నాయకా.. అక్రమాలు చాలిక
ఇది జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనం. దీనికి ఆరు మడిగెలు ఉన్నాయి. ప్రధానచౌక్లో ఉండటంతో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి నెలా అద్దె రూపంలో రూ.60 వేల నుంచి రూ.80వేల ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో సంఘ సభ్యుల మధ్య తలెత్తిన ఆర్థికపర విబేధాలు గతంలో భవనాన్ని సీజ్ చేసే వరకు వెళ్లింది. రాజకీయ నాయకుల అనుగ్రహంతో అప్పుడు సద్దుమణిగింది. అయితే తాజాగా మరోసారి ఆ సంఘ సభ్యులు నాయకుడి తీరును వ్యతిరేకిస్తూ అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment