తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘంలో విభేదాలు
మడిగెల అద్దె స్వాహాపర్వంపై అభ్యంతరం
అదనపు కలెక్టర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు
సంఘ నాయకుడి అక్రమాలపై సమగ్ర విచారణకు విజ్ఞప్తి
కై లాస్‌నగర్: తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు మరో సారి రచ్చకెక్కాయి. అధ్యక్షుడిగా చెలామణి అవుతు న్న వ్యక్తి తీరును తప్పుపడుతూ ఆ సంఘం సభ్యులు అదనపు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పదవిలో అనైతికంగా కొనసాగుతూ సంఘానికి సంబంధించిన మడిగెల అద్దెలు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తూ సభ్యులు అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మడిగెలను లీజుకు ఇచ్చేందుకు తాజాగా సదరు నాయకుడు మీడియా పరంగా ప్రకటన జారీ చేయడం సంఘ సభ్యుల్లో విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా చెలామణి అవుతున్న నాయకుడికి వ్యతిరేకంగా సంఘ సభ్యులంతా ఏకం కావడం ఆసక్తి రేపుతోంది.
ఆది నుంచి వివాదాస్పదమే..
తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనా నికి సంబంధించి ఆది నుంచి వివాదాస్పదమే నడుస్తోంది. సంఘ సభ్యుల సంక్షేమం కోసం భవనం నిర్మించుకునేందుకు ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డు న ఉన్న తెలంగాణ చౌక్‌లో విలువైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో సంఘ కార్యాలయంతో పాటు వ్యాపారపరమైన ఆరు మడిగెలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం బిర్యానీ హౌస్‌తో పాటు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీటి నుంచి అద్దెరూపంలో ప్రతి నెలా సంఘానికి రూ.60వేల నుంచి రూ.80వేలు వసూలవుతున్నట్లుగా సంఘ సభ్యులు పేర్కొంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వర కు రెండు వర్గాలు ఉండగా, ఈ భవనం తమదంటే తమదేనని ఇరువర్గాలు ఆధిపత్యం కోసం యత్నించారు. తరచూ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో 2018లో అప్పటి కలెక్టర్ ఆదేశాలమేరకు ఆర్డీవో ఆ భవనానికి తాళం వేసి సీజ్ చేశారు. అప్పట్లో సదరు నాయకుడి ఆధిపతాన్ని వ్యతిరేకించిన ప్రత్యర్థి వర్గానికి ఆ భవనాన్ని కేటాయించారు. అయితే ప్రస్తుత సంఘం నాయకుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రత్యర్థి సంఘం వ్యక్తులతో సయోధ్య కుదుర్చుకొని తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. సంఘ భవనానికి వచ్చే నిధులు సభ్యుల సంక్షేమానికి వినియోగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తు తం ఆ సంఘానికి సంబంధించి జిల్లా కార్యవర్గం లేదు. రెండేళ్ల క్రితం వరకు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తే ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జిల్లా కార్యవర్గం లేకపోవడంతో సంఘ భవనంపై తానే ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివాదానికి దారితీసిన లీజ్ ప్రకటన..
సంఘ భవనానికి సంబంధించి మడిగెల లీజు గడు వు ఇటీవల ముగిసింది. దీంతో వాటిని కొత్తగా 20 ఏళ్ల పాటు లీజు పద్ధతిన అద్దెకు ఇచ్చేందుకు ప్రస్తు త కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వ్యకి మీడియాలో ప్రకటన జారీ చేయడం వివాదానికి దారి తీసింది. సంఘ సభ్యులను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతున్నారు. కొన్నేళ్లుగా సంఘానికి సంబంధించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోగా, మడిగెల అద్దె ఎంత వస్తుంది.. వాటిని ఎందుకోసం వినియోగిస్తున్నారనే సమాచారం కూడా సభ్యులకు తెలియజేయకుండా ఏకపక్షంగా వాటిని వినియోగించుకున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వారి మధ్య విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలో సదరు నాయకుడి తీరు ను తప్పుపడుతున్న సభ్యులు జెడ్పీలో ఆఫీస్ సబా ర్డినేట్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి జీవో నం.422 తేది. 23.07.2011 ప్రకారం తెలంగాణ నాల్గో తరగతి ఉ ద్యోగుల సంఘం సభ్యుడిగా కొనసాగే అర్హ త లేదంటూ అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సదరు వ్యక్తి అక్రమాల కు పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్ప టి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జ రిపించి సదరు నాయకుడిపై చర్యలు తీసుకో వా లంటూ ఫిర్యాదు చేయడం నాల్గో తరగతి ఉద్యోగులతో పాటు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
‘సంఘంతో వారికి ఎలాంటి సంబంధం లేదు’
ఆదిలాబాద్‌టౌన్: నాల్గో తరగతి ఉద్యోగుల సంఘంపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆశన్న, నర్సింగ్, నరేందర్‌తో సంఘానికి ఎ లాంటి సంబంధం లేదని నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూ రి గంగాధర్ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర సంఘం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో సంఘానికి సంబంధించిన ఆరుమడిగెల అగ్రిమెంట్ నవంబర్‌తో ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం కొత్తవారికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారు చేసి న ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారమే సంఘం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment