ఆదిలాబాద్‌టౌన్: పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ లు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌహాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని వినాయక్‌చౌక్‌లో గల శిశుమందిర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించ డం సరికాదన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి దశల వారీగా పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన, తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పణ, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించామని, 17న ఇందిరాపార్కులో 5వేల మంది ఉపాధ్యాయులతో ధర్మాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment