![విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న రఘుతేజ - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/24/23adi56-340043_mr_0.jpg.webp?itok=PEVky6JH)
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న రఘుతేజ
ఆదిలాబాద్‌టౌన్: సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాలని నిజామాబాద్ ఐటీ హబ్ రీజినల్ సెంటర్ మేనేజర్ బీ రఘుతేజ సూచించారు. సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నా లెడ్జ్ టాస్క్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనే రెండు అంశాలపై రెండురోజుల పాటు నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు. కాగా, టాస్క్ కళాశాల ఇన్‌చార్జి డాక్టర్ బీ జ్యోత్స్నారాణి లాజికల్, డెసిషన్ మేకింగ్, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళా శాల ప్రిన్సిపాల్ పీ భరద్వాజ, విభాగాధిపతులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment