yalamanchili
-
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్‌పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, స్టేట్స్‌మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్‌లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్‌లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్‌పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్‌లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్‌పేయి–ముషారఫ్‌ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్‌లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
జనసేనకు ఝలక్.. ఐదురోజుల్లోనే సొంత గూటికి..
సాక్షి, అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రలోభాలు, మాయమాటలతో మభ్యపెట్టి అయిష్టంగా తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి యత్నించిన కూటమి పార్టీలకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఝలక్ ఇస్తున్నారు. కూటమి పార్టీకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోలా గెలవడానికి ప్రయత్నించిన ఆ పార్టీల నేతలు భంగపడిన ఘటన యలమంచిలి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పదవిలో ఉన్నారు. ఈ నెల 8న ఉమను మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, మరికొంత మంది జనసేన రాష్ట్ర, స్థానిక నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. ఈ మేరకు ఉమకు జనసేన పార్టీ కండువా వేసిన ఫోటోలను మీడియాకు పంపించారు. అయితే కేవలం 5 రోజుల్లోనే శిలపరశెట్టి ఉమ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు.బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో జరిగిన యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ ఆమె భర్త గణేష్‌తో హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జనసేనలో ఐదు రోజులు కూడా ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.ఎంపీటీసీల సమావేశం ఉందని మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన కండువా వేశారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శిలపరశెట్టి ఉమ సాక్షికి తెలిపారు. పార్టీ అధినేత జగనన్నతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేనను వీడడంతో లేని బలం ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నించిన జనసేన నేతలు అభాసుపాలైనట్టయిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. -
జగన్ పాలనే ఉండి ఉంటే చర్చ మొదలైంది
-
యలమంచిలి టీడీపీ-జనసేన సమావేశం రసాభాస
-
పవన్ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ
సాక్షి, విశాఖపట్నం: సర్వేల పేరుతో ఆశావహులు, అభ్యర్థులతో పాటు క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్.. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతుండగా, ఇదేం తిక్క అంటూ పవన్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ ధోరణిపై జనసేనలో రచ్చ జరుగుతోంది. తాజాగా, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్‌పై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. సీటు కేటాయించిన తర్వాత కూడా సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళనలో పడ్డారు. విజయ్ కుమార్‌ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం జరగ్గా, తరువాత జనసేన జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. మరోవైపు చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనుచరులతో ఆయన రహస్యంగా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. ఇదీ చదవండి: దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ? -
బీసీలను లీడర్లను చేసింది సీఎం జగన్ ఒక్కడే..
-
గోదావరి దాటికి విలవిలలాడుతున్న లంక గ్రామాలు
-
Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్‌కు నివాళి!
అనూహ్యమైన, అనితరసాధ్యమైన పాల ఉత్పత్తి రంగంలో విజయాలు సాధించిన ఆడారి తులసీరావు ఈనెల 4వ తేదీన మరణించారు. మూడున్నర దశాబ్దాలు విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా వ్యవహరించి, రైతుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ప్రతి ఒక్క రైతుతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ ఉండేవారు. డెయిరీకి పాలు సరఫరా చేసే వేలాదిమంది రైతుల పిల్లలకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించారు. పాడి రైతులలో పేదవారి పిల్లలకు హాస్టలు వసతి కల్పించి, ఉచిత విద్యను బోధింపజేసిన సేవాదృక్పథం ఆయనది. రైతాంగ యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆత్మ విశ్వాసంతో వ్యవసాయాన్నీ, పాడినీ అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రయత్నించాలని తరచూ తన అనుభవాలు జోడించి ఉద్బోధించేవారు. పాలను సేకరించి, వినియోగదారులకు పాలు, పెరుగు, మజ్జిగ అమ్మడమే ప్రధానంగా కొనసాగిన విశాఖ డెయిరీ, అనంతర కాలంలో ఆ పాలతో అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ప్రారంభించి రుచి, శుచిలో అగ్ర తాంబూలం అందుకునేలా చేసిన సవ్యసాచి ఆయన. ఆంధ్రా కురియన్‌గా కీర్తించబడినా కించిత్ గర్వం, అతిశయం దరిచేరనివ్వని వ్యక్తిత్వ శైలి ఆయనది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో డెయిరీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే, యలమంచిలి నియోజక వర్గం రాజకీయాలలో ఆరు దశాబ్దాలు క్రియాశీల పాత్ర పోషించారు. ఆనాటి విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా వ్యవహరించిన తన తాత స్వర్గీయ ఆడారివీరు నాయుడు ఆయనకు స్ఫూర్తి. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పంచాయతీకి మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నికైనారు. యల మంచిలి పురపాలక సంఘంగా మారిన తర్వాత రెండుసార్లు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2015 డిసెంబరులో భారత పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ తన 37వ జాతీయ సమావేశంలో తులసీరావు పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, ఆడారి కీర్తి కిరీటంలో కలికితురాయి. లక్షలాదిమంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు బతుకుదెరువు చూపించిన దార్శనికుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆడారి తులసీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన మృతికి గొప్ప నివాళి. ఆయన మరణించినా, పల్లెల్లో ఆయన నిర్మింపజేసిన వందలాది కట్టడాలు ఆయన సేవలను మరింత చిరస్మరణీయం చేస్తాయి. లక్షలాది కుటుంబాలు తరతరాలు ఆ మహనీయునికి రుణపడి ఉంటాయి. (క్లిక్ చేయండి: ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం) – బి.వి. అప్పారావు, విశాఖపట్నం -
జలదిగ్బంధంలో యలమంచిలి
-
గుండుసూదిపై స్వర్ణ ‘ఒలింపిక్స్ చిహ్నం’
యలమంచిలి రూరల్: ఒలింపిక్స్ క్రీడోత్సాహం ఎల్లెడలా వెల్లివిరిస్తోంది. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేలా ఏటికొప్పాక హస్తకళాకారుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి రూపొందించిన సూక్ష్మ ఒలింపిక్స్ చిహ్నం అందర్నీ ఆకర్షిస్తోంది. 22 క్యారెట్ బంగారంతో ఒలింపిక్స్ చిహ్నాన్ని తయారు చేసి గుండు సూది పైభాగంలో ఆయన అమర్చారు. 1 మి.మీ. ఎత్తు, 2 మి.మీ. వెడల్పుతో ఈ కళాఖండాన్ని సృజించేందుకు రెండు రోజుల వ్యవధి పట్టిందని, దీనిని మైక్రోస్కోప్‌లో మాత్రమే స్పష్టంగా వీక్షించగలమని చిన్నయాచారి చెప్పారు. -
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఏటి ‘గొప్పా’క
యలమంచిలి రూరల్, అచ్యుతాపురం: విశాఖ జిల్లా యలమంచిలి మండలం వరాహనది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామంలో అంకుడు కర్రతో రూపొందించిన బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాయి. ఇక్కడి కళాకారులు సహజసిద్ధంగా లభించే కర్ర,, మైనం, సహజ రంగులతో తమ సృజనకు పదునుపెట్టి అనేకరూపాల్లో బొమ్మలు తయారు చేస్తారు. ఏటా ఈ గ్రామం నుంచి రూ. 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రిటైల్ అమ్మకం దారులు, సరుకురవాణాచేసేవారు.. ఇలా అనేక కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఏటికొప్పాక కళ వందేళ్లక్రితం ఉప్పుచిప్ప, కుంకుమ భరిణి, పిల్లలు ఆడుకునే దొండకాయ తయారీతో ప్రారంభమయింది. ఒక తరం నుంచి మరో తరానికి.. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ఎటువంటి శాస్త్రం లేదు. ఒక తరం నుంచి మరోతరం నేర్చుకోవడమే జరుగుతోంది. ఒక బొమ్మ తయారీకి 3 నుంచి 10 విడిభాగాలు తయారుచేస్తారు. పలు బొమ్మల సమాహారం ఒక చిత్రరూపంగా రూపొందుతుంది. అంకుడు కర్రను విడిభాగాలుగా చెక్కి వాటికి మైనం పూస్తారు. ఒక్కొక్క భాగానికి రంగులు అద్ది ఆరబెడతారు. విడిభాగాలన్నీ కలిపి బొమ్మ తయారుచేస్తారు. రాజు, రాణి, పల్లకీ, భటులు.. ఇలా బొమ్మలను కలిపి చిత్రరూపంగా తయారుచేసి అమ్మకానికి పెడతారు. చారిత్రక కథారూపాలు, గ్రామీణ ఉత్సవ సందడి, అన్నమయ్య, దశావతారాల ఆలయం, పెళ్లిసందడి, రథం, పల్లెటూరు, ఎడ్లబండి వంటి చిత్రరూపాలను కళాకృతులుగా తయారుచేసి ఏటికొప్పాక కళాకారులు తమ సత్తా చాటారు. వైఎస్సార్ ఆసరాతో ఉలి పట్టిన బాలికలు కొన్నాళ్ల క్రితం వరకు కళాఖండాల తయారీలో మహిళలు ఉలిపట్టుకునేవారు కాదు. మగవారు బొమ్మల్ని తయారుచేస్తే మహిళలు మైనం, రంగులు అద్దేవారు. వైఎస్సార్ హయాంలో రూ. 50 లక్షలతో గ్రామంలో కళాకారులకు కమ్యూనిటీహాల్ నిర్మించారు. ప్రత్యేక కాలనీ, విద్యుత్ మోటార్లు ఇచ్చారు. కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా పాఠశాల స్థాయిలో బొమ్మల తయారీపై శిక్షణ ప్రారంభించారు. దీంతో ఎక్కువగా బాలికలు బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. విద్యుత్ మోటార్ల వినియోగం పెర గడంతో బొమ్మల తయారీలో శారీరక శ్రమ తగ్గింది. అవార్డుల పంట అంకుడుకర్రతో కళాకృతులు రూపొందించి ఈ గ్రామానికి చెందిన కళాకారులు అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్రీశైలపు చిన్నయాచారి 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశైలపు రమణ, పెదపాటి ఆనందాచారి జాతీయ మెరిట్ పురస్కారం పొందారు. పీఆర్వీ సత్యనారాయణ, కొత్తలి శ్రీను, కె.సోమేశ్వరరావు, లక్కరాజు నాగేశ్వరరావు, పెదపాటి శివకృష్ణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ‘అమ్మ’కాల్లో అగ్రస్థానం... బిడ్డను ఎత్తుకొని లాలించే అమ్మ బొమ్మను ఏటికొప్పాక కళాకారులు దశాబ్దం క్రితం రూపొందించారు. ఈ బొమ్మ విశేష ఆదరణ పొందింది. ఈ ఆకృతిలో ఉండే బొమ్మల అమ్మకాలే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఏటా వేల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ బొమ్మనే చాలా కార్యక్రమాల్లో అవార్డుగా ప్రదానం చేస్తున్నారంటే దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలోనూ ఏటి కొప్పాక బొమ్మల్నే మెమెంటోలుగా అందజేశారు. తరతరాలుగా కొనసాగుతున్న కళ.. బొమ్మల తయారీని తరతరాల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నాము. బ్రిటీషు వారి హయాంలోనే కుంకుమ భరణి, ఉప్పుచిప్ప, దొండకాయ, పెళ్లికొడుకు పెళ్లికూతురు బొమ్మల్ని చెక్కారు. ఉప్మాక తీర్థంలో అమ్మకానికి పెట్టేవారు. 1910 నాటికి మా తాత పెదపాటి సత్యం హయాంలో చిలుకలు ,పెళ్లికి వ్రతంకి నగిసీలుదిద్దిన పీటలు, డబ్బులపెట్టి తయారుచేసేవారు. మా నాన్న ఆనందాచారి హయాంకి నాజూకైన బొమ్మల తయారీపై దృష్టి పెట్టారు. మా నాన్నగారి హయాంలో రంగులను తగుమోతాదులను మార్చడంద్వారా కొత్తరంగులను కనుక్కున్నారు. ద్రాక్ష గుత్తులు, అరటి పళ్లు వంటివి తయారుచేసేవారు. మా తరంలో ఆలయ సముదాయం, గుర్రపు బండి పెండ్లిసందడి వంటి సన్నివేశాలను ప్రదర్శించేలా కళాకృతుల సమ్మేళనాలను తయారుచేస్తున్నాము. అప్పట్లో ఈ పరిశ్రమ లాభసాటిగా ఉండేది. ఈ మధ్య చైనా బొమ్మల పోటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రోత్సాహం ఉంటే మరింత మంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంది. – పెదపాటి శరత్, జాతీయఅవార్డు గ్రహీత సిరామిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసే దేశ, విదేశీ బొమ్మలు కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఏటి కొప్పాక బొమ్మల్లో సహజసిద్ధమైన రంగుల్ని మాత్రమే వినియోగించడం వల్ల ఎన్నాళ్లు ఉన్నా గాలిలో రసాయన మార్పులు చెందవు. సహజరంగుల తయారీ ఇలా.. మైనంకి ఎటువంటి రంగు ఉండదు. మైనం కరిగించి దీనిలో స్వయంగా తయారు చేసుకున్న సహజ రంగుల్ని కలిపి కర్రకు పూస్తారు. ఎరుపు రంగు: బిక్షా ఒరిల్లా విత్తనాల నుంచి ఎరుపురంగు తయారుచేస్తారు. కేజీ విత్తనాలను లీటరు నీటిలో నానబెట్టి రంగునీళ్లు సేకరిస్తారు. దీన్ని మరిగించడంతో చిక్కటి ఎరుపురంగు ద్రావణం తయారవుతుంది. నీలంరంగు: ఇండిగో మొక్కల ఆకులనుంచి నీలంరంగు సేకరిస్తారు. ఇండిగో ఆకుల్ని డ్రమ్ములో కుళ్లబెట్టి పసరు తీస్తారు. ఈ పసరును ఘనీభవింపజేసి ఇండిగో రంగు ముక్కలుగా నిల్వచేసుకుంటారు. పసుపురంగు: పసుపు కొమ్ములనుంచి తీసుకుంటారు. మైనంలోకలిపి వినియోగిస్తారు. ఆకుపచ్చరంగు: ఇండిగో ముక్కల్లో పసుపు కలపడంతో తయారవుతుంది. నలుపురంగు: పాడైపోయిన నల్లబెల్లం, ఇనుపతుప్పుని వేడినీళ్లలో కలిపి నెలరోజులపాటు కుండలో నిల్వచేస్తారు. కరక్కాయ తొక్కల్ని నీటిలో మరిగించి కషాయం తయారుచేస్తారు. నల్లబెల్లం నీటి కషాయాన్ని కలిపి మరిగిస్తే నల్లరంగు వస్తుంది. ప్రధానరంగులను తగు మోతాదులో కలపడం ద్వారా కళాకారులు తమకు అవసరమైన పలు వర్ణాలు తయారు చేసుకుంటారు. కళ నిలబడాలంటే.. - అటవీశాఖ ఆధ్వర్యంలో అంకుడు కర్ర సాగు చేపట్టాలి. కర్ర సరఫరాలో అడ్డంకులు లేకుండా చూడాలి. కర్ర సాగు, అమ్మకాన్ని చట్టబద్ధం చేయాలి. - కళాకారులకు వడ్డీలేని రుణాలు అందించాలి. సొసైటీద్వారా షెడ్లు నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి. - మున్సిపాలిటీ, కార్పొరేషన్ , బస్‌కాంప్లెక్స్ పరిధిలో దుకాణాలు ఏర్పాటుచేసుకోవడానికి స్థలాలు కేటాయించాలి. - కళలో కంప్యూటర్ డిజైనింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించాలి. - చైనా బొమ్మలను తెచ్చి ఏటికొప్పాక బొమ్మలుగా నమ్మంచి అమ్ముతున్న వర్తకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పింఛను సౌకర్యం కల్పించాలి.. కళ నేర్చుకోవడం మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ నమ్మకంతోనే బాలికలు ఎక్కువ మంది బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. మా పూర్వీకుల నుంచి పారంపర్యంగా దీన్ని నేర్చుకుంటున్నాము. సీనియర్ కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. – పి.శ్రావణి, యువకళాకారిణి -
‘ఎమ్మెల్యే రామానాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో యలమంచిలి మండలంలోని ఇసుక ర్యాంపులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పోత్తూరి బుచ్చిరాజు, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెం ఆనంద ప్రకేష్‌లు సోమవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపులపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుకపై పర్సంటేజీలు తీసుకుని 100ల కోట్లు దోచుకున్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక కొరత ఏర్పడిన విషయం వాస్తవమని అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇసుక నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్లైన్లో ఇసుక పాలసీని ప్రారంభించామని ఆయన తెలిపారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ యలమంచిలి ఫ్లైఓవర్
-
కొత్తదనం వైపు.. ‘యలమంచిలి’ చూపు
అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి మిళితం. మున్సిపాలిటీ హోదా సాధించింది. ఈ నియోజకవర్గంలో దేశంలోనే చెప్పకోదగ్గ ఏటికొప్పాకలో బొమ్మల తయారీ కళాకారులు ఉన్నారు. అచ్యుతాపురంలో స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటైంది. రాంబిల్లి మండలంలో రక్షణ శాఖకు చెందిన నేవెల్ బేస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో కొల్లేటి సరస్సు తరువాత ఆస్థాయిలో కొండకర్ల ఆవ ఉంది. ప్రధాన జల వనరుగా శారదానది ప్రవహిస్తోంది. ఈ నియోజకవర్గ పరిధిలో వరి, చెరకును ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. యలమంచిలిలో కనకమహాలక్ష్మి, భూలోకమాంబ, మామిడివాడ పైడితల్లి అమ్మవారు, చోడపల్లి చోడమాంబిక, మునగపాక గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలాగే పంచదార్ల పుణ్యక్షేత్రం జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. రాజకీయ నేపథ్యం... యలమంచిలి నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. రాంబిల్లి మండలం దిమిలికి చెందిన వారు ఎక్కువ కాలం పాలన సాగించారు. యలమంచిలి నియోజకవర్గంలో గతంలో ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలు ఉండేవి. దిమిలికి చెందిన పప్పల బాపునాయుడు, నగిరెడ్డి సత్యం ఒక్కొక్కసారి ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన వీసం సన్యాసినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అచ్యుతాపురం మండలానికి చెందిన కేకేవీ ఎస్ రాజు ఒకసారి గెలుపొందారు. 1983, 1989, 1994 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు రాంబిల్లి మండలం దిమిలికి చెందిన పప్పల చలపతిరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొం దారు. అత్యధికంగా పప్పల చలపతిపావు 19,000 మెజారిటీతో నగిరెడ్డి ప్రభాకర్‌పై విజ యం సాధించారు. పప్పల చలపతిరావు, నాలుగు ఎన్నికల్లోనూ, వీసం సన్యాసినాయుడు, కె.కె.వి.ఎస్. రాజు, యు.వి.రమణమూర్తిరాజు, ప్రభాకరరావులను ఓడించారు. 1999 ఎన్నికలో కాంగ్రెస్ తరుపున పోటీచేసి యు.వి.రమణమూర్తిరాజు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరుపున గెలుపొందారు. యు.వి. రమణమూర్తిరాజు తాను గెలి చిన రెండు ఎన్నికల్లోనూ గొంతెన నాగేశ్వరరావుపై 5,863, 10,090 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పంచకర్ల రమేష్‌బాబు ప్రత్యర్థి ప్రగడ నాగేశ్వరరావుపై 8,375 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రగడ నాగేశ్వరరావు ఓడినప్పటికీ టీడీపీకి దీటుగా జవాబు చెప్పారు. నియోజకవర్గ ఓటర్లు 1,88,766 పురుషులు 92,879 మహిళలు 95,875 ఇతరులు 12 పోలింగ్ బూత్‌లు 224 గెడ్డకు అవతల–గెడ్డకు ఇవతల... యలమంచిలి నియోజకవర్గం ఏర్పాటుకు ముందు నుంచి శారదా నది హద్దుగా గెడ్డ అవతల గెడ్డ ఇవతల అనే విభజన ప్రజల్లో ఉండేది. ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లిలో సగం మండలం గెడ్డ అవతల అనేవారు. రాంబిల్లి మండలంలో మిగిలిన సగభాగం, అచ్యుతాపురం మండలాలను గెడ్డ ఇవతల అనేవారు. 1983 వరకూ గెడ్డ అవతల, ఇవతల నినాదం కొనసాగింది. గెడ్డ అవతల వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1981లో గెడ్డ ఇవతల కె.కె.వి.ఎస్.రాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీలపరంగా రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత ఈ నినాదం సమసిపోయింది. ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు.. కాలపరిమితి ఎమ్మెల్యే పార్టీ 1952 పి.బాపునాయుడు కె.ఎల్.పి 1955 సి.వి.ఎస్.రాజు ఇండిపెండెంట్ 1962 వి.సన్యాసినాయుడు కాంగ్రెస్ 1967 ఎన్.సత్యనారాయణ ఇండిపెండెంట్ 1972 కె.వి.కాకర్లపూడి ఇండిపెండెంట్ 1978 వి.సన్యాసినాయుడు కాంగ్రెస్ 1983 కె.కె.వి.ఎస్.రాజు టీడీపీ 1985 పప్పల చలపతిరావు టీడీపీ 1989 పప్పల చలపతిరావు టీడీపీ 1994 పప్పల చలపతిరావు టీడీపీ 1999 పప్పల చలపతిరావు టీడీపీ 2004 యు.వి.రమణమూర్తిరాజు కాంగ్రెస్ 2009 యు.వి.రమణమూర్తిరాజు కాంగ్రెస్ 2014 పంచకర్ల రమేష్‌బాబు టీడీపీ పునర్విభజనలో మారిన కులసమీకరణ... 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్.రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో కలిసిపోయింది. మునగపాక మండలం యలమంచిలిలో చేరింది. అప్పటివరకు కాపు, వెలమ, మత్స్యకార సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. మునగపాక మండలం కలవడంతో గవర సామాజిక వర్గం ప్రాధాన్యత పెరిగింది. నియోజకవర్గంలో అధిక ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు... నియోజకవర్గంలో 224 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటిలో సమస్యాత్మకమైనవి యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 1, 3, 6, 7 వార్డులు, ఏటికొప్పాక, ఎర్రవరం, రాంబిల్లి మండలంలో కొత్తపట్నం, గజిరెడ్డిపాలెం, వైలోవ, మునగపాక మండలంలోని వాడ్రాపల్లి, నాగవరం, ఉమ్మలాడ, అచ్యుతాపురం మండలంలో తంతడి, కొండకర్ల, పూడిమడక, ఎస్ఈజెడ్ కాలనీ, దోసూరు, దొప్పెర్ల, ఇరువాడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
తండ్రి మీదకి కుక్కను ఉసిగొల్పుతూ..
సాక్షి, యలమంచిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉన్నమట్ల లక్ష్మణదాసు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యలకు పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలం ఉంది. అది కాకుండా మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్య చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజని ఆస్తి తమ పేరిట రాయమని ఇబ్బంది పెడుతున్నారు. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కను తీసుకువచ్చి లక్ష్మణదాసుపై ఉసిగొల్పుతూ భయపెడుతున్నారు. దీనిపై స్థానిక సంఘ పెద్దలకు చెపితే వారి మాట కూడా వినకుండా సంఘ పెద్దలను దుర్భాషలాడి చెదరగొట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ కలుగజేసుకుని ఆస్తి రాయమని సలహా ఇచ్చారు. సరే కదాని ఇరువురు కుమారులకు చెరొక 5 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడగా అలా కుదరదు నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంటిలో ఉంటుంటే సూటి పోటు మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని లక్ష్మణదాసు తహసీల్దార్ వి. స్వామినాయుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. -
కమీషన్ల యావ తప్ప జన ఘోష పట్టలేదు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన మాకన్నీ కష్టాలే మిగిల్చింది. కమీషన్ల కక్కుర్తి తప్ప బడుగు, బలహీన వర్గాల సమస్యలేవీ ఆయన పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు.. పింఛన్లు ఇవ్వరు.. ఆరోగ్యశ్రీ అమలు చేయరు.. మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారు. సెజ్, ఎన్ఏఓబీ నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా సమస్యలు పరిష్కరించాలయ్యా..’ అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 247వ రోజు సోమవారం వైఎస్ జగన్.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో పాదయాత్ర కొనసాగించారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, అక్కచెల్లెమ్మల ఆత్మీయత, అనురాగాల మధ్య రామన్నపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సాని కాలువ, చీమలాపల్లి, బంగారుపాలెం క్రాస్, కొండకర్ల మీదుగా కొండకర్ల జంక్షన్ వరకు సాగింది. దారిపొడవునా వేలాది మంది ఎంతగా ఘన స్వాగతం పలికారో అంతగా తమ సమస్యలనూ విన్నవించారు. జగన్‌ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమరు అధికారంలోకి రాగానే వాటికో పరిష్కారం చూపాలంటూ వేడుకున్నారు. ఎన్ఏఓబీ నిర్వాసితులకిచ్చిన హామీలన్నీ గాలికే నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ (ఎన్ఏఓబీ) నిర్వాసితులు తాము పడుతున్న ఇక్కట్లను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. 2011 సెప్టెంబర్ 3న అప్పటి జిల్లా కలెక్టర్ తమ 13 డిమాండ్లను పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చినా ఇంతవరకు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఏఓబీ కోసం తీసుకున్న భూములకు ఇచ్చే పరిహారంలోనూ తేడా చూపుతున్నట్టు చెప్పారు. ‘ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్ష, పరోక్ష నిర్వాసితులకు ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రీయ విద్యాలయం లేదా గురుకుల ఆశ్రమ పాఠశాల, కేంద్రీయ ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. మత్య్యకార కుటుంబాలపై ఆధారపడిన ఇతర వర్గాల వారికి నష్టపరిహారం ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. జెట్టి నిర్మాణం చేయాలి. కాంట్రాక్ట్, కార్మిక సంఘం ఏర్పాటుకు అనుమతించాలి. వేతన నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులతో పాటు కుటుంబాల జాబితా తయారు చేసి న్యాయం చేయాలి. చేపలు అమ్ముకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించాలి. సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. పునరావాస ప్యాకేజీని ఆయా కుటుంబాల్లోని మేజర్ అయిన కుమార్తెలు, కుమారులకు కూడా వర్తింపజేయాలి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు’ అని నిర్వాసితుల సంఘం నాయకులు సీహెచ్ అప్పారావు, మేరిగి అప్పలరాజు తదితరులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మరోపక్క కొత్త్తపట్నం, వాడనరసాపురం పరిధిలోని మత్స్యకారులు సుదీర్ఘకాలం నుంచి చేపల వేట సాగిస్తున్న ప్రాంతాలను ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు. తమకు చెప్పకుండానే సముద్రంలో నాలుగు రాతి వంతెనలు, ఇనుప వంతెనలు నిర్మిస్తున్నారని, ఇవి పూర్తయితే మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాపోయారు. ఎన్ఏఓబీ ప్రాజెక్టు నుంచి సుమారు 5 కిలోమీటర్ల పొడవునా కొత్తపట్నం, యాత కొత్తపట్నం గ్రామాల మీదుగా పైపు లైను సముద్రంలోనికి తీసుకువెళ్లి అక్కడ డ్రెడ్జింగ్ నిర్వహిస్తూ ఇసుకను బయటకు తీసుకువస్తున్నారని, దీనివల్ల మత్స్యసంపద అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పరోక్షంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు కూడా నౌకదళం వారు సహాయ పునరావాస ప్యాకేజీ ఇచ్చేలా చూడాలని జగన్‌ను కోరారు. వీరి సమస్య ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే పూర్తిగా పరిశీలించి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దిబ్బపాలెం పునరావాస కాలనీలో అక్రమాలు... అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) నిర్వాసితుల కోసం దిబ్బపాలెం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు, ప్యాకేజీల అమలులో అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆ కాలనీ వాసులు కె.రమణ, ఎస్.బాబూరావు, ఎ.శ్రీనివాసరావులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించి.. అనర్హులను కూడా అర్హులుగా గుర్తించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఇదే జరిగితే సుమారు 700 మంది అనర్హులు లబ్ధి పొందుతారని వాపోయారు. సెజ్ కోసం భూమిని సేకరించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని నిర్వాసితుల సంఘం ప్రతినిధులు జగన్ ఎదుట వాపోయారు. సెజ్ పునరావాస కాలనీలో ఐటీఐ, పాలిటెక్నిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నిర్వాసితులకు స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించేలా చూడాలని కోరారు. యలమంచిలి నియోజకవర్గంలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని పలు క్రిస్టియన్ సంఘాలు జగన్ దృష్టికి తీసుకువచ్చాయి. శ్మశానాలు కూడా లేకుండా చేస్తున్నారని, ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు పెడుతున్నారని ఆర్మీ ఆఫ్ ది లార్డ్ సంఘానికి చెందిన జాషువారాయ్, అచ్యుతాపురం పాస్టర్ సుధీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. చర్చిలు కట్టుకోవడానికి ఇచ్చే మైనారిటీ ఫండ్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో చర్చికి తాళాలు వేసి పాస్టర్లు రాకుండా చేస్తున్నారని వాపోయారు. నేను బతికున్నానంటే వైఎస్ చలువే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ వల్లే తానీవేళ బతికున్నానని కొండకర్ల వద్ద అరుణ అనే యువతి జగన్ ఎదుట భావోద్వేగానికి లోనయ్యింది. తనకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉండేదని, తన తల్లిదండ్రులు ఎక్కడెక్కడో చూపించి.. ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత లేక నిశ్చేష్టులై ఉన్న స్థితిలో ఆరోగ్య శ్రీతో బతికి బయటపడ్డానని వివరించింది. ఆ రోజుల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు పెద్దాస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించే వారని 13 ఏళ్ల నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. అసలు బతుకుతానని అనుకోలేదని, తనకు ఇప్పుడు ఇద్దరు పిల్లలని చెప్పింది. పిల్లల్ని బాగా చదివించాలని, ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం తీసుకువస్తానని జగన్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే మా ఆరోగ్యాలు బాగుంటాయని ఆరోగ్య శ్రీతో బతికి బట్టకట్టిన కె.అందులాపల్లి గ్రామానికి చెందిన గుబ్బల జ్యోతి అన్నారు. చేతిలో నయాపైసా లేక తనకు చికిత్స ఎలా చేయించాలో తెలియక సతమతం అవుతున్న తన తల్లిదండ్రులకు ఆనాడు వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆశాదీపంగా కనిపించిందని, ఫలితంగానే నేనిప్పుడు జగన్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పగలిగానని సంబరపడ్డారు. పేదలకు మేలు జరగాలంటే జగన్ రావాలన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య పింఛన్ కోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా తమను పట్టించుకోవడం లేదని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు, తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని నిరుద్యోగులు వాపోయారు. దళిత వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లి కానుకను లక్ష రూపాయలకు పెంచాలని మహిళా నాయకురాలు కాశీ ముని కుమారి నాయకత్వంలో పలువురు మహిళలు వైఎస్ జగన్‌కు విన్నవించారు. జీవో నెంబర్ 550 ద్వారా నష్టపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోనే ద్వీతీయ మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొండకర్ల ఆవకు పూర్వవైభవం తేవాలని, వలస వెళ్లిన తూర్పు కాపులకు ఇతర ప్రాంతాల్లోనూ బీసీ–డి కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమానికి రహదారి సౌకర్యం కల్పించాలని, అనాధ పిల్లలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని పలువురు జగన్‌ను కోరారు. విశాఖలో ఎగసిపడుతున్న జనకెరటం సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లాలో అడుగుపెట్టింది మొదలు రోజురోజుకు జనాదరణ వెల్లువెత్తుతోంది. ప్రజా ప్రస్థానంలో మహానేత అడుగుపెట్టిన నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దే ఆయన తనయుడు, జననేత జగన్ అడుగు పెట్టినప్పుడు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నర్సీపట్నం, కోటఉరట్ల, యలమంచలిలో జరిగిన సభలకు జోరు వర్షంలోనూ జనం పోటీపడ్డారు. మరో వైపు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేవుడు కుమార్తె గొట్టేటి మాధవి యలమంచలిలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటి చింతపల్లి నియోజకవర్గం నుంచి సీపీఐ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టేటి దేవుడుకు విశాఖ ఏజెన్సీలో మంచి పేరు ఉంది. నిజాయితీపరుడిగా, నిష్కలంక రాజకీయ నేతగా పేరొందిన ఆయన్ను అభిమానించే వేలాది మంది గిరిజనులు, సీపీఐ శ్రేణులతో కలిసి మాధవి పార్టీలో చేరడంతో స్థానికంగా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. అంతకు ముందు నర్సీపట్నం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా నాయకుడు రుత్తల ఎర్రా పాత్రుడితో పాటు నర్సీపట్నం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి, గత ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల రామచంద్రరావు, మాకవరపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుత్తల జమిందారి తదితర నేతలు పార్టీలో చేరారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి పెదఈశ్వరరావు, డీసీసీ కార్యదర్శి అద్దేపల్లి నూకి నాయుడు తదితరులు దార్లపూడిలో వైఎస్సార్సీపీలో చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన విడదల రజని వందలాది మంది అనుచరులతో రేగుపాలెం జంక్షన్లో పార్టీలో చేరారు. నేదురుమల్లి కుమారుడి చేరిక ఖరారు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 8న విశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు తనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేదురుమల్లి అభిమానులు పార్టీలో చేరతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తి వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన కొండకర్ల జంక్షన్లో వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు. కాగా, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నేతలు పలువురు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సబ్బవరం మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాలనాయుడు, ఆర్ఈసీఎస్ మాజీ డైరెక్టర్ సబ్బవరపు నారాయణమూర్తి, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం అప్పలనాయుడు తదితరులతో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు. అనకాపల్లి నియోజకవర్గం మారేడుపూడి మాజీ సర్పంచ్ ఈగల నూకరత్నం, ఈగల కృష్ణమూర్తి, ఆర్ఎంపీ వైద్యుడు బి.అప్పలనాయుడు, అచ్యుతాపురం మాజీ ఎంపీపీ వి.నరసింగరావు, వెన్నెలపాలెం కమ్యునిటీ హెల్త్ అధికారి వెన్నెల నరసింహరావు, మరో 500 మంది వైఎస్సార్సీపీలో చేరారు. -
మీరొస్తేనే మాకు మంచి రోజులు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో అచెంచల ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులొస్తాయనే నమ్మకాన్ని తీసుకొస్తోంది. దీంతో ఊరూవాడా ఆయన కోసం తరలివస్తున్నారు. ప్రస్తుత పాలనపై విసుగెత్తిన వాళ్లు, మార్పును కోరుకునే వాళ్లు, రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, చంద్రబాబు పాలనలో అనుభవాలు చవిచూసిన మాజీ ఉన్నతోద్యోగులు, అనుక్షణం చిత్ర వధ అనుభవిస్తున్న ఉద్యోగులు, భద్రత కరువైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా తరలివస్తున్నారు. ‘నువ్వొస్తేనే రాష్ట్రం బాగుంటుంది’ అని మనోభావాలను వ్యక్తీకరిస్తున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో శనివారం సాగిన 245వ రోజు పాదయాత్రలో కూడా ఇలాంటి సన్నివేశాలు అనేకం కనిపించాయి. కొత్తపాలెం క్రాస్ నుంచి నారాయణపురం, మామిడివాడ, పంచదార్ల, అప్పరాయుడుపాలెం, ధారభోగాపురం వరకు వేలాది మంది జననేతకు స్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చే సారథి ఆయనేనంటూ అభిప్రాయపడ్డారు. కన్నీళ్లు తెప్పిస్తూ.. జీవితాలతో ఆడుకుంటున్న అధికార తెలుగుదేశం పార్టీని జననేత చెబుతున్నట్లు బంగాళాఖాతంలో కలపాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రే దళారై దోచుకుంటున్న వైనాన్ని ఊరూరా జనం చెప్పుకొచ్చారు. మండుతున్న రైతు గుండెకు చల్లదనం మూతపడ్డ సహకార చెక్కర ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని, నష్టపోయిన కర్మాగారాలకు జవసత్వాలిస్తామని జగన్ చేసిన ప్రకటన యలమంచిలి చెరకు రైతులను ప్రభావితం చేసింది. రాంబిల్లి మండలం కొత్తూరు రైతులు జననేతను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ మంచి రోజులు వస్తాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు ఇవ్వక బాధపడుతున్న నానేపల్లి గణేష్.. అభిమాన నేత ముందు ఆనందాన్ని పంచుకున్నాడు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో ఎంతో ధీమాగా ఉన్నామని చెప్పాడు. మీ వల్లే గత వైభవం వస్తుందన్న విశ్వాసం ప్రదర్శించాడు. నేవెల్ బేస్ భూసేకరణ బాధితులూ వచ్చారు. కేంద్రంతో పని లేకుండానే న్యాయం చేస్తానంటూ మీరిచ్చిన హామీ మత్స్యకారుల జీవితాల్లో ఆశలు రేపిందన్నారు. ‘ఎన్నాళ్ల నుంచో ఆందోళన చేస్తున్నామయ్యా.. మీరొక్కరే కనికరించారు.. మీరే సీఎం అవుతారు.. మా బతుకుల్లో చీకట్లు తొలుగుతాయి’ అని వీరభద్రం, శంకర్ అన్నారు. శారద, వరాహ నదుల్లోనే చేపల వేటకు అనుమతిస్తే మేమెలా బతకాలంటూ మత్స్యకారులు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉపాధి గురించి మీరే ఆలోచించాలన్నా.. అంటూ కొత్తపట్నం, వాడనరసాపురం, ఈతపాలెం, ఏలుగుండుపాలెం, వారకాడ, బంగారయ్యపాలెం గ్రామాల ప్రజలు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో వంద బడులు తీసేస్తారా? ఇదెక్కడి ప్రభుత్వం? గిరిజనులపై ఇంత కక్షా? అంటూ గిరిజన ప్రాంత ఉపాధ్యాయ ప్రతినిధి కోడా సింహాద్రి ఆవేదన వెలిబుచ్చాడు. సహచరులతో పాటు ఆయన జగన్‌ను కలిశాడు. విశాఖ ఏజెన్సీలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పాడు. ఏజెన్సీలోని 11 మండలాల్లో వంద పాఠశాలలను మూయించారని, విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారని వివరించాడు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టు అధ్యాపక నియామకాలు జరగడం లేదన్నాడు. మీరు సీఎం అయితే ఈ పరిస్థితులు మారతాయని ఆకాంక్షించాడు. 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా జగన్ వద్ద కష్టాలు చెప్పుకున్నారు. ‘మా నోళ్లు కొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నా.. మీరు అధికారంలోకి రాగానే మంచి రోజులొస్తాయనే నమ్మకం ఏర్పడింది’ అని గట్టు రాఘవ, ధనలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ అందని కిడ్నీ బాధితులు, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు రాని వారు, రుణమాఫీ హామీతో మోసపోయిన వారు.. అడుగడుగునా కష్టాలు చెప్పుకున్నారు. జగనన్న రాగానే కష్టాల నుంచి గట్టెక్కుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. హమ్మయ్యా.. వర్షం వెలిసింది.. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పాదయాత్ర తిరిగి మొదలయ్యే సమయంలో వర్షం ప్రారంభమైంది. ‘జగన్‌ను కలుద్దామని వచ్చాను.. మళ్లీ వాన పడుతోంది. కలుస్తామో.. లేదో..’ అంటూ నర్సమ్మ, శంకర్, వీరయ్యతో పాలు అనేక మంది పాదయాత్ర శిబిరం వద్ద ఆందోళనగా అన్నారు. అప్పటికే జనం.. పాదయాత్ర శిబిరం సమీపంలోని చెట్ల కింద, రోడ్డుపై గొడుగులు పట్టుకుని నిరీక్షిస్తుండటం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ‘హమ్మయ్యా.. వర్షం ఆగింది.. పాదయాత్ర సాగుతుంది’ అంటూ ఉత్సాహం ప్రదర్శించారు. తమ నేత బయటకు రాగానే వాళ్లంతా చుట్టుముటారు. ఆయనతో కలిసి చినుకులతో తడిసిన రోడ్డుపై కేరింతలు కొడుతూ ముందుకు సాగారు. మధ్యలో కాసేపు జల్లులు పడినా ఎవరూ లెక్క చేయలేదు. -
యలమంచిలిలో పండుగాలా సాగుతోన్న ప్రజాసంకల్పయాత్ర
-
హోరువానలోనూ వైఎస్ జగన్ వెంట కదిలిన జనం
-
ప్రజాసంకల్పయాత్ర: వర్షం సాక్షిగా...జనప్రభంజనం
-
‘ఆమెతో పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటా’
సాక్షి, యలమంచిలి: తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని ఓ యువతి గ్రామస్తులు, కులపెద్దలు, ఐద్వా సంఘ మహిళలతో కలిసి ధర్నాకు దిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏనుగువానిలంకలో చోటుచేసుకుంది. గెద్దాడ మరియ మ్మ అనే యువతి బండి మురళీకృష్ణతో వివాహం చేయాలని ధర్నాకు దిగింది. వివరాలిలా ఉన్నాయి.. కలగంపూడిలోని తూర్పుపాలెంనకు చెందిన మేరీమాత ఏనుగువానిపాలెంకు చెందిన మురళీకృష్ణ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యా రు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం మురళీకృష్ణ గల్ఫ్ దేశం వెళ్లగా మేరీమాత కూడా మరో గల్ఫ్ దేశం వెళ్లింది. ఇద్దరూ వేర్వేరు దేశాల్లో ఉపాధి పొందుతుండగా కొంతకాలానికి మురళీకృష్ణ స్వగ్రామానికి వ్యాపారం చేసుకుంటానని చెప్పి వచ్చాడు. మురళీకృష్ణ వ్యాపారానికి మేరీమాత డబ్బులు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ అబ్బిరాజుపాలెంకు చెందిన మరో యువతితో వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన మేరీమాత హుటాహుటిన స్వగ్రామానికి రాగా మురళీకృష్ణ ఆమెకు కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో మేరీమాత విషయాన్ని కులపెద్దలకు చెప్పి మురళీకృష్ణ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. ఇదిలా ఉండగా మేరీమాతను పెళ్లిచేసుకోవడానికి తనకు ఇష్టంలేదని, బలవంతంగా చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని మురళీకృష్ణ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. మురళీకృష్ణతో పెళ్లి జరిగేవరకూ వదిలేది లేదని మేరీమాత భీష్మించింది. ఇరు సంఘాల పెద్దలు బండి శ్రీనివాస్, గుబ్బల ఏడుకొండలు ఏనుగువానిలంక గ్రామ పెద్దలు మేళం రామాంజనేయులు, ముచ్చర్ల ధర్మరాజు, ఐద్వా సంఘం తరఫున పొత్తూరి జ్యోతి, జిల్లెళ్ల ప్రశాంతి, సీఐటీయూ మండల కార్యదర్శి దేవ సుధాకర్, సీపీఎం నాయకుడు మాసవరపు సుబ్బారావు తదితరులు మేరీమాతకు బాసటగా నిలిచారు. -
యలమంచిలిలో చోరీ
విశాఖపట్నం, యలమంచిలి: పట్టణంలోని రామ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది.రామ్‌నగర్ శివారు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గొర్లె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. ఇంటి బయట శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి వెనుక తలుపు తాళం తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు విశాఖ డెయిరీలో టెక్నికల్అసిస్టెంట్గా పనిచేస్తుండడంతో తెల్లవారుజామున లేచి డ్యూటీకి బయలుదేరే సమయంలో ఇంటిలో వెళ్లగా చూడగా వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి, దుస్తులు చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బాధితుని ఫిర్యాదుమేరకు యలమంచిలి టౌన్ ఎస్ఐ నారాయణరావు ఆ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.దొంగలను పట్టుకునేందుకు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. -
నాకెప్పుడు ప్రజల మధ్యనే ఉండటం ఇష్టం
-
టీడీపీకి షాక్: కన్నబాబు రాజీనామా
రాంబిల్లి(యలమంచిలి): మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్‌బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. అయితే తాను వైఎస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు.