ys avinash reddy
-
టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం
-
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
కడపలో పోలీసుల ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. -
కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
చంద్రబాబు పై అవినాష్ రెడ్డి ఫైర్
-
బీటెక్ రవి హల్చల్.. అధికారుల అండతో ఓవరాక్షన్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. టీడీపీ నేతలు కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తాజాగా నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీటెక్ రవి హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బీటెక్ రవి రాజకీయం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ, కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పులివెందులలో నీటి పన్ను నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. గిడ్డంగివారిపల్లిలో బీటెక్ రవి తన అనుచరులతో కలిసి నో డ్యూ సర్టిఫికెట్లను చింపివేశారు. అలాగే, ఇనగలూరులో అధికారాలను అడ్డుపెట్టుకుని నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో తన అనుచరులను అడ్డుపెట్టుకుని బీటెక్ రవి హల్ చల్ చేస్తున్నాడు.ఇక, నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్ వేసేందుకు అర్హత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నేతలకు నో డ్యూ సర్టిఫికెట్లు రాకుండా కూటమి నేతలు ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు.. పలుచోట్ల వీఆర్వోలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపాలని లేఖలో కోరారు. అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు వేస్తే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారుల తీరుపై ఆర్డీవో, డీఎస్పీకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే శాంతిభద్రతల సమస్య వస్తుందని అధికారులకు తెలిపారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
బీటెక్ రవి, పోలీసులకు వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
-
జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోండి.. సీఎంకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. చత్తీస్‌గఢ్‌లో ల్యాండ్ మైన్ పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో సీఎంను అవినాష్ రెడ్డి కోరారు.ఇటీవల చత్తీస్‌గఢ్ అంబుజ్‌మడ్‌లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం విన్నవించుకున్నారు. దీంతో, వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.ఈ లేఖలో రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ పోషణ కోసం రాజేష్ భార్య స్వాతికి మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీర మరణం పొందిన రాజేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
ఇంత అరాచకమా..? చంద్రబాబు సర్కార్‌పై అవినాష్‌రెడ్డి ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోందని.. వందరోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అసంతప్తి మూటగట్టుకుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ నరసింహను చంపారన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.పులివెందులతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కతి లేదు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తేవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!‘‘పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం అడ్మిషన్లు రాకుండా చేసింది. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు. -
మహామ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో ఎంపీ అవినాష్ రెడ్డి
-
వినాయకుని పూజలో వైఎస్ అవినాష్ రెడ్డి
-
ఏపీకి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్రం నిలబెట్టుకోవాలి: ఎంపీ అవినాష్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో భాగంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోదీని కోరారని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న విభజన చట్టంలోని హామీని అమలు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ అవినాష్ కోరారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతున్నా పేదలు-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని అన్నారు. పేదలు ధనికులుగా మారినప్పుడే ఇది అర్థవంతంగా ఉంటుందన్నారు. 10 శాతం మంది ధనికుల చేతుల్లో 77 శాతం దేశ సంపద ఉంటే.. 90% జనాభా చేతిలో 23% సంపద మాత్రమే ఉందని తెలిపారు. ఈ అంతరాలను తొలగించేందుకు ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.‘దేశంలో ఆదాయపు పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భీమా 25 వేలకే ఐటిడి కింద పరిమితం చేశారు. కానీ రోజురోజుకు వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమాను లక్ష రూపాయల వరకు మినహాయించాలి. కొత్త పన్ను విధానం వల్ల ప్రజలు ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. చేనేతకారులు ఉపయోగించే ముడి సరుకులపై ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలి. ఫిషింగ్ నెట్స్ పై జిఎస్టిని రద్దు చేయాలి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ యంత్రాలపై జిఎస్టిని మినహాయించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించాలి’ అని తెలిపారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పులివెందుల: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్‌కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి రెడ్‌బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కును హరిస్తోందన్నారు. ఓవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతామని తెలిపారు. అవినాశ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఇటీవల అధికార పార్టీ దాడిలో గాయపడిన అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని పరామర్శించి, వారిలో ధైర్యం కల్పించి, వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తర నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని 20 మంది టీడీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్‌తో విచక్షణా రహితంగా కొట్టారని, స్టిక్స్ విరిగిపోతే బండరాళ్లతో తలపై దాడి చేశారన్నారు. బుధవారం పుంగనూరులో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి పైనా రాళ్లతో దాడులు చేశారన్నారు. తాము గత ఐదేళ్లు ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకత్వం ఏ రోజూ అరాచకాలను ప్రోత్సహించలేదని, ఎంతసేపూ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని 80 శాతం తొలగించారన్నారు. సెక్యూరిటీని తొలగించినా, ఇంకా ఏమి చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆపలేరని ఆయన తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత పులివెందులలో 70వేల టన్నుల ఇసుకను టీడీపీ వారు దోచేశారని చెప్పారు. మైన్స్, బార్ల పైనాపడిపోతున్నారని చెప్పారు. -
చంద్రబాబు నీతులు చెబుతూనే దాడులను ప్రోత్సహిస్తున్నారు: ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అలాగే, వైఎస్సార్సీపీ ఎంపీలు పార్టీని వీడే అవకాశమే లేదన్నారు.కాగా, కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించాను. నాపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కడప ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. వారి అభివృద్ధి కోసం పనిచేస్తాను.ఇక, కేంద్రంలో టీడీపీ మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ప్రజాదోహమే అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. 2019లో మేము విజయం సాధించినప్పుడు మేము ఎవరిపై దాడులకు పాల్పడలేదు. చంద్రబాబు ఒకవైపు నీచులు చెబుతూనే మరోవైపు దాడులను పోత్రహిస్తున్నారు.వైఎస్సార్సీపీ ఎంపీలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు పార్టీనీ వీడే అవకాశమే లేదు. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వారిలాగే అందరు పార్టీ మారుతారని అనుకుంటున్నారు. మేమంతా వైఎస్ జగన్ వెంటే ఉంటాం’ అని స్పష్టం చేశారు. -
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
-
కుట్రలు.. కుతంత్రాలు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జిగా భూపేష్‌రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే. లోపాయికారి ఒప్పందం టీడీపీదే.... కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు. హవ్వా...ఓటమి భయమా..?! కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్‌కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి
-
పులివెందులలో హింసకు టీడీపీ పన్నాగం
సాక్షి ప్రతినిధి కడప: హింసకు తావు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పోలింగ్‌లో హింసకు టీడీపీ కుట్ర చేస్తోందని తెలిపారు. పోలింగ్ ప్రారంభంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందులలో మొదటగా హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గలాటాలు చేయాలని ప్రణాళిక రూపొందించుకుందన్నారు.ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చారని, వారి అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు యత్నిస్తోందని తెలిపారు. అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తత ప్రచారం కల్పించి, వైఎస్సార్సీపీనే చేయించినట్లుగా తప్పుడు ప్రచారానికి కుట్ర జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ఈ వ్యూహం రచించారన్నారు. స్వేఛ్చగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమని, అందుకే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారన్నారు. -
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
-
చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు. -
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
-
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
వేముల: వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’ అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
Viveka Case: అవినాష్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్ వేశారుసీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్వైఎస్ భాస్కర్‌రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ వేసిందిఅని అవినాష్ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసింది.మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు