మహిళ ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్(జి): భర్త వేధింపులు తాళలేక చెరువులో దూకి మహిళ ఆత్మహత్యా య త్నానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మండల కేంద్రానికి చెందిన పందిరి మమత, సాయన్న భా ర్యాభర్తలు. భర్త పెడుతున్న వేధింపులతో మనస్తాపానికి గురైన మమత సోమవారం స్థానిక బసం చెరువులో దూకింది. గమనించిన స్థానికులు పోలీస్ కానిస్టేబుల్ చౌహాన్ కృష్ణకు సమాచారం అందించగా స్థానికుల సాయంతో మహిళను బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స అందించి 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ సోదరుడు గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment