గిరిజనుల అభివృద్ధికి కృషి
● వర్చువల్‌గా మాట్లాడిన ప్రధాని మోదీ
ఉట్నూర్‌రూరల్: దేశంలో గిరిజనుల అభివృద్ధి తోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో పేర్కొన్నారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్స వ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దేశంలోని 100 జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని వర్చువల్‌ద్వారా అధికారులు, గిరిజను లు తిలకించారు. కార్యక్రమానికి ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, రాయిసెంటర్ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, ఇతర అధికారులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ‘ధర్తి అభ జన్ జాతీ య గ్రామ ఉత్కర్శ్ అభియాన్’ పథ కం ప్రధా న ఉద్దేశమన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఆయా జిల్లాల్లో మొదటి దశలో ఎంపికై న 31 ఆవాసాలను అభివృద్ధి పర్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గిరి జనులకు చెక్కులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మా ట్, ఐటీడీఏ ఏపీవో వసంత్‌రావు, పీవీటీజీ ఏపీవో మనోహర్, ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment