కై లాస్‌నగర్: టీజీపీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్–4 ద్వారా ఎంపికై న 45 మందిని ప్రభుత్వం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి కేటాయించింది. ఇందులో 37 మంది వార్డు ఆఫీసర్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అకౌంటెంట్లు ఉన్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి యువ వి కాసం బహిరంగసభలో వీరు ఉద్యోగ ని యామక పత్రాలు అందుకున్నారు. వీరికి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వరంగల్ (ఆర్ డీ) కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ కేటా యించాల్సి ఉంది. ఇందులో భాగంగా మంగళవారం 20 మంది మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమ ఆప్షన్ పత్రాలు అందజేశారు. వీరిలో అత్యధికంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీనే ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment