‘ఇందిరమ్మ’ సర్వే షురూ
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి న క్షేత్రస్థాయి సర్వే జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. ప్రజాపాలనలో అందించి న దరఖాస్తుల ఆధారంగా ఈ ప్రక్రియ ని ర్వహిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్ల వద్ద కు వెళ్లిన మున్సిపల్, పంచాయతీ సిబ్బంది తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 42 దరఖాస్తుల ను పరిశీలించారు. ఆదిలాబాద్ మున్సిపాలి టీలో 15 దరఖాస్తులను పరిశీలించి వారి వి వరాలు యాప్‌లో నమోదు చేశారు. తలమడుగు మండలంలో 15దరఖాస్తులను పరిశీ లించగా 13 అప్లికేషన్ల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఆదిలాబాద్‌రూరల్‌లో మూడు దరఖాస్తులు పరిశీలించి రెండింటి సమాచారం నమోదు చేసి మరో దాని కొంత సమాచారం సేకరించారు. భీంపూర్ మండలంలో రెండింటిని యాప్‌లో నమోదు చే శారు. ఇచ్చోడలో నాలుగు, సిరికొండలో ఒక టి, ఉట్నూర్‌లో రెండు దరఖాస్తుల సమాచా రాన్ని సేకరించినా ఇంకా యాప్‌లో నమోదు చేయలేదు. మొత్తంగా 42 దరఖాస్తులను పరిశీలించి 32 దరఖాస్తుల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేశారు. పది దరఖాస్తుల సమాచారాన్ని సేకరించారు. బజార్‌హత్నూర్, బేల, బోథ్, గాదిగూడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, జైనథ్, మావల, నార్నూర్, నేరడిగొండ, తాంసి మండలాల్లో తొలి రోజున సర్వే ప్రారంభించలేదు. పంచాయతీ కార్యదర్శులు తమకు ప్రభుత్వపరంగా ఆదేశాలు వస్తేనే సర్వే చేస్తామని అధికారులకు వినతిపత్రాలు అందజేసిన నేపథ్యంలో ఈ సర్వే నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని 18మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కో సం 1,97,448దరఖాస్తులు అందాయి. వీట న్నింటిని అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment