క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్
ఆదిలాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆది లాబాద్ రూరల్ మండలస్థాయి సీఎం కప్ పోటీల ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఓటమికి కుంగిపోకుండా నిరంతరం సాధన చేయాలన్నారు. అప్పుడే విజ యాలు సాధ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధి కారి పార్థసారథి, క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడ పాఠశాల శిక్షకులు పాల్గొన్నారు
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
తలమడుగు: క్రీడలతో యువతకు ఉజ్వల భవి ష్యత్తు ఉంటుందని ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా అన్నారు. మండలంలోని బరంపూర్ గ్రా మంలో సీఎం కప్ మండలస్థాయి క్రీడాపోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్‌రెడ్డి, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడా అధికారి పార్థసారఽథి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment