‘ఆశ’ల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు తరలివెళ్తున్న ఆశ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ ఎదుట మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోగా ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరికి పోలీసుల నుంచి దిష్టిబొమ్మను ఆశలు లాక్కొని దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చిన్నన్న, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment