రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ
● కలెక్టర్ రాజర్షిషా ● పోలింగ్‌స్టేషన్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 12లోగా తెలియజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియాతో కలిసి గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ము సాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించామన్నారు. ఈనెల 7న జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామపంచాయతీల్లో వాటిని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలు, 3,870 వార్డులు ఉండగా, 3888 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితా రూపొందించామని తెలిపారు. వాటిపై అభ్యంతరాలను ఈనెల 12న అన్ని మండలాల్లో స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే 13న పరిష్కరించనున్నట్లు తెలిపారు. తుది జాబితాను 17న ప్రచురించనున్నట్లు తెలిపారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధి కారి శ్రీలత, ఫణిందర్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment