● ఆర్‌ఎంఎస్ కార్యాలయం జిల్లా కేంద్రంలోనే కొనసాగేలా ఉత్
మంచిర్యాలలోనే స్పీడ్ పోస్ట్ సేవలు
పాతమంచిర్యాల: స్పీడ్‌పోస్ట్ సేవలు, ఉత్తరాల బట్వాడా ఇకనుంచి మంచిర్యాల నుంచే జరుగనున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచి ఉత్తరాలు, పార్శిళ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంది. 2016 వరకు జిల్లా కేంద్రంలోనే కొనసాగిన స్పీడ్ పోస్టాఫీస్ (ఇంట్రా సర్కిల్ హబ్)ను అధికారులు వరంగల్‌కు తరలించారు. దీంతో ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఒక్కరోజులోనే అందాల్సిన ఉత్తరాలు మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా అందేవి. కొన్నిసార్లు పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కింపు సమయానికి కేంద్రాలకు అందని సంఘటనలు ఉన్నాయి. తాజాగా జిల్లాలో ఆర్‌ఎంఎస్ సేవలను కూడా ఇక్కడి నుంచి వరంగల్‌కు తరలించాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విషయాన్ని ముందే గ్రహించిన ‘సాక్షి’ నవంబర్ 08న ‘డిస్ట్రిబ్యూషన్ తరలింపు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రజాప్రతినిధులు స్పందించారు. తపాలాశాఖ ఉన్నతాధికారులు సైతం జిల్లా అఽఽధికారులతో సంప్రదింపులు జరిపి కార్యాలయం తరలింపుపై అభిప్రాయాలు సేకరించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తపాలాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అంతేకాకుండా ఆర్‌ఎంఎస్ కార్యాలయం, స్పీడ్ పోస్టాఫీస్‌ను జిల్లా కేంద్రంలో కొనసాగించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నవంబర్ 23న కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు విన్నవించారు. దీనిపై తపాలాశాఖ ఉన్నతాధికారులు పునరాలోచన చేశారు. రెండు కార్యాలయాలు ఇక్కడి నుంచే కొనసాగించాలని డిసెంబర్ 5న కేంద్ర కమ్యూనికేషన్‌ల మంత్రిత్వశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (మెయిల్ ఆపరేషన్స్) హరిఓం శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి కథనంతోనే ఆర్‌ఎంఎస్ కార్యాలయం జిల్లా నుంచి తరలిపోకుండా నిలిచిందని ఈ సందర్భంగా ఉద్యోగులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment