ఇంద్రవెల్లి: నాగోబా ఆలయ వార్షికోత్సవ నిర్వహణపై మెస్రం వంశీయులతో బుధవా రం సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి వంశీయులు తరలిరావాలని ఆయన కోరారు.
అర్లి(టి) @ 11.0
తాంసి: జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం గజగజ వణికిపోతున్నారు. భీంపూర్ మండలం అర్లి(టి)లో మంగళవారం 11 .0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వేకువజా మున చలి ప్రభావంతో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
రేపు జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీలు
ఆదిలాబాద్‌టౌన్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకొని తెలంగాణ గణితపురం ఫోరం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 12న జి ల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దిలీప్‌రెడ్డి, కిషన్ ప్రకటనలో తెలి పారు. జిల్లాకేంద్రంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఉదయం 11.30 నుంచి 12.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. మండలస్థాయిలో గెలుపొందిన ము గ్గు రు ఈ పోటీలకు హాజరు కావాలని తెలిపా రు. 18న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు పాఠశాలల విద్యార్థులను ఈ పోటీల్లో పాల్గొనేలా చూడాలని కోరారు.
రేపు పట్టుబడ్డ వాహనాలకు వేలం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 13 ద్వి చక్రవాహనాలు, ఒక కారు వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ ప్రకటనలో తెలిపారు. ఈనెల 12న జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో వేలం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు నిర్దేశిత ధరావత్తు సొమ్ము చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment