సమ్మె బాటలో ‘సమగ్ర’ ఉద్యోగులు
ఆదిలాబాద్‌టౌన్: తమ సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. మానవ హక్కు ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో పడాల రవీం నాయిని పార్థసారథి, ఆడెపు సోమన్న, ప్రియాంక, వెంకటి, ప్రకాశ్, దేవదర్శన్, నవీన, పాల్గొన్నారు.
మాజీ మంత్రి సంఘీభావం
కై లాస్‌నగర్: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని మంగళవారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు జీవో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని అర్హతలున్న ఉద్యోగులపై చిన్న చూపు చూడటం సరికాదన్నారు. సమస్యను మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించేలా కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment