హత్య కేసులో నిందితుడి అరెస్టు
మంచిర్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ నెల 8న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేదరీవాడకు చెందిన మిట్టపల్లి వీరాస్వామి కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన తీగల భాగ్యతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 8న మద్యం మత్తులో భాగ్యతో గొడవపడి బండరాయితో తలమీద బాదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరి సంపతి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి రి మాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
గొలుసు అపహరణ
భైంసాటౌన్: ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన సోమవారం పట్టణంలోని బస్టాండ్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్‌కు చెందిన లింగంపల్లి లక్ష్మి(60) భైంసా బస్టాండ్‌లో కుభీర్ బస్సు ఎక్కుతుండగా, గుర్తు తెలియని దుండగుడు గొలుసు (తులం నర) దొంగిలించాడు. కొద్దిసేపటికి మెడలో గొలుసు లేకపోవడాన్ని గమనించిన వృద్ధురాలు లబోదిబోమంది. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment