● ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి.. విజయతీరాలకు చేరువై ● గ్
మూడో కొలువుకొట్టిన.. అమీర్
జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన షేక్ అమీర్ 2019లో జేపీఎస్ కొలువు సాధించాడు. అయినా సంతృప్తి పడలేదు. పుస్తకాలను వీడకపోవడంతో 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అనంతరం గ్రూప్–4లోనూ సత్తా చాటాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో జిల్లాస్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. తాజాగా జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు అమీర్. తల్లిదండ్రులు షేక్ షఫీ–రషీదా బేగంల కష్టం, అన్నదమ్ముల మార్గదర్శకత్వంతోనే ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెబుతున్నాడు. తన తదుపరి లక్ష్యం గ్రూప్–2 ఉద్యోగమని అంటున్నాడు. ముఖ్యంగా నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తనను ఎంతగానో ప్రోత్సహించారని, ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొంటున్నాడు.
సర్కారు కొలువే లక్ష్యంగా వారంతా శ్రమించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మస్థైర్యం వీడలేదు. ఓటములు చవిచూసినా పట్టు సడలనివ్వలేదు. నిరాశకే నిరాశ పుట్టేలా ఒక్కో అడుగుతో ముందుకు సాగారు. ఓ వైపు బాధ్యతలు, మరోవైపు విధులు నిర్వర్తిస్తూనే పుస్తకాలతో కుస్తీ పట్టారు. ప్రణాళికాబద్ధంగా చదివి గ్రూప్–4 ఫలితాల్లో మెరిశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. గెలుపుతీరాన నిలిచిన జిల్లాకు చెందిన పలువురి విజయగాథలు.
– ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment