Web Site
-
వెల్కమ్ టు వెబ్3 వరల్డ్
టెక్నాలజీ ప్రేమికులైన యువతరం తాజా ఆసక్తి... వెబ్3 విశాలమైన వెబ్ 3 స్పేస్‌లో స్టార్టప్‌ల నుంచి ఉద్యోగాల వరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారిత వెబ్3 యువత కోసం ఎన్నో ద్వారాలను తెరవనుంది. స్వయంప్రతిపత్తిని అందించనుంది... ఒకప్పుడు... ‘మాకు వెబ్‌సైట్‌తో పనిలేదు. ప్రింట్ మీడియా టీవీ చాలు’ ‘ఇ–కామర్స్‌తో పనిలేదు. ఇన్–స్టోర్ చాలు’‘మొబైల్ వెబ్సైట్, యాప్‌లతో పనిలేదు’ ‘వెబ్3 స్ట్రాటజీ మాకు అవసరం లేదు’ అన్నట్లుగా ఉండేది. 90ల నుంచి 2020 వరకు సాంకేతికతకు సంబంధించిన అభిరుచులు, అభిప్రాయాలలో ఎంతో మార్పు వచ్చింది. ‘మాకు అవసరం లేదు’ అన్నచోటే ‘మాకు తప్పనిసరిగా అవసరం’ అనే మాట వినిపిస్తోంది. వెబ్3 సాంకేతిక విషయంలోనూ ఇదే మార్పు చోటు చేసుకుంది. ‘ఇలా వచ్చి అలా వెళ్లి పోయే ట్రెండ్ ఇది’ అనుకున్న కంపెనీలు కూడా వెబ్3 సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. యూత్‌తో కనెక్ట్ కావడానికి ‘వెబ్3’ అనేది బలమైన సాధనం అని నమ్ముతున్నాయి. వెబ్3 మార్కెటింగ్‌పై రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నాయి. వెబ్3 బ్రాండ్స్ జెన్ జెడ్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి సంప్రదాయ విధానాలకు భిన్నంగా కొత్తదారిలో పయనిస్తున్నాయి. బ్లాక్‌చెయిన్–బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్, వర్చువల్ వరల్డ్స్ అభివృద్ధి వల్ల డిజిటల్ స్పేస్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది యువతరం. వెబ్–3 బేస్డ్ గేమ్స్, వర్చువల్ వరల్డ్స్ యువ ప్లేయర్స్‌కు అటానమస్, వోనర్షిప్, మానిటైజేషన్ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లాంటి సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫామ్స్ మీద ఆధారపడకుండా కంటెంట్ క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి, కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి వెబ్3 టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ‘వెబ్3 విశ్వరూపాన్ని మనం ఇంకా చూడనప్పటికీ కొత్తరకం అవకాశాలతో క్రియేటర్లను ఆకట్టుకుంటోంది. మధ్యవర్తుల అవసరం లేకుండానే డైరెక్ట్–కన్యూ్జమర్ ఇంటరాక్షన్‌కు వీలు కల్పిస్తుంది. సంప్రదాయ పద్ధతుల కంటే భిన్నంగా ఆదాయ మార్గాలను విస్తరించుకోవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే వెబ్3 అనేది సంప్రదాయ మోడల్స్‌ను సవాలు చేసేలా ఉంటుంది. క్రియేటర్లు ఒక అడుగు ముందుకు వేసేలా చేస్తుంది’ అంటున్నాడు ఏఐ పవర్డ్ క్రియేటర్ టెక్ కంపెనీ ‘యానిమెటా’ సీయివో దేవదత్తా. ‘వెబ్3 జెన్–జెడ్, మిలీనియల్స్‌ను ఆకట్టుకుంటుంది. వెబ్3 నుంచి మరిన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు. వెబ్3 యాప్ ఫౌండర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన కసరత్తు చేస్తే, ఆసక్తికరమైన ఐడియాలతో ముందుకు వస్తే గేమ్‌లో ముందు ఉంటారు’ అంటున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ ‘యాప్టోపియా’ ఫౌండర్, సీయివో జోనాథన్ కె. వెబ్ 3 రంగంలో భారత్ వేదికగా ఎన్నో కంపెనీలు పని చేస్తున్నాయి. వీటిద్వారా యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. సాలిడిటీ డెవలపర్, మార్కెటింగ్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, బ్లాక్ చెయిన్ ఆఫీసర్, కమ్యూనిటీ మేనేజర్, యూనిటీ డిజైనర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఈవెంట్స్ మేనేజర్, ఎనలిస్ట్, బీటా టెస్టర్, టెక్నికల్ రైటర్, డెవలపర్, డిజైనర్, ఇన్ఫ్లూయెన్సర్ మేనేజర్... ఇలా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నయా ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్(డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ)కు సంబంధించి వెబ్ 1 నుంచి వెబ్ 2 వరకు జరిగిన ప్రస్థానాన్ని గమనిస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. వెబ్ 1 దశలోని వెబ్సైట్ల నుంచి వెబ్2 దశలోని సోషల్ మీడియా విస్తృతి వరకు ఆ మార్పును ప్రతిబింబిస్తాయి. అయితే ‘అభివృద్ధి’గా చూపుతున్న మార్పు బడా కంపెనీలకే మేలు చేసిందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద కంపెనీల ఆధిపత్యానికి, నియంత్రణకు వీలు లేని వెబ్3 టెక్నాలజీపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. వెబ్3 స్టార్టప్‌లు భారతీయ మార్కెట్లో ఊపందుకోవడం ఈ మార్పును సూచిస్తోంది. వెబ్ 3లో డీసెంట్రలైజ్డ్ విధానంలో డేటా ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతుంది. వెబ్ 3 అనేది ఒక తరం మార్పునకు ప్రతిబింబం. ‘వెబ్ 3కి కొలమానం ఏమిటి?’ అనే విషయానికి వస్తే ఒక యాప్‌లో డాటా, ఐడెంటిటీ, ప్రైవసీ, ప్లే–టు–ఎర్న్లాంటి ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి. స్వెట్‌కాయిన్ (ఫిట్నెస్), ట్విగ్(ఫైనాన్స్)లాంటి వెబ్3 రైజింగ్ స్టార్స్ ఆచరణ స్థాయిలో వెబ్3 ఎలిమెంట్స్‌ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. మైరాతో అంతర్జాతీయ స్థాయికి... వెబ్ 3 వరల్డ్ ఇనోవేషన్‌కు సంబంధించి ఘనంగా చెప్పుకునే వారిలో శిల్పా కర్కెరా ఒకరు. నాగ్‌పుర్‌కు చెందిన శిల్ప ఏఐ అండ్ బ్లాక్‌చెయిన్ సొల్యూషన్స్, ప్రాడక్ట్ కంపెనీ ‘మైరా టెక్నాలజీకి’ ఫౌండర్, సీయివో. ప్రస్తుతం ఈ కంపెనీ ఆరు దేశాల్లో పనిచేస్తోంది. ‘మైరా బ్లాక్స్’ అనే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్‌తో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తోంది. ఎన్నో కొత్త కంపెనీలకు టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేసింది. ‘మీకు సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉంటే మీలాగే ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయండి. నిపుణులతో మాట్లాడండి’ అంటుంది శిల్ప. -
సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్సైట్. తాజాగా బిగ్ షాకిచ్చింది ఐబొమ్మ. ఇప్పటికే డౌన్లోడ్ ఆప్షన్ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు. చదవండి: సినిమా హిట్.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన ‘కోబ్రా’ డైరెక్టర్ కాగా హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకు ఐబొమ్మ గతంలో కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వహకులు.. ఆ తర్వాత మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరికొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. చదవండి:జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? -
దళితబంధు యూనిట్లపై పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలులో మరిన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ఈ పథకం లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంతో అమలు చేస్తుండగా... వారికి నిత్యం సహాయ, సహకారాలను అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఏర్పాటు చేసిన యూనిట్‌ను దళితబంధు వెబ్సైట్లో ఎంట్రీ చేసి, నిర్వహణ తీరును క్రమం తప్పకుండా రికార్డు చేసేందుకు ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది. లబ్ధిదారులు, జిల్లా సంక్షేమాధికారులతో సమన్వయానికి ఈ విభాగం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే దళితబంధు అమలుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ సంక్షేమ శాఖలు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ... క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా పథకంలో సవరణలకు సూచనలిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం రాష్ట్రస్థాయి కమిటీతో సమన్వయం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్వహణపై పర్యవేక్షణ... దళితబంధు సాయంతో ఏర్పాటు చేసిన వ్యాపార యూనిట్ల తీరును ఈ ప్రత్యేక విభాగం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. నెలకోసారి యూనిట్ నిర్వహణ తీరుపై సంబంధిత లబ్ధిదారుతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఏవైనా సమస్యలెదురైతే... సంబంధిత కేటగిరీకి చెందిన నిపుణులతో సమన్వయపర్చి లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34వేల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. వీరి ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. ఇందులో ఇప్పటికే 8వేల మంది లబ్ధిదారులు వారి ఖాతా నుంచి నగదును ఉపసంహరించి వివిధ రకాల యూనిట్లను తెరిచారు. మరో రెండు నెలల్లో 50శాతానికి పైగా లబ్ధిదారులు యూనిట్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Srivari Special Darshan Quota Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: (కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు) -
27 భాషల్లో ఓయూ వెబ్సైట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ వెబ్‌సైట్‌ను ఇక నుంచి ఇంగ్లిష్తో పాటు 27 భాషల్లో చూడవచ్చు. ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఓయూ వెబ్‌సైట్‌కి వెళ్లి భాషల ఎంపికపై క్లిక్ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. -
బిట్‌కాయిన్ కుంభకోణం: వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంలో సీసీబీ పోలీసుల విచారణలో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కుంభ కోణానికి కేంద్రబిందువైన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి, పలు వెబ్సైట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ కార్యకలాపాలకు ఎలా పాల్పడింది బహిర్గతమైంది. ఐదేళ్ల పాటు బిట్‌కాయిన్ దందాలో భాగస్వామిగా తాజాగా సీసీబీ పోలీసులకు పట్టుబడిన రెండో వ్యక్తి రాబిన్ ఖండేన్వాలా. ఇతడు శ్రీకి దందా పట్ల నోరువిప్పాడు. హ్యాకింగ్ ఎలా చేశారు, ఎవరికి బిట్కాయిన్లను విక్రయించారు, ఈ దందాలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారు అనే విషయాలపై రాబిన్ ఏడు పేజీల వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరీ ఖండేన్వాలా? పశ్చిమబెంగాల్ కు చెందిన రాబిన్ఖండేన్వాలా సీఏ పట్టభద్రుడు కాగా 2012 నుంచి 16 వరకు తండ్రి నిర్వహించే రైస్‌మిల్ చూసుకునేవాడు. 2016లో రాబిన్ సర్వీసెన్ పేరుతో బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రారంభించాడు. పలు వెబ్సైట్ల తెరిచి అమ్మకం, కొనుగోళ్లను చేసేవాడు. ఇంతవరకు రూ.50 కోట్లు వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్‌లో హ్యాకర్ శ్రీకృష్ణ ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఈ సమయంలో శ్రీకృష్ణ తనవద్దనున్న 900 బిట్కాయిన్లు విక్రయించాలని కోరగా, రాబిన్ వాటిని అమ్మి ఆ డబ్బును శ్రీకి అకౌంట్లోకి జమచేశాడు. సుమారు రూ. ఐదారు కోట్ల వ్యవహారాలు నడిపారు. వందలాది కాయిన్ల అమ్మకాలు శ్రీకి గోవాలో పోకర్ ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని రాబిన్ చెప్పాడు. అలా శ్రీకి కోట్లాది రూపాయలను దోచుకుని గోవాలో విలాసాలు చేసేవాడు. 2017 నుంచి అనేక వెబ్సైట్లను హ్యాక్ చేసిన శ్రీకి 130 బిట్కాయిన్లను రాబిన్ ఖండేన్వాలాకు ఇచ్చాడు. దీనిని విక్రయించి రూ.3.48 కోట్ల నగదును 50 మందికి పైగా అకౌంట్లలోకి జమచేశాడు. మిగిలిన డబ్బును శ్రీకి జల్సాలకు చెల్లించాడు. శ్రీకి హ్యాక్ చేయడానికి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవాడు. హవాలా ద్వారా రూ.4.98 కోట్లు 2017లో శ్రీకృష్ణ ఇరిడియం టోకెన్లను అందించి రాబిన్ ద్వారా అమ్మేయించాడు. 2018లో బెంగళూరు కు వచ్చినప్పుడు శ్రీకి హ్యాకర్ అని తెలిసిందని విచారణలో చెప్పాడు. ఒక హోటల్లో శ్రీకి, మహమ్మద్ నలపాడ్ తదితరులు తనను కలిశారని తెలిపాడు. బిట్కాయిన్ల గురించి చర్చ జరిపామని, కొద్దినెలల తరువాత ఓ కేసులో నలపాడ్ అరెస్టయ్యాడు. ఈ సమయంలో శ్రీకికి తన ఇంట్లో ఐదురోజులు ఆశ్రయం ఇచ్చానని, ఈ సమయంలో ఢిల్లీ, చండీఘడ్, జైపూర్, ముంబై తదితరాలకు వెళ్లినట్లు రాబిన్ చెప్పాడు. 2018లో శ్రీకి అడగడంతో 30 బిట్కాయిన్లను బదిలీ చేశానని, సుజయ్, సునీశ్, ప్రసిద్ధ్ శెట్టి, సురేశ్ అనే వారిని పరిచయం చేశాడన్నారు. శ్రీకి కి నగదు కావాలనడంతో హైదరాబాద్ అభిషేక్ ద్వారా హవాలా మార్గంలో మొత్తం రూ.4.98 కోట్ల నగదు పంపించానని వివరించాడు. బిట్‌కాయిన్ నిందితులను వదలం : సీఎం శివాజీనగర: బిట్ కాయిన్ స్కామ్‌ను బయటికి తీసుకురావడం, విచారణ చేపట్టింది మేమే. ఇందులో ఎంతటి బలమైన వ్యక్తులున్నా శిక్షిస్తాం అని సీఎం బొమ్మై చెప్పారు. ఆదివారం విధానసౌధ ముందు నెహ్రూ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత మాట్లాడారు. ఈ కేసులు ఈడీ, సీబీఐకి అప్పగించాము. వారు కోరిన సమాచారాన్ని అందించాము. 2018లో కాంగ్రెస్ సర్కారు నిందితుడు శ్రీకృష్ణను విచారించి ఉంటే అన్ని విషయాలూ బహిరంగమయ్యేవి. ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ మోసం జరిగినా చర్యలు తీసుకొంటాము అని చెప్పారు. నన్ను వదిలేయండి: నలపాడ్ బిట్‌కాయిన్ స్కామ్‌లో నా పాత్ర లేదు, అనవసరంగా నా పేరును ప్రస్తావించి వేధించవద్దు అని కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2021 జనవరిలో బిట్ కాయిన్ కేసు బయటికి వచ్చింది. దీంతో నాకు సంబంధం ఉంటే ఎప్పుడో అరెస్టు చేసేవారు కదా అని అన్నారు. యూబీ సిటీలో గొడవ కేసులో 117 రోజులు జైలులో ఉన్నాను, మా నాన్న హ్యారిస్ ఎమ్మెల్యే కాబట్టి నాపై కొందరు బురదచల్లుతున్నారు అని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అని కోరారు. -
మొన్న బ్యాన్ ప్రకటన.. ఇప్పుడు అశ్లీల కంటెంట్‌కు రైట్ రైట్!
OnlyFans Reverse Ban Decision: అశ్లీల కంటెంట్‌తో దూసుకుపోతున్న వెబ్సైట్ ఓన్లీఫ్యాన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ సైట్లో అడల్ట్ కంటెంట్‌కు చోటు ఉండదని ప్రకటించిన కొన్ని గంటలకే.. మాట మార్చేసింది. అన్నిజానర్ల కంటెంట్‌కు తమ వెబ్సైట్లో చోటు ఉంటుందంటూ సె*వర్కర్లకు బహిరంగ మద్దతుతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాకింగ్ పార్ట్నర్స్, పే అవుట్ ప్రొవైడర్స్ విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 1 నుంచి తమ వెబ్సైట్లో అశ్లీల కంటెంట్‌కు చోటు ఉండబోదని ప్రకటించింది ఓన్లీఫ్యాన్స్. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బుధవారం సాయంత్రం మరో ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాకింగ్ పార్ట్నర్స్ మద్దతుతోనే ముందుకెళ్తామని ప్రకటించడం గమనార్హం. ఓన్లీ ఫ్యాన్స్ అనేది యూకేకు చెందిన పెయిడ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం.. మరోవైపు వెబ్‌సైట్‌కు, కస్టమర్ల పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు అందులో కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో సెలబ్రిటీ యూజర్ల వల్ల డీసెంట్ సైట్‌గా పేరు దక్కించుకున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో సెక్స్‌వర్కర్ల ఎంట్రీతో అశ్లీల వెబ్సైట్ అనే ముద్ర వేయించుకుంది. కంటెంట్ ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్ వైడ్‌గా 130 మిలియన్ల యూజర్లు ఉండగా.. భారత్ నుంచి సుమారు మూడున్నర లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలు ఇవే.. ఆన్లైన్ పో* పరిశ్రమ బిలియన్ల వ్యాపారం నడుస్తుండడంతో పాటు నేరాలు బాగా తగ్గాయి. ముఖ్యంగా కరోనా టైం ఈ సైట్లో ఎరోటిక్ కంటెంట్‌కు ఫుల్ గిరాకీ ఉంటోంది. అయితే ఇలాంటి అడల్ట్ కంటెంట్ క్రియేట్ వెబ్‌సైట్‌పై నిషేధాలు విధిస్తే మళ్లీ సె*వర్కర్లంతా రొడ్డెక్కుతారని, తద్వారా క్రైమ్ రేటు పెరిగే అవకాశాలు ఉంటాయని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అంతేకాదు తమ ఉపాధిపై దెబ్బపడుతుందని, భద్రతకు సంబంధించి ఆందళోన వ్యక్తం చేస్తున్నారు సె*వర్కర్లు. చదవండి: అశ్లీల వెబ్సైట్లు.. సబ్‌స్క్రిప్షన్‌కు కార్డులూ పని చేయవు -
దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణకు వచ్చింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని పిటిషన్లో కోర్టుకు తెలిపారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందని ఏజీ పేర్కొంది. అయితే నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్సైట్లో లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
కాలు కదపకుండా కాసులు కురిపించే ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రశాంత్‌కు ఆంగ్లభాషలో మంచి పట్టుంది. ఆరునెలల క్రితం వర్క్ అండ్ హైర్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాడు. సృజనాత్మక కంటెంట్ రైటింగ్ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో నాలుగు గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.28 వేలు ఆర్జిస్తున్నాడు. దీపికకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసే అంశంపై మంచి పట్టుంది. ఒకవైపు ఇంటి పని చేసుకుంటూనే ఆన్లైన్లో ఖాళీ సమయాల్లో పలు కంపెనీల ట్రాన్స్లేషన్లు పూర్తిచేసి నెలకు రూ.25 వేలకు పైగానే ఆర్జిస్తోంది. ఏంటీ నయా ట్రెండ్ అనుకుంటున్నారా..? తమ హాబీల ద్వారా ఆదాయ ఆర్జన చేసేందుకు పలువురు గ్రేటర్ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఖాళీసమయాల్లో ఆడుతూ..పాడుతూ పనిచేస్తూ..ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారు తాము తీసిన ఫోటోలను కొన్ని వెబ్సైట్లలో తేలికగా విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సేవారంగంలో కొత్త తరహా వెబ్సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్, తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్ అవకాశాలు అందిస్తుండడం విశేషం. జాబ్‌లు ఇలా.. ► హబీకి..టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికిపెట్టే వెబ్సైట్లు బోలెడు అదుబాటులోకి వచ్చాయి. ►ఖాళీ సమయాల్లోనూ కాసులు కురిపించే ఉద్యోగాలను ఇంటి నుంచి కాలు కదపకుండా సంపాదించుకునే ఉద్యోగాలకే సిటీజన్లు ఓటేస్తున్నారు . ►గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృత్తినిపుణులు ఇలా..మహానగరం పరిధిలో ఇలా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తూ నెలకు పది వేల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు వేలాదిమంది ఉన్నారు. ►ప్రధానంగా మెడికల్ ట్రాన్స్స్కిప్షన్, ట్రాన్స్లేషన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫోటోగ్రఫి, ట్రావెల్ ఎక్స్పర్ట్, ఫుడ్‌బ్లాగర్, ఇంటీరియర్ డిజైనింగ్, మొబైల్ యాప్ తయారీ, వెబ్సైట్ మేకప్ తదితర ఫ్రీలాన్స్ జాబ్స్‌కు సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు. ►మహానగరం పరిధిలో ఇంటర్నెట్ వినియోగం 80 శాతానికి పైగా ఉండడంతో ఈ ఫ్రీలాన్స్ జాబ్స్‌కు క్రేజ్ పెరిగిపోయింది. వెబ్సైట్లు కొన్ని.. అప్‌వర్క్, వర్క్ అండ్ హైర్, ఫ్రీలాన్సర్.కామ్, ట్రూలాన్సర్, ఫైవర్, వీటికితోడు రెగ్యులర్ జాబ్ వెబ్‌సైట్స్ అయిన షైన్, లింక్డిన్, ఇండీడ్ లాంటి వాటిలోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కునే అవకాశం ఉంది. -
వలసలను తక్షణం ఆపాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిపై ఫేక్ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావుల బెంచ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్రం.. సత్వర చర్యలతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేశామని, ఫేక్‌న్యూస్ కారణంగా ప్రజల్లో తలెత్తిన భయాందోళనలతో పరిస్థితులు నియంత్రించలేనంతగా చేయిదాటి పోయాయని తెలిపింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ జాడలు కనిపించలేదని, నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రతి 10 మంది వలస కార్మికుల్లో ముగ్గురు సొంతూళ్లకు వెళ్లడంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఉచితంగా కోవిడ్ పరీక్షకు ఆదేశించండి దేశంలోని పౌరులందరికీ కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్ష ఉచితంగా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉచితంగా పరీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ లాయర్ శశాంక్ డియో సుధి పిటిషన్ దాఖలు చేశారు. తమకున్న రోగాన్ని నిర్ధారణ చేసుకొనేందుకు సాధారణ పౌరులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే అక్కడ భారీగా ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు. -
అందరి చూపు సేంద్రియం వైపు
నంగునూరు (సిద్దిపేట): ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విషతుల్యమైన పంటలతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆర్గానిక్ పంటల వైపు చూస్తోందన్నారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట ఆర్గానిక్ ప్రొడక్ట్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం వాటర్‌షెడ్ పథకం కింద రైతులకు సబ్సిడీ టార్పాలిన్ కవర్లు, స్ప్రేయర్లు అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు పండించడం వల్ల కేన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఆర్గానిక్ పంటలు అమ్మేవారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంటలను అందించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీని కోసం www.siddipetorganicproducts.com ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ వెబ్సైట్లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతు వివరాలు, పొలం, ఫొటోలు, పంట తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. నేరుగా కొనుగోలు..: ఈ వెబ్సైట్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల నుంచే వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయవచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సేంద్రియ రైతులకు మంచి ధర వచ్చేందుకు, వినియోగదారుల కొనుగోలుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పరుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతుండటాన్ని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రూ.15 లక్షల ఆర్థిక సాయం.. యాభై ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించి సేంద్రియ వ్యవసాయం చేస్తే వారికి ప్రభుత్వం నుంచి మూడేళ్ల పాటు విడతల వారీగా రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలతో పాటు కార్పొరేట్ సంస్థల సాయంతో రైతులకు ఆవులను సమకూర్చుతామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుసంధానిస్తామన్నారు. రైతులు నమ్మకంగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే కొనుగోలు దారులు పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేసేలా చేస్తామన్నారు. వరంగల్, సిద్దిపేట రైతు బజారులో సేంద్రియ ఉత్పత్తులు అమ్మడానికి ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో రైతులకు మంత్రి హరీశ్‌రావు ఆర్గానిక్ వ్యవసాయ పనిముట్లను అందజేశారు. కొమురవ్వ.. వ్యవసాయం ఎట్ల చేస్తున్నవ్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి, నర్సంపేట్ నియోజక వర్గాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు రావడంతో మంత్రి వారి వివరాలు సేకరించారు. పాలకుర్తికి చెందిన మహిళా రైతు కొమురవ్వ మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని చెప్పడంతో.. ఎన్ని ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నావని, ఎరువులు, కషాయాలు ఎలా తయారు చేస్తున్నావని మంత్రి ఆమెను అడిగి తెలుసుకున్నారు. -
ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో టెండర్లు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో 104, 108, ఈఆర్సీ (ఆపరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్)ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉంచినట్లు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ జ్యుడీషియల్ ప్రివ్యూ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ ప్రివ్యూ ‘లోగో’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాధ్యత గల పౌరులుగా ప్రజలు, కాంట్రాక్టర్లు, నిష్ణాతులు.. టెండర్లపై తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 200 రిగ్గుల యంత్రాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పరిశీలించి, అందులోని లోపాలను సవరించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు వీలుగా రూ.600 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, ఆ టెండరును పరిశీలించి లోపాలను సవరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. తర్వాత వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాలేరు నగరి – సుజల స్రవంతి పనులకు సంబంధించిన టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వచ్చిందని, దానిని పరిశీలించాల్సి ఉందన్నారు. -
జిల్లాలో ఉర్దూ వెబ్సైట్..
సాక్షి, మహబూబ్‌నగర్ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన మహబూబ్‌నగర్ జిల్లా నేడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు, తెలుగులోనే అందుబాటులో ఉండే మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను సరికొత్తగా ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉర్దూ మాట్లాడే, చదివే వారికోసం స్వాస్ సాంకేతిక టెక్నాలజీ సహాయంతో ఈ ఉర్దూ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఉర్దూలో మహబూబ్‌నగర్ జిల్లా ఎన్ఐసీ వెబ్సైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంపై ఉర్దూ భాష మాట్లాడే వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఉర్దూ భాషలో మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ఐసీ అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగించి తుది మెరుగులు దిద్దారు. నెల రోజులపాటు కసరత్తు చేసిన ఎన్ఐసీ అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ఉర్దూ వెబ్‌సైట్‌కు అంకురార్పన చేశారు. దేశంలోనే మొదటిసారి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా దేశంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను ఉర్దూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తుండటమే కాకుండా అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి సైతం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఉర్దూ భాషలోనూ వెబ్సైట్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మెరుగైన ఫలితాలు తీసుకురానుంది. అయితే జిల్లాలో ఇప్పటికే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఈ–ఆఫీస్ విధానంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని అనుసంధానం చేసి ఫైళ్ల నిర్వహణను అత్యంత సులభతరం చేయడంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సఫలీకృతులయ్యారు. ప్రతీ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఎవరూ కార్యాలయాల చుట్టూ సంతకాల కోసం, అనుమతుల కోసం తిరిగే వీలు లేకుండా తమ కార్యాలయం నుండే ఈ–ఆఫీస్ విధానంతో క్షణాల్లో అనుతులు తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకుల సమక్షంలో.. ఈ విధానంతో పనిభారం తగ్గడమే కాకుండా అధికారులు అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఇదిలాఉండగా, ఉర్దూ వెబ్‌సైట్‌ను మొదటిసారిగా అందుబాటులోకి తేవడం ఎంతో గర్వకారణమని జిల్లా అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రొనా ల్డ్‌రోస్ సోమవారం ప్రజావాణి కార్యక్రమం వేదికగా అఖిలపక్ష పార్టీల ము స్లిం నాయకుల సమక్షంలో ఉర్దూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ రూపకల్పనకు స్వాస్ సాంకేతిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని, ఎన్ఐసీ అధికారుల శ్రమ ఫలితంగా ఉర్దూ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించేందుకు వీలుకలిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. -
రైల్వే వెబ్సైట్ హ్యాకర్ అరెస్టు
కాశీబుగ్గ : రైల్వే టికెట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి 35 నకిలీ ఐడీలతో టికెట్లు పొందుతున్న వ్యక్తిని పలాస రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన పత్తి బాలకృష్ణ(36) తప్పుడు మార్గాల్లో టికెట్లు పొందుతుండగా ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది పేరుతో తీసుకున్న రిజర్వేషన్ టికెట్లు, ఖాళీ రిజర్వేషన్ పత్రాలు, రెండు సెల్ఫోన్లు, రూ.8270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ డి.కుమార్ నిందితుడిపై రైల్వే సెక్షన్ 143 కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం విలేకరుల ముందు ప్రవేశపెట్టి విశాఖపట్నం సెకెండ్ క్లాస్(ఎంఎం) రైల్వేకోర్టుకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించారు. -
ధరణి సర్వర్ డౌన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల సమగ్ర వివరాల కోసం రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ వెబ్సైట్ బుధవారం సాయంత్రం నుంచి మొరాయిస్తోందని, పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణకు సహకరించడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఇప్పటికే పాస్‌పుస్తకాల సవరణ విషయంలో జాప్యం జరుగుతుండగా, అధికారికంగా రూపొందించిన వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడం రెవెన్యూ వర్గాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన అన్ని మండలాల్లో ఒకేసారి తప్పుల సవరణకు ఉపక్రమించడంతో సర్వర్ డౌన్ అయిందని, దీన్ని వెంటనే పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నత్తనడకన తప్పుల సవరణ ధరణి వెబ్సైట్ ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణల కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వాస్తవానికి, గతనెల 28 నుంచి ఈనెల 3వ తేదీలోపు ఈ తప్పుల సవరణ కార్యక్రమం పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తొలుత ఆధార్ నంబర్ల మార్పులు, డబుల్ ఖాతాల మార్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చారు. కానీ ఎక్కువ మొత్తంలో నమోదయిన విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లు, పేర్లలో తప్పుల గురించిన ఆప్షన్లు ఇవ్వలేదు. అయితే, సర్వే నంబర్లు, పేర్లలో మార్పులకు సంబంధించిన ఆప్షన్లను గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. కానీ, సర్వర్ డౌన్ కావడంతో ఆ పని కూడా ముందుకు సాగడం లేదు. దీనికి తోడు మరో 10 రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ ఆప్షన్ల ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పులను సవరించాల్సి ఉంది. కానీ, దశలవారీగా ఇస్తున్న ఈ ఆప్షన్లు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. అసలే అన్ని ఆప్షన్లు అందుబాటులోకి రాక తిప్పలు పడుతున్న రెవెన్యూ యంత్రాంగానికి ఈ సర్వర్ డౌన్ సమస్య మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుండటం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చి, సర్వర్ సమస్యలు లేకుండా చూస్తేనే ఇంకో రెండు నెలల్లో అయినా తప్పులు లేని పాస్‌పుస్తకాలు రాష్ట్ర రైతాంగానికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నెట్టింట్లో నగ్నసత్యం
మీ పిల్లలు ఇంటర్నెట్లో ఏంచేస్తున్నారు ... ఏం చూస్తున్నారో మీకు తెలుసా ... తరగతికి సంబంధించిన పాఠాలుచూస్తున్నారు కదా అని మీరు వదిలేస్తే పప్పులో కాలేసినట్టే ... క్లాస్ పాఠాల కోసం పిల్లలకు కంప్యూటర్లు, నెట్ కనెక్షన్లు ఇస్తేకొందరు కామ పాఠాలు వెతుక్కుంటున్నారు. నగ్న చిత్రాలను నెట్టింట్లోనే చూస్తున్న పిల్లలు దేశంలోనేకోట్లల్లో వున్నారు. అరచేతిలో శృంగారం అందుబాటులోకి రావడంతో నీలిప్రపంచానికి యువత బానిసగా మారుతోంది.వారిలో హింస ప్రవృత్తి పెరిగిపోయి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి వారినినియంత్రించడానికి కేంద్రం పోర్న్సైట్లపై కొరడా ఝుళిపిస్తున్నా వారి యత్నాలు బెడిసి కొడుతున్నాయి. వీటిని పూర్తిగాకట్టడి చేయకుంటే దీని ప్రభావం ఎక్కువగా వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుపతి క్రైం: ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న జీవన శక్తి ఇంటర్నెట్. సమస్త ప్రపంచాన్ని అరచేతిలో మడిచిన సాంకేతిక తంత్రం. ప్రపంచంలో సగా నికి పైగా సంస్థలు పనిచేయాలంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా వుండాల్సిందే. అలా మన లైఫ్ స్టైల్లో ఇంటర్నెట్ అత్యవసరమైపోయింది. ఎంతలా అంటే ఒక పదినిమిషాలు ఇంటర్నెట్ లేకపోతే లక్షకోట్లు నష్టం వచ్చే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. యువత అయితే రోజంతా తిండి లేకపోయినా వుండరేమోగాని సెల్‌ఫోన్ ఇంటర్నె ట్ లేకుండా ఒకక్షణం కూడా వుండలేక పోతున్నా రు. ఇ దంతా ఇంటర్నెట్కు, ఇన్పర్మేషన్ టెక్నాలజీకి ఒక కోణం మాత్రమే. కానీ మనకు తెలియని కూడా వుంది. అది ప్రపంచానికి తెలియని నీలికో ణం. ఒకసారి బానిస అయితే చాలు ఇక ఎవరినీ వదలిపెట్టదు. మదనపల్లిలో ఓ యువకుడు ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు నిరాకరించడంతో నమోదు కాలేదు. అయితే పోలీసులు తమదైన శైలిలో యువకున్ని విచారించగా అశ్లీల సైట్లు అధికంగా చూడడం వల్ల బాలికపై అత్యాచార యత్నానికిపాల్పడినట్లు తేలింది. శ్రీకాళహస్తిలో కూడా ఓ మహిళపై అత్యాచార యత్నం జరిగింది. ఆ కేసులోని నిందితులు కూడా పోలీసుల విచారణలో ఆసక్తికరమైన నిజాలు వెల్లడించారు. నిత్యం అశ్లీల వీడియోలను చూడటం వల్ల వారికి ఇలాంటి కోరికలు పుట్టినట్లు, అదే ప్రస్తుతం తీవ్రమైనట్లు పోలీసులు నిర్ధారించారు. కట్టడికి కేంద్రం కసరత్తు భావితరాలను తప్పటడుగులోకి తీసుకెళుతున్న ఈ నీలిలోకానికి తలుపులు వేయడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్నెట్లో పెట్రేగిపోతున్న పోర్న్సైట్లపై కొరడా ఝుళిపించింది. సర్వీస్ ప్రొవైడర్లసాయంతో ఇండియన్ ఇంటర్నెట్లో విహరిస్తున్న 875 పోర్న్సైట్లను, వాటి యూఆర్ఎల్, ఐపీ లింక్‌లను బ్లాక్ చేయగలిగింది. ప్రస్తుతానికి పబ్లిక్, ప్రైవేటు మొబైల్ డేటా ప్రొవైడర్ల సాయంతో ఈ అశ్లీలత సైట్లను అరికట్టేందుకు తొలి అడుగులు వేసినా పలురకాల దారుల్లో