పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Nov 9 2024 12:44 AM | Last Updated on Sat, Nov 9 2024 12:44 AM

-

ఇంద్రవెల్లి: పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని దస్నాపూర్‌గూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్నాపూర్‌గూడ గ్రామానికి చెందిన జవాదే విలాస్‌ –కవిత దంపతుల కూతురు జవాదే అంజలి(13) బజార్‌హత్నూర్‌ మండలకేంద్రంలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం తల్లి కవితతో కలిసి వ్యవసాయ చేనులో పత్తి ఏరడానికి వెళ్లింది. సాయంత్రం నీళ్లు తాగి వస్తానని తల్లితో చెప్పి ఇంటికి వెళ్లిన అంజలి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయింది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆటోలో మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. కాగా ఆత్మహత్యపై ఎవరూ ఫిర్యాదు అందలేదని ఎస్సై దుబ్బక సునీల్‌ తెలిపారు.

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

ఆదిలాబాద్‌టౌన్‌(జైనథ్‌): ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన హబీబ్‌ ఖాన్‌(42) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జైనథ్‌ ఏఎస్సై ఆత్మారాం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఖుర్షీద్‌నగర్‌కు చెందిన హబీబ్‌ఖాన్‌ తన రెండో భార్య మర్డర్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడు. జైలుకు వెళ్లి ఇటీవల బయటకు వచ్చాడు. జైనథ్‌మండలంలోని మేడిగూడలో తన మొదటి భార్య జమీలా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుంది. కాగా శుక్రవారం మేడిగూడ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన జేబులో ఉన్న సూసైడ్‌ నోట్‌లో తన రెండో భార్యను హత్య చేశానని, తనకు జీవించే హక్కు లేదని ఉన్నట్లు ఏఎస్సై తెలిపారు. తన ఆత్మహత్యకు మొదటి భార్య, పిల్లలకు సంబంధం లేదని అందులో రాసి ఉందన్నారు. కాగా భార్య జమీలా తన భర్త కొంత కాలంగా మద్యానికి బానిసై తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, పలుమార్లు నచ్చజెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement