wildfire
-
చెన్నైలో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ (ఫొటోలు)
-
Texas: విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పానాండిల్, ఓక్లహామా ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించిన అతిపెద్ద కార్చిచ్చు స్మోక్హౌజ్క్రీక్ఫైర్ కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 4వేల 4 వందల కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని దహించి వేసిన ఈ కార్చిచ్చులో చాలా ఇళ్లు, నిర్మాణాలు లక్షల సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. కార్చిచ్చు వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తేల్చలేకపోతున్నామని అధికారులు తెలిపారు. పానాండిల్ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటివరకు 500 వరకు నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. కార్చిచ్చు వల్ల కాలిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలేదని మీడియాతో అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో వాతావరణపరిస్థితులు కార్చిచ్చుకు మరింత అనుకూలంగా మారుతున్నాయని, టెక్సాస్ ఓక్లహామా, కాన్సాస్, న్యూ మెక్సికోలో అగ్ని కీలలు మరింత విజృంభిస్తాయని జాతీయ వాతావరణ సేవల కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి హత్య -
స్పెయిన్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 3 వేల ఇళ్లు బుగ్గిపాలు!
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు నియంత్రణ లేకుండా శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు దాదాపు 11,000 ఎకరాల విస్తీర్ణం వరకు దీని మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెప్పారు. అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం. దీని వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అనేక అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3,000 భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు అంచనా వేశారు. చెలరేగుతున్న అడవి మంటలు కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు అంగీకరించలేదని.. వారు పరిస్థితిని అర్థం చేసుకుని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు చెప్పుకొచ్చారు. చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
అడవి మంటలు.. అక్కడ గాలి కూడా డేంజరే..
కెనడాలో కొనసాగుతున్న అడవి మంటల కారణంగా అధికారులు ఉత్తర అమెరికా అంతటా మిలియన్ల మంది ప్రజలకు హై-రిస్క్ ఎయిర్ క్వాలిటీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడియన్ రాజధానిలోని ప్రస్తుతమున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యానికి చాలా అధిక ప్రమాదంగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. టొరంటోతో పాటు దాని పరిసర ప్రాంతాలలో, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ సేపు బయట ఉన్నట్లయితే అనారోగ్యబారిన పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈశాన్య అమెరికాలో చాలా వరకు గాలి నాణ్యతను అనారోగ్యకరంగా మారినట్లు తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న శ్వాసకోశ సమస్యలున్న వ్యక్తులకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ పొగ ఉత్తరాన బోస్టన్ వరకు, దక్షిణాన పిట్స్బర్గ్, వాషింగ్టన్ డీసీ వరకు విస్తరించి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూ ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టాప్ 200లో ఉన్నాయి, అంటే ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. న్యూయార్క్‌లో, మంగళవారం ఉదయం తీసిన ఫోటోలు కెనడా నుండి దక్షిణ దిశగా ప్రయాణించిన అడవి మంటల పొగ కారణంగా నగరం స్కైలైన్పై నారింజ పొగమంచు కప్పినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఉన్న వ్యక్తులను ఈ పొగ అలుముకున్న ప్రాంతాల నుంచి ఖాళీ చేస్తున్నారు. కెనడా సాధారణం కంటే ఈ ఏడాది ఎక్కువ అడవి మంటలను సెగను చవి చూడాల్సి వస్తోంది. ప్రస్తుత సీజన్లో చాలా వరకు పొడి, వేడి పరిస్థితుల కారణంగా ఈ వేసవిలో కెనడాలో అతిపెద్ద మంటలు సంభవించవచ్చని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు. చదవండి: ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. మరిపోసా కౌంటీలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. యోస్మైట్ నేషనల్ పార్కు సమీపంలో ప్రారంభమైన కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడి 2,600 నివాసాలు, వ్యాపార సంస్థల్లోని 6 వేల మందిని వేరే చోటుకు తరలించారు. 400 మంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. Here is a view of the Oak Fire activity on Jerseydale rd near the Forest Service Station. The fire has burned 14,281 acres as of this morning. Today will be another tough day of operations for all resources.🙏to the individual who sent this in to us #oakfire #California #mariposa pic.twitter.com/pjXOUFARJq — TheHotshotWakeUp: Podcast (@HotshotWake) July 24, 2022 ఇదీ చదవండి: ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద -
టర్కీ ని దహించి వేస్తున్న కార్చిచ్చు
-
23 వేల ఎకరాలు దగ్ధం.. దంపతులపై 30 కేసులు
వాషింగ్టన్: గతేడాది అగ్రరాజ్యం అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని ఎల్ రాంచ్ డొరాడో పార్కులో భారీ కార్చిచ్చు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 23 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సెప్టెంబర్ 5, 2020 న శాన్ బెర్నార్డినో కౌంటీలో చెలరేగిన కార్చిచ్చు సుమారు 23 రోజుల పాటు కొనసాగింది. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు ఓ అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. ఈ క్రమంలో ఈ కార్చిచ్చుకు కారణమైన జంటపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఆ వివరాలు.. పార్టీలో తలెత్తిన ప్రమాదం.. అమెరికా ఎల్ రాంచ్ డొరాడో పార్కు సమీపంలో రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట జెండర్ రివీల్ పార్టీ(పుట్టబోయే బిడ్డ ఆడా, మగా తెలిపే పార్టీ) ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో బ్లూ, పింక్ కలర్లో పొగలను రిలీజ్ చేసే పైరోటెక్నిక్ డివైజ్‌లను పేలుస్తుంటారు. బ్లూ కలర్ పొగ వస్తే మగ బిడ్డ అని, పింక్ కలర్ పొగ వస్తే ఆడపిల్ల అని అర్థం. ఈ క్రమంలో జిమెనెజ్ జంట వీడియో తీస్తూ.. డివైజ్ పేల్చడంతో పొగకు బదులుగా మంటలు వచ్చాయి. వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసినా.. లాభం లేకపోయింది. అప్పటికే మంటలు అదుపు తప్పి భారీగా విస్తరించాయి. ఎల్డొరాడోలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 23వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఈ జంటపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కార్చిచ్చు దావానలంలా వ్యాపించడంతో ఐదు ఇళ్లు ధ్వంసం అవడంతోపాటు, ఒక అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. ఈ క్రమంలో ‘‘రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట వల్లే ఇదంతా జరిగింది. ఈ దంపతుల మీద అసంకల్పిత మారణకాండతో సహా 30 నేరాలకు పాల్పడినట్లు’’ శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. జెండర్ రివీల్ పార్టీ.. మన దగ్గర లింగ నిర్థారణ పరీక్షలు చేయించినా.. చేసినా నేరంగా భావిస్తారు. కానీ అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో డెలివరీకి కొన్ని నెలల ముందే వైద్యులు పుట్టబోయేది ఆడ పిల్లా, మగ పిల్లాడా అన్న విషయాన్ని వెల్లడిస్తారు. ఇక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తెలపడం కోసం జరిపేదే జెండర్ రివీల్ పార్టీ. -
Photo Feature: సాకులతో సరి.. సీరియస్‌నెస్ లేదు మరి!
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనవసరంగా రోడ్డెక్కే వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినా.. నిబంధనలు కఠినతరం చేసినా నగర వాసుల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. అవసరార్థం రహదారులపైకి వస్తున్నవారు కొందరైతే.. కారణాలు లేకుండా వస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. ఇలా రోడ్డుపైకి వచ్చిన వారిని పోలీసులు తనిఖీ చేశారు. అకారణంగా వచ్చిన వారికి జరిమానాలు విధించారు. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించినా నగర వాసులు కొందరు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఏవో సాకులు చెప్పి ఇష్టారీతిగా బండ్లపై తిరిగేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి. -
300 కోట్ల ప్రాణులు కనుమరుగు!
మెల్బోర్న్: దాదాపు 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలకు ఆస్ట్రేలియాలో చెలరేగిన భీకర కార్చిచ్చు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ కసెల్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బర్డ్ లైఫ్ ఆస్ట్రేలియాలు కలసి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లు సంయుక్తంగా 11.46 మిలియన్ల హెక్టార్ల పరిధిలోని కార్చిచ్చుతో ధ్వంసమైన అటవీ ప్రాంతం, జనావాసాలపై పరిశోధన నిర్వహించి నివేదికను వెల్లడించాయి. గతంలో 120 కోట్ల వన్య ప్రాణులు చనిపోయినట్లు ఆ నివేదికలో వెల్లడించాయి. అయితే ఆ పరిశోధన పూర్తి స్థాయిలో జరగలేదని, కార్చిచ్చు వ్యాపించిన చోటంతా నిర్వహించిన తాజా పరిశోధనలో దానికి మూడు రెట్ల సంఖ్యలో వన్య ప్రాణులు మరణించినట్లు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. 143 మిలియన్ల పాలిచ్చే జంతువులు, 246 కోట్ల పాకే జంతువులు, 180 మిలియన్ల పక్షులు, 5.1 కోట్ల కప్పలు మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చెప్పింది. ఆధునిక ప్రపంచంలో ఈ స్థాయిలో నష్టం కలిగిన ఘటన కనీవినీ ఎరుగనిదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఎగసిన మంటల నుంచి వన్యప్రాణులు తప్పించుకునే అవకాశం లేదని, తప్పించుకున్నా ఆహారం లేక మరణించి ఉంటాయని, వేరే చోట మనుగడ సాగించలేక కూడా మరణించి ఉండవచ్చని పేర్కొంది. -
మంటల్లో పబ్‌కు బీరు సరఫరా!
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా పొదలు తగలబడుతూ మంటలు చుట్టుముట్టిన విక్టోరియా పట్టణాల్లో మల్లకూట ఒకటి. ఆ నగరం నుంచి బుధవారం నాడే వేలాది మంది ప్రజలను, వారితోపాటు ఆహార పదార్థాలను తీసుకొని ఓ నౌకా దళం సురక్షిత ప్రాంతానికి తరలి పోయింది. అయినా నాలుగు వేల మంది ప్రజలు పట్టణంలో మిగిలిపోయారు. ఆ పట్టణానికి వచ్చి పోయే దారులను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. పట్టణంలోని హోటల్ మోటల్‌లోని పబ్‌లో బీర్లు అయిపోయాయి. అప్పటికే మంచినీటి కొరతతో బాధ పడుతున్న పట్టణ ప్రజలు బీర్లకు ఎగబడడంతో బీర్లు త్వరగా అయిపోయాయి. రెగ్యులర్ కోటా రావడానికి సమయం పడుతుంది. దాంతో పబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫిలిపోవిక్ మల్లకూట కౌంటీ అగ్నిమాపక దళాధికారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆయన ఈ విషయాన్ని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనిక దళానికి చేరవేయడంతో ఆ సైనిక దళం కార్ల్‌టాన్, యునైటెడ్ బ్రేవరీస్‌కు చెందిన మూడు వేల లీటర్ల బీర్లను తీసుకొచ్చి పబ్‌కు సరఫరా చేసింది. అందుకు హోటల్ యజామానితోపాటు వినియోగదారులు కూడా సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి భూ ఉపరితం బాగా వేడెక్కిపోవడంతో ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడుతున్న విషయం తెల్సిందే. దీని వల్ల ఇప్పటికే కొన్ని కోట్ల జంతువులు మత్యువాత పడ్డాయి. నీటిని రక్షించుకోవడంలో భాగంగా లక్షకుపైగా ఒంటెలను కాల్చివేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. చదవండి: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆగని కార్చిచ్చు.. ఎటుచూసిన కళేబరాలే బీచ్‌లలో చిక్కుకున్న వేల మంది -
‘క్రికెట్ జ్ఞాపకాని’కి రికార్డు ధర
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం ఆ దేశ దిగ్గ క్రికెటర్ షేన్ వార్న్ తన బ్యాగీ గ్రీన్(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్)ను వేలానికి పెట్టగా దానికి ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను సోమవారం వేలానికి తీసుకురాగా, అది రోజు వ్యవధిలోనే ఊహించని ధరకు అమ్ముడుపోయింది. వార్న్ బ్యాగీ గ్రీన్‌కు లభించిన ధర 5,29,500 డాలర్లు. సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను వేలంలో కొనుగోలు చేశాడు. దాంతో అత్యంత ధరకు అమ్ముడుపోయిన ఓ ‘క్రికెట్ జ్ఞాపకం’గా వార్న్ బ్యాగీ గ్రీన్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాగీ గ్రీన్‌ను అధిగమించింది.(ఇక్కడ చదవండి: ‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) గతంలో బ్రాడ్‌మన్ బ్యాగీ గ్రీన్‌ను వేలం పెట్టగా అది 4,25,00 డాలర్లకు అమ్ముడుపోగా ఇప్పుడు దాన్ని వార్న్ బ్యాగీ గ్రీన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో వార్న్ బ్యాగీ గ్రీన్ తర్వాత స్థానంలో బ్రాడ్‌మన్ బ్యాగీ గ్రీన్ ఉండగా, మూడో స్థానంలో ఎంఎస్ ధోని బ్యాట్ విలువ ఉంది. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో ధోని ఆడిన బ్యాట్‌ను తర్వాత వేలంగా వేయగా దాని విలువ సుమారు కోటి రూపాయిలు పలికింది.వార్న్ బ్యాగీ గ్రీన్‌ను వేలంలో పెట్టిన మరుక్షణమే ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. రెండు గంటల వ్యవధిలో అది 2,75,000 డాలర్లను దాటింది చివరికి ఎంసీ అనే వ్యక్తి దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు నడుంబిగించిన వార్న్.. టెస్టు కెరీర్ ఆసాంతం ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీని వేలం వేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలని వార్న్ పిలుపునిచ్చాడు. వార్న్ తన అంతర్జాతీయ క్రికెట్లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు సాధించాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్(800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆస్ట్రేలియాను రక్షించేదెవరు?
అడవి తల్లినే నమ్ముకున్న మూగజీవాలు కీకారణ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. అప్పుడు అమెజాన్ అడవులు.. ఇప్పుడు ఆస్ట్రేలియా అడవులు.. అగ్నికి ఆహుతి అవుతూ మూగజీవాలను పొట్టనపెట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి బూడిదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవులను అంటుకున్న మంటలు దగ్గరిలోని పట్టణాలకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ విపత్తును ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు ‘అగ్ని’ పరీక్షగా మారింది. ఓవైపు అధికారులు అడవుల్లో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుండగా, మిగతా దేశాలు అగ్నికి ఆహుతవుతున్న మూగజీవాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు 24మంది మరణించగా, కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో అక్కడ నివసించే జనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8వేల కోలాలు(ఓ రకమైన జంతువు), 50 కోట్లకు పైగా జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఐదున్నర మిలియన్ల హెక్టార్లకు పైగా అడవి బుగ్గయ్యింది. అక్కడి అగ్నిమాపక సిబ్బంది రాత్రనక, పగలనక సహాయక చర్యలు చేపడుతున్నా విధ్వంసాన్ని నియంత్రించలేకపోతున్నారు. కళ్లముందే సజీవదహనమవుతున్న జంతువులను చూసి కన్నీళ్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే దట్టమైన అడవుల్లో తప్పించుకునే దారి తెలీక మంటల్లో చిక్కుకుని గాయపడిన జంతువులను అగ్నిమాపక సిబ్బంది రక్షించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి. ‘ఆస్ట్రేలియా కోసం ప్రార్థించండి’ అని నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. ‘మానవమాత్రులకు లొంగని అగ్నికీలలను భగ్నం చేయడానికి ‘వర్షం’ కురవాలని ప్రార్థిద్దాం’ అంటూ గొంతు కలుపుతున్నారు. ‘అక్కడ మనుషులు మాత్రమే ప్రాణాపాయ స్థితిలో లేదు. వేలాది జంతువులు సహాయం కోసం మూగగా రోదిస్తున్నాయి. వాటిని కాపాడుకుందాం’ అంటూ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ట్విటర్లో #PrayForAustralia హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. చదవండి: ఆస్ట్రేలియాలో ఆరని కార్చిచ్చు I'LL PRAY FOR YOU, STAY SAFE 🙏 All animals, koalas kangaroos and all peoples #PrayForAustralia pic.twitter.com/XDsgfdsGkq — SYNOM34N (@synom34n) January 5, 2020 We want to give you guys an update on the state of the fires 🔥 affecting your Aussie mates & how you can help!! #PrayForAustralia pic.twitter.com/FbVTY8MOp4 — Human Rights Defene (@HRDefence) January 5, 2020 -
వైరల్ : ప్రాణాలకు తెగించి కోలాను కాపాడింది
న్యూసౌత్ వేల్స్ : ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు ఇప్పటికి తగలబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న అడవిలో మంటల్లో చిక్కుకున్న ఎలుగుబంటి జాతికి చెందిన కోలాను ఒక మహిళ ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కాగా, బుధవారం న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో బారీగా కార్చిచ్చు అంటుకొని 110 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల పొదళ్లకు కార్చిచ్చు అంటుకోవడంతో కోలా తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న టోనీ డోహర్తి అనే మహిళ చెట్ల పొదల్లో చిక్కుకున్న కోలాను చూసి దానిని కాపాడడానికి పరిగెత్తింది. దానిని మంటల నుంచి బయటికి తీసి తను వేసుకున్న షర్ట్‌ను విప్పి మంటలను అదుపు చేసేందుకు దాని చుట్టూ కప్పి కారు దగ్గరికి తీసుకువచ్చారు. కోలాకు ఆహారం పెట్టి నొప్పి తెలియకుండా ఉండేందుకు నీరు చల్లారు. తర్వాత దానిని పూర్తిగా బ్లాంకెట్‌తో కప్పి ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కోలా శరీరం బాగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగానే ఉంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. టోనీ డోహర్తి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఆమె ఒక యోధురాలు అంటూ ప్రశంసిస్తున్నారు. తనకు ఏమైనా పర్వాలేదు ఎలాగైనా కోలాను కాపాడాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. -
కాలిఫోర్నియా నుంచి లాస్ఏంజెల్స్ను తాకిన కార్చిచ్చు
-
విజయనగరం జిల్లాలో 200 ఎకరల్లో కార్చిచ్చు
-
కాలిపోర్నియాలో రగులుతున్న కార్చిచ్చు
-
కార్చిచ్చుకు 9 మంది బలి
పారడైజ్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అడవుల్లో చెలరేగుతున్న మంటల ధాటికి శుక్రవారం రాత్రికి మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. పదుల సంఖ్యలో మనుషులు ఆచూకీలేదు. వివిధ ప్రాంతాల్లోని వేలాది మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలోని మొత్తం 26 వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మరణించిన వారంతా బుట్టే కౌంటీలోని ప్యారడైస్ పట్టణవాసులే. ఉధృతమైన గాలుల కారణంగా కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ప్యారడైజ్‌లో వందలాది ఇళ్లు, అనేక రెస్టారెంట్లు, వాహనాలు కాలిపోయాయి. 70 వేల ఎకరాలను కార్చిచ్చు బూడిద చేసిందనీ, ఇంకా మంటల తీవ్రత తగ్గలేదని కాలిఫోర్నియా అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. అటు దక్షిణ కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీలోనూ రెండు కార్చిచ్చులు మొదలయ్యాయి. సియార్రా నెవాడా పర్వతాల దిగువన, చికో పట్టణంలో నివసిస్తున్న 52 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. వెంచురా కౌంటీలో ‘వూల్సీ ఫైర్’ ధాటికి 35 వేల ఎకరాలు కాలిపోయాయనీ, 88 వేల ఇళ్ల నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామని అధికారులు చెప్పారు. హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాలిబు నగరానికీ కార్చిచ్చు వ్యాపిస్తోంది. లియోనార్డో డికాప్రియో, జాక్ నికోల్సన్, జెన్నిఫర్ అనిస్టన్; హాల్లే బెర్రీ, చార్లైజ్ థెరాన్, బ్రాడ్ పిట్ తదితరులు ఈ ప్రాంతంలోనే నివసిస్తారు. -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 9 మంది మృతి
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 9 మంది మృతి
పారడైస్ (కాలిఫోర్నియా) : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మరణించారని, 6700 నివాసాలు, వ్యాపార సంస్థలు బుగ్గిపాలయ్యాయని కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ తెలిపింది. మరో 35 మంది కనిపించకుండా పోయారని, ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మంటలు దావానలంలా వ్యాపించడంతో వేలాది ఎకరాలు బూడిదపాలై తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అభివర్ణించారు. అటవీప్రాంతానికి సమీపంలోని సుమారు లక్షా 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, మంటలను అదుపుచేసేందుకు దాదాపు 2వేల మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 30వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయని వెల్లడించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా చుట్టుపక్కల కిలోమీటర్లమేర దట్టంగా పొగ వ్యాపించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పారడైస్ నగరంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోంది. ఇది బుధవారం కాల్పుల ఘటన చోటుచేసుకున్న థౌజండ్ ఓక్స్ నగరానికి సమీపం ప్రాంతం కావడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మంటలు మాలిబూ నగరానికి సైతం వ్యాపించాయి. ఈ ప్రాంతంలో హాలీవుడ్ అగ్ర తారలు ఎక్కువగా నివాసముంటారు. విపరీతమైన గాలులు వీస్తుండడంతో కాలిఫోర్నియా పశ్చిమ ప్రాంతానికి మంటలు వ్యాపిస్తున్నాయి. -
