విద్యుత్ శాఖ ఎస్‌ఈకి పదోన్నతి
● చౌహాన్‌కు చీఫ్ ఇంజినీర్‌గా ప్రమోషన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈగా పనిచేస్తున్న జేఆర్ చౌహాన్‌కు వరంగల్ చీఫ్ ఇంజినీర్ కన్‌స్ట్రక్షన్స్ పదోన్నతి లభించింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా జిల్లాకు చెందిన ఈయన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తొమ్మిదేళ్లుగా ఎస్‌ఈగా పనిచేశారు. 1992లో ఉమ్మడి జిల్లాలోని జన్నారంలో ఏఈగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఏడీ, వరంగల్ డీఈ, ఆదిలాబాద్, నిర్మల్ ఎస్‌ఈగా పనిచేశారు. పదోన్నతి లభించడంపై ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వారు వచ్చేవరకు ఆదిలాబాద్ ఎస్‌ఈగా చౌహాన్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. పదోన్నతి పొందిన ఈయన ఈనెల 12న చార్జ్ తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment