సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ
నేరడిగొండ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 సాఫ్ట్‌బాల్ పోటీల్లో నేరడిగొండ కేజీబీవీ విద్యార్థినులు ఆరుగురు కాంస్య పతకాలు సాధించినట్లు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు ఆర్.శ్రీలేఖ డి.శిరీష జె.అనిత, టి.శిరీష, ఎం.శ్రీనిత్య బి.వనితను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ స్నేహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
11న క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న అండర్–14 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కోదాటి ప్రదీప్, కోచ్. ప్రదీప్ తెలిపారు. క్రీడాకారులు మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోని క్రికెట్ నెట్‌లో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. 1 సెప్టెంబర్ 2010 తర్వాత పుట్టినవారు పోటీలకు అర్హులని, మరిన్ని వివరాలకు 9440010696 నంబరులో సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇచ్చోడ: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు సింధుజ, అంజలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రోజారాణి తెలిపారు. ఈ నెల 7 నుంచి 11 వరకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న 71వ సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment