YSR Nethanna Nestham
-
నేతన్నలకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న మనసున్న నేత
-
చేనేతకు ఇది స్వర్ణయుగం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆగష్టు 7వ తేదీ.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా.. చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. నా పాదయాత్రలో వాగ్దానం చేసినట్లుగా.. వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించాం. నేత కార్మికులకు సంవత్సరానికి రూ. 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చేనేత కార్మికులను ఉద్ధరించాలనే మా నిబద్ధత.. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. నేతన్నలకు గత వైభవాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాము. వారికి సుసంపన్నమైన భవిష్యత్తును అందిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారాయన. On #NationalHandloomDay, we celebrate the rich heritage of our weaver community, an integral part of our cultural legacy. As promised during my Padayatra, we launched the YSR Nethanna Nestham scheme, empowering our weavers with their looms and yearly financial assistance of Rs… pic.twitter.com/1Blmd12VF2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2023 -
వైయస్ఆర్ నేతన్న నేస్తం మా జీవితాలలో వెలుగులు నింపింది
-
‘వైయస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో ప్రతి చేనేత కుటుంబానికి భరోసా..
-
ఇదీ వీళ్ల సంస్కారం: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్
వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలో జరిగిన సభలో జగన్ ఏమన్నారంటే.. బాబుగారి వలంటీర్ ఈ దత్తపుత్రుడు.. మన వలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారంటాడా? ఇతను ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మరలా వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్లీ వదిలేయడం.. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం.. ఇదే పని. పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. మరో క్యారెక్టర్ వయస్సు 75 ఏళ్లు. అయినా సిగ్గులేదు. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడుతూ.. ఆహా బావా.. నువ్వు సినిమాల్లోనే చేశావు. నేను నిజ జీవితంలోనే చేశాను అంటూ.. చేసిన వెధవ పనులను ఆ ముసలాయన గొప్పగా చెప్పుకుంటాడు. అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంట.. లేదా కడుపన్నా చేయాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. పట్టపగలే మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డ్యాన్స్‌లు చేసేవారు ఇంకొకరు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే.. నిస్సిగ్గుగా డ్యాన్స్‌లు చేస్తూ కనిపిస్తాడు. సాక్షి, తిరుపతి: వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎండైనా, వానైనా, చలైనా, వరదలొచ్చినా, పండగరోజైనా, సెలవురోజైనా నిక్కచ్చిగా సేవ చేస్తున్న వలంటీర్ల కేరెక్టర్‌పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు, బావమరిది కేరెక్టర్ ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఆయన వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొన్ని విషయాలు మాట్లాడకూడదనుకున్నా పరిస్థితులు చూసినప్పుడు తప్పడం లేదన్నారు. ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థలను, మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరని, కానీ మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ మాటలు చెప్పాల్సి వస్తోందని చెప్పారు. వలంటీర్లంతా మన ఊళ్లో, మన కళ్లెదుటే నాలుగేళ్లుగా కనిపిస్తున్నారని, మనందరికీ తెలిసినవాళ్లేనన్నారు. ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో తలుపుతట్టి, గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ అవ్వాతాతలను చిరునవ్వులతో పలరించే కుటుంబ సభ్యులు మన వలంటీర్లు అని చెప్పారు. వెంకటగిరిలో జరిగిన సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం అవినీతికి, వివక్షకు తావు లేకుండా, మనందరి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప వద్దకూ.. కాళ్లకు బలపం కట్టుకుని మరీ వెళ్లి.. కులం, మతం, వర్గం, ప్రాంతం చివరకు వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా అవ్వాతాతలకు మేలు చేస్తున్న మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థపై కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు.. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి అని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నిస్సిగ్గు రాతలు ► వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటారు. గ్రామ వలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.. ముంబయికో, ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారు అని ఇంకొకరు నిస్సిగ్గుగా అంటారు. దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక, సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకో సిగ్గులేని టీవీ–5 మీడియా రాస్తాయి. ఇటువంటి వారంతా బురద జల్లుతారు. అబద్దాలకు రెక్కలు తొడుగుతారు. ► 2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో సేవలందిస్తున్నారు. ఇందులో 60 శాతం నా చెల్లెమ్మలే. మన వలంటీర్లు అంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవా భావంతో పని చేస్తున్నారు. ఇలాంటి మన సేవామిత్రలు, సేవారత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల కేరెక్టర్‌ను తప్పుపట్టింది ఎవరో తెలుసా? సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట వేచి ఉన్న జనవాహిని ► ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్. ఇంకొకరు చంద్రబాబు నాయుడు. మరొకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీరంతా ఒక గజదొంగల ముఠా. వీళ్లు వలంటీర్ల కేరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. వలంటీర్ పిల్లల కేరెక్టర్ ఎలాంటిదో అదే గ్రామంలో వారి సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసు. వీరికి మంచి చేసిన చరిత్రే లేదు ► ఇచ్చేది తన పార్టీ బీ–ఫారమ్. నిజానికి టీడీపీకి బీ–టీమ్. చంద్రబాబు మీద పోటీ ఒక డ్రామా. బీజేపీతో స్నేహం మరో డ్రామా. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. అంతటికీ స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుది. నిర్మాత చంద్రబాబు. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఇవీ నిజాలు. ► ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారంటే వీరికి మంచి చేసిన చరిత్ర లేదు. ఫలానా మంచి చేశాం.. అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్కటి మంచి చేసిన చరిత్ర లేదు. ఉన్నదంతా వంచన, వెన్నుపోట్లు మాత్రమే. ఇదీ వీళ్ల జీవిత చరిత్ర. ఇదీ మన చరిత్ర ► మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం కేవలం 50 నెలల్లోనే ఎలాంటి అవినీతి, లంచాలకు తావులేకుండా ఏకంగా రూ.2.25 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో జమ చేసింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మన చరిత్ర. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం మన చరిత్ర. ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.26 వేల కోట్లకు పైగా అమ్మఒడి పథకం ద్వారా నిలవడం మన చరిత్ర. ► దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరాగా.. వారికి తోడుగా నిలబడుతూ రూ.19,178 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టడం, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇవ్వడం మీ బిడ్డ చరిత్ర. ► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేయూత అనే పథకం ద్వారా మరో రూ.14,129 కోట్లు ఇచ్చాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టుగా వ్యాపారాలు సైతం చూపించడం ఇంకో చరిత్ర. రైతు భరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతన్నలకు రూ.31 వేల కోట్లు నేరుగా జమ చేయడం మన చరిత్ర. గొప్ప చదువుల కోసం తాపత్రయం ► మన పిల్లలు చదవాలి, చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఏ తల్లి, తండ్రీ తమ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని.. వారికి తోడుగా ఉంటూ విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. పిల్లలకు మెస్ చార్జీలకు.. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం తీసుకొచ్చాం. ఈ రెండు పథకాలకు ఈ 50 నెలల్లో రూ.15 వేల కోట్లు ఇచ్చాం. ► మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, నాడు–నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, మూడో తరగతి నుంచే టోఫెల్లో సైతం ప్రిపరేషన్, ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఉండేలా ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేయడం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, రోజుకొక మెనూతో పిల్లలకు గోరుముద్ద పథకాన్ని తీసుకురావడం, స్కూళ్లు తెరిచేటప్పటికే ఆ పిల్లల చిక్కటి చిరునవ్వుల మధ్య కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా కానుక పంపిణీ.. ఇది మన పిల్లల భవిష్యత్ కోసం చేస్తున్న మన చరిత్ర. ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నాం ► మేనిఫెస్టో అంటే చంద్రబాబు మాదిరిగా చెత్తబుట్టలో పడేయడం కాదు. దాన్నొక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం. ఏకంగా 98 శాతం హామీలను నెరవేర్చి.. గడప గడపకూ తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఈ మేనిఫెస్టోను వాళ్ల చేతుల్లో పెడుతూ మీరే చదివి మీ బిడ్డని ఆశీర్వదించండని అడుగుతున్న చరిత్ర మనది. ► ఏకంగా 26 జిల్లాలు చేసిన చరిత్ర మనది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంతవరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయంలో ఏకంగా 50 శాతం పెరిగి 6 లక్షలకు చేరాయి. 2.06 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మనది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర కూడా మనదే. ► స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరో 17 కడుతున్నాం. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఆరు పోర్టులుంటే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మరో 4 పోర్టులు కడుతున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు, మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పేదలపట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో చేస్తున్నాం. మారుతున్న గ్రామాల ముఖచిత్రం ► ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో వలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కనిపిస్తుంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లూ కనిపిస్తాయి. ► కొత్తగా 108, 104 అంబులెన్స్ వాహనాలు 1,600 పైచిలుకు కుయ్ కుయ్‌మంటూ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారాయి. గతంలో సరిగా నిర్వహించకుండా.. కేవలం 1,000 వ్యాధులకు పరిమితమైన ఆరోగ్యశ్రీని.. 3,250 వ్యాధులకు విస్తరించాం. ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చాం. కోవిడ్ టైంలో మనం చేసిన యుద్ధం ఇంకొక చరిత్ర. ► అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేశాం. సామాజిక న్యాయంలో ఎవరూ చేయని విధంగా ప్రతి అడుగులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల కోసం ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న చరిత్ర మనది. ► రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అసైన్డ్ భూములు మీద హక్కులు ఇచ్చిన చరిత్ర మనది. 2 లక్షల ఎకరాలకు పైగా చుక్కల భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే.. భూముల సమస్యలను తొలగించి రైతన్నల చేతిలో పెట్టిన చరిత్ర మనది. అప్పటికీ, ఇప్పటికీ తేడా చూడండి ► మనిషి కేరెక్టర్, విశ్వసనీయత విషయంలో కానీ, మేనిఫెస్టోకి ఇస్తున్న విలువ గురించి కానీ, చేస్తున్న మంచి విషయంలో కానీ గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా మీరే గమనించండి. మనకు ఎలాంటి పాలకుడు, పాలన కావాలన్నది ఆలోచన చేయండి. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. మీ బిడ్డ దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు. రాబోయే రోజుల్లో వాళ్లు ఇంకా అబద్ధాలు చెబుతారు. ఇవాళ వలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో.. రాబోయే రోజుల్లో మీ బిడ్డ గురించి, మీ బిడ్డ ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అదే మాదిరిగా దారుణంగా అబద్ధాలు చెప్తారు. ఇవేవీ నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. సభా ప్రాంగణానికి సీఎం జగన్ వస్తుండగా జై జగన్ అంటూ నినాదాలు -
వెంకటగిగిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం.. జగనన్నకు జనం జేజేలు (ఫొటోలు)
-
వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం’’ అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘బీసీలంటే బ్యాక్వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఈ నాలుగేళ్లలో నేతన్నల ఖాతాల్లో ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు విడతల్లో రూ.1,20,000 జమ చేశాం. ఈ ఒక్క పథకానికే మన ప్రభుత్వం రూ.970 కోట్లను కేటాయించింది. దేవుడి దయతో నేతన్నలకు తోడుగా నిలబడే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ మగ్గాలకే ఉరి వేసుకొనే దుస్థితి నుంచి మగ్గాలను ఆధునికీకరించుకొని, జీవనాన్ని మెరుగుపర్చుకొనే స్థాయికి నేతన్నలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. మగ్గానికి మహర్దశ తీసుకొచ్చి, దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చి, వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చి, ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తున్నారు. గత నాలుగేళ్లూ క్రమం తప్పకుండా ఈ సాయాన్ని అందించారు. వరుసగా ఐదో ఏడాది కూడా వైఎస్సార్ నేతన్న నేస్తం’ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం. బీసీలంటే బ్యాక్వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్‌బోన్… pic.twitter.com/8yH6yeSYcH — YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2023 -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్.. సీఎం జగన్ సెటైర్లు
-
చేనేత చేయి పట్టుకొని నడిపిస్తా
-
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైయస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం (ఫొటోలు)
-
సీఎం జగన్ రాకతో.. దద్దరిల్లిన వెంకటగిరి సభ!
-
వెంకటగిరిలో సీఎం జగన్ సభ.. ఇసుకేస్తే రాలనంత జనం
-
వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం
-
నేతకు జీవం పోశాం
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో నేతన్నకు తోడుగా నిలిచి, అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేతకు, ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. ఇంతకు ముందు లేని విధంగా అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వ్రస్తాలను అమ్మే ఏర్పాటు చేశామని, తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నల ఖాతాల్లో రూ.193.64 కోట్లు నేరుగా జమ చేశారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ ఏడాది కూడా రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేల వెంకటగిరి అని చెప్పారు. అలాంటి ఈ గడ్డపై నుంచి ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆరి్థకంగా, రాజకీయంగా, విద్యా పరంగా, మహిళా సాధికారత పరంగా అన్ని విధాలా మేలు చేయడంలో.. అంబేడ్కర్, పూలే భావజాలాన్ని అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బీసీలు బ్యాక్ బోన్ క్లాసులు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని ఎన్నికల వేళ చెప్పాను. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఈ నాలుగేళ్లలో ప్రతి పనిలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపించే విధంగా అడుగులు వేశాను. ఈ కోవలోనే నవరత్నాలు తీసుకు వచ్చాను. నేతన్న నేస్తం తీసుకొచ్చాను. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ఏటా రూ.24 వేల చొప్పున వరుసగా ఇస్తూ పోతున్నా. ఇలా ఐదు విడతలుగా రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టాం. 80,686 మంది చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకి మేలు జరిగేలా ఇవాళ రూ.194 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఐదు దఫాలుగా రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం కూడా చేయలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఇకపై అలా జరగకుండా నవరత్నాలు తీసుకొచ్చాం. హామీలు గాలికొదిలేసిన గత ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గెలిచాక గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్లో రూ.1000 కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కారి్మకులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా ఎన్నో హామీలిచ్చి చివరకు చేనేతలను మోసం చేశారు. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామన్న వారు ఐదేళ్లకు కలిపి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మన ప్రభుత్వంలో ఆ పరిస్థితి మార్చేశాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు చెప్పిన మాట నెరవేరుస్తూ 2019 డిసెంబర్ 21న నా పుట్టిన రోజునాడు వైఎస్సార్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరుసగా ఐదో దఫా సహాయం చేశాం. సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,396 కోట్లు, నవరత్నాల్లో ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టాం. బకాయిలతో కలిపి ఆప్కోకు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు.. మొత్తంగా రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేయగలిగాం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి రూ.450 కోట్లు ఎక్కడ? మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లో రూ.3,706 కోట్లు ఎక్కడ? ఒక్కసారి మీరే ఆలోచించండి. వెంకటగిరికి వరాలు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే రామ్‌కుమార్‌రెడ్డి నిధులు అడిగారు. ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి చూశాం. రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ ఎస్టిమేషన్ తయారుచేయిస్తే రూ.553 కోట్లు అవుతుందన్నారు. ఇందుకు అనుమతులు మంజూరు చేస్తాను. 6 మండలాల్లో డ్రెయిన్లు, సీసీరోడ్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నా. మున్సిపాలిటీలో డ్రెయిన్లు, సీసీరోడ్లకు సంబంధించి ప్రతి గడపకూ తిరగమని రామ్‌కు చెబుతున్నాను. ఒక్కోసచివాలయానికి రూ.50 లక్షలు కేటాయిస్తాం. వెంకటగిరికి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించిన నిధులూ మంజూరు చేస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ గురుకుల స్కూల్ మంజూరు చేస్తున్నా. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నా. జాతర ఇవాళే వచ్చినట్లయ్యింది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేత పనులు గిట్టుబాటు కాక చేనేత కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మీరొచ్చాక (సీఎం జగన్) వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఆ పరిస్థితులు మారిపోయాయి. నవరత్నాల పథకాల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. నా భర్తకు కిడ్నీలో రాళ్లు వస్తే రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాం. పిల్లలకు స్కూల్లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. మీ (సీఎం) పుణ్య మా అని టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. సీఎం జగనన్న మేలు ఎప్పటికీ మరచిపోం. రెండు నెలల తర్వాత వచ్చే వెంకటగిరి జాతర.. ఇవాళే వచ్చినంత ఆనందంగా ఉంది. – సోమా విజయలక్ష్మి, చేనేత కార్మికురాలు, వెంకటగిరి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కళల కల‘నేత’
సాక్షి, అమరావతి: ‘‘పట్టు వస్త్రంపై ప్రధాని మోదీ ధ్యానముద్ర.. వాల్ హ్యాంగింగ్ వస్త్రంపై సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న నిలువెత్తు చిత్రం.. పట్టు చీరపై శ్రీరామకోటి, రామాయణ పాత్రలు.. ఇదంతా ఓ చేనేత కార్మికుడి కళల కలబోత’’. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జూటూరి నాగరాజు.. చేనేతలో నైపుణ్యానికి సాంకేతికతను జోడించి అద్భుతాలు సాధిస్తున్నాడు. చేనేతలో ఆకట్టుకునేలా నాగరాజు ఆవిష్కరించిన వాటిల్లో కొన్ని.. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని పట్టు వస్త్రంపై ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి.. ఆ వస్త్రాన్ని ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభ సభలో సీఎం వైఎస్ జగన్‌కు, చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు అందజేశాడు. ► బాపట్ల వైఎస్సార్సీపీ నేతల కోరిక మేరకు నవరత్న పథకాల పేర్లు, చిత్రాలతో కూడిన రెండు మీటర్ల పొడవైన పట్టు శాలువాను నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే నేసి ఇచ్చాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ నడిచి వస్తున్న చిత్రాన్ని సైతం అద్భుతంగా నేశాడు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన పోటీల్లో అవార్డును సాధించాడు. ► ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ (తెలంగాణ) ఫొటోతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా పట్టు వస్త్రంపై నేసి ఇచ్చాడు. ► లేపాక్షి మందిరములో చెక్కిన వందలాది శిల్పాలను అచ్చుగుద్దినట్టు చేనేత మగ్గం ద్వారా పట్టు చీరలో నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. థాయ్‌లాండ్ సంస్కృతికి చెందిన చిహ్నాలు, చార్మినార్, తాజ్‌మహాల్‌ను సైతం పట్టు చీరలపై నేసి ప్రతిభకు పట్టం కట్టాడు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో 104 రాకెట్లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఇస్రో శాటిలైట్ శారీని చేనేత మగ్గంపై తయారు చేశాడు. విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ శాటిలైట్ శారీని చూసి నాగరాజును అభినందించారు. ► గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలిగోపురం, తెలుగు అక్షరాలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై తయారు చేసి ఔరా అన్పించాడు. ఆధునికత జోడించాను మా తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేతకు ఆదరణ తగ్గిన తరుణంలో దానికి ఆధునికత జోడించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నాను. డిగ్రీ చదివాను. 25 ఏళ్లుగా చేనేతపైనే ఆధారపడ్డాను. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేతలో కొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నాను. నా ఉత్పత్తులు పలు దేశాలకు, దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి చేస్తున్నాను. కంప్యూటర్ ద్వారా ఆధునిక డిజైన్లను ముద్రించి మగ్గంలోని జకార్డ్, తదితర ఆధునిక పరికరాల సాయంతో వస్త్రాలను నేస్తున్నాను. అనేక పోటీల్లో బహుమతులు సాధించాను. –జూటూరి నాగరాజు, ధర్మవరం చేనేత కార్మికుడు -
జగనన్న కోసం జనం.. దారి పొడవునా తరగని అభిమానం (ఫొటోలు)
-
అందుకే సీఎం జగన్ జననేత అయ్యారు..!
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా పెడనలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవానికి హాజరైన అనారోగ్య బాధిత బాలుడి తల్లిదండ్రులు, ఓ వృద్ధురాలు, మరో ముగ్గురు మహిళలు ముఖ్యమంత్రి జగన్‌కు తమ సమస్యలను విన్నవించేందుకు నిరీక్షిస్తున్నారు. వేదికపై కూర్చున్న సీఎం జగన్ అర్జీలు చేతబట్టుకుని ఎదురుచూస్తున్న వారిని గమనించి తనవద్దకు తీసుకురావాలని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ రావిలాల మహేష్‌కుమార్‌కు సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వారందరినీ బారికేడ్లు దాటించి వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీఎం కార్యాలయ కార్యదర్శి ముత్యాలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని వారి వద్దకు వెళ్లి అర్జీలను స్వీకరించి సీఎంకు అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కార్యక్రమం ముగిశాక గుర్తు పెట్టుకుని మరీ మరోసారి వారిని పిలిచి మాట్లాడారు. చదవండి: CM YS Jagan: మంచిని ఓర్వలేరు -
మంచిని ఓర్వలేరు: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో మనం మంచి పనులు చేస్తుండటాన్ని చంద్రబాబుతో కూడిన దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీరి వైఖరి చూస్తుంటే బాధ కలుగుతోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక రాట్నం... ఒక మగ్గం మన దేశం రూపురేఖలను మార్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి మన స్వాతంత్య్ర పోరాటాన్ని గమనిస్తే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, జాతీయ ఉద్యమాన్ని సంఘటితం చేసిన ఘనత నేతన్నలదేనని గుర్తు చేశారు. మన నేతన్నలు మగ్గాల మీద నేసేది దారాల కలబోత మాత్రమే కాదన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. బతుకుదెరువు కోసం.. మన నేత, చేనేత గొప్ప సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, చేనేతను వేల సంవత్సరాల నుంచి నమ్ముకుని బతుకుదెరువు కోసం నేతన్నలు అవస్థలు పడటాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అద్భుతమైన వస్త్రాలను నేసే నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3,648 కి.మీ. పాదయాత్రలో చాలాచోట్ల కళ్లారా చూశా. మాట ప్రకారం వారికి తోడుగా నిలుస్తున్నాం. నేతన్నపై ప్రేమకు నిదర్శనం.. 2019లో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని నా పుట్టిన రోజు నాడే తెచ్చాం. నేతన్న మీద నా ప్రేమకు అది నిదర్శనం. క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలు చొప్పున అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరుసగా నాలుగో ఏడాదీ అందచేస్తున్నాం. ఈ ఒక్క పథకం కింద ఇప్పటివరకు ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.96 వేల మేర ప్రయోజనాన్ని చేకూర్చాం. గత అప్పుల కింద బ్యాంకులు ఈ డబ్బులను జమ చేయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం. నేతన్నలకు మొత్తం సాయం రూ.2,049.43 కోట్లు ఇవాళ అందించే సాయంతో కలిపితే ఇప్పటివరకూ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ఇది కాకుండా నేతన్నలకు సామాజిక ఫించన్ల ద్వారా మరో రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా మరో రూ.393.30 కోట్లు చెల్లించాం. ఇలా మూడేళ్లలో నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ఏకంగా రూ.2,049.43 కోట్లు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా నేతన్నలకు ఇంత అండగా నిలబడిందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సీఎం వైఎస్ జగన్‌కు నవరత్నాల లోగోతో కూడిన చేనేత వస్త్రాన్ని చూపుతున్న నేతన్న నేతన్నల కుటుంబాలకు దన్ను అప్‌గ్రేడ్ మిషన్స్... ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయంతో మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ లాంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం నేతన్నలకు వచ్చింది. తద్వారా కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సులువుగా మగ్గాన్ని నడుపుతున్నారు. 2018–19లో నెలకి రూ.4,680 మాత్రమే ఉన్న నేతన్నల ఆదాయం వైఎస్సార్ నేతన్న నేస్తం దన్నుతో మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది. ఆన్‌లైన్‌తో ప్రపంచానికి పరిచయం.. ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేశాం. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచాం. మూడేళ్లలో చేసిన మంచి ఇదీ.. శాశ్వత బీసీ కమిషన్... శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్, బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర నేరుగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం. అధికారంలో.. మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే రెండో విడతలో వారికి 70 శాతం ఇవ్వగలిగాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. శాససనభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్క ఉన్నారు. మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. ఎమ్మెల్సీలుగా 32 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. కార్పొరేషన్లలో... 98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 70 పదవులు దక్కాయి. 648 మండల ప్రజా పరిషత్ పదవుల్లో వైఎస్సార్ సీపీ 637 గెలుచుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం పదవులు ఇచ్చాం. జడ్పీ ఛైర్మన్లు 13కిగానూ 13 వైఎస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారంటే గతానికి, ఇప్పటికి తేడాను మీరే గమనించండి. సామాజిక న్యాయం... చంద్రబాబు పాలనలో ఎలాంటి సామాజిక న్యాయం ఉందో చెప్పేందుకు ఒక్క ఉదాహరణ చాలు. నాడు విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, కృష్ణా జడ్పీ ఛైర్మన్‌గా గద్దె అనురాధ, కనకదుర్గమ్మ ఆలయం ఛైర్మన్‌గా యలమంచి గౌరంగబాబు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ మన పాలనలో విజయవాడ మేయర్‌గా నా చెల్లి, బీసీ మహిళ భాగ్యలక్ష్మి ఉన్నారు. కృష్టా జడ్పీ ఛైర్మన్‌గా మరో బీసీ చెల్లెమ్మ హారిక ఉన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌గా బీసీ అన్న సోమినాయుడు ఉన్నారు. ఎటు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. 50 శాతం కేటాయిస్తూ చట్టం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేశాం. అందులోనూ 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అక్కచెల్లెమ్మలు 50 శాతానికి పైగా కనిపిస్తారు. నేతన్న నేస్తం సభకు హాజరైన జనసందోహం అక్కచెల్లెమ్మలకు అండగా.. అక్కచెల్లెమ్మల పేరుతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతోంది. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి పెడుతున్నాం. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత పథకాలతో తోడుగా నిలిచాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మారుస్తున్నాం. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉన్నారు. నేతన్న నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్ సంతోషించే హృదయాలు కావవి.. ► ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతుంటే రాళ్లు వేసే కుళ్లు, కుతంత్రాలను మన కళ్లెదుటే చూస్తున్నాం. ► నాకు వాళ్ల మాదిరిగా ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, టీవీ 5 అండ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ఒక్కటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నాకు తోడున్నాయి. ► కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడనుకుంటే.. అప్పుడు జనంపై నమ్మకం పెట్టుకుని పరిపాలన చేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నా. అందుకే నేను చేసిన మంచి మీద నమ్మకం ఉంది. నా నమ్మకం మీమీద ఉంది. ► గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి కోసం వినియోగించారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీంతో పాలన సాగించారు. ► ఆ రోజు అప్పులు గమనిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (అప్పు శాతం పెరుగుదల) 19 శాతం ఉంటే ఈ రోజు 15 శాతం మాత్రమే ఉంది. అంటే ఆరోజు కన్నా ఇవాళ అప్పులు తక్కువగానే చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి. అప్పటికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మార్పు. నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.102 కోట్ల పనులకు పచ్చజెండా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి జోగి రమేష్ దాదాపు రూ.102 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నా. ఇంకో శుభవార్త ఏమిటంటే.. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం బందరు పోర్టుకు శంకుస్ధాపన చేయడమే. అందుకోసం మళ్లీ వస్తా. నేరుగా ప్రజల వద్దకే ఈ సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని గమనించిన సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌ను నేరుగా వారి వద్దకు పంపి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
వైఎస్సార్ నేతన్న నేస్తం.. సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన (ఫొటోలు)
-
మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్
సాక్షి, పెడన(కృష్ణా జిల్లా): మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాను ఈ సభలో మాట్లాడటానికి మైక్ పట్టుకున్న తర్వాత ఒక శుభవార్త కూడా వచ్చిందని, అది ఏమిటంటే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. దీనిలో భాగంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు సీఎం జగన్. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అన్న సీఎం జగన్.. త్వరలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపకు వస్తానని సభా ముఖంగా తెలిపారు. చదవండి: సామాజిక న్యాయ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం: సీఎం వైఎస్ జగన్ దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్ -
నేతన్నల ఆదాయం మూడురెట్లు పెరిగింది: సీఎం జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలవలేదని, నేతన్నల జీవితాలను తన పాదయాత్రలో గమనించా గనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. ఇవాళ 80, 546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మాది. కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. తప్పుడు విమర్శలు చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకుంటున్నారని, జరుగుతున్న మంచిని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. అన్ని వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామన్న ఆయన.. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
నేడు కృష్ణా జిల్లా పెడనలో సీఎం జగన్ పర్యటన
-
వైఎస్ఆర్ నేతన్న నేస్తం
-
దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్
వైఎస్సార్ నేతన్న నేస్తం.. నాలుగో విడత నగదు జమ కార్యక్రమం అప్డేట్స్ ►ప్రసంగం అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నేతన్నల ఖాతాల్లోకి నేరుగా 193.31 కోట్లు జమ చేశారు సీఎం జగన్. పెడన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ►దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది ►గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు ►నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా ►వారికి నేనున్నాననే భరోసా అందించా ►అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చాం ►మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ►నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం ► 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ ►లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం ► ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు ►మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్ ►పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం: సీఎం జగన్ ►త్వరలో మచిలీపట్నం పోర్టు శంకస్థాపన: సీఎం జగన్ ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్ ► కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ► మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే నేత సీఎం వైఎస్ జగన్ ► బలహీనపక్షాల తరఫున నిలబడే బలమైన నేత సీఎం జగన్ ► రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారు ► అన్ని వర్గాల ప్రజలకు సీఎం అండగా నిలుస్తున్నారు ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, ఇతరులు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. ► చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్.. స్వయంగా మగ్గాన్ని నేశారు. ► పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమం కోసం పెడన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు.. పర్యాటక మంత్రి, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పుష్ఫగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. గురువారం ఉదయం కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన మంత్రి జోగిరమేష్, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను,ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని,కొడాలి నాని,పార్ధసారధి,కైలే అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా ► కృష్ణా జిల్లా పెడన పర్యటన కోసం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి.. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం.. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. ప్రసంగిస్తారు. షెడ్యూల్ ► సీఎం జగన్ ఇవాళ (గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ► బహిరంగ సభలో ప్రసంగించి.. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ► కార్యక్రమం అనంతరం.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కృష్ణా, విశాఖ జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 25న (గురువారం) కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఆయన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. 10.50 నుంచి 12.30 గంటల వరకు పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. విశాఖపట్నం జిల్లా పర్యటన ఇలా.. 26న (శుక్రవారం) విశాఖపట్నంలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో ఒప్పంద కార్యక్రమం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన వారికి ధ్రువపత్రాలను అందించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరతారు. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20 నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. 11.23 నుంచి 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. 12.40 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.