కార్చిచ్చు : కాలిఫోర్నియాను కమ్మేస్తున్న పొగ
-
కార్చిచ్చు : అమెరికాను కమ్మేస్తున్న పొగ
వాషింగ్టన్ : కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అమెరికాను పొగతో కమ్మేస్తోంది. గత వారం రోజులుగా సుమారు 1, 87,000 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసినట్లు అమెరికా జాతీయ అగ్రిమాపక సంస్థ తెలిపింది. ‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్’గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల మంటలు అంటుకున్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్వాన్ ప్రావిన్స్‌లు కూడా అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నాసా విడుదల చేసిన ఫొటో ఎయిర్ క్వాలిటీ అలెర్ట్.. కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ అలెర్ట్ విధించారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని అమెరికా డిసీజ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. ముఖ్యంగా హృద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద కార్చిర్చుగా చెబుతోన్న ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రం మరింత కాలుష్యంతో నిండిపోయిందని వాతావరణ నిపుణుడు స్టీవెన్ డిమార్టినో అన్నారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా పర్యావరణ చట్టాల లోపం వల్లే కార్చిచ్చు ఈ రాష్ట్రాన్ని మింగేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
79కి చేరిన గ్రీస్ కార్చిచ్చు మృతుల సంఖ్య
ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్ సమీప అటవీప్రాంతాలను కార్చిచ్చు దహించివేస్తున్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య బుధవారం 79కి పెరిగింది. అగ్నికీలల బారిన పడిన వారిని రక్షించేందుకు ఈశాన్య ఏథెన్స్లోని తీరప్రాంత ఇళ్లలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అగ్నికీలల్లో కాలిపోయిన ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించిన నివాస ప్రాంతాల్లో తమ వారి జాడ గల్లంతయ్యిందంటూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారి స్టారోలా మలిరి చెప్పారు. ఇంతవరకూ ఎంత మంది జాడ తెలియకుండా పోయిందో సంఖ్య చెప్పలేమని ఆమె అన్నారు. -
హనీమూన్‌లో కార్చిచ్చు.. కష్టాలు!
ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది. ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది. పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు. మహా దావానలం.. 100 మంది మృతి -
మహా దావానలం.. అగ్నికి 100మంది ఆహుతి
ఏథెన్స్ : కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది. తొలుత 74 మంది మృతిచెందారని భావించినా.. ఆ సంఖ్య 100కు చేరుకోగా , మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని రిసార్ట్ టౌన్ మాటీలో చోటుచేసుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు అగ్నికీలలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్ అధికారులు వెల్లడించారు. మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ల వైపు పరుగులు తీయగా, మరోవైపు కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ అధికారి మంగళవారం ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు. ఏథెన్స్ పరిధిలో జరిగిన ఈ దావానలం దేశాన్నే సంక్షోభంలో పడేసింది. ప్రాణభయంతో పర్యాటకుల పరుగులు గ్రీస్ అందాలు చూద్దామనుకుని వస్తే బూడిదే మిగిలిందంటూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాపోతున్నారు. తమ కుటుంబసభ్యులను మంటలు సజీవదహనం చేస్తుంటే.. పరుగెత్తి మా ప్రాణాలు కాపాడుకోవడం తప్పా, ఏం చేయలేకపోయామంటూ మృతుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవదారు వృక్షాల్లో ఏర్పడ్డ చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేశాయని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో తమ ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు ఏం చేయాలో అర్థంకాక పలు దేశాలకు చెందిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి