vizia nagaram
-
అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. తిథి, వార నక్షత్రాలను అనుసరించి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఈవో సుధారాణి వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, అక్టోబర్ 25న అర్ధమండలి దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పేర్కొన్నారు. సిరిమాను పూజారి బి. వెంటకరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బి. వెంకటరావు, వేద పండితులు తాతా రాజేశ్ బాబు, దూసి శివప్రసాద్, వి. నర్శింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 7 గంటల సమయం -
బంగారు తల్లులు అమ్మకే బరువుగా మారుతున్నారు..!
ఔను...అమ్మకే ఆడ శిశువు బరువవుతోంది. దీంతో జిల్లాలో మగ,ఆడ పిల్లల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలి కాన్పులో కూడా ఆడపిల్లను తిరస్కరించడంతో పిండ దశలోనే పిండేస్తున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా నారీ గళాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. నిఘాల మాటునే నీరుగార్చేస్తున్నారు. సాక్షి,విజయనగరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడపిల్లను పిండ దశలోనే పిండేస్తున్నారు. దీంతో మగపిల్లల నిష్పత్తితో పోల్చుకుంటే ఆడపిల్లల నిష్పత్తి (1000:938)గా గుర్తించారు. జిల్లాలో బంగారు తల్లులను ఉమ్మనీటిలోనే కన్నుమూసే పరిస్థితి ఎదురవుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడే లోపల పెరిగేది ఆడ, మగ అని తెలుసుకుని మరీ చంపేస్తున్న ఘటనలు వైద్యుల సాయంతోనే గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇందుకు గర్భిణులు కూడా సహకరిస్తుండడంతో ఇవేవీ బయటకు రావడం లేదు. జిల్లాలో 66 ప్రైవేట్, 14 ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లున్నాయి. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం సంబంధిత వ్యక్తులకు సైగలతో చెప్పడంతో గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రూ.10 వేలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిసినా పరస్పర ఒప్పంద ప్రాతిపదికగా చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. రెండోసారి తప్పు చేసినట్లు నిర్ధారణయితే ఐదేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు వైద్య ధ్రువీకరణ పత్రం భారత వైద్య మండలి ద్వారా ఐదేళ్ల రద్దు చేస్తారు. తర్వాత కూడా ఇదే పనికి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానాతోపాటు శాశ్వతంగా వైద్య ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తారు. 12 ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానంతో జిల్లాలో బొబ్బిలి, ఎస్.కోట, సాలూరు ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం. ఇలా మొత్తం 12 ఆసుపత్రుల్లో తమ సిబ్బంది డెకోయ్ ఆపరేషన్ నిర్వహించింది. వైద్యులు తప్పిదాలకు పాల్పడితే వారి వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు చేస్తాం. గర్భస్ధ పిండం పరిస్ధితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో డెకోయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల్లో ఎవరైనా సరే లింగ నిర్ధారణకు పాల్పడుతున్నారని తెలిస్తే నేరుగా 9849902385 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ, విజయనగరం చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’ -
అయ్యో జ్యోతి.. నీకు ఎంత కష్టమొచ్చింది!
కన్నబిడ్డను అమ్మ కాదనుకుంది. నాన్న లోకంలోనే లేకుండా పోయాడు. చివరకు వృద్ధాప్యంలో ఉన్న తాతే ఆ ఆడబిడ్డకు ఆధారంగా ఉన్నాడు. అష్టకష్టాలు పడుతూ పోషిస్తున్నాడు. అయినా మన అధికారుల కళ్లకు ఆ బిడ్డ కష్టాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఏ ఒక్కటీ అందించడం లేదు. వివరాల్లోకి వెళ్తే... శృంగవరపుకోట: పట్టణంలోని బర్మా కాలనీకి చెందిన గొర్లె సత్యవతికి కొత్తవలసకు చెందిన గురయ్యతో పుష్కర కాలం కిందట వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె జ్యోతి ఉంది. గురయ్య ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో సత్యవతి తన బిడ్డ జ్యోతితో ఎస్.కోటలోని తండ్రి అంకులు వద్దకు వచ్చేసింది. రెండేళ్ల కిందట సత్యవతి కూడా జ్యోతిని కాదనుకుంది. కన్నబిడ్డను కాదనుకొని వేరొకరిని వివాహమాడి జ్యోతిని వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి లేక తల్లి వదిలేయడంతో తాత వద్దే జ్యోతి ఉంటుంది. తాత తట్టా, బుట్ట అల్లి విక్రయించగా వచ్చే కాసింత డబ్బుతో పేదరికం మధ్య మనమరాలు జ్యోతితో అష్టకష్టాల నడుమ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరి కి ఇల్లంటూ లేకపోవడంతో పుణ్యగిరిలోని ప్రభుత్వ సామాజిక భవనంలోనే తలదాచుకుంటున్నారు. దయ చూపని అధికారులు ఇన్ని అవస్థల నడుమ కూడా జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుకలేవీ అందడం లేదు. దీనికి కారణం ఆధార్ లేకపోవడమే. ఆధార్ లేకపోవడంతో పాఠశాలలోని ఛైల్డ్ ఇన్ఫో యాప్‌లో జ్యోతి వివరాలు నమోదు కావడం లేదని హెచ్ఎం ఎం.పార్వతి చెప్పారు. తనకు చదువుకోవాలని ఉందని, వసతిగృహంలో వేస్తే చదువుకుంటానని జ్యోతి చెబుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చిన్నారి జ్యోతికి ప్రభుత్వ పథకాలు అందేలా, చదివేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆ చిన్నారి ఆశను బతికించాలని ఆశిద్దాం. చదవండి: పెళ్లి ముచ్చట తీరనేలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అంతలోనే.. -
కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటిచాడో ప్రబుద్ధుడు. ఈ క్రమంలో. ఆ యువకుడిని బాధితురాలి సోదరి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. కాగా, మంటల కారణంగా.. బాధితురాలి సోదరితోపాటు, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, రాంబాబు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రేమ పెళ్లి.. అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో..
విజయనగరం: ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కదేమోనన్న అనుమానంతో అమ్మాయి తండ్రి దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిని కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో ఐదుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పట్టణ డీఎస్పీ పి. అనిల్ కుమార్ మంగళవారం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన పటిమీడ శివసూర్య అనే యువకుడు విజయనగరంలోని బంగారం దుకాణంలో పనిచేస్తూ ఆ షాపు ఎదురుగా ఉన్న నావెల్టీ షాపు యజమాని నరపత్‌సింగ్ పురోహిత్ కుమార్తె పూజ అనే అమ్మాయిని ప్రేమించి మేనెలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది నచ్చని పూజ తండ్రి కోర్టులో కుమార్తె కనిపించడం లేదని, స్వరాష్ట్రమైన రాజస్థాన్ కోర్టులో సెర్చ్ వారెంట్ దాఖలు చేశారు. అక్కడి కోర్టు ఆదేశాలతో రాజస్థాన్ పోలీసులు రాజాం వచ్చి, స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడు పటిమీడ శివసూర్య ఇంటికి వెళ్లి, అతను ఇంట్లో లేని సమయంలో పూజను తమతో తీసుకెళ్లారు. భార్య పూజను పోలీసులు తీసుకెళ్లడానికి నరపత్‌సింగ్ కారణమని భావించిన శివసూర్య..తన తండ్రి శ్రీరామ్మూర్తి, వారి దగ్గర పనిచేసే ముంగరి హరికృష్ణ, అతని స్నేహితుడు వంశీ, బావ తర్లాడ విశ్వేశ్వరరావుల సహకారంతో మూడు మోటారు సైకిళ్లపై ఆగస్టు 15న విజయనగరం వచ్చి, ముందుగా నరపత్ సింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండడం గమనించి మెయిన్‌రోడ్డులో ఉన్న నావెల్టీ షాపు వద్దకు వచ్చి చూడగా షాపు గేటుకు తాళం వేసి ఉండడం గమనించారు. అయితే షాపులో కొంతమంది వ్యక్తులు ఉండడం గమనించి, గేటు తాళాలు పగులగొట్టి, నరపత్ సింగ్, కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నించారు. షాపులో ఉన్నవారు తమకు తెలియదని చెప్పడంతో అక్కడ ఉన్న దుండారాం చౌదరి అలియాస్ రమేష్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి, ఇనుపరాడ్లతో కొట్టారు. వారిని అడ్డుకునేందుకు దినేష్ దివాశి అనే వ్యక్తి ప్రయతి్నంచగా అతనిని కూడా కొట్టి దుండారాం చౌదరిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ విషయమై అక్కడే షాపువద్ద ఉన్న గౌతం పురోహిత్ డయల్100కి ఫోన్ చేసి వివరించారు. దీంతో వన్‌టౌన్ సీఐ జె.మురళి ఆధ్వర్యంలో ఎస్సైలు ఐ.దుర్గాప్రసాద్ కృష్ణప్రసాద్‌లు రెండు బృందాలుగా సీసీ కెమెరాలను పర్యవేక్షించి నిందితులను 24 గంటల వ్యవధిలో పట్టుకుని కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్సైలు, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ అనిల్ కుమార్ వివరించారు -
దొంగ స్వాముల కలకలం.. దైవశక్తులు ఉన్న ప్రతిమలంటూ..
విజయంనగరం: విజయనగరంలోని ఎస్.కోటమండలంలో దొంగస్వాములు పూజలు చేస్తామని గ్రామస్తుల దగ్గర నగదు వసూళ్లు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, మూషిడిపల్లి గ్రామంలో కొంత మంది దొంగస్వాములు.. దేవుడి పూజలు చేస్తామని స్థానికులను నమ్మించారు. అంతటితో ఆగకుండా.. దైవశక్తులు ఉన్న దేవుడి ప్రతిమలంటూ గ్రామస్తులనుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు.. దొంగ స్వాములను ఆలయంలో బంధించి దేహశుద్ధి చేశారు. బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, దొంగ స్వాములను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో కిలేడీ చీటింగ్.. కోట్లు కొట్టేసి మాస్టర్ ప్లాన్..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేసి సుమారు రూ.కోటి వసూలు చేసిన మండలంలోని రాముడువలసకు చెందిన కిలేడీ బుట్ట సరస్వతి ఎట్టకేలకు అరెస్టు అయ్యింది. అసలు పేరును కాదని విజయరాణిగా చలామణి అవుతూ పలువురిని మోసగించింది. తనకు పెద్దలతో పరిచయాలున్నాయని ఒకొక్కరి నుంచి రూ.50వేల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసింది. అంగన్వాడీ కార్యకర్త, మండల కో ఆర్డినేటర్, 104 అంబులెన్సు డ్రైవర్, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు, కార్యదర్శి తదితర ఉద్యోగాల పేరు చెప్పి సుమారు 13 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈమెను పట్టణంలోని గుర్తించిన బాధితులు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీయడంతో శనివా రం రాత్రి గొడవ జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. ఆదివారం రిమాండ్ నిమిత్తం తరలించినట్టు చెప్పారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్
-
సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారు
సాక్షి, విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేస్తూ, మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారు. గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానానికి ఆ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చేరుకుని 1గంటకు కార్యక్రమాలను ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. హెలికాఫ్టర్ దిగి బహిరంగ సభకు చేరుకునే మార్గం పొడవునా జిల్లా ప్రజలు సీఎంకు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలపనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతితో స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా: ఉదయం 11.00: విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు ఉదయం 11.02: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు ఉదయం 11.03: పోలీస్ òట్రైనింగ్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ నుంచి అయోధ్యమైదానానికి సీఎం బయలు దేరుతారు ఉదయం 11.15: అయోధ్య మైదానంలోని బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు ఉదయం 11.15 నుంచి 11.25 వరకూ: అయోధ్య మైదానంలో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శిస్తారు ఉదయం 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకూ: వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభిస్తారు మధ్యాహ్నం 12.25: బహిరంగ సభ ప్రాంగణం నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతారు మధ్యాహ్నం 12.35 నుంచి 2.45 వరకూ: పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు మధ్యాహ్నం 12.45: దిశ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్ వద్దకు బయలుదేరుతారు మధ్యాహ్నం 12.50: పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం 1.00: హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం బయలుదేరుతారు -
ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు
సీతానగరం : ఒక్కో ఊరిది ఒక్కో ప్రత్యేకత. అక్కడి ఆచార వ్యవహారాలూ ఆసక్తికరమే. కొన్ని ఆనవాయితీలూ ఆశ్చర్యకరమే. సాధారణంగా ఏ ఊరికైనా ఓ పేరుంటుంది. కానీ ఆ ఊరిపేరే అక్కడ పుట్టిన తొలిసంతానానికి పెట్టుకోవడం విచిత్ర ఆనవాయితీ. ఇదీ సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామం ప్రత్యేకత. జోగింపేటలో 250 కుటుంబాలున్నాయి. ఆ గ్రామస్తుల ఇలవేల్పు సుబ్బమ్మ పేరంటాలు. ఈ అమ్మవారిని గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా గ్రామానికి చేరుకుని పూజించడం పరిపాటి. శతాబ్దాల కాలంగా జోగింపేటలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి మాత్రం ఆ ఊరి పేరే పెడతారు. సాధారణంగా నామకరణం నక్షత్రాలను బట్టి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. జోగింపేటలో అమ్మాయి పుడితే సుబ్బమ్మ, అబ్బాయి పుడితే గోపాలరావు, సుబ్బినాయుడు పేరే పెడతారు. -
రోడ్డెక్కిన జేఎన్టీయూ విద్యార్థులు
విజయనగరం అర్బన్: పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కోపం వచ్చింది. కళాశాల నిర్వాహణ లోపాలను సరిద్దాలని కొన్ని నెలలుగా చెబుతున్నా... ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో వారిలో నిరసన పెల్లుబికింది. ఓపిక నశించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు తాగకుండా రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. మండుటెండలో సిమెంట్ గ్రౌండ్‌పై రోజంతా మౌనప్రదర్శన చేశారు. మధ్యలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సరస్వతి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు నిరసన ప్రాంగణానికి వచ్చి సముదాయించారు. సమస్యలు రాసిస్తే టైమ్ బాండ్ పెట్టి పరిష్కరిస్తామని నిరసన మానుకోవాలని కోరారు. అయితే గత కొద్ది నెలలుగా మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేనని ప్రత్యేకించి రాసివ్వాల్సిన సమస్యలు లేవని విద్యార్థులు ఖరాకండిగా చెప్పారు. ఒక్కొక్కరుగా వెళ్లి చెబుతుంటే భయపెట్టి పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. కళాశాల నిర్వహణంలో ప్రిన్సిపాల్ విఫలమయ్యారని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. బోధన, పరిశోధనశాలల నిర్వహణ సామగ్రి కోసం గత ఏడాది విడుదల చేసిన రూ.కోట్ల నిధులు ఇప్పటికీ వినియోగించడం లేదని దాని వల్ల నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహం విద్యార్థుల సమస్యలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవసరం పడే స్టేషనరీ దుకాణం గత కొద్ది నెలలుగా లేదని, ఏ అవసరం వచ్చినా ఆరు కిలోమీటర్ల దూరంలోని పట్టణంలోకి వెళ్లాల్సి వస్తుందని విలపించారు. వైద్య సదుపాయాలు కళాశాల ప్రాంగణంలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమస్యలన్నింటినీ ప్రిన్సిపాల్ పరిష్కారమార్గాన్ని చూడకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారనే ఉద్దేశంతో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ స్వయంగా వచ్చి పరిష్కరించాలనే లక్ష్యంగా సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయానికి ఆందోళన విషయాన్ని తెలియజేశారు. నిరసనలోని విద్యార్థులతో యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా మాట్లాడారు. అయితే వచ్చిన ఫోన్ కాల్ వైస్‌చాన్సలర్ నుంచి కాకపోవడంతో విద్యార్థులు సంతృప్తి చెందలేదు. బైఠాయింపు కొనసాగిస్తామని అధికారులతో చెప్పారు. దాంతో పొద్దుపోయినా గేట్ వద్ద బైఠాయింపు కొనసాగించారు. -
'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'
సాక్షి,బొబ్బిలి(విజయనగరం) : ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా అందరూ అంటున్నారనీ, అయితే.. ఆ జిల్లాలు వెనుకబడలేదని, వెనుకబెట్టి ఉంచబడ్డాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అసెంబ్లీలో అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులను సభ కళ్లకు కట్టారు. తోటపల్లి మేజర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మినహా దాదాపు 90 శాతం నిధులను దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. చివర్లో పది శాతం పనులను సైతం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో చేయించలేకపోయారన్నారు. కాలువలకు లైనింగ్, అవసరమైన చోట స్లూయీస్‌లు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాలు గతేడాది కరువు కోరల్లో చిక్కుకున్నా ఎలాంటి ఆర్థిక సహాయం లేదన్నారు. జిల్లాలో 900కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరమ్మతులతో ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, జలవనరుల శాఖా మంత్రి చొరవచూపి తోటపల్లి పనులతో పాటు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను బాగుచేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. జంఝావతి వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని వీఆర్ఎస్, మడ్డు వలస, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా చూడాలన్నారు. అసెంబ్లీలో శంబంగి ప్రసంగం విన్న జిల్లా వాసులు సంబరపడ్డారు. ఇన్నాళ్లకు మన కష్టాలను అసెంబ్లీలో వినిపించే నాయకుడు దొరికాడని హర్షం వ్యక్తంచేశారు. -
అలుపెరగని విక్రమార్కుడు
సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా.. పౌరుషం ఆయుధం.. పోరులో జీవితం.. కైవసం కావటం కష్టమా.. తప్పని ఒప్పని తర్కమే చేయను.. కష్టమో నష్టమో లెక్కలే వేయను.. అన్నాడొక సినీ కవి. బొబ్బిలి గొల్లపల్లికి చెందిన చెందిన బొత్స రాములు ఈ కోవకే చెందుతారు. అనుకున్నది చేసేస్తారు. చేసేది తప్పా ఒప్పా పట్టించుకోరు. అందుకే.. ఏకంగా మూడు సార్లు ఎంపీగా.. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎప్పటికైనా ప్రజలు గుర్తించకపోతారా.. గెలిపించకపోతారా.. చట్ట సభల్లో అధ్యక్షా.. అంటూ గళం వినిపించకపోతానా.. అన్న ఆశ ఆయనలో ఇప్పటికీ సజీవంగా ఉంది. అనారోగ్యంతో ఇంటి పట్టునున్న బొత్స రాములు.. ఆరోగ్యం సహకరిస్తే ఈ ఎన్నికల్లో నిల్చునేవాడినని ఘంటాపథంగా చెబుతున్నారు. ఆరోగ్యం బావుంటేనా.. ఎమ్మెల్యేగా 1983, 1985, 1994, 1999, 2001లలో బొబ్బిలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయాను. వయసు 75ఏళ్లు దాటాయి కదా.. రాజకీయాలపై ఆసక్తి ఉంది. పోటీ చేయాలనుంది.. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. అనారోగ్యంతో బాధ పడుతున్న బొత్స రాములు ఎవరూ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల గురించి తెలుసుకుంటున్నాను. నామినేషన్ల తరువాత కేవలం 15రోజులే ఎన్నికలకు గడువుంది. నాకు ఎన్నికల్లో నిల్చోవడం సరదా. ప్రతిసారీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేశాను. ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కూడా. డిపాజిట్టే రాలేదు అప్పట్లో నాయకుడిగా చిన్న చిన్న పనులు గ్రామంలో చేసేవాడిని. తెల్లబట్టలు వేసుకుని ఓటేయండని అడిగేవాడిని. నాకు పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. ఇన్నిసార్లు పోటీ చేసినా ఒక్కసారీ డిపాజిట్లు రాలేదు.. ప్రజలు తిరస్కరించినా పోటీ చేయాలనే సరదాతో పోటీ చేశాను. పార్టీలపై ఆసక్తి లేదు. ఆ రోజులే వేరు అప్పట్లో రాజకీయాలకు నైతిక విలువలు ఉండేవి. తరువాత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొంత విలువ పెంచారు. కానీ ప్రస్తుత నాయకులు ప్రలోభపెడుతున్నారు. ఓటర్లు డబ్బు, మందుకు లొంగిపోయి అమ్ముకుంటున్నారు. నాకు భార్య పార్వతి, కుమారులు మన్మధ, తిరుపతి, గణపతి ఉన్నారు. భార్యకు 80 సెంట్ల భూమి ఉంది. దాంతో నేను, నా భార్య బతుకుతున్నాం. పిల్లలు ఎవరి జీవితాలు వాళ్లవి. ఆర్థికంగా తినడానికి సరిపోతుంది. సమర్థ నాయకత్వం రావాలి రాష్ట్రానికి సరైన నాయకత్వం రావాలి. అప్పుడే ప్రగతి పథంలో నడుస్తుంది. యువత, మహిళలు ఓటు విలువ తెలుసుకోవాలి. పనిచేసేవారికి ఓటు వేయాలి. రాష్ట్రాభివృద్ధికి బాట వేసే సమర్థుడిని ఎన్నుకోవాలి. -
ఏదీ..స్మార్ట్ సిటీల జాడ..?
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: స్మార్ట్ సిటీ..మంత్రం నిద్రావస్థలో మగ్గుతోంది. తాము అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకుంటామన్న ప్రస్తుత ప్రభుత్వ మాటలు నీటి మీద రాతలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన ఈ కార్యక్రమం జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు పట్టణ ప్రాం తాల్లోని ఒక్క వార్డులో అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది. కేవలం ఆర్భాటాల కోసం పాలన ప్రారంభంలో మున్సిపల్ పాలకవర్గాలు స్మార్ట్ పేరు చెప్పుకుంటూ నిర్వహించిన కార్యక్రమాలు అంత బూటకమని తేలిపోయింది. ఈ విషయంపై ప్రచారానికి పోయిన ప్రభుత్వం, అధికార యం త్రాంగం ప్రస్తుతం ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా నిమ్మకుండడంపై సర్వత్రా విమర్శలు వక్తం అవుతున్నాయి. స్మార్ట్ సిటీల అమలు మాట దేవుడెరుగు కానీ ప్రజలకు కనీస వసతులు దక్కక నానా పాట్లు పడుతున్నారు. ప్రయోజనం శూన్యం.. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన చిన్నపాటి పట్టణాలు నుంచి పెద్ద నగరాలను సైతం స్మార్ట్ సిటీగా తయారు చేయాలన్న భావనతో 2014లో స్మార్ట్‌వార్డుల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ముందుగా ఆయా ప్రాంతాలు, పట్టణాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు దత్తత విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఏ ఒక్క శ్రీమంతుడు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో మొత్తం వార్డుల్లో 20 శాతాన్ని 2016 మార్చి నెలాఖరులోగా స్మార్ట్‌గా తీర్చిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా దశల వారీగా స్మార్ట్ వార్డులను తీర్చిదిద్దూతూ పట్టణ ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, యంత్రాంగం గొప్పలు చెప్పుకున్నారు. దీనిలో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డుతో పాటు 3, 5, 13, 15, 22, 24, 32లను ఎంపిక చేశారు. అంతేకాకుండా బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో వార్డులను ఎంపిక చేస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వార్డు ప్రజలకు సమస్యల కష్టాల తీరి నట్లేనన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఐదు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏ ఒక్క వార్డులో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. పలు వార్డుల్లో గతంలో కన్నా పరిస్థితులు మరింత దయనీ యంగా మారిందన్న వివర్శలు వినిపిస్తున్నాయి. తొలి విడతలో ఎంపికైన వార్డులిలే.. ప్రాంతం మొత్తం వార్డులు స్మార్ట్‌వార్డులుగా మార్చాల్సిన సంఖ్య విజయనగరం కార్పొరేషన్ 40 8 బొబ్బిలి మున్సిపాలిటీ 30 6 పార్వతీపురం మున్సిపాలిటీ 30 6 సాలూరు మున్సిపాలిటీ 29 6 నెల్లిమర్ల నగరపంచాయతీ 20 4 స్మార్ట్ వార్డుగా మారాలంటే... ప్రభుత్వం నిర్దేశకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వార్డులు స్మార్ట్‌గా రూపుదిద్దుకోవాలంటే ప్రధానంగా ఐదు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వార్డు పరిధిలోని గృహాలన్నింటికీ శతశాతం మంచి నీటి కుళాయి కనెక్షన్లు కల్పించాలి. అంతేకాకుండా నిరంతరం వాటి ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. శతశాతం వార్డులోని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా నిర్వహించడంతో పాటు సేకరించిన చెత్తను కుప్పలుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించాలి. తడి పొడిచెత్తలను వేరు చేయాలి. స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దాల్సిన వార్డుల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. వార్డు పరిధిలో ప్రధాన జంక్షన్లు ఉంటే అక్కడ మొక్కలు నాటాల్సి ఉంటుంది. నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వీటితో పాటు జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో అమలు చేయాల్సిన 20 అంశాల్లో ప్రగతి సాధించాలి. -
విజయనగరం: మీ ఓటును చెక్ చేసుకున్నారా?
నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inజీఛి.జీn వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం ఇన్చార్జ్ అధికారి 9963794303 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు check your vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
జిల్లాలో 10 డెంగీ కేసుల నమోదు
తెర్లాం: జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం తెర్లాం పీహెచ్‌సీకి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రెండు మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ (ఎంఎండీసీ) వాహనాలు తిరుగుతున్నాయన్నారు. ఈ వాహనాల్లో దోమల నివారణకు అవసరమైన మందులు వీధి కాలువల్లో పిచికారీ చేయడం, వైద్య సేవలు అందిస్తామన్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో ఎంఎండీసీ వాహనాలు తిరుగుతాయన్నారు. డెంగీ కేసుల నిర్ధారించడం కేవలం జిల్లా కేంద్రాస్పత్రిలోనే జరగుతుందన్నారు. జ్వరంతో బాధపడేవారికి ఫ్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోయిన వెంటనే డెంగీగా భావించొద్దని, జ్వరంతో బాధపడేవారికి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే, తిరిగి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఫ్లేట్‌లెట్స్ కౌంట్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ పీహెచ్‌సీకి మాత్రమే సొంత భవనం లేదని, మిగతా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 431 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, వీటిలో 135 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. సొంత భవనాల నిర్మాణానికి తహసీల్దార్లు స్థలాలు మంజూరు చేస్తే, భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. 21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ జిల్లాలో 21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఎంహెచ్ఓ తెలిపారు. 44 సెకండ్ ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సిరంజ్ల కొరత ఉన్నట్లయితే ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుతానికి మందుల కొరతలేదన్నారు. బీపీ మాత్రలు కావాలని పీహెచ్సీ, సీహెచ్‌సీల వైద్యాధికారుల నుంచి ఇండెంట్ వచ్చిన వెంటనే సరఫరా చేస్తామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రెడ్డి రవికుమార్‌ను ఆదేశించారు. తెర్లాంకు 108 వాహనం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లా అధికారులకు ‘ఏబీసీడీ’ అవార్డులు
విజయనగరం టౌన్: సమర్థవంతంగా కేసులను దర్యాప్తు చేసే అధికారులకు డీజీపీ ఇచ్చే ‘ఏబీసీడీ’ (అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులు జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు దక్కాయి. ఈ మేరకు డీజీపీ ఎం. మాలకొండయ్య చేతులమీదుగా మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయంలో ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ టి.త్రినాథ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ బుధవారం అవార్డులు అందుకున్నారు. పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏబీసీడీ అవార్డ్స్ ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకే లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామం వద్ద నిర్జన ప్రదేశంలో పూసపాటిరేగ మండలానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక దివ్యాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ పాలరాజు దర్యాప్తు బాధ్యతలను ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ టి. త్రినాథ్‌కు అప్పగించారు. బాధితురాలు మహిళ అయినందన దర్యాప్తులో సహకరించాల్సిందిగా బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలతను, అలాగే అవసరమైన సహాయ, సహకారాలందించేందుకు స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణలను ఆదేశించారు. అయితే ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు మందలిస్తారని భయపడి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పడంతో అంతరూ ఊపిరిపీల్చుకున్నారు. కేసుకు సంబంధించి వాస్తవాలను వెలికితీయడంతో పోలీస్ అధికారులకు ఏబీసీడీ అవార్డులు దక్కాయి. ఈ మేరకు అవార్డులు అందుకున్న ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ టి.త్రినాథ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణలను జిల్లా ఎస్పీ పాలరాజు, ఓఎస్డీ విక్రాంత్ పాటిల్, అదనపు ఎస్పీ ఏవీ.రమణ జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. -
సెలవులు హరీ
విజయనగరం గంటస్తంభం : ఒకవైపు వేసవి ఎండలు మండుతున్నాయి. మరోవైపు ఉక్కపోత ఊపిరి సలపనీయడం లేదు. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే అధికారులు మినహాయిస్తే అందరూ వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజు సెలవు దొరి కినా సేద తీరాలని ఉద్యోగులు ఆశపడుతున్నారు. అలాంటిది రెండో శనివారం, ఆదివారం రూపంలో వరుసగా రెండు రోజులు పాటు సెలవులు దొ రికాయి. వేసవి సెలవులు పుణ్యమా అని పిల్లలు కూడా ఇంటివద్దే ఉన్నారు. ఇంకేముంది కుటుంబ సభ్యులతో రెండు, మూడు రోజులు హాయిగా గడుపుదామని భావించిన ఉద్యోగులకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయడు పర్యటన శాపంగా మారంది. ఆయన రాకతో సెలవులు అనుభవించే పరిస్థితి లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. ఏర్పాట్ల నేపథ్యంలో విధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన దాదాపుగా ఖరారైంది. వేదిక విషయంలో కాస్త సందిగ్దత ఉన్నా పర్యటన మాత్రం ఈ నెల 15వ తేదీన ఉంటుంది. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి... వారు తీసుకున్న నిర్ణయాలన్నీ సమర్థించిన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నా నేపథ్యంలో ఇప్పుడు పోరాటం పేరుతో సభలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న విజయనగరంలో దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పనిలో పనిగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ధర్మపోరాట దీక్ష విజయనగరంలో పెడితే... శంకుస్థాపన కార్యక్రమాలు చీపురుపల్లిలో పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యత అధికారులపై పడింది. కలెక్టర్ వివేక్‌యాదవ్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. సీఎం పర్యటన ఏర్పాట్లు చూసే బాధ్యత జేసీ వెంకటరమణారెడ్డికి అప్పగించడంతో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సాయంత్రం సమావేశమై ఏ అధికారి ఏయే కార్యక్రమాలు చేయాలో మార్గనిర్దేశం చేశారు. దీంతో బాధ్యతలు తీసుకున్న అధికారులు తమ సిబ్బందిని ఏర్పాట్లలో నిమగ్నం చేసే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కావడంతో అన్ని శాఖల అధికారులు ఉండాల్సిందే. శాఖా పరమైన నివేదికలు ఇవ్వాల్సిందే. 15వ తేదీన పర్యటన కావడంతో కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో శని, ఆదివారాలు సెలవు దినాలైనా కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీపీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది కూడా ఇందుకు సిద్ధమవున్నారు. ఇతర శాఖల అధికారులు కూడా ఇదే విధమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు రావడం తప్పుకాకపోయినా కాస్తా గడువు ఉన్నట్లు షెడ్యూల్ ఇస్తే ఇలాంటి సెలవుల్లో విధులు నిర్వహింవచాల్సిన పరిస్థితి రాకపోయేదని పలువురు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. ఉద్యోగుల్లో నిరాశ సీఎం టూర్ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. చంద్రబాబునాయుడు పాలనలో ఉద్యోగులు స్వేచ్ఛ ఉండదు... పని వేళల కంటే అధిక సమయం పని చేయిస్తారు... మరోవైపు ఒత్తిడి ఉంటుంది... సెలవులు కూడా ఉండవు... ఇదీ సాధారణంగా ఉద్యోగుల్లో ఉన్న భావన. ఉద్యోగులను ఇబ్బంది పెట్టనని 2014 ఎన్నికలకు ముందు ప్రకటనలు గుప్పించిన చంద్రబాబునాయుడు మళ్లీ అదే దారిలో వెళ్తున్నారన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. -
కార్మికుడి మృతిపై అనుమానాలెన్నో..
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం గ్రామానికి చెందిన గేదుల వెంకటరావు (42) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్తులందరూ గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. వెంకటరావు శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్ ఎక్సే్ఛంజ్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం కర్మాగారంలో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో కర్మాగార ప్రతినిధులు స్పందించి ప్రథమ చికిత్స అందించి విశాఖపట్నం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సాధారణ మరణమే అయితే మృతుడి తల వెనుక భాగంలో దెబ్బ ఎందుకు తగిలిందని బంధువులు, కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. వెంకటరావు మృతి వెనుక ఏదో తతంగం జరిగి ఉంటుందని కుటంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు దిగిన బంధువులు ఇదిలా ఉంటే వెంకటరావు మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గేదులవానిపాలెం, వేచలపువానిపాలెం, గనివాడ గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కర్మాగారం గేటు వద్దకు చేరకుని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని బంధువులు స్పష్టం చేశారు. ఇందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన డీఎస్పీ పరిహారం అందజేయాలని కోరుతూ మృతుని కుటుంబీకులు, ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, గేదులవానిపాలెం, గనివాడ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు గేదుల నర్శినాయుడు, మల్లు నాయుడు, గేదుల శాంత, తదితరులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ, ఎస్.కోట సీఐ వై. రవి రంగలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం ఇచ్చిన పరిహారం తీసుకోవాలని...లేనిపక్షంలో కేసు పెట్టుకోవచ్చని మృతుని కుటుంబ సభ్యులకు డీఎస్పీ వివరించారు. అనంతరం మరోసారి ఆందోళనకారులు, యాజమాన్యం చర్చించగా, ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు. -
మాజీ సర్పంచ్ మృతికి ఆర్.నారాయణమూర్తి సంతాపం
విజయనగరం పూల్‌బాగ్ : విజయనగరం మండల పరిధిలోని సారిక పంచాయతీ మాజీ సర్పంచ్ మామిడి భవానీ మృతిపై సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సంతాపం తెలిపారు. సారిక గ్రామానికి శుక్రవారం చేరుకుని భవానీ భర్త, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడును పరామర్శించారు. పిల్లలు హాసిని, గ్రీష్మాలను ఓదార్చారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
లోకం చూడకుండానే ప్రాణం పోయింది!
నవమాసాలు మోసి.. పండంటి బిడ్డను కళ్లారా చూడాలనుకున్న ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. పురిటిలోనే బిడ్డను కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది. శిశువు మరణానికి ఆస్పత్రి వర్గాల నిర్లక్షమే కారణమంటూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నర్సులు సైతం నిరసనకు దిగి ఆశ్చర్య పరిచారు. ఈ సంఘటన రాజాం సామాజిక ఆస్పత్రి వద్ద గురువారం చోటుచేసుకుంది. విజయనగరం, రాజాం సిటీ : రాజాం సామాజిక ఆస్పత్రికి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గళావళ్లి గ్రామానికి చెందిన గర్భిణి కింజంగి కల్యాణి ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈమె అత్త వారు వంగర మండలం కొండచాకరాపల్లి కాగా గర్భిణి కావడంతో కన్నవారి ఇంటి వద్ద ఉండేది. నెలలు నిండడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివిధ పరీక్షలు, స్కానింగ్‌లు చేసిన సిబ్బంది డెలివరీకి సమయం ఉందంటూ నచ్చజెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కల్యాణికి వంట్లో నలతగా ఉండడంతో భయపడిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి కల్యాణికి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని చెప్పేందుకు డ్యూటీ డాక్టర్ సునీత కోసం కల్యాణి కుటుంబీకులు ఆరా తీశారు. అయితే ఆమె లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులు మందులు ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆ తరువాత కూడా కల్యాణికి నొప్పులు తగ్గకపోవడంతో ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని కూడా నర్సుల దృష్టికి కుటుంబీకులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో కల్యాణకి రక్త స్రవం అధికం కావడంతో ఆందోళన చెందారు. వైద్యం అందించాలని నర్సులను వేడుకున్నారు. దీంతో గురువారం తెల్లవారు జామున నర్సులు కలుగజేసుకొని ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బిడ్డ చనిపోయింది. దీంతో కల్యాణి కుటుంబీకు ఆగ్రహానికి గురయ్యారు. నొప్పులు అధికంగా ఉన్నాయని, బతిమిలాడుకున్నా డ్యూటీ డాక్టర్ రాలేదని, నర్సులే బలవంతంగా వైద్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కల్యాణి భర్త తిరుపతిరావు ఆరోపించారు. వేరే ఆస్పత్రికి వెళ్లి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రోదించాడు. చేతులారా పండంటి బిడ్డను కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆస్పత్రి వద్ద ఆందోళన విషయం తెలుసుకున్న కల్యాణి బంధువులు, కొండచాకరాపల్లి, గళావల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు గురువారం ఉదయం చేరుకున్నారు. కల్యానికి జరిగిన అన్యాయంపై ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి సూపరింటెండెంట్... ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌నాయుడు బాధితరాలు కల్యాణి కుటుంబీలతో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని, నర్సులు వైద్యం చేయడమేమిటని మండిపడ్డారు. గర్భిణులు, శిశువుల ప్రాణాలతో ఆస్పత్రి సిబ్బంది ఆడుకుంటున్నారని బాధిత కుటుంబీకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పట్టబట్టారు. ఆస్పత్రి సిబ్బందితో కూడా సూపరింటెండెంట్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణికి వైద్యం చేసిన నర్సులు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతోనే తామే వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాన్పు కష్టంగా ఉండడంతో తమకు తెలిసిన పద్ధతిలో ప్రయత్నించామని.. అయితే దురదృష్టవశాత్తు బిడ్డ చనిపోయింది పేర్కొన్నారు. సూపరింటెండెంట్ విలేకరులతో మాట్లాడుతూ మృతశిశువే జన్మించిందని..ఇందులో తమ సిబ్బంది తప్పులేదని స్పష్టం చేశారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ? బుధవారం రాత్రి ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ బిడ్డకు బాగోలేదని సమాచారం అందించినా డాక్టర్ రాలేదని.. నర్స్‌లే మొత్తం డ్రామాలు ఆడారని బాధితులు వాపోయారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదన్నారు. నర్సుల నిరసన డ్రామా ఇదిలా ఉండగా తమపైకి ఆరోపణలు రావడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులంతా ఒక్కటయ్యారు. డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని, రాత్రి, పగలు మేమే సేవలందిస్తున్నామని మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కల్యాణకి కష్టపడి వైద్యం అందించామని.. అయితే బిడ్డ చనిపోవడం బాధాకరమన్నారు. తమను ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ నిరసన డ్రామాకు తెరలేపారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. భవిష్యత్‌లో డ్యూటీ డాక్టర్లు, సంబంధిత డాక్టర్లు ఉంటేనే రోగులకు సేవలందిస్తామని, లేకుంటే సేవలు చేయలేమని నర్సులంతా స్పష్టం చేశారు.విచారణ..శిశువు మృతిపై పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యతోపాటు డీసీహెచ్ఎస్ సూర్యారావులు మెజిస్ట్రేటియల్ విచారణ జరిపారు. ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం సీహెచ్ నాయుడును, డ్యూటీ డాక్టర్ సునీతను, నర్సులు పద్మావతి, రమాదేవిలను రెండు గంటలపాటు విచారించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఎంతటి వారైనా శిక్షార్హులేనని డీసీహెచ్ఎస్ సూర్యారావు విలేకరులకు తెలిపారు. -
మూగజీవాలపై విషప్రయోగం
సీతానగరం: మూగజీవాలపై విషప్రయోగం చేసిన సంఘటన మండలంలోని బూర్జ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఆవు, ఎద్దు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కోట శివున్నాయుడు కుమారులు పోలినాయుడు, శ్రీనివాసరావు వేర్వేరుగా ఉంటున్నా వ్యవసాయం కలిసే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆవులు, ఎద్దులు పెంచుతున్నారు. పోలినాయుడు, శ్రీనివాసరావు ప్రతి రోజూ సాయంత్రం పశువులకు కుడితి పెట్టి ఇంటికి వస్తుంటారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం కూడా శాలలో ఉన్న పశువులకు కుడితి పెట్టి వీరిద్దరూ ఇంటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా ఆవు, ఎద్దు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాయి. వెంటనే పశువైద్యాధికారి ఎస్. రామారావుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి విషప్రయోగం వల్లే పశువులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఎవరో గిట్టని వారే ఈ పని చేసుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో సుమారు 60 వేల రూపాయల విలువ చేసే ఆవు, ఎద్దు మృతి చెందాయని బాధితులు లబోదిబోమంటున్నారు. నెలలో రెండో నష్టం ఏప్రిల్ ఒకటో తేదీ రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు, దుకాణం, ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు కూడా పోలినాయుడికి చెందినదే. ఎవరో కావాలనే తమపై కక్ష కట్టి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
గడువు పొడిగింపు
విజయనగరం పూల్‌బాగ్ : జిల్లాలోని నిరుపేద ఎస్సీ, బీసీ, కాపు, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, బీసీ ఫెడరేషన్ అభ్యర్థులు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మే పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్, సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసక్తి గల అభ్యర్థులు మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా గాని, మండల అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
క్షీరాభిషేకానికి సిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు
విజయనగరం టౌన్ : విజయనగరం పూల్‌బాగ్‌లోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శుక్రవారానికి మూడేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి శుక్రవారం వేకువ జామునుంచే పాలాభిషేకం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అరవై అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహానికి మోటార్ల ద్వారా స్వామివారి శిరస్సు పైకి పాలు, అభిషేక జలం వెళ్లేలా విగ్రహం నిర్మాణ సమయంలోనే పూర్తి ఏర్పాట్లు చేశారు. దేశంలోనే ఈ విగ్రహం అత్యంత ఎత్తయింది కావడం విశేషం. మలేషియాలోని కౌలాలంపూర్‌లో 140 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. దర్శించి తరించండి సర్వరోగాలను పటాపంచలు చేసే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించి తరించండి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. –కర్రి వెంకటరమణ సిద్దాంతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త -
కమ్మని కళాఖండాలు
ఎండాకాలం వస్తే.. విసనకర్రలతో విసురుకునేవారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేవారు. ఇవన్నీ ఒకనాటి రోజులు.. ఫ్యాన్లు, ఏసీలు వచ్చాక విసనకర్రలు అదృశ్యమయ్యాయి. ఇప్పుడవే తాటి కమ్మలతో దేవతామూర్తుల కిరీటాలు తయారవుతున్నాయి. సంప్రదాయ బొమ్మలు రూపొందుతున్నాయి. వాటికి అవసరమైన బొమ్మ కమ్మలు కొత్తవలస మండలం నుంచే ఎగుమతి అవుతున్నాయి. వియ్యంపేట పంచాయతీ కొటానవాని పాలెంకి చెందిన కొమ్మాది సూరిబాబు కుటుంబం బొమ్మ కమ్మల తయారీతో ఉపాధి పొందుతోంది. కొత్తవలస రూరల్ : కొమ్మాది సూరిబాబు కుటుంబం ఇరవయ్యేళ్లుగా బొమ్మ కమ్మలను తయారు చేస్తూ కోల్కత్తా, చెన్నై నగరాలకు ఎగుమతి చేస్తోంది. సూరిబాబు మంచి క్రికెట్, కబడ్డీ క్రీడాకారుడు కూడా. విశాఖ జిల్లా కండిపల్లి, రాజాగూడెం, విజయనగరం జిల్లా కొటానివానిపాలెం, బల్లంకి, శ్రీకాకుళం జిల్లా దొడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తదితర ప్రాంతాలు బొమ్మ కమ్మల తయారీకి ప్రసిద్ధి చెందాయి. వీటిని కోల్కత్తా, చెన్నై నగరాల్లో సంప్రదాయ బొమ్మల తయారీలో వినియోగిస్తారు. దేవతామూర్తుల కిరీటాలను తయారు చేస్తారు. దళారుల బెడద గిరాకీ ఉన్న బొమ్మ కమ్మల తయారీలో భార్యాబిడ్డలతో సహా శ్రమిస్తున్నా గిట్టుబాటు రావడం లేదు. మధ్యవర్తులే లాభాలు దోచుకుంటున్నారు. మొదటి నుంచి ఇదే పని నమ్ముకోవటంతో వదల్లేక అరటి మట్టలు, ఉపాధి పనులు చేసుకుంటున్నాం. వేసవిలో కమ్మ దొరక్కపోతే ఉపాధి పనులు, మామిడి పండ్ల విక్రయంతో కాలక్షేపం చేస్తున్నాం. అరటి తొండాలను కూడా తెచ్చి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటాం. – సూరిబాబు బొమ్మ కమ్మలు ఎలా చేస్తారంటే.. మెక్క తాటిచెట్ల నుంచి లేత తాటాకుల్ని స్థానికులు కొట్టి తెచ్చి వీరికి అమ్ముతారు. ఒక్కొక్క మోపులో వెయ్యి ఆకులుంటాయి. వీటిని సూరిబాబు కుటుంబం రూ.400కు కొంటుంది. వీటిని ఒకటి లేదా రెండు రోజులు ఆరబెడతారు. వాటిని ఇద్దరు బొమ్మ కమ్మలుగా కత్తిరిస్తారు. వాటిని మర్నాడు వంగిపోకుండా మడతబెడతారు. వెయ్యికమ్మలు ఒక మూటగా కట్టి విశాఖ జిల్లా వేపగుంట సమీపంలోని సింహాద్రినగర్ వ్యాపారి లారీల్లో లోడ్ చేస్తారు. అక్కడి నుంచి కోల్కత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు.