తోబుట్టువుల స్ఫూర్తితో ‘బాలాజీ’
ప్రభుత్వ ఉద్యోగాలను వరుసగా సాధిస్తూ సత్తా చాటుతున్నాడు జిల్లాలోని నార్నూర్ మండలం శీతల్ గూడ గ్రామానికి చెందిన పాపాజీ–శకుంతలబాయి దంపతుల కుమారుడు గైకాంబ్లే బాలాజీ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటివరకు ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన ఈయన వరుస ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్రతిభ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతేడాది పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై న బాలాజీ ప్రస్తుతం జడ్చర్లలో శిక్షణలో ఉన్నాడు. ఇటీవలే గురుకుల టీజీటీ(సోషల్ స్టడీస్)గా ఎంపికై నా ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–2024 ఫలితాల్లో జోన్–2లో ప్రతిభ కనబరిచి ఉద్యోగరేస్‌లో నిలిచాడు. తాజాగా గ్రూప్–4 ఫలితాల్లోనూ సత్తా చాటి వార్డు ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. నాన్న శ్రమ, తోబుట్టువుల స్ఫూర్తితో తాను ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నట్లు బాలాజీ చెబుతున్నాడు. గ్రూప్–2 ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని అంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment