ఇంద్రవెల్లిలో స్వాధీనం చేసుకున్న మద్యం
ఇంద్రవెల్లి(ఖానాపూర్): మండల కేంద్రంలో ని చిచ్‌ధరి ఖానాపూర్ రోడ్ పక్కనే అక్రమంగా బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న టగ్రే ఇందల్ దు కాణంలో శనివారం పోలీసులు, ఎకై ్సజ్ అధి కారులు నిర్వహించిన దాడుల్లో రూ.24,200 ల విలువైన మద్యం పట్టుబడినట్లు ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపారు. మద్యం స్వాధీ నం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
ఎదులాపురం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, ఇచ్చోడలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఖానాపూర్ కాలనీలో పెండల సంతోష్ వద్ద రూ.3,740 విలువ చేసే 20 మద్యం బాటిళ్లు, ఇచ్చోడలో ఇందల్ సింగ్ అనే బెల్ట్ షాపు నిర్వాహకుని వద్ద రూ. 25,000 విలువ చేసే 212 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు.
ఒకేరోజు మూడు ఆలయాల్లో చోరీ
గుడిహత్నూర్(బోథ్): మండలంలోని మచ్చాపూర్‌తాండ, ముత్నూర్‌తాండ, రావుతాండ గ్రామాల్లోని దుర్గామాత ఆలయాల్లో శుక్రవా రం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామ పెద్దలు ప్రతా ప్ సింగ్, గున్వంత్, రాంజీ, జైపాల్ తెలిపారు. అర్ధరాత్రి దాటాక దొంగలు ఒకే రూట్‌లోని కి లో మీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయాల్లో చొ రబడి రూ.3లక్షల విలువైన ఆభరణాలు అపహరించినట్లు వారు పేర్కొన్నారు. శనివారం ఉ దయం గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్సై ఇమ్రాన్ సంఘటనా స్థలాల కు చేరుకుని క్లూస్ టీంను వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. క్లూస్ టీం ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది రమేశ్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment