సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గాదిగూడ మండలం శివన్నారా గ్రామానికి చెందిన రాజు అంగన్‌వాడీ సెంటర్, సీసీరోడ్డు మంజూరు చేయించాలని, బేల మండలం గణేశ్‌పూర్ గ్రామానికి చెందిన మడావి లస్మా ఎడ్ల జత ఇప్పించాలని, సిర్పూర్(యూ) మండలం మెట్టిగూడకు చెందిన పెందూర్ భువనేశ్వర్ ఇందిరమ్మ ఇల్లు, భీమిని మండగలం కర్జిభీంపూర్ గ్రామానికి చెందిన టేకం పోషన్న బోర్‌వెల్ మంజూరు చేయాలని కోరారు. ఇంకా వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో ఏపీవో వసంత్‌రావు, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, డీపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment