‘మహా’ ప్రచారంలో మనోళ్లు
సాక్షి,ఆదిలాబాద్: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్ని కల పోలింగ్ సమీపిస్తుండగా, జిల్లా నేతలు అక్క డి వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనాన్ని కలుస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు ఉత్తర మహారాష్ట్రలో పర్యవేక్షణ బాధ్యతలను ఏఐసీసీ అప్పగించడంతో ఆమె అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పరంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఇప్పటికే పలుమార్లు అక్కడికి వెళ్లి వారు ప్రచారం చే స్తున్నారు. ఈనెల 20న మహారాష్ట్రలో పోలింగ్ జ రగనుంది. ఈ క్రమంలో ఆ ఎన్నికలను సరిహద్దు న ఉన్న జిల్లావాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
సీతక్కతో కలిసి..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు ఏఐసీసీ ఉత్తర మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె కొద్ది రోజులుగా అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ మంత్రితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. నాసిక్, ముంబాయ్, చంద్రాపూర్, యవత్మాల్ తదితర ప్రాంతాల్లో సీతక్కతో కలిసి జిల్లాకు చెందిన పలువురు నేతలు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఆదివాసీలు అధికంగా ఉన్నచోట సీతక్క ఫోకస్ పెంచారు. అంతేకాకుండా మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విస్తృతంగా పర్యటిస్తుండగా, ఆ టీమ్‌తో కలిసి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలు కూడా సరి హద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ప్రచా రంలో పాల్గొంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు వస్తుండడంతో జిల్లాకు చెందిన నేతలు అనేక మంది ఆ ప్రచారంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నారు.
బీజేపీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు..
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌కు చంద్రాపూర్ ఇన్‌చార్జి బాధ్యతలను పార్టీ అప్పగించింది. దీంతో ఆయన ఆ ప్రాంతంలో పార్టీ అభ్యర్థులతో కలిసి ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వార్ధా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పర్యటించారు. అంతేకాకుండా రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు మహారాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు వారితో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రాగా, ఎమ్మెల్యే శంకర్ అక్కడ పర్యటించారు. హింగన్‌ఘాట్‌లో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్‌తో కలిసి జిల్లా నేతలు పలువురు ప్రచారంలో పాల్గొన్నారు. కిన్వట్ బహిరంగ సభలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవీస్‌తో కలిసి బహిరంగ సభలో ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
బీజేపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే
మంత్రి సీతక్కతో కలిసి జిల్లా కాంగ్రెస్ నేతలు
Comments
Please login to add a commentAdd a comment