ఇంటర్నెట్కు చేరుతున్న పోర్న్ సైట్లను కూడా పూర్తిగా అరికట్టేందుకు నిపుణులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరిగే అత్యాచారాలు, అకృత్యాలు ఈ పోర్న్సైట్ల కారణంగానే అని క్రైం బ్యూరో భావిస్తుండగా విచారణలో సైతం నిందితులు ఇదే విషయాలను వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత చొరవ చూపి ఈసైట్లను పూర్తిగా కట్టడి చేయకుంటే మాత్రం దీనిప్రభావం చాలా తీవ్రతరంగా వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా అరికట్టడంతో ఆయా దేశాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్న నేపథ్యంలో మనదేశం కూడా దీనిని పూర్తిగా నియంత్రించాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారు. పోర్న్ సైట్స్తోనే నేరాలు అధికం ఇంటర్నెట్లో వచ్చే విచ్చలవిడి పోర్న్ సైట్స్ కారణంగా నేరాలు అధికమవుతున్నాయి. వీటిని నిరో« దించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్ర యత్నాలు చేసినా ఏదో ఒక రూ పంలో అందుతున్నాయి. వీటికి బానిసైన యువకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నా రు. పలు కేసుల విచారణలో ఈ విషయం స్పష్టమైంది. ప్రజలు, తల్లిదండ్రులు కూడా వీటిపై అవగాహన పెం చుకుని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలపట్ల గౌరవం పెరగేలా వారిని తీర్చిదిద్దాలి. అది దగ్గరగా వున్న వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడుతుండడం విచారకరం. ఇవన్నీ కూడా పెరిగిన సాంకేతిక కారణాల వల్ల జరుగుతున్నాయని క్రైం బ్యూరో తెలుపుతోంది. – మునిరామయ్య, ఈస్టు డీఎస్పీ చట్టాలు మరింత కఠినతరం లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చ ట్టాలు కఠినతరంగా వున్నాయి. వీటిని మరింత కఠినతరం చేసి ఎవరైనా సరే సమాజంలో తిరిగి అలాంటి తప్పు చేసేందుకు భయపడేలా శిక్షలు వుండాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటి కేసులు అధికమవుతుండడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పెరిగిన టెక్నాలజీ, పోర్న్ వీడియోల ప్రభావం చాలా తీవ్రంగా వుంది. వీటిపై మరింత దృష్టి సారించి పూర్తిగా నియంత్రించాలి. – కెఎస్ శ్రీధర్, న్యాయవాది దేశంపై పోర్న్ ప్రభావం పోర్న్ వెబ్సైట్ల ప్రభావం దేశంపై తీవ్రంగా వుంది. ప్రధానంగా యువతతోపాటు మైనర్లు కూడా తప్పుదోవ పట్టడానికి కావడానికి ఈసైట్లే ప్రధానంగా కారణమవుతున్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సులో అశ్లీలత్వానికి అలవాటుపడితే ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో, ఎన్ని అఘాయిత్యాలకు దారితీస్తుందో వివరంగా క్రైమ్ బ్యూరోతో పాటు సామాజిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇంటికి ఇంటర్నెట్ పెట్టిస్తే బాగుంటుందని ఏర్పాటు చేస్తే అదికాస్త పిల్లలను పక్కదారి పట్టిస్తోందని భయపడే తల్లిదండ్రులు కూడా ఎందరో వున్నారు. యాంటీ వైరస్లు, చైల్డ్ ప్రొటెక్షన్లు ఎన్ని పెట్టినా చేరాల్సిన అశ్లీలత సమాచారం చేరిపోతూనే ఉంది. కోట్ల మంది బ్లూ డేటా వినియోగం బ్లూలోకం టీనేజీలను బానిసగా మార్చుతున్న గమ్మత్తులోకం. తెలిసీ తెలియని వయస్సులో తెలియని విషయాలు తెలుసుకోవాలన్న తహతహతో వుండే వారికి ఇలాంటి సైట్లు ఆదిగురువులుగా మారుతున్నాయి. ఈ నీలి ప్రపంచానికి తెలియకుండానే బానిసలవుతున్నారు. చదువు సంధ్యలు పక్కనపెట్టి పక్కదారిపడుతున్నారు. ఒక యువతేకాదు ప్రముఖులు, వృద్ధుల వరకు ఈ నీలిచిత్రాలను చూస్తున్నారనే విషయం బహిరంగమవుతున్న తురణంలో పరిస్థితులు ఏస్థాయిలో వుందో అర్థమవుతుంది. -
కారు ఓఎల్ఎక్స్లో.. టెకీ అదృశ్యం!
బెంగళూరు: ఓఎల్ఎక్స్ వెబ్సైట్ ద్వారా కారు అమ్మేందుకు యత్నించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్నాకు చెందిన కుమార్ అజితబ్(30) బెంగళూరులోని ఓ బ్రిటీష్ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నారు. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన కారును చూసిన ఓ వ్యక్తి డిసెంబర్ 18న కుమార్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సాయంత్రం 6.30 గంటల సమయంలో కుమార్ కారులో బయటకు వెళ్లాడన్నారు. చాలాసేపయినా కుమార్ జాడలేకపోవడంతో అతని స్నేహితులు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తేలిందన్నారు. దీంతో కంగారుపడ్డ వారు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారన్నారు. కుమార్ అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని ఫోన్ లొకేషన్ చివరిసారి ఇక్కడి వైట్‌ఫీల్డ్‌లోని గున్జుర్లో ఉన్నట్లు చూపించిందన్నారు. -
సుప్రీం ఆదేశాలు పట్టించుకోని సీఐడీ
► ఏడాదిలో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా అప్లోడ్ చేయని వైనం ► ప్రత్యేక వెబ్సైట్ సైతం రూపొందించుకోలేని దుస్థితి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ కాపీలను కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఖాతరు చేయ డం లేదు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యభిచా రం, పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించి నవి తప్పా మిగతా నేరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను వెబ్సైట్లలో అందుబాటు లో ఉంచాలని సుప్రీం గతేడాది సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. అయితే ఏడాది గడిచినా రాష్ట్ర పోలీస్ శాఖలోని సీఐడీ ఒక్క కేసుకు సంబం« దించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా అప్లోడ్ చేయలేదు. తమది ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగమని, అలాంటి నిబంధనలు తమకు వర్తించవంటూ దాటవేస్తోంది. సుప్రీం ఆదేశా ల్లో సీఐడీ విభాగాలు ఎఫ్ఐ ఆర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యలు లేవు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశవ్యా ప్తంగా జరిగే ప్రతి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని 24 గంటల్లో అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తోంది. ఎఫ్ఐఆర్పై గోప్యత పాటించా ల్సిన అవసరం ఏముందన్న దానిపై సీఐడీ ఉన్నతాధికారులు నోరు మెదపడంలేదు. వెబ్‌సైట్‌కూ దిక్కులేదు.. అన్ని రాష్ట్రాల్లో నేర దర్యాప్తు విభాగాలకు ప్రత్యేకమైన వెబ్‌సైట్లున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏపీ పేరుతో సీఐడీకి వెబ్సైట్ ఉండేది. విభజన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖ అధికారిక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుంది. మూడున్నరేళ్లు గడిచినా సీఐడీ మాత్రం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకోలేదు. ఈ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులను వివరణ కోరగా తమకు ప్రత్యేక వెబ్సైట్ అవసరం లేదని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
వెబ్సైట్ అంటే ఏమిటి?
మరీ లోతైన వివరాలలోకి వెళ్ళకుండా క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్‌పై మనకు లభించే పుస్తకాలను లేదా పత్రికలను వెబ్‌సైట్స్ (Web Sites) అని అంటారు. మనం చదివే పుస్తకాలలో ఉన్నట్లు వెబ్సైట్లలో కూడా అనేక పేజీలుంటాయి. పుస్తకంలో ఒక పేజీ నుంచి మరో పేజీలోకి ఎలా వెళ్ళవచ్చో వెబ్సైట్లో కూడా అలాగే ఒక పేజీ నుంచి మరో పేజీలోకి వెళ్ళవచ్చు. పుస్తకంలో లాగానే వెబ్సైట్లోనూ తిరిగి మెుదటి పేజీలోకి రావచ్చు. ఇలా ఒక పేజీ నుంచి మరో పేజీలోకేగాక ఒకోసారి ఒక వెబ్సైట్ నుంచి మరో వెబ్సైట్లోకి నేరుగా వెళ్ళిపోయే సదుపాయమూ వుంటుంది. ఇలాంటి సదుపాయం పుస్తకాలలో వుండదు. పుస్తకాలలో మనకు అవసరవునుకున్న పేజీలను జెరాక్స్ తీసుకోగల్గినట్లే వెబ్సైట్ల నుంచి కూడా మనకు కావాలనుకున్న పేజీల ప్రింట్లను తీసుకోవచ్చు. ఒకో వెబ్సైట్లోనూ కొన్ని పదుల పేజీల నుంచి (కొన్నిటిలో పదికన్నా తక్కువే ఉండొచ్చు) కొన్ని వేల పేజీల దాకా ఉండవచ్చు. ఇవాళ ఇంటర్నెట్లో 10 కోట్లకు పైగా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ మన పుస్తకాల లాగా కేవలం అక్షరాలు – బొమ్మలతో మాత్రమే నిండి వుండవు. వీటిలో 1. అక్షరాలు, అంకెలతో వుండేవి (టెక్ట్స్ ) 2. నిశ్చల చిత్రాలతో (ఇమేజస్) వుండేవి. 3. మాటలు, పాటలు, సంగీతంతో (సౌండ్) వుండేవి. 4. కదిలే చిత్రాలతో (వీడియో) వుండేవి. అని వెబ్సైట్లు ప్రధానంగా 4 రకాలవి వుంటాయి. కొన్ని వెబ్సైట్లలో ఈ నాలుగు అంశాలూ ఉండవచ్చు. మరికొన్నిటిలో వీటిలో ఏవైనా ఒక రెండో, మూడో వుండవచ్చు. అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాలు, వివిధ సేవలను అందించేవారు, వస్తువులను ఉత్పత్తి చేసేవారు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు... ఆఖరికి వ్యక్తులు కూడా తమకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్ల – రూపంలో ఇంటర్నెట్ వ్యవస్థలో పొందుపరుస్తున్నారు. ఆయా వెబ్సైట్లను ఇంటర్నెట్లో ఓపెన్ చేసి చూడడం ద్వారా మనం మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు www.sakshi.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మీరు ‘సాక్షి’ పేపర్ని చదవవచ్చు. అదే విధంగా www.yatra.com అనే వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వివిధ యాత్రాస్థలాల వివరాలను తెలుసుకోవచ్చు. వివిధ స్థాయిల విద్యార్థుల చదువుకి, మనోవికాసానికి పనికొచ్చే వెబ్సైట్లు కూడా ఇంటర్నెట్లో లభిస్తాయి. -
వెబ్సైట్లో ఓయూసెట్ ప్రాథమిక కీ
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు పీజీ, పీజీడిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2016 ‘ప్రాథమిక కీ’ని బుధవారం వర్సిటీ అధికారుల విడుదల చేశారు. ఈ కీ ని www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లలో పొందుపరిచారు. విడుదల చేసిన కీ లో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బలపరిచే మెటీరియల్‌ను జతపరిచి రాతపూర్వకంగా వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్‌కు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ఓయూసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు వస్తుందని కళాశాల విద్యా కమిషనర్ వాణీప్రసాద్ తెలిపారు. 10 కంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు రాకపోవచ్చని, ఈనెల 17వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. కొత్త కోర్సులు, కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చినందున, విద్యార్థులు తమ ఆప్షన్లు, వివరాలను అప్డేట్ చేసుకోవాలన్నారు. బుధవారం వరకు 1,65,174 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,56,419 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. ఆలస్య రుసుంతో 16, 17 తేదీల్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. కాగా టెట్ ఫలితాల్ని వెంటనే విడుదల చేయాలంటూ 20న విద్యాశాఖ, టెట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు రాష్ట్ర టెట్, డీఎస్సీ అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, రవి, మధుసూదన్ హెచ్చరించారు. -
28లోగా కళాశాలల డేటా అప్లోడ్ చేయాలి
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలన్నీ ఈనెల 28లోగా వెబ్సైట్లో తమ కళాశాలల డేటాను అప్లోడ్ చేయాలని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చెర్మైన్ ఆచార్య పి.నరసింహారావు సూచించారు. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వేకు అవసరమైన సమాచారాని కళాశాలలు అందించే అంశంపై గురువారం ఆచార్య నాగార్జున యూనివర్సిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, డీన్ సీడీసీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కళాశాలలు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కళాశాలలు 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలకు సంబంధించిన డేటాను ఠీఠీఠీ.్చజీటజ్ఛి.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. సమాచారం అప్లోడ్ చేయని కళాశాలపై యూజీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయని విద్యాసంస్థలకు యూజీసీ ఇచ్చే నిధుల్లో 25 శాతం కోత విధించటంతోపాటు పలు శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయటానికి ప్రతి కళాశాలకు మూడు వేల రూపాయల ఆర్దిక ప్రోత్సాహకం ఇస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలు పారదర్శకమైన పూర్తి సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, కేఎల్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, కృష్ణా, విక్రమసింహపురి యూనివర్సిటీల డీన్‌సీడీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సై ఖతం
తాడేపల్లి రూరల్ : ఆ ఇసుక క్వారీకి అనుమతులు రాలేదు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయలేదు. అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఏ వెబ్సైట్లోనూ వివరాలు లేవు. అయినా.. జిల్లాలోని ఓ అధికార పార్టీ శాసనసభ్యుడి అండతో ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరైనా అడ్డొస్తే బెదిరించేందుకు స్థానిక రౌడీషీటర్ల సహకారం తీసుకుంటున్నారు. వివరాలను పరిశీలిస్తే... మండల పరిధిలోని ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట జీరో పాయి ంట్ ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధుగణం తెరలేపింది. అనుమతులు వచ్చేశాయని ప్రచారం చేసుకొని ఏకాదశినాడు పూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఆ క్వారీ నిర్వహణకు సంబంధించి ఎక్కడా వివరాలు లేకపోవడం, సంబంధిత జీవో కాపీలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఈ రీచ్‌కు సంబంధించి ఎండీవో, తహశీల్దార్ కార్యాలయాలతోపాటు ఇతర అధికారులకు ఏ విధమైన అధికారిక పత్రాలు అందకపోవడంతో అనుమా నాలు బలపడుతున్నాయి. ఈ క్వారీని డ్వాక్రా మహిళల నేతృత్వంలో నడపాలి. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలి. ఇవేవీ లేకుండా ఇసుక తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు స్వయానా తమ్ముడు, వేలు విడిచిన బామ్మర్దులు కావడం విశేషం. వీరి అక్రమాలకు ఎవరూ అడ్డురాకుండా మత్స్యకారుల సొసైటీ ముసుగులో రౌడీషీటర్లను ఇసుక డంప్ చేసే ప్రాంతంలో ఉంచారు. స్థానిక మత్స్యకారులు నోరు మెదపకుండా ఉండేందుకు వారిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరోవైపు బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై 2012లో భారీ వాహనాలను నిషేధించారు. ప్రస్తుత ఇసుక క్వారీ నిర్వాహకులు ఇదే వంతెనపై రాకపోకలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ క్వారీని ఉండవల్లి డ్వాక్రా మహిళలకు కాకుండా నిర్వాహకులకు అనుకూలంగా ఉన్న పెనుమాక మ్యాక్స్ సొసైటీకి వచ్చే విధంగా ఓ మంత్రితో సిఫార్సు చేయించుకున్నట్టు సమాచారం. -
‘ఆదర్శం’ పట్టాలెక్కేనా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామాల్లో వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. వీటితో పాటు పర్యావరణం, సామాజిక భద్రత, సుపరిపాలన తదితరాలు లక్ష్యంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించారు. ఏడాదిలో ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం పరిధిలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి. అయితే జిల్లాలో ఎస్ఏజీవై అమలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు లోక్‌సభ సభ్యులు చెరో వెనుకబడిన గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. దామరగిద్ద మండలం మొగుల్‌మడ్కను మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, మల్దకల్ మండలం అమరవాయిని నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఎస్ఏజీవై కింద గత యేడాది ప్రతిపాదించారు. పథకం నిబంధనల మేరకు ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో గ్రామ, ప్రజల జీవన స్థితిగతులపై అధికారులు బేస్‌లైన్ సర్వే నిర్వహించారు. బేస్‌లైన్ సర్వే ఆధారంగా ఏడు నెలల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళిక (వీడీపీ)ని రూపొందించాలి. పథకం ప్రారంభమైన తొమ్మిదో నెలలో అభివృద్ధి పనులు ప్రారంభమై ఏడాది వ్యవధిలో పూర్తికావాలి. అయితే పథకం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా ఇంకా బేస్‌లైన్ సర్వే స్థాయిలోనే పనులు జరుగుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో బేస్‌లైన్ సర్వే వివరాలు నమోదు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ అప్లోడింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్లోడ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వీడీపీ ప్రతిపాదనలకు కేంద్రం నిధుల మంజూరుకు అంగీకరిస్తుంది. అటు వైపే వెళ్లని ఎంపీలు ఎంపిక చేసిన గ్రామాల్లో పార్లమెంటు సభ్యులు తరచూ పర్యటించి స్థానికులను గ్రామాభివృద్ధి దిశగా ప్రోత్సహించాలి. అయితే, నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఇప్పటి వరకు అమరవాయి గ్రామాన్ని సందర్శించలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి మొగుల్‌మడ్కలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమరవాయికి జిల్లా పరిషత్ సీఈఓ, మొగుల్‌మడ్కకు జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఏజీవై గ్రామాల్లో బేస్‌లైన్ సర్వేతో పాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఇప్పటివరకు సంపూర్ణంగా సమీక్షించిన దాఖలాలు కూడా లేదు. 2019 నాటికి ఒక్కో ఎంపీ మూడు గ్రామాలు, 2024 నాటికి ఐదు వెనుకబడిన గ్రామాలను ఎస్ఏజీవై ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది. వారం రోజుల్లో పూర్తి బేస్‌లైన్ సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేస్తాం. త్వరితగతిన కంప్యూటరీకరించేలా ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశాం. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి కావాల్సిన నిధులు తదితరాలపై ఓ అంచనాకు వచ్చాం. త్వరలో ఎంపీలు కూడా గ్రామాల్లో పర్యటిస్తారు. - నాగమ్మ, సీఈఓ, జిల్లా పరిషత్ సమస్యలపై సమరం జిల్లాలోనే అత్యధిక వెనుకబడిన గ్రామం మొగుల్‌మడ్క. గతంలోనూ అనేక పర్యాయాలు గ్రామాన్ని వ్యక్తిగతంగా సందర్శించా. అందరి అధికారులతో శుక్రవారం గ్రామంలోనే సమీక్ష నిర్వహిస్తాం. రాత్రి బస చేసి గ్రామస్తులతో మరిన్ని అంశాలపై చర్చిస్తా. - జితేందర్‌రెడ్డి, ఎంపీ, మహబూబ్‌నగర్ -
ఆన్లైన్.. భానుడు
అతడు కంప్యూటర్ కోర్సులు చేయలేదు..ఇంజనీరింగ్ చదవలేదు.. కానీ కంప్యూటర్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఒక గంట దృష్టి సారించి కంప్యూటర్‌పై కూర్చుంటే ఓ నూతన వెబ్ సైట్ తయారైనట్లే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న బనిగండ్లపాటి భానుమూర్తి.. ఆయన గురించి ‘సాక్షి’ పాఠకుల కోసం.. వైరా పట్టణానికి చెందిన బనిగండ్లపాటి భానుమూర్తి చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చింతకాని మండల పరిధిలోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ రూపొందించాడు. ఈ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చింతకాని.కామ్’ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్లో మండలానికి సంబంధించిన ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు, మరుగుదొడ్లు, జనరల్‌బాడీ మీటింగ్‌ల సమాచారం, ఎంపీటీసీ, వార్డు సభ్యుల వివరాలు పొందుపరిచాడు. బీఆర్జీఎఫ్ వెబ్సైట్.. మండల స్థాయిలో బీఆర్జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి, మండలపరిషత్ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ‘డబ్ల్యూడబ్ల్యూ.కెఎంఎం.కో.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొదించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో బీఆర్జీఎఫ్ పథకం వెబ్‌సైట్‌ను అప్పట్లో భానుమూర్తి రూపొం దించారు. ఈ వెబ్‌సైట్‌ను అప్పటి కలెక్టర్ ఉషారాణి ప్రారంభించారు. అప్పట్లో ఈ వెబ్సైట్ ద్వారా మండల స్థాయిలోని అధికారులు బీఆర్జీఎఫ్ వివరాలను అప్లోడ్ చేయడం వల్ల రాష్ట్రస్థాయి అధికారులు సైతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు కలిగింది. పంచాయతీరాజ్ వెబ్సైట్.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగాల కో సం ఒక్క క్లిక్‌తో ఆశాఖ పూర్తిసమాచారం తెలుసుకొనేందుకు నూతన వెబ్‌సైట్‌ను రూపొం దించి ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న భానుమూర్తి టీపీఆర్ఎంఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన సొంత శాఖకు సంబంధించిన(పంచాయతీ రాజ్) ఉద్యోగులకు అవసరమైన కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేశారు. ‘డబ్ల్యూడబ్ల్యూ.టీపీఆర్ఎంఈఓ.కామ్’ ద్వారా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని పీఆర్ ఉద్యోగులకు కీలకమైన జీఓలు, సర్వీస్ సేవల వివరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సెలవుల నిబంధనలు, ఆర్ధికపరమైన పూర్తిసమాచారాన్ని పొందుపర్చాడు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వివరాలను కూడా ఈ వె బ్‌సైట్‌లో పొందుపర్చాడు. గతంలో సైతం ఏపీపీఆర్ ఎంఈఏ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేతులుమీదుగా ప్రారంభించారు. బ్రాహ్మణ పరిషత్ కోసం వెబ్సైట్ రూపకల్పన.. బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. అలాగే వివిధ ఛానెల్స్‌కు సంబంధించిన ఆన్లైన్ న్యూస్ కోసం ప్రత్యేక సైట్లు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టేందుకు ఆన్లైన్ ఖమ్మం వెబ్‌సైట్‌ను ఇలా అనేక వెబ్సైట్లను రూపొందించారు. భానుమూర్తికి ఈ వెబ్సైట్ల రూపకల్పనల్లో ప్రతిభను చూసి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ కలెక్టర్ ఉషారాణి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు,రాష్ర్టనేత మల్లెలరవీంద్రప్రసాద్ ఇలా అనేక మంది భానుమూర్తిని అభినందించారు. డొమైన్స్ కమిటీ సభ్యునిగా.. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన డొమైన్స్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యునిగా భానుమూర్తి కొనసాగారు. కంప్యూటర్ నాలెడ్జ్ అధికంగా ఉన్న ఉద్యోగిగా అప్పుడు రాష్ట్ర స్థాయిలో భానుమూర్తి ఎంపికయ్యారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించేందుకు అప్పట్లో ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల సలహాల కోసం ఆయన్ను ఎంపిక చేశారు.