి’ చిత్రాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడీ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అంటే హ్యాట్రిక్‌పై గురి పెట్టారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే.. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ ఓ కీలక పాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. -
ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్
...అని తమిళ నటుడు విజయ్ సేతుపతి అంటున్నారు. మరి.. ఆ అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఎంటో ‘నవాబ్’ సినిమాలో చూడాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్, అదితీరావ్ హైదరీలు ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘చెక్కా చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అబుదాబిలో షూట్ చేశారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ‘‘మణిరత్నంగారితో వర్క్ చేయడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. కల నిజమైనట్లుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ‘నవాబ్’’ అన్నారు విజయ్ సేతుపతి. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తన పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ –‘‘కార్తీక్‌పై నాకు నమ్మకం ఉంది. ఇంకా స్క్రిప్ట్ వినలేదు. రజనీసార్‌తో నటించబోతున్నందుకు హ్యాపీ’’ అన్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
నలుగురి గురి.. సింగిల్ టార్గెట్!
ఒక పోలీస్, ఇంజనీర్, రాజకీయ నాయకుడు, రౌడీ.. ఈ నలుగురి ప్రొఫెషన్స్ వేరు అయినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అయితే ఈ టార్గెట్‌ను గెలిచి ఎవరు నవాబ్‌గా నిలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ‘చెక్క చివంద వానమ్’ చూడాల్సిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అతిదీ రావ్ హైదరీ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఇది. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ల్లో ఒకరు పోలీస్‌గా, మరొకరు రాజకీయ నాయకుడిగా, ఇంకొకరు ఇంజనీర్‌గా నటిస్తున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక నటిస్తున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ రీసెంట్గా జరిగిన షూట్లో వీరిపై పెళ్లి సీన్ కూడా షూట్ చేశారట. సగానికి పైగా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ‘నవాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.